సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఇక, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడో తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇక, ఎన్నికల ప్రారంభమైన సమయం నుంచే ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓటింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ఎన్నికల సిబ్బంది రంగంలోకి దిగి కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా కొన్ని కోట్ల మొరాయించడంతో గంటల పాటు ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు.
మరోవైపు, పలుచోట్ల పొలిటికల్ నేతల మధ్య ఫైటింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.
వివరాలు ఇలా..
►రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ
►బీఆర్‌ఎస్ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్
►119లో 118లో కాంగ్రెస్.. పొత్తులో ఒక చోట సీపీఐ
►119లో 111 చోట్ల బీజేపీ.. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన
►119లో 19 నియోజకవర్గాల్లో సీపీఎం
►119లో 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ
►రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా బరిలో..
►ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలో..
►అతి తక్కువగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ
►పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 స్థానాల్లో రెండు, పది నియోజకవర్గాల్లో మూడు చొప్పున వినియోగం.
Comments
Please login to add a commentAdd a comment