దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్‌ అభ్యర్థి భావోద్వేగం | Geniben Thakor of Congress won Gujarat's Banaskantha Gets Emotional | Sakshi
Sakshi News home page

దాతల సాయంతో గెలుపు.. తీవ్ర భావోద్వేగానికి గురైన కాంగ్రెస్‌ అభ్యర్థి

Published Wed, Jun 5 2024 10:17 AM

Geniben Thakor of Congress won Gujarat's Banaskantha Gets Emotional

అహ్మదాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని  ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్‌ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి గెనిబెన్‌ థాకూర్‌ గెలుపే నిదర్శనం.

తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి.  

ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్‌ సోర్సింగ్‌ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి  ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్‌ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు.   

Advertisement
 
Advertisement
 
Advertisement