candidate
-
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం(జనవరి31) ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది.కాగా, తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. -
Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు!
రాంచీ: జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నవంబర్ 13న రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది వివిధ బూత్‌లకు తరలివెళ్లారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏ పార్టీలు గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టాయనే విషయానికొస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్కెఎం)కి చెందిన 35 మంది అభ్యర్థులు తొలి దశలో పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 29 మంది, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23 మంది, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) నుంచి 19 మంది, భారత్ ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఈ దశలో జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాల్లో 53 పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 334 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు 12 మంది మహిళలు సహా 87 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. జార్ఖండ్‌లోని గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి మహిళలు సహా 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర రాష్ట్రాల రిజిస్టర్డ్ పార్టీలు ముగ్గురు మహిళలతో సహా 42 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. నమోదిత (గుర్తింపు లేని) రాజకీయ పార్టీలు 20 మంది మహిళలతో సహా 188 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులలో 299 మంది పురుషులు, 34 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారు.ఇది కూడా చదవండి: ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం -
2009లో ఇంటర్.. 2024లో ఎయిత్.. ఎమ్మెల్యే అభ్యర్థి వింత అఫిడవిట్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయపడిన కాంగ్రెస్ నేత అస్లాం షేక్ వింత విద్యార్హత అందరికీ షాకిస్తోంది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో తాను ఎనిమిదో ఉత్తీర్ణునిగా చెప్పుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అస్లాం షేక్ తాను 12వ తరగతి(ఇంటర్) పాస్ అయినట్లు పేర్కొన్నారు.అస్లాం షేక్ ఎన్నికల అఫిడవిట్‌పై బీజేపీ మండిపడింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తిజిందర్ తివానా మాట్లాడుతూ అస్లాం షేక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో ఈ ఒక్క విద్యార్హత కుంభకోణంతోనే అంచనా వేయవచ్చన్నారు. జితిందర్ ఓ వీడియోలో అస్లాం షేక్ తీరును ఎండగట్టారు. చదువు విషయంలో ఇంతటి అబద్ధాలు చెప్పిన వ్యక్తి ప్రజాధనంతో పాటు ఎమ్మెల్యే నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణతను 8వ తరగతిగా మార్చిన వ్యక్తి మలాద్ను ఏమి అభివృద్ధి చేస్తాడనే విషయాన్ని ఓటర్లంతా ఆలోచించాలన్నారు.ఇదేవిధంగా జార్ఖండ్‌లో జేఎంఎంకు చెందిన హేమంత్ సోరెన్ ఎన్నికల అఫిడవిట్లో తన వయసును ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగినట్లు చూపారు. ఈ అంశంపై జార్ఖండ్‌లో దుమారం చెలరేగుతోంది. ఎన్నికల అఫిడవిట్లో హేమంత్ సోరెన్ తన వయసు 49 ఏళ్లుగా పేర్కొన్నారు. విశేషమేమిటంటే 2019లో హేమంత్ సోరెన్ తన వయసు 42 ఏళ్లుగా ప్రకటించాడు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రి. పలు ఆరోపణలపై జైలుకు వెళ్లారు. బెయిల్ రావడంతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కూడా చదవండి: ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు -
నేడో, రేపో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పోటాపోటీగా ప్రయత్నాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికితోడు తాజాగా విడుదల చేసిన జాబితాలో గతంలో ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులను పార్టీ మార్చింది. దీనికి ముందు కాంగ్రెస్ మూడు జాబితాలను విడుదల చేసింది. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మూడో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే పార్టీ మూడో జాబితాలో ప్రకటించిన ఒక అభ్యర్థిని నాలుగో జాబితాకు మార్చింది.అంధేరీ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి సచిన్ సావంత్ స్థానంలో అశోక్ జాదవ్ పేరును పార్టీ ప్రతిపాదించింది. నిజానికి కాంగ్రెస్ తన మూడవ జాబితాలో సచిన్ సావంత్ పేరును ప్రకటించగా, అతను ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. అశోక్ జాదవ్ గతంలో అంధేరి వెస్ట్ నుండి అమిత్ సాతంపై ఎన్నికలలో పోటీ చేశారు. పార్టీ తన రెండో జాబితాలో ఔరంగాబాద్ తూర్పు నుంచి మధుకర్ కిషన్రావ్ దేశ్‌ముఖ్‌కు టికెట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అతని స్థానంలో లాహు హెచ్ షెవాలేను రంగంలోకి దించింది.కాంగ్రెస్ తన నాలుగో జాబితాలో అమల్నేర్ నుంచి డాక్టర్ అనిల్ నాథు షిండే, ఉమ్రేడ్ నుంచి సంజయ్ నారాయణ్ మెష్రామ్, అల్పరి నుంచి రాందాస్ మస్రం, చంద్రాపూర్ నుంచి ప్రవీణ్ నానాజీ పడ్వేకర్, బల్లార్పూర్ నుంచి సంతోష్ సింగ్ చంద్ర సింగ్ రావత్, వరోరా నుంచి ప్రవీణ్ సురేశ్ కకడే, నాందేడ్ నార్త్ నుంచి అబ్దుల్ సత్తార్ అబ్దుల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.వీరితో పాటు ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి లాహు హెచ్ షెవాలే, నలసోపరా నుంచి సందీప్ పాండే, అంధేరీ వెస్ట్ నుంచి అశోక్ జాదవ్, శివాజీనగర్ నుంచి దత్తాత్రేయ బహిరత్, పుణె కాంట్ నుంచి రమేశ్ ఆనంద్ రావ్ భాగ్వే, షోలాపూర్ సౌత్ నుంచి దిలీప్ బ్రహ్మదేవ్ మానే, పండర్పూర్ నుంచి భగీరథ్ భాల్కే అభ్యర్థులుగా నిలబెట్టింది. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
‘ఆప్’కు మరో షాక్.. హర్యానా అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరిక
చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా అమర్‌సింగ్‌ను కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు -
YSRCP ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
-
ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ
-
బొత్సపై పోటీకి వణుకుతున్న కూటమి..
-
కాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
సాక్షి, విశాఖపట్నం: మరికాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిపి ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరనున్నారు.కాగా, రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఆరు మంది సభ్యులతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా.. అభ్యర్థి ఎంపికపై నేడు మరోసారి నాయకులు సమావేశం కానున్నారు. బొత్స పై పోటీకి స్థానిక నాయకులు ముందుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపోతున్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. -
చేతులెత్తేసిన చంద్రబాబు..
-
Vizag MLC Election: కూటమిలో కన్ఫూజన్.. పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలంమరో వైపు ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. -
12న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమవేశమయ్యారు. నేటితో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొదటి విడత ప్రచారం పూర్తి కానుంది. అభ్యర్థి ఎవరనేది కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై బేధాభిప్రాయాలు కారణంగా కూటమి నాయకులు తర్జనభజన పడుతున్నారు.కార్పొరేటర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, 12వ తేదీన నామినేషన్ వేస్తున్నానని.. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 30వ తేదీ తర్వాత తమ వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుందని బొత్స అన్నారు.మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తమకు బలం ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని.. బొత్స గెలిస్తే కౌన్సిల్లో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. బలం లేకపోయినా ప్రలోభాలతో కూటమి నేతలు గెలవాలని చూస్తున్నారు. టీడీపీకి బలం లేకపోయినా.. బలం ఉందని ప్రచారం చేస్తున్నారు. వైస్రాయ్ కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు చెల్లవు’’ అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు. -
MLC అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన టీడీపీ నేతలు
-
Geniben Thakor: అమిత్ షాను సైతం డబ్బు సాయం కోరిందట!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆమెది స్ఫూర్తిదాయక విజయం. అంతేకాదు.. గుజరాత్ నుంచి కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు కూడా అదే. అందుకే సర్వత్రా ఆసక్తికర చర్చ నడిచింది. బనస్కాంతా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జెనిబెన్ నాగాజీభాయ్ ఠాకోర్(48).. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సొమ్మును క్రౌడ్ ఫండింగ్(ప్రజా సేకరణ ద్వారా డబ్బు) ద్వారా సేకరించుకున్నారు. అంతేకాదు.. ఫలితాలు వెలువడ్డాక కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె గెలుపు ప్రకటన నేపథ్యంలో భావోద్వేగానికి గురైన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి. అయితే ఆమె ఎన్నికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024తన ప్రచారం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించిన ఆమె.. బీజేపీ అగ్ర నేత.. కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా అడిగారట. ఆయన తన క్లాస్మేట్ అని, ఒక సోదరుడిగా(అమిత్ భాయ్ అని ప్రస్తావిస్తూ) భావించి సాయం కోరారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి అసాధారణమైన విజయం సాధించిన జెనిబెన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలని రాజకీయ నేతలకు సలహా ఇస్తున్నారాయన. -
ఈసారి లోక్‌సభలో ముస్లిం ఎంపీలు ఎందరు?
దేశంలోని అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ దీనికి మినహాయింపేమీ లేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన ముస్లిం అభ్యర్థులలో ఎందరు విజయం సాధించారు? వీరిలో ఏ పార్టీకి లేదా కూటమికి చెందినవారు ఎందరున్నారు?2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్‌సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్‌కు చెందిన వారే కావడం విశేషం.ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్‌వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్‌కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.ఈసారి లోక్‌సభలో ముస్లింల వాటా కేవలం 4.42 శాతానికి తగ్గింది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం ఎంపీలు విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 45 మంది ముస్లిం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అప్పుడు 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. -
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
ఢిల్లీలో 162 మంది పోటీ.. 148 మంది డిపాజిట్లు గల్లంతు
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన మొత్తం 162 మంది అభ్యర్థుల్లో 14 మందిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 148 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓటింగ్ శాతం తూర్పు ఢిల్లీ స్థానంలో 62.89గా నమోదయ్యింది. న్యూ ఢిల్లీ స్థానంలో అత్యల్పంగా 55.43 శాతం ఓటింగ్ నమోదైంది.న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎవరైనా అభ్యర్థి డిపాజిట్‌ను కాపాడుకోవాలంటే వారికి 1,40,891 ఓట్లు అవసరం. అదే తూర్పు ఢిల్లీ స్థానంలో అయితే 2,58,180 ఓట్లు అవసరం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలింగ్ రోజున ఢిల్లీలోని 1,52,01,936 మంది ఓటర్లలో 58.69శాతం అంటే 89,23,536 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో న్యూఢిల్లీలో అత్యల్పంగా 8.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ నిబంధనల ప్రకారం డిపాజిట్ కాపాడుకోవడానికి అభ్యర్థికి 1,40,891 లక్షల ఓట్లు అవసరం. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి 17 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వీరిలో బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతికి 1.4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మిగిలిన 15 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది.అత్యధిక ఓట్లు పొందిన ఈశాన్య ఢిల్లీ స్థానంలోని 24,63,159 మంది ఓటర్లలో 15,49,80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంపై అభ్యర్థులు తమ డిపాజిట్ కాపాడుకోవడానికి 2,58,180 ఓట్లు అవసరం. ఈశాన్య ఢిల్లీ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ మినహా 26 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది. మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ, మహాకూటమి అభ్యర్థులు మినహా మిగిలిన వారందరినీ ప్రజలు తిరస్కరించారు.ఢిల్లీ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,629 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.66 శాతం మాత్రమే. రాజ్‌కుమార్ ఆనంద్‌కు పోస్టల్ ఓటు ద్వారా 28 ఓట్లు రాగా, ఈవీఎంల ద్వారా 5,601 ఓట్లు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆనంద్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన న్యూఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. -
Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
చన్నీ, బిట్టు, పప్పీ, టీనూ, కాకా, షెర్రీ, రాజా, రింకూ, మీత్. ముద్దు పేర్లు భలే ఉన్నాయి కదా! ఎన్నికల వేళ పంజాబ్‌లో జనం నోట నానుతున్న పేర్లివి. రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు పొడవుగా ఉన్నాయి. పూర్తి పేరు పలకడమే ఇబ్బంది. అందుకే నినాదాలకు, పదేపదే పిలుచుకోవడానికి క్యాచీగా, సులభంగా గుర్తు పెట్టుకోగలిగేలా ముద్దు పేర్లను వాడుతున్నారు! జలంధర్‌లో చన్నీ.. పంజాబ్ మాజీ సీఎం, జలంధర్ కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ అందరికీ ‘చన్నీ’గానే తెలుసు. అందుకే ‘జలంధర్ షహర్.. చన్నీ దీ లెహర్’ (జలంధర్ నగరంలో చన్నీ తరంగం) అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక్కడి ఆప్ అభ్యర్థి పవన్ కుమార్ ‘టీనూ’ కోసం ‘సాద టీను.. జలంధర్ దా టీను’ (మన టీనూ.. జలంధర్ టీనూ) అంటూ వైరల్ చేస్తున్నారు. లుధియానా కాంగ్రెస్ అభ్యర్థిగా పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ ‘రాజా’ బరిలో ఉన్నారు. ఆయన కోసం ‘తుహాదా రాజా.. తుహాదే సంగ్’ (మీ రాజా మీతోనే) అనే స్లోగన్ తయారు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ పరాషర్ ‘పప్పీ’ ఆప్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ రవ్నీత్ సింగ్ ‘బిట్టూ’ బరిలో ఉన్నారు. ‘బిట్టు తే రాజా గప్పీ.. జిట్టుగా సడ్డా పప్పీ’ (బిట్టు ఫూలవడం.. పప్పీ గెలవడం ఖాయం ) అని ఆప్, ‘బిట్టూ దే నాల్.. లుధియానా ఖుష్హాల్’ (బిట్టు చాలు లుధియానా అంతా ఆనందాలు) అని బీజేపీ హోరెత్తిస్తున్నాయి. సంగ్రూర్ నుంచి మంత్రి గుర్మీత్ సింగ్ ‘మీత్’ ఆప్ అభ్యరి్థగా నిలబడ్డారు. ‘జిత్తేగా మీత్.. జిత్తేగా సంగ్రూర్’ (మీత్ గెలుస్తారు.. సంగ్రూర్ గెలుస్తుంది) అని ఆయన అనుచరులు వైరల్ చేస్తున్నారు. ఫిరోజ్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థి జగ్దీప్సింగ్ బ్రార్ బరిలో ఉన్నారు. ఆయన ఫేస్బుక్లో ‘కాకా బ్రార్.. ఫర్ ఫిరోజ్‌పూర్’ హ్యాష్‌టాగ్‌తో మద్దతుదారులు నినాదాలిస్తున్నారు. గురుదాస్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థిగా అమన్ షేర్ ‘షెర్రీ’ కల్సీ పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
ఒడిశాలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 147 మంది సభ్యులున్న అసెంబ్లీకి నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతోంది. మే 13న నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలలోని తొలి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ మే 20న, మూడో దశ ఓటింగ్ మే 25న, నాలుగో దశ జూన్ ఒకటిన జరగనుంది. కాగా సోరో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ చివరి క్షణంలో మార్చింది.బాలాసోర్ జిల్లాలోని సోరో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన మంగళవారం నాడు బీజేపీ తన అభ్యర్థిని మార్చింది. తొలుత అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజేంద్ర కుమార్ దాస్ స్థానంలో పరశురామ్ దాదాను నిలబెట్టింది. కాగా దాస్, దాదా ఇద్దరూ బీజేపీ అభ్యర్థులుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దాదా నామినేషన్‌ను పార్టీ ధృవీకరించింది.బీజేపీ ఒడిశా ఎన్నికల ఇన్ఛార్జ్ విజయ్ పాల్ సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సోరో అభ్యర్థిగా పరశురామ్ దాదా పేరును ధృవీకరించిందని తెలిపారు. 2014, 2019లో బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థిగా సోరో నుండి దాదా రెండుసార్లు గెలిచారు. ఆయన గత నెలలో బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. -
టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ముట్టడించిన మహిళలు
సాక్షి, నంద్యాల జిల్లా: టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. ఓటుకు డబ్బులు ఇస్తామని స్లిప్పులు తీసుకుని టిక్కులు వేసి డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పచ్చ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బుతో పాటు వివిధ తాయిలాలను ఎర వేస్తున్నారు. కొన్ని చోట్ల కుటుంబాలను ఎంపిక చేసుకొని రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ హామీలను గుప్పిస్తూ నగదును పంపిణీ చేస్తున్నారు. -
జనసేన ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన గెలుపు నాదే
-
చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి పరమ్‌పాల్.. వీఆర్ఎస్ రద్దు.. డ్యూటీకి రావాలంటూ ఆదేశం!
పంజాబ్‌లోని బఠిండా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. అకాలీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.రెండు రోజుల క్రితం పరమ్‌పాల్ కౌర్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ కూడా రాసింది. అయితే పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ వీఆర్ఎస్ను తిరస్కరించింది. ఆమెను వెంటనే విధుల్లో చేరాలని కోరింది.ఇటువంటి పరిస్థితిలో పరమ్‌పాల్ కౌర్ నామినేషన్ దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. పరంపాల్ కౌర్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆమెను బఠిండా అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్మెంట్ తన నోటీసులో.. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌లోని రూల్ 16(2) ప్రకారం సమర్థ ప్రీ-డిశ్చార్జ్ కోసం పరమ్‌పాల్ కౌర్ దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వృద్ధురాలైన తల్లిని చూసుకోవడానికి రిటైర్మెంట్ కోరుతున్నట్లు ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు.పదవీ విరమణ దరఖాస్తు నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించాలని పరమ్‌పాల్ కౌర్ అభ్యర్థించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ సిబ్బంది విభాగం పంపిన నోటీసులో పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సంబంధిత అధికారికి మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వగలదని స్పష్టం చేసింది . కేంద్ర ప్రభుత్వానికి ఈ హక్కు లేదని దానిలో పేర్కొంది.అలాగే తల్లి సంరక్షణకు కోసం పదవీ విరమణ కోరుతున్నట్లు దరఖాస్తులో పేర్కొన్న కారణం నిరాధారమైనదిగా పరిగణిస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. ఆమె దరఖాస్తు సమర్పించాక రాజకీయాలలో చురుకుగా మారారు. అందుకే ఈ కారణం నిరాధారమని సదరు నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆమె రిలీఫ్ అప్లికేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె తక్షణమే విధుల్లో చేరాలని ఆ నోటీసులో ఆమెకు తెలియజేశారు. -
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
-
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
-
బీజేపీనా? సమాజ్‌వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్‌సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్‌సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్‌కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్‌కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్‌బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్‌బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్‌కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా మహిళా నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. అంజనీ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె.మయూర్భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నాబా చరణ్ మాఝీని రంగంలోకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ నాడు విజయం సాధించిన బిశేశ్వర్ తుడు స్థానంలో నాబా చరణ్ మాఝీకి అవకాశం కల్పించింది.ఇదే స్థానం నుంచి సుదమ్ మరాండీ బీజేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. సుదామ్ మరాండి ఒకప్పుడు ఒడిశాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేతగా ఉన్నారు. అయితే ఆ తరువాత అతను బీజేడీలో చేరారు. సుదామ్ మరాండీకి స్థానికంగా ప్రజల మద్దతు ఉందనే మాట వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి జేఎంఎం తరపున అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ లోక్‌సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది.మయూర్భంజ్ జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. 2019లో అంజనీ సోరెన్ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మయూర్భంజ్ లోక్‌సభ స్థానంలో గిరిజనుల సంఖ్య అత్యధికం. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. జేఎంఎంతో పొత్తు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. -
అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!
యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
మా అభ్యర్థికి ఓటేయకండి: కాంగ్రెస్ ప్రచారం
జైపూర్: రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. అలాగని అక్కడి అభ్యర్థి రెబల్ అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్డ్ అయిన బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ (BAP) అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.దీంతో బీజేపీ, కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామర్ పోటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం కలిగించనుంది. బన్స్వారా-దుంగార్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి రెండవ దశలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తమ సొంత అభ్యర్థికి బదులు రోట్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, బీఏపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నట్లు దామోర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకుడు వికాస్ బమ్నియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ బమ్నియా కుమారుడు రోట్‌కు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దక్షిణ రాజస్థాన్‌లో స్థాపించిన బీఏపీకి రోట్తో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని మూడోసారి యూపీలోని మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని 2014 నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె.. తన భర్తకు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు. హేమ మాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం తన భర్త, నాటి హీరో ధర్మేంద్రకు ఇష్టంలేదంటూనే, మరో హీరో వినోద్ ఖన్నా సూచనలతో రాజకీయాల్లో కాలుమోపానని తెలిపారు. రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలా కష్టమని, అందుకే ధర్మేంద్ర తనను రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించారన్నారు. ధర్మేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అందుకే తనకు అలాంటి సలహా ఇచ్చిరని హేమ మాలిని తెలిపారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే తాను తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. ధర్మేంద్ర 2004 నుండి 2009 వరకు బికనీర్ నుండి ఎంపీగా ఉన్నారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో నాడు నటుడు వినోద్ ఖన్నా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలో వినోద్‌ను చూసి నేర్చుకున్నానని, పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనే నేర్పించారన్నారు. బీజేపీ నేత వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. -
డీజిల్ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. పలు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో పలు వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గనీబెన్ ఠాకూర్ ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్న గనీ బెన్ అందుకు అయ్యే ఖర్చును అక్కడి జనం నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తన ఎన్నికల ఖర్చుల కోసం చాలామంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. అందుకు ప్రతిగా బనస్కాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత 10 రోజుల్లో తాను నిర్వహించిన బహిరంగ సభల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను పలువురు భరించారని తెలిపారు. తన కారు డీజిల్ ఖర్చును కూడా జనమే చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కాంగ్రెస్ ‘దేశం కోసం విరాళం’ ప్రచారాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపారు. బనస్కాంతలో కాంగ్రెస్ అభ్యర్థి గనీ బెన్‌పై బీజేపీ నుంచి ప్రొఫెసర్ రేఖా చౌదరి ఎన్నికల బరిలోకి దిగారు. రేఖా చౌదరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2013లో జరిగిన ఉప ఎన్నికతో సహా గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో బనస్కాంత సీటును బీజేపీ గెలుచుకుంది. -
ప్రధాని మోదీపై పోటీకి దిగిన హేమాంగీ సఖి ఎవరు?
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీకి దిగడంతో అతని ప్రత్యర్థులెవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖిల భారత హిందూ మహాసభ టిక్కెట్‌పై మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా నిలిచారు. అఖిల భారత హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ యూనిట్ రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీనిలో భాగంగా వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి ఎన్నికల బరిలోకి దిగారు. హేమాంగీ సఖి తాను ట్రాన్స్జెండర్ల హక్కుల సాధన కోసం ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలలో ట్రాన్స్జెండర్లకు సీట్లు కేటాయించాలని హేమాంగీ సఖి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన హేమాంగీ సఖి.. నేటికీ ట్రాన్‌జెండర్లు భిక్షాటన చేయడం ద్వారా పొట్టపోసుకుంటున్నారని, ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదని వాపోయారు. తాను కాశీలోని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. హేమాంగీ సఖి భాగవత కథను పంజాబీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ మొదలైన భాషలలో వివరిస్తారు. భారతదేశంతో పాటు బ్యాంకాక్, సింగపూర్, మారిషస్ మొదలైన దేశాలలో హేమాంగీ సఖి భాగవత కథను వినిపించారు. ట్రాన్స్‌జెండర్ మహామండలేశ్వర్ హేమాంగీ సఖి తల్లి పంజాబీ. తండ్రి గుజరాతీ. హేమాంగీ సఖి తన బాల్యాన్ని మహారాష్ట్రలో గడిపారు. తల్లిదండ్రులు మరణించాక హేమాంగీ సఖి బృందావనం చేరుకుని, అక్కడ పలు గ్రంథాలను అధ్యయనం చేశారు. కాగా వారణాసి లోక్‌సభ స్థానానికి ఏడో దశలో అంటే చివరి దశలో ఓటింగ్ జరగనుంది. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. -
కేరళలో యూపీ వ్యూహం.. గణపతి శరణులో బీజేపీ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు. కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్‌లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు. -
బీదర్‌లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్‌లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్‌సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్‌కుమార్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం -
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య !
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ మేరకు రాజయ్య పేరును కేసీఆర్ కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం(ఏప్రిల్ 12) భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ సీటు స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారని అలకబూనిన రాజయ్య ఎన్నిలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌కు వెళ్లడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఓకే అన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ.. కడియం -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
రజాకార్ మూలాలు చిత్తూ చేసి 40 ఏళ్ల చరిత్ర తిరగరాస్తాము
-
చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్‌లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్‌లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్‌కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అలీఘర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. #WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC — ANI (@ANI) April 8, 2024 -
లోక్‌సభ అభ్యర్థికి గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కాజల్ నిషాద్కు గుండెపోటుకు గురయ్యారు. ఆమెను వెంటనే లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 5న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమె స్థానిక స్టార్ హాస్పిటల్లో చేరారు. అయితే ఏప్రిల్ 7న అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యుల సూచన మేరకు లక్నోకు తరలించారు. కాజల్ నిషాద్‌ను అంబులెన్స్‌లో లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆమె డీహైడ్రేషన్ కారణంగా స్టార్ హాస్పిటల్లో చేరారు. తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో చికిత్స పొందుతున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో ఎంతో కీలకమైనది. గతంలో సీఎం యోగి ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం భోజ్‌పురి నటుడు రవికిషన్ ఈ స్థానానికి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రవికిషన్ బీజేపీ తరపున గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. రవికిషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ తరపున కాజల్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. -
‘నా భార్య కాంగ్రెస్.. ఇంటికి వెళ్లను’ ఓ అభ్యర్థి కఠిన నిర్ణయం
భోపాల్: ఈ సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకర్ ముంజరే తాత్కాలికంగా ఇంటిని వీడి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇంట్లో అడుగు పెట్టను అని కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని బీఎస్పీ అభ్యర్థి కంకర్ ముంజరే శనివారం తెలిపారు. తన తన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే అక్కడ ఉంటున్నారని, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను అనుసరిస్తున్నప్పుడు ఒకే పైకప్పు కింద ఉండకూడదని అన్నారాయన. ఏప్రిల్ 19న పోలింగ్ రోజు తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే చెప్పారు. "నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆనకట్ట సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. వేర్వేరు భావజాలాన్ని అనుసరించే ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద నివసిస్తుంటే, అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు ” అని ఆయన పీటీఐతో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్‌ను ఓడించారు. అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి అయి మెట్టినింటికి వెళ్లిన మహిళ చనిపోయే వరకు అక్కడే ఉంటుందని అనుభా ముంజరే చెబుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్‌పై బాలాఘాట్ నుండి పోటీ చేసినప్పుడు తాము కలిసే ఉన్నామని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు. -
మరో పదేళ్లు హేమామాలినీనే ఎంపీ?
యూపీలోని మధుర ఎంపీ హేమామాలిని విజయానికి ఇక ఢోకాలేదట! ఓ స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తూ, రోబోయే పదేళ్లూ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంటారని చెప్పారట. ప్రస్తుతం హేమామాలిని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె ఆచార్య ప్రేమానంద్ మహరాజ్‌ను కలిసేందుకు మధురలోని ఆయన ఆశ్రమానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ప్రేమానంద్ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ హేమామాలినీని ఆశీర్వదిస్తూ ‘మీరు సాధువులకు దగ్గరగా ఉండటమే కాకుండా, భగవంతుని పాదాలను ఆశ్రయించారు. మీరు ప్రాపంచిక విజయాలనే కాకుండా, అతీంద్రియ విజయాలను కూడా అందుకుంటారు. శ్రీ కృష్ణునిపై మీకు కలిగిన ప్రేమ ఒక అతీంద్రియ విజయం . ఏది ఏమైనప్పటికీ మీరు మరో పదేళ్లు ఇలా విజయాలు సాధిస్తూనే ఉంటారు’ అని ఆశీర్వదించారు. హేమామాలిని ప్రేమానంద్ ఆశ్రమంలో 20 నిముషాల పాటు ఉన్నారు. -
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్‌నుంచి రెండుసార్లు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
చందాలతో నామినేషన్.. ఆటోలో తిరుగుతూ ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరమయ్యింది. ఈ ఎన్నికల పోరులో నేతలంతా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్దే తమ నినాదమంటూ ఎన్నికల సభల్లో ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ‘మిస్టర్ డొనేషన్’గా పేరు తెచ్చుకున్న ఒక అభ్యర్థి విచిత్ర రీతిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. బీహార్‌లోని గయ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అశోక్ కుమార్ పాశ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా. అశోక్ ప్రభుత్వ భూమిలో ఇంటిని కట్టుకున్నాడు. తన ఎన్నికల నామినేషన్‌కు అయ్యే మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి నిధులను సేకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు అతనికి ‘మిస్టర్ డొనేషన్’ అనే పేరు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రజల మధ్యకు వెళ్లి, వారికి వందనం చేస్తూ పది రూపాయల చందాతో పాటు తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. అశోక్ కుమార్ పాశ్వాన్ ఎన్నికల గుర్తు ఆటో. దీంతో అతనే స్వయంగా ఆటో నడుపుతూ ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. గతంలో గయ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినవారెవరూ ఈ ప్రాంతానికి ఒక్కసారైనా రాలేదని అశోక్ ఆరోపిస్తున్నాడు. తాను ఎంపీని అయ్యాక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని అన్నాడు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలను అభివృద్ధి పనులకు వెచ్చిస్తానని అశోక్ తెలిపాడు. బడా నేతల మాదిరిగా తాను ప్రచారం చేయలేనని, తోటి ఆటో డ్రైవర్లు తన కోసం ప్రచారం చేస్తున్నారని అశోక్ పేర్కొన్నాడు. -
వీళ్లా.. అభ్యర్థులు!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నకోద్దీ తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకలేదు. డబ్బున్నదనో, ఇతర కారణాలతోనే మొత్తంమీద అభ్యర్థులనైతే ఎంపిక చేశారు. వీరిలో అధిక శాతం పోటీకైతే సిద్ధమయ్యారు కానీ, క్షేత్రస్థాయిలో కనీస ప్రభావం చూపించలేకపోతున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. కొందరిని అయినా మార్చి ఇంకా ధన బలం ఉన్న వారిని పోటీకి పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. మరోపక్క సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నారు. పనిచేయని పొత్తులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పారీ్టలతో పొత్తులు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగకపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచార సభల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్‌షోలకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు వైఎస్ జగన్ రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్లెదుటే ఓటమి కనిపిస్తోంది. చంద్రబాబు నాలుగు నెలల క్రితమే ప్రకటించిన మేనిఫెస్టో, ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నాయి. సత్యవేడు అభ్యర్థి మార్పు! చిత్తూరు జిల్లా సత్యవేడులో ఫిరాయింపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మార్చడం దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి ప్రజల్లో ఆదరణ లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ సీటు నిరాకరించింది. ఆయన్ని టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు అదే సీటు కేటాయించారు. ఇప్పుడు తత్వం బోధపడటంతో ఆదిమూలాన్ని తప్పించి మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు. అడ్డగోలు వాదనలు చేయడం ద్వారా ఎల్లో మీడియాలో గుర్తింపు పొందిన కొలికపూడి శ్రీనివాస్‌ని గొప్ప వ్యక్తిగా భావించి తిరువూరు సీటు ఇచ్చేశారు. కానీ అక్కడ ఆయన్ని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. దీంతో శ్రీనివాస్‌ని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడిలో స్థానిక నేతలను కాదని ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌ను ఎంపిక చేశారు. ఆయన కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో మరొక డబ్బున్న నేత కోసం కసరత్తు చేస్తున్నారు. గజపతినగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మడకశిర స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారమూ పని చేయలేదు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మొన్నటివరకు తప్పుడు ప్రచారం ద్వారా హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా, మౌత్ క్యాంపెయినర్ల ద్వారా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయించి ప్రజలను తికమక పెట్టాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అయినా వాపునే బలుపు అనుకుని టీడీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా గాల్లో తేలిపోయారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక వైఎస్సార్సీపీ నిర్వహించిన నాలుగు ‘సిద్ధం’ సభలు టీడీపీ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. ఇప్పుడు వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేస్తోంది. దీంతో టీడీపీ అంతర్మథనంలో మునిగిపోయింది. పొత్తులు కూడా వికటించినట్లు తేలడంతో ఇప్పుడు 10 శాతం అభ్యర్థులనైనా మార్చి ఉన్నంతలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే దిశగా చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండి, అనపర్తి సీట్లపై అనిశ్చితి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపైనా అనిశ్చితి నెలకొంది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించినప్పటికీ, చంద్రబాబు ఒత్తిడితో వివాదాస్పద నేత రఘురామకృష్ణరాజును అక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామరాజుకు బీజేపీ నర్సాపురం ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. రఘురామరాజు నర్సాపురం ఎంపీ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాకపోతే ఉండి సీటు కేటాయించక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగల అభ్యర్థిని మార్చాలని అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒత్తిడి తెస్తుండడంతో ఆ దిశగానూ కసరత్తు నడుస్తోంది. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాల మార్పుపైనా చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించే దిశగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించిన నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా బలమైన వైఎస్సార్సీపీకి కనీస పోటే ఇచ్చేలా వాతావరణాన్ని మార్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
‘ప్రచారానికెళ్లను.. నేరుగా ఫలితాల్లోకి దూకుడే’
జార్ఖండ్‌లోని గొడ్డ లోక్‌సభ నియోజకవర్గంలో విచిత్ర ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఎంపీ, బీజేపీ అభ్యర్థి నిషికాంత్ దూబే ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరారు. నిషికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తనకు పోటీనిచ్చే బలమైన నేత జేఎంఎంలో లేరని ఆరోపించారు. ఒకవేళ జేఎంఎం ఎవరినైనా తనకు ప్రత్యర్థిగా నిలబెడితే, తాను ప్రచారం చేయనని అన్నారు. అలాగే ప్రదీప్ యాదవ్‌ను కాంగ్రెస్ నిలబెట్టినా తాను ప్రచారానికి వెళ్లనని, నేరుగా ఫలితాల అందుకునేందుకే వెళతానని అన్నారు. నామినేషన్ దాఖలు చేశాక, ఫలితాల కోసం ఎదురు చూస్తానని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల ప్రచార సమయంలో తాను టైమ్‌పాస్ చేయడానికి ఎక్కడో ఒకచోట టీ తాగుతూనో, క్రికెట్ ఆడుతూనో కాలం గడుపుతానని అన్నారు. ఇక్కడి నుంచి జేఎంఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నదన్నారు. తన గెలుపుపై తనకు అపార నమ్మకం ఉందని, బహుశా ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండదన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చాలో తనతో పోరాడే అభ్యర్థి లేడని, ఆ పార్టీ నేతలు స్టీఫెన్ మరాండీ, నలిన్ సోరెన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. -
వయనాడ్‌లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్‌కు ముందు జరిగే రోడ్ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్‌కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. -
jammu: అనంత్‌నాగ్ నుంచి బరిలో గులాంనబీ
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్(డీపీఏపీ) మంగళవారం(ఏప్రిల్ 2) ఒక ప్రకటనలో తెలిపింది. డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ పోటీపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్(ట్విటర్)లో ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ ఉదంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జితేంద్రసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2022లో డీపీఏపీ పార్టీని స్థాపించారు. ఇదీ చదవండి.. బారామతిలో వదిన మరదళ్ల సమరం -
ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు!
భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ తారలతో పాటు రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల పోరులో మనం యువరాణులను, యువరాజులను చూడబోతున్నాం. దేశంలోని ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు రాజకుటుంబాలకు చెందిన పలువురికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 12 రాజకుటుంబాల వారసులు పోటీకి దిగారు. వీరిలో ఐదుగురు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఏడుగురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటకలోని మైసూర్ రాజు నుంచి త్రిపుర రాజకుటుంబానికి చెందిన రాణి వరకు పలువురు అభ్యర్థులు ఈ జాబితాలో కనిపిస్తారు. మార్చి 13న బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ వడియార్‌కు అవకాశం కల్పించింది. యదువీర్ తాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 1999 వరకు మైసూర్ నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బీజేపీ తన రెండవ జాబితాలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుండి కీర్తి సింగ్ దేవ్ వర్మకు అవకాశం కల్పించింది. ఆమె త్రిపుర మాణిక్య రాజ కుటుంబానికి చెందిన యువరాణి. ఆమె తిప్ర మోతా పార్టీ నేత ప్రద్యోత్ దేవ్ వర్మకు సోదరి. తిప్ర మోత పార్టీ ఇటీవలే ఎన్డీఏ కూటమిలో చేరి, ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తోంది. ఈ క్రమంలో వినిపించే మూడో పేరు మాళవిక కేశరి దేవ్. ఈమెను బీజేపీ ఒడిశా నుంచి బరిలోకి దింపింది. మాళవిక బీజేడీ మాజీ ఎంపీ అర్కా కేశరి దేవ్ భార్య . కలహండి రాజకుటుంబ సభ్యురాలు. 2023లో ఈ దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మహిమా కుమారి విశ్వరాజ్ సింగ్ మేవార్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈమె మేవార్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ భార్య. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై బీజేపీ రాజమాత అమృతా రాయ్‌ను పోటీకి నిలిచింది. రాయ్ కృష్ణనగర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆ ప్రాంతంలో ఆమెను రాజమాత అని పిలుస్తారు. ఛత్రపతి శివాజీ వారసుడు, మహారాష్ట్రలోని సతారా రాజ్యసభ ఎంపి ఉదయన్‌రాజే భోసలే ఈసారి బీజేపీ టిక్కెట్‌పై సతారా లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి, గ్వాలియర్ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే బీజేపీలో రాజ్యసభ ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి గుణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీకి దిగారు. ఒడిశాలోని పట్నాఘర్-బోలంగీర్ రాజకుటుంబానికి చెందిన బొలంగీర్ సిట్టింగ్ ఎంపీ సంగీతా కుమారి సింగ్ డియోకు బీజేపీ ఈసారి టిక్కెట్ ఇచ్చింది. -
ఎన్నికల బరిలో ఆటో డ్రైవర్
దేశంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు పలు చోట్ల ఆసక్తికరంగా మారాయి. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇంతలోనే ఈ స్థానం నుంచి ఒక ఆటో డ్రైవర్ ఎన్నికల రంగంలోకి దూకి, తాను బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీ ఇస్తానని చెబుతున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జ్ఞానదీప్ అనే ఆటో డ్రైవర్ గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఈయన ఆటో నడుపుతూ చాలాకాలంగా గ్రేటర్ నోయిడాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. జ్ఞాన్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇప్పటి వరకు ఏ నేత కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని, అందుకే తాను రంగంలోకి దిగుతున్నానని తెలిపాడు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకోసం పాటుపడతానని పేర్కొన్నాడు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. తాను రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీగా నిలుస్తానని తెలిపాడు. తాను ఎంపీగా ఎన్నికైతే స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ట్రాన్స్జెండర్లకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు చేయూతనిస్తానని అన్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా, వారు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూస్తానని పేర్కొన్నాడు.. लोकसभा चुनाव 2024 गौतमबुद्ध नगर में खड़ा हुआ गजब उम्मीवार, भाजपा-सपा को टक्कर देने आया एमपी का ड्राइवर, देखिए दिलचस्प वीडियो @ECISVEEP #LokSabhaElection2024 #Noida (@mayank_tawer ) pic.twitter.com/1HIsaBPEWo — Tricity Today (@tricitytoday) April 1, 2024 -
చంద్రబాబుకి బుద్ధి చెప్తాం..జగన్ ని గెలిపించుకుంటాం
-
పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే..
-
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
ఎన్నికల వింత హామీ.. రేషన్ కార్డుపై విదేశీ మద్యం!
రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు వీలైనన్ని వాగ్దానాలు చేస్తూ, హామీలనిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఎన్నికల వింత వాగ్దానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన వనితా రౌత్ తనను ఎంపీని చేస్తే, రేషన్ కార్డులపై విదేశీ మద్యం అందజేస్తానని, నిరుద్యోగ యువతకు మద్యం కాంట్రాక్టులు కేటాయిస్తానని హామీనిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వనితా రౌత్ చేస్తున్న వాగ్దానాలను ఇంతకు ముందు ఏ అభ్యర్థి కూడా చేసివుండరు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రతి గ్రామంలో బార్లను తెరుస్తానని, తనకు వచ్చే ఎంపీ నిధులతో పేదలకు ఉచితంగా మద్యం అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. దీనికి ముందు వనితా రౌత్ 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 2019లోనే చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి చేశారు. ఆ సమయంలోనూ ఆమె ప్రజలకు ఇటువంటి హామీలనే ఇవ్వడం విశేషం. -
‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్ గురించే!
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన. "ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. #WATCH | Lok Sabha elections 2024 | Congress candidate from Bastar (Chhattisgarh), Kawasi Lakhma says, "I am not contesting the elections, Congress party will contest the elections...Why did I get a ticket? I had not asked for one...If it is being insisted, give the ticket to my… pic.twitter.com/WSPUJ17I9O — ANI (@ANI) March 28, 2024 -
కాంగ్రెస్ అభ్యర్థిపై ఎస్పీ కార్యకర్తల తిరుగుబాటు!
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలకు ఇది మింగుడుపడటం లేదని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొరాదాబాద్ సీటు కేటాయింపు విషయంలో గతంలో ఎస్టీ హసన్ , రుచి వీర మధ్య వివాదం తలెత్తింది. ఇప్పుడు సమాజ్‌వాదీ మిత్రపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీ.. ఎస్పీ కార్యకర్తల నిరసరనను ఎదుర్కోవలసి వచ్చింది. అమ్రోహా జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ కార్యకర్తలు డానిష్ అలీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీని చూసిన వెంటనే ఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట తోపులాట జరిగింది. వేదికపై కూర్చున్న నేతలు వారిస్తున్నప్పటికీ కార్యకర్తల నిరసన మాత్రం ఆగలేదు. ఎస్పీ కార్యకర్తలు కార్యాలయం వెలుపల డానిష్ అలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డానిష్ అలీని అభ్యర్థిగా నిలబెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. డానిష్ అలీ బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అతనిని అమ్రోహా స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలబెట్టింది. -
బీజేపీలోకి నవనీత్ రాణా.. అమరావతి నుంచి పోటీ!
మహారాష్ట్రలోని అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా అధికారికంగా బీజేపీలో చేరారు. నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే నవనీత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికిముందు అమరావతి (రిజర్వ్డ్ స్థానం) నుంచి పార్టీ అభ్యర్థిగా నవనీత్ రాణాను బీజేపీ ప్రకటించింది. బీజేపీలో చేరిన నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నానని అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తారని, ఈ విధంగానే తనకు టిక్కెట్ కేలాయించారన్నారు. తన శ్రమను బీజేపీ గుర్తించిందని, ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి 400 సీట్లు దాటాలనే బీజేపీ సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ఇకపై తాను బీజేపీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు స్వతంత్రులు గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో నవనీత్ రానా కూడా ఒకరు. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబీ కుటుంబానికి చెందిన నవనీత్ కౌర్.. రవి రానాతో పెళ్లి తర్వాత రానాను తన పేరులో చేర్చుకున్నారు. నవనీత్ కౌర్, రవి రాణా యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆశ్రమంలో కలుసుకున్నారు. 2011లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎంపీ నవనీత్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు నవనీత్ మోడలింగ్‌లో తన కెరియర్ ప్రారంభించారు. తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించారు. నవనీత్ పెళ్లి తర్వాత రాజకీయాల్లో కాలుమోపారు. 2014లో ఎన్సీపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అమరావతి ఎంపీగా ఎన్నికయ్యారు. #WATCH | Maharashtra | Navneet Rana joins BJP in the presence of BJP state president Chandrashekhar Bawankule, in Nagpur pic.twitter.com/W3pCVrhfuH — ANI (@ANI) March 27, 2024 -
ఇలా టిక్కెట్ ఇచ్చి... అలా రద్దు చేసి..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్‌కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్‌కు టిక్కెట్‌ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్‌కు కేటాయించింది. మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్‌ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. -
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన YSRCP
సాక్షి, గుంటూరు: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె. గత ఎన్నికల ఫలితాలేంటీ? మాడుగుల స్థానంలో పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు. -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్‌ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్‌సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
రేపు బీజేపీ తుది జాబితా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఖరారు కాగా, ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం. ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వికేంద్రీకరణ వ్యూహం... బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్‌బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్‌షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
YSRCP 2024: మహిళలకు, విద్యాధికులకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ వెల్లడించింది. ఈసారి మహిళలకు, విద్యాధికులకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. 2019తో పోల్చిచూస్తే మహిళలకు ఈ సారి ఐదు సీట్లు అధికంగా కేటాయించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళకు మొత్తం 24 సీట్లు కేటాయించగా, వాటిలో 19 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర స్థానాల్లో ఉంటూ, పార్టీ కోసం పాటుపడినవారిని గుర్తించి, వారిలో 14 మందికి పార్టీ సీట్లు కేటాయించింది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన మొత్తం 200 మందిలో 77 శాతం మంది అంటే 153 మంది (131 ఎంఎల్ఏ, 22 ఎంపీ)లు పట్టభద్రులు. వారిలో 58మంది పోస్టు గ్రాడ్యుయేట్, ఆరుగురు డాక్టరేట్ చేసినవారు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులలో 17 మంది వైద్యులు, 15మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక రక్షణ విభాగం ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని 50 శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కేటాయించారు. ఈ జాబితాలో 84 ఎంఎల్ఏ, 16 ఎంపీ అభ్యర్థులున్నారు. 2019 ఎన్నికల సీట్ల కేటాయింపుతో పోల్చి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటికీ అదనంగా 7 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీసీ పార్టీ కేటాయించింది. ఇక మహిళా అభ్యర్థుల విషయానికొస్తే 2019తో పోల్చిచూస్తే ఈసారి అదనంగా 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. -
పంజాబ్ లోక్‌సభ ‘ఆప్’ అభ్యర్థుల జాబితా విడుదల
పంజాబ్ లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా లోని వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లర్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకు, ఫతేగఢ్ సాహిబ్ నుంచి గురుప్రీత్ సింగ్ జీపీ, ఫరీద్కోట్ నుంచి కరమ్‌జీత్ అన్మోల్, బటింఠా నుంచి గుర్మీత్ సింగ్ ఖాడియన్, సంగరూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్, పటియాల నుంచి డా. బల్బీర్ సింగ్‌లను లోక్ సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించింది. -
బీజేపీ నుంచి ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే..
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒకే ఒక పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. అదే కేరళలోని మలప్పురం నియోజకవర్గం అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. ఎందుకంటే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే.. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు. ‘ది క్వింట్’ కథనం ప్రకారం.. రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రభావితుడై రాజకీయాల్లోకి వచ్చారు. 2022 జూలై నుంచి లోక్‌సభలో గానీ, రాజ్యసభలోగానీ బీజేపీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. మలప్పురం స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్, సీపీఎం అభ్యర్థి వి.వసీఫ్లపై అబ్దుల్ సలామ్ పోటీ చేయనున్నారు. మలప్పురం నియోజకవర్గం డీలిమిటేషన్‌కు ముందు మంజేరిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భాగమైన ఐయూఎంఎల్కి కంచుకోటగా ఉంది. ఎవరీ అబ్దుల్ సలామ్? మలప్పురంలో జన్మించిన అబ్దుల్ సలామ్ పీహెచ్డీ చేశారు. 2011 నుంచి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. కేరళలో యూడీఎఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఐయూఎంఎల్ ద్వారానే ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం. అబ్దుల్ సలామ్ బీజేపీలో చేరిన రెండు సంవత్సరాల తరువాత అంటే 2021లో తిరుర్ స్థానం నుండి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఐయూఎంఎల్ అభ్యర్థి కురుక్కోలి మొయిదీన్ చేతిలో 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా సలాం బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు కూడా. -
బందరు YSRCP ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం(బందరు) లోక్‌సభ అభ్యర్థి విషయంలో వైఎస్సార్సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ Simhadri Chandrasekhar పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్ ఆయన్ని( సింహాద్రి చంద్రశేఖర్) కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన ఇక్కడికి రావడం వల్ల.. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి జరుగుతుంది అని పేర్ని నాని ఆకాంక్షించారు. నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఇప్పటిదాకా లేను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను అని డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన బాలశౌరికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో జనసేనలో చేరారాయన. దీంతో ఇక్కడి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైఎస్సార్సీపీ. దేశంలోనే ప్రముఖ కేన్సర్ వైద్యుడిగా చంద్రశేఖర్‌కు పేరుంది. దివంగత సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే చంద్రశేఖర్. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 1985 నుంచి 1999 మధ్య మూడు పర్యాయాలు వరుసగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసింది తెలిసిందే. అయితే గత రెండు ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ పార్టీలు ప్రయత్నించినప్పటికీ సుముఖత చూపలేదు. రాజకీయాల్లో నీతి, నిజాయితీగా పనిచేసిన మంత్రిగా సింహాద్రి సత్యనారాయణరావుకి ఎంతో పేరుంది. ఆయన రాజకీయ వారసత్వంగా సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావడం పట్ల దివిసీమ ప్రజలు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తొలుత సింహాద్రి చంద్రశేఖర్ Simhadri Chandrasekhar Raoను అవనిగడ్డ నిజయోకవర్గ ఇంఛార్జిగా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం లోక్‌సభ స్థానం ఇంఛార్జిగా ప్రకటించారు. అయితే అవనిగడ్డ ఇన్‌ఛార్జి బాధ్యతలను తన తనయుడు రామ్‌చరణ్‌కు ఇవ్వాలంటూ సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారాయన. దీంతో ఇక ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్‌కు సీఎం జగన్ అవకాశం కల్పించారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులెవరు?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించగా, కాంగ్రెస్ కూడా త్వరలో ఈ జాబితాను విడుదల చేయనుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఢిల్లీలోని చాందినీ చౌక్, నార్త్-వెస్ట్, ఈశాన్య సీట్ల కోసం పార్టీ పలువురి పేర్లను చర్చిస్తోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదిరిన నేపధ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాలలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ సీట్లలో పోటీకి నిలబెట్టేందుకు కొన్ని కొత్త పేర్లతో పాటు పాత అభ్యర్థులు, కులాల సమీకరణకు తగిన అభ్యర్థులు ఎవరనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాందినీ చౌక్ నుంచి అభ్యర్థిత్వం కోసం భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, ఢిల్లీ సీనియర్ నేత ఛత్తర్ సింగ్ పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నార్త్-వెస్ట్ ఢిల్లీకి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, బవానా మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఈ జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ మూడు స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మరో లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే.. -
రాయ్‌బరేలీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కుమార్ విశ్వాస్?
కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఈసారి బ్రాహ్మణ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్థులుగా కుమార్ విశ్వాస్, బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే పేర్లు వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, అమేథీలను యూపీలో కాంగ్రెస్‌కు కంచుకోటలుగా పరిగణిస్తారు. అయితే 2019లో అమేథీ నుంచి బీజేపీ తన అభ్యర్థిగా స్మృతి ఇరానీని పోటీకి దింపి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టింది. రాయ్‌బరేలీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదేస్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ రాయ్‌బరేలీ నుంచి ప్రముఖుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. కుమార్ విశ్వాస్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై అమేథీ నుంచి పోటీ చేశారు. విశ్వాస్ను ఎన్నికల్లో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమార్ విశ్వాస్ ప్రసంగం ఆయన బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సూచనలిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ద్వారకలో పర్యటించినప్పుడు ఆయనను కుమార్ విశ్వాస్ ప్రశంసించారు. -
పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రగడ
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచి్చంది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి. -
పాక్‌లో ఎన్ని సీట్లకు ఎన్నికలు? బరిలో పార్టీలేవి? అభ్యర్థులెందరు?
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. విపరీతమైన ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. దేశంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పాక్ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. పాకిస్తాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేస్తారు. 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 141 సీట్లు, సింధ్‌లో 75, ఖైబర్ పఖ్తుంక్వాలో 55, బలూచిస్థాన్‌లో 20, ఇస్లామాబాద్‌లో మూడు సీట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం 12.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో సగానికి పైగా ఉంది. 6.9 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా, 5.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నమోదైన ఓటర్లలో కూడా 44 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. 2018 నుండి, దేశంలో ఓటర్ల సంఖ్య 2.25 కోట్లు పెరిగింది. అందులో 1.25 కోట్ల మంది మహిళలు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 4,806 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు లింగమార్పిడి అభ్యర్థులు ఉన్నారు. 167 నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల విషయానికొస్తే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ). ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. ఫలితంగా పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో దాదాపు 17,500 ‘అత్యంత సున్నితమైన’ పోలింగ్ స్టేషన్లు. పాక్ ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయనున్నారు. -
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం. -
మహ్మద్ అజారుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఇన్నిరోజుల నుంచి రాజకీయ పార్టీలు ముమ్మరంగా సాగించిన ఎన్నికల ప్రచారానికి మంగళవారమే తెరపడింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలను ఈసీ తీసుకుంటుంది. -
ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్‌రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్రావు, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు. కేసీర్ కుటుంబమే బాగుపడింది పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్‌లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!
రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు (నవంబర్ 25) పోలింగ్ జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజస్థాన్ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఈసారి దేశంలోని అందరి దృష్టి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రాజస్థాన్ ఎన్నికల్లో వందల కోట్ల ఆస్తులు కలిగిన అభ్యర్థులు పోటీకి దిగారు. అదేసమయంలో ఒక్క రూపాయి కూడా ఆస్తి లేని అభ్యర్థులు కూడా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తమ దగ్గర ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొన్నారు. 1. బన్వారీ లాల్ శర్మ: అల్వార్ జిల్లాలోని తనగాజీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీకి దిగిన అభ్యర్థి బన్వారీ లాల్ శర్మ. ఆయన తన ఆస్తులను జీరోగా ప్రకటించారు. 2. హేమంత్ శర్మ: అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ స్థానం నుండి పోటీ చేస్తున్న ఇండియన్ పీపుల్స్ గ్రీన్ పార్టీ అభ్యర్థి, న్యాయవాది హేమంత్ శర్మకు కూడా తనకు ఆస్తులు లేవని తెలిపారు. 3. దీపక్ కుమార్ మీనా: సామ్రాట్ మిహిర్ భోజ్ సమాజ్ పార్టీకి చెందిన దీపక్ కుమార్ మీనా.. సవాయ్ మోథ్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన దగ్గర కూడా ఎలాంటి ఆస్తి లేదు. 4. బద్రీలాల్: ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన బద్రీలాల్ (కాన్షీరామ్) ఝలావర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ దాగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్లో తన ఆస్తులు సున్నా అని తెలియజేశారు. 5. నహర్ సింగ్: నహర్ సింగ్.. మజ్దూర్ కిసాన్ అకాలీ దళ్ టిక్కెట్‌పై గంగానగర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానం రాయసింగ్నగర్ నుండి పోటీ చేస్తున్నారు. ఈయనకు కూడా ఎలాంటి ఆస్తి లేదు. 6. కన్హయ్యలాల్: కన్హయ్యలాల్ బికనీర్ జిల్లాలోని నోఖా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 7. వేద్ ప్రకాష్ యాదవ్: తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తులు లేవని ప్రకటించిన వేద్ ప్రకాష్ యాదవ్ అల్వార్ జిల్లాలోని ముండావర్ స్థానం నుంచి పోటీకి దిగారు 8. పురుషోత్తం భాటి: పురుషోత్తం భాటి అజ్మీర్ జిల్లాలోని బీవార్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నాడు. రూ.500 ఆస్తుల యజమానులు మరోవైపు తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. బహుజన్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతా పార్టీకి చెందిన కుసుమ్ లత హిందౌన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బహుజన్ ముక్తి పార్టీకి చెందిన చంద్ర కుమార్ చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా నుండి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ వద్ద రూ.500 మేరకు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఈ వీఐపీ సీట్లపైనే అందరి దృష్టి! -
కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్ రద్దు!
త్వరలో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు. శ్రీగంగానగర్ జిల్లాలోని శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఈయన ఎన్నికల బరిలో నిలిచారు. గుర్మీత్ సింగ్ కున్నార్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుర్మీత్ సింగ్ కున్నార్ కుమారుడు రూబీ కున్నార్ తండ్రి మరణవార్తను మీడియాకు తెలిపారు. 75 ఏళ్ల గుర్మీత్ సింగ్ కున్నార్ అనారోగ్యంతో నవంబర్ 12న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. గుర్మీత్ సింగ్ మృతితో కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్దతుదారుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నికలకు ముందు అభ్యర్థి మృతి చెందడంతో శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబరు 25న జరగాల్సిన పోలింగ్ వాయిదా పడింది శ్రీకరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పృథిపాల్ సింగ్ సంధు రెండో స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన సురేంద్ర పాల్ సింగ్ టీటీ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ ముగ్గురూ మళ్లీ ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధం అయ్యారు. కాగా సంధు ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు! -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్ ఇవ్వండి
కరీంనగర్ టౌన్: అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరు సాగిస్తున్నానని బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్‌సింగ్‌తో కలసి కరీంనగర్ కలెక్టరేట్‌లోకి కారు నడుపుకుంటూ వెళ్లిన సంజయ్.. ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటివరకు ప్రజలు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకట్రెండు పథకాలు అమలు చేసి అదేదో గొప్ప పని చేసినట్లు భూతద్దంలో చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు వైపా లేక ధర్మం వైపా ప్రజలు తేల్చుకోవాలి: రాజాసింగ్ కరీంనగర్ ప్రజలు ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ పక్షాన ఉంటారో లేక అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ. 20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్లో సంజయ్ పోటీ చేస్తున్నారని తెలియగానే గంగుల కమలాకర్ దారుస్సలాం వెళ్లి ఎంఐఎం అధినేతకు సలాం చేశారని... అయినా సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ట్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీయేనని మైనారిటీలు గుర్తించాలన్నారు. బండి సంజయ్‌పై 35 కేసులు.. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై పలు సందర్భాల్లో 35 కేసులు (గత అసెంబ్లీలో కేవలం 5 కేసులు) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు. సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూములు, గృహాలు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద సంజయ్ దంపతుల ఆస్తుల విలువ రూ.79.51 లక్షలు మాత్ర మే. ఇక తనకు రూ.5.44 లక్షల రుణాలు, తన భార్యకు రూ.12.40 లక్షల రుణాలు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు.