TRS
-
జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై హరీష్ రావు కామెంట్స్
-
Uttam Kumar: 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు
-
కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తుండటంతో కోలాహలం
-
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
-
కాంగ్రెస్ పాలనలో రైతు వంచన: మాజీ మంత్రి కేటీఆర్
-
నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
BRS ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డికి ఊరట
-
BIG Update : ఫార్ములా ఈ-రేస్ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ
-
MLC Kavitha: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
-
KTR: తప్పించుకోలేవు రేవంత్..!
-
అల్లు అర్జున్ పై కాదు..ప్రజలపై దృష్టి పెట్టు..
-
సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao
-
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
-
ధరణి పోర్టల్ లో అసలైన మోసం..
-
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు
-
జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
-
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ
-
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీర్చాల్సి వస్తుంది: భట్టి
-
తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
-
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
ఇరిగేషన్ భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు: హరీష్
-
కలెక్టర్ పై దాడి ఘటనలో కీలక ఆధారాలు..
-
Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వద్దంటే కాంగ్రెస్ లోకి వస్తున్నారు
-
రాహుల్ గాంధీది ఏ కులం..?
-
కౌశిక్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్
-
‘స్టేషన్‌ఘన్‌పూర్’కు ఉప ఎన్నిక అనివార్యమేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి అనర్హత ముప్పు పొంచి ఉందా..? ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతటా ‘అనర్హత’పైనే చర్చ..గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించించడం కలకలం రేపింది. దీంతో స్టేషన్ ఘన్పూర్ టికెట్ పొందడం మొదలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం... తాజాగా హైకోర్టు తీర్పు వెలువడే వరకు పలుమార్లు కడియం శ్రీహరి పతాక శీరి్షకలకెక్కారు. హైకోర్టు తీర్పు మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశమే ఎక్కువుందన్న చర్చ ఒక పక్కన.. స్పీకర్ కార్యాలయం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ మరో పక్కన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అన్న ఉత్కంఠ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎవరి ధీమా వారిదే... బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా.టి.రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఎవరికీ వారుగా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి..బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న. నాలుగు వారాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి.– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రిడివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్తాంనాకు కోర్టుపైన నమ్మకం వుంది.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ది. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యేనిబద్ధత ఉంటే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి..బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. కడియం శ్రీహరి, కావ్యలు నియోజకవర్గానికి ఎంత చేసిన తక్కువే. నియోజకవర్గ ప్రజలకు వారు రుణపడి ఉండాలి. – డా.టి.రాజయ్య, మాజీ మంత్రి -
ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: హరీశ్‌రావు
రామచంద్రాపురం (పటాన్చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.హరీశ్.. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కండువాతో మాజీమంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కండువాతో హరీశ్ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మళ్లీ టీఆర్ఎస్..! పెరుగుతున్న ఒత్తిడి..
-
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
మైండ్‌గేమ్‌తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
మానకొండూర్ (కరీంనగర్): మైండ్‌గేమ్‌తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది’అని తెలిపారు.టీఆర్ఎస్గా మారుస్తాం..బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్ సునిల్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు. -
వరంగల్.. ట్రయాంగిల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్ సెగ్మెంట్‌ను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ (హనుమకొండ) పార్లమెంట్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగించింది. 2009 పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు మూడు ఉపఎన్నికలు కలుపుకొని మొత్తం 20 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కడియం కావ్య (కాంగ్రెస్)నాన్న తోడు.. పార్టీ బలమే గెలిపిస్తుందన్న ధీమా లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కడియం కావ్య.. తండ్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీకున్న బలాన్ని నమ్ముకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఘన విజయం ఇచ్చారు. ఈ పార్లమెంట్ పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరడం, ఆయన కూతురు కావ్యనే అభ్యర్థి కావడం అనుకూలంగా మారింది. డాక్టర్‌గా, స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు ద్వారా చేసిన ప్రజాసేవకుతోడు కాంగ్రెస్ పార్టీ బలం, యువ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారనే ధీమాలో కడియం కావ్య ఉన్నారు. అయితే కడియం కావ్య స్థానికేతరురాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ సమయాన బీఆర్ఎస్లో ఉన్న కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థి అయ్యారు. పార్టీ ఫిరాయింపులతో పాటు వీటన్నింటిపై ప్రతిపక్షాలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నాయి.అరూరి రమేశ్ (బీజేపీ)మోదీ చరిష్మా.. పాలకుల వైఫల్యాలే కలిసి వస్తాయంటూ.. 2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించిన అరూరి రమేష్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికితోడు జాతీయస్థాయిలో మోదీ అనుకూల పవనాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. గతంలో వరంగల్(హనుమకొండ)లో ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ప్రచారం కూడా అనుకూలమే. మామునూరు ఎయిర్‌పోర్టు, టెక్స్టైల్ పార్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, మెట్రోరైలు సహా అనేక పథకాలకు మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు అరూరి రమేష్ గెలుపులో ఏమేరకు పాలు పంచుకుంటారన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన విజయవంతం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో పాటు ప్రజలతో తనకున్న సంబంధాలతో గెలుస్తానని చెబుతున్నారు.సుదీర్‌కుమార్ (బీఆర్ఎస్)కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశ తెలంగాణరాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న డాక్టర్ మారెపెల్లి సు«దీర్‌కుమార్ మొదటిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ వైస్ చైర్మన్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓరుగల్లుకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీ మారారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థి కాగా, మేయర్ గుండు సు«ధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్‌రావు తదితరులు సైతం బీఆర్ఎస్ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డా.టి.రాజయ్యలతో పాటు పలువురు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు, తొలి సీఎంగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన మేలును చూసి ప్రజలు గెలిపిస్తారన్న ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ ఉన్నారు. ముగ్గురిదీ బీఆర్ఎస్ బ్యాక్‌గ్రౌండే.. అందరూ మొదటిసారే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్కు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ ఎం.సు«దీర్కుమార్ను పోటీలోకి దింపారు. కాగా డాక్టర్ మారేపల్లి సు«దీర్‌కుమార్ ఆయుర్వేద వైద్యుడు కాగా, కడియం కావ్య సైతం వైద్యురాలే. బీఆర్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ ముగ్గురు కూడా ఎంపీ ఎన్నికల బరిలో నిలవడం మొదటిసారి. ప్రభావితం చూపే అంశాలు » ఎంపీ సెగ్మెంట్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వారి మొగ్గు ఎటువైపు ఉంటుందో.. » దళితుల ఓట్లూ కీలకమే» నగర ఓటర్లు, విద్యావంతులూ ఎక్కువే» బలమైన తెలంగాణవాదం2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా..» పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) 6,12,498 » దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్) 2,62,200 » చింతా సాంబమూర్తి (బీజేపీ) 83,777 -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం -
బీజేపీ నేత ఈటల దారెటు?
హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో.. ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్‌కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. త్రిముఖ పోరు..? మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
ఓర్వలేకే తప్పుడు ప్రచారం
ఇబ్రహీంపట్నం: అధికారం కోల్పోయిన అక్కసుతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుక్రవారం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకాన్ని చాలామంది మహిళాలు వినియోగించుకుంటున్నారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ప్రతిపక్షాలకు అక్కసు పుట్టిందన్నారు. ఈ పథకంపై కావాలని బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. ఆటో డ్రైవర్లను ఉసిగొల్పి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతుండటంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ఉచిత ప్రయాణంపై మహిళలు బస్సుల్లో కొట్టుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 త్వరలో అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సదాలక్ష్మి, కవిత, ఉషశ్రీ, మాధవి, వెంకటమ్మ, మంజుల, అమృత, రత్నకుమారి, లావణ్య పాల్గొన్నారు. -
కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించండి: కౌశిక్ రెడ్డి భార్య
ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేసిండు. ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా పని చేసి కూడా సొంత మండలం, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఉపఎన్నికల్లో గెలిచి ఒక్కసారి మండలానికి రాలేదని, మంత్రిగా ఉండి మహిళా సంఘం భవనం కట్టించలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోవద్దన్నారు. ‘మీ దయ, దండం పెట్టి, గదవ పట్టుకొని, మీ కడుపులో తలపెట్టి మరీ అడుగుతున్న నన్ను గెలిపించండి.. చేసిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తా’నని అన్నారు. వేరేవారు గెలిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది, తనను గెలిపిస్తే కమలాపూర్‌ను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మీ ఆడబిడ్డగా కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించాలని కౌశిక్‌రెడ్డి భార్య షాలిని కోరారు. మా డాడీని భారీ మెజార్టీతో గెలిపించాలని కూతురు శ్రీనిక ఓటర్లను వేడుకున్నారు. అనంతరం కార్యకర్తలు, మహిళలతో కలిసి కౌశిక్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. కౌశిక్‌రెడ్డికి మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ రాణిశ్రీకాంత్, జెడ్పీటీసీ కల్యాణిలక్ష్మణ్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, వైస్ ఎంపీపీ శైలజఅశోక్, సర్పంచ్ విజయతిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, రాధికారమే‹శ్, నాయకులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి ఇల్లందకుంట మండలంబూజునూర్ గ్రామంలో ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేశ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పాడి కౌశిక్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొమురెల్లి, ఎంపీటీసీ విజయ–కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు విక్రమ్, మాజీ ఎంపీటీసీ రామ్ స్వరణ్‌రెడ్డి, నాయకులు,తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి, బేతిగల్, కనపర్తి, ఘన్ముక్కుల గ్రామాలలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు ప్రచారం జమ్మికుంట పట్టణంలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ ఆర్యవైశ్యుల సంఘం అ«ధ్యక్షుడు ఐత మహేశ్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ఒక్కసారి పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు. -
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం
-
తెలంగాణలో చివరి దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారం
-
హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘2014 లోనే తెలంగాణలో మార్పు వచ్చింది. కొవిడ్, ఎన్నికలు మినహా మిగతా ఆరున్నరెళ్ల పాలన ప్రజల ముందుంది. 65 ఏళ్లుపాటు గత సీఎంలు పాలించిన పనితీరుతో కేసీఆర్ పనితీరును గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ‘ప్రో రూరల్ ప్రో అర్బన్, ప్రో అగ్రికల్చర్ ప్రో బిజినెస్’ అనే పంథాపై కేసీఆర్ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనుమానాలు వీడి ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతులు పెరిగాయి. 2021-22 సంవత్సరానికిగాను ఐటీ ఎగుమతుల వల్ల రాష్ట్రానికి రూ.57వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ ఉత్పత్తులు పుంజుకున్నాయి. రాష్ట్ర సంపద హెచ్చయింది. 2014లో వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది. కానీ 2022లో 3.5 కోట్ల టన్నుల వరి పండించి మొదటిస్థానంలో ఉంది. టీఎస్ఐపాస్ ద్వారా 27వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. గతంలో క్రెడాయ్‌కు సంబంధించి కేసీఆర్ ఒకేరోజు ఏకంగా దాదాపు 6 జీవోలు విడుదల చేశారు. కానీ స్పష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అలాంటి అవకాశం ఉండదు’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో కేటీఆర్ వివరించారు. ‘100 శాతం అక్షరాస్యత, ‘అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాం. గతంలో హైదరాబాద్‌కు గుర్తుగా ఛార్మినార్ చూపించేవారు. కానీ ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకు క్రెడాయ్ ఎంతో సహకారం చేసింది. 2047 వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో పూర్తి సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యం ఉంది. 2040 వరకు పూర్తి గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌గా మార్చాలి. వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ ప్లాంట్లు పెంచాలి. వాహన, శబ్ద కాలుష్యం తగ్గించాలి. హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా ఉంచేందుకు కెమెరాల సంఖ్యను పెంచాలి. 24 గంటలు నీటివసతి కల్పించాలి. హైదరాబాద్‌లో రానున్న పదేళ్లలో 415 కిలోమీటర్లకు మెట్రో విస్తరించాలి. రాష్ట్రంలో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ తీసుకురానున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్‌కు కేవలం గంటలో చేరుకునే అవకాశం ఉంది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలుచేయనున్నాం. హైదరాబాద్ చుట్టూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలి. 2030 వరకు హైదరాబాద్‌ను ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతాం. శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలి. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలే రూపొందించాలి’ అని ఆయన వివరించారు. -
కాంగ్రెస్ అభ్యర్థుల్లో కొందరు రెండు మూడుసార్లు ఓడినవారే
-
కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేష న్లన్నీ చిత్తు కాగితాలేనని, డిక్లరేషన్ల పేరిట ఆ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజలను మోసగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్ పేరిట రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మైనార్టీలు, బీసీల జనగణన చేసి ‘ఫెయిర్ రిజర్వేషన్’ ఇస్తామనడంలో కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని విమర్శించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం హోం మంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ఇంతియాజ్ ఇషాక్ అలీ, సలీమ్, సోహైల్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ భావజాలానికి అనుగుణంగా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు తదితరులను గతంలోనే రాజ్యాంగం మతపరమైన మైనార్టీలుగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మైనార్టీ డిక్లరేషన్ పేరిట మైనార్టీలు, బీసీల నడుమ విద్వేషాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ తరహా ప్రతిపాదనలతో అటు మైనార్టీలు, ఇటు బీసీలు నష్టపోతారని చెప్పారు. మైనార్టీలు బీసీలుగా గుర్తింపు పొందితే వారికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, బడ్జెట్ కేటాయింపులు, మైనార్టీ సంక్షేమ, ఫైనాన్స్ కార్పొరేషన్ల రద్దు తదితర ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. బీజేపీ భావజాలానికి అనుగుణంగా, బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ తయారైందని, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం వల్లే ఈ తరహా ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో అతి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు మైనార్టీ సంక్షేమం విషయంలో దేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పదేళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే, తాము తొమ్మిదేళ్ల కాలంలోనే అంతకు 11 రెట్లు వెచ్చించామని చెప్పారు. తెలంగాణలో మైనార్టీ సంక్షేమానికి కేటాయింపులు రాబోయే రోజుల్లో రూ.5 వేల కోట్లకు చేరనుండగా, కాంగ్రెస్ డిక్లరేషన్‌లో రూ.4 వేల కోట్టే ఇస్తామనడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఇమామ్‌లు, మౌజంలకు రాబోయే రోజుల్లో రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, గోషా మహల్, హుజూరాబాద్‌లో గెలిచి తీరుతామని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ వంద సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఆర్థిక తీవ్రవాదం కాంగ్రెస్ పార్టీలో ఆరాచక రాజకీయం, ఆర్థిక తీవ్ర వాదం నడుస్తోందని, టికెట్లు అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత సంగిశెట్టి జగదీశ్ బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే జరి గిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత నక్క రవీందర్, నకిరేకల్ నాయకులు ప్రసన్నతోపాటు ముషీరాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్య క్రమంలో మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠాగో పాల్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఆ 33 సెగ్మెంట్లలో మారుతున్న పార్టీల రాతలు
ప్రతిసారీ ఎన్నికలు జరుగుతాయి..ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేసిన వారిలో ఒక్కరు గెలిస్తే, మిగిలిన వారంతా ఓడిపోతారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జరిగేది ఇదే. కానీ, కొన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ విజేతలు, పరాజితులను నిర్ణయించే క్రమంలో విలక్షణంగా వ్యవహరిస్తుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి కొన్ని నియోజకవర్గాల ప్రజలు తమ మూడ్‌ను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. కొన్నిచోట్ల ఒక్కసారి గెలిచిన పార్టీకి మరోమారు పట్టం కట్టరు. మరికొన్ని చోట్ల వరుసగా ఒక్కో పార్టీని గెలిపిస్తుంటారు. అలాంటి విలక్షణ తీర్పునిచ్చే నియోజకవర్గాలు తక్కువేం లేవు. రాష్ట్రంలోని నాలుగో వంతుకుపైగా నియోజకవర్గాల్లో విభిన్న తీర్పులిస్తున్నారు ప్రజలు. ఆ నియోజకవర్గాలేంటి... ఈ ప్రజల ‘మూడ్’ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. ♦ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎనిమిది ఎన్నికల్లో ఒక్కసారి మినహా ఏడుసార్లు విభిన్న తీర్పునిచ్చారు. ఒకసారి గెలిచిన పార్టీని మళ్లీ అక్కడి ప్రజలు ఆదరించలేదు(2004లో మినహా). 2018లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 2014లో టీఆర్ఎస్, 2009లో కాంగ్రెస్ గెలిచాయి. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నప్పుడు 2004లో టీడీపీ, 1999లో టీడీపీ, 1994లో సీపీఐ, 1989లో కాంగ్రెస్, 1985లో సీపీఐ గెలిచాయి. అంటే (2004లో మినహా) ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవని సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతోందన్నమాట. ♦ ఖానాపూర్‌లో ఒక్కసారి మినహా గత ఆరు ఎన్నికల్లో ఏ పార్టీనయినా ప్రజలు వరుసగా రెండుసార్లు గెలిపిస్తున్నారు. 1994, 1999ల్లో టీడీపీ, 2004లో టీఆర్ఎస్, 2008, 2009లో మళ్లీ టీడీపీ, 2014, 18 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించారు. ♦ ఆదిలాబాద్‌లో 1978 నుంచి మూడుసార్లు వరుసగా ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ రెండుసార్లు టీడీపీ గెలిచింది. మరోసారి కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ టీడీపీ గెలిచింది. తాజాగా జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. ♦ నిర్మల్‌లో నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, 2014లో బీఎస్పీ, 2018లో టీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందాయి. ♦ ముథోల్‌లో 1983లో కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ గెలిచాయి. అంటే 40 ఏళ్లుగా ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు. ♦ ఆర్మూరులో 1983లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ గెలిచాయి. గత రెండు ఎన్నికల్లో మాత్రమే టీఆర్ఎస్ వరుసగా గెలిచింది. ♦ జగిత్యాలో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ పెద్దపల్లిలో 1978లో కాంగ్రెస్, 83లో టీడీపీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్ఎస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్ఎస్ గెలిచాయి. ఇలా వరుసగా 45 ఏళ్ల సంప్రదాయానికి గండికొడుతూ 2018లో కూడా టీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. ♦ హుజూరాబాద్‌లో1962 నుంచి వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిస్తే, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు టీడీపీ గెలిచింది. టీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత 6సార్లు ఆ పార్టీనే గెలిచింది. గత ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది. ♦ శేరిలింగంపల్లి ఏర్పాటైన తర్వాత మూడుసార్లు మూడు పార్టీలను అక్కడిప్రజలు గెలిపించారు. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్లు ఇక్కడి నుంచి గెలిచాయి. ♦ సంగారెడ్డిలో 1989 నుంచి గెలిపించిన పార్టీ మళ్లీ ప్రజలు గెలిపించడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో టీడీపీ, 99లో బీజేపీ, 2004లో టీఆర్ఎస్, 09లో కాంగ్రెస్, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు గెలిపించారు. ♦ ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీనయినా రెండుసార్లు ఆదరిస్తున్నారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థులు అక్కడ గెలిస్తే, 2004, 09లో కాంగ్రెస్, 2014, 18లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ♦ చేవెళ్లలో 2004లో కాంగ్రెస్, 09లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 8లో టీఆర్ఎస్ గెలుపొందాయి. ♦ తాండూరులో 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ గెలిచాయి. ఐదు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీని ప్రజలు మరోసారి ఆదరించలేదు. ♦ ముషీరాబాద్‌లో 1989, 94లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒసారి బీజేపీ, మరోమారు టీఆర్ఎస్ గెలిచింది. అక్కడ మళ్లీ రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఒకసారి బీజేపీ, మరోసారి టీఆర్ఎస్ గెలిచాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ♦ జూబ్లీహిల్స్ ఏర్పాటయిన తర్వాత మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ విజయం సాధించాయి. ♦ గోషామహల్లో ప్రజలు డబుల్ ధమాకా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1972, 78లో కాంగ్రెస్ గెలిస్తే, 83, 85లో టీడీపీ గెలిచింది. 94, 99 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2014, 18 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ, 1989లో మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ♦ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. 2004లో టీడీపీ, 09లో కాంగ్రెస్, 14లో టీడీపీ, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారో? ♦ కొడంగల్‌లో కూడా రెండుసార్లు గెలిచే సంప్రదాయం కొనసాగుతోంది. 1994,96లో టీడీపీ, 1999,2004లోకాంగ్రెస్, 2009,14లో టీడీపీ గెలిచాయి. 18లో టీఆర్ఎస్ గెలవగా, 23లో ఎవరుగెలుస్తారో వేచి చూడాలి. ♦ మక్తల్‌లో 2005 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ వనపర్తిలో గత నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కల్వకుర్తిలో 1989 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. 1989లో కాంగ్రెస్, 94లో ఇండింపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలవడం గమనార్హం. ♦ దేవరకొండలోనూ గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ 1994లో సీపీఐ గెలిస్తే 99లో కాంగ్రెస్, 2004లో సీపీఐ, 2009లో కాంగ్రెస్, 14లో సీపీఐ, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కోదాడలోనూ గత నాలుగు పర్యాయాలుగా ఓసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు. ఇక్కడ 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో కాంగ్రెస్, 18లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ తుంగుతుర్తిలో 1989లో కాంగ్రెస్ విజయం సాధించగా, 94లో ఇండిపెండెంట్, 99లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ, 14లో టీఆర్ఎస్ గెలిచాయి. వరుసగా రెండోసారి 2018లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ♦ నర్సంపేటలో ఐదు పర్యాయాలుగా గెలిచిన పార్టీ గెలవడంలేదు. 1999లో ఇక్కడ టీడీపీ గెలిస్తే, 2004లో టీఆర్ఎస్, 2009లో టీడీపీ, 2014లో ఇండిపెండెంట్, 2018లో టీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ♦ పరకాలలో 1989లో బీజేపీ గెలిస్తే, 94లో సీపీఐ, 99లో టీడీపీ, 2004లో టీఆర్ఎస్, 09లో కాంగ్రెస్, 12లో టీఆర్ఎస్, 14లో టీడీపీ, 18లో టీఆర్ఎస్ పార్టీలు గెలిచాయి. గత 8 ఎన్నికల్లోనూ అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోమారు గెలవడం లేదు. ♦ ములుగులోనూ నాలుగు పర్యాయాలుగా గెలుపు గుర్రాలు మారుతూనే ఉన్నాయి. 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 09లో టీడీపీ, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ♦ ఖమ్మం నియోజకవర్గంలో 1994 నుంచి గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. ఇక్కడ 1994లో సీపీఐ, 1999లో కాంగ్రెస్, 2004లో సీపీఎం, 2009లో టీడీపీ, 2014లో కాంగ్రెస్, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. ♦ కొత్తగూడెంలోనూ నాలుగు దఫాలుగా విజయం వేర్వేరు పార్టీలను వరిస్తోంది. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, 2009లో సీపీఐ, 14లో టీఆర్ఎస్, 18లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ♦ ఇక, అశ్వారావు పేట ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీలు గెలిచాయి. ఇక్కడ 2009లో కాంగ్రెస్, 2014లో వైఎస్సార్సీపీ, 2018లో టీడీపీ గెలిచాయి. ♦ నకిరేకల్‌లోనూ నాలుగు దఫాలుగా ఇవే ఫలితాలొస్తున్నాయి. ఇక్కడ 2004లో సీపీఎం గెలిస్తే 2009లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. ♦ డోర్నకల్‌లోనూ ఓటర్లు ప్రతీఎన్నికల్లో తమ తీర్పు మారుస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌ను గెలిపించిన అక్కడి ప్రజలు 09లో టీడీపీనీ, 14లో కాంగ్రెస్‌ను, 18లో టీఆర్ఎస్ను గెలిపించారు. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
చేదోడు లేని ఆ నలభై ఏడు!
తెలంగాణలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర మాత్రం చేదు జ్ఞాపకంగానే ఉంది. 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా స్థానాల్లో కొన్నిచోట్ల గత పది ఎన్నికల్లో ఆ పార్టీ ఒకట్రెండు సార్లు మాత్రమే గెలవగలిగింది. 1967 తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించలేదు. పునర్విభజన తర్వాత ఏర్పాటైన బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, దేవరకద్ర, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వైరాలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ పాగా వేయలేదు. మెదక్ నియోజకవర్గంలోనూ 1989 తర్వాత కాంగ్రెస్ గెలవలేదు. సిరిసిల్లలో 2009 నుంచి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కెవిజయం సాధిస్తూనే ఉన్నారు. దుబ్బాకలో 2009లో చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. అంబర్‌పేటలో 1989లో వి. హనుమంతరావు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. మహబూబ్‌నగర్‌లో 1989లో పులివీరన్న గెలిచిన తర్వాత జరిగిన ఏడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. భువనగిరిలో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.నర్సింహారెడ్డి మాత్రమే గెలిచారు. నర్సంపేటలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే 1957లో కె.కనకరత్నమ్మ, 1967లో కె.సుదర్శన్‌రెడ్డి మాత్రమే గెలిచారు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచిన నియోజకవర్గాలివే.. ♦ 2004 తర్వాత సిర్పూర్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు దక్కలేదు. 1978 తర్వాత గెలిచింది 2004లోనే. అప్పుడు కోనేరు కోనప్ప విజయం సాధించగా, గత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ♦ చెన్నూరులో కూడా 1978 తర్వాత గెలిచింది 2004లోనే. ఇక్కడ మాత్రం ఓడిపోయిన ప్రతిసారీ రెండోస్థానంలో నిలిచింది. 2004లో జి.వినోద్ గెలిచారు. ♦ 2009లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పాటయిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ♦ మంచిర్యాలలోనూ కాంగ్రెస్ ఇప్పటివరకు గెలవలేదు. నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో సహా) ఓడిపోయిన కాంగ్రెస్ మూడుసార్లు రెండో స్థానంలో నిలిచింది. ♦ ఖానాపూర్‌లో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి కె.భీంరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. ♦ 1983 నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పదిసార్లు ఎన్నికలు జరిగితే 1989, 2004లో రెండుసార్లు సి.రామచంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ♦ బోథ్ నియోజకవర్గంలో వరుసగా ఎనిమిది పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోంది. ఇక్కడ 1983లో కాంగ్రెస్ పక్షాన ఎం.కాశీరాం గెలిచిన తర్వాత మరెవరూ గెలవలేదు. ♦ నిర్మల్‌లో 1999, 2004లో వరుసగా రెండు సార్లు ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో గెలవలేదు. ♦ 1989, 99 ఎన్నికల్లో రెండుసార్లు ఆర్మూరు నుంచి కాంగ్రెస్ గెలిచింది. 1999 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ♦ ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది నాలుగు సార్లు మాత్రమే. ఐదు సార్లు రెండోస్థానంలో నిలిచింది. చివరగా 2004లో సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ♦ బాన్సువాడలో గత నాలుగు సార్లు ఓటమిపాలయ్యింది. 2004లో బాజిరెడ్డి గోవర్దన్ గెలవగా, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఓడిపోయింది. ♦ కామారెడ్డిలో 1983 తర్వాత కాంగ్రెస్ గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1989, 2004లో షబ్బీర్‌అలీ ఇక్కడి నుంచి గెలిచారు. ♦ నిజామాబాద్ అర్బన్‌గా మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలుపొందలేదు. 2009లో నియోజకవర్గం పేరు మారగా, అంతకుముందు 2004, 1999లో కాంగ్రెస్ తరఫున డి.శ్రీనివాస్ రెండుసార్లు గెలుపొందారు. ♦ నిజామాబాద్ రూరల్‌లో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ గెలవలేదు. అంతకుముందు డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు కూడా 2008 ఉప ఎన్నికలో, 1978లో ఆకుల లలిత, ఎ. బాల్‌రెడ్డిలు మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ♦ కోరుట్లలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ విజ యాన్ని అందుకోలేకపోయింది. బుగ్గారం (2009కి ముందు)గా ఉన్నప్పుడు మాత్రం రెండుసార్లు రత్నాకర్‌రావు, ఒకసారి కె.గంగారం, మరోమారు రాజారాం, ఇంకోసారి మోహన్‌రెడ్డిలు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. ♦ పెద్దపల్లిలో 1989 తర్వాత కాంగ్రెస్ గెలుపొందలేదు. 1989లో గీట్ల ముకుందరెడ్డి గెలిచిన తర్వాత వరుసగా ఆరుసార్లు ఆ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. ♦ హుజూరాబాద్ నియోజకవర్గంలో 1978 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అప్పుడు దుగ్గిరాల వెంకట్రావు విజయం సాధించారు. ♦ సిద్దిపేటలో కాంగ్రెస్ చివరగా గెలిచింది 1983లోనే. అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం గమనార్హం. ♦ దేవరకద్రలో ఇంతవరకు కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. నాగర్‌కర్నూల్‌లో 1989లో వంగా మోహన్‌గౌడ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓటమి పాలవుతూనే ఉంది. 1983 తర్వాత ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. -
సిద్దిపేట నుంచి..మరో టీఆర్ఎస్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్య సమితి) పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన సీఎం కేసీఆర్ గతంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, ఇటీవల దానిని బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు తుపాకుల బాలరంగం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీని రిజిస్టర్ చేసింది. దీనిని టీఆర్ఎస్ అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించింది. బహుజనులకు రాజ్యాధికారం కోసమే..: రాష్ట్ర జనాభాలో 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలున్నా రాజ్యాధికారం దక్కడంలేదు. ముదిరాజ్‌లు 14 శాతం, పద్మశాలీలు 8 శాతం, యాదవ్‌లు 12 శాతం, గౌడలు 10 శాతం జనాభా ఉన్నా, ఐదుశాతం లోపు జనాభా ఉన్నవారికే ప్రస్తుతం పదవులు దక్కుతున్నాయి. రాబోయే కాలంలో బహుజనులకు రాజ్యాధికారం కోసమే పార్టీని స్థాపించాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లలో పోటీ చేస్తాం. – బాలరంగం -
ఇక్కడ తీరువేరు వార్ వేరు
రెండు ఎన్నికల్లోనూ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాలను దక్కించుకోగా,భద్రాచలంలో సీపీఎం గెలుపొందింది. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇక సత్తుపల్లిలో టీడీపీ, కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికలో పాలేరు నుంచి టీఆర్ఎస్ గెలుపొందింది. ఇక 2018 ఎన్నికల్లో మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. వైరాలో ఇండిపెండెంట్ అభ్యరి్థ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలిచింది. అయితే 2018 ఎన్నికల తర్వాత పరిణామాలతో పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో బలం పెంచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ పెట్టి ఇక్కడ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. జలగం హవా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఎక్కువకాలం జలగం కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. 1957లో జలగం కొండల్రావు, 1962, 1967,1972లో వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు విజయ బావుటా ఎగురవేశారు. అనంతరం 1978లో వేంసూరు కాస్తా సత్తుపల్లి నియోజకవర్గంగా ఏర్పడడంతో వెంగళరావు గెలుపొందారు. ఆయన కాసు, పీవీ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం లోక్‌సభ నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆయన సోదరుడు కొండల్రావు సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు 2004లో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 40 ఏళ్ల తర్వాత... గత నలభై ఏళ్లుగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే ప్రతీసారి విపక్షంలోనే ఉంటూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తిరగరాశారు. 1978లో కాంగ్రెస్ తరఫున కీసర అనంతరెడ్డి గెలుపొందగా.. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వర్టీ ది. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ 2018లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా, ఆయనకు మంత్రి పదవి దక్కింది. కమ్యూనిస్టుల కోటకు బీటలు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నా క్రమంగా బీటలు వారుతూ వర్టీ ది. గత రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఇతర పార్టీ లతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సత్తా చాటిన తుమ్మల ఇక సత్తుపల్లి రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఒరవడి సృష్టించారు. 1983లో తెలుగుదేశం తరఫున ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి,2009లో ఖమ్మం నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి పాలయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆÆŠḥఎస్ తరఫున గెలిచినా, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఓటమి పాలయ్యారు. తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో పనిచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ విజయం సాధించి పాలనాపగ్గాలు చేపట్టినా ఇక్కడ మాత్రం ఒకటీ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉండగా.. గతంలో సత్తా చాటిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయారు. -
ఈ సారి వైఎస్సార్సీపీ మెజారిటీ అంతకుమించి: విజయసాయి రెడ్డి
అమరావతి: తెలుగు ప్రాంతం సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా 2014 జూన్ 2న విడిపోయాక రెండు చోట్ల శాసనసభ ఎన్నికలు ఆరు నెలల తేడాతో నిర్వహించడం ఐదేళ్ల క్రితం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీకి రెండో ఎన్నికలు దాని పదవీ కాలం ముగియడానికి ఆరు నెలలు ముందు 2018 డిసెంబర్ 7న జరిగాయి. పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి బలం మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 63 నుంచి 88 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతాన్ని కూడా ఈ ఎన్నికల్లో 46.9 శాతానికి పెంచుకోగలిగింది. ఆరు నెలల తర్వాత 17వ లోక్ సభ ఎలక్షన్లతోపాటు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వినూత్న, చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 2019 ఏప్రిల్–మే మాసాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీలో నాటి పాలకపక్షాన్ని తొలగించి, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మునుపెన్నడూ కనీవినీ ఎరగని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. మొత్తం 175 సీట్లకు గాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి 151 సీట్లలో విజయాన్ని అందించారు. పాలక టీడీపీకి కేవలం 23 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో, రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టారు. ఐదేళ్ల అడ్డగోలు పరిపాలనకు తెలుగుదేశం చెల్లించిన మూల్యం ఇది. నూతన రాజధాని అమరావతి పేరుతో, ఇంకా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వంటి పేర్లుతో చేసిన కుంభకోణాలపై ఆంధ్రా ప్రజలు ఇలా స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పన్నెండేళ్ల ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి తన నాలుగున్నరేళ్ల పాలన తర్వాత జరిపించిన 2018 డిసెంబర్ ఎన్నికల్లో తన బలాన్ని 25 సీట్లు పెంచుకుని మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది. 2022 అక్టోబర్ లో భారత రాష్ట్రసమితిగా (బీఆరెస్) మారిన టీఆరెస్ ఇప్పుడు మూడోసారి తనకు పరిపాలించే అవకాశం ఇవ్వాలని జనం ముందకు పోతోంది. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, మరో జాతీయపక్షం బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పాలక ప్రాంతీయపక్షంతో పోటీపడుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని పార్టీకి మూడోసారి పరిపాలించే అవకాశం ఇవ్వాలా? అనేది తెలంగాణ ఓటర్ల ముందున్న ప్రశ్న. ఈసారి అంతకుమించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రగతితోపాటు ప్రజా సంక్షేమంపై అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ దృష్టి పెట్టింది. వృద్ధాప్య పెన్షన్లను దశలవారీగా పెంచుతూ పోయే ఫైలుపైనే కొత్త సీఎం జగన్ 2019 మే 30న లక్షలాది మంది ప్రజానీకం ముందు సంతకం చేశారు. ‘నవరత్నాలు’ పేరుతో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చే పనిని కృతనిశ్చయంతో మొదలుబెట్టింది రాష్ట్ర సర్కారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి రూపొందించిన అనేక నగదు బదిలీ పథకాలను గత నాలుగున్నర సంవత్సరాలుగా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మతం, కులం, పార్టీ భేదం లేకుండా ఆంధ్రా ప్రజలంతా రాష్ట్ర సర్కారు పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం తన అనుకూల మీడియా సాయంతో పాలకపక్షంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని 2019 వేసవి నుంచీ నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కుంభకోణంలో తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పటి నుంచీ ఓ పక్క కోర్టుల్లో న్యాయవిచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో పక్క టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు అబద్ధాలు, అర్థసత్యాలతో చంద్రబాబు అరెస్టు ‘అన్యాయమంటూ’ గావుకేకలు పెడుతూ రోడ్లెక్కుతున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎంత అవినీతి జరిగిందో స్వయంగా చూసిన తెలుగు ప్రజానీకం మాత్రం అవినీతి ఆరోపణలపై జరిగిన మాజీ సీఎం అరెస్టుపై హేతుబద్ధంగానే స్పందిస్తున్నారు. సొంత రాష్ట్రం ఏపీలో జనం నుంచి తమ నాయకుడి అరెస్టుపై ‘సానుభూతి వర్షం’ కురవకపోవడంతో టీడీపీ కొత్త వ్యూహానికి తెర తీసింది. హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు, ఆంధ్రా మూలాలున్న కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేయడానికి ఈ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా–జనాదరణ కరవైన టీడీపీ ఇప్పుడు నిరాశా నిస్పృహలతో చేస్తున్న విన్యాసాలను ఆంధ్రాప్రజలు గమనిస్తున్నారు. 2024 ఏప్రిల్–మేలో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధిచెబుతారు. వైఎస్సార్సీపీ మెజారిటీని 160 సీట్లు దాటించి ఇంకా ఎందాకా తీసుకెళతారనేదే ప్రస్తుతం రాజకీయ, ఎన్నికల విశ్లేషకుల చర్చనీయాంశం. -విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం -
ఉద్యమం నుంచి నేషనల్ హైవే పైకి..
కల్వల మల్లికార్జున్‌రెడ్డి : రాష్ట్రసాధనే లక్ష్యంగా ఉద్యమపార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి తొలిసారిగా ‘భారత్ రాష్ట్రసమితి’ రూపంలో ఎన్నికల పరీక్షకు సిద్ధమవుతోంది. జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి ఓవైపు రంగం సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించేందుకు పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలో ఎన్నికలను అ్రస్తాలుగా మలుచుకొని ఫలితాలు రాబట్టుకున్న కేసీఆర్ ‘హ్యాట్రిక్ అధికారం’ కోసం త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఉపఎన్నికలతోనే ప్రస్థానం షురూ ..: తెలంగాణ రాష్ట్ర సాధనకు టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి ఏకకాలంలో రాజీనామా చేసిన కేసీఆర్ ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2001లో సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన..: టీఆర్ఎస్ 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఉమ్మడి ఏపీలో 46 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 26 చోట్ల విజయం సాధించింది. రాష్ట్ర ఏర్పాటుపై మాట తప్పిందనే కారణంతో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు. 2006 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎంపీగా మరోమారు కేసీఆర్ విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లగా, కేవలం ఏడుగురు మాత్రమే గెలుపొందారు. భారీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆ తర్వాత పార్టీ నేతల ఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. ముందస్తు ఎన్నికలతో రెండోసారి అధికారం..: ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తూ 2018 సెపె్టంబర్ 6న కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు రద్దు నిర్ణయంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఏకకాలంలో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని చోట్లా పోటీ చేసి 88 చోట్ల విజయం సాధించింది. వరుసగా రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాతి కాలంలో కోరుకంటి చందర్ (ఏఐఎఫ్బీ), రాములునాయక్ (ఇండిపెండెంట్)తో పాటు 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో పార్టీ సంఖ్యాబలం 104కు చేరింది. గడిచిన నాలుగేళ్లలో 2018–22 మధ్యకాలంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా నాగార్జునసాగర్, హుజూర్నగర్, మునుగోడులో టీఆర్ఎస్ హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ రూపంలో తొలి పరీక్ష ..: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ పేరిట తొలిసారిగా ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఒకే జాబితాలో 115 మంది పేర్లు కేసీఆర్ ప్రకటించారు. తొలిసారిగా చేజిక్కిన అధికార పగ్గాలు..: 2014 ఎన్నికల్లోఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేసి 63 చోట్ల విజయం సాధించింది. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఎస్పీ, సీపీఐ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం భారీగా పెరిగింది. నారాయణఖేడ్, పాలేరు ఎమ్మెల్యేల(కాంగ్రెస్) మరణంతో 2016లో వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. మహాకూటమితో కేసీఆర్ జట్టు..: 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమితో టీఆర్ఎస్ జట్టు కట్టింది. 45 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేయగా, 10 సీట్లే గెలిచింది. తర్వాత పార్టీలో చేరిన చెన్నమనేని రమేశ్ (వేములవాడ) సహా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2011 ఉపఎన్నికలో బాన్సువాడలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం విజేతగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతున్న దశలో టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, గంప గోవర్దన్, జూపల్లికృష్ణారావు, తాటికొండ రాజయ్య 2012లో రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. నాగర్‌కర్నూలు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన నాగం జనార్దన్‌రెడ్డికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే ఉప ఎన్నికలో మహబూబ్‌నగర్ నుంచి ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) టీఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై గెలుపొందారు. -
గాదె ఇన్నయ్య అరెస్టు
జఫర్‌గఢ్: టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామానికి చెందిన ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథాశ్రమం’వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్యను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అనాథాశ్రమ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల నుంచి గాదె ఇన్నయ్య ‘భారత్ బచావో’కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నయ్యను అరెస్టు చేసింది రాష్ట్ర పోలీసులా? కేంద్ర దర్యాప్తు సంస్థలా అన్నది తెలియాల్సి ఉంది. ఇన్నయ్య విద్యార్థి దశలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి హైదరాబాద్‌లోని జలదృశ్యం కార్యాలయంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ను స్థాపించారు. ఆ తరువాత కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇన్నయ్య.. తెలంగాణ రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమం కొనసాగించారు. ఈ క్రమంలో మళ్లీ జైలుకు వెళ్లారు. విడుదలైన అనంతరం జఫర్‌గఢ్ మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద 2006 మే 28న ‘మా ఇల్లు అనాథ అశ్రమం’నెలకొల్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘భారత్ బచావో’కార్యక్రమాన్ని చేపడుతున్న ఇన్నయ్యను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసముంటున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. -
బీఆర్ఎస్ను వీడనున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త నేత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు సమచారం. గుబాబి పార్టీకి బైబై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి నారాయణ రెడ్డి 2016లో బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లోనే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. 2018లోనూ మళ్లీ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం ఈ సారి కూడా మొండిచేయి చూపించింది. దీంతో ఆయన తన రాజకీయ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపై దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు సిట్టింగ్ స్థానాలకే ప్రధాన్యతనిచ్చింది. పార్టీలో ఈసారి టిక్కెట్ దక్కుతుందని భావించిన ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానానికి మొరపెట్టుకున్నా.. ప్రయోజనం లేకపోవడంతో కొత్తదారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత -
ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నేడు మెల్బోర్న్లోని పవిలియన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ సాగనుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని, అందుకు క్రికెట్ టోర్నీనే సరైన వేదిక అని నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయి రామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్ష రెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
గాంధీ మార్గంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా, గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని.. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ పదే పదే చెప్పేవారని.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ౖగ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా.. వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా.. గిరిజనులు, దళితులు, మైనారిటీల నుంచి అగ్రవర్ణ పేదలదాకా అందరికీ, అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. గత ఏడాది ఆగస్టు 8న ప్రారంభించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముగింపునిచ్చింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుతంగా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను.ఆ నేపథ్యంలోంచి వచ్చినదే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల్లాంటి కొందరు తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారు. వారంతా తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిత్రమేమిటంటే.. అలా అన్న వాళ్లే ఈరోజు మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన ఈ పదేళ్లలోనే అద్భుత పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే దిక్సూచి అనే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా.. స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాల వెలుగులోనే అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు వేదికగా నిలుస్తున్నది. ౖగాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది.ఈ అభివృద్ధి నమూనాను ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్య్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నిజం చేద్దాం. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమర యోధుల ఆశయాలనుచాటేలా..: సీఎస్ శాంతికుమారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించిందని సీఎస్ శాంతికుమారి చెప్పారు. సమరయోధుల ఆశయాలను ప్రస్తుత తరానికి చాటì చెప్పేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించామని.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించామని, దాదాపు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయని అమె అన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. అదిగో చూడండి’ ఆలాపనతోపాటు ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘భారతీయ భావన’ నాట్య రూపకంలో.. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సీతోపాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన అలరించింది. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్కో ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. అనంతరం ‘సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట పలు వాయిద్యాలతో సాగిన జూగల్బందీ.. తర్వాత మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన సీఎం కేసీఆర్.. చాలా బాగున్నాయంటూ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
టికెట్ వస్తుందా.. కటీఫ్ చెప్పేద్దామా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందస్తుగా విడుదల చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో అసంతృప్త జ్వాల మాత్రం ఆరడం లేదు. జాబితా వెలువడి పది రోజులు గడిచినా టికెట్ ఆశించి భంగపడిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు అసంతృప్త స్వరాన్ని తగ్గించడం లేదు. నియోజకవర్గ ప్రజలు, తమ అనుచరవర్గంతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న అసంతృప్త నేతలు లోలోన తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడేందుకు మరో నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహ దృక్పథంతో లెక్కలు వేసుకుంటున్నారు. కేటీఆర్ రాక కోసం ఎదురుచూపులు ఒకేసారి 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేయగా, నేటికీ సుమారు డజనుకు పైగా నియోజకవర్గాల్లో అసమ్మతులు మెట్టు దిగడం లేదు. ప్రగతిభవన్ దిశా నిర్దేశం మేరకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కేటీఆర్ అమెరికా పర్యటనను నుంచి తిరిగి వచి్చన తర్వాత ఆయనతో భేటీ అయ్యేందుకు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. జాబితా ప్రకటన తర్వాత బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మదింపు చేస్తున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా కొందరు అభ్యర్థులను మార్చక తప్పని సరి పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఆశావహులు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరో? ఇక పార్టీ టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర అభ్యర్థులు తమపై పోటీ చేసే ప్రత్యర్థి పారీ్టల అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులను వెంటాడుతోంది. విపక్ష పార్టీ అభ్యర్థుల బలాబలాలకు అనుగుణంగా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు సొంత పారీ్టలో అసమ్మతి సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నట్లు బీఆర్ఎస్ గుర్తిస్తోంది. పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతుండటంతో వారిని బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. మరో వారం రోజుల్లో పార్టీ పరంగా కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గాలకు ప్రచార సామగ్రి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రచార సామగ్రిని తరలించే పనిలో ఉంది. నియోజకవర్గాల వారీగా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన ఓటర్లు, గ్రామాలు, పథకాల వారీగా వారి వివరాలను పార్టీ అభ్యర్థులకు అందజేస్తున్నారు. పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, తోరణాలు తదితరాలను తొలి విడతలో తెలంగాణ భవన్ నుంచి చేరవేస్తున్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాల్సిందిగా మంత్రి హరీష్‌రావు, కవితపై పార్టీ అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. ఓ వైపు అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆలోగా ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీ‹Ùరావు, కవిత ప్రచార షెడ్యూలుపైనా కసరత్తు జరుగుతోంది. -
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబి పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల దడ మొదలైంది. కొందిరికి టికెట్లపై పెట్టుకున్న ఆశలు అవిరవుతున్నాయి. జనంలో పలుకుబడి లేమి, అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు బైబై చెబుతోంది గులాబీ దళం. అవినీతి ఆరోపణలే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొంపలు ముంచాయా? లైంగిక వేధింపులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ను దూరం చేసిందా? లాస్ట్ ఛాన్స్ ఇవ్వండని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు కోరుతున్నా కరుణించడం లేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులుపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి . అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు బీఅర్ఎస్ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ఇప్పటికే సిద్దం చేసింది. ఈ జాబితా లో ఉన్న పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. జాబితాలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అసిపాబాద్ అత్రం సక్కు, చెన్నూర్ నుంచి విప్ సుమన్, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి పేర్లున్నట్లు తెలుస్తోంది. కాని జాబితాలో ఎమ్మెల్యే రేఖనాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్లు లేవని సమాచారం. జిల్లాలో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ షాక్ ఇస్తున్నారని సమాచారం. దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య టిక్కెట్ రాదని కలవరపాటుకు గురవుతున్నారు. వీరి స్థానంలో ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ , బోథ్ నుంచి మాజీ ఎంపీ నగేష్ టిక్కెట్ ఖారారైందని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిని సీటుని పోత్తులో సీపీఐకి కేటాయిస్తారని పార్టీలో చర్చజరుగుతోంది. ఒకవేళ పోత్తు లేకుంటే ఎంపీ నేతకాని వెంకటేష్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనుగుంట ప్రవీణ్ పేరు ఖారారు చేస్తుందని సమాచారం. ఎమ్మెల్యే రేఖా నాయక్ పై తీవ్రమైన అవినీతి అరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, దళిత బందు, సర్కార్ పనుల కేటాయింపులలో వాటాలు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై అంతులేని ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దళితబందు, దళిత బస్తీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో వాటాలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి. వీటికితోడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట. ఎమ్మెల్యే రేఖనాయక్ పై కూడా ఇదేవిధమైన వ్యతిరేకత ఉంది. టిక్కెట్ గెలిచే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు , శేజల్ పై లైంగిక వేధింపులతో ప్రజల్లో పరువు కోల్పోయారు. అందుకే టికెట్టు ఇవ్వడంలేదట. ముచ్చట మూడోసారి పోటీ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ద్వారా టిక్కెట్ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఒక్కసారి చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? -
కల్వకుర్తి: బీఆర్ఎస్కు మైనస్! కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా..
నాగర్ కర్నూల్ జిల్లాలో చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం కల్వకుర్తి. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తారు. టీడీపీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్దితులు హాట్‌టాపిక్‌గా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం పేరు: కల్వకుర్తి మండలాల సంఖ్య: 6 (కల్వకుర్తి , వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్) మొత్తం గ్రామపంచాయతీలు: 164 మున్సిపాలిటీలు: కల్వకుర్తి, ఆమనగల్లు ప్రభావితం చూపే పంచాయితీ: మాడ్గుల మొత్తం ఓటర్లు: 2,17,042 పురుషులు: 1,10,975; మహిళలు: 1,06,061 2014లో కాంగ్రెస్ అభ్యర్ది వంశీ చందర్‌రెడ్డి కేవలం 78 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 3447 ఓట్ల మెజార్టీలో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్దాయిలో ఉన్నాయి. గ్రూపు రాజకీయాలతో ఇక్కడ కూడా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది జైపాల్‌యాదవ్ మూడో స్దానం నిలిచారు. కసిరెడ్డికి స్దానికసంస్దల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో ఆయన గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి బీఆర్ఎస్ తరపున సీటు ఆశించారు. ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు కానీ పార్టీ మరోసారి జైపాల్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదు. అయినా జైపాల్ యాదవ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశాల్లో ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు నడిచింది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అదే గ్యాప్ కొనసాగుతుంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా తలనొప్పిగా మారనుంది. ఎవరికి సీటు ఇచ్చినా ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. పార్టీలోని చిత్తరంజన్‌దాస్, ఉప్పల వెంకటేష్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్లు కూడా జైపాల్ యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించటమే కాక ఆయనకు సీటు ఇస్తే సహకరించమని ఇటీవల కసిరెడ్డి నేతృత్వంలో ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారట. ఇక జైపాల్ యాదవ్ ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో తన మార్క్ పని ఏది చేయలేదని..డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కల్వకుర్తిలో జరిగినా పంపిణీ చేయటంలో జాప్యం చేస్తుండటం మైనస్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడ తీవ్ర జాప్యం వల్ల తనకోసం పనిచేసిన వారికి మేలు చేయలేక పోయారనే అపవాదు ఉంది. అదే జైపాల్ యాదవ్ ధీమా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు జైపాల్ యాదవ్. ఈ నియోజకవర్గం గుండా రెండు జాతీయరహదారులు హైదరాబాద్-శ్రీశైలం,జడ్చర్ల, కోదాడ ఉండగా కొత్తగా కొట్రనుంచి నంద్యాల వరకు మరో జాతీయరహదారి మంజూరయ్యింది. నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రామా కేర్ సెంటర్ లేదు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వందపడకలు చేస్తామన్న హమీ నేటికీ నెరవేరకపోవటంతో జనాలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టక తప్పటం లేదు. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కూడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధిపత్యపోరు కూడా జరుగుతోంది. కేవలం ప్రభుత్వ పథకాలపైనే భరోసా పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్దితి ఇక్కడి బీఆర్ఎస్ నేతల వంతవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున వంశీచందర్ రెడ్డి 2014లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో ఆయన మూడోస్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం చేయటం లేదట. ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని సొంత పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడ తమ దారితాము చూసుకుంటున్నారు. ఐక్యతా ఫౌండేషన్ పేరుతో ఎన్ఆర్ఐ రాఘవేందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేడా.. ఆయన కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు వస్తే కాంగ్రెస్ నుంచి లేకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనే అలోచనలో ఉన్నాడట. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. సీటు కూడ కావాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు కూడ జరిగాయట. కానీ సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆతని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ నడిపించే నాయకుడే కరువయ్యాడు. పారిశ్రామిక వేత్త జూపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2014లో వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువటంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న వంశీచందర్‌రెడ్డి ఈసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశంలేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. అందుకే ఆయన వ్యూహత్మకంగా జూపల్లి భాస్కర్‌రావును ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, రుణమాఫి, డబుల్ బెడ్రూం రూం ఇళ్ల నిర్మాణం వంటి అశలు తమకు కలిసివస్తాయని భావిస్తుంది. బీజేపీకి బలంగా మారిన అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు ఇక బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఆ పార్టీ అభ్యర్ది తల్లోజు ఆచారి ఓటమి చెందారు. తర్వాత ఆయన జాతీయ బీసీ కమీషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ పాత నేతలు, కార్యకర్తలు కొత్తవారిని పార్టీలోకి రానివ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆచారి నియోజకవర్గంలో ఆశించిన స్దాయిలో అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో కొంత బీజేపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత.. టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..మోదీ చరిష్మా ఈ సారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తోందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు నాగర్‌కర్నూల్ అటూ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్ -శ్రీశైలం,కోదాడ-జడ్చర్ల,కొట్ర-నంద్యాల మధ్య మూడు జాతీయ రహదారులు గల నియోజకవర్గంగా ఉంది. దుందుభీ నదీ ప్రవాహం ఉంటుంది. ఆలయాలు: రెండవ భద్రాదీగా పేరున్న సీతారామచంద్రస్వామి ఆలయం సిర్సనగండ్లలో ఉంది. కడ్తల్లో మైసిగండి ఆలయం ఉంది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవటం, నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమల స్దాపన చేయకపోవటంతో ఆ వర్గం ఓట్లు కూడ బీఆర్ఎస్కు మైనస్ కానుంది. -
జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!
నియోజకవర్గం: జడ్చర్ల మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట) మొత్తం పంచాయితీలు: 187 మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు పురుషులు: 102076; మహిళలు: 100326 ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు. పార్టీల్లో కుమ్ములాటలు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. మూడు ముక్కలాట కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది. మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రెరెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. అయోమయంలో కార్యకర్తలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్ గౌడ్ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్‌షాపులో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్‌మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవలేదు.. భవిష్యత్‌లో కలవబోదు.’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
సబితతో సవాలే.. ‘ఢీ’ కొట్టగలరా?
రంగారెడ్డి: మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి‘హస్త’వ్యస్తంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. ఇక్కడి నేతల ‘చేతులు’ మాత్రం కలవడం లేదు. ఎవరికి వారే ప్రత్యేక ఎ‘జెండా’తో ముందుకు సాగడంపై పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు కొత్తగా వలసలు.. ఏళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ము కుని పని చేస్తున్న లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. మరోవైపు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో గందరగోళం నెలకొంది. సంక్షోభ సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా.. కార్యకర్తలకు అండగా నిలబడి.. ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆర్థికంగా ఖర్చులు భరిస్తూ పార్టీని బలోపేతం చేస్తే.. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమను కాదని, కొత్త నేతలకు టికెట్ కట్టబెడితే తమ రాజకీయ భవితవ్యం ఏమిటనే భావన ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. తమదైన ముద్ర వేసేందుకు.. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి వచ్చే ఎన్ని కల్లో ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఆయన మీర్పేట్, జిల్లెలగూడ, చంపాపేట్‌లో తరచూ పర్యటిస్తున్నారు. ఆయా కేంద్రాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్కేపురం నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. పార్టీ నుంచి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే లభిస్తుందని చెబుతున్నారు. ఈయనకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లతో పాటు మహేశ్వరం మండలంపై కొంత పట్టుంది. రాజకీయంగా మంత్రి సబితతో విభేదించి ఏడాది క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. బడంగ్పేట్, బాలాపూర్, జల్పల్లి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన కొత్త మనోహర్‌రెడ్డి సైతం ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పదేళ్లుగా కేఎంఆర్ ట్రస్ట్ పేరుతో పుస్తెమెట్టెలు, నూతన వస్త్రాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన ఆయన కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎల్మటి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు. ఊగిసలాటలో తీగల గతంలో హైదరాబాద్ మేయర్‌గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అధికార బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేడర్‌కు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని ఇటు హస్తం పార్టీ స్థానిక నేతలే కాదు.. స్వయంగా కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కోడలు, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయనతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. సబితతో సవాలే.. నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పటోళ్ల సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాఽధించారు. 2009లో మొత్తం 2,86,974 ఓట్లు ఉండగా, 1,74,911 పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 57,244 పోలవగా, సబిత 65,077 ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 4,03,719 ఓట్లకు, 2,17, 299 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త మనోహర్‌రెడ్డికి 42,517 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి 62,521 పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 93,305 ఓట్లతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు 39,445 ఓట్లు (16.84 శాతం) సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 86,254 ఓట్లు (36.82 శాతం) సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితారెడ్డి 95,481 ఓట్లతో(40.76 శాతం) విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె కాంగ్రెస్‌ను వీడి.. అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర కేబినేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి భారీగా నిధులు తెప్పించి, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆమెను వచ్చే ఎన్నికల్లో ‘ఢీ’ కొట్టడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ఆదిలాబాద్ రాజకీయ చరిత్ర : గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న మరోసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. దీంతో ఆయన నాలుగుసార్లు గెలిచినట్లయింది. ఒకసారి టిడిపి తరపున, మూడుసార్లు టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో 2014లో తర్వాత మంత్రిగా ఉన్న జోగు రామన్నకు 2018లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు. జోగు రామన్న తన సమీప బిజెపి ప్రత్యర్ది పాయల్ శంకర్‌పై 26606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ ఐ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. రామన్నకు 74050 ఓట్లు రాగా, శంకర్‌కు 47444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ అభ్యర్ది గండ్ర సుజాతకు 32200 ఓట్లు వచ్చాయి. జోగు రామన్న బిసి వర్గానికి చెందినవారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గం వారు. 2009లో జోగు రామన్న టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న నేపధ్యంలో టిఆర్ఎస్లో చేరి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఘన విజయం సాదించారు. తదుపరి 2014, 2018లలో గెలిచారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లి సామాజికవర్గ నేతలు, ఐదుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ, ముగ్గురు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు. రామచంద్రారెడ్డి ఆదిలాబాదులో 1978, 85లలో ఇండిపెండెంటుగాను, 1989, 2004లలో కాంగ్రెస్ ఐ తరుఫున మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఈయన నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్లలో మంత్రిగా కూడా పనిచేసారు. ఇక్కడ 1999లో గెలిచిన పడాల భూమన్న చంద్రబాబు క్యాబినెట్లో స్థానం పొందారు. ఆదిలాబాదులో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు సిపిఐ ఒకసారి గెలవగా, నాలుగుసార్లు ఇండి పెండెంట్లు విజయం సాధించారు. మరో నేత సి.వామన్‌రెడ్డి ఒకసారి ఇండ పిెండెంటుగా, ఇంకోసారి టిడిపి పక్షాన గెలిచారు. ఆదిలాబాద్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఒక్కటవుతున్నారు!
నల్లగొండ: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ముఖ్య నాయకులు ఏకమవుతున్నారు. మొన్నటి వరకు అంటీముట్టనట్టుగా ఉన్న నేతలు ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకొని సోమవారం రాత్రి ఇచ్చిన విందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు అంతా హాజరయ్యారు. ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా.. తామంతా కలిసే ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనూ నేతలు అదే ఐక్యతా రాగాన్ని అందుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. బుధవారం కోమటిరెడ్డి ఇంట్లో రాష్ట్ర నేతలు లంచ్ మీటింగ్‌కు హాజరై ఐక్యతను చాటారు. ఇన్నాళ్లు ఎవరికి వారుగానే.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయన పెద్దగా కలిసి పాల్గొన్న సమావేశాలు లేవు. మంత్రి, గుత్తా మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా పెద్దగా కలిసేవారు కాదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం.. ఇదే సమయంలో మంత్రి తన పుట్టిన రోజు వేడుకలకు రావాలని ఆహ్వానించడంతో గుత్తా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో తామే గెలుస్తామని ఇప్పటికే చెబుతున్న నేతలు ఈ కలయిక ద్వారా తాము కలిసి పనిచేస్తామనే సంకేతాన్ని పార్టీ కేడర్‌కు పంపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒక్కటవుతున్న ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో నేతలు అంతా ఒక్కటవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలను తాము గెలిచి తీరుతామన్న సంకేతాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇదివరకే స్పష్టం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తామంతా కలిసే ఉన్నామనే విషయాన్ని రుజువు చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగ్‌కు రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ పర్యటించడం ద్వారా పార్టీని గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. నియోజకవర్గ స్థాయిలో చెక్ పెట్టేదెలా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కిందిస్థాయిలో మాత్రం లుకలుకలు అలాగే కొనసాగుతున్నాయి. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయి నాయకులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ టికెట్ ఇస్తే కోదాడలో కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో బుసిరెడ్డి పాండురంగారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మన్యం రంజిత్ యాదవ్, మునుగోడులో గుత్తా అమిత్, నల్లగొండలో పిల్లి రామరాజు యాదవ్, చాడా కిషన్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమై తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో కొందరు తమకు అవకాశం ఇస్తే పోటీ చేస్తామంటుండగా, మరికొందరు సిట్టింగ్‌లకు ఇవ్వకుండా, తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్న వారు ఉన్నారు. మరోవైపు వేముల వీరేశం, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటారనే ప్రచారంపైనా బుధవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరోక్షంగా వివరణ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులున్నారని, ఓవర్ లోడ్ అయిందని, ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయిలో నెలకొన్న అసమ్మతిని ఎలా చల్లార్చుతారు? టికెట్లు ఆశిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తారు? అన్నది ముఖ్య నేతలకు సవాల్ కానుంది. -
బీఆర్ఎస్లో గౌరవం దక్కడం లేదు
కామారెడ్డి: బీఆర్ఎస్లో సరైన గౌరవం దక్కడం లేదని, స్థానిక నాయకులు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని బీబీపేట బీఆర్ఎస్ ఎంపీటీసీ 2 కొరివి నీరజ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన కనీస గౌరవంగా పిలువడం లేదని, పార్టీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్ ప్రకారం కూడా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవ మాన పరుస్తున్నారన్నారు. బీ ఆర్ఎస్ మండల నేతల వల్లే ఇలాంటి అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమె భర్త నర్సింలు వీడియోలో మాట్లాడుతూ స్థానిక పార్టీ నేతలతోనే అవమానం ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించిన కవిత
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎంఎల్సీ కవిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. 29 రాష్ట్రాల NRIలు పాల్గొంటున్న టోర్నమెంట్.. టీఆర్ఎస్నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం , కేసిఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది , కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎన్నుకునామని , ఈ టోర్నమెంట్ లో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల కు చెందిన వారు పాల్గొంటారని, తద్వారా కేసిఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండాను NRI లందరికీ చేరుతుందని అందుకే బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం క్రికెట్ కప్ టోర్నమెంట్‌ను ఎంచుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులందరికీ తెలియచేసేలా , అలాగే ఉద్యమం నుండి పార్టీకి విశిష్ట కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని కవిత అభినందించారు . కేసిఆర్ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించబోతున్నారని, దీని స్ఫూర్తి తోనే మేము క్రికెట్‌ను పార్టీ భావజాల వ్యాప్తికై ఎంచుకున్నామని నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ హామీ.. ఆలేరు టికెట్‌పై సర్వత్రా ఆసక్తి
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా పైరవీలకు తావులేకుండా సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇవ్వనున్నట్లు పలు రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే ఇప్పటికే పలు దఫాలు సర్వేలు చేయించగా.. కాంగ్రెస్ సైతం సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇటీవల ప్రకటించడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో గుబులు నెలకొంది. పనితీరు మెరుగుపరుచుకునే యత్నం ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ పలుసార్లు నిర్వహించిన సర్వేల్లో ప్రజలు ఏం చెప్పారోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిఘా వర్గాలు, అధికార పార్టీ అనుబంధ పత్రిక, ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టాయి. సర్వే తమకు అనుకూలంగా ఉందా.. ప్రతికూలంగా ఉందా ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలు తమ తప్పులు దిద్దుకోవడం, పనితీరును మరింత మెరుగుపర్చుకునే యత్నంలో ఉన్నారు. సీఎంను కలిసిన గొంగిడి దంపతులు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దంపతులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడం చర్చనీయాంశమైంది. సర్వే నివేదిక ఆధారంగా ఈసారి సునీతకు బదులు ఆమె భర్త మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దించే అవకాశం ఉందన్న ప్రచారం పలు మీడియాల్లో జరుగుతోంది. సిట్టింగ్‌లకే సీట్లు అంటూనే కొందరికి మార్పు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఈ ప్రచారం మొదలైంది. కేడర్‌లోనూ వివిధ రకాలుగా చర్చ మొదలైంది. టికెట్ తమకే ఖాయమని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడానికే సీఎంను కలిసి హామీ తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గో హెడ్ అని మహేందర్‌రెడ్డి భుజంతట్టారని గొంగిడి సునీత ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోసారి ఆలేరు నుంచి పోటీచేయడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి. చిక్కిన పట్టు పోకుండా.. జిల్లాలో బీజేపీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జోష్ నింపింది. దాంతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. గతంలో కంటే తమ బలం పెరగడంతో చిక్కిన పట్టును వదులుకోవద్దన్న పట్టుదలతో నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికా రమే లక్ష్యంగా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌లోనూ సర్వే.. పైరవీకారులకు కాదు సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్య ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. -
దానం బదులు.. పీఏ చంద్రశేఖర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరు?
బంజారాహిల్స్: బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలను నివారించి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశలో అధిష్టానం ఓ బృహత్తర పథకాన్ని ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏ గ్రూపు తగాదాలను నివారించాలని ఈ కార్యక్రమం తలపెట్టారో ఆ గ్రూపు తగాదాలతోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులెత్తేశారు. ► కొన్ని డివిజన్లలో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు పొసగక, మరికొన్ని డివిజన్లలో నేతల మధ్య విభేదాలు, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సానుకూల వాతావరణం లేకపోవడంతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదు. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లలో ఇప్పటిదాకా వాటి ఊసే ఎత్తడం లేదు. ► ఇప్పటి వరకు కొన్ని డివిజన్లలో జరిగిన ఆత్మీ య సమ్మేళనాలు అంతగా విజయవంతమైనట్లుగా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఆత్మీయ సమ్మేళనాలపై నియోజకవర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుండగా ఖైరతాబాద్‌లో ఈ సమ్మేళనం అంత ఉత్సాహంగా, సానుకూల వాతావరణంలో జరగలేదని మంత్రి కేటీఆర్‌కు నివేదికలు వెళ్లాయి. ఇంకా రెండు డివిజన్లలో నిర్వహించాల్సిన సమ్మేళనాలు అటకెక్కాయి. ► బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదు. ► జూబ్లీహిల్స్ డివిజన్లో మూడు, నాలుగు గ్రూపులు బీఆర్ఎస్లో వేరు కుంపట్లు పెట్టాయి. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే అంత తేలిక కాదని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి డివిజిన్‌లోనూ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ► ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటుండటంతో కార్యకర్తలు ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది. ► పార్టీ శ్రేణులు అన్నింటినీ కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యే దానం ఆ దిశలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ► నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అధిషానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఈ వర్గ విభేదాలు ఎన్నికల నాటికి సమసిపోకపోతే ఈ అవకాశాన్ని కాంగ్రెస్, బీజేపీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ కార్యకర్తలే వాపోతున్నారు. ఎమ్మెల్యే సారు బిజీగా ఉన్నారు... హిమాయత్‌నగర్: ‘ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ చాలా బిజీగా ఉన్నారు. అందుకే డివిజన్ పర్యటనకు నేను హాజరయ్యాను’ అని ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ అన్నారు. పీఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్థానికులు అవాక్కయ్యారు. బుధవారం హిమాయత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి నేతృత్వంలో జీహెచ్ఎంసీ ఈఈ పేర్రాజుతో కలసి పీఏ చంద్రశేఖర్ పర్యటించారు. స్ట్రీట్ నెంబర్–2లో డ్రైనేజీ సమస్య ఉండటంతో ఇక్కడ పైప్‌లైన్ మంజూరైంది. ఈ పైప్‌లైన్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పీఏకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో కరెంట్ పోల్‌ను రీప్లేస్ చేయాలని కోరారు. భగ్గీఖానా, స్ట్రీట్ నెంబర్–4లోని పూర్తిగా ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఈఈ పేర్రాజును పీఏ చంద్రశేఖర్ కోరారు. స్థానికులు, నాయకులు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే దానంకు వివరించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానంటూ పీఏ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం రావాల్సిన పర్యటనలో ఆయన పీఏ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. -
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ వ్యూహంపై నల్లగొండ జిల్లాలో చర్చ జోరందుకుంది. బీజేపీలో చేరతారా.. కాంగ్రెస్‌లో చేరతారా అన్న చర్చతో పాటు ఆయన సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం ఇక్కడ జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన బీఆర్ఎస్, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు పొంగులేటి శిబిరం టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా సీనియర్ నేత చకిలం అనిల్‌కుమార్‌కు ఆహ్వానం అందడంతో ఆయన నేడు(ఈ నెల 6న) ఖమ్మంలో పొంగులేటితో భేటీ కానున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలతో నూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, పొంగులేటి బీజేపీలో చేరితే ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో ఆయన ప్రభావం చూపడం కష్టమేనని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరినా కష్టమేనన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్ఎస్)పేరుతో పార్టీ పెడతారన్న చర్చ సాగుతోంది. తద్వారా బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్యనేతలు, ఉద్యమంలో పనిచేసినా ప్రాధాన్యం దక్కని నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు ఇటీవల రాజీ నామా చేసిన చకిలంను పొంగులేటి బృందం చర్చలకు ఆహా్వనించిందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ఎంపీగా నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదు: బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ -
సిద్దిపేట: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ..
సాక్షి, సిద్దిపేట: టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమితి) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది. తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం చిరునామాగా ఓల్డ్ అల్వాల్‌లోని ఇంటి నంబర్. 1–4–177/148, 149/201ను దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన తుపాకుల మురళీకాంత్.. పార్టీ ఉపాధ్యక్షుడిగా, సదుపల్లి రాజు.. కోశాధికారిగా, వెల్కటూర్‌కు చెందిన నల్లా శ్రీకాంత్.. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మే 27లోపు తమ కు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 28న ఓ హిందీ పత్రిక, 29న ఇంగ్లిష్ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో అభ్యంతరాలొస్తే పరిశీలిస్తారు. అనంతరం నిబంధనల మేరకు రాజకీయ పార్టీగా రిజిస్ట్రర్ చేస్తారు. కాగా, బాలరంగం 1983 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్ఎస్ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019–2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్.. బయటకు వెళ్తే ఇంటికి వస్తారనే నమ్మకం లేదు’ -
సీబీఐ దర్యాప్తు జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని పాతబస్తీలో ఎలాంటి ఆధారాల్లేకుండా జారీచేసిన 27 వేల జనన, 4 వేల మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు రేషన్, ఓటర్ కార్డులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అవినీతికి ఈ ఉదంతం నిదర్శనమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్దలు, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత భారీగా సర్టిఫికెట్ల జారీకి అవకాశం లేదని.. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ జరిపి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వేలాదిగా సర్టిఫికెట్ల జారీ ఆందోళన కలిగించే అంశమన్నారు. దేశంలో అల్లర్లకు ఉగ్ర కుట్ర.. జీహెచ్ఎంసీ జారీచేసిన బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్‌పోర్టులు పొంది హైదరాబాద్ కేంద్రంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు కేసీఆర్ ధారాదత్తం చేశాడు. ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా అనుమతి లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని అనడంతోపాటు 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్’అని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీ మొత్తం జల్లెడపడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలసి వాస్తవాలు వెలుగులోకి వచ్చేదాకా ఉద్యమిస్తామన్నారు. -
బీజేపీ అధికారంలోకొస్తే పేదలకు భూములు, ఇళ్లు
నాగోలు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పేదలకు భూములు ఇచ్చుడేమోగానీ గడచిన నాలుగు దశాబ్దాలుగా పేదల ఆధీనంలో ఉన్న భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా, బీజేపీ కార్నర్ మీటింగ్‌లను నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నాగోలు చౌరస్తాలో, బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం హస్తినాపురం చౌరస్తాలో నిర్వహించారు. ఆయా సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ‘పల్లెల్లో ఉపాధి లేక వేల మంది పట్నానికి వలస వచ్చారు. వీరంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదు. ఒక్కరికి కూడా 50 గజాల భూమి ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన భూమిని గద్దల్లా గుంజుకుంటున్నారు’ అని ఆరోపించారు. హైదరాబాద్‌లో కిరాయిలు కట్టలేకపోతున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎల్బీనగర్ కాలనీ వారికి భూములు రెగ్యులరైజ్ చేస్తామని మునుగోడు ఎన్నికల సందర్భంగా కేటీఆర్ వచ్చి జీఓ 118 ఇచ్చారు. ఓట్లు వేయించుకున్నారు. తరువాత మర్చిపోయారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా 118 జీఓను అమలు చేయాలి’ అని ఈటల డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల భూములకు పట్టాలు ఇస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చశారు. పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని...ఉద్యోగావకాశాలను కల్పిస్తాం అని భరోసా ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్మే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ ఎల్బీనగర్ కన్వీనర్ రవీందర్‌గౌడ్, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రెడ్డి, నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, బద్దం బాలకృష్ణగౌడ్, శ్యామల, పద్మారెడ్డి, మైనం రాజేష్, రావుల శ్రీనివాస్, డప్పు రాజు, రాఘవాచారి, హస్తినాపు రం డివిజన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్, బీఆర్ఎస్ మారినంత మాత్రాన ఒరిగేదేమి లేదు: ఎంపీ లక్షణ్
-
ఎలక్షన్ టైమ్.. బడ్జెట్ లైన్, కేరాఫ్ ఊరు
సాక్షి, హైదరాబాద్: వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు ప్రాధాన్యం, పల్లె, పట్టణ ప్రగతుల నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే బదిలీ చేసేందుకు అవకాశం.. సంక్షేమ పథకాలు య«థాతథం.. విద్యుత్ సబ్సిడీలకు నిధుల పెంపు.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత.. మొత్తం మీద 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్లో ఈ రెండు శాఖలకు కలిపి ఏకంగా రూ.60 వేల కోట్ల వరకు కేటాయించింది. ఇక బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలకు నిధులను ఆశించిన మేరకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధితో పాటు సొంత పన్నుల ఆదాయాన్ని ఆసరాగా చేసుకుని, కేంద్రంపై ఆశలు వదులుకోకుండానే, రుణాలను పెద్దగా పెంచకుండానే, ఆర్థికాభివృద్ధికి సూచిక అయిన మూలధన వ్యయానికి 40 శాతం మేరకు నిధులు పెంచింది. ఈ మేరకు బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే, సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద చూపెట్టడం ఈ బడ్జెట్లోనే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. రహదారుల నిర్వహణ, మరమ్మతులకు నిధులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులకు అదనంగా మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.2,000 కోట్లను ప్రతిపాదించింది. వీటితో పాటు ఆర్అండ్బీ శాఖకు (బీటీ రెన్యువల్స్) అదనంగా మరో రూ.2,500 కోట్లను ప్రతిపాదించింది. పల్లె ప్రగతి కింద రూ.3,360 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.1,474 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకే ఇవ్వనుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ నిధులు వెచ్చించామని, అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే స్థానిక ప్రజాప్రతినిధుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను గ్రీన్‌చానల్ (ట్రెజరీ ఆంక్షలు లేకుండా) విధానంలో పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వెచి్చంచనున్నారు. గతంలో టీయూఎఫ్ఐడీసీ కింద మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.300 కోట్లను కూడా నేరుగా బడ్జెట్లోనే కేటాయించడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించడం విశేషం. వ్యవసాయానికి ఊతం బడ్జెట్లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చూపెట్టింది. వ్యవసాయ, సహకార రంగాలకు ఈసారి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబంధు కింద 2022–23లో రూ.14,800 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు ఎక్కువ చూపెట్టింది. తాజా బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.6,380 కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసేందుకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేసినప్పటికీ రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రైతు బీమా కోసం రూ.123 కోట్లు, మత్స్యశాఖకు రూ.100 కోట్లు చూపెట్టిన ప్రభుత్వం.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి, ఎన్సీడీసీ ఇచ్చే రూ.4,500 కోట్ల రుణం ద్వారానే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పకనే చెప్పింది. సంక్షేమం యధాతథం బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్లో కూడా తగిన ప్రాధాన్యత లభించింది. కల్యాణలక్షి్మ, షాదీముబాకర్లకు రూ.3,210 కోట్లు (గత ఏడాది కంటే రూ.460 కోట్లు ఎక్కువగా) చూపెట్టింది. విద్యుత్ సబ్సిడీల (వ్యవసాయం, హెయిర్ సెలూన్లు, ఇస్త్రీ షాపులకు ఇచ్చే సబ్సిడీలు) రూపంలో గత బడ్జెట్ కంటే అధికంగా రూ.12 వేల కోట్లు, ఉచిత బియ్యం పంపిణీకి రూ.213 కోట్లు అదనంగా రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.919 కోట్లు ఎక్కువగా రూ.5,609 కోట్లు కేటాయించింది. కొత్తగా న్యూట్రిషన్ కిట్ల కోసం 33 జిల్లాలకు గాను రూ.200 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్లో కేటాయించిన విధంగానే దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది లబి్ధదారులను ఎంపిక చేసి ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు గత బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు చూపెట్టింది. బడ్జెటేతర నిధుల నుంచి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు అదనంగా ‘సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు’ పథకానికి కూడా నిధులు కేటాయించింది. గృహా నిర్మాణ పథకానికి ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించగా, ఇందులో సొంత జాగాల ఇళ్లకు రూ.7,890 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల మంది లబి్ధదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సీఎం విచక్షణ మేరకు మరో 25 వేల మందిని ఎంపిక చేస్తారు. కొత్త తాయిలాలు పెద్దగా లేకపోగా.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016 ఇచ్చే పథకాన్ని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రతిపాదించకపోవడం గమనార్హం. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం బడ్జెట్లో నిధులు ఆశించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చూపెట్టారు. విద్యాశాఖకు రూ.19 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.12,161 కోట్లు ప్రతిపాదించారు. వీటితో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ.11,495 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.22,260 కోట్లు చూపెట్టారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.31 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1,000 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, ఐఅండ్పీఆర్కు రూ.1,000 కోట్లు, ఎయిర్పోర్ట్–మెట్రో అనుసంధానానికి రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు కేటాయించగా, అందులో కొత్త నియామకాలకు అవసరమయ్యే వేతనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణపై ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సెర్ప్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణను కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రూ. 2.37 లక్షల కోట్ల మేర అంచనా సవరణ 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఏడాది మార్చి 6వ తేదీన రూ.2.56 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి రూ.2,37,884.55 కోట్లుగా సవరించారు. అంటే ప్రతిపాదించిన మొత్తం కంటే రూ.19 కోట్ల వరకు లోటు తేలిందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో ఎఫ్ఆర్బీఎం పేరుతో కేంద్రం విధించిన నిబంధనల వల్లే రూ.13 వేల కోట్లు నష్టపోయామని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదిస్తే చాలా తక్కువగా కేంద్రం ఇస్తోందని, పన్నుల్లో వాటా తగ్గిస్తోందని చెప్పిన ప్రభుత్వం.. సవరించిన అంచనాల్లో మాత్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధులను భారీగానే చూపెట్టడం గమనార్హం. పంచ సూత్రతోనే ఖజానాకు కిక్కు – రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.2.90 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుగుణంగా ఖజానా నింపేందుకు ఐదు పద్దులు దోహద పడనున్నాయి. ఇందులో సొంత పన్ను ఆదాయ పద్దు కింద రూ.1.31 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపి దాదాపు రూ.62,500 కోట్లు, రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు, పన్నేతర ఆదాయం కింద (భూముల అమ్మకాలతో కలిపి) రూ.22,808 కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.20 వేల కోట్లు సమకూర్చుకునేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. అన్నింటికీ నిధులు పెంచాం: ఆర్థికమంత్రి ఈసారి బడ్జెట్లో ఉన్న పథకాలకు నిధులు పెంచుతూనే కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఆర్థిక, ప్రణాళిక, గణాంక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. పలు పథకాలకు నిధుల కేటాయింపు క్రమాన్ని వివరించారు. 2023 సంవత్సరానికి గాను ఆర్థిక, సామాజిక సర్వేను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరిందని, 2022–23లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15.6 శాతంగా నమోదయిందని వెల్లడించారు. కాగా ఉదయం 10:30 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలను చదవడం ప్రారంభించిన హరీశ్‌రావు 12:15 గంటలకు అంటే సుమారు 105 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
దమ్ములేనిది కేసీఆర్ బానిసలకే: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సీఎం కేసీఆర్ బానిసలు, ఆయన సంధించిన సైకో శాడిస్టులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో బలుపెక్కి దమ్ముందా అని మాకు చాలెంజ్ చేస్తున్నారు ... దమ్ములేనందునే వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, తుర్క నరసింహులుతో కలిసి శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన తమ ధైర్యం ఏమాత్రం దెబ్బతినదని.. వారి మాటలను మరింత స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఇంకా దూకుడుగా కొట్లాడ తామన్నారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు ఒక ప్రత్యేక దేశం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్న తీరు ఏమాత్రం మంచిది కాదన్నారు. గవర్నర్‌తో వ్యవహరించిన తీరు జుగుప్సాకరం ‘ఈ జనవరి 26న కేసీఆర్ రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని మహిళలను అవమానపరచడమే’ అని ఈటల అన్నారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ -
హుజుర్నగర్లో పొలిటికల్ హీట్.. బీజేపీకి బలమైన నేత దొరికాడా?
తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకు పెరిగిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాషాయ పార్టీకి అనేక చోట్ల కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షతో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే అనేక మందికి కాషాయ తీర్థం ఇచ్చింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీనీ వేధిస్తోంది. అయితే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో కూడా అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సరితూగే అభ్యర్థిని రెడీ చేసుకుంటోంది. క్రమంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంతమేర పట్టు బిగించింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కీలకంగా ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. గత ఉప ఎన్నికల్లో పోయిన పరువును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. కమలం ఎందుకు తలకిందులయింది? హుజూర్ నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైదిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే వారికి పోటీనిచ్చే స్థాయి నేత లేక ఇన్నాళ్లు బీజేపీ తల పట్టుకుంది. గత ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్లో పట్టు సాధించేందుకు శ్రీకాంత్ రెడ్డి రూపంలో కాషాయ పార్టీకి బలమైన నేత దొరికినట్లు అయింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరవర్గం ఉండటంతో పాటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం కూడా శ్రీకాంత్‌రెడ్డికి ఉంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజవర్గంలో పట్టు సాధించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ.. అక్కడ కార్యక్రమాలు సాగిస్తూ వస్తోంది. మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన తండా భూముల విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చను తీసుకురావడంతో పాటు... దాని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఉద్యమించింది. ఇది గిరిజన రైతుల్లో ఆ పార్టీ పట్ల సానుభూతిని పొందేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు. బండి సంజయ్ ధాన్యపు రాశుల పరిశీలన పేరుతో చేసిన హంగామా కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఎటొచ్చి దీన్ని కొనసాగించేందుకు ఇన్నాళ్లు ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. సవాల్ ప్రతి సవాల్ ఇన్నాళ్లు అక్కడ ద్విముఖ పోరు మాత్రమే సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా ముక్కోణపు పోరుగా మారింది. ఇప్పటికే మరోసారి గెలవాలని సైదిరెడ్డి, ఎలా అయినా గెలవాలని ఉత్తమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 30 వేల ఓట్లలో 55 నుంచి 60 వేలు ఓట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలనే ప్లాన్‌లో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారట. అయితే శ్రీకాంత్ రెడ్డికి బొబ్బా భాగ్యారెడ్డి అనే నేత రూపంలో తలనొప్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తుండటంతో తనకు సహకరిస్తారో లేదో అని శ్రీకాంత్ రెడ్డి అనుమానపడుతున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్, కారు పార్టీలకు గట్టి పట్టున్న హుజూర్ నగర్లో ఎలక్షన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఆ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఏ రేంజ్లో ఉంటుంది? ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కేసీఆర్ పాలన అరిష్టం
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలన రాష్ట్రానికే అరిష్టమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తోందని, రేపటి తెలంగాణకు తొలికేక అని, బీజేపీ గెలుపులో ఇక్కడి నాయకులే పునాదిగా నిలిచారని తెలి పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో శనివారం పార్టీ బూత్ సభ్యుల సమ్మేళనంలో మాట్లాడారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించారన్న అక్కసుతో సీఎం కేసీఆర్ మానేరు నదిని చెరపట్టి ఇసుక తవ్వి...ఎడారి చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా టెంటు వేసి కొట్లాడుదామన్నారు. ధరణితో నష్టపోయిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, వారి తరఫున పోరాడుదామని తెలిపారు. -
Telangana: ఆ ‘ఎర’లపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: గత (2018) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, దాన్ని ఆసరాగా చేసుకుని తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కార్యాచరణను ఉధృతం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్లో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, మల్లురవి, చల్లా నర్సింహారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, టి.రామ్మోహన్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. ఇందులో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు పదవులు ఇవ్వడం ద్వారా తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకున్నారని, అవినీతి నిరోధక చట్టం–1988లోని 7, 8, 13, 14 సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్లు 120–బీ, 171–బీ రెడ్‌విత్ 171ఏ, 34 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు (ఎఫ్ఐఆర్ నం.455/2022)తో తమ ఫిర్యాదును కూడా కలిపి విచారించాలని కోరారు. ఫిర్యాదులో ఏముందంటే.. ‘2014 నుంచి 2018 మధ్య కాలంలో నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు వివిధ రాజకీయ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లారు. 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే టీఆర్ఎస్తో పెద్దలతో టచ్‌లో ఉన్న మా పార్టీకి చెందిన 12 మంది, తమకు వివిధ రూపాల్లో లబ్ధి చేకూరగానే టీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ 12 మందిలో ముగ్గురిని చేర్చుకునేందుకు బీజేపీ ఎర వేసిందనే ఆరోపణలపై రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. రోహిత్‌రెడ్డి కేసులో విచారణ పక్షపాత ధోరణిలో జరుగుతున్నందున ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ నం: 455కు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించే సమయంలో మా ఫిర్యాదును కూడా సదరు దర్యాప్తు సంస్థకు బదిలీ చేయండి..’ అని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో రేవంత్, భట్టి మీడియాతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ డైరెక్టర్‌కూ ఫిర్యాదు చేస్తాం: రేవంత్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అనంతరం భట్టితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని, అందుకే వివిధ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారని మండిపడ్డారు. సీఎల్పీ నేతగా దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేర్చుకుని ఆర్థిక, అధికార ప్రయోజనాలను కల్పించారని, కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులోని ఆధారాలను కూడా పరిశీలించాలన్నారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా అవసరమైతే రాజకీయ పోరాటం చేయడానికీ వెనకాడబోమన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం: భట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఒకేసారి చేరలేదని.. విడతల వారీగా చేరిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. ఫిరాయింపులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు స్వీకరించి పరిశీలించామని, కోర్టు అనుమతి, న్యాయసలహా తీసుకుని కేసు నమోదుపై ముందుకెళ్తామని ఎస్సై లింగ్యానాయక్ తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు వీరే.. హరిప్రియ బానోతు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాంతారావు రేగ, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, వనమా వెంకటేశ్వరరావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌రెడ్డి. 12 మంది ఎమ్మెల్యేలకు జరిగిన లబ్ధి గురించి కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలివే: ఎమ్మెల్యే పేరు లబ్ధి హరిప్రియ బానోతు నగదు లబ్ధి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి 08–09–2019 నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కందాల ఉపేందర్‌రెడ్డి నగదు లబ్ధితో పాటు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు బిల్లుల మంజూరు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 08–02–2020 నుంచి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేగ కాంతారావు అసెంబ్లీ విప్ హోదా ఆత్రం సక్కు నగదు లబ్ధి చిరుమర్తి లింగయ్య నగదు లబ్ధి వనమా వెంకటేశ్వరరావు నగదు లబ్ధి, భూఅంశాల సెటిల్మెంట్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి నగదు లబ్ధి (భూసేకరణ మొత్తం) జాజుల సురేందర్ నగదు లబ్ధి గండ్ర వెంకటరమణారెడ్డి నగదు లబ్ధి, భార్య జ్యోతికి భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ పదవి రోహిత్ రెడ్డి నగదు లబ్ధి -
కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు
కర్నూలు కల్చరల్: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అంటూ పగటి కలలు కంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములవారిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పి అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మాట్లాడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డుపడిన కేసీఆర్... ఇప్పుడు ఆంధ్రా అంటూ కూని రాగాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నియంత్రణ చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. -
కేసీఆర్ బిహార్‌కు పారిపోవడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణకు పరాయివా డు, కిరాయివాడు అయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. బిహార్‌తో కేసీఆర్‌కు రక్తసంబంధం ఉందని, అందుకే తెలంగాణలో బిహార్ అధికారుల రాజ్యం నడుస్తోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాలం చెల్లిపోయిందని, బిహార్‌కు పారిపోవడం ఖాయమన్నారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని, దీని వెనుక టీఆర్ఎస్, బీజేపీలు న్నాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలను కలవని కేసీఆర్ పక్క రాష్ట్రం వారిని కలు స్తున్నారని, వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. -
తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబ పాలన, అహంకారం, అవినీతి, దోపిడీతో తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని, కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ పోరాడుతోందని, చాలావేగంగా దూసుకుపోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబపాలనతో ప్రజలు కేవలం బాధపడటమే కాకుండా తీవ్రంగా ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ మారినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల్లో బీజేపీ టాప్.. రెండోస్థానంలో టీఆర్ఎస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ద ఫ్రుడెండ్ ఎలక్టరోల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్ ఈటీ, సమాజ్ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి. రెండోస్థానంలో టీఆర్ఎస్.. బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్ ఈటీ నుంచి ఆప్ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్ డొనేషన్స్ ఈటీ నుంచి కాంగ్రెస్‌కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఉన్నాయి. మరో ఆరు ఎలక్టరోల్ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు?: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు?. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం! -
అటు ఈడీ ఇటు సీబీఐ.. జంక్షన్ లో బీఆర్ఎస్
-
కేంద్ర పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా తెలంగాణ సర్కారు తీరుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు మోదీ ప్రభుత్వం ద్వారా మేలు జరిగితే ఎక్కడ కేసీఆర్‌ని మరిచిపోతారోనని భయపడి అనేక పథకాలు అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా ఇచ్చినా టీఆర్ఎస్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో వాటి పనులు జరగడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, దీంతో ఎఫ్ఆర్బీఎం కింద తెస్తున్న అప్పులు కూడా వడ్డీలు కట్టేందుకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు, విద్యుత్ డిస్కం సమస్యలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి అంశాలను తాను ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను గురుకులాల పేరుతో కేసీఆర్ భ్రష్టు పట్టించడం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు మళ్లించడం, కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగంపై కూడా రాజ్యసభలో మాట్లాడానని లక్ష్మణ్ చెప్పారు. -
Telangana: వార్ రూం ఇష్యూ.. కాంగ్రెస్‌కు మేలా? కీడా?
వార్ రూమ్ ఇష్యూ టీ.కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వార్ రూమ్‌లో సోదాలు చేసి తెలంగాణ సర్కార్... కాంగ్రెస్‌కు ఆయుధం తానే ఇచ్చిందా? వచ్చిన ఆయుధాన్ని హస్తం పార్టీ నేతలు వాడుకుంటారా? తమ ఆధిపత్య పోరాటాలతో జార విడుచుకుంటారా? వార్ రూమ్ ఆందోళనలో టీ.కాంగ్రెస్ నేతలంతా ఎందుకు పాల్గొనలేదు? చేయి కాలుతూనే ఉంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ తెలంగాణ కాంగ్రెస్‌కు సానుకూలంగా వార్తలు రావడం అరుదైన అంశంగా మారిపోయింది. పార్టీ బాగు మరచి కొట్టుకుంటున్న నాయకులు..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..మీడియాలో ఒకరి మీద ఒకరి విమర్శలతో గాంధీభవన్ హోరెత్తిపోయేది. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వంటి ఎన్నో అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌కు నెగిటివ్‌గా మారాయి. కొంతకాలం నుంచి కారు, కమలం పార్టీల మధ్య నడుస్తున్న వార్..రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న సందేహాన్ని కూడా ప్రజల్లో కలిగిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక పార్టీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకున్నారు. సునీల్ టీమ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సైబరాబాద్ పోలీసులు ఆయన కార్యాలయం అయిన కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని అక్కడి సిబ్బందిని అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ భగ్గుమంది. రాష్ట్ర మంతా కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఒక్క రోజే హడావిడా? పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిని టీ.కాంగ్రెస్ సకాలంలో సక్రమంగానే ఉపయోగించుకోగలిగింది. అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదనే యాంగిల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు నాయకులు. దాడి జరిగిన రోజు రాత్రంతా సునీల్ ఆఫీస్ లో షబ్బీర్ అలీ, మల్లురవి, హైదరాబాద్ నగర నాయకులు పోలీసుల తీరుపై ఆందోళన చేసారు. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. చాలా కాలంగా మీడియాలో పాజిటివ్ వార్తలే లేని కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం బాగా ఉపయోగపడింది. ఆ రోజంతా మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన వార్తలు కనిపించాయి. ఇంట్లోనే పెద్ద వార్ ఇక కొందరు నేతలు మినహా మిగతా వారంతా కాంగ్రెస్ వార్ రూమ్‌లో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వరకు కమిటీల ఏర్పాటు గురించి పార్టీలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సునీల్ అంశం తెరపైకి వచ్చి కాంగ్రెస్‌కు మేలు చేసింది. అయితే కొందరు నేతలు అసలు విషయాన్ని పక్కన పెట్టి సునీల్ అంశాన్ని ఎత్తుకున్నారంటూ కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు సునీల్ ఎవరు అంటూ కొందరు.. వార్ రూమ్ అయితే గాంధీ భవన్ లో ఉండాలి కానీ బయట ఎందుకు ఉందని ఇంకొందరు.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులు చర్చకు రాకుండా చేయడానికే అని మరికొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. వార్ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడిని ఒక అంశంగానే కొందరు నేతలు పరిగణించకపోవడం విశేషం. అర చేతికి అయిదు వేళ్లు, ఏ ఒక్కరికి కలవని దారులు ఒక సీరియస్ విషయంలోనే విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక ముందైనా కలిసి పనిచేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఇలాగే పలు అంశాలపై నాయకులంతా ఏకమైనా...అది తాత్కాలికమే అని నిరూపించారు. పార్టీ ఒకటైనా ఎవరి వ్యవహారం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వార్ రూమ్ ఇష్యూని కాంగ్రెస్ నేతలు ఏమేరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
హామీలు అమలు చేస్తే చెప్పు దెబ్బకు సిద్ధం: బండి సంజయ్
సిరిసిల్ల: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ దివాలా కంపెనీ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేస్తే ప్రజల కోసం చెప్పుతో కొట్టించుకోవడానికి, తల నరుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను డ్రగ్స్ వాడలేదని పరీక్షల్లో తేలితే చెప్పు దెబ్బలకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై బండి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడల్లో గురువారం బీజేపీ శ్రేణులతో సమావేశమై ‘సెస్’ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తానన్నడు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తుంటే ట్విట్టర్ టిల్లు (మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి) చెప్పుతో కొడతానంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నడు. డ్రగ్స్ వాడి మానేసిండు కదా..‘‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’’తో బాధపడుతున్నాడు. కేసీఆర్ బిడ్డనేమో మా ఎంపీ అర్వింద్‌ను చెప్పుతో కొడతానంటోంది. కానీ మీలాగా సంస్కారహీనంగా మేం మాట్లాడలేం’అని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. \ కేంద్రాన్ని బద్నామ్ చేస్తున్నారు... తెలంగాణ లాగా దేశమంతటా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అంటున్నారని, తెలంగాణ ఏ విషయంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. ‘రైతు రుణాలు మాఫీ చేయలే. ఉద్యోగాలు భర్తీ చేయలే. నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, రైతులకు ఉచిత యూరియా, దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే. వడ్లు సరిగ్గా కొనుగోలు చేయట్లే. కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఆగలే’అని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్... 15 గంటలే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారని దుయ్యబట్టారు. రైతులకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ బద్నామ్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఎంత భారమైనా రైతులకు సబ్సిడీపై ఎరువులను సరఫరా చేస్తోందని చెప్పారు. రైతులకు ఫసల్‌బీమా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే కలిసే ముఖం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రానికి సహకరించకుండా రోడ్లు, రైల్వేలేన్లు సహా అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు, నియంత, రాక్షస పాలన అంతం కోసం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నానని బండి సంజయ్ వివరించారు. రోడ్డుపై ఉరికించి కొట్టాలే.. రాష్ట్రంలో ఓ అధికారి (హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఉద్దేశించి) క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్ అభివృద్ధి చెందిందంటడు. ఆయనకు సిగ్గుండాలె. మరి ఈ దేశంలో ఎందుకున్నవ్? దేశం విడిచి పో. ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మతప్రచారం చేస్తవా?’అని బండి ప్రశ్నించారు. బరితెగించిన ఇలాంటి అధికారులను రోడ్లపై ఉరికించి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కాళ్లు మొక్కే అధికారుల సంగతి చూస్తామని సంజయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణిరుద్రమదేవి, టి.వీరేందర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, ఆవునూరి రామాకాంత్‌రావు, రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్‌లు పాల్గొన్నారు. -
అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి
కంటోన్మెంట్ (హైదరాబాద్): తనపై ఐదుగురు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల పట్ల మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ అదో చిన్న సమస్యని..దయచేసి పెద్దది చేయవద్దని కోరారు. మంగళవారం ఉదయం బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తామంతా ఒకటే కుటుంబమని, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలుంటాయని, మీడియా కూడా దీన్ని పెద్దగా చిత్రీకరించవద్దని వేడుకున్నారు. ఈ సమస్యను మా ఫ్యామిలీ (పార్టీ) పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామన్నారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. చదవండి: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో.. -
బంగారు తెలంగాణ దొరలకే పరిమితమైంది
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
ఆయా శాఖల్ని ప్రతివాదులుగా పిటిషన్ దాఖలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన అంశంలో సంబంధిత శాఖలు, సంస్థల్ని ప్రతివాదు లుగా చేర్చి మరో పిటిషన్ దాఖలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. రేవంత్ దాఖలు చేసిన ఓ అప్లికేషన్ సోమవారం సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్‌ప్రసాద్ ధర్మాసనం ముందుకొచ్చింది. 2018 లో బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ నిధులు సమీకరించిందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతివాదిగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. ఆయన లేవనెత్తిన అంశాలపై ఐటీ శాఖ అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ విచారణ ముగించింది. తాజాగా ఇదే కేసులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని, ఐటీశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ రేవంత్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం సంబంధిత శాఖల్ని ప్రతివాదులుగా చేర్చుతూ మరో పిటిషన్ దాఖలు చేయడానికి స్వేచ్ఛనిస్తూ ఈ అప్లికేషన్‌పై విచారణ ముగించింది. -
ఢిల్లీ హైకోర్టుకు చేరిన TRS పేరు మార్పు వ్యవహారం
-
డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్..
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈమేరకు మాట్లాడారు. రోహిత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా.. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్‌చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
ఇప్పుడు రాలేను.. ఈడీకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లేఖ.. విచారణపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు గడువు కావాలని ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ రాశారు. విచారణ షెడ్యూల్ మార్చాలని కోరారు. ఈడీ ఎంత సమయం ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని రోహిత్ రెడ్డి అంటున్నారు. వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ.. దాని నమూనాను నోటీసులతో జత చేసింది. చదవండి: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఫోకస్ -
TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బంగారు కూలి పేరుతో టీఆర్ఎస్ నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీకి గతంలోనే ఫిర్యాదు చేశారు రేవంత్. దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు అప్పుడే లేఖ పంపింది ఈసీ. అయితే ఈ విచారణ పూర్తి కాకుండానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళే(సోమవారం) విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. చదవండి: సీవీ ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరా?.. ఓ పార్టీ కార్యకర్తా?: రేవంత్ -
‘నా సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదు’
హైదరాబాద్: తన సవాల్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వీకరించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. డ్రగ్స్ కేసులో తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని శనివారం సవాల్ చేశారు రోహిత్‌రెడ్డి. ఈ రోజు(ఆదివారం) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన రోహిత్ రెడ్డి.. తన సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదంటూ ఎద్దేవా చేశారు. దాంతో సంజయ్ చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తాను తప్పుడు పత్రాలు సమర్పించినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన ఆరోపణులు నిరూపించాలని సవాల్ విసిరారు రోహిత్‌రెడ్డి. రఘునందన్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే రఘునందన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లించి పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులును పక్కదారి పట్టించారని ఆరోపించారు లక్ష్మణ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం లేదన్నారు. -
కాంగ్రెస్‌లో ‘కోవర్టుల’ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోవర్టుల అంశం కుదిపేస్తోంది. ఇది సీనియర్లను కలవరపరుస్తుండగా, పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే టీఆర్ఎస్, బీజేపీలకు కోవర్టులుగా కొందరు నేతలు పనిచేస్తున్నారని, అందుకే పనిగట్టుకుని అసమ్మతివాదం వినిపిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. సీనియర్ నాయకుల పేర్లు పెట్టి మరీ కోవర్టుల ముద్ర వేసే ప్రయత్నాలు గతంలో జరిగినా ఏఐసీసీ కానీ, పీసీసీ కానీ ఖండించకపోవడం గమనార్హం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయనతో కూడా కోవర్టులకు వార్నింగ్‌లు ఇప్పించడం, ఆ తర్వాత అదే ప్రచారం పదేపదే జరుగుతుండటం, తాజాగా దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో కోవర్టుల అంశం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నిసార్లు అడిగినా...! టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టులనే పదం తరచుగా వినిపిస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై ఎవరు నోరువిప్పినా వారు కోవర్టులని సోషల్ మీడియాలో ప్రచారం జరిగేది. కొన్ని సందర్భాల్లో టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ... ఇలా చాలామంది నేతలు ఇతర పార్టీలకు కోవర్టులుగా మారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారం జరిగినప్పుడల్లా పార్టీ పక్షాన ఖండించాలని సదరు నేతలు కోరినా అటు ఏఐసీసీగానీ, ఇటు టీపీసీసీగానీ పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో, వేదికల్లో ఇలా ప్రచారం చేస్తోంది రేవంత్రెడ్డేననే చర్చ కూడా జరిగింది. అయితే, రేవంత్‌రెడ్డి మాత్రం ఈ ప్రచారంతో తనకు సంబంధం లేదని కొట్టిపారేశారే తప్ప పార్టీలో కోవర్టులులేరని ఖండించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కనుగోలు కార్యాలయంలో కుట్ర జరిగిందా? తాజాగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి సందర్భంగా కోవర్టుల వ్యవహారానికి సంబంధించిన పలు విషయాలు, విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు కూడా వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టేలా ఈ కార్యాలయం పనిచేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం బహిరంగంగానే వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేసే విధంగా తలలు మార్చి మార్ఫింగ్ చేసిన ఫొటోలు సునీల్ కనుగోలు కార్యాలయంలో దొరికాయని తనకు పోలీస్ కమిషనరే చెప్పినట్టు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించడం తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం కలిగిస్తోంది. అయితే సొంత పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం సునీల్ కనుగోలుకు ఏముందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కార్యాలయంపై దాడి అనగానే రేవంత్ రెడ్డి వర్గ నేతలు హడావుడి చేశారని, ఈ నిజాలు బయటకు వస్తాయనే నానా హంగామా చేసి ఏ అంశంపై స్పందించని విధంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు ఇదే కారణమనే చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి కాంగ్రెస్ వాదులను వెళ్లగొట్టే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే మీడియా ముందుకు రావాలని సీనియర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికితోడు కీలక నాయకులు సిఫారసు చేసిన జిల్లా అధ్యక్షులను ప్రకటించకుండా నిలిపివేయడం, పీసీసీ డెలిగేట్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకంలో పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారికే పదవులు ఇప్పించడంతో ఈ నేతల్లో అసమ్మతి పెల్లుబికింది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ కాంగ్రెస్ తమ చేతి నుంచి వెళ్లిపోతుందనే ఆందోళనతోనే తాజా కార్యాచరణకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పూనుకున్నారని తెలుస్తోంది. -
‘నేను ప్రమాణం చేసి చెబుతున్నా..నాకు సంబంధం లేదు’
హైదరాబాద్: తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కావాలనే ఇందులో ఇరికించాలని చూస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు రోహిత్‌రెడ్డి. డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధ లేదని తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి చెబుతున్నానని, మరి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధారాలతో నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని చాలెంజ్ చస్త్రశారు. తాను ఆదివారం ఇదే టైమ్‌కి ఇక్కడకి వస్తానని, బండి సంజయ్ ఆధారాలతో రావాలన్నారు. తమకు నోటీసులు వస్తాయిన బీజేపీకి ముందే ఎలా తెలుసని రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, కర్ణాటక పోలీసులు నుంచి కూడా తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..
మేడ్చల్ రూరల్: దేశంలో అతిపెద్ద ఐటీ దాడి తనపైనే జరిగిందని, అది కూడా రికార్డేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్స్ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో.. హ్యాట్రిక్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగానని.. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి ఉద్బోధించారు. -
కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది: జేపీ నడ్డా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగియలేదని, అసలు యాత్ర ఇప్పుడే మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్నలకు నమస్కరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. వివరాలు జేపీ నడ్డా మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా విఫలమయ్యారు. బండి సంజయ్ రూపంలో కరీంనగర్ నియోజకవర్గం ప్రజ లకు సమర్థుడైన నాయకుడు దొరికాడు. సంజయ్ నేతృత్వంలో ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్ర 56 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,403 కిలోమీటర్ల పాటు సాగింది. వాస్తవానికి ఇది ముగింపు కాదు. ఇదే ఉత్సాహంతో కేసీఆర్ పాలనా వైఫల్యాలను ‘సాలు దొర.. సెలవు దొర’ అన్న నినాదంతో ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రజల్లో భరోసా కలి్పంచే బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలదే. కేసీఆర్ సర్కారుది దమననీతి రెండు, మూడో విడతల యాత్ర సమయంలోను, ఇప్పుడు కూడా నా పర్యటనను సైతం కేసీఆర్ సర్కారు ఆపే ప్రయత్నం చేసింది. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో అని కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలాంటి దమననీతిని ప్రజలు చెత్తకుప్పలో వేస్తారని గుర్తించాలి. దేశంలో మోదీ నేతృత్వంలోని సర్కారు బీసీలు, దళితులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల వారికి అండగా నిలుస్తోంది. కానీ కేసీఆర్ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్నారు. ఇలాంటి సర్కారుకు కొనసాగే హక్కు లేదు. వారికి విశ్రాంతి ఇచ్చి.. మాకు అధికారం ఇవ్వాల్సిన సమయం వచి్చంది. మేం సబ్కా సాత్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్ అన్న నినాదంతో సాగుతున్నాం. ఏ రోజైనా ఆదివాసీ మహిళ, దళితుడు రాష్ట్రపతి అవుతారని అనుకున్నారా? ఎప్పుడైనా 8 మంది ఆదివాసీలు, 30 మంది బలహీనవర్గాలవారు కేబినెట్ మంత్రులు అవుతారని ఊహించారా? వీటన్నింటినీ నరేంద్ర మోదీ సుసాధ్యం చేశారు. సెపె్టంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని నిర్వహించారు. మేం అధికారంలోకి వస్తే మరింత గొప్పగా వేడుకలు చేస్తాం. తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం రూ.1.04 లక్షల కోట్ల వ్యయంతో 4,996 కిలోమీటర్ల పొడవైన హైవేలు నిర్మించింది. అంతేకాకుండా నాలుగు వరుసల ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లకు సహకరించాం. జల్ జీవన్ మిషన్‌కు భారీగా నిధులిచ్చాం. కేసీఆర్ చెప్పినట్టుగా 8 ఏళ్ల కింద తెలంగాణ ధనిక రాష్ట్రమే.. కానీ దాన్ని రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను నడిపిస్తానన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్నారు. కానీ కుటుంబ, రాచరిక పాలన చేస్తున్నారు. పెద్ద స్థాయిలో సీఎం, కిందిస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు ద్రోహం చేశారు. భూములను లూటీ చేసేందుకు ధరణి పోర్టల్‌ను ఆయుధంగా మలుచుకున్నారు. ఇలాంటి నాయకులను కొనసాగనీయాలా? బీజేపీతో చేతులు కలపండి.. సీఎం కేసీఆర్‌కు ఫాంహౌస్ కట్టుకునే సమయం ఉంది. కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చే తీరిక లేదా? రైతుల రుణమాఫీ ఏమైంది? దళితులకు మూడెకరాలు, యువతకు నిరుద్యోగ భృతి ఇప్పటికీ అమలు కాలేదు. కేజీ టు పీజీ పథకం ఏమైందో అందరికీ తెలుసు. కేంద్రం ప్రవేశపెట్టిన వెల్నెస్ సెంటర్ల పేర్లు మార్చి బస్తీ దవాఖానాలుగా ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ అవినీతి పాలన, దమనకాండ దూరం కావాలనుకునే వారంతా బీజేపీతో చేతులు కలపండి. తెలంగాణలో అవినీతి వ్యతిరేక ప్రభుత్వంపై పోరాడండి’’ అని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఫుల్ జోష్ ఉంది.. కీపిటప్ బండి సంజయ్‌ను అభినందించిన జేపీ నడ్డా సాక్షి, హైదరాబాద్: ‘‘ఇక్కడి ప్రజల్లో ఫుల్ జోష్ ఉంది. బండి సంజయ్ కీపిటప్. పాదయాత్ర కంటిన్యూ చెయ్యండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. గురువారం కరీంనగర్ సభలో ప్రసంగించిన నడ్డా అనంతరం స్టేజ్ దిగుతూ సంజయ్ భుజం తట్టి ప్రశంసించారు. సభ ఆలస్యంగా జరిగి చీకటిపడటంతో జేపీ నడ్డా హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. చదవండి: కరీంనగర్లో సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్ -
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఢిల్లీ: ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ ఆఫీస్ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జెండా ఆవిష్కరించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ వెంట కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి. జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను పార్టీ ఆహ్వానించారు. కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు మరికొందరు నేతలను ఆహ్వానించారు. వీరితో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. -
గిరిజనులను మోసగిస్తున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేమంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా పార్లమెంటు వేది కగా ప్రకటించడం దుర్మార్గమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇవ్వగా, 2016లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం సత్యవతి మీడియాతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉండాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానం అందలేదని చెప్పిన కేంద్రమంత్రులు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారన్నారు. గిరిజనులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు దీక్షలకు పురిగొల్పుతున్నారని, దీనిపై బీజేపీ స్పష్టతనివ్వాలన్నారు. గిరిజనుల పట్ల బీజేపీ ధోరణి మారకుంటే ఆ పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు మారాలంటే బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరముందని సత్యవతి పేర్కొన్నారు. -
KCR BRS: మరో ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం పుట్టి, రాష్ట్రంలో అధికారం చేపట్టి తన ప్రస్థానాన్ని ఘనంగా చాటుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తన మరో ప్రస్థానాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యింది. జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు, సత్తాను చాటేందుకు, గళం వినిపించేందుకు వీలుగా బుధవారం హస్తినలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆరంభించనుంది. సర్దార్ పటేల్ మార్గ్‌లోని ఈ తాత్కాలిక కార్యాలయాన్ని మధ్యాహ్నం 12.37 గంటల నుంచి 12.47 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. పూజా కార్యక్రమాలు మొదలు బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 9.15 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజలతో ఇవి మొదలవ్వగా పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. శృంగేరీ నుంచి వచ్చిన రుత్వికుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగగా, బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాజశ్యామల యాగం, నవ చండీయాగం ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ యాగ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. యాగం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించిన తర్వాత కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత 12:37–12:47 గంటల మధ్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. హాజరు కానున్న జాతీయ నేతలు.. బీఆర్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను పార్టీ ఆహ్వానించింది. జేడీయూ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలను ఆహ్వానించినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలను ఆహ్వానించామని చెప్పారు. మరోవైపు రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు నేతలు బుధవారం ఉదయానికి ఢిల్లీ చేరుకుంటారని, మొత్తంగా 400 నుంచి 500 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ విధానం వెల్లడి! కార్యాలయం ప్రారంభించిన తర్వాత.. పార్టీ జాతీయ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. నదీ జలాలు, సరిహద్దు వివాదాలు, ఆర్ధిక రంగ పురోభివృధ్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, విద్యుత్ సంస్కరణలు, విదేశాంగ విధానం, జాతీయ సంస్థల తీరు, సమాఖ్య స్ఫూర్తి, జాతీయ స్థాయిలో పొత్తులు వంటి అంశాలపై కేసీఆర్ తమ విధానాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు. కేసీఆర్ మీడియా భేటీకి సంబంధించిన గదిని మంగళవారం రాత్రికే సిద్ధం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ, వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలకు సంబంధించి సైతం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాశ్వత కార్యాలయం పనుల పరిశీలన సోమవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి మంగళవారం మధ్యాహ్నం వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అన్ని అంతస్తులను కలియతిరిగిన ఆయన ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ మార్గ్‌లోని తాత్కాలిక కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఆఫీసును పరిశీలించి పలు సూచనలు చేశారు. పూజలు జరుగుతున్న ప్రదేశంతో పాటు, యాగాలు జరిగే ప్రాంతాన్ని కేసీఆర్ సందర్శించారు. ఆయన వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాగా బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పటేల్ మార్గ్‌లో పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్ఎండీసీ అధికారులు తొలగించారు. -
బీఆర్ఎస్ ఓవర్ టూ ఢిల్లీ.. హస్తినలో బిజీగా సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశ రాజధాని ఢిల్లీలో తొలి అడుగు పెట్టేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కె.కేశవరావు, జోగినపల్లి సంతో‹Ùకుమార్, రంజిత్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, రాములు, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి తుగ్లక్ రోడ్‌లోని అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో చర్చించారు. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగాలు మంగళ, బుధవారాల్లో పార్టీ కార్యాలయంలో జరిగే రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. మంత్రి వేముల, ఎంపీ సంతోష్ కుమార్.. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మూడురోజులుగా..యాగాలు, పార్టీ కార్యాలయ ప్రారం¿ోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. శృంగేరీ పీఠం గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి. యాగశాల ప్రాంతంలో 300 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల, సంతో‹Ùతో పాటు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, అందుకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. కార్యాలయానికి అవసరమైన ఫరి్నచర్‌ను సైతం ఇప్పటికే అక్కడికి చేర్చారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో ‘కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత.. కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాలతో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రారం¿ోత్సవానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ కార్యవర్గం, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులను కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రానికి మిగతా ఆహా్వనితులు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి భావ సారూప్య పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుటు ప్రకాశ్‌రాజ్ తదితరులు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు ఆహ్వానితులతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. 15 మందితో పొలిట్‌బ్యూరో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 14న జరిగే సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తారు. అదే రోజు మధ్యా హ్నం జాతీయ మీడియాతో జరిగే భేటీలో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి ఎందు కు ఉత్పన్నమైందనే విషయాన్ని వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కొన్ని జాతీయ చానళ్లు నిర్వహించే ప్రత్యక్ష చర్చల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు, వివిధ రంగాలకు చెందిన వారితోనూ కేసీఆర్ వరుస భేటీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో వేగవంతం చేసేందుకు 15 మందితో కూడిన పొలిట్‌బ్యూరోను ప్రకటించే అవకాశముంది. వసంత్‌విహార్‌లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ శాశ్వత కేంద్ర కార్యా లయాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని తెలిసింది. -
తప్పు చేసినవారికి శిక్ష తప్పదు
జగిత్యాల టౌన్/జగిత్యాల రూరల్: తండ్రికి ఇష్టమైన లిక్కర్ దందా కోసమే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లారని, తప్పు చేసిన తన కూతురును కాపాడేందుకే సీఎం కేసీఆర్ డ్రామాలకు తెరతీశారని, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దొంగసారా, పత్తాల దందా నేరాల్లో ఇరుక్కున్న కూతురు కవిత కోసం రోడ్లపైకి రావాలంటూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? అని ప్రశ్నించారు. బతుకమ్మ పేరిట డిస్కో డ్యాన్సులు చేస్తూ కవిత బతుకమ్మ తల్లిని కించపర్చారని మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఆంధ్రా నేతలతో కుమ్మక్కై విద్వేషాలు రెచ్చగొడుతూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నిషేధిత సంస్థలకు నిధులు సమకూరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మెజారిటీ ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొండగట్టు, వేములవాడ, బాసర, ధర్మపురి ఆలయాలకు నిధులు మంజూరు చేస్తామన్న సీఎంక కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డబుల్బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితబంధు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం హామీలు నెరవేర్చకుండా చెల్లని రూపాయిలా మారిని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీలో చెల్లుబాటు అవుతారా? అని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర చిచ్చు రగిల్చి సెంటిమెంట్‌తో మళ్లీ లబ్ధిపొందాలని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణయాగం చేసిన తర్వాత రాష్ట్రానికి ఏం న్యాయం చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. ‘ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే పాపాలు పోతాయా..? రాజశ్యామల యాగం సాక్షిగా ప్రజలకు నిజాలు చెప్పు.. లిక్కర్ కేసులో నీ కూతురు (కవిత) ప్రమేయంపై ఎందుకు స్పందించడం లేదు’అని ప్రశ్నించారు. రాజశ్యామల యాగం ‘సాక్షి’గా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు ప్రమేయం లేదని ప్రమాణం చేయాలన్నారు. -
నన్ను సంప్రదించకుండానే పీసీసీ కమిటీలను ప్రకటించారు: భట్టి
-
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత ఇంటి వద్ద అన్ని వాహనాలు, అంతమంది జనం ఎందుకు?
-
రాష్ట్రంలో దౌర్జన్యకర పాలన
ధన్వాడ: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ధన్వాడ మండలంలోని గున్ముక్లలో ఆయన పర్యటించి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గల్లీలో బెల్ట్‌షాపులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాలని, తాము అధికారంలోకి వస్తే భూమి లేని వారికి ఎకరాభూమి ఇస్తామని, బెల్ట్‌షాపులను పాలబూతులుగా మారుస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ కుటుంబీకులను ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘లోక్‌సభ’ నుంచే ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ ప్రస్థానానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్పుచేసే ప్రక్రియ పూర్తవడంతో వీలైనంత త్వరగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు. ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని పటేల్ మార్గ్‌లో పార్టీ తాత్కాలిక కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే మీడియా సమావేశంలో పార్టీ విధివిధానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం శాశ్వత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలోనే ఢిల్లీలో నిర్వహిస్తామని సంకేతాలిచ్చినా పేరు మార్పిడి ప్రక్రియ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. చలికాలం ముగిశాక మార్చి నెలాఖరులో ఢిల్లీలో పార్టీ శాశ్వత కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించడంతోపాటు ఆవిర్భావ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలతోనే అరంగేట్రం బీఆర్ఎస్ ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో కార్యకలాపాలకు మార్గం సుగమమైనా.. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున పరిశీలక, ప్రచార బృందాలను పంపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాల్లో కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, హన్మంత్ షిండేతో పాటు మరికొందరు నేతల సేవలను వినియోగించుకుంటామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. చేరికలు, విలీనాలతో పార్టీ విస్తరణ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నాటికల్లా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయస్థాయిలో ఆసక్తితో ఉన్న పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరిపి.. కలిసి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవడం, విలీనాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఆలోగా రాష్ట్రానికి చెందిన నేతలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, వివిధ రంగాల నిపుణులతో పొలిట్‌బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రత్యేక పాలసీలు రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాజ్యాంగం, విధివిధానాల రూపకల్పనకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అవగాహన కలిగిన వారికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. పార్టీ జాతీయ కార్యకలాపాల సమన్వయంలో తోడ్పాటు అందించడంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, దాసోజు శ్రవణ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులతో కూడిన బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు సమాచారం. త్వర లో ప్రకటించే బీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోలో వీరిలో కొందరికి ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాల విస్తరణ, పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ల నూతన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్న సీఎం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పాలనాపరమైన అంశాలను తుదిదశకు చేర్చే యోచనలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతోపాటు మరికొందరు నేతలతో ‘టాస్క్‌ఫోర్స్’ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను ముమ్మరం చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. -
అట్టహాసంగా ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకు స్థాపన కార్యక్రమంలో, తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఉన్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎంకు స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత త్రైలోక్య మోహన గౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎంను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముహ్తూర సమయంలో బీఆర్ఎస్ ఏర్పాటు అధికారిక పత్రాలపై పార్టీ అధినేతగా కేసీఆర్ సంతకాలు చేశారు. నిర్ణయించిన ముహూ ర్తం మేరకు 1.25 గంటలకు భారతదేశ చిత్రపటంతో కూడిన గులాబీ జెండాను హర్షధ్వానాల మధ్య ఆహ్వానితులతో కలిసి ఆవిష్కరించారు. తరలివచ్చిన ప్రముఖులు, నేతలు: కుమారస్వామి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతుసంఘాల నేతలు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్నామ్ సింగ్ (హరియాణా), అక్షయ్ కుమార్ (ఒడిశా), హిమాంశు తదితరులు హాజరయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ల్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ ర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాల్లో కార్యకర్తలు బాణసంచా పేలుళ్లు, డీజే, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. గుణాత్మక మార్పు వస్తుందనే విశ్వాసం ఉంది: కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహ్వానితులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో ప్రారంభించగా, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుదుటన తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. కేసీఆర్ సోదరీమణులతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. ‘తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ బీఆర్ఎస్ వృక్షం శాఖోపశాఖలుగా నేడు భారతాన విస్తరిస్తుంది. భారతదేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే చల్లని నీడను పంచనుంది మన భారత్ రాష్ట్ర సమితి’ – హరీశ్‌రావు, ఆర్థిక శాఖమంత్రి ‘బీఆర్ఎస్ ఆవిర్భావం మహోజ్వల ఘట్టం. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో నవశకం ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి’ – నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత ‘భారత రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. టీఆర్ఎస్తో సంఘటిత, సమైక్య, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చారు. భారతీయుల కలలు నిజం చేసేందుకు సీఎం కట్టుబడి ఉన్నారు. తెలంగాణ భూమికగా భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ ప్రస్థానం బీఆర్ఎస్’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు ఫలించాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు గెలవాలి. ఆ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. – ముఖ్యమంత్రి కేసీఆర్ -
‘అప్పుడు అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ‘భారత్ రాష్ట్ర సమితి అనే వెలుగు దివ్వెను దేశం నలుమూలలా విస్తరింప చేద్దాం. భరతమాత సంతృప్తి పడేలా తెలంగాణ కీర్తి కిరీటాన్ని ఆమె పాదాల వద్ద పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేద్దాం. భారత్ రాష్ట్ర సమితితో మన ప్రయాణం కొనసాగించి భరతమాత సంతృప్తిని కళ్లారా చూద్దాం. కొత్త రాజకీయ శక్తి అవిర్భవించినపుడు పాత శక్తులు రకరకాలుగా విమర్శలు చేస్తాయి. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు కూడా చాలామంది అవమానించి గొంతు నులిమే ప్రయత్నాలు చేశారు. అవన్నీ అధిగమించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు కూడా కొంతమంది బాధలు, ఇబ్బందులు పెడతారు. పిరికితనం లేకుండా ముందుకు సాగుదాం. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం కాబట్టే తెలంగాణ సాధించాం. అదే స్ఫూర్తితో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తే ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం..’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో భారతదేశ చిత్ర పటంతో కూడిన గులాబీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ, ఇతర ముఖ్య నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ గడ్డ నుంచి బీఆర్ఎస్ పతాకం ఎగురవేయడం ఆషామాషీగా అలవోకగా, ఆవేశంలో చేస్తున్న పని కాదన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు వెనుక ప్రబల కారణముందని, ఇది ఒక ప్రారంభం మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి.. తిరోగామి స్థితిలో భారత్ ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లక్ష్యంగా పిడికెడు మందితో టీఆర్ఎస్ ప్రారంభమైంది. అనేక ఛీత్కారాలు, అవహేళనలు ఎదుర్కొంటూ చిత్తశుద్ధి, అంకిత భావం, త్యాగాలతో ప్రజల దీవెనలు అందుకుంటూ ఉప్పెనలా విజృంభించి తెలంగాణ సాధించాం. 60 లక్షల మంది సభ్యులతో ఈ రోజు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేలాది మంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని సౌష్టవంగా నిర్మించుకుని క్రమ శిక్షణతో ప్రభుత్వాన్ని నడిపి అద్భుత ఫలితాలు సాధించాం. ఎడారిలా, మంచినీరు లేని ప్రాంతంలా పేరుపడిన తెలంగాణ ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధిస్తే.. రత్నగర్భగా అపార మానవ సంపద కలిగిన భారత్ మాత్రం తిరోగామి స్థితిలో ఉంది. 41 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి, 70 వేల టీఎంసీల నదీ జలాలు, 109 కోట్ల మంది పనిచేసే జనం, జనాభాలో 52 శాతం యువత ఉన్నా.. దేశం దుస్థితిలో ఉంది. ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ఉగ్రవాదం లాంటివెన్నో సాగుతున్నాయి. చెన్నై వంటి చారిత్రక నగరాలు గుక్కెడు తాగునీటి కోసం విలవిల్లాడుతున్నాయి. దేశ యువతను మతోన్మాదులు నిరీ్వర్యం చేస్తూ ఉంటే మనం గుడ్లప్పగించి చూస్తున్నాం. తెలంగాణ లాంటి ప్రయత్నమే దేశ మంతటా జరిగితే అమెరికాను తలదన్నే ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదాలుస్తుంది. ఇందుకు నాందీ ప్రస్తావన మన నుంచి జరగడం సంతోషం. దేశానికి అన్ని విషయాలు వివరించి తెలంగాణ ఉద్యమ తరహాలో పరివర్తన చూస్తాం. దేశంలో గుణాత్మక మార్పు, ఆర్థిక పరిపుష్టి కోసం అంకిత భావంతో ముందుకు సాగుదాం. బీఆర్ఎస్ తొలి నినాదం అబ్ కీ బార్..కిసాన్ సర్కార్. భారత్‌లో మన ప్రభుత్వం వస్తే మారుమూల గ్రామాలు, తండాల్లో 24 గంటలు కరెంటు ఇస్తాం. ఏడాదికో 25 లక్షల కుటుంబాలకు దళితబంధుతో పాటు రైతుబంధు పథకాలు అమలు చేస్తాం..’ అని కేసీఆర్ ప్రకటించారు. కొత్త విధానాల రూపకల్పనపై కసరత్తు ‘దశాబ్దాలుగా సాగుతున్న నీటి పంచాయితీలు, ఆర్థిక పురోగతికి అవాంతరాలు, రైతాంగ సమస్యలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలో అనేక రంగాల్లో కొత్త విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది. వాటర్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఎన్విరాన్మెంట్ పాలసీ, వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీలు కొత్తగా రూపొందించుకునేందుకు నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు, ఆర్థికవేత్తలతో మాట్లాడాం. ఈ పాలసీలను కొద్ది రోజుల్లో దేశ ప్రజల ముందుపెడతాం. అలాగే బీఆర్ఎస్ కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా నూతన ఆలోచన, కొత్త ఒరవడి ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేలా అద్భుత ప్రగతికి బాటలు వేసే ఆలోచనలను మేల్కొలుపుతాం. సమాఖ్య స్ఫూర్తిని పెంచేలా బీఆర్ఎస్ పనిచేస్తుంది..’ అని సీఎం తెలిపారు. కుమారస్వామి కోసం కష్టపడి పనిచేస్తాం ‘కర్ణాటక రైతులు తెలంగాణ ప్రభుత్వ పథకాల అమలును చూస్తున్నారు. కర్ణాటక భావి ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చూస్తున్నాం. కుమారస్వామి కోసం కష్టపడి పనిచేయడంతో పాటు కర్ణాటక రైతులకు ఇక్కడి పథకాలను వివరిస్తాం. తెలంగాణ పోరాటానికి దేవెగౌడ మద్దతు ఇచ్చారు. గతంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరుకు వెళ్లా. ప్రగతిశీల నాయకుల వెంట ఉంటాం. కన్నడ భాష తెలిసిన ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, షిండే, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి నేతలు కర్ణాటకలో కుమారస్వామిగా మద్దతుగా ప్రచారం చేస్తారు..’ అని కేసీఆర్ చెప్పారు. పండుగలా కార్యాలయం ప్రారంభం ‘ఈ రోజు దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టే బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించుకునేందుకు ఓ రోజు ముందే చేరుకునేలా పార్టీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. టీఆర్ఎస్ ఏర్పాటు ఆనాటి అవసరం కాగా.. దేశం కోసం బీఆర్ఎస్గా మారుతున్నాం. పార్టీ సొంత కార్యాలయం పనులు వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తవుతాయి..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. -
సింగరేణి ప్రైవేటీకరణ .. తెలంగాణను కుప్పకూల్చడమే!
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణను కుప్పకూల్చడమేనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చే స్తోందని, అందులో భాగంగానే బొగ్గు గనులను ప్రైవేటీకరించే ప్రయత్నంలో ఉందని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. తక్కువ కా లంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణపై బీజేపీ కక్ష కట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు తాజాగా చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న కేంద్రం.. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్లో లిగ్నైట్ గనులు కేటాయించిందని తెలిపారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేంద్రం అప్పజెప్పిన గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతుల ప్రక్రియ తాలూకు పత్రాలను కేటీఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణపై ఈర్ష్యతోనే వేలం ‘గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సై తం బొగ్గు గనులను కేటాయించాలని గత కొంతకాలంగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోంది. సొంత రా ష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణ సమాజంపై ఈర‡్ష్యతో సింగరేణి గనులను వేలం వేస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో సింగరేణి బొగ్గు గనులను వేలానికి పెట్టారు. ఉత్పత్తిలో, లాభాల్లో ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ, దేశంలోనే అత్యధికంగా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించిన సింగరేణికి చెందిన బ్లాకులను ఎలా వేలం వేస్తారు? బొగ్గు తవ్వకమే ప్రధాన విధిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను చేస్తోంది. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. అయినా కేంద్రం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతోంది. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరిస్తే తెలంగాణలో చీకటే.. ‘సింగరేణి ప్రైవేటీకరణ సమస్య బొగ్గు గనులు ఉ న్న ఏడెనిమిది జిల్లాలది కాదు. ఇది సమస్త తెలంగా ణకు సంబంధించిన అంశం. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించాలనే కుట్రలకు కేంద్రం తెరలేపింది. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కుల వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపై అక్కసు కూడా ఈ కుట్ర లో భాగమే. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నా ల్లో కేంద్రం విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుంది. సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు..’అని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఎంపీ గొంతు ఎత్తాలి ‘గనుల వేలంపై కేంద్రం మొండిగా ముందుకు వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం తప్పదు. తెలంగాణ ఉద్యమం ఎగిసినట్టుగానే, మరోసారి సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలి. సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రైవేట్ కత్తి పెడితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై వేటు వేయడం ఖాయం. 150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమేసే కుట్రలు కేంద్రం ఇకనైనా ఆపాలి..’అని కేటీఆర్ కోరారు. -
టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలన్న విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎన్ భర్ నుంచి గురువారం లేఖ అందింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న పార్టీలో తీర్మానించి, కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పేరు మార్పిడికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)’గా మార్చేందుకు ఈసీ అంగీకరించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన అధికారిక లేఖపై ఈ ముహూర్తంలోనే సంతకం చేసి పంపిస్తారు. దీనితోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరిట అధికారిక కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. తెలంగాణ భవన్ ఆవరణలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలందరూ శుక్రవారం మధ్యాహ్నంలోగా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. లాంఛన ప్రక్రియలు పూర్తిచేసి జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు వీలుగా ఈ ఏడాది అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ జనరల్ బాడీ సమావేశం తీర్మానించింది. అక్టోబర్ 6న ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. ఆ తీర్మానాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు నవంబర్ 7న పబ్లిక్ నోటీసు జారీ చేశారు. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నందున కొత్త పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో కోరారు. అభ్యంతరాలను తగిన కారణాలతో 30రోజుల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి (రాజకీయ పార్టీలు)కి అందజేయాలని సూచించారు. ఈ గడువు గురువారం ముగిసింది. అభ్యంతరాలు వ్యక్తంకాకపోవడంతో భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్పునకు అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాసింది. దీంతో రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరిట రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. -
విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ విడిపోవడం మాకు ఇష్టం లేదు.. ఉమ్మడి రాష్ట్రమే మా వైఎస్సార్ సీపీ విధానమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం’అని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డల కోపాగ్నికి మరోసారి గురికావద్దని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకోసం కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రకటనలు ఇవ్వడం బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డికి సరికాదన్నారు. బీజేపీ పన్నుతున్న కుట్రలో ఏపీ ప్రభుత్వం పావు కావొద్దని హితవు పలికారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, తల్లీబిడ్డలను విడదీశారంటూ పలుమార్లు తెలంగాణ అస్థిత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నా రు. షర్మిల కూడా మోదీ మాటలే చెబుతున్నారని ఆరోపించారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలను తెలంగాణలో తిరిగి కలపాలని, దీనిపై కొట్లాడటానికి ఏపీ నేతలు కలసి రావాలని కోరారు. -
హస్తిన మార్గాన..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరో ప్రస్థానం దిశగా అడుగు వేసింది. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలనే వినతికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడంతో.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్.. శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్గా రూపుమారుతోంది. టీఆర్ఎస్తో స్వరాష్ట్ర సాధనకు పోరాడి రెండు పర్యాయాలు సీఎం పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. బీఆర్ఎస్తో ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎంట్రీకి సంబంధించి సంకేతాలు ఇస్తూ వచ్చారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని, అందుకోసం ప్రయత్నిస్తామని ప్రకటనలు చేశారు. జలదృశ్యం వేదికగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు కేసీఆర్ ఏకకాలంలో రాజీనామా ప్రకటించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు పునాదులు వేసింది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికలో కేసీఆర్ తిరిగి విజయం సాధించడంతో టీఆర్ఎస్ ప్రస్థానానికి తొలి మైలు రాయి పడింది. అప్పటి నుంచి ఉద్యమ పార్టీగా వినూత్న వ్యూహాలతో ముందుకుసాగిన టీఆర్ఎస్.. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని, కరీంనగర్ సభలో నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ ఏర్పాటు హామీ ఇప్పించింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా జాతీయ స్థాయిలో 36 పార్టీలతో లేఖలు ఇప్పించారు. కొత్త సవాళ్ల మధ్య.. ఉద్యమ నేతగా కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు, తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రిగా చేపట్టిన కొన్ని సంస్కరణలు పలు సందర్భాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు గురయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్కు కొత్త సవాళ్లు విసిరాయి. అయితే ఇవేవీ తమపై ప్రభావం చూపవనే రీతిలో కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ ప్రవేశానికి సంబంధించి గత రెండేళ్లలో వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు, జాతీయ స్థాయిలో పేరొందిన పార్టీలు, నేతలతో మంతనాలు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతుందని కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5న నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. డిసెంబర్ 9న లాంఛనంగా పేరుమార్పును అమల్లోకి తెస్తున్నారు. దీనితో రెండు దశాబ్దాల టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పేరిట మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. రాజీనామాలు, ఉప ఎన్నికల వ్యూహంతో.. రాజీనామాలు, ఉప ఎన్నికలను ఉద్యమ వ్యూహంగా మార్చుకున్న కేసీఆర్.. పలు సందర్భాల్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి భిన్నమైన ఫలితాలు చవిచూశారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో టీఆర్ఎస్ 54 సీట్లలో పోటీచేసి 26 చోట్ల గెలిచింది. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడం టీఆర్ఎస్కు కొత్త ఊపిరి పోసింది. 2008లో పార్టీలో మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించగా.. ఉప ఎన్నికల్లో తిరిగి ఏడుగురు మాత్రమే గట్టెక్కారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులతో మహా కూటమి పేరిట జట్టుకట్టినా కేవలం పది మంది మాత్రమే టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణంతో ఉమ్మడి ఏపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని టీఆర్ఎస్ అనువుగా మలుచుకోగలిగింది. 2010 నుంచి 2012 వరకు పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా రాజీనామాలు, ఉప ఎన్నికలతో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమరణ దీక్ష.. ఎడతెగని పోరాటాలతో.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించింది. దీనితో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అదే ఏడాది డిసెంబర్ 23న ప్రకటించింది. దీనితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు ద్వారా టీఆర్ఎస్ ఆందోళనను ఉధృతం చేసింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి ఆందోళనలతో ఊపును కొనసాగించింది. ఎడతెగని పోరాటాలతో కేంద్రం దిగొచ్చింది. 2014 ఫిబ్రవరిలో ఉమ్మడి ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అదే ఏడాది మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించగా.. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే గడువుకన్నా ఆరు నెలలు ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి 2018 డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు వెళ్లిన టీఆర్ఎస్కు 119 స్థానాలకు గాను 88 సీట్లు దక్కాయి. రెండోసారి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. -
టీఆర్ఎస్ ను BRS గా మారుస్తూ ఈసీ ఆమోదం
-
జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీనియర్ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పూడ్చలేనంత పెరిగిన గ్యాప్.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్ఎస్లో చేరడంతో సీన్ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్ పూడ్చలేనంతగాపెరిగింది. ఏకం చేసే దిశగా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్ ఘటనను ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్ఎస్ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?) -
సబ్కా వికాస్ కాదు.. సబ్ బక్వాస్
నేను బతికి ఉన్నంతకాలం రైతుబంధు, రైతుబీమా విచ్ఛిన్నమైన, ధ్వంసమైన తెలంగాణ రైతాంగానికి పునరుజ్జీవం కల్పించేందుకే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. నేను బతికి ఉన్నంతకాలం.. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం. మాటల గారడీ, మత పిచ్చిగాళ్ల మాటలు వింటే మోసపోతాం. అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తి షావుకార్లకు కట్టబెట్టే కుట్ర రాష్ట్రాలు పేదలకు ఉచిత పథకాలను అమలు చేయొద్దు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్పీఏల పేరిట రూ.14 లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటుపరం చేసింది. కేంద్ర బడ్జెట్‌తో సమాన బడ్జెట్ ఉన్న ఎల్ఐసీని షావుకార్లకు కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయి. 25 లక్షల మంది ఎల్ఐసీ ఏజెంట్లు దీనికి వ్యతిరేకంగా పిడికిలి ఎత్తాలి. వందలు, వేలకోట్ల ప్రజల సొమ్ముతో విద్యుత్ రంగంలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను నామమాత్రపు ధరలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఏ రంగంలో విజయవంతం అయిందో చెప్పాలి. మేకిన్ ఇండియాతో ఏ పరిశ్రమ వచ్చిందో చెప్పాలి. ప్రతీ ఊర్లో చైనా బజార్లు రావడమేనా మీరు సాధించింది. దీపాంతలు, జెండాలు, బ్లేడ్లు, కుర్చీలు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బీజేపీ విధానాల కారణంగా దేశంలో వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు. బీజేపీది సబ్కా సాత్, సబ్కా వికాస్ కాదు.. సబ్ బక్వాస్..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఉత్త మాటల గారడీ, డంబాచారం తప్ప బీజేపీ సాధించినదేమీ లేదని పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభం, మెడికల్ కాలేజీకి భూమి పూజ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల అర్బన్ మండలం మోతె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కొంతకాలంగా గోల్మాల్ గోవిందాలు, మాటలగారడీ గాళ్లు తిరుగుతున్నారు. వారితో అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే ఆగమైపోతాం. ఒకసారి తెలంగాణ నాయకులు చేసిన చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు ప్రజలు ఉద్యమించారు. సమ్మెలు, పోరాటాలు, ప్రాణత్యాగాలు చేశారు. మోసపోతే దెబ్బతింటాం. 100 ఏళ్లు వెనక్కిపోతాం. మేధావులు, రచయితలు, విద్యావంతులు, యువత దీనిపై చర్చించాలి. జగిత్యాల పట్టణం మోతె గ్రామం వద్ద బుధవారం నిర్వహించిన బహిరంగసభకు హాజరైన జనం. (ఇన్సెట్) ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ సాధించినదేమీ లేదు బీజేపీ విధానాల కారణంగా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతబడ్డాయి. 50 లక్షల మంది నిరుద్యోగులయ్యారు. దీనిపై నేను దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఏటా 10వేల మంది పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు. అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం ఊడిపోయింది అన్నట్టు దేశం పరిస్థితి తయారైంది. సబ్కా సాత్.. సబ్కా వికాస్ కాదు.. సబ్ బక్వాస్. మాటలగారడీ, డంబాచారం తప్ప బీజేపీ సాధించిందేమీ లేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరెంటు కోతలు, మంచినీళ్లు రావు. అంగన్వాడీ నిధులతో బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజుకో లైంగికదాడి, దళితులపై దౌర్జన్యాలు జరగకుండా రోజు గడుస్తోందా? తెలంగాణ జీఎస్డీపీ 5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అదే కేంద్రం తీరు సరిగ్గా ఉంటే.. రూ.14 లక్షల కోట్లకు చేరి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణకే పథకాలు ఛిద్రమైన తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నాం. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం ఈ పథకాలు అమలవుతాయి. దాదాపు 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. మరో 5–10 రోజుల్లో రైతుబంధు కూడా వస్తుంది. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుండగా వారి గోస ఎవరూ పట్టించుకోలేదు. వారికి నెలకు వందల కోట్లు వెచ్చిస్తూ రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఆరోగ్యశ్రీ, కల్యాణలక్షి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలెన్నో అందజేస్తున్నాం. కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేలా దాదాపు వెయ్యి గురుకులాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. వ్యక్తిగత ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. వరద కాల్వను జీవనది చేసుకున్నాం.. గతంలో వరద కాల్వపై మోటార్లు పెట్టుకుంటే పీకేసేవారు. రైతులు ఆత్మహత్యలు, దుబాయ్, బొంబాయి వలసలతో అల్లాడే పరిస్థితి. తెలంగాణ వచ్చాక వరద కాల్వను జీవనదిగా మార్చుకున్నాం. ఈ కాల్వపై ఉన్న తూముల నుంచి దాదాపు 13 వేల మోటార్లు పెట్టుకుని రైతులు స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. అలాంటి మోటర్లకు మీటర్లు పెడతారంట.. ఇది సబబేనా? రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.13–14 వేల కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రపంచంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. రెండు జిల్లాల్లోని నియోజకవర్గాలు అదనపు నిధులు ఉద్యమ సమయంలో గోదావరి తీరంలోని ధర్మపురి క్షేత్రంలో పుష్కరాలపై వివక్ష చూపడంపై చాలాసార్లు ప్రశ్నించాను. ప్రజలు, పండితుల దీవెన వల్ల నేడు తెలంగాణ సాకారమైంది. మన వద్ద ఘనంగా పుష్కరాలు చేసుకున్నాం. ఉద్యమ సమయంలో జగిత్యాల జిల్లాలో ఎటుచూసినా ఎండిన చెరువులు, బోర్లు కనిపించేవి. అప్పట్లో నేను బండలింగాపూర్ గ్రామంలో బస చేశాను కూడా. ఆ గ్రామస్తుల కోరిక మేరకు దాన్ని మండలంగా ప్రకటిస్తున్నాను. జగిత్యాల, కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేస్తాం. రోళ్లవాగు ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తాం. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, భీమారంలకు ఉపయోగపడేలా సూరమ్మ చెరువును నింపుతాం. మల్యాల మండలం ‘మద్దుట్ల’ ఎత్తిపోతలను వెంటనే చేపడతాం. పోతారం, నారాయణపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తాం..’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో ప్రసంగం ముగించారు. అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎనలేనిది జగిత్యాల కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి సంక్షేమ పథకం విజయం వెనుక ఉద్యోగుల కృషి ఎనలేనిదని.. ఉద్యమంలోనూ ఎంతో పోరాడారని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, జిల్లాకో మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామన్నారు. రైతుబంధు, బీమా, ఇతర పథకాలతో వ్యవసాయ స్థిరీకరణ జరిగి, వలసలు తగ్గాయని చెప్పారు. కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్‌రావు, రవిశంకర్, రమేశ్‌బాబు, ఎమ్మెల్సీలు కె.కవిత, ఎల్.రమణ, పాడి కౌశిక్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులపై కేసులా?
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ఉద్యమకారులపై కుట్రలతో కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అయితే రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదని విమర్శించారు. తిండి లేకున్నా ఉంటాం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని వ్యాఖ్యానించారు. తాను రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర ఎంపీలు బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయా లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కే బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. లోక్‌సభలో సింగరేణి అంశాన్ని ‘అత్యవసర’ అంశంగా లేవనెత్తిన ఉత్తమ్.. కల్యాణ ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్– 3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వరంగ బొగ్గు గనుల సంస్థ ఎస్సీసీఎల్కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలసి ఉన్నాయన్నారు. మోదీ ప్రైవేటీక రణ చేయబోమని హామీ ఇచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకే ముందుకు వెళుతోందన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తోంది సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి నామా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణనే తీసుకుంటుందని నామా అన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ.. విధానపరమైన నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకుంటోందన్నారు. కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభు త్వానికే కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు. ఆరోపణలు నిరాధారం: కేంద్ర మంత్రి జోషి సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీల ఆరోపణలు నిరాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీల ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉండగా, 49% వాటా కలిగిన కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే గనుల వేలం విష యంలో కేంద్రం.. ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం –1957 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో కళ్యాణఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి గనుల వేలం ప్రక్రియలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, వాటిని ఎస్సీసీఎల్కు కేటాయించాలని తెలంగాణ అభ్యర్థించినా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి అన్ని కోల్ బ్లాకులను వేలం పద్ధ తిలోకి తెచ్చామన్నారు. గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళుతుందని, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని మంత్రి విమర్శించారు. -
గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
-
మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
నాగోలు (హైదరాబాద్): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. పేదల్ని ఆదుకుంటున్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. పెరిగిన తలసరి ఆదాయం.. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. 31.7 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్.. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వేములవాడలో ‘రూ. వంద కోట్ల’ ప్రకంపనలు
వేములవాడ: వేములవాడలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, కొందరు అడ్డగోలుగా భూములు, గుట్టలు కబ్జాలు చేసుకున్నారని, ఆ విషయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన రమేశ్‌బాబు వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సొంతపార్టీ నేతలున్నా వదలబోనని హెచ్చరించడంపై స్థానికంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. వేములవాడలో ఈ నెల 5న జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు తుపాకీ, మైనింగ్ లైసెన్సులు తీసుకొని రాజ్యమేలాలని చూస్తున్నారని రమేశ్ వ్యాఖ్యానించడంతో స్థానికంగా దుమారం చెలరేగుతోంది. వేములవాడ పట్టణ శివారులోని అగ్రహారం గుట్టలు, నందికమాన్ ప్రాంతంలో భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అధికార పార్టీ నాయకులు మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. వేములవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దడ పుట్టిస్తున్నాయి. -
ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు 50% సమయాన్ని కేటాయించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేశవరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడుచుకోవట్లేదని..17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్వినియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై అందరినీ కలుపుకుని పార్లమెంటులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో కొన్ని విశేషాలు గమనించవచ్చు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు కురిపించినా, పెద్ద గా హద్దులు దాటినట్లు అనిపించదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని స్థాయి లో ఉన్నవారు అనవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉదాహరణ కాకుండా పశ్చిమబెంగాల్ ను ఉదహరించారు. బెంగాల్ లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని గతంలో మోడీ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. మోడీ ఆ మాట అన్న విషయం నిజమే. అప్పట్లో దీనిపై కలకలం రేగింది. వివిధ రాజకీయ పక్షాలు మోడీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాయి. తాజాగా కెసిఆర్ ఆ సంగతి ఎందుకు తీసుకు వచ్చారో తెలియదు. అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినవారని పట్టుకుని జైలులో వేశామని ఆయన తెలిపారు. నిజమే! ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పే. మధ్య ప్రదేశ్, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో బిజెపి వారు గేమ్ ప్లాన్ ఆడి తమ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. కెసిఆర్ ఆ ముచ్చట చెప్పి బిజెపిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అలా ప్రయత్నం చేసినవారిని జైలులో పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే ఆయనే గత ఎనిమిదేళ్లలో ముప్పైఏడు మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరి దానిని ఏమంటారన్నదానిపై మాట్లాడడం లేదు. కాకపోతే వారంతా తెలంగాణ అభివృద్ది కోసం స్వచ్చందంగా చేరారని చెప్పవచ్చు. ఎర కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు కావడం, అసలు పట్టుబడ్డ నిందితులతో ఈ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధాలు ఏమిటో ఇంతవరకు బహిరంగ పరచకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? ఈ నేపధ్యంలో ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలను కొనడం ఏమిటో, సిట్ ఏమి తేల్చిందో, నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనే యత్నం చేసిందో ఇంతవరకు తేలలేదు. కాని ఈ విషయంలో బిజెపిని ఇరుకున పెట్టడంలో, తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయడంలో కెసిఆర్ కొంతవరకు సఫలం అయ్యారు. ఇదే తరుణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైన, మంత్రి మల్లారెడ్డి వంటివారిపైన వచ్చిన ఆరోపణలు టిఆర్ఎస్ కు అప్రతిష్టగానే మారాయి. ఎంత కేంద్రంపైన, కేంద్ర దర్యాప్తు సంస్థలపైన విమర్శలు కురిపించినా, చివరికి అవి నిర్వహించే విచారణలకు హాజరుకాకుండా ఉండలేని పరిస్థితి. టిఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని కెసిఆర్ వాపోయినా, సంబంధిత నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుంది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ప్రముఖంగా వచ్చిన వైనంపై మహబూబ్ నగర్ సభలో మాట్లాడలేదు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్ల లో జరిగిన సోదాలు, పట్టుబడిన డబ్బు గురించి ప్రస్తావించలేదు. దీనిని ఏమని అనుకోవాలి. ఈ పాయింట్ నే బిజెపి కాని, ఇతర పార్టీల నేతలు కాని ఫోకస్ చేస్తున్నాయి. మల్లారెడ్డి తన పై ఐటి దాడి జరిగినప్పుడు గంభీరంగా మాట్లాడారు కాని, ఆయన సంతృప్తికరమైన వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. అలాగే కవిత కూడా కావాలంటే జైలులో పెట్టుకోవాలని సవాల్ చేశారు కాని, ఆ స్కామ్ గొడవకు సంబంధించి స్పష్టత ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ క్రమంలో ఆమె విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ, తదితర డాక్యుమెంట్లు అందచేయాలని , ఆ తర్వాత విచారణ చేయాలని ఆమె కోరారు. ఇందుకు సీబీఐ స్పందన ఎలా ఉంటుందన్నది తెలియవలసి ఉంది. అయితే, ఆమెను కేవలం వాంగ్మూలం ఇవ్వడానికే నోటీసు ఇవ్వడం కొంతలో కొంత ఊరట అవుతుందేమో! ఆమె సాక్ష్యం తర్వాత అధికారులు ఎలా స్పందిస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటి గురించి మాట్లాడడం ఒకరకంగా కెసిఆర్ కు కూడా ఎంబరాస్మెంటే అని చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదని, మల్లారెడ్డి కాలేజీలలో అవకతవకలు లేవని చెప్పే సాహసం కెసిఆర్ చేయలేకపోవచ్చు. కాకపోతే టిఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభావితం చేస్తోందన్న అభియోగం మోపవచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి పట్టుబడ్డ 15 కోట్ల నగదుపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రాజకీయంగా కూడా కొంత నష్టం వాటిల్లవచ్చు. ఏది ఏమైనా వచ్చే ఆరు నెలలు టిఆర్ఎస్ కు అత్యంత కీలకం. బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల గడువు దగ్గరపడే కొద్ది ఈ కాక ఇంకా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీఆర్ఎస్లో పీక్ స్టేజ్‌కు పాలిటిక్స్.. మంత్రితో జెడ్పీ చైర్మన్ వాగ్వాదం!
వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతలుగా జిల్లాకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం హెల్త్ సెక్టార్ గ్రాంట్స్ రూ.84 లక్షలు, రూ.2.10 కోట్ల నిధుల కేటాయించగా.. వాటిని వినియోగించే అంశంలో జెడ్పీ సమావేశంలో మంత్రి అధికారులు సూచనలు చేశారు. అయితే ‘మా ప్రమేయం లేకుండా పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ చేస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు జనం గౌరవం ఏముంటుంది. ఈ పాటిదానికి గ్రాంట్ జెడ్పీకి ఇవ్వటం దేనికి.. నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి మీరే పనులు చేయిస్తే.. సరిపోతుంది కదా.’ అని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి నిలదీశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ప్రభుత్వం నిధులతో పాటు ఇచ్చిన నిబంధనలను పాటించి నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. గ్రాంట్ విడుదలైన తర్వాత నాలుగుసార్లు నిధులను వెచ్చించే నిబంధనలను మార్చుతూ.. సర్క్యులర్ పంపించారు. ఎంత వరకు సమంజసం అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశంలో కూర్చోవాలా.. వెళ్లిపోనా.. అంటూ జెడ్పీ చైర్మన్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన నిమ్మకుండిపోయారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల జిల్లాఅధికారుల ఎదుట మంత్రి, జెడ్పీ చైర్మన్ విభేదించుకోవటం చూసి నివ్వెరపోయారు. కొద్దిసేపటికే.. మంత్రి సమావేశం నుంచి మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందంటూ.. వెళ్లిపోయారు. -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ మరోసారి రసవత్తరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ విచారణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు(మంగళవారం) కవితను విచారిస్తామని గతంలో సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. మరోవైపు.. విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కోఠిలోని ఆఫీసుకు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతిలేదని ఇప్పటికే సర్కార్ జీవో 56 విడుదల చేసింది. ఈ తరుణంలో కవితను విచారించాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో, కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సీబీఐకి రాసిన లేఖలో కవిత.. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. సీబీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. -
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి నోటి మాటలేనా?
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీఆర్ఎస్ నేతల హామీలు నోటి మాటలేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శించారు. హామీలకు మించి 2.25 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 2021 పీఆర్సీ కమిటీ రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ శాఖ ల్లో 39% మేరకు ఉద్యోగులే లేరని చెప్పిన విష యాన్ని గుర్తుచేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం గత ఎనిమిదేళ్లలో 35 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు స్పష్టమవుతుందని షర్మిల ట్వీట్ చేశారు. -
16న కరీంనగర్‌కు జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 16న కరీంనగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైతే ఆ వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలు చుట్టివచ్చేలా ఆరో విడత పాదయాత్రకు బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తంగా ఐదు విడతల యాత్ర ద్వారా 56 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయనుండగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఆయన ఆరోవిడత యాత్ర చేపట్టనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొనేలా భారీ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. పాదయాత్రల ద్వారా మొత్తం 70 నియోజకవర్గాలు కవర్ చేస్తున్నందున, గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 50 నియోజకవర్గాలను వీలైనంత తక్కువ సమయంలో బస్సుయాత్ర ద్వారా చుట్టిరావాలని బండి సంజయ్ భావిస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా రోజుకు రెండు అసెంబ్లీ స్థానాలను చుట్టొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. -
బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు
వికారాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, దీంతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతుసమస్యలపై నిర్వహించిన ధర్నాలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఢిల్లీలో ఉన్నోడు.. గల్లీలో ఉన్నోడు కూడబలుక్కొని డ్రామాలాడుతున్నరు.. ప్రచార మాధ్యమాల్లో ప్రజాసమస్యలపై చర్చ రాకుండా చేస్తున్నారు’ అని అన్నారు. కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే టీఆర్ఎస్ ఓటేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేవెళ్ల– ప్రాణహిత ప్రాజెక్టు కింద రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో రూ. 8 వేల కోట్లు రంగారెడ్డి జిల్లాలోనే ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో డిజైన్ మార్చి పాలమూరు పథకాన్ని పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలతో నాటకాలు ఈడీ, సీబీఐ, సిట్ల పేరుతో దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఈడీ నోటీసులిస్తే, వ్యవస్థలను గౌరవించి వెళ్లి సమాధానాలు చెప్పి రాలేదా అని పేర్కొన్నారు. మరి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇస్తే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని, కవితకు సీబీఐ నోటీసులు ఇస్తే ఇంట్లో కూర్చొని సమాధానమిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ ఉసురు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న కేసీఆర్.. ఇప్పుడు తన వరకు వచ్చే సరికి ఏడుస్తున్నారని రేవంత్ విమర్శించారు. నాడు రూ.30 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. నేడు మారు బేరంలో వంద కోట్లిస్తే అమ్ముడు పోకుండా ఉంటాడా? అని నిలదీశారు. తనను జైళ్లో పెట్టినప్పుడు కూతురు నిశ్చితార్థం కోసం ఒక్కరోజు బెయిల్ గురించి ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకోవటం నిజం కాదా? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయన కూతురు వరకు వచ్చే సరికి గగ్గోలు పెట్టడమెందుకని అన్నారు. మీడియా సామాజిక బాధ్యతను మరచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. ఆ రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యత కామారెడ్డి జిల్లాలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకున్న ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ట్వీట్ చేశారు. ‘రైతును కాపాడేందుకు సమ యం ఉన్నా స్పందించని యంత్రాంగం. కేసీఆర్ పాలనలో మొద్దుబారిన వ్యవస్థల దుర్మార్గానికి నిదర్శనం ఇది’ అని ట్వీట్లో ధ్వజమెత్తారు. -
కేంద్రం తీరును ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు రాజకీయ, పాలనపరమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, తద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. పార్లమెంటులో లోపలా, బయటా చోటు చేసుకునే పరిస్థితులను బట్టి వ్యూహరచన చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళనలు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ఇతర ధర్నాలు, ఆందోళనలకు అంశాల వారీగా టీఆర్ఎస్ మద్దతునిస్తుందని తెలిపారు. అవసరమైతే సమావేశాల బహిష్కరణ! ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్రలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలను అడ్డుకున్న తీరుతో పాటు అందులో బీజేపీ పాత్ర, విచారణను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఎంపీలకు వివరించారు. విభజన హామీల అమలులో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, నిధుల విడుదలలో చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. గవర్నర్ వ్యవస్థతో పాటు, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా విపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణను ప్రజలకు వివరించేందుకు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. -
బండి సంజయ్ బస్సుయాత్ర!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే అంచనాలతో.. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రకు బదులు బస్సుయాత్ర చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలుంటే పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం తక్కువకావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ పూర్తిగా సన్నద్ధంగా ఉండేలా.. అన్ని నియోజకవర్గాలను చుట్టేలా కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది. ఆరో విడత యాత్ర జంటనగరాల పరిధిలో.. ప్రస్తుతం ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్.. అది ముగిసిన వెంటనే మూడు నాలుగు రోజులు విరామమిచ్చి ఆరో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ సారి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పాదయాత్రకు రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. గతంలో మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహించిన తరహాలోనే జంట నగరాల పరిధిలో పది రోజుల యాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న కరీంనగర్లో ఐదో విడత పాదయాత్ర ముగింపు బహిరంగసభలో ఆరో విడత యాత్రపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా సమీక్షలు బండి సంజయ్ ఒకవైపు పాదయాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర విరామ సమయంలో, ఉదయం పూట పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేతలతో, 6న నిజామాబాద్, 7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఈ విడత పాదయాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల సమీక్షలు పూర్తి చేయనున్నారని.. తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టి పెడతారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
టీఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది : వైఎస్ షర్మిల
-
‘ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ దిశగా ముందుకెళ్తున్నాము’
సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషం. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. గురుకులాలను ఇంకా పెంచుతాము. చాలా కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. కంటివెలుగు ఓట్ల కోసం తెచ్చింది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాము. సంస్కరణ అనేది అంతం కాదు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కవిత తన పాత్ర లేదని నిరూపించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదేనని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ఎవరికి చుట్టం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... అక్రమాలపై లభించిన ఆధారాలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూ, నోటీసులిస్తుంటే తెలంగాణ ప్రజల మీద దాడులు అనే విధంగా చిత్రీకరించాలని కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలపైనా, తమపైనా ఏమైనా ఏమైనా అనుమానాలుంటే సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ,ఈడీ, సీబీఐ దాడులకు, నోటీసులకు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని స్కామ్‌లుగా మారాయని విమర్శించారు. ఏ ప్రభుత్వాన్నీ పడగొట్టలేదు: బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టలేదని...కొన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు వారి పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు మంత్రి అయ్యారు? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో మంత్రిగా ఉన్నారు? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై మేధావులు గొంతు విప్పాలని..ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. -
ధరణితో విప్లవాత్మక మార్పు
సాక్షి, కామారెడ్డి: భూముల రికార్డులను భద్రపరిచి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రూపొందించిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ధరణిలో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన ‘డోంగ్లీ’మండలాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ధరణితో తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడం, పాసుపుస్తకాలు ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, త్వరితగతిన పనులు జరగడానికి ధరణి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇక్కడ అమలవుతున్న ధరణి పోర్టల్ విధానాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు ధరణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పథకాలను చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నపుడు ఏ ఊరికీ సరైన రోడ్లు లేవని, తాగునీరు దొరికేది కాదని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తారురోడ్లు నిర్మించామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందిస్తున్నామని, 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని గ్రామాల ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామని అంటున్నారని తెలిపారు. సభలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జెడ్పీ చైర్పర్సన్ దఫెదార్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారికి మంత్రి నివాళి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పిట్లం మండ ల కేంద్రంలో ఆయన చిత్రపటానికి మంత్రి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని కొనియాడారు. ఓర్వలేక నిధులు నిలిపేసిన కేంద్రం: హరీశ్ తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మెరుగైన పాలనను టీఆర్ఎస్ అందజేస్తుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నిజాంపేట్ మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 97 వేల ఉద్యోగాల భర్తీకి నోటి ఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని, అయితేఈ మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందన్నారు. మంత్రిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం.. పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాల్లో పర్యటించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావును అడ్డుకునేందుకు బీజేపీ, బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
టీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : రేవంత్ రెడ్డి
-
కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్ అంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు. లిక్కర్ స్కాంలో మిగతా వారిని విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలి. గతంలో ఎన్నికల సంఘానికి నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందకు లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితలను అరెస్ట్ చేయాలన్నారు. బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే, బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత పేరును చేర్చినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. -
హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టు బెయిలిచ్చినా నిందితులు విడుదల కాలేదు. రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమకూర్చలేక న్యాయవాదులు తంటాలు పడుతున్నారు. నందకుమార్‌పై పెండింగ్ కేసులో బెయిల్‌పై నాంపల్లి కోర్టు శనివారం తీర్పు చెప్పనుంది. కోర్టు ఆర్డర్ తర్వాతే నందకుమార్ విడుదలపై క్లారిటీ రానుంది. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులతో పాటు లుకౌట్ నోటీసులు కొట్టేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ అన్నారు. చదవండి: పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్ -
కాంగ్రెస్‌లో నందు చిట్టా తంటా!
సాక్షి, హైదరాబాద్: వలసల బెడదతో సతమతమ వుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ‘నందు చాటింగ్ చిట్టా’కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలకు నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటం కలవరం పుట్టిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు, తాము పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న నేతల పేర్లు ఈ జాబితాలో ప్రత్యక్షం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. సిట్ విచారణలో భాగంగా వెల్లడైన ఈ పేర్లు కేవలం కాగితాలు, ఫోన్ చాటింగ్‌ల వరకే పరిమితం అయ్యా యా? పార్టీ నేతలను ఎవరైనా కలిసి మంతనాలు జరిపారా? ఆ మంతనాల్లో పాల్గొన్నదెవరు? ఎవరు పార్టీలో ఉంటారు? ఎవరు వెళ్లిపోతారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నాయి. ఎమ్మెల్యేలతో సహా...! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. వీరికి తోడు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మల్రెడ్డి బ్రదర్స్, గాలి అనిల్‌కుమార్, సురేశ్‌షెట్కార్, రాజ్‌ఠాకూర్, ఆదిశ్రీనివాస్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్లాంటి నేతల పేర్లు ప్రత్యక్షం కావడంతో అసలు నందు అండ్ కో వీరిలో ఎవరినైనా కలిసిందా అనే కోణంలో టీపీసీసీ ఆరా తీస్తోంది. వీరికి తోడు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్న తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల పేర్లు కూడా చాటింగ్‌లో ప్రస్తావనకు రావడంతో పార్టీలో ఉన్న వారిని తీసుకోవడంతోపాటు కొత్తవారు రాకుండా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయనే చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సామాజిక వర్గమే టార్గెట్ నందు జాబితాలోని నేతల పేర్లు చూస్తుంటే రాష్ట్రంలోని ఓ ప్రధాన సామాజిక వర్గంపై దృష్టిపెట్టారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ‘మొదటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అండగా ఉంటున్న ఆ సామాజిక వర్గం నేతలను దూరం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపర్చాలనే వ్యూహం అమలు చేస్తున్నార’ని అని టీపీసీసీ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో చెప్పారు. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా?
నిర్మల్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ బిడ్డ కవితకు ఈడీ నోటీసులిస్తే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన కేసీఆర్ బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలని ఆయన ప్రశ్నించారు. లిక్కర్, డ్రగ్స్, క్యాసినో, అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలు కేసీఆర్ కుటుంబం జైలుకు పోవాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో రోజు శుక్రవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం బామ్ని (కె), నందన్, నర్సాపూర్ (జి), రాంపూర్ గ్రామాల మీదుగా సాగింది. నందన్‌లో రచ్చబండ పెట్టి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన మహిళలు, బీడీ కార్మికులతో మాట్లాడారు. నర్సాపూర్ (జి)లో రాత్రి నిర్వహించిన సభలో కేసీఆర్ కుటుంబంపై బండి విరుచుకుపడ్డారు. కేసీఆర్ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, సీఎం తీరును చూసి దేశం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఐటీ మూసివేతకు కేసీఆర్ కుట్ర.. బాసర ట్రిపుల్ ఐటీ మూసివేతకు సీఎం కేసీఆర్ కుట్రపన్నారని బండి సంజయ్ ఆరోపించారు. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన తిండి, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. తమ చుట్టాలకే సీఎం కాంట్రాక్టులు ఇచ్చారని... అందుకే అక్కడ ఏం జరిగినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా వచ్చి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని బండి డిమాండ్ చేశారు. మంత్రి, పోలీసులపైనే కేసులు పెట్టిస్తా.. నిర్మల్ నియోజకవర్గంలోని నర్సాపూర్‌లో దళితబంధు అడిగిన పాపానికి మహిళలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు దళిత మహిళలపై దాడిచేసి కేసులు పెట్టిన పోలీసులపై అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ సోయం బాపురావు ద్వారా ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళ బర్కుంట చిలుకతో సంజయ్ మాట్లాడించగా వచ్చే ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణరెడ్డిపై పోటీ చేస్తానని ఆమె పేర్కొంది. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపురావు, పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి, సహప్రముఖ్ తూళ్ల వీరేందర్‌గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
పాదయాత్రను, పార్టీని ఆపడం ఎవరితరం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న తన పాదయాత్రను టీఆర్ఎస్ గూండాలు అడ్డుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల దుయ్యబట్టారు. అయితే తన పాదయాత్రను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి తన పాదయాత్రను ఆగిన చోటు (వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం) నుంచే తిరిగి ప్రారంభిస్తున్నానని, ఈ నెల 14 వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు కేవలం అధికార పార్టీకి మాత్రమే మిత్రులుగా ఉంటున్నారని... ప్రతిపక్షాలపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ వారు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరడానికి శుక్రవారం డీజీపీ కార్యాలయానికి పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పిట్టా రాంరెడ్డి తదితరులతో కలసి వచ్చిన షర్మిల... డీజీపీ లేకపోవడంతో అదనపు డీజీకి వినతిపత్రం అందచేశారు. పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని సైతం అందించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి నేను దత్తపుత్రికను అని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్ బీజేపీకి పెళ్లాం అని అనాలా? నేను నిలదీసినట్లుగా బీజేపీని ఎవరు నిలదీస్తున్నారు? నన్ను నల్లి మాదిరిగా నలిపేస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు.. తాలిబాన్లు. రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోంది. కేసీఆర్ ఈ తాలిబాన్లకు అధ్యక్షుడు. ఏమి చేసుకుంటారో చేసుకోండి. వైఎస్సార్ బిడ్డ దేనికీ భయపడదు. ఈ బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాల్సిన సమయం వచ్చింది’అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటా. తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెచ్చే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవలి రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ వ్యవహారశైలి, పోలీసు నిర్బంధాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు, పాదయాత్ర కొనసాగింపుపై విస్తృతంగా చర్చించారు. -
నిజామాబాద్‌లో కుల రాజకీయం..మా వాళ్లు ఎక్కువ, మేమే గెలుస్తాం!
ఒకప్పుడు అక్కడ మున్నూరు కాపులదే రాజ్యం. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు వారే. కాని ఇప్పుడు వేరే సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ మున్నూరు కాపుల జెండా ఎగరేయాలని ఆ సామాజికవర్గ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఈసారి రెండు పార్టీల నుంచి మున్నూరు కాపులు పోటీకి ప్లాన్ చేస్తున్నారు. ఏ కులానికి టికెట్.? నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన బిగాల గణేష్ గుప్తా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిటింగ్‌లకే వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తామని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ప్రకటించడంతో..గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి అవసరమైతే అభ్యర్థులను మారుస్తామని కేసీఆర్ చెప్పినా... తాజా ప్రకటన వల్ల సిటింగ్‌లకు పెద్దగా ఇబ్బంది లేదనే వాదన వినిపిస్తోంది. అయితే గణేష్‌కు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్‌లో తమ పట్టు పోయిందని భావిస్తున్న మున్నూరు కాపులు తమ వర్గానికి చెందిన నేతను నిలపాలని కోరుకుంటున్నారు. దీంతో ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రేస్‌లో ముందుకొచ్చారు. కమలంలోనూ కుల సమీకరణాలే ఇదిలా ఉంటే మరో వైశ్య ప్రముఖుడు ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈసారి ఆయనకే కమలం సీటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి గణేష్, బీజేపీ నుంచి సూర్యనారాయణ..ఇలా రెండు ప్రధాన పార్టీల నుంచి వైశ్య ప్రముఖులకే సీట్లు దక్కుతాయనే ప్రచారం నేపథ్యంలో మున్నూరు కాపులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ సామాజికవర్గ బలంతోనే ఎవరైనా గెలవాల్సి ఉంటుందని అందువల్ల తమనుంచే ప్రధాన పార్టీల్లో అభ్యర్థులుండాలని వారు భావిస్తున్నారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్‌కు బదులుగా బరిలో దిగాలని ఆకుల లలిత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ అధికార టీఆర్ఎస్ నుంచి గనుక ఆకుల లలితకు టిక్కెట్ దక్కకపోతే...ఆమె కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలూ లేకపోలేదనే ప్రచారమూ జరుగుతోంది. మా వాళ్లు ఎక్కువ, మేమే గెలుస్తాం.. మరోవైపు కాంగ్రెస్ టిక్కెట్ కోసం సీనియర్ నేత డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ కూడా ప్రయత్నిస్తున్నారు. కాని కారిణం బయటకు రాలేదు గాని..ఈ ప్రయత్నాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ధర్మపురి సంజయ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోతే..అర్బన్‌లో పట్టున్న ఎంఐఎం పార్టీ తరపున దించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మైనారిటీలకు బలం ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పట్టుదలగా ఉంది. అందువల్ల గాలిపటం పార్టీ నుంచి పోటీ చేస్తే అటు మైనారిటీ ఓట్లు, ఇటు మున్నూరు కాపుల ఓట్లతో తేలిగ్గా గెలవవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నిజామాబాద్ అర్బన్ పోటీ ఈసారి రసవత్తరంగా ఉంటుంది. టీఆర్ఎస్ సిటింగ్కే సీటిస్తే...బీజేపీ కూడా వైశ్య అభ్యర్థినే బరిలో దించితే..ఇక కాంగ్రెస్, ఎంఐఎంల నుంచి మున్నూరు కాపులు పోటీ చేస్తే రాబోయే ఎన్నికల పోరాటం నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
స్వామీజీ.. బీఎల్ సంతోష్.. వాట్సాప్ చాటింగ్ 25 మంది రెడీ!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి (స్వామీజీ) బీజేపీ నేత సంతోష్ (జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్)కు సమాచారమిచ్చారు. వీలైనంత త్వరగా 40మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న రామచంద్ర భారతి, బీజేపీ నేత సంతోష్ మధ్య జరిగిన ఈ చాటింగ్ వివరాలను సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్య జరిగిన చాటింగ్‌లనూ సేకరించింది. ఇదే కేసులో మరో నిందితుడు నందుకుమార్ అలియాస్ నందు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు మిగతా నిందితులు అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, సింహ యాజీ తదితరులతో జరిపిన వాట్సాప్ సంభాషణల వివరాలనూ సిట్ సేకరించింది. తెలంగాణలో టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లను నిందితులు చాటింగ్‌లలో ప్రస్తావించినట్టు పేర్కొంది. వారందరూ.. నా సర్కిల్‌కు చెందిన వారే! టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీజేపీ నేత సంతోష్‌కు మధ్య జరిగిన చాటింగ్‌లు వెల్లడిస్తున్నాయి. సిట్ నివేదికలోని వివరాల మేరకు.. ఈ ఏడాది ఏప్రిల్ 26న సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. అందులో ‘‘మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ నా సర్కిల్‌కు చెందిన వారే. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా 40 మంది వీలైనంత త్వరగా పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. వారంతా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటారు..’’ అని బీజేపీ సంతోష్‌కు రామచంద్ర భారతి వివరించారు. ఇక ఈ సంభాషణకు కొన్ని నిమిషాల ముందు 2022 ఏప్రిల్ 26న సాయంత్రం 4.47 గంటల సమయంలో బీజేపీ సంతోష్‌కు ఓ వ్యక్తి మెసేజీ పెట్టారు. ‘రామచంద్ర భారతి స్వామీజీ ఇక్కడ హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిసేందుకు వచ్చారు. మిమ్మల్ని కలిసి తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయాలు చర్చించాలనుకుంటున్నారు’’ అని అందులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజనర్సింహ! రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్యకూడా సెప్టెంబర్ 27న వాట్సాప్ సంభాషణ జరిగింది. ‘‘తెలంగాణకు సంబంధించి ఇటీవల ఓ కీలక పరిణామం జరిగింది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని సోనియాతో చర్చించే విషయంలో ఇటీవల దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ నడుమ ఓ సమావేశం జరిగింది. ఇదే జరిగితే బీజేపీకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో మూడేళ్లుగా పనిచేస్తున్న నాకు తెలిసిన ఓ బృందం ద్వారా ఈ విషయం తెలిసింది. కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కాంటాక్ట్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన దామోదరకు దళితులు, రెడ్డి సామాజికవర్గంలో బలమైన అనుచరవర్గం ఉంది. తనకు సన్నిహితంగా ఉండే ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దామోదర టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి ఆయనకు అనేక అంశాలు తెలుసు. 20కి పైగా నియోజకవర్గాల్లో దామోదర సామాజికవర్గానికి 75 వేల చొప్పున ఓట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కేసీఆర్ బృందంలోని ఓ వ్యక్తి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అమిత్‌షాను సంప్రదించారు. ఆయన బీజేపీలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు పెరుగుతాయి. మీరు వీలైనంత త్వరగా సమయమిస్తే ఈ అంశంపై చర్చిద్దాం’’ అని ఆ చాటింగ్‌లో పేర్కొన్నారు. చేరికలపై నందు వరుస సంభాషణలు సింహయాజి, అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ అనే వ్యక్తులతో నందకుమార్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14వరకు జరిపిన వాట్సాప్ సంభాషణ, మెసేజీలను కూడా సిట్ సేకరించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బావమరిదిగా చెప్తున్న అడ్వొకేట్ శ్రీనివాస్‌తో పటాన్చెరు, తాండూరు, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, సంగారెడ్డి, జహీరాబాద్, చేవెళ్ల, పరిగి, మానకొండూరు, మంచిర్యాల, పెద్దపల్లి, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిర్మల్, భద్రాచలం, నర్సంపేట, మహబూబాబాద్, చెన్నూరు, జనగామ, ఆందోల్, నారాయణఖేడ్, మహేశ్వరం, బాన్స్వాడ, నిజామాబాద్ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల పేర్లను వాట్సాప్ చాటింగ్‌లో నందు ప్రస్తావించారు. ఇక మెదక్, పెద్దపల్లి, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నల్గొండ ఎంపీ స్థానాల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. సింహయాజితో జరిగిన సంభాషణలో తన అమెరికా వీసా, ప్రతాప్‌కు, తనకు పదవి, ఇతర వ్యాపార విషయాలను నందు ప్రస్తావించారు. సింహయాజి, ప్రతాప్‌లతో జరిగిన సంభాషణలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లపైనా చర్చించారు. -
లిక్కర్ స్కాంలో ప్రభుత్వం
అలంపూర్/అలంపూర్ రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో మునిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో నిర్వహించిన బీఎస్పీ పాదయాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఈ స్కాంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లిక్కర్ ఇతర దందాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. ఇందులోని నిందితులు తమ సెల్ఫోన్లను సైతం పగలగొట్టారని, ఇలాంటి నీచమైన పనిని కరడు కట్టిన నేరస్తులు సైతం చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే బీసీల కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. -
కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రశ్నించినందుకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతిని, ఎమ్మెల్యేల దోపిడీని ప్రశ్నించినందుకే తనపై దాడి జరిగిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ధ్వజమెత్తారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల తనపై జరిగిన దాడి గురించి షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పతనం మొదలైంది.. తాను సాగిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఫ్లెక్సీలు తగలబెట్టడం, వాహనాలకు నిప్పంటించడం, ధ్వంసం చేయడం, కార్యకర్తలను కొట్టడం చేశారని షర్మిల ఆరోపించారు. ఈ మొత్తం తీరును గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. కేసీఆర్ పతనం మొదలైంది కాబట్టే దాడులు చేస్తున్నారని విమర్శించారు. తనను అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ముందే ప్రణాళిక రచించారని, అందుకే శాంతిభద్రతల సమస్యను టీఆర్ఎస్ గూండాలు, పోలీసులే సృష్టించారని షర్మిల దుయ్యబట్టారు. టీఆర్ఎస్ గూండాల దాడులను కేసీఆర్‌కు చూపేందుకే ప్రగతి భవన్‌కు పార్టీ నేతలతో కలసి బయలుదేరానని... కేసీఆర్ ఇంటికి చేరుకోకముందే పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. వాహనంలో ఉండగానే ఒక మహిళ అని చూడకుండా క్రేన్ సాయంతో తనను తీసుకెళ్లారని, అరెస్ట్ చేయడమే కాకుండా తనతోపాటు ఉన్న వారిని కొట్టారని ఆరోపించారు. తమను రిమాండ్‌కు తరలించేందుకు విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. తాలిబన్ల నాయకుడిగా కేసీఆర్.. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యం కాదని దుయ్యబట్టారు. తెలంగాణ అఫ్గానిస్తాన్‌గా మారిందని, కేసీఆర్ తాలిబన్ల నాయకుడిగా మారారని షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకుందని, కవిత లిక్కర్ స్కాంలో, కేటీఆర్ బినామీల పేరుతో రూ. లక్షల కోట్లు సంపాదించారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం, ప్రగతిభవన్‌పై దాడులు చేస్తే రూ. లక్షల కోట్లు బయటపడతాయన్నారు. దాడులు జరిగాక కూడా, టీఆర్ఎస్ నేతలు వరుస ప్రెస్మీట్లు పెట్టి తనను బెదిరిస్తున్నారని, బయట అడుగుపెట్టనీయబోమని, దాడులు జరిగితే వారికి సంబంధం లేదని హెచ్చరిస్తున్నారన్నారు. కేటీఆర్ భార్య ఆంధ్ర నుంచేగా.. ‘నన్ను ఆంధ్రా పెత్తనం ఏమిటని అంటున్నారు. మరి మంత్రి కేటీఆర్ భార్య ఆంధ్రా నుంచి రాలేదా? ఇక్కడ బతకడం లేదా? కేటీఆర్ భార్యను మీరు గౌరవించుకున్నప్పుడు, నన్ను ఎందుకు గౌరవించరు? నేను ఇక్కడ (తెలంగాణలో) పెరిగిన దాన్ని. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా. ఇక్కడే పెరిగా. అబిడ్స్‌లో స్కూలు, మెహిదీపట్నంలో కాలేజీకి వెళ్లి చదువుకున్నా. ఇక్కడే పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం నా హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా’అని షర్మిల అన్నారు. ముమ్మాటికీ తాను తెలంగాణ బిడ్డనేనని, పునరుద్ఘాటించారు. -
అప్పుడు సింహయాజీని కలిసిన కోదండరాం.. భేటీపై ఏమన్నారంటే?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు సంబంధాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్తలపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆరు నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవమే. ఆయనను కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కలిశాను. తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని, సింహయాజీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్న విషయం అప్పట్లో తెలియదని కోదండరాం స్పష్టం చేశారు. ఇక, వీరి భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరామ్ వెల్లడించారు. -
కిషన్‌రెడ్డికి మంత్రి హరీష్ సవాల్..
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మరోసారి బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి.. మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు సిద్దమంటూ ఓపెన్ సవాల్ చేశారు. కాగా, మంత్రి హరీష్.. గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈనెల 7వ తేదీన సీఎం కేసీఆర్ జగిత్యాలలో నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ భవనం, పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడి టీఆర్ఎస్ తలపెట్టిన సభ ఏర్పాట్లను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. పన్నుల్లో 42 శాతం కాదు.. కేవలం 29.6 శాతం మాత్రమే ఇస్తోంది. కేంద్ర బడ్జెట్ కోసం దొడ్డిదారిన సెస్‌ల రూపంలో కేంద్రం వేలకోట్లు వసూలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్లో 20 శాతం సెస్‌ల రూపంలోనే వస్తోంది. మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇస్తున్నామని అంటున్నారు. కానీ, 29.6 శాతమే ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు నావద్ద ఉన్నాయి. దీనిపై చర్చకు కిషన్‌రెడ్డి సిద్దమా అంటూ ఓపెన్ సవాల్ విసిరారు. 42 శాతం నిధుల పేరుతో కేంద్రం.. రాష్ట్రాల్లోని పలు పథకాలను రద్దు చేసిందన్నారు. దీని వల్ల తెలంగాణ వేల కోట్లు నష్టపోయిందని తెలిపారు. బండి సంజయ్ కూడా తలాతోక లేకుండా మాట్లాడాతారు. 8 ఏళ్ల కాలంలో కేంద్రం కోటి కోట్ల అప్పు చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, నిరుద్యోగులను మోసం, కాంట్రాక్ట్ పద్దతిలో కొందరికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. -
కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. షర్మిల అరెస్టును బీజేపీ నేతలు ఖండించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న ‘తామరపువ్వులు’’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. దీనికి వైఎస్ షర్మిల సైతం కవితాత్మకంగా స్పందించారు. ‘పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కాని పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవలేదు’అని తిరుగు సమాధానం ఇచ్చారు. ‘అమ్మా.. కమల బాణం, ఇది మా తెలంగాణం, పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజాగణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు, నేడు తెలంగాణ రూటు, మీరు కమలం కోవర్టు, ఆరెంజ్ ప్యారెట్టు. మీలాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను, రాజ్యం వచ్చాకే రాలేదు నేను, ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ’కవిత’ను’అంటూ ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు. నేడు రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలవనున్నారు. 2 రోజులుగా టీఆర్ఎస్ వర్గాల దాడుల నేపథ్యంలో షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
లిక్కర్ స్కామ్‌లో భారీ ట్విస్ట్.. ఫోన్లు మార్చి లావాదేవీలు చేసిన ఎమ్మెల్సీ కవిత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. రాష్ట్ర పాలిటిక్స్‌లో లిక్కర్ స్కామ్ ప్రకంపలు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపించడం టీఆర్ఎస్ను టెన్షన్‌కు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ.. ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. రిమాండ్‌లో అమిత్ ఆరోరా కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిపింది. లిక్కర్ పాలసీలో పెంచిన 12 శాతం కమీషన్‌ను ఆప్ ప్రభుత్వానికి అప్పచెప్పేందుకు లావాదేవీలు జరిపినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. కాగా, సౌత్ గ్రూప్‌పేరుతో సిండికేట్‌గా మారి రూ. 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పారని ఈడీ ఆరోపించింది. పలు ఫోన్లను మార్చి లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఇక, ఆయా వ్యక్తుల ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్నది. దీంతో, ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది.