
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment