Telangana Assembly Elections 2023
-
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
అది కరెక్ట్ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి స్పందించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగనందునే ఓడామని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఓటమికి పది కారణాలను పార్టీ కేడర్‌కు ఆయన వివరించారు. ‘‘బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ప్రజలు తప్పుచేశారడనం సరికాదు. రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా ప్రజలే. మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లో, వేలల్లో మాత్రమే మన మెజార్టీ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకోవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి’’ అని కేడర్‌కు పిలుపు ఇచ్చారాయన. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పది కారణాలను కేటీఆర్ వివరించారు. పరిపాలనపైనే దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు. అందుకు పూర్తి బాధ్యత నాదే. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా మారి పార్టీని నడపడం సరికాదు. ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి పట్టించుకోలేదు. ప్రభుత్వానికి పథకాల మద్య కార్యకర్త లేకుండానేరుగా లబ్ధిదారుడికి పథకం చేరడంతో ఓటర్‌కి.. కార్యకర్తకు లింక్ తెగిపోయింది. రాష్ట్రంలో గత పదేళ్లలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా.. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయాం. ప్రతీ నియోజకవర్గంలో 15 వేల కొత్త పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోయాం. వందలో ఒక్కరికి రాలేదు.. అదే నెగెటివ్‌గా ప్రచారం అయ్యింది. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వాళ్లు ఓపిక పట్టలేకపోయారు. వాళ్లంతా అసహనంతో మనకు వ్యతిరేకం అయ్యారు. రైతు బంధు తీసుకున్న సామాన్య రైతు కూడా.. ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇస్తే ఒప్పుకోలేదు’’ అని ఓటమి కారణాల్ని కేటీఆర్ విశ్లేషించి.. బీఆర్ఎస్ కేడర్‌కు వివరించారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులో ఉండదు. ఇక ఎమ్మెల్యే చుట్టూ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టురానే ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించం అని కేడర్‌ను హెచ్చరించారాయన. -
పార్టీ అభిమానులూ ఓటేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు. పొత్తు సాధ్యం కాక... తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్‌రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. -
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం -
అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు. ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్ పీరియడ్‌గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది. గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే. ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్‌లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్‌లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది. వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి. సెక్రటేరియట్‌కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి. రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్ చర్యే! వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది. అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్‌లోకి వచ్చే ప్రొసీజర్స్‌ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది. కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్‌కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం. తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్‌లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్... కథ అడ్డం తిరిగింది! ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్ పార్టీ టెన్ బై టెన్ స్కోర్ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది. తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్ఎస్ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్ బూత్‌ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్పల్లి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్‌లో బీఆర్ఎస్కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్‌కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్‌బీ కాలనీ బూత్ నెంబర్ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్‌కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపై బాబు అనుచిత వ్యాఖ్యలు
-
తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..
హైదరాబాద్: తెలంగాణలో మరికాసేపట్లో ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్‌ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది నాయకుల జాబితాలో భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఉన్నారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
కొత్త ఎమ్మెల్యేల్లో 82 మందిపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 85 మందికి సీట్లు కేటాయించగా వారిలో 51 మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నా రు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన 79 మందిలో ఏడుగురు, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన 57 మందిలో 19 మంది, ఏఐఎంఐఎం కేటాయించిన ఐదుగురిలో నలుగురు గెలిచా రు. కాగా సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరా వుపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఈ సంస్థలు బుధవారం ఒక నివేదికను విడుదల చేశాయి. ఆస్తుల్లో అగ్రస్థానంలో వివేక్ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి గెలిచిన 119 మందిలో 114 (96%) మంది కోటీశ్వరులు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 60 (94%) మంది, బీఆర్ఎస్ నుంచి 38 (97%) మంది, బీజేపీ నుంచి 8 (100%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు (100%), సీపీఐకి చెందిన ఒకరు (100%) తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న ట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వివేకానంద్ (కాంగ్రెస్) తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి ప్రథమ స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రూ.433+ కోట్లతో పాలే రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.58+ కోట్లు, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తార క రామారావు రూ.53+ కోట్లు, సీఎల్పీ నాయకుడు, టీపీసీ సీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్ల ఆస్తులు ప్రకటించారు. రూ.24+ లక్షలతో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచా రు. రూ.28+ లక్షలతో దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్, రూ.56+లక్షలతో అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణలు తదుపరి స్థానా ల్లో ఉన్నారు. 2023లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 38.88 కోట్లు కాగా.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.15.71 కోట్లు కావడం గమనార్హం. అప్పుల్లో దానం టాప్ మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తమకు రూ. కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని ప్రకటించారు. రూ.49+ కోట్ల అప్పుతో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రథమ స్థానంలో నిలిచారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (రూ.43+ కోట్లు), చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ (రూ.41+ కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 96 మంది ఎమ్మెల్యేల వయసు 51 పైనే తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 23 (19%) మంది ఎమ్మెల్యేల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండగా, 96 మంది (81%) ఎమ్మెల్యేలు 51–80 సంవత్సరాల మధ్య వయస్సుతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేగా బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి (74) నిలిచారు. అత్యంత పిన్న వయస్కులైన ఎమ్మెల్యేలుగా పాలకుర్తి నుంచి గెలుపొందిన యశస్విని (26), మెదక్ నుంచి గెలిచిన మైనంపల్లి రోహిత్ (26) నిలిచారు. కాగా కొత్త అసెంబ్లీలో 109 మంది పురుషులు, 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. -
దక్షిణాదిలో ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్‌లో ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రాగలిగింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడంతో అధికారంలోకి వస్తామని లేదా అధిక సంఖ్యలో సీట్లు సాధించి కింగ్‌మేకర్ లేదా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్రాల్లోనూ నిలిచి ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో మరింత బలోపేతమవుతున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఎందుకు విస్తరించలేకపోతు న్నది? అందుకు దారితీస్తున్న, ప్రభావం చూపు తున్న అంశాలేమిటి అన్న దానిపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. వరుస ఓటములతో.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, తెలంగాణలో ఓటమితో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. డీలా పడిన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటితో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రా యం పార్టీలో వ్యక్తమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవ గా, వచ్చే ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టమిని అధిగమించినట్టు అవుతుందనే చర్చ అంతర్గతంగా ముఖ్యనేతల్లో సాగుతున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల కల్లా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాదిలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టు దొరక్కపోవడానికి కారణాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణాదికి సంబంధించి ప్రత్యేక ఎ జెండాకు తుది రూపం ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిని ఆనుకొని పొరుగున రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాల్లో 181 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 53 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను దాటి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే దిశగా కచ్చితమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్లనుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రపార్టీలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణ ఫలితాలపై బీజేపీ పోస్టుమార్టం
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైంది. పార్టీలో జరిగిన పరిణామాలు.. సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కమలసారథి కిషన్ రెడ్డి, అసలు కాషాయ దళపతి హస్తినకు తీసుకెళ్లిన రిపోర్ట్ లో ఏముంది ? ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 8 అసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు సాధించి ఉనికి చాటుకుంది. గత మూడేళ్లుగా బీజేపీ చేసిన పోరాటలకు.. వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు. కిషన్ రెడ్డి ఇస్తున్న రిపోర్ట్ లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు వర్కవుట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, బీసీ సీఎం నినాదం ఎంత వరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినా.. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఆరు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు... టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నా వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది. దీంతో జీహెచ్ఎంసీలో కేవలం ఒక్క గోషామహల్ విజయంతో సరిపెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది. కాంగ్రెస్ ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు పోటీ చేసి పరాజయం పాలుకావడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసినప్పటికీ ఎందుకు గెలవలేదనే దానిపై చర్చ సాగుతోంది. ఎంపీల అతివిశ్వాసం, గ్రేటర్ లో కార్పోరేటర్ల సహాయ నిరాకరణ, నేతల మధ్య ఆధిపత్య పోరులాంటి అంశాలు.. బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు ? పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చదవండి: TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు -
చెల్లని నాణేలు..చిల్లర రాజకీయాలు...
-
Telangana: కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
-
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. -
సీరియస్ పొలిటికల్ పిక్చర్ లో కమెడియన్లు
-
ఆ లోక్‌సభ సెగ్మెంట్లలో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్‌సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్‌లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్కు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఇక పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్ఎస్ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్‌లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ రాజధానిలో హస్తవాసి బాగాలేదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీ నలుగురు ఎంపీలున్నా నిరాశే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు. మరో ఎంపీ సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. సంజయ్ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌లలో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్‌లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు (ఫొటోలు)
-
బర్రెలక్క.. తగ్గేదేలే!
బర్రెలక్క(శిరీష).. ఆమె ఓ సోషల్ మీడియాలో సంచలనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు సైతం ఆమె ముచ్చెమటలు పట్టించారు. శిరీషకు వచ్చిన ప్రచారాన్ని చూసి ఆమె గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. ఒకవైపు ప్రశంసలు.. మరొకవైపు విమర్శల నడమ ఆమె పోటీకి సై అన్నారు. వెనక్కి తగ్గమని బెదిరింపులు.. బుజ్జగింపుల పర్వం కొనసాగినా చివరి వరకూ పోటీలోనే ఉంటానని చెప్పి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శిరీష. అయితే ఇక్కడ బర్రెలక్క అనబడే శిరీష ఓడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాలుకల్లో ఉండిపోయేంత ఆదరణను చూరగొంది. అదే ఇప్పుడు ఆమెకు కొండంత బలంలా పని చేస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రెడీ అంటోంది. నాల్గో స్థానమే.. కానీ ప్రతీ నోట బర్రెలక్క మాటే..! ఆమె పోటీ చేసిన కొల్లపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన శిరీషకు మొత్తం 5,598 ఓట్లు వచ్చాయి. కానీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయి? కొల్లపూర్లో పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడిచింది. ప్రధానంగా బర్రెలక్క ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం కూడా జనం నోళ్లల్లో ఎక్కవగా నానింది. చివరకు పరాజయం చవిచూసినా ఒక సామాన్యురాలు.. ఆ మాత్రం ముందుకు వెళ్లడమే చాలా గొప్ప విషయమంటూ పొగిడిన నోళ్లు ఎన్నో.. నాకు ప్రచారానికి టైమ్ సరిపోలేదు.. ఫలితాల అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. తాను ప్రచారం ఎక్కువ రోజులు చేయలేకపోయానని, వారం రోజులు మాత్రమే తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేసినట్లు చెప్పారు. తాను ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదానినని ఆమె పేర్కొంది. ప్రజలు ఎవరినీ తొందరగా నమ్మరని, తనది చిన్న వయసు కావున.. ఎలా పాలిస్తుందని అనుకున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను ఓడిపోలేదని ప్రజల మనసు గెలిచానని తెలిపారు. కొందరు తనకు ఓటు వేయకూడదని ఓటర్లను బెదిరించారని చెప్పారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచలేదని.. తనకు వచ్చిన ఓట్లు స్వచ్ఛమైనవని, ఈ రకంగా తాను గెలిచినట్లేని చెప్పారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, మద్దతుగా నిలిచిన మేధావులకు, సోషల్ మీడియా మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఆసక్తి ఓట్లు విషయంలో ఆమె అందరిలో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. గెలవకపోయినా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన మార్క్ చూపుతుందని ఆమె మద్దతుదారులు ఆశించారు. ఆమె ప్రచారం కోసం పలు సంఘాల నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్లు, న్యాయవాదులు, టీచర్లు, ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు.. ఆమె సైతం ఎవరికీ భయపడకుండా.. ఒక వైపు తన సోదరుడి మీద దాడి జరిగినా ప్రచారంలో ముందుకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లను పక్కన పెట్టి.. అసలు పోటీ చేయడమే గొప్ప విషయమని, నిరుద్యోగుల పక్షాన పోరాటం అపొద్దని నెటిజన్లు కోరుతున్నారు. పోటీలో గెలవకపోయినా శిరీష తొలి అడుగును, ప్రచారంలో ఆమె చూపిన ధైర్యాన్ని అన్ని వర్గాలు వారు అభినందిస్తున్నారు. బర్రెలక్క బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. -
జస్ట్ మిస్.. కొద్దిలో గట్టెక్కింది వీరే.. భారీ మెజార్టీ వీళ్లదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్లాన్ జరుగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్‌తో, భారీ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
ఎట్టకేలకు పోరాడి గెలిచారు
-
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
ప్రజాసేవలో డాక్టర్లు..!
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు. ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. -
కమల వికాసం.. విలాపం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్‌కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. నిజంకాని అంచనాలు.. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్లో), ధర్మపురి అరి్వంద్ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్‌లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్‌లలో), ఎం. రఘునందన్‌రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది. ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్‌ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వివేక్, రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. -
జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో లక్ష్మణ్‌గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్ తేజావత్ సంపత్‌నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్ సింబల్‌కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్‌కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్‌లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్‌లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
ఉమెన్.. డబుల్ డిజిట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్‌కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్‌సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్‌గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్‌ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
పార్టీ మారినా.. ఓటమి తప్పలే..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ 2018 ఎన్నికల్లో గెలుపొందిన విపక్ష ఎమ్మెల్యేల్లో 16 మంది బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరికి ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో 14 మంది బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ –ఎస్టీ), స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావ్యుడా రాములు నాయక్ (వైరా ఎస్టీ) బీఆర్ఎస్లో చేరినా ప్రస్తుత ఎన్నికలో టికెట్ దక్కలేదు. గత ఎన్నికలో టీడీపీ నుంచి గెలుపొందిన మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట ఎస్టీ), సండ్ర వెంకట వీర య్య (సత్తుపల్లి ఎస్సీ)తో పాటు కాంగ్రెస్ నుంచి 12 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), సుదీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్ ఎస్సీ), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), రేగా కాంతారావు (పినపాక ఎస్టీ), హరిప్రియ భానోత్ (ఇల్లందు ఎస్టీ), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్రావు (కొత్తగూడెం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ఎస్టీ) బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (ఎల్బీనగర్) మాత్రమే తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ వీడి.. గెలుపుతీరానికి చేరి.. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరి టికెట్లు దక్కించుకున్న పలువురు నేతలు గెలుపు తీరాలకు చేరారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా నిరాకరించి కాంగ్రెస్‌లోకి వెళ్లి తనతో పాటు తన కుమారుడికి టికెట్ సాధించుకున్న మైనంపల్లి హన్మంతరావు మాత్రం ఓటమి చెందారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), మందుల సామేలు (తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), మనోహర్‌రెడ్డి (తాండూరు), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), కూచుకుళ్ల రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి కుమారుడు), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్) గెలుపొందారు. సరితా తిరుపతయ్య (గద్వాల), శ్యామ్ నాయక్ (ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త – ఆసిఫాబాద్), జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి) తదితరులు కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలుపు తీరాలకు చేరలేక పోయారు. బోగా శ్రావణి (జగిత్యాల), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), కందుల సంధ్యారాణి (రామగుండం), పులిమామిడి రాజు (సంగారెడ్డి), కేసీఆర్ రత్నం (చేవెళ్ల) బీజేపీలో, నీలం మధు (పటాన్చెరు) బీఎస్పీలో చేరి టికెట్లు దక్కించుకున్నా ఫలితం లేకపోయింది. -
ఓడిపోయిన అనుభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే... ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. ♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. ♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. ♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్దీ ఇదే పరిస్థితి. ♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. ♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. ♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. పొరుగునే ఉన్న ధర్మపురి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్‌నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్‌తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. బండి.. గంగుల నువ్వా–నేనా.. కరీంనగర్లో విజయం చివరి వరకూ దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. దీనిపై బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్ కేంద్రానికొచ్చా రు. పోలింగ్ బూత్ 43,289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూమ్‌నంబర్ 3లోని 594 ఓట్లు, రాంపూర్‌లోని విద్యార్థి హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లలోని 697 ఓట్లను లెక్కించారు. చివరికి 3,169 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. ► మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారా యణ విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే రసమయిపై ఏ దశలోనూ వెనకబడలేదు. ► చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై ఆధిపత్యం చూపించారు. ► హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్‌పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. ► పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని– శ్రీధర్‌బాబు, రామగుండం– మక్కాన్ సింగ్, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్‌స్వీప్ చేసింది. మక్కాన్‌సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్‌కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి. ► సిరిసిల్లలో కేటీఆర్(బీఆర్ఎస్) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు. ► వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్‌గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ► జగిత్యాలలో తొలుత జీవన్‌రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌పోల్స్ కూడా అరవింద్‌కే మొగ్గుచూపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్‌పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. విశేషాలు.. ► కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు. ► హుజూరాబాద్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓడిపోయారు. ► రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ► ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా.. 8 కాంగ్రెస్.. 5 బీఆర్ఎస్ కైవసం! కరీంనగర్: గంగుల కమలాకర్ (బీఆర్ఎస్), ఓట్లు: 92,174, మెజారిటీ 3,169, రెండోస్థానం: బండి సంజయ్ కుమార్ (బీజేపీ), ఓట్లు: 89,005, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 40,052 పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్), ఓట్లు: 1,18, 888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్‌రెడ్డి(బీఆర్ఎస్) ఓట్లు: 63,780, మూడో స్థానం:దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315 రామగుండం: రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ (కాంగ్రెస్) , ఓట్లు: 92,227 , మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్(బీఆర్ఎస్), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966 మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్ఎస్), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779 మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్ (బీఆర్ఎస్), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్ (బీజేపీ) ఓట్లు: 14,879 చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్ పార్టీ: (బీఆర్ఎస్) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669 హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండోస్థానం: ఈటల రాజేందర్ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్ (కాంగ్రెస్) ఓట్లు :53,164 హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్ కుమార్, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓట్లు: 8338 సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్ఎస్), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328 వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్ఎస్). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్‌రావు (బీజేపీ), ఓట్లు: 29,710. జగిత్యాల: సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138 కోరుట్ల: సంజయ్ (బీఆర్ఎస్), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), ఓట్లు : 39,647 ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్.కుమార్ (బీజేపీ), ఓట్లు: 7,345 ఇవి చదవండి: కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..! -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
‘విక్రమార్కుడి’ విజయ పరంపర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్‌రాజ్‌కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్రాజ్పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. ‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్‌కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
తెలంగాణ గడ్డపై తొలిసారి కాంగ్రెస్..
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటి చేసిన సీపీఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు(ఆదివారం) జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్.. అదే ఊపును కడవరకూ కొనసాగించింది. ఫలితంగా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది. మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా, బీఆర్ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపును అందుకుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ చూస్తే వెనుకబడే ఉంది. ఎక్కడ కూడా లీడ్‌లోకి రాలేదు. కాంగ్రెస్ ఆది నుంచి 50 స్థానాల్లో ఆధిక్యం దక్కకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో బీఆర్ఎస్ వెనుకంజలో పయనించింది. కాగా, బీఆర్ఎస్ ఓటమిలో బీజేపీ పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నికలు పోరు ప్రారంభమైన నాటి నుంచి బీఆర్ఎస్-బీజేపీలు మిత్రులు అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్కు ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తుందనే ప్రచారం కూడా కాంగ్రెస్ చేసింది. వీరిద్దరూ మిత్రపక్షాలేనని, బీఆర్ఎస్ ‘ఏ’ టీమ్ అయితే బీజేపీ ‘బీ’ అంటూ ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ సుమారు 14 శాతం ఓట్ల షేర్‌ను సాధించినట్లే కనబడుతోంది. అదే సమయంలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అభ్యర్థుల్లు ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..? -
కేసీఆర్ చేసిన ఆ ఒక్క తప్పు భారీ ఓటమికి కారణం
-
బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు, కవిత రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి Jai KCR !! Jai BRS !! Dear BRS family, thank you for all the hardwork !! Special thanks to all the social media warriors for the fight you put up !! Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023 -
కాంగ్రెస్‌కు తాత్కాలిక ఓటమే.. లోక్‌సభకు సిద్ధమవుతాం: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో తెలంగాణ మినహా.. మూడు రాష్ట్రాల్లో గెలుపును బీజేపీ సుస్థిరం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణలో.. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకొని.. తెలంగాణలో గెలిచి.. మధ్యప్రదేశ్‌లో గట్టి పోటీ ఇస్తామనుకున్న కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది. తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. మూడు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే స్పందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓటమిని తాత్కాలిక పరాజయంగా భావిస్తామని తెలిపారు. ఈ ఓటమిని నుంచి బయటపడి.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలపే లక్ష్యంగా సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో(రాజస్తాన్, చత్తీస్‌గఢ్) అధికారం కోల్పోయింది. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. అయితే ముందు నుంచి ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసింది. మొత్తగా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గెలుపు కొంత ఉపశమనం కలిగించింది. -
శ్రీకాంతాచారికి ఈ విజయం అంకితం: రేవంత్
-
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్‌గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు (ఫొటోలు)
-
Telangana Congress Celebrations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబురాలు (ఫోటోలు)
-
సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక వ్యాఖ్య
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన. -
కేవలం ఐదు స్థానాల్లో బిఆర్ఎస్ విజయం
-
గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్‌లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్‌రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్‌లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్‌ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు. -
తెలంగాణ కాంగ్రెస్ విజయ సారథి అనుముల రేవంత్‌రెడ్డి (ఫొటోలు)
-
తెలంగాణ ఫలితాలు: ఫిరాయింపుదారులకు దెబ్బ
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు. మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు. కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చందర్ పోటీ చేయగా.. రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ 40 వేల ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు. పైలెట్ రోహిత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో గెలుపొందిన పైలెట్ రోహిత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తార్వత బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన రోహిత్‌రెడ్డిని ఆ నియోజకవర్గం ప్రజలు ఓటర్లు తిరస్కరించారు. గండ్ర వెంకట రమణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈసారి ఫిరాయించిన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గండ్ర ఓటమిపాలయ్యారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల విరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమిపాలయ్యారు. ఆయితే లింగయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి ఈసారి పోటీ చేశారు. నకిరేకల్ నియోజకవర్గ ఓటర్లు లింగయ్యను తిరస్కరించారు. వనమా వెంకటేశ్వర్ రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వనమా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్లీ పోటి చేయగా ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వనమా కొత్తగూడెంలో ఓడిపోయారు. సండ్ర వెంకటవీరయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023లో ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీ చేయగా.. సత్తుపల్లి ఓటర్లు తిర్కరించారు. రేగా కాంతారావు గత ఎన్నికల్లో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంతారావు మళ్లీ బరిలో దిగారు. అయితే ఈసారి పినపాక సెగ్మెంట్ ఓటర్లు కాంతారావును తిరస్కరించారు. హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు హరిప్రియా నాయక్. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి.. బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పికపాక నుంచి పోటీ చేసిన హరిప్రియ ఓటమిపాలయ్యారు. ఉపేందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్లోకి జంప్ చేశారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఆయన్ని పాలేరు నియోజకవర్గ ఓటర్లు తిర్కరించారు. సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు. ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన్ని ఎల్లారెడ్డి ఓటర్లు సురేందర్‌రెడ్డిని తిరస్కరించారు. హర్షవర్ధన్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఈసారి ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఓటర్లు హర్షవర్ధన్‌రెడ్డి తిరస్కరించారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
ఫుల్ జోరులో కాంగ్రెస్.. సీఎం అభ్యర్థుల లీడింగ్ ఎలా ఉందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నేతలు భారీ మెజార్టీ సంపాదించారు. మరోవైపు, అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. మెజార్టీ ఇలా.. రేవంత్‌రెడ్డి.. 12వేల మెజార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 25వేల మెజార్టీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. 20వేల మెజార్టీ భట్టి విక్రమార్క.. 8వేల మెజార్టీ సీతక్క.. మూడు వేల మెజార్టీ ఇక, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే కీలక చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మా నేత సీఎం అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం అధిష్టానమే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో హస్తం శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | #TelanganaElection2023 | Congress workers pour milk on a poster featuring Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and state party chief Revanth Reddy as the party continues its lead in the state. As per the official EC trends, the… pic.twitter.com/IWi4QEz4EQ — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను కర్ణాటకకు తరలించే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాజ్‌కృష్ణలో డీకే శివకుమార్ సహా కర్ణాటక నేతలు బస చేశారు. లగ్జరీ బస్సులను కూడా తరలింపునకు రెడీ చేశారు. #WATCH | Congress cadre burst firecrackers outside the office of the party's state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt — ANI (@ANI) December 3, 2023 -
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కౌంట్‌డౌన్.. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠ (ఫొటోలు)
-
రిజల్ట్స్ టెన్షన్ అందరిలో..!
-
నల్లగొండ జిల్లా దేవరకొండ మొదటి రౌండ్ ఫలితాలు
-
గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ
-
క్షణం క్షణం ఉత్కంఠగా..తెలంగాణ ఎన్నికల కౌంటింగ్.. (ఫొటోలు)
-
TS: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా.. -
తెలంగాణ రిజల్ట్..ప్రత్యక్షప్రసారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందోనన్న అంశంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ను ప్రత్యేక ప్రసారం ద్వారా చూడండి. -
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ గవర్నర్‌తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధమని తెలిపిన నేతలు గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందించిన పార్టీ బృందం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుంది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరతాం: డీకే శివకుమార్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్‌కు చెప్పనున్న కాంగ్రెస్ నేతలు కాసేపట్లో సీఎల్పీ సమావేశం హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హోటల్లో డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ నలుగురు పరిశీలకులు తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. మ్యాజిక్ ఫిగర్ 60 తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌ను కోరిన గవర్నర్ తమిళిసై పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ 23వ రౌండ్ కౌంటింగ్ ని నిలిపివేసిన అధికారులు రీ కౌంటింగ్ చేయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అధికారులు, RO తో మాట్లాడుతున్న కాట శ్రీనివాస్ కౌంటింగ్ కేంద్రం ముందు భారీగా చేరుకున్న మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా కార్యకర్తలు రావడంతో కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మా సీఎం అభ్యర్థి పార్టీ కోసం కష్టపడ్డాడు.. గెలిపించాడు.. మా హైకమాండ్ కూడా రేవంత్ కు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటుంన్నా.. ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గత ఎన్నికల కంటే తగ్గిన మెజార్టీ హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. మరి కొద్దిసేపట్లో హోటల్ కు చేరుకోనున్న 27 మంది గెలిచిన ఎమ్మెల్యే లు రాత్రి 9 గంటలకు సీఏల్పీ మీటింగ్.. ఆలోపే గెలిచిన ఎమ్మెల్యేలు హోటల్ కు రావాలని పిలుపు రీకౌంటింగ్‌ను కోరిన బండి సంజయ్. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల గెలుపుపై రీకౌంటింగ్ కు కోరిన బండి సంజయ్.. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అప్పీల్ చేసిన సంజయ్.. నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు 1.బాన్సువాడ లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పై 23,464 ఓట్ల మెజారిటీతో విజయం. 2.బాల్కొండ లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత రెడ్డి విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి పై 4,533 ఓట్ల మెజారిటీతో గెలుపు. 3.నిజామాబాద్ అర్బన్ లో బీజేపి అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారాయణ విజయం సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పై 15,387 మెజార్టీ గెలుపు 4.ఆర్మూర్ లో బీజేపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఘన విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పై 29,669 ఓట్ల మెజారిటీతో గెలుపు. 5.నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి విజయం సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై 21,963 ఓట్ల మెజారిటీతో విజయం. 6.బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ పై 3,062 ఓట్ల మెజారిటీతో విజయం. సిద్ధిపేటలో హరీష్ రావు విజయం సిద్ధిపేటలో హరీష్ రావు విజయం 2018 కంటే తగ్గిన మెజారిటీ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి 6789 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ పై గెలుపొందిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి మూడో స్థానంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ: పీటీఐ వర్గాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కు ఈసీ నోటీసులు వివరణ ఇవ్వాలని ఇద్దరికీ ఆదేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి గుల్లంగన కింద అధికారులపై ఈసీ చర్యలు హుజూరాబాద్‌లో ఈటల ఓటమి హుజూరాబాద్‌లో ఈటల ఓటమి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌషిక్ రెడ్డి ఈటలపై విజయం కరీంనగర్లో స్వల్ప మెజార్టీతో గంగుల కమలాకర్ గెలుపు కేవలం 326 ఓట్ల మెజార్టీతో గెలుపు రీకౌంటింగ్ కోరిన బండి సంజయ్ రేపు(సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం సీఎం ఎవరు అనే దానిపై కసరత్తు సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చిన కేసీఆర్ ఎల్బీనగర్లో బీఆర్ఎస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు. బోధ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ముందంజ రెండో స్థానంలో కేసీఆర్, మూడో స్థానంలో రేవంత్ 15వ రౌండ్ ముగిసే సరికి 3వేల మెజార్టీతో బీజేపీ ఇంకా నాలుగు రౌండ్స్ మిగిలి ఉన్నాయి. వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి విజయం ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్మా బుజ్జు విజయం చెవెళ్లలో బీఆర్ఎస్ విజయం స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ డిమాండ్ ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి విజయం సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు 29వేల మెజార్టీతో కేటీఆర్ విజయం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు గెలుపు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డా. మురళీనాయక్ విజయం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు గెలుపు. నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి విజయం నర్సంపేటంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడ్ సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి ముందంజ ఐదువేల ఓట్లతో లీడ్‌లో జగదీష్ రెడ్డి ఇది తెలంగాణ ప్రజల విజయం: భట్టి మధిరలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తాను. దొరల తెలంగాణ పాలన పోయింది, ప్రజల తెలంగాణ పాలన వచ్చింది. ఇది తెలంగాణ ప్రజల విజయం దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ విజయం తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి కొల్లాపూర్‌లో కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు బర్రెలక్క(శిరీష) ఓటమి మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్ట విక్రమార్క గెలుపు మధిరలో 35వేల మెజార్టీతో భట్టి విజయం హుస్నాబాద్‌లో ముందంజలో పొన్నం ప్రభాకర్ 11వేలకుపైగా ముందంజలో కొనసాగుతున్న పొన్నం గోషామహల్లో రాజాసింగ్ గెలుపు ఆర్మూర్‌లో బీఆర్ఎస్కు షాక్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓటమి బోధన్‌లో కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు తుంగుత్తురిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామూల్ గెలుపు. మంథనిలో శ్రీధర్‌బాబు గెలుపు 30వేలకు పైగా మెజార్టీతో గెలుపు సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ గెలుపు. మునుగోడులో 21వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు. చరిత్రను తిరగరాసిన స్పీకర్ పోచారం తెలంగాణ చరిత్రలో స్పీకర్‌గా ఓడిపోవడం అనవాయితీ కానీ, ఈ ఎన్నికల్లో పోచారం విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం బ్రదర్స్(వినోద్), కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పటోళ్ల సంజీవ రెడ్డి భారీ గెలుపు. బాన్సువాడలో పోచారం గెలుపు బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం విజయం మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు. ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చేవెళ్ల, స్టేషన్‌ఘన్‌పూర్ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఓటమి నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ విజయం హుజుర్నగర్లో ఉత్తమ్ కుమార్ విజయం 46వేల మెజార్టీతో ఉత్తమ్ గెలుపు కొడంగల్‌లో రేవంత్ విజయం 32వేల మెజార్టీతో రేవంత్ గెలుపు భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సిరిసిల్లలో కేటీఆర్ 25వేల ఆధిక్యం. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి విజయం హుజురాబాద్‌లో 10వేల మెజార్టీలో పాడి కౌశిక్ రెడ్డి. హుస్నాబాద్‌లో 14వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 11,515 ఆధిక్యత దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం రఘునందన్ రావు ఓటమి. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ గెలుపు 14వేల మెజార్టీతో తుమ్మల విజయం జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు విజయం మధిరలో భట్టి విక్రమార్కకు 22వేలకుపైగా ఓట్ల ఆధిక్యం నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ విజయం 54వేలకు పైగా భారీ మెజార్టీలో కోమటిరెడ్డి గెలుపు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామెదర రాజనర్సింహ గెలుపు 24వేల భారీ మెజార్టీతో భారీ విజయం బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం బెల్లంపల్లిలో భారీ ఆధిక్యంలో వివేక్ సూర్యాపేటలో ముందంజలో మంత్రి జగదీష్ రెడ్డి. ఓటమి దిశగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్కు బిగ్ షాక్ పోటీ చేసిన గజ్వేల్, హుజురాబాద్‌లో ఓటమి దిశగా ఈటల సికింద్రాబాద్ నియోజకవర్గం రౌండ్ నెంబర్: 11 BRS: 4460 BJP: 2315 NC: 2093 11వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2145 11వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 32883 ఓట్లతో ఆధిక్యం.. గాంధీ భవన్‌కు భారీ ర్యాలీతో బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్‌కు చేరుకున్న డీకే శివకుమార్ నల్గొండలో 44 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంబర్‌పేటలో బీఆర్ఎస్ విజయం కాలేరు వెంకటేశ్ గెలుపు. నాగర్‌కర్నూల్‌లో వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బహదూర్‌పురలో విజయం దిశగా ఎంఐఎం షాద్ నగర్లో 12వ రౌండ్ ముగిశాక కాంగ్రెస్ అభ్యర్ధి 1407 లీడ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు తెలంగాణలో జనసేన పరిస్థితి ఇది.. డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఎనిమిది చోట్ల అదే పరిస్థితి ప్రధాన పార్టీలకు ఏమాత్రం దరిదాపుల్లో ఓట్లు దక్కించుకోని జనసేన అభ్యర్థులు 80కి పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కుత్బుల్లాపూర్‌లో 60,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో 11 రౌండ్లు ముగిసే సరికి 19798ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగా రెడ్డి ముందంజ అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థికి 9వ రౌండ్ లో 14,624 ఓట్ల ఆధిక్యం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ డీజీపీ వెంట సీనియర్ ఐపీఎస్‌లు కూడా పూల బొకేలు ఇచ్చి రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పిన అధికారులు తాండూరులో 800 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ 8వ రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 16,136 లీడ్ రంగారెడ్డి జిల్లా 14 స్థానాల్లో 11లో బీఆర్ఎస్కు ఆధిక్యం, 3 కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ఠాకూర్ విజయం చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ విజయం ఆంధోల్ నియోజకవర్గంలో 14 రౌండ్ ముగిసేసరికి 20 వేల పై చిలుకు ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు.. ఉత్తమ్ స్పందన తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో సోనియా ఉన్నారు: ఉత్తమ్ 2014, 2018 ఎన్నికల్లో మేము కొన్ని తప్పులు చేశాం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తున్నారు మేడ్చల్‌లో మల్లారెడ్డికి 23 వేల ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి రేవంత్‌రెడ్డి లీడ్ చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థికి 14 వేల లీడ్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ ఆరు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వినిరెడ్డి సిరిసిల్లలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాకలో పదవ రౌండ్ మూసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 32,349 ఓట్ల ఆదిక్యత కూకట్‌పల్లిలో ఏడవ రౌండ్ ముగిశాక.. 29,805 లీడ్‌లో కృష్ణారావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం.. బాణసంచా కాలుస్తూ సంబురాలు మరొకొందరు హస్తం కార్యకర్తలు సోనియా గాంధీ ఫొటోకు పాలభిషేకం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు... నగర శివారు ప్రాంతాల్లో BRS హవా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో విజయతీరాల్లో BRS రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఎల్బీనగర్ లో BRS బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఆరో రౌండ్ ముగిసినా.. ఈటల వెనుకంజ హుజురాబాద్‌లో ముగిసిన ఆరో రౌండ్ పాడి కౌశిక్‌రెడ్డి ముందంజ ఆరువేల ఓట్లకు పైగా ఆధిక్యం రెండోస్థానంలో కాంగ్రెస్ తొలి రౌండ్‌నుంచి.. మూడో స్థానంలోనే కొనసాగుతున్న ఈటల ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 13,000 లీడ్ ఖానాపూర్‌లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు హుజూరాబాద్‌లో ఆరో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి లీడ్ మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్) 15 వేల ఆధిక్యం పెద్దపల్లిలో 17వేల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు భద్రాచలంలో గెలుపు దిశగా బీఆర్ఎస్? పదో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ 5,155 ఇంకా మిగిలి ఉన్న మూడు రౌండ్స్ శేరిలింగంపల్లిలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ మధిరలో 15వేల ఓట్ల ఆధిక్యంలో విక్రమార్క కామారెడ్డిలో 1200 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో 12 వేల ఓట్ల ఆధిక్యంలో యూకత్పురలో ఆధిక్యంలో బీజేపీ బహదూర్‌పురలో ఆధిక్యంలో ఎంఐఎం దేవరకద్రలో 600 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ సంగారెడ్డిలో ఆధిక్యంలో బీఆర్ఎస్ బర్రెలక్కకు 1200 ఓట్లు నాంపల్లి 100 ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం ములుగు నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క(అనసూయ) 12,673 ఓట్ల ఆధిక్యం ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి 21,349 మెజార్టీలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి. జహీరాబాద్ ఆరో రెండు ముగిసే సరికి 906 ఓట్ల స్వల్ఫ ఆదిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు. మధిరలో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి మల్లు భట్టి విక్రమార్కకు 15819 ఓట్ల మెజార్టీ ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం బోణీ కొట్టిన కాంగ్రెస్ తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం పినపాక 7వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ 14,307 భద్రాచలం 8వ BRS లీడ్ 2853 అశ్వారావుపేట 12వ కాంగ్రెస్ 26306 ఇల్లండు 12th కాంగ్రెస్ 35 241 కొత్తగూడెం 6వ CPI లీడ్ 13,820 మంచిర్యాల్లో నాల్గవ రౌండు ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌కు 10,107 మెజార్టీ హుస్నాబాద్ లో 8 వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు 6235 లీడ్ ఖానాపూర్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి.. బీజేపీ 700 ఓట్ల లీడ్ సనత్ నగర్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 11658 ఓట్ల ఆధిక్యం భువనగిరిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత కంటోన్మెంట్లో ఐదు రౌండ్లు ముగిసేసరికి.. 21 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్య నందిత సాయన్న ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో.. కాంగ్రెస్ 59 బీఆర్ఎస్ 37 బీజేపీ 9 ఎంఐఎం 1 తుమ్మలకు 8 వేల లీడ్ మహబూబ్‌నగర్‌లో 65 ఓట్ల ఆధిక్యంలో శ్రీనివాస్‌గౌడ్ ఆరుగురు మంత్రులు ఓటమి బాటలో? ఆధిక్యంలో ఘోరంగా వెనుకబడిన ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఐదు వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం భూపాలపల్లి నాలుగవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యo 9285 మేడ్చల్‌లో 11వ రౌండ్ ముగిసేసరికి 17,856 ఆధిక్యంలో మల్లారెడ్డి లీడ్ దుబ్బాకలో ఆరో రౌండు ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 20,799 ఓట్ల ఆధిక్యం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు ఆధిక్యం 11,791 లీడ్ హుజురాబాద్‌లో ఈటల మూడో ప్లేస్ మూడు రౌండ్లు ముగిసేసరికి కౌశిక్‌రెడ్డి లీడ్ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ మూడోస్థానంలో కొనసాగుతున్న ఈటల జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ లీడ్ మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకి 10590 ఆధిక్యం ఖమ్మం అశ్వారావుపేట 8 రౌండ్లకు కాంగ్రెస్16125 ఆధిక్యత సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనుకంజ బోథ్ నియోజకవర్గం లో 4వ రౌండ్ లో బీ అర్ ఎస్ అభ్యర్థి అనిల్ 3,353 లీడ్ పాలేరు లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2164 ఓట్ల ఆధిక్యం కరీంనగర్లో బండి సంజయ్ ముందంజ ఐదో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలోకి వచ్చిన బండి సంజయ్ కరీంనగర్లో 943 ఓట్లతో బండి లీడ్ నిజామాబాద్ రూరల్‌లో ఏడో రౌండ్ ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి 8521 ఓట్ల ఆధిక్యం రాజేంద్ర నగర్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 68 లోని ఈవీఎం మొరాయిo చడంతో నిలిచిన కౌంటింగ్ పటాన్చెరులో మూడో రౌండ్ ముగిసేసరికి 369 ఓట్ల తో లీడ్ మూడు రౌండ్లు ముగిసే సరికి గజ్వేల్‌లో కేసీఆర్ లీడ్.. 3020 నల్గొండలో ఎనిమిది రౌండ్స్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 25వేల ఓట్ల అధిక్యం ఆసిఫాబాద్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ కోవ లక్ష్మి మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి 2440ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు సూర్యాపేటలో నాలుగో రౌండ్ ముగిసేసరికి.. 2657 బీఆర్ఎస్ జగదీశ్వర్‌రెడ్డి లీడ్ పటాన్చెరులో 264 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ బహదూర్‌పూర్‌లో700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఆర్మూర్‌లో బీజేపీకి 2 వేల ఓట్ల ఆధిక్యం గద్వాల్లో 5,700 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ శేరిలింగంపల్లిలో 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఖమ్మంలో తుమ్మలకు 4 వేల ఓట్ల ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్-53 బీఆర్ఎస్-31 బీజేపీ-6 సీపీఐ-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొత్తం 6511 ఓట్ల మెజారిటీ పటాన్ చెరు రెండో రౌండ్ ఆధిక్యంలో కాంగ్రెస్.. 264 ఓట్ల ఆధిక్యం కామారెడ్డిలో ఆధిక్యంలోకి వచ్చిన కేసీఆర్ 600 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ సిరిసిల్లలో 3,749 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ భూపాలపల్లిలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కార్వాన్, బహదూర్‌పురాలో బీజేపీ లీడ్ మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ మైనంపల్లి వెనుకంజ మెదక్‌లో మైనంపల్లి కొడుకు రోహిత్ ముందంజ జూబ్లీహిల్స్‌లో 900 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు 7 వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 4 వేల ఓట్ల లీడ్‌లో రేవంత్‌రెడ్డి వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ముందంజ గజ్వేల్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి 920 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ కొల్లాపూర్‌లో బర్రెలక్కకు కేవలం 400 ఓట్లు మాత్రమే! చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 4 వేల ఓట్ల ఆధిక్యం సికింద్రాబాద్‌లో పద్మారావు ఆధిక్యం సిరిసిల్ల మూడో రౌండ్లో 2,621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెనుకంజ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. ఆసిఫాబాద్ సెగ్మెంట్ మూడవ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి 2,420 ఓట్ల ఆదిక్యం మంథని నియోజకవర్గంలో 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు 3425 లీడ్ ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ నాలుగో రౌండు మూసేసరికి 6245 కోట్ల ఆధిక్యం ములుగు నియోజకవర్గంలో ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 7461 ఓట్ల ఆదిక్యం నిజామాబాద్ అర్బన్‌లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 47 బీఆర్ఎస్ 26 బీజేపీ 3 హుస్నాబాద్ మూడో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 74 4 ఆధిక్యత. .. మొత్తం ఆధిక్యత 2250 ఖమ్మం పాలేరులో 3 వ రౌండ్ అయిపోయే సరికి పొంగులేటి సుమారు 7000 లీడ్ మూడో రౌండ్లు ముగిసేసరికి.. కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యం కల్వకుర్తిలో 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డిలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 తాండూరులో 139 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బెల్లంపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వినోద్ సత్తుపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్లకు పైగా లీడ్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కొరుట్లలో బీఆర్ఎస్ సంజయ్‌కి ఆధిక్యం నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ లీడ్ పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ ఉప్పల్‌లో బీఆర్ఎస్ ముందంజ మేడ్చల్‌లో మల్లారెడ్డికి 2 వేలకు పైగా లీడ్ నల్గొండలో ఐదో రౌండ్ ముగిసేసరికి 17 వేల ఆధిక్యంలో కోమటిరెడ్డి హుజూర్ నగర్లో 12 వేల ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ హుజూరాబాద్‌లో ఈటల వెనుకంజ రెండో రౌండ్లోనూ కౌశిక్ మందంజ కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్ గజ్వేల్‌లో కేసీఆర్ వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యం గోషామహల్లో రాజాసింగ్ వెనుకంజ నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం నర్సంపేటలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం ఖమ్మం నియోజకవర్గంలో మూడో రౌండ్ ముగిసే నాటికి తుమ్మల 796 ఆధిక్యం పినపాకలో రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం డోర్నకల్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజ కామారెడ్డిలో 1162 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి మెదక్‌లో 7 బీఆర్ఎస్, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం నిర్మల్‌లో బీజేపీ ఆధిక్యం ఆలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు లీడ్ ఆశ్వారావుపేటలో ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ సూర్యాపేటలో రెండో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం.. లీడ్ కొచ్చిన జగదీశ్‌రెడ్డి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు ఆధిక్యం ఖైరతాబాద్‌లో దానం ముందంజ రామగుండంలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ 12 వేలకు పైగా లీడ్ కూకట్‌పల్లిలో మాధవరం లీడ్ 7 వేలకు ఓట్లకు పైనే కొత్తగూడెంలో కూనంనేనికి 3వేలకు పైగా(3,350) ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రేవంత్ సిరిసిల్లలో కేటీఆర్‌కు 1500 వందల ఓట్లకు పైగా లీడ్ అంబర్‌పేట రెండో రౌండ్లో బీఆర్ఎస్కు ఆధిక్యం సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ సంబరాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరంగల్ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజలో.. రంగారెడ్డి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 2 నిజామాబాద్ కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ 3, బీఆజేపీ 3 ఆదిలాబాద్ కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీ 2 ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు అనూహ్య ఫలితాలు మహేశ్వరంలో రెండో రౌండ్లో సబితా ఇంద్రారెడ్డి మందంజ నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి మందంజ ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం కరీంనగర్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజ భువనగిరి రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12, బీజేపీ 1 స్థానాల్లో ముందంజ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకంజ తొమ్మిది కాంగ్రెస్, ఒకటి సీపీఐ నిజామాబాద్‌లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యం రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి.. సీతక్కకు 3 వేల ఓట్లకు పైగా లీడ్ మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ముందంజ జనగామలో బీఆర్ఎస్ లీడ్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ నల్గొండ నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి.. 12 వేల ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి ఆధిక్యం 4,389 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ హుజూరాబాద్ తొలి రౌండ్లో కౌశిక్‌రెడ్డి ముందంజ వెనుకబడిన ఈటల వికారాబాద్‌లో మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కరీంనగర్లో గంగుల ముందంజ 1145 ఓట్ల ఆధిక్యంలో గంగుల బాల్కొండలో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో కాంగ్రెస్ ముందంజ రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చిన కేటీఆర్ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ముందంజ గజ్వేల్‌లో ఈటల వెనుకంజ పటాన్చెరులో బీఆర్ఎస్ ఆధిక్యం సత్తుపల్లిలో 2,240 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం తొలి రౌండ్లో కేటీఆర్ వెనుకంజ 265 ఓట్లతో వెనుకబడిన కేటీఆర్ సిర్పూర్లో బీజేపీ ముందంజ ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజ రెండో రౌండ్లో.. రెండో రౌండ్లోనూ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ముందంజ 1962 ఓట్లతో ముందంజలో రేవంత్ దుబ్బాకలో తొలి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్లో వెనుకబడ్డ పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ప్రముఖులు వెనుకంజ వీళ్లే.. మానుకొండూరులో రసమయి పాలకుర్తిలో ఎర్రబెల్లి తుంగతుర్తిలో గాదరి వెనుకంజ ఆదిలాబాద్ జోగురామన్న కేటీఆర్ చార్మినార్‌లో తొలిరౌండ్లో బీజేపీ ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొత్తగూడెంలో సీపీఐ ముందంజ పాలేరులో పొంగులేటి ముందంజ కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ ముందంజ సనత్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని ముందంజ బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధిక్యం ములుగులో కాంగ్రెస్ సీతక్క ముందంజ మెదక్‌లో 5 వేలపై ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్ పొంగులేటికి 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం హైదరాబాద్‌లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం మానుకొండూరులో కాంగ్రెస్ ముందంజ నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ ముందంజ నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ముందంజ తాండూర్‌లో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ముందంజ బీజేపీ తొలి రౌండ్ ఇలా.. మహేశ్వరంలో బీజేపీ ఆధిక్యం నిర్మల్లోనూ బీజేపీ లీడ్ కరీంనగర్లో బండి సంజయ్ లీడ్ ఆర్మూర్‌లో కాంగ్రెస్ ముందంజ ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ దానం నాగేందర్ ముందంజ వరంగల్ తూర్పులో కొండా సురేఖ ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ ముందంజ బీఆర్ఎస్ తొలి రౌండ్లో.. నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం సనత్ నగర్లో తలసాని జుక్కల్‌లో ముందంజ గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్‌కు 300 ఓట్ల ఆధిక్యం పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ శేరిలింగంపల్లిలో గాంధీ సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్‌లో.. ముషీరాబాద్‌లో భూపాలపల్లిలో తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా ఈవీఎం లెక్కింపు తొలి రౌండ్లో.. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజ మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యం అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజ ఈవీఎం ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్లో.. భువనగిరి లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముందంజ నల్లగొండ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ మిర్యాలగూడ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ భట్టి విక్రమార్క మొదటి రౌండ్లో 2022 ఓట్ల మెజార్టీ ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఆధిక్యం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 800 ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో ఇండిపెండెంట్ బర్రెలక్క ముందంజ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు.. ఉమ్మడి వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ముందంజ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో.. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజ హుజురాబాద్ పోస్టల్ కౌంటింగ్‌లో ఈటల ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో అనూహ్యంగా ముందంజలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కౌంటింగ్‌పై సీఈవో స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నడుస్తోంది 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది ఈవీఎం లెక్కింపు ప్రారంభం అయ్యింది ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు...ప్రశాంతంగా కౌంటింగ్ నడుస్తోంది ఇబ్రహంపట్నం ఘటనలో ఫిర్యాదులు వచ్చాయి డీఈవో వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు ఇబ్రహీంపట్నం ఘటన సమసిపోయింది... అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ చూపించాం ఇబ్రహీంపట్నంలోనూ కౌంటింగ్ ప్రారంభం అయింది పోస్టల్ బ్యాలెట్ కామారెడ్డి, కరీంనగర్లో బీజేపీ ముందంజ నల్గొండలో కాంగ్రెస్ ముందంజ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్(ఎంఐఎం) ముందంజ ఖమ్మం, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల, భట్టి ముందంజ హుజూరాబాద్‌లో ఈటల ముందంజ కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ముందంజ పరిగి, వికారాబాద్, తాండూరులో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు వేములవాడలో కాంగ్రెస్ ముందంజ సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిలో.. ఇంకా మొదలుకాని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు #WATCH | Counting of votes gets underway in Telangana's Karimnagar pic.twitter.com/35Fw96EglQ — ANI (@ANI) December 3, 2023 ప్రగతి భవన్ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత అధికారం మాదే: మాణిక్‌రావ్ ఠాక్రే తెలంగాణలో 70 సీట్లు కచ్చితంగా గెలుస్తాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయి మీడియాతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నేతల్లోనే కాదు.. అందరిలో ఉత్కంఠ తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల నిరీక్షణకు నేటితో తెర రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం హోరాహోరీ రాజకీయపోరులో తలపడుతున్న 2,290 మంది అసెంబ్లీలో అడుగుపెట్టబోయే ఆ 119 మంది ఎవరో అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర మొత్తం 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అధికార కైవసానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60. ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై హస్తం పార్టీ ధీమా మళ్లీ అధికారం మాదేనని బీఆర్ఎస్ కచ్చితంగా కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ ఇండిపెండెంట్ల ప్రభావం ఎంత? పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 12వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1లక్ష 80వేల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్ ఉదయం 8.30గం.కి ప్రారంభం కానున్న ఈవీఎంల కౌంటింగ్ సంగారెడ్డి జిల్లా అందోల్ (36) స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఓపెన్ చేసిన ఎన్నికల అధికారులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 131 టేబుళ్ల ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.20 లక్షల ఓట్లు ఉదయం 8గం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అరగంట నుంచి గంట లోపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగింపు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం ఖమ్మంలో.. మొత్తం 14,378 పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఆన్ లైన్ ద్వారా 150 మంది దరఖాస్తు చేసుకుని బ్యాలెట్ పంపించారు వయో వృద్ధులు, దివ్యాంగులు 2290 మంది ఇంటి వద్ద ఓటు వేశారు విధులలో పాల్గొన్న సిబ్బంది ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 క్యాంపు రాజకీయాల ప్రచారం అవాస్తం: భట్టి కాంగ్రెస్ క్యాంపు రాజకీయా ప్రచారం అవాస్తవం. మేము 70 నుంచి 80 సీట్లు గెలుస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. సీఎంగా ఎవరిని చేయాలన్నది అధిష్టానం చూసుకుంటుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది: జోగు రామన్న తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. వరంగల్‌లో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ సెంటర్‌కు తరలిస్తున్న అధికారులు. పోటాపోటీ ధీమా హ్యాట్రిక్ లోడింగ్ 3.0 అంటూ కేటీఆర్ ట్వీట్ ఎగ్జిట్‌పోల్స్‌తో అయోమయానికి గురికావొద్దని భరోసా రాబోయే ప్రభుత్వం మనదేనంటూ కాంగ్రెస్ పోస్టర్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పార్టీల ఏజెంట్లు(అభ్యర్థులు) తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎంల ఫలితాలు ఉదయం తొమ్మిది గంటలకే ఈవీఎం తొలి ఫలితం? పోస్టల్‌బ్యాలెట్ ఓటింగ్‌లో.. అత్యధికంగా కుత్బుల్లాపూర్, తర్వాత మేడ్చల్ పెద్దపెల్లి జిల్లాలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మొత్తం 4164.. పెద్దపెల్లిలో 1356 మంథనిలో 993 రామగుండంలో 1815 ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 ఆదిలాబాద్ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఏజెంట్లు అభ్యర్థితో పాటు పదహారు మందికి అనుమతి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే జోగురామన్న, స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి ప్రధాన నేతలు గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ కొడంగల్, కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి పోటీ గజ్వేల్, హూజురాబాద్ నుంచి ఈటల పోటీ గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటల, కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ సిర్పూర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధిరలో భట్టి విక్రమార్క హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్లో బండి సంజయ్ కొరుట్లలో ధర్మపురి అర్వింద్ దుబ్బాకలో రఘునందన్ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మల్కాజ్‌గిరిలో మైనంపల్లి, మెదక్‌లో మైనంపల్లి తనయుడు రోహిత్ కంటోన్మెంట్లో గద్దర్ కూతురు వెన్నెల చంద్రాయగుట్టలో అక్బరుద్దీన్ పోటీ సిరిసిల్ల కేటీఆర్ సిద్ధిపేట హరీష్‌రావు బరిలో కొల్లాపూర్ బర్రెలక్క(కర్నె శిరీష), రామగుండం సోమారపు సత్యనారాయణ, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్ తదితరులు కూడా.. లెక్కింపు కేంద్రంలో.. ఓట్ల లెక్కింపునకు.. 14 టేబుళ్లు (పోలింగ్ కేంద్రాలు 350కి మించిన చోట 28 టేబుళ్లు) ఒక్కో టేబుల్ వద్ద.. సూపర్వైజరు, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్, పోటీలోని అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటు సెల్‌ఫోను.. ఆర్వో, పరిశీలకులు, ప్రత్యేక అధికారుల ఫోన్లకే అనుమతి తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్ చివరిగా శేరిలింగంపల్లి ఫలితం ఎక్కువ మంది పోటీ చేయడంతో.. సిద్ధిపేట గజ్వేల్ ఆలస్యమయ్యే అవకాశం కౌంటింగ్ ఇలా.. ఉదయం 5: 00 లెక్కింపు కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ఉదయం 7: 00 టేబుళ్ల వద్ద పని మొదలు ఉదయం 8: 00 తపాలా ఓట్ల లెక్కింపు ప్రారంభం ఉదయం 8: 30 మొదటి రౌండు తపాలా ఓట్ల ఫలితం ఉదయం 9:00 ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు, కొన్ని చోట్ల ఉదయం 8.30 నుంచి ఉదయం 9: 30 మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం ప్రతి 15-20నిమిషాల నుంచి అరగంటకోసారి ఒక్కో రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం కౌంటింగ్.. టిక్ టిక్ కాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కోసం 500 ఓట్ల కోసం ఒక టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుల్స్ అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు 1,798 టేబుల్స్, మొత్తం 2417 రౌండ్లలో లెక్కింపు పూర్తి ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుల్స్ 11 గంటల వరకు ఫలితాల సరళిపై రానున్న స్పష్టత ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119, మ్యాజిక్ ఫిగర్ 60 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ప్రతీ 15-20 నిమిషాలకు రౌండ్ ఫలితం కీలకంగా ఫలితాలు ఇవాళ తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలువడనున్న ప్రజా తీర్పు కావడంతో కీలకంగా భావిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ స్వయంగా 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు ప్రత్యేకంగా మ్యానిఫెస్టోల విడుదల నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చి.. మిగిలిన 118 నియోజకవర్గాల్లో పోటీ భాజపా అభ్యర్థులు 111, ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ బీఎస్పీ 107, సీపీఎం 19 స్థానాల్లో పోటీ మొత్తం 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, అయిదుగురు ఎమ్మెల్సీలు పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరి బరిలో దిగగా.. పలువురు స్వతంత్రులూ.. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, సీపీఐ, సీపీఎంల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సహా పలువురు కీలక నేతలు నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై ధీమాగా హస్తం పార్టీ మళ్లీ అధికారం మాదేనంటున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ వీడనున్న శాసనసభ ఎన్నికల ఉత్కంఠ 2.36 కోట్ల మంది తెలంగాణ ఓటర్ల తీర్పు వెలువడేది నేడే నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం -
ఊరూవాడా.. రిజల్ట్‌పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్‌లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్‌ఫామ్‌లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తం అయ్యేలా అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 119 నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలతో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్టు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను తనిఖీ చేసుకున్నారని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్‌నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్‌గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్‌రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్‌కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
-
TS Election 2023: పట్టుబడిన నగదు, గోల్డ్, డ్రగ్స్ విలువ ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత భారీగా నగుదు, మద్యం, గోల్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.469.63 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోగా దీనికి సంబంధించి 11,859 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే, 2018 ఎన్నికల సందర్భంగా రెండు వేలకుపైగా కేసులు నమోదు కాగా.. రూ.103 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక, 2018తో పోలిస్తే 2023లో భారీగా కేసులు పెరగగా.. భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు. 2023కు సంబంధించిన వివరాలు ఇవే.. నగదు.. 241.52 కోట్లు.. 241 ఎఫ్ఐఆర్లు నమోదు గోల్డ్/సిల్వర్.. 175.95 కోట్లు.. 5 ఎఫ్ఐఆర్లు నమోదు మద్యం.. 13.36 కోట్లు.. 11,195 ఎఫ్ఐఆర్లు నమోదు డ్రగ్స్.. 22.17 కోట్లు.. 323 ఎఫ్ఐఆర్లు నమోదు ఉచితాలు.. 16.63 కోట్లు.. 95 ఎఫ్ఐఆర్లు నమోదు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను: సీతక్క
-
రాహుల్ వ్యాఖ్యల మర్మమేంటి?.. సీఎంగా సీతక్క?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(ఆదివారం) నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవునున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. ఇక, అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ ఫలితాలపైనే ఉంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? లేక, కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నాడంటే.. కాగా, శుక్రవారం కేరళలోని కొచ్చిలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఇంకా చాలా మంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయత్నించాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల వెనుక.. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సపోర్టుగా ఒకానొక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో, సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక, సీతక్క విషయానికి వస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములుగు ఏజెన్సీ నుంచి గెలిచి.. అసెంబ్లీ వేదికగా పలుమార్లు బీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సందర్బాల్లో సీతక్కను బీఆర్ఎస్ సభ్యులు సైతం అభినందించిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దుతిస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రాజకీయంగా మహిళలకు మద్దతివ్వాలన్నారు. కానీ, ఎన్నికల విషయం వచ్చే సరికి.. తెలంగాణలో కేవలం 11 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ తీరును కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. Congress is ruling Rajasthan, Himachal, Chhattisgarh, Karnataka. How many women Chief Ministers? Even deputy CM? Himachal Congress doesn't even have a woman minister. Telangana their CM candidate is not woman. Check how many woman ministers in Rajasthan and Karnataka. https://t.co/bnCXCf5TaF — Ankur Singh (@iAnkurSingh) December 1, 2023 కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు వీరే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది. వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. -
నయా పాలి‘ట్రిక్స్’.. గెలిచేది సారే.. వచ్చేది కారే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నిలక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్కువ సంఖ్యలో ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో సైలెంట్ వేవ్‌తో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సెలైంట్ వేవ్‌తో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని గెలిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. Silent wave is mostly favorable to BRS just like the same happened in West Bengal - Prof. Sanjay Kumar pic.twitter.com/eii3WZ7Kqc — చార్వాక (@Charwaka99) December 1, 2023 మరోవైపు.. కొందరు సోషల్ మీడియాలో వేదికగా కూడా కేసీఆర్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నిలకల్లో ‘చేయి’ ఎత్తి ‘కారు’ను ఆపడం సాధ్యమేనా అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎవరి విశ్లేషణలో వారు బిజీగా ఉన్నారు. మరోవైపు, గెలుపు ఓటములు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తూ పంచ్‌లు విసురుతున్నారు. నాకెందుకో ఈసారి కూడా తెలంగాణ లో "కార్" తిరుగుతుందని అనిపిస్తుంది,.. "చెయ్యి" ఎత్తి "కార్" ని ఆపగలం అనుకుంటున్నారు కానీ, అది సాధ్యం కాదని రేపు తెలుస్తుంది...😄 #TelanganaElections #KTR #BRSParty #KCRHattrick #KCROnceAgain — పంచభట్ల సారంగపాణి (@Siddart9Praveen) December 2, 2023 ఇక, థర్డ్ విజన్ నాగన్న సర్వే ఎగ్జిట్‌పోల్స్ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా సమీకరణాలను వెల్లడించింది. బీఆర్ఎస్ దాదాపు 60-68 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు 33-40 సీట్లు వస్తామయని తెలిపింది. Now Third Eye Vision Naganna Survey has also been released and the Prediction is clear BRS party led by #KCR garu is forming Government once again in #TelanganaAssemblyElections2023 థర్డ్ ఐ విజన్ నాగన్న సర్వే కూడా ఎన్నికల్లో కేసిఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి… pic.twitter.com/0F0H8VFeYI — Dinesh Chowdary (@dcstunner999) November 29, 2023 -
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతారా?
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతాడు!.. నా పందెం ఇంత లే.. గజ్వేల్‌లో ఈటలనే గెలుస్తాడు! అంతకంటే డబుల్ నా పందెం హరీష్‌రావు లాస్ట్ ఎలక్షన్ల వచ్చిన మెజారిటీ ఈసారి క్రాస్ చేస్తాడని నా బెట్ దాటడని నా బెట్ ఖమ్మంలో పువ్వాడ-తుమ్మల పోటీలో గెలుపు ఆయనదే.. బర్రెలక్క ఈ ఎలక్షన్స్‌లో కచ్చితంగా గెలుస్తుందని ఇంత సొమ్ము వేస్తున్నా.. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సమయంలోనే పందెం రాయుళ్ల జోరు పెంచారు. గత నెల రోజుల నుంచి ఎలక్షన్ బెట్టింగ్ ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు, కౌంటింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు పందెం కాసే సొమ్ము అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద లీడర్ సాబ్‌ల మీద, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. కాయ్ రాజా కాయ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల మీద జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. మొత్తం 33 జిల్లాల్లో.. ఎంపిక చేసిన నేతలపైనే పందేలు వేస్తున్నారు. బెట్టింగ్స్ కోసమే సర్వేలు చేయించుకున్న కొందరు.. లక్షల నుంచి కోట్లలో కాస్తున్నారు. ముఖ్య నేతల మీద, మంత్రుల గెలుపోటముల మీద ఓ లెక్క లేకుండా వేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. షాకింగ్ బెట్. ఇంట్రెస్టింగ్ రేటు దుబ్బాకలో రఘునందన్‌రావు గెలుస్తాడా? ఓడిపోతాడా?.. సంగారెడ్డిలో రఘునందన్‌రావు మళ్లీ నెగ్గుతాడా?ఇలా.. ఆప్షన్లతో బెట్టింగులు నడుస్తున్నాయి. కామారెడ్డి, గజ్వేల్ మీద బెట్టింగ్ ముఠాల స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో కేసీఆర్ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణమని చెపనక్కర్లేదు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అనేదానికంటే.. గజ్వేల్‌లో ఈటల నెగ్గుతారనే ఇంకా ఎక్కువ సొమ్ముతో పందెం వేస్తున్నారు. అంతెందుకు విదేశాల నుంచి కూడా యాప్స్ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోందని టాక్. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్‌రావు గత ఎన్నికల్లో 1 లక్షా 19 వేల మెజారిటీ సాధించారు. ఈసారి ఆ మెజారిటీ రికార్డును దాటేస్తారా? అని పందెం వేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఖమ్మంలో తుమ్మల-పువ్వాడ ఫైట్ మీద, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారని, కేటీఆర్ మెజార్టీ ఎలా ఉండబోతుందని, ఆదిలాబాద్-కరీంనగర్లో బీఆర్ఎస్కు జీరో సీట్లు అని.. ఇలా రకరకాల ఆఫ్షన్లతో పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైసలే కాదు.. పొలిటికల్ బెట్టింగ్‌లో.. డబ్బులే కాదు భూములను కూడా పందెంలో పెడుతున్నారు కొందరు. సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో గెలుపోటములపై లక్షల్లో సొమ్ముతో పాటు పొలాలను కూడా కొందరు తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల బెట్టింగ్ విలువ రూ.10 వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చనేది ఒక అంచనా. -
Telangana Elections 2023: ఫలితాలపై టాలీవుడ్లో టెన్షన్..టెన్షన్!
అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సా..కాంగ్రెస్సా..?.. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. సామాన్య ప్రజానీకంతో పాటు సీనీ ప్రముఖులు సైతం ఈ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలతో సినిమా వాళ్లకు సంబంధం ఏంటనే డౌట్ రావడం సహజం. అయితే చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో ప్రత్యేక్షంగా సబంధం లేకున్నా.. పరోక్షంగా మాత్రం చాలా ఉంది. షూటింగ్‌ల అనుమతి మొదలు.. టికెట్ల రేట్ల పెంపు వరకు ప్రతీది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ ప్రభుత్వం మారితే ఇండస్ట్రీపై ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తుంది? టికెట్ల రేట్ల విషయంలో సహకరిస్తుందా లేదా అనే భయం నిర్మాతల్లో మొదలైంది. ఎవరు వస్తే నో టెన్షన్.? మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందా? వస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నదానిపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు సత్సంబంధాలున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్నది కూడా చర్చగా మారింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సినిమా అవార్డులు లేవు. నంది అవార్డులు కూడా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. ఇక షూటింగ్‌ల పరంగా ప్రస్తుతాని అయితే హైదరాబాదే సినిమా క్యాపిటల్. బోలెడన్ని స్టూడియోలతో పాటు 24 క్రాఫ్ట్స్ నిపుణులందరూ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నారు. ఎలాంటి కెమెరాలయినా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దేశం మొత్తమ్మీద ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే సినిమా ఎక్విప్మెంట్, మ్యాన్‌పవర్ ఉంది. అందుకే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంమీద ఇక్కడ ఆసక్తి ఎక్కువగా నెలకొంది. ‘సలార్’తో మొదలు.. డిసెంబర్ చివరి వారం నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతుంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. టికెట్ల రేట్లను పెంచి కలెక్షన్స్‌ని పెంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..ఎలాగో అనుమతులు ఇస్తారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాత్రం అంత త్వరగా పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా రెండు వారాల్లోనే తెలియాలి. ఇక సలార్ తర్వాత సంక్రాంతికి హనుమాన్, గుంటూరుకారం లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. వీటికి కూడా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది. సలార్ విషయంలో క్లారిటీ వస్తే.. సంక్రాంతి సినిమాలకు పెంపు ఉంటుందో లేదో తెలిసిపోతుంది. రేవంత్‌తో భేటీ? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భావించి..ఇప్పటికే పలువురు నిర్మాతలు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. టాలీవుడ్‌కి చెందిన ఓ బడా నిర్మాత తాజాగా రేవంత్‌తో భేటీ అయ్యాడు. ఆయన మర్యాదపూర్వకంగానే రేవంత్‌ని కలిసినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం రహస్యంగా రేవంత్‌ని కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ..ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరిస్తుందని సినీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మరి అధికారంలోకి వచ్చేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్.. అంతా ఆయన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్పర్ట్. అందుకే పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్‌కు మరువలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్‌ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నారు. కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే -
ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత?
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధ, బాంధవ్యాలు, రాజకీయ అనుబంధాల నేపథ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నిజానికి తెలంగాణలో ఎలాంటి ఫలితం వచ్చినా ఏపీ రాజకీయాలపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ఏపీలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఏపీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క శాతం లోపే ఓట్లు ఉన్నాయని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ✍️వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. ఎవరైనా ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు అక్కడ ఏదైనా చేస్తున్నా అది వారి వ్యక్తిగతం అని చెప్పాలి. బీఆర్ ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంటే, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీకి సంబంధించి కొందరు కాంగ్రెస్ ర్యాలీలలో టీడీపీ జెండాలతో తిరుగుతున్నారు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. తమ మద్దతు ఎవరికి లేదని చెప్పలేదు. దాంతో కాంగ్రెస్‌కు ఆయన అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి. ✍️తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్‌కు ఉపయోగపడాలని, అందుకే టీడీపీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా ఉన్న జనసేన మాత్రం తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగాలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే, హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం విశేషం. అయినా చంద్రబాబును తెలంగాణలో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరలేదు. చంద్రబాబు కూడా జనసేనను బలపరచండని టీడీపీ అభిమానులకు పిలుపు ఇవ్వలేదు. ఆ రకంగా సొంత పార్టీ అభ్యర్ధులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం వస్తుంది. ✍️బీజేపీతో జనసేన తెలంగాణలో కలిసి ఏపీలో మాత్రం ఆ పార్టీతో కాపురం చేయకుండా టీడీపీతో సహజీవనం చేయడం రాజకీయాలలో వింతగా మారింది. దీనిని వావివరసలు లేని రాజకీయంగా వైసీపీ నేత పేర్ని నాని ఇప్పటికే విమర్శించారు. ఈ విధంగా చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం టీడీపీ, జనసేనలపైనే ఎక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేనలకు షాక్ అవుతుంది. వారు కోరుకున్నట్లు కాంగ్రెస్ కాని, బీజేపీ కాని గెలవకపోతే వారికి నిరుత్సాహం అవుతుంది. చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు కూడా ఖండించినా, టీడీపీ శ్రేణులు కాని, టీడీపీని ఓన్ చేసే ఒక సామాజికవర్గం వారు కాని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న భావన ఉంది. ✍️బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో ఆటోమాటిక్‌గా వైసిపికి అడ్వాంటేజ్‌గా ఉండవచ్చన్నది వారి భయం అని చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గం ఇలా వ్యవహరిస్తుండేసరికి కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల పేరుతో సమావేశాలు నిర్వహించి వారి మద్దతు అభ్యర్ధించడం విశేషం. టీఆర్ఎస్ గెలిస్తే సహజంగానే టీడీపీని వ్యతిరేకించే శక్తులకు సంతోషంగా ఉంటుంది. దీనివల్ల ఏపీలో వైసీపీకి పెద్ద ప్రయోజనం ఉండకపోయినా, తెలంగాణలో ఆ పార్టీ అభిమానులుగా ఉన్నవారిలో సంతృప్తి కలిగిస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. ఇది చంద్రబాబు అరెస్టు వల్ల వచ్చిన సానుభూతి అని టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది. ఆ వర్గం టివీ చానల్లో ఇప్పటికే దీనిపై చర్చ జరిగింది. ✍️కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక సర్వే సంస్థ ప్రతినిధి అదే చర్చలో తమకు చంద్రబాబు అరెస్టు సానుభూతి ప్రభావం ఎక్కడా కనిపించలేదని చెప్పడంతో ఆ టీవీవారు అవక్కాయ్యారు. అలాగే చంద్రబాబు బహిరంగంగా ఏ సంగతి చెప్పలేని నిస్సహాయస్థితి. ఆయన ఎప్పుడూ చేసే తెరచాటు రాజకీయం నెరపవచ్చు. సోషల్ మీడియాలో ఇదేదో తమ గొప్పగా కూడా ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అయినా ఏపీలో ఈ కారణంగా ఓట్లు వేస్తారని అనుకుంటే భ్రమే. అక్కడి పరిస్థితుల ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జనసేన అభ్యర్ధులు ఎవరైనా ఒకరు గెలిస్తే అదే తమకు గొప్ప విజయంగా ఆ పార్టీవారు ప్రచారం చేసుకుంటారు. ✍️ఎవరూ గెలవకపోతే మాత్రం జనసేన నీరుకారిపోతుంది. దీంతో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ బలం పై పూర్తి సంశయాలు వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు పవన్‌ను చులకనగా తీసుకుని బాగా తక్కువ సీట్లు కేటాయించడానికి ప్రయత్నిస్తారు. కాగా టీడీపీ అభిమానులకు, కమ్మ సామాజికవర్గం వారికి కాపునాడు ఒక విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం కుకట్పల్లి వంటి నియోజకవర్గాలలో కమ్మ వారంతా జనసేనకు ఓట్లు వేయాలని కోరింది. కాని అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కమ్మ వర్గం అయినందున వారిలో ఎక్కువమంది అటువైపే మొగ్గు చూపారని అంటున్నారు. తత్ఫలితంగా జనసేన అభ్యర్ధి అక్కడ ఓడిపోతే, ఈ రెండు పార్టీల మధ్య, ముఖ్యంగా కమ్మ, కాపు వర్గాల మధ్య అంతరం ఏర్పడుతుంది. ✍️జనసేనకు కమ్మ సామాజికవర్గం మద్దతు ఇవ్వనప్పుడు తాము ఏపీలో ఎందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని కాపు సామాజికవర్గ నేతలు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఇవ్వడం పవన్‌కు కష్టం అవుతుంది. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు మీద అనుమానాలు ఏర్పడతాయి. పవన్ కోరుకున్నట్లు టీడీపీకి ఎందుకు సరెండర్ అవ్వాలని అడుగుతారు. ఈ నేపథ్యంలో పవన్ ముందస్తుగా ఏపీలో పార్టీ సమావేశం జరిపి టీడీపీతో పొత్తు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారని భావించవచ్చు. కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిస్తే టీడీపీలో కొంత ఆశ ఏర్పడుతుంది. ✍️తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రదానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దానిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తారు. దీనివల్ల ఏపీలో టీడీపీకి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కాని, కొంత నష్టం కూడా ఉండవచ్చు. రేవంత్ మాత్రం తెలివిగా రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం ఉండదని,ప్రభుత్వాల మధ్య సంబంధాలు మామూలుగానే ఉంటాయని అంటున్నారు. పైగా చంద్రబాబు తనకు రాజకీయ గురువు కాదని, సహచరులమేనని ఇప్పటికే ఒక ఇంటర్వ్యులో ప్రకటించారు. ఆయన కూడా అనవసరంగా ఏపీతో కయ్యానికి వెళ్లడానికి వెనుకాడవచ్చు. ✍️బీజేపీ తెలంగాణలో గెలిచే అవకాశం కనబడడం లేదు. అయినా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీపై వారికి కోపం రావచ్చు. ఏపీలో బీజేపీతో కూడా కలవాలన్న టీడీపీ యోచనకు బ్రేక్ పడవచ్చు. కాని జనసేన వారు బీజేపీ నుంచి విడిపోయిన తర్వాతే టీడీపీతో పొత్తు పెట్టుకోవల్సి ఉంటుంది. దాని ప్రభావం కూడా ఆ రెండు పార్టీల సంబంధాలపై పడవచ్చు. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేనలు ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు. మరో విశ్లేషణ కూడా ఉంటుంది. ఒక వేళ తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీల హామీలు వెంటనే అమలు చేయడం అసాధ్యమైన విషయం. ✍️ప్రత్యేకించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే మరీ కష్టం. ముందుగా రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయలేకపోయినా, వారిచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోయినా ఆ పార్టీకి జనంలో వ్యతిరేకత వస్తుంది. ఏపీలో చంద్రబాబు కూడా అలాంటి వాగ్దానాలనే చేసినందున వాటిని జనం నమ్మని పరిస్థితి మరింత గట్టిగా ఏర్పడుతుంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇబ్బంది తెలుగుదేశం పార్టీకే అవుతుంది తప్ప వైసీపీపై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే తన వాగ్దానాలను దాదాపు పూర్తిగా అమలు చేసి జనంలో తిరుగుతోంది కనుక. ✍️ఏపీలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది తేలవలసి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీతో ఏపీలో పొత్తుపెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వంటివారు కోరుకుంటుండవచ్చు. ఆ ప్రతిపాదనను పార్టీ హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది కూడా చూడవలసి ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి మంచి ఓట్ షేర్ వస్తే ఏపీలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. కాని అది అంత తేలికకాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఎలా ఉండాలో తెలియక గందరగోళం అవుతుంది. ✍️బీజేపీని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇక్కట్లు సృష్టించాలన్న ప్లాన్ టీడీపీలో ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక వైసీపీ ఇప్పటికే టీడీపీ, జనసేనల కూటమిని, ఆ పార్టీకి బాకాలు ఊదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఎదుర్కోవడానికి సిద్దమైనందున తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద సమస్య కాదు. మొదటినుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అంతేకాదు. టీఆర్ఎస్ రెండు టరమ్లు పాలన చేసింది కనుక సహజంగానే వైసీపీకి ఆ పాయింట్ కలిసి వస్తుంది. దీనిని బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా దాని ప్రభావం తెలుగుదేశం, జనసేనలపైనే అధికంగా ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్