సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితులు ఉండేవని ఎద్దేవా చేశారు.
కాగా, మంత్రి పువ్వాడ అజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదు. తుమ్మల నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరం. గత ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికి తుమ్మల రిటైర్ అయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు తుమ్మల. నువ్వు లేకపోతే తెలంగాణ రాలేదా?. నీ వల్ల తెలంగాణ రాలేదు ఈ విషయం గుర్తు పెట్టకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నువ్వేమైనా సీఎంవా తుమ్మల?
ఇదే సమయంలో, తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవు. టికెట్లు ఇప్పించడానికి నువ్వేమైనా పార్టీ అధినేతవా లేక ముఖ్యమంత్రివా?. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధ రహితం. కందాలకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం. మమతా ఆసుపత్రి మా కష్టార్జితం. కేటీఆర్, అజయ్‌లు గుండెలు కోసుకునేతం మిత్రులం. నీ ఆస్తులు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వే పార్టీలు ఫిరాయించావు. ముందు టీడీపీ, తర్వాత బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్‌లో చేరావు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉండి భక్త రామదాసును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
తుమ్మల మనసాక్షికి తెలుసు..
మరోవైపు.. నామా నాగేశ్వర రావు కూడా తుమ్మలకు కౌంటరిచ్చారు. శనివారం నామా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు దీవించారు. తుమ్మల గురించి ముఖ్యమంత్రి వందకు వంద శాతం నిజం చెప్పారు. తుమ్మల మనసాక్షికి అది తెలుసు. కేసీఆర్ నన్ను పిలిచి మరీ ఎంపీని చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసింది నేనే. అందుకే నాకు ఎంపీ సీటు ఇచ్చారు. ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. అది కూడా నీ అకౌంట్‌లో వేసుకోవాలని చూస్తున్నావా తుమ్మల. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నా గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు. మా నాయకులు అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నావ్. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకో’ అని అన్నారు.
చర్చకు సిద్దమా..
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. నాపై ఆరోపణలు చేసే ముందు రుజువులు చూపించంది. అప్పుడు పాలేరు నుండి పోటీలో తప్పుకుంటాను. దీని కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో నో టికెట్.. పార్టీ మార్పుపై విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment