సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్‌లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్‌లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.
చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా..
Comments
Please login to add a commentAdd a comment