Telangana BC Welfare Association president
-
భూ బకాసురులను వదిలి గుడిసెల మీదా దాడి చేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు. -
అమరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వాలి
సూర్యాపేట అర్బన్, న్యూస్‌లైన్,జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లు తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తించి వారి కుటుంబా లకు టికెట్లు కేటాయించి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్ కోరారు. సూర్యాపేట పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి ప్రమేయం లేని ఆర్.కృష్ణయ్యను తెలంగాణ ముఖ్యమంత్రిగా శాలిగౌరా రం ప్రాజెక్టు రాచకాల్వ టీడీపీ ప్రకటించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1400 మం దిలో 1100 మంది బీసీలే అమరుల య్యారన్నారు. రాజకీయ పార్టీలు అమరుల త్యాగాలను వారిని పట్టించుకోకుండా అగ్రవర్ణాల వారికి పెద్దపీట వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ తా ళ్లపల్లి రామకృష్ణగౌడ్, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మే కల రంజిత్‌కుమార్, నాయకులు దేవరకొండ నరేష్‌చారి, వసంత సత్యనారాయణపిళ్లే, ఉయ్యాల నర్సయ్యగౌడ్, ఆవుల అంజయ్యయాదవ్, శాతరాజు రాము, నర్సింహ, కుశలవ, నరేష్, బత్తుల కౌసల్యయాదవ్, కొమ్ము వెంకన్న పాల్గొన్నారు.