KCR BRS Party
-
కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. -
నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది
-
అరెస్టులకు భయపడేది లేదు: KCR
-
TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
మెదక్‌లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి బుధవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరు. మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. మెదక్‌లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుంది. కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైలులో ఉన్నారు. బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారు. శంషాబాద్‌లో ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తాం. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
BRS Party: చేవెళ్లలో తొలి బహిరంగ సభ.. ఎంపీ ఎన్నికల్లో ఇదే వ్యూహం
సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలను తరలించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్కు తిరుగుండదని నిరూపించాలని చూస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం రావాంటే ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరని భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. తెరపైకి బీసీ నినాదం చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీసీ వాదానికి తెరతీసింది. అందరికంటే ముందుగా సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం.. ప్రచారంలో భాగంగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది.అయితే అనూహ్య పరిణామాల మధ్య పోటీ నుంచి రంజిత్‌రెడ్డి తప్పుకోవడంతో మరో అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా వారు పోటీకి ససేమిరా అనడంతో చివరకు జిల్లాకు సుపరిచితుడు బీసీ ఉద్యమ నేత, రంగారెడ్డి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్ఎస్ అధినేత చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ పోటీలోనే ఉండదు.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ అని అందరు భావించిన తరుణంలో కాసానిని అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ ట్రయాంగిల్‌గా మారిందనే చర్చ మొదలైంది. కాసానికి జిల్లాతో ఉన్న అనుబంధం, ఆయనకు ఉన్న పరిచయాలు, బీసీ ఉద్యమంలో ఆయన పాత్ర తదితర అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో అదనపు బలంగా మారాయి. అనుకున్న స్థాయిలో బీసీ వాదాన్ని తట్టి లేపగలిగితే ఆయనకు గెలుపు అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. -
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ 2.నాగర్‌కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, 3. మెదక్: వెంకట్రామిరెడ్డి, 4. మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి, 5. కరీంనగర్: వినోద్ కుమార్, 6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, 7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్, 8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు, 9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 10.మహబూబాబాద్ : మాలోత్ కవిత, 11. మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి, 12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు, 13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, 14. వరంగల్ : కడియం కావ్య 15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 16. భువనగిరి - క్యామ మల్లేశ్ 17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి -
రసవత్తరంగా మారనున్న లష్కర్ పోరు
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే. గెలుస్తాం: కేసీఆర్ ధీమా పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు. ఐదింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు. త్వరలోనే ప్రచారంలోకి.. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. -
Medak Lok Sabha: మెదక్ నుంచి కేసీఆరే!
గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు జహీరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్‌రెడ్డి రేసులో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్‌ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్‌కు కూడా ఎంపీ టికెట్ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్ మాత్రం వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం? ఈ మెదక్ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. -
విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సాక్షి,నారాయణపేట: మక్తల్‌లో కృష్ణా నది వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నారాయణపేటకు బయలుదేరే ముందు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీకి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. పదేళ్ళలో కేంద్రం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ‘గతంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ చేయబోయేది ఏమీ లేదు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం. కంటి వైద్యం కోసమో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసమో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు ఉంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ప్రసక్తే లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తప్ప రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్రలు క్లస్టర్ల వారిగా ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. హస్తినలో సీఎం రేవంత్ -
మామా అల్లుళ్లు రాష్ట్రాన్ని చెదలు పట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్ట్‌ల పేరుతో దోచుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారు. రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారమని అప్పుడే నిపుణులు చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది. 14 పేజీలతో రిటైర్డ్ ఇంజినీర్లు ఈ నివేదిక ఇచ్చారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. మేడిగడ్డ వద్దే ప్రాజెక్ట్‌లు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజానీకానికి కళంకంగా మారింది. దోచుకోవాలని దాచుకోవాలనే ఆలోచనతోనే మేడిగడ్డ కట్టారు కూలిన ప్రాజెక్ట్‌ను చూసి మీరు సిగ్గుపడాలి. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తుంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది కూడా మేమే. తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు, కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లు నియమించుకున్న ఇంజినీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్ట్ కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు. మేడిగడ్డ మేడిపండేనా సాక్షిలో కథనం కూడా వచ్చింది. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. కాళేశ్వరంతో చేవేల్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. నేడు ఇదే సభలో హరీష్ అబద్దాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సెలైంట్‌గా చూస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు సాగు నీటి మంత్రిగా కొనసాగి.. ఆ తరువాత హరీష్‌ను ఎందుకు బర్తరఫ్ చేశారు. విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ విమర్శలు చేశారు. -
ఇక నుంచి పాత కేసీఆర్ మెప్పిస్తాడా?
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నుంచి దిగిపోయాక తొలిసారి నల్గొండ నుంచి పోరాట శంఖం పూరించారు. ఆయన చెప్పిన విషయాలతో మనం ఏకీభవించవచ్చు. విబేధించవచ్చు. కాని ఒక విషయం మాత్రం అంగీకరించక తప్పదు. ప్రసంగం చేయడంలో, ప్రజలను ఆలోచింపచేయడంలో, అవసరమైతే రెచ్చగొట్టడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువు చేసుకున్నారు. తాను పులినంటూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారిని దద్దమ్మలు, చేతకాని చవటలు అంటూ విరుచుకుపడ్డారు. తన హయాంలో జరిగిన కొన్ని అభివృద్ది పనులు వివరించారు. కరెంటు సరఫరా గురించి ప్రస్తావించారు. మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వెళ్లడంపై కూడా స్పందించారు. కాగా ఈ ప్రసంగంలో ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా ఆయన ఉచ్చరించకపోవడం గమనించదగిన అంశం. రేవంత్ బహుశా తన స్థాయి కాని వ్యక్తి అని అనుకుని ఉండవచ్చు. లేదా అనవసర ప్రాధాన్యత ఎందుకు అని భావించి ఉండవచ్చు. కృష్ణా నదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్‌కు అప్పగించడానికి వీల్లేదంటూ కేసీఆర్ నల్గొండలో భారీ సభను నిర్వహించారు. సహజంగానే కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆయన వాయిస్ ఏ రకంగా ఉంటుంది? ఎంత పదునైన భాష వాడతారు అన్న ఆసక్తి నెలకొంది. ఆ విషయంలో ఎవరి అంచనాలను ఆయన తగ్గించలేదు. తన శైలిలో ఉచ్ఛస్వరంతో ఆయన మాట్లాడుతుంటే సబికులంతా శ్రద్దగా విన్నారు. ఆయా సందర్భాలలో చప్పట్లు కొట్టారు. మరో పోరాటానికి ప్రజలు సిద్దపడాలని, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలోని జిల్లాల వారంతా అప్రమత్తం అవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. కృష్ణా నది జలాలలో ఏభై శాతం వాటాను పొందకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారాదన్న డిమాండ్ పేరుతో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభను గమనిస్తే ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు విబి రాజు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డలపై ఒక నానుడి వ్యాప్తిలో ఉండేది. వీబీ రాజు మంత్రిగా ఉంటే సమస్య, చెన్నారెడ్డి మంత్రివర్గం బయట ఉంటే సమస్య అన్నది ఆ నానుడి. అంటే చెన్నారెడ్డి మంత్రిగా లేకపోతే ఏదో ఒక ఉద్యమం తీసుకు వస్తారన్నది అప్పట్లో అందరి భావన. దానికి తగినట్లుగానే ఆయా సందర్భాలలో మంత్రిగా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండేవారు. ఉదాహరణకు 1969లో ఆరంభమైన తెలంగాణ ఉద్యమంలో తొలుత ఆయన ప్రమేయం ఏమి లేదు. కాని అప్పట్లో ఆయన ప్రభుత్వంలో లేరు. దాంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాన వేసుకుని మొత్తం ఈ ప్రాంతం అంతటా తన ప్రభావాన్ని చూపించారు. తదుపరి తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార్టీని పెట్టి పది లోక్ సభ స్థానాలను గెలిచి సంచలనం సృష్టించారు. తదుపరి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వేరే కథ. ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంతో ప్రభుత్వాన్ని నడిపారన్నది ఎక్కువ మంది భావన. కానీ.. ప్రతిపక్షంలోకి రాగానే తిరిగి ఉద్యమకారుడి అవతారం ఎత్తగలిగారు. గత ఎన్నికల సమయంలో వివిద ప్రచార సభలలో కేసీఆర్ స్పీచ్ లలో ఉత్తేజం పెద్దగా కనిపించేది కాదు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారన్నట్లుగా అనిపించేది. నల్గొండ సభలో ఆయనలో పాత కేసీఆర్ కనిపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఏ తరహాలో ఉపన్యాసాలు ఇచ్చేవారో, దాదాపు అదే స్టైల్లోకి వచ్చారనిపిస్తుంది. తెలంగాణ యాస,భాషతో పాటు, దద్దమ్మలు, చవటలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిపై ద్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరు కావడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కాని నల్గొండలో పోరాట సభ పెట్టి ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ప్రజలను రెచ్చగొట్డానికి కేసీఆర్ ఈ సభను వాడుకున్నారన్న విమర్శలు వస్తే రావచ్చు. కాని ఆయన మళ్లీ ప్రజా జీవనంలో బాగా చురుకుగా ఉండబోతున్నారనిపించింది. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్లో ఒక ఆత్మ విశ్వాసం పెంచగలిగారు. కేసీఆర్‌కు జనంలో ఆదరణ తగ్గలేదన్న నిరూపించుకునే యత్నం చేశారు. తాను తెలంగాణ కోసమే పనిచేస్తానని చెప్పడానికి ఈ సభను వాడుకున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులందరూ చేసిన విమర్శలకు ఒకేసారి జవాబు ఇచ్చారనిపిస్తుంది. కోమటిరెడ్డి రైతు బందు రాలేదని అన్నవారిని చెప్పుతో కొడతానన్న వ్యాఖ్యను ఆయన ప్రస్తావించి రైతుల వద్ద ఇంకా గట్టి చెప్పులు ఉంటాయని హెచ్చరించారు. తాను విద్యుత్ సరఫరా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని 24 గంటలు ఇస్తూ, కాంగ్రెస్ రాగానే కోతలు మొదలయ్యాయని అంటూ అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.నిజంగానే గతంలో ఎప్పుడూ శాసనసభలో ఇలా ప్రత్యేకంగా బయటనుంచి తెప్పించి జనరేటర్ పెట్టలేదు. ఎప్పుడైనా కరెంటు పోయినా వెంటనే వచ్చేది. ఈ పాయింట్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే. దానిని కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆయన నిలదీశారు. కృష్ణా జలాల వాటాపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయా అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పులి మళ్లీ వచ్చిందన్న చందంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కట్టెకాలేవరకు పులిలా పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆందోళలనలకు అనుమతి ఇవ్వడానికి అంతగా ఇష్టపడని కేసీఆర్, ధర్నా చౌక్ ను కూడా అనుమతించని కేసీఆర్ ,ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాడే హక్కు ఉంటుందని చెప్పడం విశేషం. తనకు ,తన ప్రభుత్వానికి ఒక మచ్చగా మారిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనను ఆయన తక్కువ చేసి చూపించే యత్నం చేశారు. రేవంత్ నాయకత్వంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ప్రదేశాన్ని చూడడానికి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆయన తప్పుపడుతూ , ఏమిటి వారు చూసేది. బొందలగడ్డ అంటూ వ్యాఖ్యానించారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుంగలేదా? కడెం ప్రాజెకట్టు గేట్లు తగలేదా? మూసి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా?అంటూ అది పెద్ద విషయం కాదన్నట్లుగా సమాదానం ఇచ్చారు. గోదావరి లో నీరు ఉన్నా,ఎత్తిపోయకుండా రైతులను ఎండగడుతున్నారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంలు మేడిగడ్డపై చేస్తున్న విమర్శలకు కేసీఆర్ సూటిగా సమాదానం చెప్పినట్లు అనిపించలేదు. తాము తిరిగి డబుల్ స్పీచ్ లో తిరిగి అధికారంలో వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని అవకాశాలను కేసీఆర్ వాడుకున్నారు. ఎన్నికల కోసం ఈ సభ పెట్టలేదంటూనే కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాదించడం కోసం ఎజెండాను సెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గత శాసనసభ ఎన్నికలలో దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం ,మహబూబ్ నగర్ జిల్లాలలో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్న నేపధ్యంలో నల్గొండ నుంచే ఈ సభను నిర్వహించడం విశేషం. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఆయన నాందీ ప్రస్తావన పలికారనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఆయనకు పరీక్షే. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఎంత యాక్టివ్ గా పనిచేసినా, కేసీఆర్ రంగంలో దిగితే ఉండే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూపించడానికి ఈ సభను ఆయన విజయవంతంగా వాడుకున్నారు. కాకపోతే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇదంతా రాజకీయం కోసమే అని జనం అనుకుంటే మాత్రం కొంత నష్టం జరగవచ్చు. తెలంగాణ సాధనకోసం పలువ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ ఈ విషయాలు తెలియనివి కావు. అయినా తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లడమే ఆయన శైలి. ఈ సభతో బీఆర్ఎస్ క్యాడర్ లో విశ్వాసం ఎంత మేర పునరుద్దరణ అయింది తెలుసుకోవడానికి పార్లమెంటు ఎన్నికలే గీటు రాయి అవుతాయని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్
-
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు: కేసీఆర్
KCR Nalgonda Public Meeting Updates నల్గొండ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్ ఇది ఉద్యమ సభ, పోరాట సభ ఇది రాజకీయ సభ కాదు నీళ్లు లేకపోతే మనకు బతుకులేదు పక్షిలా తీరుక్కుంటూ రాష్ట్ర మొత్తానికి చెబుతూనే ఉన్నా నీరు లేకపోతే తెలంగాణ లేదు ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పరిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఉద్యమించకపోతే మనల్ని రక్షించేందుకు ఎవరూ రారు నల్లగొండ సభ తెలంగాణ వ్యతిరేకులకు ఓ హెచ్చరిక నిమిషం కూడా కరెంట్ పోకుండా మనం సప్లయ్ చేశాం పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అని ఇప్పటి పాలకులు అంటున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టేకాలే వరకు పులిలా కొట్లాడుతా పిల్లిలాగా సైలెంట్‌గా ఉండను అవసరమైతే పిడికిలి బిగించాలి కేసీఆర్ సర్కారు పోగానే కరెంటు ఎటు పోయింది చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది అదనపు కరెంట్ ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడంలేదు మీకు తెలివిలేక, నడపరాక, చేతకాక కరెంట్ పోతోంది 3 కోట్ల టన్నుల వడ్డు పండించిన తెలంగాణకు ఏం బీమారి వచ్చింది రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయ కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులను ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట మేడిగడ్డ పోయి ఏం పీకుతారు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలి నాగార్జున సాగర్కుంగలేదా? కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా? అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా తేలేవరకూ కొట్లాడాలి నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు..హక్కుల మీద పోరాటానికి సిద్ధంగా లేకపోతే నష్టపోతాం కరెంట్ ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు.. ఫోన్లు మోగడంలేదు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదు మీరేం బాధపడకండి, మళ్లీ మనమే వస్తాం కృష్ణా, గోదావరి జలాల్లో సంపూర్ణమైన వాటావచ్చే వరకూ పోరాడుతాం నల్గొండలో బీఆర్ బహిరంగ సభ సభా ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ► నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. ఎన్ఎస్యూఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాక్షి, నల్గొండ: కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Budget Session.. అప్డేట్స్.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా కేసీఆర్ తెలంగాణకు తీరని నష్టం చేశారు: ఉత్తమ్ పదేళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారు రేపు కాళేశ్వరం సందర్శనకు అందరినీ ఆహ్వానిస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ చిట్‌చాట్ ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు ఉత్తమ్ మాటలు మాకేం అర్థం కావడం లేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది. ఆనాడు పదవులు కోసం పెదవులు మూసుకుంది: హరీష్‌రావు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి చెప్పి వచ్చి ఇక్కడ తంటాడు పడుతున్నారు పోతిరెడ్డిపాడుపై పేగులు తెగేదాకి కొట్లాడింది మేం అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించొద్దు రాష్ట్రానికి కృష్ణా జలాల కంటే ఎక్కువ మరేముంది: మల్లు భట్టి విక్రమార్క కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్సర్కార్ అనేక తప్పులు చేసింది గత సర్కారు తప్పులను సరిచేయడానికి ఉత్తమ్ నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్‌పై రేవంత్ సీరియస్ కేసీఆర్ సభకు రావాలి. పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం. కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు?. కేసీఆర్ సభ రాకుండా ఫాంహౌస్‌లో దాక్కున్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలి. హరీష్ కామెంట్స్.. కాంగ్రెస్ ప్రాజెక్ట్‌లను అప్పగించేందుకు ఒప్పుకుంది. సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేవంత్ కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి ఎందుకొచ్చారు?. వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. అధికారులను బద్నాం చేసుకుంటూ ఎన్ని రోజులు తప్పించుకుంటారు. ►తెలంగాణ శాసన మండలి ఈనెల 14కు వాయిదా ఉత్తమ్ కామెంట్స్.. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోంది. ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు కోమటిరెడ్డి కామెంట్స్.. దక్షిణ తెలంగాణను నాశనం చేశారు. నల్లగొండవాసులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. నల్లగొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్లగొండకు రావాలి. హరీష్‌రావు కామెంట్స్.. నల్లగొండలో సభ పెట్టినందునే ప్రభుత్వం తీర్మానం పెట్టింది. ఇది బీఆర్ఎస్ విజయం మాకు ప్రజెంటేషన్ అవకాశం ఎందుకు ఇవ్వలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ శాసనసభలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా జలాలు తరలించే ప్రసక్తే లేదు. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ, బీఆర్ఎస్ వచ్చాన కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే.. ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గింది.. డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీంసీలే క్లేయిమ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం కావాలని మాట్లాడుతున్నారు. అంతా చేసి నల్లగొండలో సభ పెడితే ఏం లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీరియస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలపై మాట్లాడలేదు.. గోదావరి జలాలపై మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ షాకింగ్ కామెంట్స్ కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలి. కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం. నల్లగొండ జిల్లాకు కేసీఆర్, జగదీష్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీవేడీ చర్చ కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీలో రెండు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. సభలో సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ అయితే, సభలో తమకూ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్ ఇక, ప్రజెంటేషన్ కాపీలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. ►చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►విద్యుత్, ఫారెస్ట్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ►అలాగే, దివంగత నేతలు మచిందర్ రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సంతాపం తెలపనుంది. ►బడ్జెట్‌పైచర్చ-సమాధానం ఇవ్వనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ►అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ►మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టుపై సభలో ప్రకటన చేయనుంది. ►ఇక, టొబాకో అండ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ►2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్‌పై ప్రకటన ►మరోవైపు కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ►కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. -
సీఎం ఇలా మాట్లాడటం సిగ్గుచేటు.. డిఫెన్స్‌లో రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై సందేహాలు వస్తున్నాయి. ఆయన తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చేది చెప్పడానికి వ్యాఖ్యలు చేశారు.నిజానికి ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వాన్ని అయినా కుట్రపూరితంగా పడగొడితే తప్పే అవుతుంది. రేవంత్ కు సహజంగానే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఇప్పటికి్ప్పుడు రేవంత్ సీటుకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు కాని, ఆయన ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని ప్రజలు ఉరికించి కొడతారని ,వేపచెట్టుకు కట్టేసి వారి లాగులలో తొండలు వదలుతారని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా కాంగ్రెస్ నేతలకే ఈ హెచ్చరిక చేశారేమో అన్న భావన కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అవుతుంది. ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగితే ఏమి అవుతుంది. బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎంఐఎం మద్దతు ఇచ్చినా అది సరిపోదు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది కాని, బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. అంతేకాక పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వదిలే అవకాశం ఎప్పుడు వస్తుంది? పార్టీలో గ్రూపుల గొడవ పెరిగి, ముఖ్యమంత్రి రేసులోకి ఎవరైనా గట్టి కంటెండర్ వస్తే అప్పుడు జరిగితే జరగవచ్చు. అది కూడా పార్టీ మారకుండా తమకు నచ్చిన కాంగ్రెస్ నేతకు సపోర్టు చేస్తారు. అంతే తప్ప పార్టీ మారరు. అయినా రేవంత్ కు ఎందుకు అనుమానం వచ్చింది? ఇందులో రెండు లక్ష్యాలు ఉండవచ్యు. ఒకటి బీఆర్ఎస్ తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పడం ద్వారా ప్రజలలో సానుభూతి పొందడం, ఇంకొకటి తన సీటుకు ఎవరైనా కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తే వారి సంగగతి చూడవలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించడం కావచ్చు. విశేషం ఏమిటంటే ఇంద్రవెల్లి సభలో ఆయనతో పాటు సీఎం.. సీటు ఆశించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అక్కడే మరో కొందరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క తదితరులు ఉన్నా వారు ధ్రెట్ కారన్న సంగతి తెలిసిందే. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజార్టీ రాగానే మల్లు భట్టి తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే ఆయా సందర్భాలలో తనకు పీసీసీ నాయకత్వం అప్పగించాలని కోరుతుండేవారు. మరో మంత్రి ,పీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశించారు. వీరు భవిష్యత్తులో సీఎం పదవికి పోటీ పడరని అనుకోలేం. తమ సొంత గ్రూపులు కట్టరని భావించలేం. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రేవంత్ వెనుకే ఉన్నారు. భవష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారు మంత్రి కావాలని కోరుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో 65 సీట్లే వచ్చాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కన్నా కేవలం ఐదు మాత్రమే అధికం అన్నమాట. అందుకే బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాట కూడా వారు అని ఉండాల్సింది కాదు. దీనిని ఆసరాగా చేసుకుని రేవంత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊళ్లలో ఉరికించి కొడతారని, వేపచెట్టుకు కోదండం వేయించి లాగులలో తొండలను వదలుతారని హెచ్చరించారు. మూతి పళ్లు రాలతాయని, తొక్కుతామని ..ఇలా ఏవేవో మాట్లాడారు. అంత సీరియస్ గా మాట్లాడవలసిన అవసరం లేదు. ఏదో పాసింగ్ రిమార్కు అయితే ఫర్వాలేదు కాని, దానిపై నొక్కి వక్కాణించడం అంటే బహుశా ప్రజల దృష్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కాకుండా ప్రభుత్వం కూల్చివేతపై వచ్చే వదంతుల మీద పడాలని కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే స్తోమత ఉండకపోవచ్చు. బీజేపీ, ఎంఐఎం లతో కలిసి పడవేయాలనుకుంటే అప్పుడు ఈ మూడు పక్షాలకు కలిపి ఏభై సాలుగు సీట్లు అవుతాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక ఆరుగురిని లాగితే అప్పుడు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. కాని బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం. లు సహకరించుకునే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ కు ఉపయోగంగా ఉంటుంది. ఈ లోగా రేవంత్ రెడ్డి కనుక కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే ఆ కధ వేరుగా ఉంటుంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడం చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రిని అభివృద్ది పనుల కోసమే కలిస్తే తప్పు లేదు. అదే టైమ్ లో వదంతులు రాకుండా చూసుకోవాలి. ఒకరకంగా ఇది చెలగాట రాజకీయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాడానికి అన్ని వ్యూహాలు వేస్తుంది. అదే టైమ్ లో బీఆర్ఎస్ కు తన ఉనికిని పరిరక్షించుకోవడమే పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ నేపద్యంలో కాంగ్రెస్ లో గ్రూపులు బలపడకుండా చూసుకోవడమే రేవంత్ ముందు ఉన్న సవాలు అని చెప్పవచ్చు. కనుక ఆయన కేసీఆర్ పేరుతో విమర్శలు చేసినా, అదంతా కాంగ్రెస్ లో సీఎం సీటుకు పోటీపడేవారిని ఉద్దేశించే అయి ఉండవచ్చన్న సందేహం వస్తుంది.దేశంలో అనేక ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాని అక్కడ ఎవరూ ఎమ్మెల్యేలను చెట్టకు కట్టేసిన దాఖలాలు లేవు. అంతదాకా ఎందుకు రేవంత్ కు గురువైన చంద్రబాబు నాయుడు తన మామ ఎన్ టి రామారావును సీఎం సీటులోనుంచి లాగిపడేశారు. అయినా అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను ఎవరూ చెట్టుకు కట్టేయలేదు. తొండలు వదల లేదు. గత టరమ్ లో కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ కూటమి పడిపోయింది. మద్యప్రదేశ్ లో కమలనాద్ ప్రభుత్వం కూలిపోయింది. రాజకీయాలలో ఏవైనా జరగవచ్చు. 1984లో ఎన్.టి.ఆర్. ను నాదెండ్ల బాస్కరరావు పడకొట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రజా ఉద్యమం వచ్చిన మాట నిజమే కాని, దానివల్ల ప్రభుత్వం పునరుద్దరణ కాలేదు. ఎన్ టి రామారావు మెజార్టీ ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం వల్లే అని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వైపు ప్రభుత్వం ఏర్పడుతుంది. రేవంత్ ఈ సందర్భంగా మాట్లాడిన భాష మాత్రం సహేతుకంగా లేదని చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరుష పదజాలం వాడినా నడిచిపోయింది. కాని ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోకూడదు. మూతి పళ్లు రాలతాయి.. కిందపడేసి తొక్కుతాం, లాగులలో తొండలు వేస్తారు.. ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆయన పదవికి అంత హుందానివ్వదు.కేసీఆర్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణ చేయడం ఆరంబించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికే రేవంత్ ప్రాదాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్ నిర్వహించడం ఏమిటని కొందరు సన్నాసులు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇంద్రవెల్లి కాల్పులు జరిగి పలువురు మరణించారు. ఆ తర్వాత స్థూపం కట్టుకోవడం కూడా కష్టమైంది.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ నివాళి అర్పిస్తోందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఇదంతా సమైక్య రాష్ట్ర పాలకుల తప్పు అని,సోనియాగాందీ ఆ తప్పును సరిచేయడానికి తెలంగాణ ఇచ్చారని కొత్త లాజిక్ తెచ్చారు. అలాగే ప్రముఖ గాయకుడు, మాజీ నక్సలైట్ నేత గద్దర్ పేర సినిమా అవార్డులు ఇస్తామని,నంది బదులు గద్దర్ పేరు పెడతామని కూడా రేవంత్ ప్రకటించారు. ఇవన్ని చూస్తుంటే నక్సల్స్ కు సంబందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం అనుసరిస్తున్న విదానాన్ని రేవంత్ తప్పు పడుతున్నట్లుగా ఉంది. నక్సల్స్ పోరాటాలను తెలంగాణ కాంగ్రెస్ సమర్ధిస్తుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనా ఒక క్లారిటీ లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారేమో అన్న అబిప్రాయానికి తావిస్తున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చించన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తానాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు. చదవండి: TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం -
పొలిటికల్ హీట్.. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటున్నారు’
సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఇక, తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఏదైనా జరగొచ్చు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్ భారీగా డబ్బులు ఇచ్చారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ. భద్రాద్రి ఆలయానికి వచ్చి తలంబ్రాలు తీసుకురాలేనోళ్లు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు?. తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారే. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అధిక నిధులు వస్తాయి’ అని కామెంట్స్ చేశారు. -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కేసీఆర్ సరే.. మీ సంగతేంటి చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఒక వ్యాఖ్య చేశారు. తుపాను బాధితులను పరామర్శ పేరుతో సాగించిన రాజకీయ పర్యటనలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, విర్రవీగితే తెలంగాణలో ఏం జరిగిందో చూశామని అన్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, తన కేసును ప్రస్తావిస్తూ, తను సాంకేతికంగా, చట్టపరంగా దొరకనని చెప్పారు. తప్పు చేయకపోయినా ఏభై రెండు రోజులు జైలులో ఉంచారని ఆయన తెలిపారు. తన కోసం ప్రపంచం అంతా పోరాడిందని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? మీరు ప్రశ్నించినా కేసులు పెడతారని ఆయన అన్నారు. అలాగే, జనసేన-టీడీపీ పొత్తు, వచ్చే ఎన్నికలలో ప్రభావం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగడం వల్లే ఓటమి చెందారని నమ్ముతున్నారా? అదే నిజమైతే తాను 2004లోనూ, అలాగే 2019లోనూ ఓడిపోవడానికి కారణం విర్రవీగడమేనని ఒప్పుకుంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అనుసరించిన విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టోకరా వేసిన తీరు, ఆయన వ్యవహార శైలికి నిరసనగానే టీడీపీని ఓడించారు. అందుకే ఆ పార్టీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విషయంలో మరీ అంత విమర్శలు లేవు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అభివృద్ది చేయడం కూడా గమనించిన ప్రజలు ఈ ప్రాంతంలో అన్ని సీట్లను బీఆర్ఎస్కు కట్టబెట్టారు. తెలంగాణ శాసనసభలో 119 సీట్లకు గాను, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. ఏపీలో 175 సీట్లకు గాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి కేవలం 23 స్థానాలే దక్కాయి. దీని గురించి ఏమంటారు!. అదే సమయంలో కేసీఆర్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ కూడా ఉన్న మాటనిజమే. ఇది ఎవరి విషయంలో అయినా వర్తిస్తుంది. ఆ సంగతి మర్చిపోయి, తానేదో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు.. తనను ఓడించింది విర్రవీగినందువల్ల కాదనట్లు మాట్లాడడమే ప్రత్యేకత. చంద్రబాబు ఏ అంశంలో అయినా ద్వంద్వ ప్రమాణాలు పాటించగల నేర్పరి. అలాగే కేసీఆర్ విషయంలోకూడా చేశారు. మొన్నటివరకు కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెబుతుండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఏదైనా విమర్శ చేయదలిస్తే తెలంగాణ పాలనను అప్పుడప్పుడు పొగుడుతుండేవారు. ఇదే చంద్రబాబు 2014లో కేసీఆర్‌కు అసలు పాలన గురించి ఏం తెలుసని ప్రశ్నించేవారు. ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ దెబ్బకు భయపడి చెప్పాపెట్టకుండా పెట్టే బేడా సర్దుకుని చంద్రబాబు విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేయడం అంటేనే గజగజలాడేవారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తుపెట్టుకున్నప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేసినా, టీఆర్ఎస్ గెలిచేసరికి మళ్లీ మౌనంలోకి వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ గురించి కూడా అంతే. మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించేవారు. ఆయన 2019లో తిరిగి అధికారం చేపట్టడంతో మళ్లీ పొగడటం ఆరంభించారు. ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారంటే ఆయన ఓడిపోయారులే అన్న భావన తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ విర్రవీగారని అనడం ద్వారా చంద్రబాబు మరో సంగతి స్పష్టం చేశారని వెల్లడైందన్న విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిందన్న సంగతి తేటతెల్లమైందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని కూడా పరుష పదజాలంతో చంద్రబాబు దూషించేవారు. తదుపరి వారితో పొత్తుపెట్టుకున్నారు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేశారు. కనుక చంద్రబాబు.. ఎప్పుడు ఏదీ ప్రస్తుతమో అదే చేస్తుంటారు. ఈరోజు నాకేంటి అని తప్ప ఇంకొకటి ఆలోచించరని ఆయనను బాగా దగ్గరగా చూసిన ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అంతే చేశారు. తన కేసు గురించి కూడా ప్రస్తావించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్న వ్యాఖ్యలు వచ్చాయి. తాను తప్పు చేయకపోయినా జైలులో పెట్టారని అంటున్నారు. నిజంగానే తప్పు జరగకపోతే తన మాజీ పీఎస్‌ను అమెరికా పారిపోయేలా ఎందుకు చేశారు?. 17ఏ కింద కేసును కొట్టివేయాలని అంటున్నారే తప్ప, నిధుల దుర్వినియోగం చేయలేదని ఎందుకు వాదించలేకపోతున్నారు. ఇదే కేసులో ఈడీ నలుగురు వ్యక్తులను ఎలా అరెస్టు చేసింది? ఈ ప్రశ్నలకు ఎన్నడూ సమాధానం ఇవ్వడం లేదు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఈ మధ్య ఎస్ఐ పరీక్షలకు సంబంధించి కొందరు అభ్యర్ధులు తమ ఎత్తు విషయమై హైకోర్టుకు వెళ్లారు. గౌరవ న్యాయమూర్తులు స్వయంగా వారి ఎత్తును కొలిపించి తీర్పు ఇచ్చారు. మరి అదే చంద్రబాబు కేసులో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆయనకు గుండె జబ్బు, తదితర వ్యాధులు ఉన్నాయని నిర్దారణకు వచ్చి బెయిల్ ఇచ్చేసింది. ప్రైవేటు ఆస్పత్రి రిపోర్టును మరో ప్రముఖ ప్రభుత్వ సంస్థకు పంపి వారి అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ఎవరికైనా సందేహం వస్తే ఏం చెబుతాం?. తీరా బెయిల్ వచ్చాక, ఇప్పుడు చంద్రబాబు తనకు ఎలాంటి గుండె జబ్బు లేదన్నట్లుగా శుభ్రంగా తిరుగుతున్నారే. మంచిదే. కానీ, తప్పుడు సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ పొందారేమో, కోర్టును తప్పుదారి పట్టించారేమో అన్న అభిప్రాయం రాకుండా ఉంటుందా?. ఏది ఏమైనా చంద్రబాబు జైలుకు వెళ్లకముందు తనను ఎవరు ఏమీ చేయలేరని, ముఖ్యమంత్రి జగన్ తనను ఏం చేస్తారని ఇష్టారీతిన మాట్లాడేవారు. ప్రస్తుతం మాత్రం స్వరం మార్చి తనను అన్యాయంగా జైలులో పెట్టారని చెబుతున్నారు. తనకోసం ప్రపంచం అంతా కష్టపడిందని చిత్రమైన స్టేట్ మెంట్ ఇస్తూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన పొత్తు గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒకవేళ అధికారం వస్తే, పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేనిదీ మాత్రం ప్రస్తావించడం లేదు. అందుకే మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జనసేన క్యాడర్‌కు, పవన్‌కు మధ్య యుద్దం జరుగుతోందని ఆయన అన్నారు. తనకు కావాల్సింది జేజేలు, చప్పట్లు కాదని, ఓట్లు అని పవన్ అంటున్నారని, ఓట్లు సరే.. అధికారం సంగతేమిటని జనసైనికులు ఆయనను ప్రశ్నిస్తున్నారని జోగయ్య పేర్కొన్నారు. జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ చెబుతున్నారని, కానీ అధికారం వస్తుందని నమ్మిస్తేనే ఓట్లు వేస్తారని జనసేన నేతలు అంటున్నారని ఆయన విశ్లేషించారు. కనీసం అరవైసీట్లు అయినా జనసేన తీసుకోవాలని జోగయ్య సూచించారు. జనసేన వెంట టీడీపీ ఉందని కార్యకర్తలలో విశ్వాసం కలిగిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా? జనసేనకు అరవై సీట్లు ఇస్తారా? ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఉంటుందా? ఉండదా? ఇవేవి తేల్చకుండా చంద్రబాబు జనసేన కార్యకర్తలను కలలోకంలో ఉంచాలని చూస్తున్నారు. పవన్‌కు రాజకీయంగా వ్యూహాలు లేని పరిస్థితిని, తెలంగాణలో జనసేనకు ఎదురైన చేదు అనుభవాలను తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని తన చెప్పుచేతలలో ఉంచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. దీనికి ఆత్మాభిమానం ఉండే జనసైనికులు అంగీకరించడం కష్టమేనని జోగయ్య వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అధికారం వస్తే చంద్రబాబును పట్టుకోవడం కష్టమని, ఆయన విర్రవీగుతారన్నది జనసేన వారి భయం. జనసేనకు మొండి చేయి చూపినా చేయగలిగేది ఏమీ ఉండదన్నది వారి అనుమానం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చివరి నిమిషంలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్కు అదే ప్లస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి ఎదురయ్యేది. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు ఇవే.. అలంపూర్: అబ్రహం స్థానంలో విజయుడికి సీటు.. గెలుపు. జనగాం: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు.. గెలుపు స్టేషన్ ఘనపూర్: తాటికొండ రాజయ్య స్థానంలో కడియంకు అవకాశం.. గెలుపు. నర్సాపూర్: మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం.. గెలుపు ఆసిఫాబాద్: ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం.. గెలుపు దుబ్బాక: ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం.. గెలువు బోథ్: రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం.. గెలువు ఉప్పల్: బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు. మల్కాజ్గిరి: మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం.. విజయం. -
ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్మోహన్రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. -
కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం: ప్రియాంక
-
కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్‌నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యరి్థ, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. -
కేసీఆర్ నీ టైం అయిపోయింది: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదు. పదేళ్లుగా తెలంగాణను నాశనం చేసింది. 2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని కేసీఆర్ మాటిచ్చి తప్పారు. కానీ, బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందని హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం కబ్జా చేసింది. పేపర్ లీకేజ్‌లతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. టేబుల్‌పైన ఎక్కువ డబ్బులు ఎవరు పెడితే.. వాళ్లను మంత్రి వర్గంలో కేసీఆర్ చేర్చుకునేవారు. కేసీఆర్ నీ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం వచ్చింది.. ..అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ కోసం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంది. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా?.. ..మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్ కట్టిస్తాం. ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెస్తాం. జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం అని షా ప్రకటించారు. ఆర్మూర్ సభ అనంతరం రాజేంద్ర నగర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు అమిత్ షా. సాయంత్రం అంబర్‌పేటలో రోడ్ షర్లో పాల్గొంటారు. -
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్.. 80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం
సాక్షి, నిజామాబాద్/ నారాయణ్‌ఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడుతూ.. ఎంపీగా కవితను ఓడించారని కేసీఆర్ నిజామాబాద్‌పై పగ పట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ జాడ లేకుండా పోయాడని ధర్మపురి అర్వింద్‌ను ఉద్ధేశించి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రేవంత్ మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్.. 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి పదేళ్లు గడిచిందని.. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకూ చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మద్దతు ధర అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని అన్నారు. రైతుల భూములు మింగేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని విమర్శించారు. చదవండి: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్ నారాయణ్‌ఖేడ్ గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయం: రేవంత్ ‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్. స్వాతంత్ర్యం కోసం నినదించిన కుటుంబం షెట్కాట్ కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. పోటీలో ఉన్న అభ్యర్దుల గుణగనాలతోపాటు వారి పార్టీల విధానాన్ని చూసి ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. గతంలో కొడంగల్ వాసులు ఎక్కడికెక్కడికో వలసలుపోయేవారని.. ఆ పరిస్థితి నేడు మారిందని తెలిపారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారని.. అలాంటి తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్ హితవు పలికారు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవడం రైతులకు సాధ్యం కాదని తెలిపారు. ఆ మోటర్లు పెట్టాలంటే 50 నుంచి 60 వేల కోట్లు కావాలని అన్నారు. రేవంత్ పెద్ద భూకబ్జాదారుడని, ఎన్నో భూములు కబ్జా చేశాడని విమర్శించారు. కాంగ్రేస్ ది భూమాత కాదు భూమేత పథకమని మండిపడ్డారు. ధరణి తీసేస్తే పెద్ద ప్రమాదమే అవుతుందన్నారు. చిప్పకూడు తిన్నా సిగ్గురాలే ‘రేవంత్ రెడ్డి అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఆయనవి ఆల్త్ పాల్త్ మాటలు ఇక్కడ పని చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్ తుపాకీ పట్టుకొని వెళ్లారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్. ఓటుకు నోటు 50లక్షలతో పట్టుబడిన కేసులో చిప్పకూడు తిన్నా ఆయనకు సిగ్గురాలేదు. రేవంత్ నోరు తెరిస్తే గబ్బు. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చాడని కాంగ్రెస్ వాళ్లే ఆరోపిస్తూ గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు. వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు కాంగ్రెస్‌లో 25 మంది సీఎంలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. సీఎం అవుతాడని మీరు నమ్మి ఓటు వేస్తే నష్టపోతారు. నామీద పోటీకి కామారెడ్డికి వచ్చాడు. అక్కడ ఓడిస్తున్నారు ఇక్కడ కూడా ఓడించాలి. రేవంత్ రెడ్డి పెద్ద దొంగ ఇలాంటి దరిద్రుల పీడ పోవాలి. వీళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అక్కడివాళ్లే వచ్చి చెబుతున్నారు. ’ అని కేసీఆర్ మండిపడ్డారు. చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్! పరిగిలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది. ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్. గతంలో వలసలు, కరువు, కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు. తెలంగాణ వచ్చాక కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నాం. విధి వంచితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.. పెన్షన్ వెయ్యి నుంచి పెంచుకుంటూ వచ్చాం. మూడోసారి అధికారంలో ఇచ్చాక పెన్షన్ రూ. 5 వేలుచేస్తాం. కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా?.ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే’ నని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. -
ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్.. హ్యాట్రిక్ దక్కేనా
గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచార పర్వం కీలక దశకు చేరుకున్నది. పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని వర్గాలను ఆకర్షించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుగా ముందుకువెళ్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సైతం ఓటర్లను ఆకర్శిస్తూనే అన్ని వర్గాలను తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్: నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌కు భారీ మెజారిటీని అందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయ త్నిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటిస్తున్న క్రమంలో ఆయన గెలుపు బాధ్యతను నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం భుజస్కందాలపై వేసుకున్నది. ఎలాగైనా కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడానికి శ్రేణులు పనిచేస్తున్నాయి. పని విభజన చేసుకుంటూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి, మర్కూక్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే సుమారుగా 40వర్గాలతో అధికార పార్టీ నేతలు సమ్మేళనాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే భూనిర్వాసితులు, దివ్యాంగులు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, వైశ్యులు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ తదితర సమ్మేళనాలకు మంత్రి హరీశ్‌రావు హజరై వారి మద్దతును కోరారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం తర్వాత గజ్వేల్‌లో వచ్చిన మార్పును వివరిస్తూ... ఈ అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా కొసాగాలంటే కేసీఆర్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని ముఖ్యమైన వర్గాల ఆత్మీయ సమ్మేళనాలను సైతం నిర్వహించడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఈటల సైతం.. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇక్కడ వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తిగా ద్వితీయశ్రేణి నాయకులను తనవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బలంగా ఉన్న వర్గాలను గుర్తించి ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్గాలను కలిశారు. గతంలో టీఆర్ఎస్లో క్రీయాశీలకంగా ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి వారి మద్దతును కోరుతున్నారు. అంతేకాకుండా బీసీ నినాదాన్ని ప్రచారంలో బలంగా వాడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నేతలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తనదైన శైలిలో ఎండ గడుతున్నారు. స్థానిక నినాదాన్ని నమ్ముకుని.. కాంగ్రెస్ అభ్యర్థి, తూంకుంట నర్సారెడ్డి మాత్రం స్థానిక నినాదాన్ని నమ్ముకొని ఎన్నికల రంగంలోకి దిగారు. తన ప్రచారంలో ప్రతి చోట ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీల ప్రయత్నాలు నడుమ గజ్వేల్ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. -
దుబ్బాకలో నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్‌కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..? కేసీఆర్ కేబినెట్లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు. హరీశ్‌ను దుబ్బాక ప్రజలు నమ్మరు హరీశ్‌రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్‌రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్‌రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్పేట మండలంలోని చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలన్నారు. రాయపోల్ మండలంలో..| రాయపోల్ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు. పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్‌రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఏరులై పారుతున్న మద్యం మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్‌రావు విమర్శించారు. అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు. -
తెలంగాణ ‘కరెంటా’భరణం.. కేసీఆర్ !
సినీ సంగీత ప్రపంచంలో శంకరాభరణం శంకరశాస్త్రి ఎంతటి మహనీయుడో..ఉద్యమ ప్రపంచంలో అంతటి గౌరవనీయుడు కేసీఆర్. సంగీత సాధనలో శంకరశాస్త్రి గొప్ప అయితే..తెలంగాణ సాధనలో కేసీఆర్ గొప్ప. తెలంగాణలో 24 గంటలు నిర్విరామ కరెంట్ అనేది నిర్వివాదంగా చెప్పుకోవాల్సిన విషయం. కేసీఆర్ ఎప్పుడూ తన పల్లె పలుకుబడులూ, ప్రజా నానుడులూ, సామెతలతో విషయాన్ని విపులంగా మారుమూల పల్లె ముసలమ్మకైనా అర్థమయ్యేలా చెప్పగలడు. కానీ శంకరశాస్త్రి అభిమానుల్లాంటి శిష్ట క్లాసికల్ జనానికి అర్థమయ్యేలా చెప్పాలన్నది కొందరు బీఆర్ఎస్ కార్యకర్తల సంకల్పం. అందుకే ‘కరెంట్’ అనే కాన్సెప్టుతోకొన్నిసంగతులు అర్బన్ ఆడియెన్స్‌కు అర్థమయ్యేలా చెప్పాలని రాసుకున్న కొన్ని సీన్స్ ఇవి... కేసీఆర్ హుందాగా తన గుర్తునూ..ప్రచార నినాదాన్ని ఇలా రూపొందించుకుంటాడు. ఆ సంగీత ప్రపంచపు పెద్దమనిషిలాగే..ఈయన నినాదగానం ఇలా ఉంటుంది... ‘‘ఓ ‘కారు’ చిహ్నమ్ము సంధానమౌ పార్టీయే.. బీఆర్ఎస్ పార్టీనే..మన బీఆర్ఎస్ పార్టీయే’’ అంటూ క్లాసికల్ క్లాస్ ఆడియెన్స్క్కూడా నాటుకునేలా చెబుతాడు. ‘కరెంటు మూడుగంటల పాటు చాలు’..అంటూ ఓ కాంగ్రెసు వ్యక్తి చేసిన వ్యాఖ్యానం కేసీఆర్‌ను ఎంతో బాధపెడుతుంది. అప్పుడాయన ఇలా ఉద్బోధ చేస్తాడు. ‘‘చూడండి కాంగ్రెస్సు వారూ... తొట్టెలో ఉన్న బుడుతడు తన హాయి నిద్ర కోసం 24 గంటల కరెంటడుగుతాడు. పేషెంటయిన ఓ పెద్దాయన తన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కోసం ఇంకో రకంగా కరెంటడుగుతాడు. చేనుకు నీళ్లు పెట్టాలనుకున్న బక్క రైతు రాత్రి పురుగూ, పుట్రా ముట్టకుండా పవిత్రమైన కరెంటును పట్టపగలే అడుగుతాడు. కేంద్రంలోని కొందరు పెద్దలు కరెంటుకు మీటర్లు పెట్టాలంటారు. ఇలా..ఒక్కొక్కరి కరెంటుకు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్పసుంటుందీ..ప్రయోజనముంటుంది. అందరికీ అవసరమైన ఈ కరెంటును మూడుగంటలు చాలంటూ మిడిమిడిజ్ఞానంతో ముక్కలుగా విరిచేసి రాష్ట్రాన్ని అంధకారం చేయకు కాంగ్రెస్సూ! తాదాత్మం చెందిన నీటిప్రవాహపు లోతుల్లోంచి పెల్లుబికిన పవిత్ర హైడల్ కరెంటులాంటి విద్యుత్ గురించి ఇలాంటి అపభ్రంశపు మాటలు మాట్లాడకు దాసూ!!’’ అంటూ హితబోధ చేస్తాడు కేసీఆర్. ‘‘సార్.. మీరు చెప్పినదంతా అర్థమైందిగానీ..‘పవిత్రమైన కరెంటు’ ఏమిటి సార్?’’ అడిగాడో రాజకీయశిష్యుడు. అంతే..ఆయనలో మనసు మూలలనిండా నిండిపోయున్న పల్లెపదాల పదకోశ భండాగారాల్లోంచి... ‘అటజనిగాంచె’నంటూ, ‘కాటుక కంటినీరం’టూ..అప్పుడప్పుడు మాత్రమే వెలువడే పండితవాక్కులు మరోసారి వెలువడ్డాయి. ఇలా... ‘‘చూడండి కార్యకర్తలూ..‘పృథ్వా్యపస్తేజోవాయురాకాశః’ అనే ఆ పవిత్ర పంచభూతాల్లో ఒకటైన నీటి నుంచీ..ఈ నీరు టర్బనాంతర్గత భ్రమణకల్లోల్లాల్లోంచి, ఆ జలజీవన స్రవంతిలోంచి..ఈ జనజీవన స్రవంతిలోకొచ్చే ఈ కరెంటు పవిత్రమైనది కాకుండా ఎలా ఉంటుంది నాయనా’’ అంటూనే... ‘‘ఈ కరెంటు సప్లైని ఓ కాపుగాయడానికి ఓట్లు అందించే ఓటరులందరికీ శత సహస్ర వందనాలు. ఇలాంటి ఓటరులంతా ఓటేసినంతకాలం ఈ కరెంటుధార సప్లై అసిధారావ్రతంలా ఇలా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది’’ అంటూ ఉండగానే... ‘‘అయ్యో... మేమా వ్యాఖ్య చేయనేలేదు. ఇదంతా మీడియా వక్రీకరణ. మేమూ కట్టుబడి ఉన్నాం ఐదుగంటల కరెంటుకు’’ అంటూ ‘కరెంటు’షాక్కొట్టినట్లుగా గగ్గోలుపెడుతూ నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు కాంగ్రెస్‌వారు. -
ఊసే లేని కొత్త పెన్షన్ల మంజూరు
హైదరాబాద్: పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సామాజిక పెన్షన్ల పెంపుపై ఆశలు చిగురిస్తున్నా.. ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాని అభాగ్యుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. గత కొన్నేళ్లుగా కొత్తగా సామాజిక పెన్షన్ల మంజూరు లేకుండా పోయింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోల్లో సామాజిక పెన్షన్ల పెంపుపై స్పష్టమైన హామీలు ఇచ్చాయి. అధికార బీఆర్ఎస్ ప్రస్తుతం రూ. 2016 పెన్షన్‌ను రూ.5 వేలకు విడతల వారీగా పెంచుతామని ప్రకటించింది. వచ్చే మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3 వేలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు అందిస్తామని పేర్కొంది. దివ్యాంగుల పెన్షన్ రూ.4016కు ఉండగా, మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం రూ. 300కి చొప్పున ఆరు వేలకు వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను రూ. 4000కు పెంచుతామని ప్రకటించింది. దీనిపై పేదలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లోనే.. నాలుగేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు ఊసే లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం వయసు సడలింపునకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల్లో కొన్నింటికి మాత్రమే మంజూరు లభించగా మిగతావి తిరస్కరణకు గురయ్యాయి. సామాజిక పెన్షన్లకు సంబంధించిన ఆఫ్‌లైన్ దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో మగ్గుతున్నాయి. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రధానంగా బడ్జెట్ సమస్యగా తయారైనట్లు తెలుస్తోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధాప్య, వింతంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ తదితర పింఛన్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. వాస్తవంగా ఆసరా పింఛన్ల దరఖాస్తుల నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కేవలం దరఖాస్తుల స్వీకరణ తప్ప మంజూరు మాత్రం లేకుండా పోయింది. తహసీల్ ఆఫీసులో సమర్పించిన దరఖాస్తులుపై క్షేత్ర స్థాయి విచారణ జరిపి అధికారులు అర్హుల జాబితాలను కలెక్టరేట్‌కు సిఫార్సు చేయడం, ఆ తర్వాత కలెక్టర్ ఆమోదంతో సెర్ఫ్‌నకు ప్రతిపాదనలువెళ్తున్నా.. మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా గ్రేటర్ పరిధిలోని సుమారు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అనధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వృద్ధాప్య పింఛనుదారు మృతి చెందితే అతని భార్యకు పింఛన్ల మంజూరు కూడా లేకుండా పోయింది. దరఖాస్తుదారులు కలెక్టరేట్, తహసీల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో అధికారుల్లో స్పష్టత కరువైంది. దీంతో పెండెన్సీ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసి కొత్తగా మంజూరు ఇవ్వాలని పేద కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆసరా పింఛన్లు ఇలా.. హైదరాబాద్ 2,59,985 రంగారెడ్డి 2,02,129 మేడ్చల్ 1,47,053 -
సీఎం కేసీఆర్ పుట్టిపెరిగింది ఇక్కడే..
దుబ్బాకటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది దుబ్బాక. విప్లవోద్యమాలకు .. తెలంగాణ ఉద్యమానికి కీలకభూమిక పోషించింది.. ఒకే నియోజకవర్గం నుంచి 4 నక్సలైట్ దళాలు (దుబ్బాక, ఇందుప్రియాల్, గిరాయిపల్లి పీపుల్స్‌వార్ దళాలు, జనశక్తి కూడవెల్లి దళం) కార్యకలాపాలు సాగించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాగే, సీఎం కేసీఆర్‌కు విద్యాబద్ధులు నేర్పిన గడ్డ, తెలంగాణ ఉద్యమంలోనూ వందలాది కేసులతో జైలు జీవితాలు అనుభవించిన వారితోపాటు పదుల సంఖ్యలో అమరులైన పోరాటాల గడ్డగా దుబ్బాకను చెప్పవచ్చు. నియోజకవర్గంలోని తొగుట మండలంలో నిర్మించిన కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో పదికిపైగా నివాస గ్రామాల ప్రజలు తరతరాల నుంచి ఉన్న ఊళ్లూ, పుట్టిపెరిగిన ఇళ్లు, భూములను వదిలి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ► సీఎం కేసీఆర్ విద్యాబుద్ధులు ఇక్కడే.. సీఎం కేసీఆర్ ఓనమాలు నేర్చింది దుబ్బాకలోనే. దుబ్బాకకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న (ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న చింతమడక) నుంచి తన సోదరితో కాలినడకన నడుచుకుంటూ వచ్చి చదువుకున్నారు. దుబ్బాకలోనే 3 నుంచి 10 వ తరగతి చదువుకున్నారు. దుబ్బాకలో కేసీఆర్‌కు చదువుచెప్పిన గురువులతోపాటు తనతోపాటు చదువుకున్న మిత్రులను ఇప్పటికీ పేరుపెట్టి పిలుస్తుంటారు. తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో రూ.12 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరి చేయించి అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మించారు. ► ఉపఎన్నికల్లో రఘునందన్‌రావు గెలుపు.. అనారోగ్యంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో 2020లో దుబ్బాకలో ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. దుబ్బాక ఫలితంలో రాజకీయంగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ► నక్సలైట్, జర్నలిస్టు నుంచి.. నక్సలైట్‌గా.. జర్నలిస్టు స్థాయి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి. చిట్టాపూర్‌కు చెందిన రామలింగారెడ్డి దుబ్బాకలో ఇంటర్ చదువుకుంటున్న కాలంలోనే విప్లవోద్యమాల బాట పట్టి రాడికల్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడితోపాటు పలు స్థాయిల్లో పనిచేయడంతోపాటు పీపుల్స్‌వార్ కేంద్ర, రాష్ట్ర కమిటీలోని చాలామంది నేతలతో సంబంధాలు నడిపాడు. జర్నలిస్టుగా 20 ఏళ్లు పని చేశారు. ► ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. ఎన్నికల ప్రచారంలో తాజాగా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఎంపీపై దాడి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ దుమారం లేపింది. ప్రతిపక్ష పార్టీలు ఎంపీపై పథకం ప్రకారమే దాడి చేయించారంటూ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ ఘటన ప్రస్తుత ఎన్నికల సమయంలో జరగడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలకు దుబ్బాక నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది. -
రైతుల గోస తీర్చినం: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆర్మూర్/ నిర్మల్: తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి వ్యవసాయ స్థిరీకరణతోనే గ్రామాలు పటిష్టం అవుతాయని గుర్తించి చర్యలు చేపట్టామని.. రైతుల గోస తీర్చామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ చరిత్రలో లేని స్థాయిలో 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తోపాటు ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందని చెప్పారు. ఇప్పుడు ఎరువుల కోసం చెప్పుల లైన్లు లేవని, కల్తీ విత్తనాలు లేవని తెలిపారు. ఎవరు మంచి చేశారో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. అది దేశ భవిష్యత్తుకు బాట వేస్తుంది. గుడ్డిగా ఓటు వేయొద్దు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను చూడాలి. ఈ అంశా లపై మీ ఊళ్లలో చర్చ పెట్టాలి. అలాగైతే మంచి నాయకులు వస్తరు, మంచి ప్రభుత్వాలు వస్తాయి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. గతంలో పోచంపల్లి, దుబ్బాకలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే.. లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని అప్పటి సీఎంను కోరాం. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఎరువుల కోసం చెప్పుల లైన్లతో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్స్టేషన్ల దగ్గర గంటల తరబడి నిలబడేది. చెప్పులు లైన్లలో పెట్టి ఎదురుచూసేది. ఆ పరిస్థితిని మార్చాం. కల్తీలేని విత్తనాలను కూడా అందుబాటులోకి తెచ్చాం." అని సీఎం కేసీఆర్ అన్నారు. "ధరణిని రద్దు చేస్తామని, రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ధరణితో దళారులు, లంచావతారాల బెడద, వ్యవసాయ భూముల్లో అక్రమాల బాధ తప్పాయి. ఇప్పటికే రెండుసార్లు రైతు రుణాలను మాఫీ చేశాం. ఈసారి రూ.లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీచేసేలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. రోడ్డును చూస్తే తేడా తెలుస్తది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి మీరు వస్తుంటే మన తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రోడ్లే చెప్తాయి. ఎక్కడి నుంచి రోడ్డు నున్నగా వస్తదో అక్కడి నుంచే తెలంగాణ అని మహారాష్ట్రవాళ్లు అంటున్నరు. అది మన అభివృద్ధికి సూచిక. ఇళ్లు, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాలకు 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర మనదే. మహారాష్ట్రలో కరెంటు లేదు. " అని సీఎం కేసీఆర్ చెప్పారు. " మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు వందల ఏళ్ల నుంచి భైంసా, ముధోల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లలో హిందువులు, ముస్లింలు కలసిమెలసి ఉండి పని చేసుకుంటున్నరు. భైంసా అంటే రోజూ కొట్టుకుంటారనే అబద్ధాలు ప్రచారం చేసి, మన మధ్యనే చిచ్చు పెట్టాలని చూస్తున్నరు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, లాఠీచార్జి లేదు. తెలంగాణ ప్రశాంతంగా ఉండాలా లేక మతపిచ్చి మంటలతో నెత్తురు పారాలా? కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ సెక్యులర్‌గానే ఉంటుంది. గత పదేళ్లలో మైనారీ్టల సంక్షేమానికి రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు బీడీలు చేసే వారి బాధలు నాకు తెలుసు. ఎవరూ దరఖాస్తు చేసుకోకముందే వారికి పింఛన్ ఇచ్చిన. బీడీ కార్మికులకు పింఛన్ రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు దశలవారీగా పెంచి ఇస్తాం. కొత్తగా నమోదు చేసుకున్న బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి, కేటీఆర్‌లు కోరు తున్నారు. తప్పకుండా ఇస్తాం’’ అని చెప్పారు. ఇదీ చదవండి: మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..! -
బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది
-
తుమ్మల.. నీ వల్ల తెలంగాణ రాలేదు: మంత్రి పువ్వాడ ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి పువ్వాడ అజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదు. తుమ్మల నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం. గత ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికి తుమ్మల రిటైర్ అయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు తుమ్మల. నువ్వు లేకపోతే తెలంగాణ రాలేదా?. నీ వల్ల తెలంగాణ రాలేదు ఈ విషయం గుర్తు పెట్టకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వేమైనా సీఎంవా తుమ్మల? ఇదే సమయంలో, తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవు. టికెట్లు ఇప్పించడానికి నువ్వేమైనా పార్టీ అధినేతవా లేక ముఖ్యమంత్రివా?. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధ రహితం. కందాలకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం. మమతా ఆసుపత్రి మా కష్టార్జితం. కేటీఆర్, అజయ్‌లు గుండెలు కోసుకునేతం మిత్రులం. నీ ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వే పార్టీలు ఫిరాయించావు. ముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్‌లో చేరావు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి భక్త రామదాసును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తుమ్మల మనసాక్షికి తెలుసు.. మరోవైపు.. నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలకు కౌంటరిచ్చారు. శనివారం నామా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు దీవించారు. తుమ్మల గురించి ముఖ్యమంత్రి వందకు వంద శాతం నిజం చెప్పారు. తుమ్మల మనసాక్షికి అది తెలుసు. కేసీఆర్ నన్ను పిలిచి మరీ ఎంపీని చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. అందుకే నాకు ఎంపీ సీటు ఇచ్చారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అది కూడా నీ అకౌంట్లో వేసుకోవాలని చూస్తున్నావా తుమ్మల. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నా గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు. మా నాయకులు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నావ్. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకో’ అని అన్నారు. చర్చకు సిద్దమా.. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాపై ఆరోపణలు చేసే ముందు రుజువులు చూపించంది. అప్పుడు పాలేరు నుండి పోటీలో తప్పుకుంటాను. దీని కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో నో టికెట్.. పార్టీ మార్పుపై విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతారనుకున్నా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్‌నే ఎంచుకుందని.. అందుకే బీజేపీని వీడి తాను సొంతగూటికి వెళ్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై స్పందించారు. రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి సారించకపోవడమే తాను పార్టీ మారేందుకు ప్రధాన కారణమని అన్నారాయన. ‘‘తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ రెండుసార్లు ఓడింది. కాంగ్రెస్ నాయకత్వ తప్పుడు నిర్ణయాలతో రెండుసార్లు ఓడాం. కానీ, తెలంగాణ సమాజం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌ను ఎంచుకుంది. ప్రజల అభీష్టం మేరకే నేను పార్టీ మారుతున్నా’’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. డబ్బుతో నన్ను ఓడించారు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలనే నా పోరాటం మొదలుపెట్టాను.తెలంగాణ ఉధ్యమం లో ఎంపీ గా నేను ఎంతో కృషి చేశా. కానీ,తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపిక లో జరిగిన కొన్ని తప్పుల వల్ల పార్టీ కి నష్టం జరిగింది. 12 మంది కాంగ్రెస్ సభ్యుల్ని లాక్కుని ప్రతిపక్షం గొంతు లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడ్డ తర్వాత కేసీఆర్ ను గద్దె దీంచేది బీజేపీ అని నేను నమ్మి బీజేపీ లో చేరా. మునుగోడు లో నన్ను ప్రజలు గెలిపించాలనుకున్నా. కానీ, కేసీఆర్ డబ్బుతో, అధికార దుర్వినియోగంతో నన్ను ఓడించారు అని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ బలహీనపడడమే కాదు.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ అధిష్టాన నిర్ణయాలతో పార్టీ బలహీనపడింది. బీజేపీ నాయకత్వానికి పలు సూచనలు కూడా చేశా. దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ అవినీతి పై విచారణ చేస్తారని నమ్మి బీజేపీ లో చేరాను. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. ఆయన కుటుంబాన్ని జైలుకు పంపుతారని భావించా. కానీ, అలా జరగలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన వచ్చింది. మోదీ, అమిత్ షా అంటే నాకు గౌరవం ఉంది. తుదిశ్వాస వరకు బీజేపీ లో ఉండాలనుకున్నా.. కానీ కుదరడం లేదు. తెలంగాణ లో కేసీఆర్ ను గద్దెదించేందుకు ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ లో పరిస్థితులు మారాయి. అందుకే పార్టీ మార్పు పై నేను స్పష్టమైన ప్రకటన చేశాను. డబ్బులు, కాంట్రాక్టుల కోసం నేను చూడను. అమ్ముడుపోయే వ్యక్తిని అయితే.. మళ్లీ పార్టీ ఎందుకు మారతాను? అని విమర్శలకు కౌంటర్ ఇచ్చారాయన. నాకు ఎల్బీనగర్, మునుగోడు టిక్కెట్ ఇస్తామని బీజేపీ చెప్పింది. కానీ, నేను బీజేపీ లో ఉన్నా పోరాడుతా కానీ పోటీ చేయ అని చెప్పా. ఇంతకు ముందు.. నేను పార్టీ మారే సమయంలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత.. రాజగోపాల్ రెడ్డి వస్తా అంటే ఓక మెట్టు దిగుతా బహిరంగంగా ప్రకటించారాయన. రాబోయే ఎన్నికల్లో మనుగోడు నుంచే పోటీ చేస్తా. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడులోనే ఉంటా. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పైనా పోటీచేస్తా. బీఆర్ఎస్ను ఓడించడం కాంగ్రెస్‌కే సాధ్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
కేసీఆర్‌ని మట్టికరిపించిన ఏకైక నేత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కేసీఆర్‌కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు. -
సారొస్తున్నారు..
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం జడ్చర్ల వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యా హ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో తొలిసభ నిర్వహిస్తున్న క్రమంలో నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేలా జనసమీకరణకు సన్నాహాలు మొదలుపెట్టారు. కల్వకుర్తి రూట్లో పట్టణ శివారులోని గంగాపూర్ ప్రధాన రహదారిని ఆనుకు ని ఏర్పాట్లు చేస్తున్న సభకు సుమారు లక్ష మంది వ రకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ‘పాలమూరు’ వేదికగా పాగా వేసేలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అభ్యర్థులు గెలుపొందారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఆ తర్వాత పరిణామ క్రమాల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందస్తుగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి పాలమూరులోని అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఆగస్టు 21న జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో సెప్టెంబర్ 16న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ వద్ద పంప్‌హౌస్‌లో మొదటి మోటారును స్విచాన్ చేసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్ఎల్ఐఎస్) ప్రారంభించారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాను సస్యశామలం చేసే ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడాన్ని బట్టి పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటేలా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. వరాల జల్లు కురిపించేనా.. జడ్చర్లకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఎలాంటి హామీలు గుప్పిస్తారనే దానిపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అదేవిధంగా మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోడ్గల్ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. బుధవారం జడ్చర్లలో మధ్యాహ్నం, మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 26 నుంచి మళ్లీ జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. అనంతరం వచ్చే నెల ఆరో తేదీన గద్వాల, మక్తల్, నారాయణపేటలో జరగనున్న సభల్లో ఆయన పాల్గొననున్నారు. హామీ నెరవేరుతోందంటూ.. 2018 ఎన్నికల సందర్భంగా నవంబర్ 21న సీఎం కేసీఆర్ జడ్చర్లకు రాగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రు. ఈ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ప్రస్తుతం ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వర లో కృష్ణా జలాలు రానున్నందున ప్రతిష్టాత్మక హామీ నెరవేరుతోందని.. అన్ని అడ్డంకులను దాటి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుస్తాన్నామంటూ కేసీఆర్ పాలమూరులో ప్రజా ఆశీర్వాద సభలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సభ సజావుగా సాగేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్: బహిరంగసభలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఆయననుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘పొన్నాల సీనియర్ నేత. కాంగ్రెస్‌లో అణగారిన వర్గాలకు అవకాశం లేదు.. నాలుగున్నర దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తే చివరికి అవమానమే మిగిలింది.. నాకు బాధేసి ఫోన్లో మాట్లాడి.. పార్టీలోకి రమ్మన్నా.. ఇప్పడు గులాబీ జెండా కప్పుకున్నడు.. అన్ని వర్గాలను బీఆర్ఎస్ ఆదరించి పెద్ద పీట వేస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పొన్నాల మనసు గాయపడితే.. బీఆర్ఎస్ మందు వేసి నయం చేస్తుందని చెప్పుకొచ్చారు. -
సీఎం కేసీఆర్ "ప్రజా ఆశీర్వాద "సభకు 30వేల మంది...
యాదాద్రి: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల16న భువనగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్‌పై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో జరుగుతున్న తొలి బహిరంగసభను విజయవంతం చేయడానికి మున్సిపాలిటీలు, మండలాల వారీగా జనసమీకరణ చేయనున్నారు. అదే విధంగా జిల్లాలో భువనగిరితో పాటు ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నియోజకవర్గాల్లోనూ అధినేత బహిరంగ సభల తేదీలను ఖరారు చేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ 16వ తేదీన జగామ, భువనగిరిలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తొలుత జనగామలో ఆ తర్వాత భువనగిరి సభలో పాల్గొంటారు. భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేలకు పైగా జనాన్ని సమీకరించనున్నారు. ఇందుకు అనుగుణంగా 100 మంది కూర్చునేందుకు వీలుగా వేదిక, సభకు హాజరైన వారికి నీడ కోసం సూపర్ స్ట్రక్చర్ టెంట్లు, పండాలాలు ఏర్పాటు చేయనున్నారు. సన్నాహక సమావేశాలు ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు జన సమీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి, సాయంత్రం భువనగిరి మండల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం వలిగొండ, భువనగిరి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం బీబీనగర్ మండల సన్నాహక సమావేశం ఉంటుంది. సభను విజయవతం చేయాలి సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజైర విజయవంతం చేయాలి. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన మన నాయకుడు కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రజలకు అందజేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి. సభకు వేలాదిగా ప్రజలు తరలిరావాలి. –ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి -
ఎన్నికలవేళ బీజేపీ, బీఆర్ఎస్కు షాక్
సాక్షి, ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా ఊహించని ట్విస్ట్‌లు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది. బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించడం లేదు. అలాగని కాంగ్రెస్‌లో చేరబోయే విషయంపై కూడా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇది వ్యూహాత్మక మౌనమా? అనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. కొనసాగుతున్న ఉత్కంఠ నెల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి భూక్య జాన్సన్‌నాయక్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మిని పార్టీ ప్రకటించింది. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావుకు టిక్కెట్ దక్కలేదు. ఆత్రం సక్కుకు ముఖ్యమైన పదవి విషయమై పార్టీ నుంచి హామీ లభించినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. రేఖానాయక్, రాథోడ్ బాపురావుకు అలాంటి పరిస్థితి లేదు. బోథ్ ఎమ్మెల్యే రెండ్రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని చెబుతున్నారు. మంగళవారం ఆయన నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అక్కడ కూడా ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి హామీ లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికీ పార్టీకి రాజీనామా విషయంలో ఆయన స్టాండ్ కొనసాగుతోంది. ఇక రేఖానాయక్ ఇంతకుముందు ప్రకటించినట్లే పార్టీ మారుతారా.. లేనిపక్షంలో ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది మున్ముందు తేలనుంది. కాగా, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థిత్వాల కోసం ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితా అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందని ఆ పార్టీ పెద్దలు చెబుతుండగా, దాంట్లో ఈ నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల్ని ప్రకటిస్తారా? మలివిడతలోనే స్పష్టమవుతుందా..? అనేది వేచిచూడాల్సిందే. ఇక బీజేపీ జాబితాపై కూడా అందరి ఆసక్తి నెలకొంది. ఆయా అభ్యర్థుల్ని ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. కాంగ్రెస్ స్కెచ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. ప్రధానంగా ఆది లాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అధికమంది అభ్యర్థులకు చట్టసభలకు పోటీ చేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో లోకసభ పరిధిలో ఒక సీని యర్ నేతను ఏదైన నియోజకవర్గం నుంచి బరి లో నిలపడం ద్వారా మిగతా నియోజకవర్గాలను సమన్వయపర్చుకునేలా ఉండాలన్నది పార్టీ వ్యూ హమని ఓ ముఖ్య నేత పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పార్టీలోకి వస్తున్నారని ఏ కంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి ఏఐ సీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనే చర్చకు వ చ్చిందనడం రాష్ట్రంలోనే ప్రాధాన్యత అంశంగా మారింది. ఎంపీ పార్టీ మారితే అది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. బోథ్ నియోజకవర్గం నుంచి సో యంను బరిలోకి దింపాలన్నది ఆ పార్టీ వ్యూహంగా చర్చించుకుంటున్నారు. తద్వారా ఉమ్మడి జి ల్లాలో బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ఆదివాసీలపై దృష్టి సారించారు. కాగా, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండగా, రెండుచోట్ల ఆదివాసీలను బరిలోకి దించాలన్నదే పార్టీ ప్లాన్‌గా చర్చించుకుంటున్నారు. -
BRS: ఇచ్చట అలకలు-రాజీలే కాదు బైబైలు కూడా!
ఈ మధ్యకాలంలో భారత రాష్ట్ర సమితి అనూహ్యమైన ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపిస్తుంది. కొందరు ముఖ్యనేతలు పార్టీని వీడడం కాస్త ఇబ్బందే అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని జరిగినా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాటిని ఎదుర్కోగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొమ్మిదేళ్ల పాలన తదుపరి పార్టీ నుంచి కొందరు సీనియర్లు వెళ్లిపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజకీయాలలో ఇలాంటివి తప్పకపోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కొందరు పార్టీని వీడారు. తాజాగా మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు తిరిగి ఎన్నికలలో పోటీచేయడానికి టిక్కెట్ లభించినా, దానిని తిరస్కరించి పార్టీని వీడడం బీఆర్ఎస్కు కొంత అప్రతిష్ట అని చెప్పకతప్పదు. పార్టీ టిక్కెట్లు ప్రకటించేనాటికే మైనంపల్లి తిరుగుబాటు బాటలో ఉన్నారని తెలిసినా, ఆయనకు టిక్కెట్ ప్రకటించడం తప్పిదం అనిపిస్తుంది. ఏ వ్యూహంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చారో కాని, అది ఫలప్రదం కాలేదని అర్దం అవుతుంది. మైనంపల్లి కొన్నాళ్ల క్రితం మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి కారణం తన కుమారుడు మెదక్ నుంచి పోటీచేయాలని భావిస్తుంటే హరీష్ అడ్డుపడుతున్నారన్నది ఆయన భావన. తన కుమారుడితో పాటు తనకు మల్కాజిగిరి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కాని పార్టీ నాయకత్వం ఆయనకు మాత్రమే ఇచ్చింది. దాంతో ఆయన అసంతృప్తికి గురి అయ్యారు. ✍️మైనంపల్లి మొదటి నుంచి రఫ్ అండ్ టఫ్ లీడరుగానే గుర్తింపు పొందారు. టీడీపీ పక్షాన తొలిసారిగా ఆయన 2008 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో గెలుపొందారు. డీ లిమిటేషన్ లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో మెదక్ నియోజకవర్గానికి మారి మరోసారి 2009 లో గెలిచారు. తెలంగాణ ఉద్యమం దశలో ఆయన టిఆర్ఎస్ తో పలుమార్లు వివాదపడ్డ చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత 2014లో ఆయన మల్కాజిగిరి నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించారు. కానీ, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఆ టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన అలిగి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఆ పార్టీలో చేరారు. కాని అక్కడ కూడా మొండి చేయి చూపడంతో ఆ పార్టీని రెండు రోజులలోనే వీడి టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి టిక్కెట్ ఇవ్వడంతో పోటీచేశారు కాని ఓటమి చెందారు. అయినా టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మైనంపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అనంతరం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మూడోసారి గెలిచారు. ✍️సొంత అనుచర బలగం కలిగిన మైనంపల్లి ఆ ప్రాంతంలో కొంత పట్టు సాధించారు.ఆ బలంతో ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు చేశారు. సాధారణంగా అధికార పార్టీ టిక్కెట్ వచ్చాక ఇలా తిరస్కరించడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ విధంగా చూస్తే మైనంపల్లి రిస్కు తీసుకున్నట్లు అనిపిస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ లో ఆయన చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారి నుంచి రెండు టిక్కెట్ల హామీ పొందినట్లు చెబుతున్నారు. అలాకాకుంటే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. గతంలో రెండు రోజులే కాంగ్రెస్ లో ఉన్నా, రాజకీయ పరిణామాలలో వారు కాస్త బలం ఉన్న నేతలను తిరిగి చేర్చుకుంటారు. మైనంపల్లి తన భవిష్యత్తు కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువ ఆశాభావంతో ఉన్నారనుకోవాలి. అందుకోసమే రాజకీయంగా తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆయన సంగతి ఎలా ఉన్నా బీఆర్ఎస్ ఇటీవల పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ✍️కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ లో చేరారు. కొంతకాలం క్రితం ఆయన పార్టీ మారే అవకాశం ఉందని, అలకలో ఉన్నారని తెలిసి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు స్వయంగా ఖమ్మం వెళ్లి బుజ్జగించి వచ్చారు. అయినా తుమ్మలకు పార్టీ టిక్కెట్ రాలేదు. నిజానికి టీడీపీలో ఉన్న తుమ్మలను స్వయంగా కేసీఆర్ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. 2014లో పోటీచేసి ఓడిపోయిన తుమ్మల పార్టీలోకి రావడం ద్వారా ఒక సామాజికవర్గంలో ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంచనా వేశారు. ప్రత్యేకించి అప్పట్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా పార్టీలోకి తెచ్చారని చెబుతారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తదుపరి పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల గెలిచారు. కాని అక్కడే 2018 లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ది ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. దాంతో తుమ్మలకు రాజకీయ గ్రహణం పట్టినట్లయింది. అప్పటి నుంచి పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఈలోగా ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో తుమ్మల అవకాశాలకు గండి పడింది. మొత్తం మీద బిఆర్ఎస్ లో తనకు అవమానం జరిగిందని భావించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ✍️తుమ్మల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. ఆయన పాలేరు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంటేనే.. ఆ పార్టీలో చేరి ఉండాలి. ఎన్.టి.ఆర్. క్యాబినెట్ లోనూ, చంద్రబాబు క్యాబినెట్ లోనూ, తదుపరి కేసీఆర్ మంత్రివర్గంలోనూ పదవులు నిర్వహించిన తుమ్మల.. తనకంటూ ఒక ముద్రవేసుకున్నారు. అయినా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబానికి ఆయన ప్రత్యర్దిగా మారిపోయి.. టీడీపీలో చేరిన తర్వాత సొంత వర్గాన్ని తయారు చేసుకోగలిగారు. రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందిన నేత అయినా.. నోటి దురుసుతనం ఆయనకు నెగిటివ్ అని చెప్పాలి. ✍️మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 లో ఖమ్మం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన జరిగినా ఆయన గెలవగలిగారు.కాని తదుపరి రాజకీయ పరిణామాలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకుంది. దానికి తోడు టీ(బీ)ఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానించడంతో ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ 2019 లో పార్లమెంటు ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో హతాశుడయ్యారు. అయినా అలాగే ఓపికగా పార్టీలో ఉన్నా ప్రభుత్వపరంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెబుతారు. చివరికి ఆయన చేసిన కాంట్రాక్ట్ ల బిల్లులు కూడా పెండింగులో పడ్డాయని ప్రచారం జరిగింది. అయినా పార్టీపరంగా కేటీఆర్ సంప్రదింపులతో కొంత మెత్తబడ్డా, ఆశించిన రీతిలో రాజకీయం లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిపోయారు. అక్కడ పార్టీపరంగా ఒక పదవి కూడా ఇచ్చేశారు. ✍️తుమ్మల, పొంగులేటిల చేరిక బీఆర్ఎస్కు ఖమ్మం జిల్లాలో బాగా దెబ్బ అన్నది విశ్లేషణగా ఉంది. వీరిద్దరి తో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఆయా చోట్ల కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం వస్తోంది. బీఆర్ఎస్ టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు రేఖా నాయక్, బాపూరావు వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా పార్టీలో చేరవచ్చు. ఈ మాత్రానికే బీఆర్ఎస్కు పూర్తి నష్టం జరుగుతుందని చెప్పజాలం. కానీ.. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి ఈ పరిణామాలు ఉపయోగపడవచ్చు. ✍️కాగా మైనంపల్లి రాసిన లేఖలో బీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం ఉండవచ్చు. కేసీఆర్ ఏ కారణంతో పార్టీ పేరు మార్చినా, తెలంగాణ పేరు పార్టీలో లేకపోవడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదన్నది ఒక వాదన. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితి లేదు కనుక ఎవరికి వారు సర్దుకు పోయారు. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలన్న కేసీఆర్ ఆలోచనకు ఈ ఎన్నికల కారణంగా బ్రేక్ పడుతుంది. మళ్లీ గెలిస్తే అప్పుడు ఆ వ్యవహారాలు చూసుకుంటారు. ✍️కేసీఆర్ అందరికన్నా ముందుగా 115 మంది టిక్కెట్లను ప్రకటించడంతో లుకలుకలు బయటకు వస్తున్నాయి. దీని వల్ల పార్టీకి కొంత నష్టం జరిగినా, దానిని సర్దుబాటు చేసుకోవడానికి తగు సమయం ఉందన్న విశ్వాసం పార్టీలో ఉంది. మరో వైపు కేటీఆర్ ఆయా చోట్ల నేతల తగాదాలను తీర్చి రాజీలకు యత్నిస్తున్నారు. ఆ క్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు, మాజీ మంత్రి కడియం శ్రీహరిలకు మధ్య రాజీకుదిర్చారు. రాజయ్యకు ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అలాగే జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి మధ్య రాజీ కూడా కుదర్చడానికి నాయకత్వం తంటాలు పడుతోంది. రాజకీయాలలో తగాదాలు, రాజీలు సర్వసాధారణమే. ఎందుకంటే ఎవరికి వారికి పదవి కావాలి కనుక. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్‌ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
గులాబీ అధినేతకు తలనొప్పిగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్
సాక్షిప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు తలనొప్పిగా మారాయి. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 11 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తిరిగి టికెట్ ఆశిస్తుండగా.. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం పోటీ పడుతుండటంతో జనగామ టికెట్ ప్రకటన విషయాన్ని కేసీఆర్ ఆపిఉంచారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యును తప్పించి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలను కలిసి న ఎమ్మెల్యే రాజయ్య టికెట్ రాలేదన్న బాధలో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తాను సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఆయన హామీలకు కట్టుబడి చేస్తానని ప్రకటించారు. ఇదిలాఉండగా.. అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య గైర్హాజర్ కావడం మళ్లీ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. కడియం శ్రీహరి సభకు హాజరు కావాలని సంప్రదింపులు జరిపేందుకు హనుమకొండలోని ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన లేకపోవడంతో వెనుతిరిగారు. అనంతరం స్థానిక కార్యకర్తలు, రాజయ్య అనుచరులతో భేటీ అయిన పల్లా.. రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని.. రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్‌ను కలుస్తామని తెలిపినట్లు సమాచారం. కాగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో నిర్వహించిన భారీ సభకు ఎమ్మెల్యే రాజయ్య గైర్హాజరు కావడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చకు దారితీసింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోనూ వివాదం సద్దుమణగడం లేదు. ఆ స్థానంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పట్టు వీడటం లేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. ఆ ఒక్క సీటుపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టికెట్ ప్రయత్నాల్లో భాగంగా మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలిసిన ముత్తిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో తిరగడంతో పాటు ఎమ్మెల్సీగా తాను జనగామ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు, చేసిన పనులను వివరిస్తూ కేసీఆర్, కేటీఆర్‌ల ఆశీస్సులతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానంటూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నియోజకవర్గం ముఖ్యనేతలతో భేటీ అవుతూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అభ్యర్థులను ప్రకటించిన ఉమ్మడి వరంగల్‌లోని 10 స్థానాల్లో పరిస్థితి సర్దుకుపోగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో సద్దుమణగని వివాదాలు అధిష్టానంకు తలనొప్పిగా మారాయి. -
లాస్య నందితకే కంటోన్మెంట్ టికెట్
హైదరాబాద్: నాపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సాయన్న కుటుంబం మా కుటుంబమే అంటూ ప్రకటించి కేసీఆర్ చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. – లాస్య నందిత -
12 నియోజకవర్గాల్లో పాతవారికే.. సిట్టింగ్‌లకే టికెట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్లు పాత అభ్యర్థులకే దక్కాయి. సీఎం గతంలో చెప్పినట్లుగా సిట్టింగ్‌లకే మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొన్ని నియోజకవర్గల్లో సొంత పార్టీ నుంచే అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్నా అవేమీ పట్టించుకోకుండా పాత వారికే టికెట్లను కేటాయించారు. సోమవారం అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీలో ఉంటే అవకాశాలు వస్తాయని చెప్పారు. ఫిర్యాదులను పట్టించుకోకుండా.. ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తే తాము పనిచేయబోమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోకుండా పాతవారికే టికెట్లు ఖరారు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ తదితర నేతలు ఇటీవల మంత్రి హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గంలో నాయకులను పట్టించుకోరని, ఏకపక్ష పోకడలు ఉంటాయని, ఈసారి మరొకరికి టికెట్ ఇవ్వాలని కోరారు. డిండిలోనూ సమావేశం పెట్టుకొని రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని తీర్మానించారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా స్థానికంగా పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గ నేతలు శశిధర్‌రెడ్డి వర్గం నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి తీర్మానం కూడా చేశారు. నాగార్జునసాగర్‌లో హాలియా, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ కోటిరెడ్డి చెరొకటి తమ అనుచరులకు ఇచ్చుకుందామని ప్రతిపాదన పెట్టినా ఎమ్మెల్యే భగత్ అందుకు ఒప్పుకోలేదని, రెండు చోట్ల తన వర్గం వారినే చైర్మన్లుగా నియమించుకున్నారనే కోపంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం ఎమ్మెల్యే వర్గాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తాను మొదట చెప్పిన విధంగానే సిట్టింగ్‌లకే టికెట్లను ప్రకటించారు. పార్టీలో ఉంటేనే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ విశాలమైందని, ఎమ్మెల్యే టికెట్ ఒక్కటే కాదు పార్టీలో ఉంటే ఎన్నో అవకాశాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. అందరూ కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పనిచేసుకుంటూ పోతే అవకాశాలు వస్తాయని, ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆగం కావొద్దని సూచించారు. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున అసమ్మతిని తొలగించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తే అసమ్మతి నేతలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పోటీలో ఉండే అభ్యర్థులు వీరే.. సూర్యాపేట – మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తుంగతుర్తి – గాదరి కిషోర్‌కుమార్ కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్ హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ – కంచర్ల భూపాల్‌రెడ్డి మిర్యాలగూడ – నలమోతు భాస్కర్‌రావు నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాగార్జునసాగర్ – నోముల భగత్ దేవరకొండ – రమావత్ రవీంద్రకుమార్ ఆలేరు – గొంగిడి సునీత భువనగిరి – పైళ్ల శేఖర్‌రెడ్డి -
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తొలి జాబితా ఇదే.. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా 1. సిర్పూర్ - కోనేరు కోనప్ప 2. చెన్నూర్ (SC) - బాల్క సుమన్ 3. బెల్లంపల్లి (SC) - దుర్గం చిన్నయ్య 4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు 5. ఆసిఫాబాద్ (ST) - కోవా లక్ష్మి 6. ఖానాపూర్ (ST) - భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ 7. ఆదిలాబాదు - జోగు రామన్న 8. బోథ్ (ST) - అనిల్ జాదవ్ 9. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 10. ముధోల్ - జి.విఠల్ రెడ్డి ఉమ్మడి నిజామాబాదు జిల్లా 11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి 12. బోధన్ - షకీల్ అహ్మద్ 13. జుక్కల్ (SC) - హన్మంతు షిండే 14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి 15. ఎల్లారెడ్డి - జాజల సురేందర్ 16. కామారెడ్డి - సీఎం కెసిఆర్ 17. నిజామాబాదు (పట్టణ) - గణేష్ గుప్తా బిగాల 18. నిజామాబాదు (రూరల్) - బాజిరెడ్డి గోవర్థన్ 19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా 20 కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్ 21 జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్ 22 ధర్మపురి (SC) - కొప్పుల ఈశ్వర్ 23 రామగుండం - కోరుకంటి చందర్ 24 మంథని - పుట్టా మధు 25 పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి 26 కరీంనగర్ - గంగుల కమలాకర్ 27 చొప్పదండి (SC) - సుంకె రవిశంకర్ 28 వేములవాడ - చలిమెడ లక్ష్మీ నర్సింహారావు 29 సిరిసిల్ల - కె.తారక రామారావు 30 మానుకొండూరు (SC) - రసమయి బాలకిషన్ 31 హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి 32 హుస్నాబాద్ - వడితెల సతీష్ ఉమ్మడి మెదక్ జిల్లా 33 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు 34 మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ - మహారెడ్డి భూపాల్ రెడ్డి 36 ఆందోల్ (SC) - చంటి క్రాంతి కిరణ్ 37 నర్సాపూర్ - పెండింగ్ 38 జహీరాబాద్ (SC) - కొనింటి మాణిక్‌రావు 39 సంగారెడ్డి తూర్పు - జయప్రకాశ్ రెడ్డి 40 పటాన్చెరు - గూడెం మహిపాల్ రెడ్డి 41 దుబ్బాక - కొత్తా ప్రభాకర్ రెడ్డి 42 గజ్వేల్ - సీఎం కెసిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ మినహా మిగతా సీట్లలో అభ్యర్థులు యధాతధంగా ఉన్నారు. తనయులకు ఛాన్స్ ఇవ్వాలని సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ కోరినా.. సీఎం కెసిఆర్ అంగీకరించలేదు. సామాజిక పరంగా చూస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 7 రెడ్డిలకు, 2 గౌడ్స్, ఒకటి కమ్మ, ఇద్దరు వెలమ, ఇద్దరు మాదిగ ఉన్నారు. 43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి 44 మల్కాజ్గిరి మైనంపల్లి హన్మంతరావు 45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద 46 కూకట్పల్లి మాధవరం కృష్ణారావు 47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి 48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి 49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి 51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ 52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ 53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య 54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి 55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్ 56 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఉమ్మడి హైదరాబాదు జిల్లా హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా.. రెండు స్థానాలు పెండింగ్ ఉంచారు. ఇద్దరు మైనార్టీలు, ఐదుగురు బీసీలు ( మున్నూరు కాపు, వంజెర, యాదవ్, గౌడ్, గంగపుత్ర), ఒకటి కమ్మ , ఇద్దరు రెడ్డి , ఒకటి మాదిగ అభ్యర్థులు ఉన్నారు. 57 ముషీరాబాద్ ముఠా గోపాల్ 58 మలక్‌పేట్ తీగల అజిత్ రెడ్డి 59 అంబర్పేట్ కాలేరు వెంకటేశ్ 60 ఖైరతాబాద్ దానం నాగేందర్ 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ 62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 63 నాంపల్లి పెండింగ్ 64 కార్వాన్ అయిందాల కృష్ణయ్య 65 గోషామహల్ పెండింగ్ 66 చార్మినార్ ఇబ్రహీం లోడి 67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి 68 యాకుత్‌పురా సామా సుందర్ రెడ్డి 69 బహదుర్‌పురా అలీ బక్రీ 70 సికింద్రాబాదు టి.పద్మారావు 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) - లాస్య నందిత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా 72 కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి 73 నారాయణపేట - ఎస్.రాజేందర్ రెడ్డి 74 మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్ 75 జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి 76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి 77 మఖ్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి 78 వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 79 గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 80 ఆలంపూర్ (SC) - అబ్రహాం 81 నాగర్‌కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి 82 అచ్చంపేట్ (SC) - గువ్వల బాలరాజ్ 83 కల్వకుర్తి - గుర్క జైపాల్ యాదవ్ 84 షాద్‌నగర్ - అంజయ్య యాదవ్ 85 కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా 86 దేవరకొండ (ST) రమావత్ రవీంద్రనాయక్ 87 నాగార్జున సాగర్ నోముల భగత్ 87 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు 88 హుజుర్నగర్ శానంపూడి సైది రెడ్డి 89 కోదాడ బొల్లం మల్లన్నయాదవ్ 90 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 91 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి 92 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 93 భువనగిరి పైళ్ళ శేఖర్ రెడ్డి 94 నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య 95 తుంగతుర్తి (SC) గ్యాదరి కిశోర్ 96 ఆలేరు గొంగడి సునీత ఉమ్మడి ఖమ్మం జిల్లా 110 పినపాక (ST) రేగా కాంతారావు 111 ఇల్లెందు (ST) బానోత్ హరిప్రియ నాయక్ 112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ 113 పాలేరు కందాల ఉపేందర్‌రెడ్డి 114 మధిర (SC) లింగాల కమల్ రాజు 115 వైరా (ST) బానోత్ మదన్ లాల్ 116 సత్తుపల్లి (SC) సండ్ర వెంకట వీరయ్య 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు 118 అశ్వారావుపేట (SC) మచ్చా నాగేశ్వరరావు 119 భద్రాచలం (ST) తెల్లం వెంకట్ రావు I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏 Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,… — KTR (@KTRBRS) August 21, 2023 -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ కృతజ్ఞత సభ
మెల్బోర్న్: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో మెల్బోర్న్లో కేసీఆర్ కృతజ్ఞత సభ ఘనంగా నిర్వహించారు. దేశంలో రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా అహర్నిశలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు, అలాగే ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సందర్భంగా ఈ కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగిందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని.. అన్ని కులాలు అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారని అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఇక మున్ముందు కూడా ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎన్ఆర్ఐలు ప్రగాఢంగా భావించినట్లు తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా దేశం కూడా బాగుపడుతుందని, ఎన్ఆర్ఐలలో ఉన్న చాలా మంది రైతు కుటుంబాలు నుంచి వచ్చిన వాళ్లే అని రైతుల ఇబ్బందులు తెలుసుకొని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చిందో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ అండ్ గుజరాత్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు మాట్లాడుతూ.. కేసీఆర్ భారత దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి పరిమితం కాకుండా రానున్న రోజుల్లో దేశానికి నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆశించారు. ఆస్ట్రేలియాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాక్రమాలు నిర్వహించే అవకాశం కలిపించిన పార్టీ అధ్యక్షులకు, ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు రమేష్ ముత్యాల, మధు పార్స, రవీందర్ చుక్క, సత్యనారాయణ గుండా, మధు పైల, కార్తీక్ విద్యాసాగర్, రాయల సాయిరామ్, సందీప్ అనిల్, వంశీ సురభి, కుల్విందర్ బాజువ, హర్మేందర్ సింగ్, దిలీప్ రెడ్డి, అవినాష్ సంతోష్ రెడ్డి, గోపి, శ్రవణ్ బల్మూరి, అనిల్ రాఘవేంద్ర, ఆకాష్, సురేష్ రేపాల, అవినాష్, ఆకాష్,ఇతర తెలంగాణ సంఘ నాయకులు పుల్లారెడ్డి, రాజు వర్ధన్ రెడ్డి, దీపక్ కిరణ్, ప్రవీణ్ దేశం, కర్ర శ్రీనివాస్, నవీన్ బైరెడ్డి, ఓబుల్ రెడ్డి హరీష్ రెడ్డి, శేఖర్, శ్రీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు. -
కారు.. దిగిపోతున్నారు!
కొరాపుట్/జయపురం : భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని కొరాపుట్ జిల్లా నేతలు వీడనున్నారు. ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ కుటుంబం ఆ పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్ (మిట్టు) న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నుంచి ఓ వీడియో విడుదల చేశారు. తమ కుటుంబం కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన తొలి విడత చర్చలు విజయవంతంగా ముగిశాయన్నారు. గత ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో గమాంగ్ కుటుంబం ఆ పార్టీలో చేరింది. అదే వేదికపై కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి కూడా కారు ఎక్కారు. ఆ రోజు వీరి చేరికలు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మీద అంచనాలు పెంచాయి. గిరిధర్ గమాంగ్ తొమ్మిది సార్లు కొరాపుట్ ఎంపీగా, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారీ కేంద్ర కేబినెట్ మంత్రిగా పని చేశారు. గిరిధర్ భార్య హేమావతి గమాంగ్ కూడా కొరాపుట్ ఎంపీగా పని చేశారు. అటువంటి గమాంగ్ కుటుంబం 2015లో కాంగ్రేస్ పార్టీని వదిలి తొలుత బీజేపీలో చేరారు.ఆ పార్టీ అధికారంలో ఉన్నందున్న గమాంగ్‌ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ చేస్తారనే ప్రచారం జరిగింది. రోజులు గడుస్తున్నా ఎటువంటి పదవి లభించలేదు. దశాబ్దాలుగా పదవుల్లో ఉన్న గమాంగ్‌కు బీజేపీ రుచించలేదు. ఇదే సమయంలో కేసీఆర్ ఆకర్షించారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ను ప్రజలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో కొరాపుట్ పార్లమెంటరీ స్థానంలో కాంగ్రేస్ పార్టీ వర్గ విబేధాలు గమాంగ్‌కు కలసి వచ్చాయి. తొలి విడత చర్చలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు చెల్లకుమార్, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క పాల్గొన్నారు. ఇదే సమయంలో కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి తాను కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చునని ప్రకటించారు. తన తండ్రి, మేనత్త కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పని చేశారని గుర్తు చేశారు. బిజూ పట్నాయక్ ఆశయాలతో బీజేడీలో పని చేసినట్లు తెలిపారు. అనేకసార్లు పొట్టంగి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కొరాపుట్ ఎంపీగా పని చేశానన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేడీలో చేరనన్నారు. మరోవైపు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతి మాట్లాడుతూ గమాంగ్ కుటుంబం ఎనిమిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలోనికి వస్తుండం హర్షనీయమన్నారు. తాము గతంలో శత్రువులైనప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే కొరాపుట్, రాయగడ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయినట్లే. -
సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్: గత నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటనలు, మహారాష్ట్ర టూర్ షెడ్యూలుతో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల మూడో వారం నుంచి మళ్లీ క్షేత్ర స్థాయి పర్యటనలు మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల మూడో వారం నుంచి పాల్గొనే వరుస కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూలు సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టరేట్ సముదాయాలు, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల ప్రారంభంతో పాటు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. జూలైలో మరో ఐదు జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం జిల్లాల పర్య టన షెడ్యూలును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముందని సమాచారం. సీఎం పర్యటించే జిల్లాల జాబితాలో సూర్యాపేట, నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 15 తర్వాత సీఎం పర్యటన ఉండే అవకాశం ఉండగా, జిల్లా కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయంతో పాటు చనాకా–కొరాటా ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముందని చెపుతున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ కలెక్టరేట్ సముదా యంతో పాటు మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. సూర్యాపేట లేదా కోదాడలో బస చేసి మరుసటి రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సభకు హాజరయ్యేలా సీఎం షెడ్యూలు ఉంటుందని తెలుస్తోంది. మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ సముదాయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, నెలాఖరు లోగా కేసీఆర్ ప్రారంభిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. చదవండి: సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్ ఇతర జిల్లాల్లోనూ బహిరంగ సభలు జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం లేని చోట కూడా బహిరంగ సభలు నిర్వహించే యోచనలో బీఆర్ ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాల సమా చారం. 2018 ఎన్నికల తర్వాత నారాయణపేట జిల్లాలో అడుగు పెట్టని సీఎం కేసీఆర్, ఈ జిల్లాలో త్వరలో పర్యటించే అవకాశముందని స్థానిక బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. గత నెలలో మహారాష్ట్రలోని నాగపూర్, సోలాపూర్లలో పర్యటించిన కేసీఆర్.. త్వరలో పుణే లేదా భివండీలో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో అక్కడా సభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పుణేలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయా లను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. ఈ నెల 8తో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్య త్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూ లు కొలిక్కి రానుంది. ఇప్పటికే 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నట్లు మహా రాష్ట్ర నేతలు వెల్లడించారు. సంస్థాగత కమిటీల శిక్షణ కార్యక్రమానికి ఈ నెల 20 తర్వాత మహారాష్ట్రలో సీఎం పర్యటించే అవకాశ ముంది. ఏడాది చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ నెల 18 లేదా 19న మంత్రులు, పార్టీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్, జిల్లా పరిషత్ చైర్మన్లతో సమావేశం ఉంటుందని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అధికార పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే విషయం కొద్ది రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. పట్నం తీరు సైతం ఈ అంశాలను బలపర్చేలా కనిపించడంతో పార్టీ మారుతారని చాలామంది డిసైడయ్యారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం శంకర్‌పల్లిలో నిర్వహించిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ పక్కనే కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు ఆయనకు హామీఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే.. అనవసర నిర్ణయాలు తీసుకుని ఆగం కావద్దని సూచించినట్లు తెలుస్తోంది. గైర్హాజరుతో అనుమానాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహేందర్‌రెడ్డి ఇటీవల సైలెంట్ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల మహేశ్వరంలో నిర్వహించిన సీఎం మీటింగ్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎప్పుడూ ముఖ్యమంత్రి పక్కనే ఉండే ఆయన కనిపించకపోవడం ఊహాగాలకు మరింత ఆజ్యం పోసింది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విషయం మీడియాలో ఫోకస్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. అతనితో సన్నిహితంగా ఉండే సెకండ్ క్యాడర్ నేతలతో పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇద్దరు రంగంలోకి దిగి పట్నంను బుజ్జగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ చర్చలు పట్నం దారెటు.. అనే విషయంలో తలెత్తిన చర్చ అధికార పార్టీని ఆలోచింపజేసింది. సీనియర్ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయనను వదులుకోవద్దని గులాబీ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ బుధవారం రాత్రి ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవి సఫలం కావడంతో మరుసటి రోజు శకంర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో మహేందర్‌రెడ్డి.. సీఎం వెంట ప్రత్యక్షమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన గులాబీ బాస్ కేసీఆర్.. పట్నం అలక తీర్చినట్లు సమాచారం. ఆ వెంటనే రెట్టించిన ఉత్సాహంతో మహేందర్‌రెడ్డి తాండూరులోని తన మద్దతుదారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి కూడా బీఆర్ఎస్ తాండూరు టికెట్ మనకే వస్తుందని ధీమా వ్యక్తంచేసినట్లు వినికిడి. సయోధ్య కుదిరిందా..? బీఆర్ఎస్ అధిష్టానం చొరవతో.. మహేందర్‌రెడ్డి మనసు మార్చుకున్నారా..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లటంతో పాటు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టం కావడంతోనే.. పార్టీ నష్టపోతుందనే కారణంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి పట్నం మనసు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమా.. ఫైనలా..? అనే విషయాపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా అలక పాన్పు వేసి అనుకున్నది సాధించుకున్న పట్నం తనను నమ్ముకుని.. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆయన మద్దతుదారులను ఏం చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
కేసీఆర్‌కు అంత సీన్ లేదు.. పవార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పూణే: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విసర్తిస్తూ.. బీఆర్ఎస్లో చేరికలు, పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తున్నారు. ఇక, తాజాగా మహారాష్ట్రలో కొందరు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంతో కేసీఆర్.. అక్కడి రాజకీయాలపై ఫోకస్ పెంచారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన సక్సెస్ కాలేరని అజిత్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ పార్టీలో చేరుతున్న వారికి ఇక్కడ అవకాశం రాదని తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. మూలయం, మాయవతి కూడా.. కాగా, అజిత్ పవార్ పూణెలో మీడియాతో మాట్లాడుతూ.. మాయావతి, ములాయం సింగ్ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే మహారాష్ట్రలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక్కడ రాజకీయాలు చేయడంలో విఫలమయ్యారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో వారి పార్టీలను విస్తరించాలని ప్లాన్స్ చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో పార్టీలను, ప్రజలను ప్రభావితం చేయడంలో సక్సెస్ కాలేదని వెల్లడించారు. కేసీఆర్.. జాతీయ స్థాయి నాయకుడు కావాలని ఎంతో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారని అన్నారు. డబ్బంతా ఎక్కడది.. ఇక, ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌పై అజిత్ పవర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశం, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాల కోసం హోర్డింగులు, ప్రకటనలు, యాడ్స్, బ్యానర్లు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ డబ్బంతా కేసీఆర్ కు ఎక్కడ నుంచి వస్తోందనే విషయం గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఇది కూడా చదవండి: మహిళల ఉచిత ప్రయాణంలో మార్పులు.. -
శ్రావణ మాసంలోనే కారు సీట్లు ఖరారు!
ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ముందుగానే జాబితాను ప్రకటించడం ద్వారా పారీ్టలో సందిగ్ధతకు తెరదించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ప్రభుత్వ రద్దు ప్రకటనతోపాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందే ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకుని.. మరో రెండు రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. అది ముగిశాక అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. అంటే జూలై మూడో వారం నుంచి నెలాఖరు మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని.. గణనీయంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సుమారు 15శాతం మందికి మళ్లీ పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ ఉన్న సీట్లు, విపక్షాల ఎత్తుగడలు, ఇతర పారీ్టల నుంచి బలమైన నేతల చేరికకు అవకాశం ఉన్నచోట్ల ఎంపికను చివరి నిమిషం వరకు ఆపే అవకాశం ఉందని అంటున్నాయి. సంస్థాగతంగా చక్కదిద్దేందుకే ముందస్తు జాబితా! సుమారు 40కిపైగా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రపోటీ నెలకొంది. ఆయా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకా, మరెవరికైనా సీటు దక్కుతుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు ఇతర ఆశావహులు కలుపుకొని సుమారు 70 మంది బలమైన నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ ఇప్పటికే లెక్కలు వేసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ టికెట్‌పై స్పష్టత కోసం ప్రయతి్నంచే క్రమంలోనే బీఆర్ఎస్ను వీడారు. తాజాగా కూచాడి శ్రీహరిరావు (నిర్మల్) కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) కూడా హస్తం పారీ్టలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి కూడా పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడం ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్డడం సులభం అమవుతుందని సీఎం భావిస్తున్నారు. బుజ్జగింపులు.. సాగనంపడాలు.. నియోజకవర్గాలు, గ్రామస్థాయి వరకు పార్టీల బలాబలాలు, ప్రభావం చూపే నేతలు, వారి గుణగణాలపై పూర్తిస్థాయి నివేదికలను బీఆర్ఎస్ సిద్ధ్దం చేసుకుంది. ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్త నేతలను బుజ్జగించడం, సాధ్యంకాని పక్షంలో సాగనంపడ ం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పారీ్టల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితాను నిఘా సంస్థల నివేదికల ఆధారంగా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ‘‘ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు అన్ని పారీ్టల నుంచి పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. విపక్షాల ఎత్తుగడలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నచోట వారిని మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చే అంశంలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు’’ అని బీఆర్ఎస్ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకూ సన్నద్ధమయ్యేలా.. ఈసారి లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారమున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లను కూడా కలుపుకొని కనీసం 50 లోక్‌సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
ఎమ్మెల్యే లకు క్లాస్ పీకిన కే సీఆర్
-
కేసీఆర్ హామీ.. ఆలేరు టికెట్‌పై సర్వత్రా ఆసక్తి
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా పైరవీలకు తావులేకుండా సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇవ్వనున్నట్లు పలు రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే ఇప్పటికే పలు దఫాలు సర్వేలు చేయించగా.. కాంగ్రెస్ సైతం సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇటీవల ప్రకటించడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో గుబులు నెలకొంది. పనితీరు మెరుగుపరుచుకునే యత్నం ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ పలుసార్లు నిర్వహించిన సర్వేల్లో ప్రజలు ఏం చెప్పారోనన్న భయం వారిని వెంటాడుతోంది. నిఘా వర్గాలు, అధికార పార్టీ అనుబంధ పత్రిక, ఓ ప్రైవేట్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టాయి. సర్వే తమకు అనుకూలంగా ఉందా.. ప్రతికూలంగా ఉందా ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలు తమ తప్పులు దిద్దుకోవడం, పనితీరును మరింత మెరుగుపర్చుకునే యత్నంలో ఉన్నారు. సీఎంను కలిసిన గొంగిడి దంపతులు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దంపతులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడం చర్చనీయాంశమైంది. సర్వే నివేదిక ఆధారంగా ఈసారి సునీతకు బదులు ఆమె భర్త మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దించే అవకాశం ఉందన్న ప్రచారం పలు మీడియాల్లో జరుగుతోంది. సిట్టింగ్‌లకే సీట్లు అంటూనే కొందరికి మార్పు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఈ ప్రచారం మొదలైంది. కేడర్‌లోనూ వివిధ రకాలుగా చర్చ మొదలైంది. టికెట్ తమకే ఖాయమని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడానికే సీఎంను కలిసి హామీ తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గో హెడ్ అని మహేందర్‌రెడ్డి భుజంతట్టారని గొంగిడి సునీత ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోసారి ఆలేరు నుంచి పోటీచేయడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి. చిక్కిన పట్టు పోకుండా.. జిల్లాలో బీజేపీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జోష్ నింపింది. దాంతో పాటు స్ట్రీట్ కార్నర్ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. గతంలో కంటే తమ బలం పెరగడంతో చిక్కిన పట్టును వదులుకోవద్దన్న పట్టుదలతో నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికా రమే లక్ష్యంగా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌లోనూ సర్వే.. పైరవీకారులకు కాదు సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్య ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. -
ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్ (ఫొటోలు)
-
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆయన ఆఫీస్ రిబ్బన్‌ను కట్ చేశారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్ విహార్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్ భేటీ అయ్యారు. మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్ గ్రౌండ్లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్‌తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్‌ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లను సిద్ధం చేశారు. సూట్ రూమ్‌లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు. ఆంక్షలతో ఆలస్యం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 2021 సెప్టెంబర్ 2న కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇదీ చదవండి: ‘బీజేపీని తరిమికొట్టే టైం వచ్చింది’ -
బాస్ వాయిస్‌లో.. బేస్ మనదే!
వికారాబాద్: జిల్లా ఎమ్మెల్యేల వెన్నులో వణుకు మొదలైంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఆగ్రహమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధినేత మండిపాటు వెనక వీరి వ్యవహారాలు సైతం ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దళితబంధు లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలు, వారి అనుచురులు డబ్బులు వసూలు చేస్తున్నారని కేసీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేలు, వీరి అనుచరులు భయంలో పడ్డారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యేల వైరి వర్గీయులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా గులాబీ బాస్ వాస్తవాలను గుర్తించారని ప్రచారం చేస్తున్నారు. దళితబంధు లబ్ధిదారుల నుంచి రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎక్కువ వసూళ్లకు పాల్పడ్డారనే ప్రచారం సాగుతోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నగరంలో గత గురువారం నిర్వహించిన ప్లీనరీకి ముందే సీఎం కేసీఆర్.. ఇంటెలిజెన్స్ ద్వారాఅన్ని జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మన జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. దళితబంధు అందజేతలో నేతల చేతివాటాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోని అసమ్మతి నేతలు సైతం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మండిపడిన విషయాలు తెలిసిందే. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత సైతం ఈ మాటలన్నీ సీఎం చెవిలో వేశారనే ప్రచారం సాగుతోంది. డబ్బులిచ్చిన వారికే ‘బంధు’ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంలో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కుర్తి వ్యవహారాలు చేస్తున్నారనేది బహిరంగరహస్యమే. వీరు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసిందే. ఈ విషయమై జిల్లాలో గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. పథకం అందాలంటే ముందుగా రూ.3 లక్షలు చెల్లించాలని అనధికారిక నిబంధన పెట్టడంతో చేసేది లేక అప్పులు చేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చిన వారికే దళితబంధు అందగా..అసలైన అర్హుల పేర్లు మరుగున పడ్డాయి. ఇలా వసూలు చేసిన డబ్బులను అధికార పార్టీ నేతల వద్ద పెట్టిన ఎమ్మెల్యేలు.. వీటిని ఎన్నికల్లో ఖర్చు చేద్దాంలే అని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నిచోట్లా అసమ్మతి ఇదిలా ఉండగా పార్టీ ప్రతిష్ట దిగజారకుండా ప్రతిఒక్కరూ హుందాగా వ్యవహరించాలని అధినేత దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని పోయేందుకు అవసరమైతే ఓ మెట్టు దిగాలని సూచించారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని.. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ వినిపించొద్దని గట్టిగా హెచ్చరించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలన్నింటిలోనూ మన జిల్లా నేతలు ముందు వరుసలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పెరిగిపోతోంది. టికెట్టు నాకంటే.. నాకే అని నేతలు బహిరంగంగా చెబుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా వీరి తీరు మారుతుందా..? లేదా అనేది వేచి చూడాల్సిందే. -
ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి: సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలో వందకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తందని ధీమా వ్యక్తం చేశారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జెడ్పీచైర్మన్లు, ఎంపీలు ఇంచార్జీలుగా నియమించాలని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో ఇంచార్జీల నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. క్యాడర్లో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా నడపవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పలు తీర్మానాలను చర్చించి, ఆమోదించింది. ►‘ప్రతి రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం. ►దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా ►విదేశాలకు దేశీయ ఆహారోత్పత్తుల ఎగుమతి. ►దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు. ►దేశంలో బీసీ జనగణన జరపాలి. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రణాళికలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్ -
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
కేసీఆర్ ఏం చేసినా ప్రశ్నించకూడదా?
-
దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది
-
నన్ను పార్టీనుండి సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: పొంగులేటి
-
సీఎం ఉన్నారా?.. పాలన సాగుతోందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు ప్రభుత్వాధినేతగా సీఎం ఉన్నారా? అసలు పాలన సాగుతోందా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. మొత్తం పాలనను పడకేసేలా ఫక్తు రాజకీయాలు చేస్తూ సీఎం.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కావడం ఏంటని నిలదీశారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేని స్థితికి చేరుకున్నందున ఐటీశాఖ మంత్రికి కేబినెట్లో కొనసాగే నైతికహక్కు ఉందా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేటీఆర్ పొద్దున లేస్తే టెక్నాలజీ గురించి మాట్లాడతారని ఎద్దేవాచేశారు. సీఎంకు ఊర్లు తిరగడానికి సమ యం ఉంటుంది కానీ, పేపర్ లీకేజీలు, తదితర విషయాలపై సమీక్షలకు టైమ్ ఉండదా? అని నిలదీశారు. కాగా, ఈనెల 8న ప్రధాని రాష్ట్ర పర్యటనను ముఖ్యంగా సికింద్రాబాద్ బహిరంగసభను దిగ్విజయం చేయాలని పార్టీ నేతలకు లక్ష్మణ్ సూచించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మోదీ కార్యక్రమానికి పార్టీపరంగా చేయాల్సిన సన్నాహాలపై జిల్లాల పార్టీ నేతలతో చర్చించారు. -
కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్తలు వీరే..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా చేపట్టే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలను జిల్లాలవారీగా నాయకులకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆయా జిల్లాల సమన్వయకర్తల జాబితాను సోమవారం విడుదల చేశారు. నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి ఆతీ్మయ సమ్మేళనాలు మొదలుకొని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, విద్యార్థి విభాగం సమావేశాలు.. ఇలా అనేక కార్యక్రమాలను రాబోయే నాలుగు నెలల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వివిధ స్థాయిల నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేసేందుకు వీరిని నియమించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక, అమలుపై చర్చించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలవారీగా బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే.. జిల్లా – సమన్వయకర్త హైదరాబాద్ – దాసోజు శ్రవణ్ వనపర్తి, జోగుళాంబ గద్వాల – తక్కళ్లపల్లి రవీందర్ రావు మేడ్చల్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల – బస్వరాజు సారయ్య నల్లగొండ – కడియం శ్రీహరి వికారాబాద్ – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రంగారెడ్డి – ఎల్.రమణ భద్రాద్రి కొత్తగూడెం – టి.భానుప్రసాద్ రావు సంగారెడ్డి – వెంకట్రాంరెడ్డి మెదక్ – ఎగ్గే మల్లేశం మహబూబ్‌నగర్, నారాయణపేట – కసిరెడ్డి నారాయణరెడ్డి యాదాద్రి భువనగిరి – యాదవరెడ్డి నాగర్ కర్నూల్ – పట్నం మహేందర్ రెడ్డి భూపాలపల్లి, ములుగు – అరికెల నర్సారెడ్డి సిద్దిపేట – బోడకుంట్ల వెంకటేశ్వర్లు హనుమకొండ, వరంగల్ – ఎమ్.ఎస్.ప్రభాకర్ నిర్మల్, ఆదిలాబాద్ – వి.గంగాధర్ గౌడ్ మంచిర్యాల, ఆసిఫాబాద్ – నారదాసు లక్ష్మణ్ జనగామ – కోటిరెడ్డి మహబూబాబాద్ – పురాణం సతీశ్ కామారెడ్డి – దండే విఠల్ నిజామాబాద్ – బండ ప్రకాశ్ జగిత్యాల – కోలేటి దామోదర్ పెద్దపల్లి – ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖమ్మం – శేరి సుభాష్‌రెడ్డి సూర్యాపేట – మెట్టు శ్రీనివాస్. -
సీఎం కేసీఆర్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
మళ్ళీ మొదలైన పాల్ పంచులు
-
హైదరాబాద్ బాగుండాలంటే బిఆర్ఎస్ సర్కార్ పోవాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఆదివాసీలను కించ పర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిల
-
దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారు: బండి సంజయ్
-
సీఎంలు ‘ఏమిటీ జనం?’ అని ఆశ్చర్యపోయారు..’శభాష్ అజయ్’
సాక్షి, ఖమ్మం: ‘శభాష్ అజయ్.. ఆవిర్భావ సభ సక్సెస్ చేశారు. ఖమ్మం చరిత్రలోనే ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదు. కమ్యూనిస్టు నాయకులు, మిగతా నేతలు అందరూ సభ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఏమిటీ జనం?’ అంటూ ఆశ్చర్యపోయారు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందించారు. సభావేదిక పైనే కాకుండా సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. హెలి కాప్టర్ నుంచి ముఖ్యమంత్రులు దారి పొడవునా ఉన్న జనాన్ని చూసి ‘ఇంతమంది జనమా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ ఉందంటూ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ ప్రకటన నాటి నుంచి మంత్రి అజయ్ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణకు కసరత్తు చేశారు. అంతేకాకుండా ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే వెయ్యి మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సభ ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ముగిసేలా చూశారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
బీఆర్ఎస్ సభ: 2024లో మోదీ ఇంటికి.. మేము ఢిల్లీకి: కేసీఆర్
Upadates: Time 5.45 PM చివరగా అథితులుగా వచ్చిన సీఎంలు, నేతలకు ఘన సత్కారంతో సభను ముగించారు. Time 5. 40 PM దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఫర్వాలేదు.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తాము. అగ్నిపథ్‌కు కూడా రద్దు చేస్తాము. ఎల్ఐసీని ప్రభుత్వపరం చేస్తాము. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ అందిస్తాము. Time 5.20 PM కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Time 4.41 PM భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు. Time 4.02 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. Time 3.56 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు. Time: 3.35 PM సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్, డి. రాజా ఉన్నారు. Time: 2.30 PM ►రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జాతీయ నేతలు, సీఎంల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. Time: 02.00PM ►యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు. Time: 12.30PM సీఎం కేసీఆర్‌తో కలిసి ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. Time: 11.30AM ► తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర జాతీయ నేతలు యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత ఖమ్మం సభకు నేతలు వెళ్లనున్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్‌హౌజ్‌లోనే ఉండిపోయారు. సాక్షి, ఖమ్మం: చారిత్రక సభకు ఆతిథ్యమిచ్చేందుకు ఖమ్మం సిద్ధమైంది. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండడంతో సభావేదిక, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నగరమంతా గులాబీ నగిషీలు తొడుక్కుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారథ్యాన ఏర్పాట్లు పూర్తి కాగా, మరోపక్క నూతన కలెక్టరేట్ సముదాయం పుష్పగుచ్ఛంలా ముస్తాబైంది. ముఖ్యఅతిథులు తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటివెలుగును ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ఆవిర్భావ సభకు హాజరవుతారు. జాతరలా తరలివచ్చేలా.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలో ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం జన సమీకరణకు సర్వశక్తులొడ్డుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తొలి సభ కావడం, నాలుగు రాష్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండడంతో విజయవంతాన్ని ఈ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదిక ప్రత్యేకతలు.. సభా ప్రాంగణం : 100 ఎకరాలు వేదిక : జర్మనీ టెక్నాలజీ వాటర్, ఫైర్ రూఫ్ (గులాబీరంగు) హాజరయ్యే జనం (అంచనా : 5 లక్షలు ప్రాంగణంలో కుర్చీలు : లక్ష వేదికపై కూర్చునేది : సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌సింగ్‌మాన్, మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, పీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు సభావేదిక ముందు: ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు అధ్యక్షత : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేది: సీఎంలు పినరయ్ విజయన్, భగవంత్ సింగ్మాన్, కేజ్రీవాల్,అఖిలేష్ యాదవ్, డి.రాజా, చివరన సీఎం కేసీఆర్ సభా సమయం : మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు. సీఎంల పర్యటన షెడ్యూల్ ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బీఆర్ఎస్ తొలి సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మం రానున్నారు. వీరి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ► సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ► సీఎం కేసీఆర్‌తో కలిసి బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరి 10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. అక్కడ 10.40గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక 11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ► ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బీఆర్ఎస్ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ► ఈ సభలో తొలుత ముందుగా సీఎం పినరయి విజయన్ మాట్లాడగానే హెలీకాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు. ఆ తర్వాత మిగతా అతిథులు ప్రసంగిస్తారు. సభ ముగిశాక కేజ్రీవాల్, భగవంత్ మాన్ సాయంత్రం 5 గంటలకు, ఆతర్వాత అఖిలేష్ యాదవ్ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తారు. ► సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరతారు. తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు ఖమ్మం నగరాన్ని పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తదితరులు వస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండడంతో పంజాబ్, ఢిల్లీకి సంబంధించిన సీఎంల సెక్యూరిటీ వింగ్ అధికారులు చేరుకుని సభావేదిక, ప్రాంగణం, నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నలుగురు సీఎంలు తొలిసారి ఒకే వేదికపైకి రానుండడంతో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలను తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లు పర్యవేక్షిస్తుండగా, 5,210 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాగా, కలెక్టరేట్ నుంచి పది వాహనాలతో సభావేదిక వద్దకు కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అలాగే, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌తో పాటు పోలీసు కమిషనరేట్‌లో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశారు. నిఘా నీడలో ఖమ్మం! బీఆర్ఎస్ సభ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలే కాకుండా ఐదు లక్షల మంది మేర కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి నుంచి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించగా వారంతా జిల్లాకు చేరుకున్నారు. వీరిలో డీఎస్పీ ఆపైస్థాయి అధికారులకు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేయగా మిగతా వారికి కళ్యాణమండపాలు, హాస్టళ్లలో వసతి కల్పించారు. అలాగే, నగరంలోని వాసవీ గార్డెన్స్, మంచికంటి భవన్, తనికెళ్ల, బైపాస్‌రోడ్లలోని ఫంక్షన్ హాళ్లలో మెస్‌లు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు 5,200మంది ఖమ్మంతోపాటు ఇతర జిల్లాలనుంచి సుమారు 5,210మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో ఏఎస్పీలు పది మంది, ఏసీపీలు 39, సీఐలు, ఆర్ఐలు 139మంది, ఎస్సైలు 409మంది, ఏఎస్సైలు 530మంది, కానిస్టేబుళ్లు 1,772మంది, మహిళా కానిస్టేబుళ్లు 169మంది, హోంగార్డులు 1,005 మందితో పాటు స్పెషల్ పార్టీలు, రోప్ పార్టీ సిబ్బంది ఉన్నారు. ఇక భారీగా జనం హాజరుకానుండడంతో పిక్ పాకెటర్లు, పాత నేరస్తులపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి 150మంది ఇంటిలెజెన్స్ సిబ్బంది చేరుకోగా, వీరిలో ఐజీ స్థాయి మొదలు ఉద్యోగులు ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి బహిరంగ సభకు వివిధ జిలాల్ల నుంచి కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించగా, అక్కడ వాహనాలు నిలిపి సభకు వెళ్లేలా సూచనలు చేశారు. అలాగే, వాహనాలు వచ్చివెళ్లే మార్గాలను కూడా ప్రకటించారు. రహదారులు, బ్రిడ్జిలపై వాహనాలు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే పక్కకు తొలగించేలా బోయింగ్ వాహనాలు సిద్ధం చేశారు. ప్రారంభానికి ముస్తాబు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ – ఐడీఓసీ) ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మూడు రాష్ట్రాల సీఎంలు కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును బుధవారం ప్రారంభించనుండడంతో మంగళవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐడీఓసీ మొత్తాన్ని అందంగా పూలతో అలంకరించి లైట్లు అమర్చడంతో రాత్రివేళ జిగేల్మంటూ కనిపించింది. సీఎంలు, ఇతర ముఖ్యులు కలెక్టరేట్లోనే మధ్యాహ్న భోజనం చేయనుండడంతో మొదటి అంతస్తు స్టేట్ చాంబర్ పక్కనే ఉన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) చాంబర్లో ఏర్పాట్లు చేశారు. -
నేడు హైదరాబాద్ కు ఢిల్లీ, కేరళ సీఎంలు
-
ఖమ్మం నేతలతో భేటీ.. ‘పొంగులేటి’ వ్యవహారంపై కేసీఆర్ ఏమన్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సమావేశం సాగింది. ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. పొంగులేటి పార్టీ వీడినా నియోజకవర్గంలో క్యాడర్ చేజారకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న సీఎం కేసీఆర్ నగరంలో నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ హీట్