ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయపడిన కాంగ్రెస్ నేత అస్లాం షేక్ వింత విద్యార్హత అందరికీ షాకిస్తోంది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో తాను ఎనిమిదో ఉత్తీర్ణునిగా చెప్పుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అస్లాం షేక్ తాను 12వ తరగతి(ఇంటర్) పాస్ అయినట్లు పేర్కొన్నారు.
అస్లాం షేక్ ఎన్నికల అఫిడవిట్‌పై బీజేపీ మండిపడింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తిజిందర్ తివానా మాట్లాడుతూ అస్లాం షేక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో ఈ ఒక్క విద్యార్హత కుంభకోణంతోనే అంచనా వేయవచ్చన్నారు. జితిందర్ ఓ వీడియోలో అస్లాం షేక్ తీరును ఎండగట్టారు. చదువు విషయంలో ఇంతటి అబద్ధాలు చెప్పిన వ్యక్తి ప్రజాధనంతో పాటు ఎమ్మెల్యే నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణతను 8వ తరగతిగా మార్చిన వ్యక్తి మలాద్‌ను ఏమి అభివృద్ధి చేస్తాడనే విషయాన్ని ఓటర్లంతా ఆలోచించాలన్నారు.
ఇదేవిధంగా జార్ఖండ్‌లో జేఎంఎంకు చెందిన హేమంత్ సోరెన్ ఎన్నికల అఫిడవిట్‌లో తన వయసును ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగినట్లు చూపారు. ఈ అంశంపై జార్ఖండ్‌లో దుమారం చెలరేగుతోంది. ఎన్నికల అఫిడవిట్‌లో హేమంత్ సోరెన్ తన వయసు 49 ఏళ్లుగా పేర్కొన్నారు. విశేషమేమిటంటే 2019లో హేమంత్ సోరెన్ తన వయసు 42 ఏళ్లుగా ప్రకటించాడు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రి. పలు ఆరోపణలపై జైలుకు వెళ్లారు. బెయిల్ రావడంతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment