రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు వీలైనన్ని వాగ్దానాలు చేస్తూ, హామీలనిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఎన్నికల వింత వాగ్దానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన వనితా రౌత్ తనను ఎంపీని చేస్తే, రేషన్ కార్డులపై విదేశీ మద్యం అందజేస్తానని, నిరుద్యోగ యువతకు మద్యం కాంట్రాక్టులు కేటాయిస్తానని హామీనిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో వనితా రౌత్ చేస్తున్న వాగ్దానాలను ఇంతకు ముందు ఏ అభ్యర్థి కూడా చేసివుండరు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రతి గ్రామంలో బార్లను తెరుస్తానని, తనకు వచ్చే ఎంపీ నిధులతో పేదలకు ఉచితంగా మద్యం అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు.
దీనికి ముందు వనితా రౌత్ 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 2019లోనే చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి చేశారు. ఆ సమయంలోనూ ఆమె ప్రజలకు ఇటువంటి హామీలనే ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment