![MP Laxman Takes On KCR BRS Party - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/laxman.jpg.webp?itok=f4KoTKu9)
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక, బీఆర్‌ఎస్ అంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే బీఆర్‌ఎస్ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లించి పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులును పక్కదారి పట్టించారని ఆరోపించారు లక్ష్మణ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment