assembly elactions
-
ముస్లింల గడ్డపై బీజేపీ జెండా.. లాలు, అఖిలేష్ రాజకీయాలకు అడ్డుకట్ట?
లక్నో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గల రామ్‌గఢ్, యూపీలోని మొరాదాబాద్ జిల్లాలోని కుందర్కి సీటు ఒక ప్రత్యేకతను దక్కించుకున్నాయి. ముస్లింల ప్రాబల్యం కలిగిన ఈ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది.ఈ పరిణామంపై పలువురు రాజకీయ నిపుణులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇది దేశంలో మారుతున్న ఓటర్ల సెంటిమెంట్‌ను తెలియజేసే విజయమని వారంటున్నారు. అలాగే రానున్న కాలంలో ఎన్నికల రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు. రామ్‌గఢ్ సీటు మేవాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా అత్యధికం. అలాగే పంజాబీ, రాజ్‌పుత్, బనియా, సిక్కు, ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలన్నీ హిందూ-ముస్లిం వాదనపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక కుందర్కి కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇక్కడ జనాభాలో 60 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ సీటును చివరిసారిగా 1993లో బీజేపీ గెలుచుకుంది. ముస్లిం మహిళల్లో గణనీయమైన వర్గం బీజేపీకి ఓటు వేస్తున్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి.దేశ రాజకీయాల్లో అఖిలేష్ యాదవ్, లాలూ యాదవ్, మమతా బెనర్జీలు తమ తమ రాష్ట్రాల్లోని ముస్లిం ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు నేతలు ఉంటున్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా అధికంగానే ఉంది. కాగా యూపీ, బీహార్‌లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల పార్టీలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల రాజకీయాలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. మైనారిటీ ఆధిపత్య స్థానాలపై బీజేపీ సాధించిన విజయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో అఖిలేష్, లాలూల రాజకీయాలకు తాళం పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
Punjab Bypoll Voting: డేరా పఠానాలో కాంగ్రెస్-ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్రలలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.యూపీలోని 9 సీట్లు (కర్హాల్, సిసమావు, కతేహరి, కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ఫుల్పూర్, ఖైర్, మజ్వాన్), పంజాబ్‌లోని 4 సీట్లు (గిద్దర్బాద, డేరా బాబా నానక్, చబ్బేవాలా, బర్నాలా), కేరళలోని పాలక్కాడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది.పంజాబ్‌లోని డేరా పఠానా గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ సుఖ్జీందర్ సింగ్ రంధావా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్దీప్ సింగ్ రంధావా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారినీ శాంతిపజేశారు. ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు.‘ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వెలువడతాయి. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. ఇది ఓటు హక్కు సద్వినియోగానికి ఉదాహరణ. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను గమనిస్తున్నారు. అన్ని చోట్లా వీడియోగ్రఫీ జరుగుతున్నదని అఖిలేష్ అన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక’ అని పేర్కొన్నారు. वोट की प्रक्रिया को लेकर जो प्रयास ‘रात-दिन’ किया जा रहा है, उससे ये स्पष्ट हो गया है कि अब तो मतदाता दुगुने उत्साह से वोट डालनें जाएंगे। परिणाम तभी निकलते हैं जब एक भी वोट न तो बँटता है, न घटता है। उप्र के जागरूक और साहसी मतदाता अपने वोट करने के उस अधिकार के लिए शत-प्रतिशत घर… pic.twitter.com/muqlzJ7Zsu— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నదని ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు ఓటు వేయనున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
2009లో ఇంటర్.. 2024లో ఎయిత్.. ఎమ్మెల్యే అభ్యర్థి వింత అఫిడవిట్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయపడిన కాంగ్రెస్ నేత అస్లాం షేక్ వింత విద్యార్హత అందరికీ షాకిస్తోంది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో తాను ఎనిమిదో ఉత్తీర్ణునిగా చెప్పుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అస్లాం షేక్ తాను 12వ తరగతి(ఇంటర్) పాస్ అయినట్లు పేర్కొన్నారు.అస్లాం షేక్ ఎన్నికల అఫిడవిట్‌పై బీజేపీ మండిపడింది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తిజిందర్ తివానా మాట్లాడుతూ అస్లాం షేక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో ఈ ఒక్క విద్యార్హత కుంభకోణంతోనే అంచనా వేయవచ్చన్నారు. జితిందర్ ఓ వీడియోలో అస్లాం షేక్ తీరును ఎండగట్టారు. చదువు విషయంలో ఇంతటి అబద్ధాలు చెప్పిన వ్యక్తి ప్రజాధనంతో పాటు ఎమ్మెల్యే నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణతను 8వ తరగతిగా మార్చిన వ్యక్తి మలాద్ను ఏమి అభివృద్ధి చేస్తాడనే విషయాన్ని ఓటర్లంతా ఆలోచించాలన్నారు.ఇదేవిధంగా జార్ఖండ్‌లో జేఎంఎంకు చెందిన హేమంత్ సోరెన్ ఎన్నికల అఫిడవిట్లో తన వయసును ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగినట్లు చూపారు. ఈ అంశంపై జార్ఖండ్‌లో దుమారం చెలరేగుతోంది. ఎన్నికల అఫిడవిట్లో హేమంత్ సోరెన్ తన వయసు 49 ఏళ్లుగా పేర్కొన్నారు. విశేషమేమిటంటే 2019లో హేమంత్ సోరెన్ తన వయసు 42 ఏళ్లుగా ప్రకటించాడు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రి. పలు ఆరోపణలపై జైలుకు వెళ్లారు. బెయిల్ రావడంతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కూడా చదవండి: ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు -
మహారాష్ట్ర ఎన్నికలు: పూజా ఖేద్కర్ తండ్రి అఫిడవిట్లో.. మరో సందేహం?
ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్‌ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు.దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?
జమిలి. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పారీ్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పారీ్టలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పారీ్టలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకం: ఖర్గే ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక మన దేశంలో ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటి ఎన్నికలు రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయడం బీజేపీకి అలవాటే. ప్రజాస్వామ్య విరుద్ధమైన జమిలి ఎన్నికలను దేశ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరు’’ అది సంఘ్ పరివార్ రహస్య అజెండా ‘‘ఒకే దేశం–ఒకే ఎన్నిక అనేది దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఇది సంఘ్ పరివార్ రహస్య అజెండాలో ఒక భాగమే. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థను మార్చేసి అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని తీసుకురావాలన్నదే సంఘ్ పరివార్ అసలు కుట్ర. భారత పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనను మానుకోవాలి’’. – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి ప్రజలంతా వ్యతిరేకించాలి సమాఖ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణాన్ని దెబ్బతీసే జమిలి ఎన్నికలను ప్రజలంతా వ్యతిరేకించాలి. ఒకే దేశం–ఒకే ఎన్నిక ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ కుతంత్రాలు సాగిస్తోంది. ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే ఏం చేస్తారు? – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశం వారిని క్షమించదు: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: హుడా కుటుంబాన్ని హర్యానా అక్కా చెల్లెళ్లు అస్సలు క్షమించరని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ అన్నారు. హుడా కుటుంబాన్ని పాండవులతో పేల్చుతూ విమర్శలు గుప్పించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘మహాభారతం సమయంలో ద్రౌపది పణంగా పెట్టి జూదం ఆడి పాండవులు ఓడిపోయారు. దీనికి పాండవులను దేశం ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. అలాగే హర్యానా అక్కాచెల్లెళ్లు, మహిళల పరువుకు భంగం కలిగించి హుడా కుటుంబాన్ని కూడా భవిష్యత్తులో క్షమించరు. ఈ విషయంలో వారిని ఎప్పుడూ దోషులుగానే చూస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. రెజ్లర్లు తనపై ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని శనివారం అన్నారు. రెజ్లర్ల ఆందోళన వెనకాల హర్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా ఉన్నారని మండిపడ్డారు. అదేవిధంగా వినేశ్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే పతకం చేజారిందని అన్నారు.#WATCH | Gonda, UP: Former WFI President and BJP leader Brij Bhushan Sharan Singh says, "...During the Mahabharata, the Pandavas had put Draupadi on stake and lost. The country has not forgiven the Pandavas for this till date. Similarly, the Hooda family will not be forgiven for… pic.twitter.com/Pp7G6oT7ek— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. బ్రిజ్ భూషన్ చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ స్పందించారు. ఆమె ఆదివారం జులనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ.. “నేను రెజ్లింగ్‌లో ఏది గెలిచినా అది ప్రజల వల్లనే గెలిచాను. రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ఆశిస్తున్నా. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన గురించి తర్వాత మాట్లాడుతా. బ్రిజ్ భూషణ్ ఏం దేశం కాదు.. ప్రజలు నాతో ఉన్నారు. వారు నా స్వంతం. ప్రజలే నన్ను ఆదరించారు. అన్ని పోటీల్లో విజయం సాధిస్తా. పతకం రాలేదన్న బాధ భారత్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత తగ్గింది. ఎన్ని సవాళ్లు అయినా ఎదుర్కొంటున్నా’ అని అన్నారు. -
‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్‌గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్)లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీసుల్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ను అమలు చేయడం తెలిసిందే. సోమనాథన్ కమిటీ సూచనలతో..మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్పీఎస్పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డీఏ ఆధారిత పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పారీ్టల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్‌ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి, దానికి చేయాల్సిన మార్పుచేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత: మోదీ యూపీఎస్‌తో ప్రభుత్వోద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బాక్సు యూపీఎస్ విశేషాలివీ... 👉 అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సరీ్వసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. 👉అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సరీ్వసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కలి్పస్తుంది. 👉 అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్‌లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్తగా ఏకమొత్త ప్రయోజనం 👉 ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం. 👉 సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. 👉ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు. 👉 ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. 👉 యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందన్నారు. 👉 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. బాక్సు కేబినెట్ ఇతర నిర్ణయాలు బయో ఈ–3, విజ్ఞాన్ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విజ్ఞాన్ధారలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నొవేషన్లకు సంబంధించి మూడు ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచి్చంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి రూ.10,579 కోట్లు కేటాయించారు. బయో ఈ–3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయో టెక్నాలజీకి మరింత ప్రోత్సహమందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. విజ్ఞాన్‌ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్‌ను ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్సీపీ(శరత్చంద్ర) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో మిత్రపక్షాల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్సీపీ అంగీకరించిందని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం శదర్ పవార్ పుణెలో రెండు పార్టీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో, పార్టీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.పుణె ఎన్సీపీ చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో పొత్తు చెక్కుచెదరకుండా ఉండేలా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఫార్ములా భిన్నంగా ఉంటుందని పార్టీ చీఫ్ తమకు సూచించాడని చెప్పారు.పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితిని కూడా ఎన్సీపీచీఫ్ సమీక్షించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను పవార్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ సీట్ల పంపకం సందర్భంగా పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందో ఇంకా నిర్ణయించలేదని రాష్ట్ర ఎన్సీపీచీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రత్యర్థి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి విషయంలో శరద్ పవార్ సీనియర్ నిర్ణయం తీసుకుంటారని పాటిల్ చెప్పారు.కాగా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. -
2027 అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్ దృష్టి
2024 లోకసభ ఎన్నికలు ముగియగానే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎస్ఫీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ నుంచి కొత్తగా ఎంపికైన ఎంపీలతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు విని, పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే భవిష్యత్‌లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అఖిలేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీకి పెద్దఎత్తున ప్రజల మద్దతు లభించిందన్నారు. దీంతో సోషలిస్టుల బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రజలు చెప్పే విషయాన్ని వినాలని, వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు సీట్లు దక్కించుకుంది. -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్‌కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమలాపురం సీటు కోసం సిగపట్లు
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శేఖర్‌తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు అవేనా..!
హిందీ మాతృభాష గల మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలో కాంగ్రెస్ ఘెర పరాజయాన్ని చవిచూసింది. బీజేపికి గట్టి పోటీ ఇచ్చేలా ధీటుగా ప్రచారాలు చేసింది. పలు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. కానీ ఓటర్లు అత్యంత విభిన్నంగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే వంటి వ్యూహ చతురతలతో ప్రచారం చేసినా.. ఓటర్ల మనసును గెలుచుకోలాదా? బీజేపీ స్ట్రాటజీ ముందు కాంగ్రెస్ గ్యారంటీల గేమ్ వర్క్ ఔవుట్ అవ్వలేదా? అంటే..ఔననే చెప్పాలి. రాష్ట్రాల వారిగా కాంగ్రెస్ వైఫల్యానికి దారితీసిన కారణాలు? ప్రముఖులు ఏమంటున్నారు? రాజస్థాన్... రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఎన్నికల సాంప్రదాయాన్ని తిరగరాయాలని ఎంతో వ్యూహాంతో ముందుకొచ్చింది. ఆఖరికి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గ విభేధాలను పక్కన పెట్టి ఐక్యతను చాటుకుంది. తాము ఒక్కటేనని చెప్పింది. ఏడు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. ఇవేమి రాజస్థాన్ ప్రజల మనసును గెలుచుకోలేకపోయాయి. గత కొన్నేళ్లుగా పాలనలో చూసిని అవినితీ, అల్లర్లు, పేపర్ లీకేజ్‌లు కాంగ్రెస్ పార్టీకి పాలన పరంగా మాయని మచ్చలుగా ఉన్నాయి. ఇవే కాంగ్రెస్‌కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అదీగాక బీజేపీ ప్రచార వ్యూహంలో కాంగ్రెస్ మైనస్‌లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని సత్తా చాటింది. మధ్యప్రదేశ్.. మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పకడ్బంధీగా వ్యూహాన్ని రచించింది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టింది. గానీ మధ్యప్రదేశ్ అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్‌ని ఢీ కొనేలా సరికొత్త హామీలతో ముందుకొచ్చింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని ఓటర్లను ఆకర్షించారు. అలాగే లాడ్లీ బెహనా యోజన, కేంద్ర ఉజ్వల యోజన వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అదీగాక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చింది. అలాగా ప్రచార ర్యాలీలో రానున్న కాలంలో మధ్యప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ప్రజల నమ్మకాన్ని పొందింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మధ్యప్రేదేశ్‌లో అత్యధిక ఓట్లతో ప్రభంజనం సృష్టించి విజయం సాధించింది. చత్తీస్‌గఢ్.. చత్తీస్‌గఢ్‌లో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత తోపాటు ఆ రాష్ట్రా సీఎం భూపేష్ బఘేల్, అతని మంత్రులపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ మైనస్ అయ్యాయి. అందువల్లే కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి భూపేష్ తన నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ అతని పార్టీ మ్రాతం ఘోరంగా ఓడిపోయింది. ఇవన్నీ బీజేపీ కలిసోచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోని అనేక్యత, పాలనాలోపాలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యతకు కారణాలని చెప్పాలి. ఐదు రాష్ట్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా ప్రభంజనం సృష్టించి విజయం సొంతం చేసుకుంది. దశాబ్దంగా పాలిస్తున్న కేసీఆర్ పాలననె గద్దె దింపి అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కేవలం ఒక్క రాష్ట్రంలోనే తన హవా చూపించగలిగింది కాంగ్రెస్. ఉత్తరాది రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మద్యప్రదేశ్‌లో తన పట్టును పూర్తిగా కోల్పోయింది. బీజేపీ మాత్రం ఈ మూడు రాష్ట్రాల గెలుపుతో అనూహ్యంగా తన ఆధిక్యం బలాన్ని పెంచుకుంది పలువురు ఏమన్నారంటే.. ►ఇది బీజేపీ విజయం కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ వైఫల్యమే అంటూ పశ్చిమ బెంగాల్ తృణమాల్ కాంగ్రెస్ ఆరోపించింది. ముందు కాంగ్రెప్ తన జమిందారీ మనస్తత్వం నుంచి బయటపడాలని మమతా బెనర్జీ వంటి ప్రముఖు అనుభవాన్ని పంచుకోవాలి అమలు చేయాలని అన్నారు. ►కాంగ్రెస్ సిండ్రోమ్ నుంచి బయటపడాలని సీనియర్ జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కేసిఆర్ త్యాగా అన్నారు. ఇక కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో పోలీపడలేదని తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలకే కాంగ్రెస్ దూరమైంది. పైగా కాంగ్రెస్ డిసెంబర్ 6న పిలుపునిచ్చిన కూటమిని కూడా అపహాస్యం పాలు చేసిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సినయర్ నేత శరద్ పవార్ మాత్రం ఈ తీర్పు భారత కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. తాము ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం అవుతాం. ఈ వైఫల్యాలకు గత కారణాలపై తమ నేతలతో విశ్లేషిస్తామని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావమేనని చెప్పారు. ఇక హిందీ హార్ట్ ల్యాండ్ అయినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి, కులగణన వ్యూహాం ఫలించకపోవుటానికి కారణం తదితరాలపై తమ నేతలతో చర్చించి విశ్లేషిస్తామని చెప్పుకొచ్చారు. (చదవండి: ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి సీఎం ఆమెనా..?) -
Telangana Election Results 2023 : తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
-
రిజల్ట్స్ టెన్షన్ అందరిలో..!
-
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హై సెక్యూరిటీ
-
మహబూబాబాద్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి
-
మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న పోలింగ్ అని అంటున్న పోలీస్
-
గ్రేటర్ హైదరాబాద్ లో 20శాతం కూడా నమోదు కాని పోలింగ్
-
మధ్యప్రదేశ్‌లో అక్కడ మళ్లీ పోలింగ్!
మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భింద్‌లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్‌లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్‌లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి) -
Rajasthan Elections 2023: ఫేక్ అని మహిళలను అవమానిస్తారా?
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్‌ను నంబర్ వన్‌గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కాంగ్రెస్ మళ్లీ వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు’
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తాజాగా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ రెండోదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. రాష్ట్రంలో గృహిణులైన మహిళందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా సీఎం భూపేష్ బఘేల్ రూ.15,000 ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు రాయ్‌పూర్‌లో విలేకరులతో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ‘ఛత్తీస్‌గఢ్ గృహలక్ష్మి యోజన’ కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని బఘేల్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న ముగిసింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపుల అంశంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్‌తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
వేగు చుక్కలే..తోకచుక్కౖలై
బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా, తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా, సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి.. 1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్‌కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి. అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం. విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా, సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం.. రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు. ఎందుకీ దుస్థితి అంటే.. కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి. కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని, మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్‌లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు కమ్యూనిస్టు పార్టీలు ఎదగకపోవటానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు కుమ్మరించడం, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుండటం వల్ల ప్రజాపోరాటాలు లేకుండా పోయాయి. వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు పెద్దగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. బూర్జువా పార్టీల నాయకులు వ్యాపారాలు చేస్తూ కార్యకర్తలను తమతో తిప్పుకుంటున్నారు. తమ తమ ప్రాంతాల్లో పెళ్లిళ్లయినా, ఏ ఇతర శుభకార్యాలైనా వెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాయకులు ఎన్ని తప్పు పనులు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేయకపోవడం వల్ల ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. బూర్జువా పార్టీల నాయకులు డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను తమ వెంట తిప్పుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కానీ కమ్యూ నిస్టులు ఇవేవీ చేయకుండా త్యాగాలు చేయాలని కోరడం ఎవరికీ నచ్చడం లేదు. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఇప్పుడు లేకుండాపోయాయి. ధనమే అన్నింటికీ మూలంగా మారింది. రాజకీయ విశ్లేషకుల మాట... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడంలో కమ్యూనిస్టులు విఫలం అవుతున్నారు. తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు దగ్గర కావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. కొందరు నాయకుల తీరు, వారి వ్యవహార శైలి ప్రజలను ఆకట్టుకోవ డం లేదు. కమ్యూనిస్టు ఆదర్శాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి నేతలు తమ సాధారణ జీవన శైలితో కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలు లేరన్న విమర్శలు ఉన్నాయి. -
ఎన్నికల హీట్..!
-
బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం చదవండి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు -
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
TS Election 2023: టికెట్ పోరు..‘నర్సాపూర్’పై కొనసాగుతున్న ఉత్కంఠ!
మెదక్: బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్ ఒకటెండ్రోజుల్లో వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం మెదక్‌లో ప్రగతి శంఖారావం బహిరంగ సభ జరిగిన మరుసటిరోజైన గురువారమే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్ తరలివెళ్లి హరీశ్‌రావును కలిశారు. టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలని మంత్రి నివాసం ముందు అనుచరులు బైఠాయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక శాఖ మంత్రి సముదాయించి పంపారు. ఇప్పటికే ఇద్దరితో మాట్లాడిన అధినేత మెదక్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభ వేదికపై కేసీఆర్, మదన్‌రెడ్డితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన అడిగిన వెంటనే నర్సాపూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి కూడా గురువారం మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశా రు. ఈనెల 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రక టించక ముందే వీరిద్దరితో నర్సాపూర్ టిక్కెట్ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పార్టీ వ్యవహారాలు.. ప్రగతి శంఖారావం బహిరంగ సభకు కార్యకర్తలు, అనుచరులను తరలించే ప్రక్రియను మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు చేపట్టారు. ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీరితో చర్చించారు. అయితే బహిరంగ సభకు ముందు.. ఈనెల 14న మెదక్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరూ హాజరుకావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడే అభ్యర్థిత్వంపై కొంతమేరకు సంకేతాలు అందడంతోనే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠ, రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. -
TS Election 2023: కరీంనగర్ అసెంబ్లీ బరిలో.. ‘బండి’ నో..?
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఎంపీ బండి సంజయ్ ఈసారి ఉండేది అనుమానమే. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన ఈసారి లోక్‌సభ బరికే మొగ్గుచూపుతున్నారని సమాచారం. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి, తన ప్రత్యర్థి, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌పై హోరాహోరీగా పోరాడారు. మొత్తం బీజేపీకి 66,009 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్కు 80,983 ఓట్లు వచ్చాయి. 14,974 ఓట్ల మెజారిటీతో గంగుల విజయబావుటా ఎగురవేశారు. ప్రతి రౌండ్లోనూ గట్టి పోటీ ఇచ్చి, కొన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బండితో విజయం దోబూచులాడింది. ఆ సానుభూతి 2019 పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేసింది. ఆ సమయంలో పుల్వామా దాడులు, పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం వెరసి.. జాతీయభావం ఎన్నికపై బాగా ప్రభావం చూపింది. దీనికితోడు బండి సంజయ్‌కి స్థానికుల నుంచి సానుభూతి వెల్లువెత్తడంతో ఎంపీగా ఘన విజయం సాధించారు. మొత్తం 4,98,276 ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి బి.వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేంద్ర కేబినెట్ పక్కా అన్న హామీతోనే.. మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ సంజయ్ తన హయాంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు తెప్పించారు. మునుగోడు బైపోల్‌లోనూ చివరికి వరకు బీజేపీ పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఉన్న 7 శాతం ఓటుబ్యాంకును 32 శాతానికి తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారు. ఒక దశలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగగా అనూహ్య పరిస్థితుల మధ్య రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ తాను కరీంనగర్ నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని సన్నిహితులతో, మీడియాతో చెబుతూ వచ్చారు. అసలు ఆ ఉద్దేశంతోనే పార్టీలో నగరంపై ఎవరికీ పట్టు చిక్కకుండా వ్యూహాత్మకంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అంటూ ఐదు భాగాలుగా విభజించారు. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా కరీంనగర్ అసెంబ్లీ రేసు నుంచి సంజయ్ వైదొలగబోతున్నారన్న ప్రచారంపై ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రంలో మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే కొలువుదీరనుందని, ఈసారి పార్లమెంటుకు ఎన్నికై తే బండికి కేంద్ర కేబినెట్లో స్థానం పక్కా అన్న హామీ మేరకే ఆయన లోకసభపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ ప్రచారంపై మరో రెండు రోజుల్లో బండి సంజయ్ నుంచి ప్రకటన రానుంది. అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు తీవ్ర పోటీ.. ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నాక కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో పోటీకి ఆశావహులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన పోటీ చేయకపోతే.. ఎవరిని రంగంలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ బీజేపీలో చేరి, అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈసారి తనకు కరీంనగర్ లోకసభ నుంచి అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్‌రావు ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి విన్నవించారు. మొన్నటిదాకా సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు రెండు సీట్లకూ పోటీ చేస్తారన్న ప్రచారంతో వీరెవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదు. కానీ, తాజా ప్రచారంతో బీజేపీలోని ఆశావహులంతా ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. -
TS Election 2023: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా.. మారి..
మహబూబ్‌నగర్: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయిలో వారి మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు తీర్పు సంచలనం రేపగా.. డీకే వర్సెస్ బండ్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహారెడ్డికి సొంత అక్క కొడుకే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. డీకే భరత్‌సింహారెడ్డి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని చేరదీశారు. ఈ క్రమంలో ఆయన అటు రాజకీయంగా, ఇటుఅధికార వ్యవహారాల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ఒకానొక దశలో గద్వాలలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు న్నాడనే గుసగుసలు సైతం విన్పించాయి. అయితే 1999లో గద్వాల పట్టణంలో కరాటే శ్రీను హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. రాజకీయ దుమారం చెలరేగింది. 1999లో శాసనసభ ఎన్నికల్లో గట్టు భీముడి చేతిలో డీకే భరత్‌సింహారెడ్డి భార్య డీకే అరుణ ఓటమిపాలు కాగా.. రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. తన ఓటమికి బండ్ల కృష్ణమోహన్రెడ్డే కారణమని భావించి.. డీకే కుటుంబం ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టడంతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
TS Election 2023: 'పద్మా నా బిడ్డ' : సీఎం కేసీఆర్
మెదక్: అభివృద్ధిలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తాం.. కౌడిపల్లి, రామాయంపేటలో డిగ్రీకళాశాలు ఏర్పాటు చేస్తాం.. టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లతో పాటు పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పీ, సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీరుస్తామన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని, కౌడిపల్లికి, రామాయంపేటకు డిగ్రీకళాశాలలను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం తదితర ప్రదేశాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తునట్లు వెల్లడించారు. అలాగే మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసి వేద్దామంటున్నారు. మీరేమంటారని సీఎం ప్రశ్నించడంతో వద్దూ వద్దూ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మా నా బిడ్డ.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నా కూతురులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రగతిలో మెదక్ జిల్లాను మెరిపిస్తామన్నారు. మరి మీరు మాత్రం గతంలో కన్నా అధిక మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది. -
TS Election 2023: '108' ఇది ఎమర్జెన్సీ నంబర్ కాదు!
కరీంనగర్: 108.. ఇది ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబర్ కాదు.. అదేదో వ్రతం కోసం గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు కావు.. వచ్చే డిసెంబర్లో జరిగే ఎన్నికలకు కాస్త అటూ ఇటుగా ఉన్న రోజులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు తమ కళ్ల ముందు మెదులుతున్న ఖర్చుల కొండను తలుచుకొని, బెంబేలెత్తుతున్నారు. అధికార బీఆర్ఎస్ ఎన్నికలకు సమరశంఖం పూరించడం, మరోవైపు మిగిలిన పార్టీల్లోనూ ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఎన్నికల్లో రానురాను ఖర్చులు పెరుగుతుండటం అభ్యర్థులను కలవరపెడుతోంది. నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఇవన్నీ ఒక ఎత్తయితే, దానికి ముందే ఎన్నికల వాతావరణం రావడంతో ఇటు కేడర్‌ను, అటు ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు రూ.లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఓటర్లు మొదలుకొని కార్యకర్త, నాయకుల వరకు ఇప్పటికే మర్యాదలు మొదలయ్యాయి. వెళ్లాల్సిందే.. కట్నాలు చదివించాల్సిందే.. ప్రతీ నియోజకవర్గంలో అన్ని రకాల కులాలు, మతాల ఓటర్లు ఉంటారు. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, దివ్యాంగులు, వితంతువులు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆశావహులదే. ఇందుకు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ఎవరూ అతీతులు కారు. దీంతో ఇకపై నియోజకవర్గంలో జరిగే ప్రతీ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చావు, పుట్టుక, పుట్టిన రోజు, పెళ్లిరోజు, సారీ ఫంక్షన్, సంతాప సభ, సన్మానాలు, కులసంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ విరమణల నుంచి గృహ ప్రవేశాల వరకు ప్రతీ సందర్భానికి వెళ్లాల్సిందే.. కట్నకానుకలు చదివించాల్సిందే. డజన్‌కు పైగా పండుగలు ఈ నెల 25న వరలక్ష్మీ వ్రతం, 31న రాఖీ, సెప్టెంబర్ 6న కృష్ణాష్టమి, 18న వినాయక చవితి, 28న వినా యక నిమజ్జనం/మిలాద్–ఉన్–నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 23న సద్దుల బతుకమ్మ, 24న దసరా, నవంబర్ 13న దీపావళి, 14న బాలల దినోత్సవం, 27న కార్తీక పౌర్ణమి.. ఇలా ఎన్నికలు ముగిసేలోగా.. డజన్‌కు పైగా పండుగలను ప్రజలు గుర్తుంచుకునేలా జరిపే బాధ్యత లీడర్లదే. ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకునేవా రు, ఈసారి కాకుంటే ఇంకెప్పటికీ కాలేమన్న ఆలోచనలో ఉన్నవారు ఈసారి సర్వశక్తులు ఒడ్డేందుకు ముందుకొస్తున్నారు. చివరికి పార్టీలో, నలుగురిలో తాము ధనవంతులమే అని చాటుకునేందుకు తమ ఆస్తులు అమ్మేందుకు, కుదవపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ రోజుల్లో నాయకుడు బయటికి వ చ్చాడంటే.. కనీసం నాలుగైదు కార్లు తప్పనిసరి. వాటిలో పెట్రోలు కొట్టించాలి. ఒక్కో కారులో ఐదారుగురు అనుచరులు, కాన్వాయ్ రాగానే జిందాబాద్కొట్టేందుకు యువత, జెండాలతో తిరిగే కార్యకర్తలు, మంగళహారతులు ఇచ్చేందుకు మహిళలు ఉండాలి. ప్రతీ నాయకుడు కనీసం 100 మందికి ఈ మూడు నెలలపాటు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సిందే. వారి వాహనాల్లో పెట్రోలు కొట్టించడం, భోజనాలు, చేతి ఖర్చులు, రాత్రిపూట రాచమర్యాదలు సరేసరి. ఎంత లేదన్నా రూ.2, 3 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘కోడ్’ కూశాక అసలు ఆట ఈ 108 రోజుల్లో కేడర్‌ను చూసుకునేందుకు రోజుకు రూ.లక్ష అయినా ఖర్చవుతుంది. ఇక దసరాకు కాస్త అటూఇటుగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలున్నాయి. అధికార పార్టీకి అంతోఇంతో పార్టీ నుంచి, వివిధ వర్గాల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. కానీ, ప్రతిపక్షాలకు ఆ అవకాశాలు చాలా తక్కువ. పోస్టర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, యాడ్స్, ఫ్లెక్సీలు, ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆశావహుల జేబులకు చిల్లులు పడేది ఈ సమయంలోనే. అటు తర్వాత చేసే ఖర్చు లెక్కలను ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుంది. బయటకు కనబడకుండా ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పరిమితికి మించి ఖర్చు చేయాలి. అదే సమయంలో పక్కనే ఉంటూ వైరిపక్షాలకు సాయపడే వెన్నుపోటుదారులను తలచుకొని, నేతలు గుబులు పడుతున్నారు. -
TS Election 2023: కాంగ్రెస్‌లోకి కీలక నేత ఎవరు..?
మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా రాజకీయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏ పార్టీలో ఉంటే మంచిదనే సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే పార్టీ, ప్రాధాన్యత ఇచ్చే చోటు కోసం వెతుకుతున్నారు. బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు పూర్తవడంతో మిగిలిన పార్టీ ల్లో అవకాశాల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇక కింది స్థాయి నాయకులు సైతం ఎక్కడ తమకు అన్ని రకాల బాగుంటుందో బేరీజు వే సుకుని కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చి మూడు నెలల ముందుగానే ఎన్నికల కదనరంగంలోకి దూకింది. తర్జనభర్జనలో మాజీ ఎంపీ.. జిల్లా పరిధిలో ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ఎంపీ పార్టీ మారేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీతో జిల్లాలో ఎదుగూ బొదుగు లేదని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పార్టీ మారిన ఆయన మళ్లీ వేరే పార్టీలో చేరడంపై ప్రజలు, అటు అనుచరుల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. ఇక తనకు ఆ పార్టీలో ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపైనా సంప్రదింపులు జరిపి ఓ కొలిక్కి వచ్చాక పార్టీ మార్పు జరగొచ్చని సమాచారం. ప్రాంతీయ పార్టీ తన రాజకీయ భవిష్యత్‌ను కష్టాల్లో నెట్టడంతో జాతీయ పార్టీలో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎస్సీ రిజర్వు స్థానాల్లో పోటీ చేస్తారని తన అనుచరులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ తన స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, నాయకులు అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. దీంతో సదరు నాయకుడు మళ్లీ ఏ పార్టీలో చేరి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే కోణంలో సుదీర్ఘంగా ఆలోచించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార పార్టీ నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో పడినట్లు సమాచారం. టికెట్ కోసం పోరాటం.. జిల్లాలో జనరల్ సీటుగా ఉన్న మంచిర్యాలపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఓసీ, బీసీ నేతలు టికెట్ ఇచ్చే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న నాయకులు టికెట్ దక్కించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో వేచి చూస్తున్నారు. కొందరు బీజేపీ, తర్వాత బీఎస్పీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా యి. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ‘ముందుగా చేరండి’ అని స్వాగతం పలుకుతున్నప్పటికీ టికెట్ ఇస్తామనే నమ్మకం ఇవ్వకపోతున్నాయి. సీటు రాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా పోటీ చేస్తామని ప్రజల్లో తిరుగుతున్న నేతలు సీటు రాకపోతే ఇప్పుడున్న పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయా పార్టీలో ఇద్దరు, ముగ్గురు నాయకులు సీటు కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరికి మాత్రమే సీటు దక్కే అవకా శం ఉంది. మిగతా వారంతా వెనక్కి తగ్గి పని చేసే తీరు కనిపించడం లేదు. కొందరు రెబెల్‌గానైనా పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమయం వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలనుంది. -
TS Election 2023: మూడు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి.. : పుట్ట మధు
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
TS Election 2023: కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం: అభిలాష్‌రావు
మహబూబ్‌నగర్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలతో చర్చలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ‘ఆత్మీయ సమావేశం’ నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అభిలాష్‌రావు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభిలాష్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తిలో బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మంత్రి నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ రెండేళ్ల కిందటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరడం, వారి వర్గానికే ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అభిలాష్‌రావు తిరిగి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేరితే ఏదైనా కీలకమైన పదవి దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలతో అభిలాష్‌రావు కలసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అభిలాష్‌రావు అండగా నిలుస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్టుగా ప్రచారం సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. -
TS Election 2023: సీఎం పర్యటనపై ఆసక్తి..! సిట్టింగ్‌లు, ఆశావహుల్లో టెన్షన్..!!
నల్లగొండ: సాధారణ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. వివిధ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నందున ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర తీస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈసారి దక్షిణ తెలంగాణ నుంచే సీఎం తన ప్రచారాన్ని ప్రారంభిస్తారనే చర్చకు ఇది నాందికాబోతోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ప్రతిపక్షాలపై ఎలాంటి అస్త్రాలు సందిస్తారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. కాగా, సూర్యాపేటలో సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించి జనసమీకరణ చేపట్టారు. ఒకరకంగా దీన్ని ఎన్నికల ప్రచార సభలాగే భావించి ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినందున ఈ సభ ద్వారానే మళ్లీ ఎన్నికల వేడి పుట్టించేలా సీఎం ప్రసంగం ఉండబోతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో ఉత్కంఠ! రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల కసరత్తు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఏం మాట్లాడతారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహుల్లోనూ టెన్షన్ నెలకొంది. పార్టీ అభ్యర్థులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారా? టికెట్లకు సంబంధించిన స్పష్టత ఇస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి టికెట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో అధినేత ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సభలో ఆ ప్రకటన చేస్తారా? లేదంటే ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసి, చేసిన సంక్షేమాభివృద్ధినే ప్రాధాన్యంగా తీసుకొని మాట్లాడతారా? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ.. ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి.. ఒకొక్కటి వదులుతాం అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ ఇలా.. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల హెలిపాడ్‌కు చేరుకుంటారు. 11.10కి మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు. 11.35కి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. 12 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12.30కి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1.15కు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 1.45నుంచి 2.45 వరకు భోజన విరామం 2.45కి నూతన కలెక్టరేట్ నుంచి బయలుదేరి 3 గంటలకు ప్రగతి నివేదన సభకు హాజరవుతారు. 4.10కి సభాస్థలి నుంచి బయలుదేరి నేరుగా హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 4.25కు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సిట్టింగ్‌లకే టికెట్లని చెప్పినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. అయినా సర్వేల ఆధారంగానే గెలుపునకు అవకాశాలు ఉన్న వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పలు నియోజకవార్గల్లో ఆశావహులు టికెట్ తమకు ఇస్తారేమోనన్న ఆశతో ఫౌండేషన్లను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌పై ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం వ్యతిరేకతతో ఉంది. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం పెద్దవూరలో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ఆయన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సాగర్ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరు కావడం చర్చనీయంశంగా మారింది. దేవరకొండలో రవీంద్రకుమార్‌కు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని నియోజకవర్గ నేతలు ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ తదితరులు శనివారం హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి చెప్పారు. వీటితోపాటు కోదాడ, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లోనూ నెలకొన్న సమస్యలపై సూర్యాపేట సభ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. -
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
ఎన్నికల సన్నద్ధతపై ‘కమలం’ కసరత్తు షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కసరత్తును బీజేపీ వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అనేక శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల వాతావరణం, పరిస్థితులున్న విషయం తాము జరిపిన పలు సర్వేలు, అధ్యయనాల్లో వెల్లడైనందున మరింత దూకుడుగా ముందుకెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. ప్రధానంగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి, సామాజికవర్గాల వారీగా మద్దతు, ప్రభావితం చేసే అంశాలు, సంబంధిత నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే సామాజికవర్గాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు వచ్చి న ఓట్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు పడిన ఓట్లు, వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, వారి సామాజికవర్గాలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, బలాబలాలు, ఏవైనా లోటుపాట్లు, ఇతర అంశాలుంటే వాటిని ఎలా సరిచేసుకోవాలనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలో భాగంగా వివిధ జిల్లాల సమీక్షలను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ (రాష్ట్ర ఎన్నికల సహఇన్‌చార్జి కూడా), జాతీయ కార్యదర్శి అర్వి0ద్ మీనన్ పార్టీపరంగా వివిధ జిల్లాల సమీక్షలను నిర్వహించనున్నారు. జిల్లాల నేతల నుంచి సమాచార సేకరణ బుధవారం రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీ లతో తరుణ్‌చుగ్ సమీక్షలు ప్రారంభించారు. ఆయా అంశాలపై నాయకుల నుంచి వివరాలు, సమాచారం సేకరించినట్లు తెలిసింది. కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీలు, నాయకులను తరుణ్‌చుగ్ ఆదేశించినట్టు సమాచారం. గురువారం మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో చేపడుతున్న ఎన్నికల కార్యాచరణ, తయారీపై తరుణ్‌చుగ్ సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే గురువా రం వరంగల్ క్లస్టర్లో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు) సునీల్ బన్సల్, నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మీనన్ వేర్వేరుగా సమీక్షలు చేపడుతున్నారు. శుక్ర, శనివారాల్లో వివిధ అంశాలపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలతో విడతల వారీగా తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు స్థానాల్లో కనీసం రెండింటిని గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పటికే వీటిపరిధిలో విస్తృతంగా పర్యటించారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్.. ఎన్నికల అధికారుల నియామకం
న్యూఢిల్లీ: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్ ఎలక్టోరల్ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ నియామకమయ్యారు. మిగతా 32 జిల్లాలకు కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ కూటమి వైపు కేజ్రీవాల్.. ఆమ్ అద్మీ వ్యూహమేంటీ? -
సమస్యాత్మక పోలింగ్స్టేషన్లు గుర్తించాలి
నాగర్‌కర్నూల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సజావుగా చేపట్టాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఉదయం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ మనోహర్‌తో కలిసి సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల గుర్తింపుపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 760 పోలింగ్స్టేషన్లు ఉండగా.. వీటిలో సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ ఎన్ని ఉన్నాయి.. అందుకు గల కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలను ప్రామాణికంగా చేసుకోవాలని సూచించారు. గొడవలు జరిగిన పోలింగ్ స్టేషన్, క్రిమినల్ కేసులు ఎక్కువగా నమోదైన పోలింగ్ స్టేషన్, రెండు పొలిటికల్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉన్న ప్రాంతం, కుల, మత విభేదాలు ఎక్కువగా ఉన్న పోలింగ్‌స్టేషన్, 80 శాతం కన్నా అధికంగా పోల్ అయినవి లేదా 70 శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పోల్ అయిన పోలింగ్‌స్టేషన్.. ఏ నియోజకవర్గంలో వస్తుంది అనే పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. లైసెన్స్ పొందిన మారణాయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయో గుర్తించి తిరిగి జమ చేసుకోవాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ 2018 ఎన్నికల రోజున ఏదైనా పోలింగ్స్టేషన్లో గొడవ జరిగి ఉంటే దానిని సైతం సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉందా.. లేదా.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా.. అని భావిస్తే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు మోహన్‌కుమార్, గిరిబాబు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ జాకీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లకు కుక్కర్లు, చీరలు, నగదు పంపిణీ
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర విధానసభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు నిమగ్నమై ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొంది తీరాలని ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు కొన్ని పార్టీల నేతలు, ఆశావహులు నగదు, హెల్మెట్లు, కుక్కర్లు, చీరలు తదితర బహుమానాలను పంచడం చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు కొన్నిచోట్ల దాడులు జరిపి కానుకలను జప్తు చేస్తోంది. విస్తృతంగా తనిఖీలు డబ్బు, వస్తువులు, వెండి బంగారు కానుకల పంపిణీ ఎన్నికలు రాగానే ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు బెంగళూరు వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో తాత్కాలిక చెక్‌పోస్టులను తెరిచారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య, డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. వివిధ మార్గాల్లో ప్రలోభాలు ఎంత పటిష్ట నిఘా ఉంచినా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, జీఎస్టీ అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి టికెట్ ఆశావహులు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు బహుమానాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఆయా బహుమానాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ముందస్తుగా ఓటర్లకు టోకెన్లను ఇచ్చి నిర్ణీత దుకాణాల్లో నిత్యవసర సరుకులను తీసుకునే వెసులుబాటును కల్పించారు. చేతి గడియారాలు, వెండి దీపాలు, హెల్మెట్, కుక్కర్లు, మిక్సీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు తామేమీ తక్కువ కాదన్నట్లు ముందుకు వస్తున్నారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖ ఈ తనిఖీల్లో ముందంజలో ఉంది. రసీదు లేకుండా సరుకుల రవాణా చేసిన, అక్రమంగా గోడౌన్లో వస్తువులను దాచినా, అనుమానస్పద కొనుగోళ్లు చేసినా పట్టేస్తోంది. సరుకు రవాణాకు సంబంధించి ఈ–ఇన్వాయిస్, ఈవే బిల్, సరుకు ప్రమాణం, కొనుగోలు దారుడు, సరఫరా దారుడు, చిరునామా తదితర సమాచారాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. రౌడీలకు హెచ్చరికలు ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో రౌడీలు ముందుంటారు. అందుకే రౌడీలపై పోలీసు శాఖ ఒక కన్నేసింది. రౌడీషీటర్ల నడవడికపై నిఘా పెంచింది. రౌడీషీటర్లుగా ముద్రపడిన వారిని ముందస్తుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ప్రమాదకరంగా అనిపించే ప్రముఖ రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తోంది. అలాగే పలువురు రౌడీషీటర్ల ఇంటిపై గస్తీ కాసే పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. -
అక్బర్ పోటీ చేస్తామన్న 50 స్థానాల్లో కరీంనగర్.. అసెంబ్లీ జంగ్లో పతంగ్!
సాక్షి, కరీంనగర్: ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అంటూ హైదరాబాద్ పాతబస్తీలో మొదలైన ముస్లిం ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రస్థానం క్రమంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. గతవారం అసెంబ్లీలో మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రవ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మజ్లిస్ పాతబస్తీ పార్టీగానే అందరికీ తెలుసు. పాత హైదరాబాద్‌లోని గుల్బర్గా (కర్ణాటక), మరాఠ్వాడా (మహారాష్ట్ర) తెలంగాణ లోకల్ బాడీస్కే పరిమితమైంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే, సొంతరాష్ట్రంలో మాత్రం పార్టీని విస్తరించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ దాటికి బయటికి రావాలని మజ్లిస్ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరీంనగర్లో 60 వేల ఓట్లు..! ప్రస్తుతం కరీంనగర్ ఓటర్ల సంఖ్య 3.30 లక్షల పైమాటే. అందులో 59,270 వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్ ప్రకటన ఆకస్మికంగా చేసింది కాదు. దీని వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు తమకు బ లం ఉన్న 50 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచి్చంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉన్నాయని సమాచారం. ఇందుకోసం కరీంనగరంలోని ఓటర్ల సమాచారం మొత్తం సేకరించారు. దారుస్సలాం ఆదేశాల మేరకు.. ప్రత్యేక యాప్‌లో మొత్తం ఓటర్ల సమాచారం నిక్షిప్తం చేశారు. మొత్తం దాదాపు 390 పోలింగ్ బూత్‌ల వారీగా.. హిందూ, ముస్లింలు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పురుషులుగా విభజించారు. కరీంనగర్లో 30 వేలకుపైగా ఉన్న ఎస్సీలు తమతో కలిసి వస్తారన్న ధీమాతో మజ్లిస్ ఉంది. కొత్త ఓట్ల నమోదుకే డివిజన్ల పర్యటన.. కరీంనగర్లో 60 వేలకుపైగా ఓటర్ల బలం ఉన్న నేపథ్యంలో పోటీ చేసే పరిస్థితి వచ్చినా.. మద్దతిచ్చే నిర్ణయం తీసుకున్నా.. దేనికైనా సిద్ధంగా ఉండాలని దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వారం రోజులుగా డివిజన్ల పర్యటనకు ఎంఐఎం శ్రీకారం చుట్టింది. తమ ఓటర్లు ఉన్న 35 డివిజన్లలో కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నది దీని వెనక అసలు ఉద్దేశం. ఇప్పుడున్న ఓటర్లకు కనీసం నాలుగైదు వేలు యువ ఓటర్లు ఉంటారని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం వెంట ఎస్సీలు నడుస్తారా? మొత్తం కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను మజ్లిస్ కులం, మతం అనే అంశాల ఆధారంగా డేటా వర్గీకరించింది. 81.5% హిందూ జనాభా, 18.5% ముస్లిం జనాభా అని రెండు రకాలుగా విభజించింది. అందులో హిందువుల్లో 81.5% మందిలో మరో 14.5% వరకు అంటే దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఎస్సీలు కూడా ఉన్నారని.. మొత్తం తమకు 80 వేలమంది మద్దతు దొరుకుతుందని ఎంఐఎం ధీమాగా ఉంది. అదే సమయంలో నగరంలో ఉన్న ముస్లింలలో ఎందరు ఎంఐఎం వెంట నిలుస్తారు? రూ.10 లక్షల ఆర్థిక సాయంతో దళితబంధులాంటి భారీ సంక్షేమ పథకాలు అమలువుతున్న నేపథ్యంలో ఎస్సీలు మజ్లిస్‌కు మద్దతిస్తారా? అన్న సవాళ్లు మజ్లిస్‌ను వేధిసూ్తనే ఉన్నాయి. అందుకే.. అసలు మజ్లిస్ కరీంనగర్లో పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షం బీఆర్ఎస్తోనే కలిసి నడుస్తుందా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, సంకీర్ణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కోడిమఠం స్వామీజీ జోస్యం చెప్పారు. విజయనగర జిల్లా హొసపేటెలో ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కొందరు చర్చించుకుంటున్న నేపథ్యంలో కోడిమఠం పీఠాధికారి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ భవిష్యత్ రాజకీయాల గురించి నర్మగర్భంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇద్దరు గొప్ప వ్యక్తులు కనుమరుగవుతారన్నారు. ఉగాది అనంతరం గత ఏడాది కంటే మంచి వర్షాలు పడుతాయన్నారు. కరోనా వచ్చినా భయమేమీ లేదని, ప్రాణహాని ఉండదన్నారు. -
Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ దారెటు?
జమ్ము కశ్మీర్ గడ్డపై నల్ల మంచు కురిసిన వేళ.. తాను బీజేపీలో చేరతానంటూ గతంలో బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు గులాం నబీ ఆజాద్. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన మనసు మార్చుకుంటారా? లేదంటే మరో పార్టీలో చేరతారా? సొంత కుంపటి పెట్టబోతున్నారా? అసలు ఆయన తర్వాతి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది ఇప్పుడు.. కాంగ్రెస్ కీలక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తున్న ఆయన.. తాజా పరిణామాలకు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నారు. అయితే.. ఆయన పార్టీని వీడతారని మాత్రం అధిష్ఠానం ఊహించలేదు. పైగా పార్టీని వీడుతూ.. ఆయన విడుదల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ► 1973లో 22 ఏళ్ల వయసులో భలెస్సా బ్లాక్‌కు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఆజాద్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ పనితనానికి మెచ్చి.. రెండేళ్లకే జమ్ము కశ్మీర్ యూత్ ప్రెసిడెంట్‌ను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరో ఐదేళ్లకు అంటే 1980లో ఏకంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఆపై మహారాష్ట్ర వాసిం లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు, అటుపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ► పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే.. పార్లమెంటరీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలు చేపట్టారు ఆజాద్. ఆపైనా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కొనసాగినా.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అవకాశం రావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ► పీపుల్స్ డెమొక్రటిక్‌పార్టీ కూటమి మద్దతు ఉపసంహరణతో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం పదవికి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారాయన. ► ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ నలుగురి ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి గులాం నబీ ఆజాద్. తేడా వ్యాఖ్యలు! ► ప్రతిపక్ష నేతగా, సభ్యుడిగా బీజేపీ-ఎన్డీయేపై ఆయన ప్రత్యక్ష విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ► మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పురస్కారం అందుకున్నారాయన. ఆ సందర్భంలో.. కనీసం ఎవరో ఒకరు తన పనిని గుర్తించారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ► కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందంటూ బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు గులాం నబీ ఆజాద్. ఆ సందర్భంలో.. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. ► కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్‌ని అవమానిస్తోందని ఆరోపిస్తూ.. ఆయన మేనల్లుడు ముబషర్ ఆజాద్ బీజేపీలో చేరారు. ► కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. ఏర్పడ్డ జీ 23 కూటమిలో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల(పంజాబ్‌లో అయితే ఏకంగా అధికారం కోల్పోవడం) ఆధారంగా.. సంస్థాగత మార్పుపై తీవ్రస్థాయిలో అధిష్ఠానంపై గళమెత్తారు. ► ఆ సమయంలోనే ఆయన పార్టీని వీడతారేమో అనే చర్చ నడిచింది. అయితే సోనియా గాంధీ పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడంతో ఆయన ఆ సమయానికి మెత్తబడ్డారు. "పోస్టులు వస్తాయి... పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి... అధికారం వస్తుంది... కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే... గులామ్ నబీ ఆజాద్ జీ నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు" అని మోదీ భావోద్వేగం చెందారు. "నేను మిమ్మల్ని రిటైర్ కానివ్వను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. నా డోర్లు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 ► ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్.. బీజేపీ గూటికి చేరతారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలే అని అప్పుడు కొట్టిపారేశారాయన ► కాంగ్రెస్‌లో తన ప్రాబల్యాన్ని తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిస్తే, అది ప్రమోషన్ కాదని.. డిమోషన్ అని పేర్కొంటూ ఆ పదవికి రాజీనామా చేసి సోనియాగాంధీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరగక ముందే.. ► తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన లేఖలో.. పార్టీ ఎన్నికలను బూటకమని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే గుప్పించారు. ► బీజేపీ కాకుంటే.. బీజేపీలో చేరేది ఊహాగానాలే అంటూ గతంలో ప్రకటించారు గులాం నబీ ఆజాద్. కానీ, బీజేపీతో ఆయన అనుబంధం మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చని ఒకవర్గం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరినా.. సలహాదారుగా మాత్రమే ఆయన వ్యవహరించవచ్చనే భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో గనుక చేరుకుంటే.. ఆయన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ‘స్థానిక’ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని, లేదంటే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు ఆ హోదా లేకున్నా.. కాంగ్రెస్‌కు ఆజాద్ రాజీనామా, లేఖ కలకలం -
అటు శనీశ్వరం – ఇటు కాళేశ్వరం
తెలుగు రాష్ట్రాలకు ఎండ వేడి ఎక్కువే. రాజకీయ వేడీ ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్లకోమారు జరగాలి. ఆ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తులు, పైయెత్తులూ రెండున్నరేళ్లు ముందుగానే ప్రారంభమవుతాయి. అందువల్ల రేయింబవళ్ల మాదిరిగా మన సగం జీవితకాలాన్ని ఈ రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 22 నెలల టైముంది. ఇంకో పదహారు నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు జరగాలి. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు సంధించ బోయే ప్రధానాస్త్రాలేమిటో ఇప్పటికే వెల్లడైంది. ఏపీలో శనీశ్వరుని పీడ, తెలంగాణలో కాళేశ్వరంపై రగడ! చంద్రబాబు పార్టీ, దాని అనుబంధ విభాగాలైన యెల్లో మీడియా, సోషల్ మీడియా, స్లీపర్ సెల్స్ అన్నిటినీ కలిపి శనీశ్వరుని పేరుతో పరిగణించవలసి వస్తున్నది. ఎందుకంటే ఈ యెల్లో సిండికేట్‌కు మంచీ–చెడులతో పనిలేదు. ఉచ్ఛ–నీచ విచక్షణ లేదు. న్యాయా న్యాయ విచికిత్స అవసరం లేదు. సమయమూ – సందర్భమూ ఉండదు. తన కూటమి అధికారంలో ఉండడానికి ఏం చేయడా నికైనా వెనుకాడదు. శనీశ్వరుడూ అంతే... ఎందుకు, ఎప్పుడు, ఎవరిలో ప్రవేశి స్తాడో తెలియదు. ఎందుకు పీడిస్తాడో తెలియదు. ఎప్పుడు వదులుతాడో తెలియదు. అతడి ప్రభావం నుంచి పరమ శివుడైనా తప్పించుకోలేడనే కథ ఒకటి ఉన్నది. ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లి శనీశ్వరుడి ఆగడాలపై పరమేశ్వరునికి మొరపెట్టుకున్నాడట! అతని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని సవాల్ చేశాడట. ‘ఆ శని నన్ను కూడా వేధించగలడా’ అని పరమశివుడు ప్రశ్నించాడట. ‘తప్పకుండా వేధిస్తాడ’ని నారదుల వారు బదులు చెప్పారట! అయితే డేటూ, టైమూ ఫిక్స్చేసి రమ్మని చెప్పు, ఏం చేస్తాడో చూద్దామని శివుడు ఆదేశించాడట. నిర్ణయించిన ముహూర్తానికి ఒక కీకారణ్యంలోకి వెళ్లి వటవృక్షం తొర్రలో పరమేశ్వరుడు దాక్కున్నాడట. నిర్ధారిం చిన ఘడియలు దాటిన తర్వాత విజయగర్వంతో శివుడు బయ టకు వస్తాడు. ఎదురుగా శనీశ్వరుడు! శివునికి నమస్కరించి, ‘స్వామీ! కైలాసంలో కూర్చొని లోకాలను పాలించవలసిన తమరు నా భయంతో కొన్ని ఘడియలైనా సరే చెట్టు తొర్రలో దాక్కున్నారు. అదీ నా ప్రభావం’ అని చెప్పాడట! యెల్లో సిండికేట్ కనికట్టు విద్యలో దిట్ట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడంలో బహు నేర్పరి. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా భ్రమించేంతవరకు వెంటపడుతూనే ఉంటుంది. ఈ యెల్లో శనీశ్వరుని లీలలే మనం ఏపీ ఎన్నికల ప్రచారంలో చూడబోతున్నాము. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ చేతిలో వజ్రాయుధంగా ఉండవలసింది. కానీ, దాన్నే ప్రతిపక్షాలు కూడా ప్రధాన ఆయుధంగా మలుచుకోగలగడమే వింతల్లో కెల్ల వింత. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది విపక్షాల ఆరోపణ. ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ కూడా కన్నేసిందనీ, ఈడీ రంగంలోకి దిగిందనే వార్తలు కూడా ముసురుకున్నాయి. ఈ వార్తలకు ప్రతిపక్షం కంటే అధికార పక్షమే ఎక్కువ ఆజ్యం పోయడం ఆసక్తి కలిగించే అంశం. దర్యాప్తు సంస్థల్ని చేతిలో పెట్టుకొని కేంద్రం ప్రతిపక్ష రాష్ట్రాలను బెదిరిస్తున్నదనీ, మేం దానికి భయపడేది లేదనీ స్వయంగా ముఖ్యమంత్రే పలుమార్లు ప్రకటించారు. దీంతో లోలోపల ఏదో జరుగుతున్నదనే అనుమానం జనంలో పొడసూపింది. ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అంటే ‘మోడీ, ఈడీ’ అనే నిర్వచనాన్ని కేటీఆర్ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఫలితంగా రాబోయే ఎన్నికల కాలాన్ని ప్రభావితం చేయబోయే అంశం కాళేశ్వరమేనన్న అభిప్రాయం బలపడుతున్నది. శని ఒకసారి ప్రవేశిస్తే కొంత కీడు చేస్తాడు. రెండోసారి ప్రవేశిస్తే ఇంకొంచెం ఎక్కువ కీడు చేస్తాడు. మూడోసారి కూడా ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమట. ఆ మూడో దశను మృత్యు పీడనతో పోల్చుతారు కొందరు జ్యోతిష్యులు. ఈ యెల్లో శనీశ్వరుడు ఇప్పటికే రెండుసార్లు అధికార పీఠంలో ప్రవేశించి, మొదటిసారి ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత రాష్ట్రాన్ని పీడించాడు. కాకపోతే శని పీడన కాలాన్ని కూడా స్వర్ణయుగంగా ప్రచారం చేయడం యెల్లో సిండికేట్ గొప్పతనం. మూడోసారి ప్రవేశం కోసం గత మూడేళ్లుగా యెల్లో శనీశ్వరుడు ప్రదర్శిస్తున్న ఇంద్రజాల విద్యల్ని చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ వారం నుడివిన పోలవరం సుభాషితాలను ఒకసారి పరిశీలించండి. గోదావరి వరదల తర్వాత రెండుసార్లు చంద్రబాబు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ఒకసారి, తర్వాత ఒకసారి! ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించి, వారికి కావలసిన వనరులను సమకూర్చి నిరంతరం పర్యవేక్షించడం, సలహాలివ్వడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించే పద్ధతి. తానే స్వయంగా పర్యటనకు వెళ్తే అధికార యంత్రాంగం తన చుట్టూ మూగుతారనీ, సహాయ చర్యలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఆయన ఈ పద్ధతిని అనుసరిస్తారు. ప్రపంచంలో చాలామంది ప్రభుత్వాధినేతలు కూడా ఈ పద్ధతినే అనుస రిస్తారు. చంద్రబాబు పద్ధతి వేరు. ఆయనొక షోమ్యాన్. సహాయ కార్యక్రమాలు అటకెక్కినా సరే తాను తుపానులను ఆపేస్తున్నట్టూ, వరదలను కంట్రోల్ చేస్తున్నట్టూ మీడియాలో కనిపించాలి. అధికార బృందాన్ని తన చుట్టూ నిలబెట్టుకొని వారి మీద అరుస్తుండాలి. తాను ఒక్కడే చురుగ్గా పనిచేస్తున్నట్టు మీడియాలో ఆహా ఓహో అనే వార్తలు రావాలి. వైఎస్ జగన్ అనుసరించే పరిష్కార వైఖరిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు మొదటిసారి వెళ్లారు. ‘సీఎం రాలేదు... నేను వచ్చాన’ని గొప్పలు చెప్పు కున్నారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే ఆయన మాటలను వక్రీకరించడానికి చంద్రబాబు మరోసారి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్రెడ్డి పూర్తిచేయలేరని తేల్చేశారు. తాను మళ్లీ వచ్చి పూర్తిచేస్తానన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యమని చెప్పారు. 22 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం 20 వేల కోట్లు ఇస్తుందని సలహా ఇచ్చారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తానన్నారు. ఎప్పుడూ చెప్పినట్టుగా సకల అనర్థాలకు జగన్ ప్రభుత్వమే కారణమనీ, తాను వస్తే జిందా తిలిస్మాత్ తెస్తాననీ మరోసారి ఢంకా భజాయించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని మూడు ముక్కల్లో పరిశీలిద్దాము. 195 టీఎమ్సీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందుకోసం గోదావరికి అడ్డంగా రెండున్నర కిలోమీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ను కట్టాలి. ఈ డ్యామ్‌ను కట్టాలంటే వరదను మళ్లించాలి. సీడబ్లు్యసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు ఎగువన అప్రోచ్ చానల్ నిర్మించి, నదీ ప్రవాహాన్ని కుడివైపుకు మళ్లించాలి. డ్యామ్‌కు సమాంతరంగా కుడివైపున నిర్మించే స్పిల్‌వే మీదుగా నీటిని విడుదల చేసి సుమారు 6 కిలోమీటర్ల తర్వాత మళ్లీ ప్రధాన నదిలో కలపాలి. స్పిల్‌వే పనులు కాగానే 35 మీటర్ల ఎత్తు కాంటూర్ పరిధిలో నివసించే 8,800 కుటుంబాలకు పునరావాసం కల్పించి, ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి. ఆ తర్వాత స్పిల్‌వే ద్వారా మళ్ళించి మళ్లీ నదిలో కలిపిన వరద వెనక్కు ఎగదన్ని డ్యామ్ పనులకు విఘాతం కలిగించకుండా దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించి, ఈసీఆర్‌ఎఫ్‌కు పునాదిగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ పద్ధతి మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం తలకిందులు చేసింది. నిర్వాసితుల పునరావాసంలో కమీషన్లు రావు కనుక అది పక్కనపెట్టి డయాఫ్రమ్ వాల్ పనులను చేపట్టింది. కాఫర్ డ్యాం ద్వారానే పంటలకు నీళ్లిస్తానని ప్రకటించి, స్పిల్‌వే కట్టకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పని ప్రారంభిం చారు. నిర్వాసితులు పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేయడంతో కాఫర్ డ్యామ్‌ల పనిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత 2019 ఆగస్టు, 2020 ఆగస్టుల్లో వచ్చిన వరదలు సగం కట్టిన ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా తక్కువ వైశాల్యంలో ప్రవహించవలసి వచ్చింది. దీంతో వరద ఉధృతి పెరిగి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై, రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిన్నది. ఇదీ తెలుగుదేశం ప్రభుత్వం పోలవరంలో సాధించిన ఘనకార్యం. ఈ పాపాలన్నిటినీ దాచిపెట్టి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంపై నిందలకు దిగారు. 22 మంది ఎంపీలు రాజీనా మాలు చేస్తే నిర్వాసితుల పునరావాసానికి డబ్బులు రావా అని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీటిపారుదల వ్యయాన్ని మాత్రమే ఇస్తామంటూ, అంటే నిర్వాసితుల పరిహారం తమ పరిధిలోది కాదంటూ గతంలో కేంద్ర కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పుడు 20 వేల కోట్లను పరిహారంగా తీసుకు రావడానికి ఆ తీర్మానమే అవరోధంగా మారింది. తీర్మానం చేసినప్పుడు కేంద్ర కేబినెట్లో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు న్నారు. వారు అభ్యంతరం చెప్పి వున్నా, రాజీనామా చేస్తామని హెచ్చరించి వున్నా ఈ కేబినెట్ తీర్మానం ఉండేది కాదు. ఇప్పుడీ అవస్థ ఉండేది కాదు. సిగ్గుతో తలదించుకోవలసింది ఎవరు? రాజీనామా చేయవలసింది ఎవరు? అలాగే, ‘అల్లూరి సీతారామ రాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉండటమేమిటి? అంతదూరం ఎలా వెళ్తారు? విలీన మండలాలతో ఒక ప్రత్యేక జిల్లానే ఏర్పాటు చేస్తా’నని కూడా చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం పద్నాలుగేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. రెండున్నరేళ్ల కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు పోలవరం జిల్లా ప్రకటన చూస్తే నవ్వు రాకుండా ఉంటుందా? పైగా గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత పనుల కోసం మండల కేంద్రాలకు వెళ్లే వారే కరువయ్యారు. ఇక జిల్లా కేంద్రానికి వెళ్లేవారి సంఖ్య బహుస్వల్పం. యెల్లో శనీశ్వరుల ప్రచారాలకు ఒక తర్కం గానీ, హేతుబద్ధత గానీ, వాస్తవికత గానీ, ఆధారాలు కానీ ఏమీ ఉండవు. స్వార్థ ప్రయోజనం తప్ప! వారానికి ఒకటి చొప్పున వెలువడుతున్న పోలవరం తరహా ప్రచారాలు విశ్లేషణలకు అందవు. బండకేసి బాదడమే మార్గం. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజినీరింగ్ వండర్‌గా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికవుతున్న వ్యయాన్ని బట్టి చూసినా ఇదొక ప్రపంచస్థాయి ప్రాజెక్టు. ఇప్పటికే రమారమి 80 వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో 40 వేల కోట్లయితే తప్ప మొత్తం ప్రాజెక్టు పూర్తి కాదు. 20 చోట్ల లిఫ్టులు, 20 రిజర్వాయర్లున్న బృహత్తర పథకం ఇది. ప్రాజెక్టు నిర్వహణకయ్యే విద్యుత్ వ్యయమే ఏటా 4 వేల కోట్లుంటుందని అంచనా. వ్యయంలో సింహభాగం రుణాలే కనుక రానురాను ఈ ప్రాజెక్ట్ నిర్వహణ భారంగా మారనున్నదని ప్రతిపక్షాలతో సహా కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ అంతకు అనేక రెట్లు రైతులు లాభపడనున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ రైతులు గత సంవత్సరం సాధించిన 2 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులను చూపెడు తున్నది. కానీ ఈ రెండేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి పోసిన నీళ్లు వంద టీఎమ్సీల కంటే తక్కువేనన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన జల యజ్ఞంలో భాగంగా ‘ప్రాణహిత – చేవెళ్ల’ అనే ఒక కొత్త ఆలోచనకు కూడా కార్యరూపం ఇచ్చారు. వార్ధా, వేనగంగ నదుల సంగమం తర్వాత ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా ఈశాన్య సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బరాజ్ నిర్మించాలి. అక్కడి నుంచి ఎల్లంపల్లి దగ్గర (గోదావరి – ప్రాణహిత సంగమానికి ముందు) గోదావరికి తరలించి, మిడ్ మానేరు మీదుగా రంగారెడ్డి జిల్లా వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీ–డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందనీ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చనే అంచనాతో ప్రాజెక్టును రీ–డిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి... సముద్రమట్టానికి దాదాపు సమానమైన ఎత్తులో ఉంటాయి. కనుక ఎత్తిపోతల వ్యయం తక్కువగా ఉంటుంది. మేడిగడ్డ తక్కువ ఎత్తులో ఉంటుంది. అక్కడ్నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేందుకు ఎక్కువ సామర్థ్య మున్న మోటర్లు, ఎక్కువ ఖర్చు అవసరమౌతాయి. పైగా రివర్స్ పంపింగ్! నదిని వెనక్కు పంపించడం! పోలవరంలో నదీ ప్రవాహాన్ని కుడిపక్కకు మళ్లించి, దిగువన ప్రవాహంలో కలిపేయడం ప్రత్యేకత. కాళేశ్వరంలో ఎగువకు మళ్లించడం ప్రత్యేకత. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి మూడు పంప్‌హౌస్‌ల సాయంతో ఎల్లంపల్లి దగ్గర గోదావరిలో కలుపు తారు. అయితే గడిచిన సంవత్సరం ఇలా 30 టీఎమ్‌సీలను ఎల్లంపల్లికి తరలించిన తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో అందులో 23 టీఎమ్‌సీలను గేట్లెత్తి మళ్లీ దిగువకు వదలాల్సి వచ్చింది. పీఛేముడ్ – ఆగేముడ్! కరెంట్ ఖర్చు అదనం. కాళేశ్వరం ప్రాజెక్టును సాంకేతిక అంశాలు, వ్యయప్రయాసల అంశాల అధారంగా విమర్శించే వారు ఒక వర్గం. రాజకీయ విమర్శలు చేసేవారు మరో వర్గం. ఈసారి ఎలాగైనా తెలంగాణాలో అధికారాన్ని సాధించి దక్షిణాదిన బలపడాలని బీజేపీ గట్టిగా కోరుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బలహీనపడుతున్నప్పటికీ తెలంగా ణలో మాత్రం ఇప్పటికీ బలమైన పునాదు లున్నందు వల్ల చావో–రేవో తేల్చుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడు తున్నది. ఈ రెండు పార్టీలు కాళేశ్వరాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకున్నాయి. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిం దని ఆరోపిస్తున్నాయి తప్ప ఇప్పటివరకు ఆ అవినీతికి సంబం ధించి ఒక్కటైనా నిర్దిష్టమైన ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని వనరులూ చేతిలో ఉన్న బీజేపీ కూడా ఎటువంటి ఆధారాన్నీ చూపెట్టలేకపోతున్నది. కాకపోతే ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పారదర్శకత లేదని వాదిస్తున్నది. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సాయం అందించే ఏఐబీపీ స్కీమ్‌లో చేర్చుతాము... వివరాలు పంపించమని అడిగితే రాష్ట్రం స్పందించడం లేదని కేంద్రం ఆరోపిస్తున్నది. ఖర్చులు, రుణాలు మొదలైన వివరాలను చెప్పడం ఇష్టం లేకనే స్పందించడం లేదని కేంద్రం అభిప్రాయం. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్రం చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందిస్తూ – ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతులు లేవనీ, అందుకే జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేమనీ చెప్పింది. ఎంతసేపూ ఖర్చులకు సంబంధించిన పారదర్శకత లేదని చెప్పడం ద్వారానే అవినీతి ముద్ర వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు కనిపి స్తున్నది. ‘కాళేశ్వరం – అవినీతి’ అనే అంశంపై జాతీయ పార్టీలు ఎంత దూకుడుగా ఉన్నాయో, టీఆర్ఎస్ అంతే దూకుడుగా ఉన్నది. వస్తేరానీ ఈడీ–మోడీ అంటున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే కాళేశ్వరం ట్రాప్‌లో జాతీయ పార్టీలను ఇరికించ డానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదా? టీఆర్ఎస్ను జాతీయ పార్టీలు ఇరుకున పెడుతున్నాయా అనేది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
గుజరాత్: బీజేపీలో చేరిన పటీదార్ నేత హార్ధిక్ పటేల్
గాంధీనగర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్ ట్విటర్లో పోస్టు పెట్టారు. తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం కోసం ఒక చిన్న సైనికుడిగా పనిచేయనున్నట్లు తెలిపారు. యావత్ ప్రపంచానికే మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు. ఇక గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయం చుట్టూ హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా 28 ఏళ్ల యువ పాటిదార్ నేత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాలపై అసంతృప్తి చెందిన హర్దిక్ బహిరంగంగా ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చారు. కొన్ని రోజులకు(మే 18న) కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్ అయితే తాను పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఎవరి ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు. ప్రజల కోసం పనిచేయడానికే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కాగా మరికొన్ని నెలల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్ నేత -
వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీకి పలువురు ముఖ్య నేతల తనయులు సై అంటున్నారు. గతంలో ఉమ్మ డి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలే కా కుండా.. ప్రస్తు తం కీలక పదవు ల్లో ఉన్న వారి తన యులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీరిలో కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. వీరితో పాటు మరికొంత మంది యువ నాయకులు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికలకు ఏడాదిపైగా ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాల్లోనే కాదు బంధువులు, కార్యకర్తలు, సామాజిక వర్గం ప్రజలు, అభిమానులు ఇలా ఎవరి ఇళ్లలో ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధిష్టానాల వద్ద పావులు కదుపుతున్నారు. మాస్ టు క్లాస్.. శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ ఈసారి ఎన్నికల్లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది క్రితం ఈయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. విద్యార్థి, యువజన నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. తరచూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాడు. అటు మాస్‌తో పాటు ఇటు క్లాస్ పీపుల్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పట్నం’పై ప్రశాంత్ కన్ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సుదీర్ఘ కాల ఎమ్మెల్యేగా పని చేయడం, వయసు మీదపడటంతో తన స్థానంలో కుమారుడిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌కు కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉంది. షాద్‌నగర్‌లో పాగా కోసం.. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు ఏపీ మిథున్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గతంలో ఆయన తండ్రి టీఆర్ఎస్ ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తండ్రితో పాటు ఆయన కూడా బీజేపీ గూటికి చేరాడు. షాద్‌నగర్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తండ్రి బాటలో రవీంద్రుడు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పెద్ద కుమారుడు వై.రవీందర్ యాదవ్ కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేశంపేట్ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి స్థానంలో తరచూ నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే.. పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా.. మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్‌రెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నారు. 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన శివారులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. బయటకు కనిపించకపోయినా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 111జీవో ఎత్తివేత అంశంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేశాడు. ఈసారైనా దీవిస్తారా.. మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి చేవేళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు. -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్‌కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్‌లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్‌కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్‌యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
బీజేపీ బంపర్ ఆఫర్.. ఉచితంగా స్కూటీలు, లాప్ ట్యాప్స్
ఇంపాల్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కమలం నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా గెలుపే లక్ష్యంగా బంపర్ ఆఫర్లతో ప్రజలపై హామీల వర్షం కురిస్తున్నారు. ముణిపూర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మణిపూర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలను అరికట్టడంతో సీఎం విజయవంతమయ్యారని కొనియాడారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - వృద్ధాప్య పింఛన్ రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు. - ఉన్నత విద్య కోసం విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం. - 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు. - ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు. - ఉచితంగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు. - మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు ఉచిత బీమా. - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు. -మహిళలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం. - పీజీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు. - సాంస్కృతిక వారసత్వం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ. - ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు. -
తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా , బీజేపీ నాయకులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కోనుగోలు విషయంలో టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీపై టీఆర్ఎస్ చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. అదే విధంగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్‌షా ఆదేశించారు. త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని నాయకులకు అమిత్ షా సూచించారు. ఈ సభకు తాను.. హజరవుతానని పేర్కొన్నారు. సభ నిర్వహించే తేదీని పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు. -
భవానీపూర్‌లో 53.32 శాతం ఓటింగ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మోస్తరు ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ అనుమతించనున్నట్లు తెలిపారు. మొత్తం ఓటింగ్ శాతాన్ని శుక్రవారం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. భవానీపూర్‌లో టీఎంసీ తరఫున సీఎం మమత, బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్, సీపీఎం తరఫున శ్రిజిబ్ బిశ్వాస్‌లు బరిలోకి దిగారు. ముర్షిదాబాద్‌లోని సంసేర్ గంజ్‌లో 78.60 శాతం, జంగిపూర్లో 76.12శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీఎంసీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ వద్దకు 97 ఫిర్యాదులు రాగా, వాటిలో 91 ఫిర్యాదులను అధికారులు కొట్టేశారు. 97 ఫిర్యాదుల్లో 85 ఫిర్యాదులు సీఎం పోటీ చేస్తున్న భవానీపూర్‌లోనే రావడం గమనార్హం. మేలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ తన పదవిని నిలబెట్టుకొనేందుకు ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. ఒడిశా ఉప ఎన్నికలో 68.40 శాతం ఓటింగ్.. పిపిలి: ఒడిశాలోని పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల సమయానికి 68.40శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్కే లోహని తెలిపారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ 19 నియమావళి ప్రకారం ఓటింగ్ జరిగిందని, భద్రతబలగాలు అందుకు సాయపడ్డాయని చెప్పారు. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మమత -
యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ ప్రారంభించిందన్నారు. ఓంప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. భగీదరి సంకల్ప్ మోర్చా పేరుతో ఇతర పార్టీలని ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అంతేకాక, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదని అసదుద్దీన్ తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు. उ.प्र. चुनाव को लेकर मैं कुछ बातें आपके सामने रख देना चाहता हूँ:- 1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2 — Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021 గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలుపొందింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చదవండి: ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు -
ముగిసిన నందిగ్రామ్ పోరు
మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలతో పశ్చిమబెంగాల్లోని రెండో దశ పోలింగ్ గురువారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల మాటెలావున్నా రెండో దశలో అందరి కళ్లూ నందిగ్రామ్‌పైనే వున్నాయి. మూడు దశాబ్దాలక్రితమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరి ఊహలకూ భిన్నంగా ఆ ఒక్క స్థానాన్నే ఎంచుకుని పోటీ చేస్తుండటం ఇందుకు కారణం. అక్కడ పోలైన ఓట్ల శాతం 80 శాతం పైగా వుందంటే పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఎనిమిది దశల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో గత నెల 27న 30 స్థానాలకు తొలి దశ పూర్తయింది. రెండో దశలో గురువారం నందిగ్రామ్తోసహా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నందిగ్రామ్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నిటినీ మమత చక్రాల కుర్చీలో స్వయంగా సందర్శించటం, తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించటంలేదని ఆరోపణలొచ్చినచోట ఎన్నికల అధికారులను కదిలించి పరిస్థితి చక్కదిద్దటం మాత్రమే కాదు... సాధారణ ఓటర్లను బీజేపీ అడ్డగిస్తున్నదని ఆరోపణలొచ్చిన బోయల్ పోలింగ్ కేంద్రం దగ్గర రెండు గంటలపాటు వుండి పర్యవేక్షించటం గమనిస్తే ఆమె పట్టుదలేమిటో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో మమత అంతా తానై పోరాడారు. రాష్ట్రంలో ఆమెతో సరితూగగలిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతోసహా అతిరథ మహారథులను బీజేపీ మోహరించింది. నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సొంత నియోజకవర్గం కావటం, ఆయన నిన్న మొన్నటివరకూ తృణమూల్‌లో కీలక నేతగా వుండటం కారణంగా అక్కడి ఓటర్లు ఎటు మొగ్గాలో తేల్చుకోవటానికి చాలానే కష్టపడివుంటారు. పంట భూములను అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు 2007లో సాగించిన పోరులో సువేందు కీలకపాత్ర పోషిం చారు. అప్పట్లో రైతులకు సన్నిహితుడయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాగా పాటుబడ్డారని చెబుతారు. అందుకే ఆయన్ను పార్టీలో వుంచటానికి మమత శత విధాల ప్రయత్నించారు. ఆయన తమ వైపు మొగ్గు చూపకపోతే బీజేపీ బహుశా ఇంత హోరాహోరీ పోరాటానికి సిద్ధపడేది కాదు. అధికారానికి రాబోయేది తామే అన్నంత హడావుడి చేసేది కాదు. ఆ స్థాయిలో బీజేపీ హడావుడి చేయకుంటే మమత సైతం అంత పట్టుదలగా తన సొంత నియో జకవర్గాన్ని వదిలి నందిగ్రామ్‌కు కదిలివచ్చేవారు కాదు. ఏమైతేనేం అగ్నికి వాయువు తోడైనట్టు బీజేపీ–సువేందుల కాంబినేషన్ బెంగాల్ ఎన్నికలపై ఉత్కంఠను అనేక రెట్లు పెంచితే... సువేందుతో తాడో పేడో తేల్చకోవటానికి మమత రావటం నందిగ్రామ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. మమత రాకపోయివుంటే ఆ స్థానం నిస్సందేహంగా సువేందు సొంతమే. ఆ సంగతలావుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మమత మొదటగా తనను తాను నిందించుకోవాలి. సీపీఎం శ్రేణులు తమ పార్టీవారిని బతకనీయటం లేదని, వారు తమిళనాడు వంటి దూరప్రాంతాలకు పోయి జీవనం సాగించవలసివస్తోందని లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో మమత ఆరోపించేవారు. కానీ అధికార పీఠం అందుకున్నాక తమ పార్టీ శ్రేణులపైనా అలాంటి ఆరోపణలే వస్తున్నాయని గుర్తించలేకపోయారు. అవి ఏ స్థాయికి చేరాయంటే ఒకప్పటి వామపక్షాల కార్యకర్తలు తమకెదురవుతున్న వేధింపులు భరించలేక బీజేపీని ఆశ్రయించాల్సివచ్చింది. తమకు మినహా వేరెవరికీ పునాదులు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే తృణమూల్ ఈ పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు చాన్నాళ్లుగా ఆరోపిస్తు న్నాయి. సంక్షేమంతో, అభివృద్ధితో ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది ప్రత్యర్థుల్ని అధిగమిం చటం వేరు... ఫిరాయింపులతో, బెదిరింపులతో దాన్ని సాధించాలనుకోవటం వేరు. ప్రత్యర్థి పార్టీ లకు పునాది లేకుండా చేయటానికి రెండో మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ఖాళీ నింపేందుకు మరొక పార్టీ రంగం మీదికొస్తుంది. తృణమూల్ అధికారంలోకి రావటంలో కీలకపాత్ర పోషించిన నందిగ్రామ్ ఉద్యమంలో పాల్గొన్నవారికీ, అప్పట్లో జాడతెలియకుండా పోయినవారి కుటుంబాలకూ 14 ఏళ్ల తర్వాతగానీ ఆర్థిక ఆసరా కల్పించలేకపోవటం తృణమూల్ పాలన తీరుకు అద్దం పడుతుంది. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడటం వెనకున్న కారణాలేమిటో మమత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. సాగుతున్న పాలనపై తమ మనోభీష్టాన్ని వ్యక్తం చేయటానికీ, సమర్థవంతులైన ప్రతినిధులను ఎంచుకోవటానికీ ఎన్నికలను ప్రజలు ఒక సందర్భంగా భావిస్తారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆ ఎన్నికలు కాస్తా వైరి వర్గాల బలప్రదర్శనలుగా మారుతున్నాయి. పరస్పర దూష ణలకు వేదికలవుతున్నాయి. మద్యం, డబ్బు ప్రవహించటం... డాబూ దర్పం చూపటం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాధారణ ప్రజానీకంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించటం మినహా ఎన్నికలు సాధి స్తున్నదేమీ వుండటం లేదు. పార్టీల మేనిఫెస్టోల్లో సాగు సంస్కరణలు, పెట్రో ధరల పెంపు వంటివి కనబడవు. ఇతరేతర అంశాల ఆసరాతో గద్దెనెక్కాక అవన్నీ జనంమీద స్వారీ చేస్తాయి. ఈ పరిస్థితి మారితేనే ఎన్నికలు అర్ధవంతమవుతాయి. అందులో అసలైన ప్రజాభీష్టం వ్యక్తమవుతుంది. -
మహిళలపై అవాక్కులు!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటే సాధారణ పౌరులు బెంబేలెత్తే పరిస్థితులొచ్చాయి. ఎన్నికల ప్రచారసభల్లో, మీడియా సమావేశాల్లో, ర్యాలీల్లో, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు ఎలాంటి దుర్భాషలతో విరుచుకుపడతారో, ఏం వినవలసివస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. మహిళలనూ, అట్టడుగు కులాలవారినీ కించపరుస్తూ మాట్లాడే నేతల పరువు ఎటూ పోతుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతూ దేశ పరువుప్రతిష్టలు సైతం దెబ్బతింటున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ మాదిరే వున్నాయి. తన కాలికి అయిన గాయాన్ని ప్రదర్శించదల్చుకుంటే ఆమె చీరెకు బదులు బెర్ముడా షార్ట్‌లు ధరించాలని ఆయనగారు సలహా ఇచ్చారు. ఈ నెల 10న నందిగ్రామ్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆమె కాలికి గాయమైంది. రెండు రోజులు ఆసుపత్రిలో వుండి వచ్చారు. అప్పటినుంచీ ఆమె గాయానికి కట్టుతోనే చక్రాల కుర్చీలో కూర్చుని ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. కారు డోరు తీసుకుని వుండగా కొందరు దుండ గులు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాలు ఇరుక్కుని గాయమైందని ఆమె వివరణ నిచ్చారు. ఇదంతా సానుభూతి పొందటానికి ఆడుతున్న డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. గాయమైందంటే కనీసం సానుభూతి ప్రకటించటానికి కూడా సిద్ధపడలేదన్న విమర్శలొచ్చాయిగానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని ఆశించలేం. అది లేకపోగా హద్దు మీరి వస్త్రధార ణపై సలహా ఇచ్చేవరకూ పోయిందంటే ఎన్నికల ప్రచార సరళి రాను రాను ఎలా దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు.మమతా బెనర్జీ ప్రస్తుతం దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి. ప్రత్యర్థులపై నిప్పులు చెరగటం ఆమె నైజం. అలా మాట్లాడటం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ విమర్శ ఆ అంశానికి పరిమితం కావాలి తప్ప కించపరిచేలా మాట్లాడటం సరికాదు. దిలీప్ ఘోష్ వ్యాఖ్య అసభ్యకరంగా వున్నదని విమర్శలొస్తే ఆయన మరింత హీన స్థాయిలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవహరించాలట. చీరె ధరించిన మహిళ కాళ్లు చూపటం సభ్యత కాదట. తన మాటల్లో వివాదమేమీ లేదని, వాటిపై వివరణనివ్వాల్సిన అవసరం లేదని దిలీప్ ఘోష్ అభిప్రాయం. ఆయన అయిదేళ్లక్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదా స్పదుడయ్యారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థినులనుద్దేశించి ‘వారు మగపిల్లల సాహచర్యం కోసం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోని సిగ్గుమాలిన వార’ంటూ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టులో ‘నేను చంపటం మొదలెట్టానంటే తృణమూల్ కార్యకర్తల కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతాయ’ న్నారు. వాస్తవానికి ఇలాంటి ధోరణి ఏ ఒక్క పార్టీకో, నాయకుడికో పరిమితమైంది కాదు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదనుద్దేశించి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపాల్ షెట్టి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి ఊర్మిళా మంటోద్కర్ విషయంలో ఇదే మాదిరి మాట్లాడారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనా ఆ ఎన్నికల్లో మహారాష్ట్ర పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయదీప్ కవాడే ఇలాగే వ్యాఖ్యానించారు. ఆమె నుదుటన ధరించే సిందూరం పెద్దగా వుండటాన్ని ప్రస్తావిస్తూ ‘భర్తల్ని మార్చినప్పుడల్లా ఆ సిందూరం పరిమాణం పెరుగుతుంటుంద’న్నారు. చిత్రమేమంటే పురుషులు మాత్రమే కాదు... మహిళా నేతలు సైతం తోటి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడి వుండొచ్చుగానీ... పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మహిళలు భిన్న రంగాల్లో చొరవగా ముందుకు రావటం మన దేశంలో ఇప్పటికీ తక్కువే. అన్నిచోట్లా గూడుకట్టుకున్న పితృస్వామిక భావజాలమే ఇందుకు కారణం. సైన్యంలో పనిచేసే మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పునిస్తూ, మన సమాజంలోని అన్ని రకాల నిర్మాణాలూ పురుషుల కోసం పురుషులే ఏర్పాటుచేసుకున్నవని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళల వస్త్ర ధారణ ఎలావుండాలో, వారెలా మెలగాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారంతా ఇలాంటి పితృస్వామిక భావజాల ప్రభావంతోనే మాట్లాడుతున్నారు. అందుకోసం సంస్కృతిని అడ్డం పెట్టుకుంటున్నారు. రాజకీయ రంగంలోవున్నవారిని సమాజం గమనిస్తుంటుంది గనుక వారి ప్రవర్తన, భాష ఇతరులకు ఆదర్శప్రాయంగా వుండాలి. దేశ రాజకీయాల్లో మహిళలు కూడా ఇప్పుడిప్పుడే చురుగ్గా వుంటున్నారు. రాష్ట్రపతి, విదేశాంగమంత్రి, రక్షణమంత్రి వంటి పదవులు చేపట్టి తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి కూడా మహిళే. కానీ కొందరు రాజకీయ నాయకులు చవకబారు వ్యాఖ్యలు చేసి తమను తాము దిగజార్చుకోవటమే కాదు... సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం ఒక సదస్సులో ప్రసంగిస్తూ ప్రజలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, వారు ఏం తినాలో, వ్యక్తులుగా వారేం చేయాలో చెప్పే ధోరణి రాజకీయ నాయకులకు తగదన్నారు. దిలీప్ ఘోష్ అయినా, మరొ కరైనా ఈ విషయాన్ని గుర్తెరగాలి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. -
మోదీ చిత్రం లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తున్నారు. అయితే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇకపై వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మోదీ చిత్రం ఉండబోదు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కో–విన్ పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి చిత్రం ఉండడం పట్ల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
బెంగాల్లో ‘దీదీ’నే!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంల్లో అధికార కూటమే విజయం సాధిస్తుందని టైమ్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అయితే, 2016 కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. అక్కడ బీజేపీ బలం పుంజుకున్నప్పటికీ.. అధికారం చేపట్టే స్థాయికి చేరుకోలేదని అంచనా వేసింది. పశ్చిమబెంగాల్లో..: వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్ పీఠంపై ‘దీదీ’మమత బెనర్జీనే కూర్చోనుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, గతంలో కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 146 నుంచి 162 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాలతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్లో మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2016 ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 నుంచి 115 స్థానాలను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ తేల్చింది. కాగా, కాంగ్రెస్–వామపక్షం–ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోదని, ఆ కూటమికి 29 నుంచి 37 సీట్లు రావచ్చని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తేల్చింది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీఎంసీకి 42.2%, బీజేపీకి 37.5%, కాంగ్రెస్ కూటమికి 14.8% ఓట్లు వస్తాయంది. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 10.2% ఓట్లు సాధించిన విషయం గమనార్హం. తమిళనాడులో..: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. ఈ కూటమి 158 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోవైపు, అన్నాడీఎంకే – బీజేపీల ఎన్డీఏ 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని వెల్లడించింది. యూపీఏ 43.2%, ఎన్డీఏ 32.1% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో యూపీఏ 98 సీట్లలో, ఎన్డీఏ 136 సీట్లలో గెలుపొందాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కు మెజారిటీ ప్రజలు ఓటేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో స్టాలిన్‌ను 38.4%, పళనిసామిని 31%, కమల్‌హాసన్‌ను 7.4%, రజనీకాంత్‌ను 4.3%, పన్నీరుసెల్వంను 2.6%, శశికళను 3.9% మంది ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగాలేదని 53.26% ప్రజలు అభిప్రాయపడగా, 34.35% సంతృప్తి వ్యక్తం చేశారు. అస్సాంలో..: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్వల్ప మెజారిటీతో అధికారం నిలుపుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ల కారణంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగినప్పటికీ కొద్ది మెజారిటీతో ఎన్డీఏ గట్టెక్కుతుందని అంచనావేసింది. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 67 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 57 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. 2016 ఎన్నికల్లో ఎన్డీఏ 74, యూపీఏ 39 సీట్లు గెలుచుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 42.29% ఎన్డీఏకు, 40.7% యూపీఏకు ఓటేస్తామన్నారని వెల్లడించింది. సీఏఏ, ఎన్ఆర్సీల కారణంగా యూపీఏ గణనీయంగా లాభపడిందని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్‌కు 45.2% మద్దతు పలికారు. రెండో స్థానంలో కాంగ్రెస్ నేత సౌరవ్ గొగోయి ఉన్నారు. కాగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరుపై దాదాపు 70% సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కేరళలో..: కేరళలో వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. మొత్తం 140 సీట్లకు గానూ అధికార ఎల్డీఎఫ్ 82 సీట్లను, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ 56 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఎల్డీఎఫ్ 42.9%, యూడీఎఫ్ 37.6% ఓట్లను సాధిస్తాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 91, యూడీఎఫ్ 47 సీట్లను గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌పై 42.34% పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారిలో 55.84% కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలపడం విశేషం. ప్రధానిగా మోదీకి వారిలో 31.95% మాత్రమే మద్దతిచ్చారు. పుదుచ్చేరిలో..: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే వెల్లడించింది. మొత్తం 30 స్థానాలకు గానూ 18 స్థానాలను ఎన్డీఏ గెల్చుకుంటుందని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45.8%, యూపీఏకు 37.6% ఓట్లు వస్తాయని తెలిపింది. 2016లో కాంగ్రెస్ – డీఎంకేల కూటమి 17 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 12 సీట్లు గెలుచుకుంది. -
కాంగ్రెస్‌కు కఠిన పరీక్ష
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వ్యతిరేకత, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు తెస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేరళను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. పశ్చిమబెంగాల్లో కొత్తగా ఏర్పడిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కాంగ్రెస్– వామపక్షాల కూటమి సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. అస్సాంలోనూ బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఏఐడీయూఎఫ్‌తో కాంగ్రెస్‌కు ఇంకా ఒప్పందం కుదరలేదు. తమిళనాడులో ప్రధాన పక్షం డీఎంకేపైనే కాంగ్రెస్ ఆధారపడి ఉంది. 50 స్థానాలు కావాలని కాంగ్రెస్ డీఎంకేను డిమాండ్ చేస్తోంది. అయితే, అందుకు డీఎంకే సిద్ధంగా లేదు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను, 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరును డీఎంకే గుర్తు చేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2016లో 41 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 8 చోట్లే గెలుపొందింది. పుదుచ్చేరిలో తాజా సంక్షోభం కారణంగా కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ గెలుపొందడం అవసరమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జమ్మూలో శనివారం సమావేశమైన అసమ్మతి నేతలు పార్టీ బలహీన పడుతోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ, తమిళనాడుల్లో మిత్రపక్షాలతో కలిసి గెలిచే అవకాశముందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అస్సాంలోనూ గెలుపునకు అవకాశాలున్నాయని, అయితే, తరుణ్ గొగోయి వంటి సీనియర్ నేత లేకపోవడం లోటుగా మారిందని భావిస్తున్నారు. బెంగాల్లో ప్రధానంగా టీఎంసీ, బీజేపీ మధ్యనే పోరు ఉంటుందని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్– లెఫ్ట్ కూటమికి ఆశలు లేవని విశ్లేషిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి కేవలం 15% ఓట్లు సాధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రారంభించగా, నేటి నుంచి ఆయన సోదరి ప్రియాంక ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. -
ఆపరేషన్ బెంగాల్.. అంత ఈజీ కాదు!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విలక్షణమైన పోటీకి సంబంధించిన ప్రచార దృశ్యాలు బయటికొస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం సన్నాహకాలు మాత్రమే. ఎందుకంటే ఇప్పటివరకు రోడ్ షోలు, ర్యాలీలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇంట్లో భోజనం చేయడం వంటి ఎన్నికల స్టంట్స్ చేసినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార టీఎంసీని గద్దె దింపాలని ఉవ్విళూరుతున్న కమలదళం ఆశలు అనుకున్నంత సులువుగా సాధ్యమయ్యే పరిస్థితులు బెంగాల్ రాజకీయాల్లో కనిపించట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న మాటల యుద్ధం, పోటాపోటీ దాడులు చూస్తుంటే బెంగాల్ బరిలో నిజమైన రాజకీయ యుద్ధం ప్రారంభం అయినట్లుగా అనిపించట్లేదు. సాక్షి, కోల్‌కతా: టీఎంసీని దెబ్బతీసేందుకు తూర్పు మిడ్నాపూర్ భూమిపుత్రుడైన సువేందు అధికారిని తమ జట్టులో చేర్చుకున్న కమలదళం, తమ బలాన్ని మరింత పెంచుకొనేందుకు పెద్ద సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తమవైపు తిప్పుకున్నప్పుడే సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఏమేరకు పొందగలుగుతుందన్న దానిపై ఇప్పుడు జరుగబోయే ఎన్నికలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇన్నేళ్ళుగా నామమాత్రంగా ఉనికిని చాటుకున్న బీజేపీ, అక్కడ ఉన్న సాంస్కృతిక వైరుధ్యాన్ని తట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ స్థానిక పరిస్థితులను ఎంతవరకు తట్టుకొని ఓటర్లను తమవైపు తిప్పుకోగలదనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంస్థాగతపరంగా బీజేపీలో ఉన్న ఖాళీలను ఇప్పుడు టీఎంసీ సహా ఇతర పార్టీల నుంచి తరలివస్తున్న నాయకులతో భర్తీ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా జాతీయస్థాయి నాయకత్వానికి కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ వర్క్ కల్చర్‌కు ఇంత తక్కువ సమయంలో ఆ నాయకులు ఏ విధంగా సర్దుకొని ముందుకు వెళ్ళగలుగుతారనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే టీఎంసీ వంటి పార్టీలో క్రమశిక్షణ అనేది ఏరకంగా ఉంటుందనేది జగమెరిగిన విషయం. అంతేగాక ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులకు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులకు మధ్య ఉండే అంతరాలను ఏమేరకు సర్దుబాటు చేయగలుగుతారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. అయితే టీఎంసీ నుంచి వస్తున్న నాయకుల కారణంగా పార్టీకి రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 200కు పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కమలదళానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలుస్తారనే 294 మంది అభ్యర్థులు కూడా లేరనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో గెలుపు గుర్రాలపై ఆశలతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో బీజేపీ టీఎంసీ బీ టీంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గెలుపు సులువేం కాదు బెంగాల్లో గెలవాలని తొందరపడుతున్న బీజేపీ, ఎన్నికల సమయంలో ఒక్కటొక్కటిగా సవాళ్ళను ఏరకంగా ఎదుర్కుంటుందనేది ఒక సమస్యగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 40.3 శాతం ఓట్లతో 18 లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి, బెంగాల్లో గెలుపు అనేది సునాయాసంగా కనిపిస్తుండవచ్చు కానీ, అది అంత సులువు కాదనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎంతో కీలకమైన సీఎఎ, ఎన్ఆర్సీ అమలు అంశాలను గతేడాది డిసెంబర్ 20న, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేంద్ర హోంమంత్రి కోల్డ్ స్టోరేజ్‌లోకి పంపారు. దీని ప్రభావం ఏమేరకు బీజేపీపై ఉంటుందనే అంశంపై చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మమతా బెనర్జీకి ఎంత కీలకమో, బీజేపీకి కూడా అంతే కీలకం. ఒకవేళ బెంగాల్లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేస్తే దేశవ్యాప్తంగా తమ ఇమేజ్ను పునరుద్ధరించుకొనేందుకు, తమ సత్తా ఏంటో చూపించుకొనేందుకు ఇదొక మంచి అవకాశంగా కమలదళం భావిస్తోంది. అయితే గత కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చివరి వరకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీని వద్దనుకొని ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలో మెజారిటీ సాధించకపోవడంతో, ఇతర పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వచ్చింది. రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్‌ను గద్దె దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కాస్తా ఫెయిల్ అయింది. కమలదళం ప్లాన్స్ సక్సెస్ కాలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య, ఆర్థిక ఒడిదుడుకులు, ప్రగతి మందగించడం, సుమారు రెండు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం వంటి అనేక అంశాలు బీజేపీకి రాజకీయ సవాళ్లుగా మారాయి. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్ వంటి రాష్ట్రంలో 294 సీట్లలో 200 సీట్లు గెలుచుకోవాలనే బీజేపీ లక్ష్యం కాస్త కఠినమైనదే. ఇటీవల విడుదలైన ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సైతం మమతాబెనర్జీ కాషాయదళానికి కషాయం తాగించడం ఖాయమనే ప్రకటించింది. అయితే మమతా బెనర్జీని గద్దెదింపే లక్ష్యంతో శాయశక్తులు ఒడ్డి పనిచేస్తున్న కమలదళం, అన్ని అడ్డంకులను తట్టుకొని ఏమేరకు విజయం సాధిస్తుందనేది వారి రాజకీయ ఎత్తుగడలే నిర్ణయిస్తాయి. మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు కీలక నాయకులు పార్టీని వదిలి వెళుతున్న సమయంలో కార్యకర్తల్లో ఎలాంటి నిత్సేజం రాకుండా ఉండేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు వేగవంతం చేశారు. తూర్పు మిడ్నాపూర్ నుంచి సువేంధు అధికారి బీజేపీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కాపాడుకొనేందుకు అతని ప్రత్యర్థి అఖిల్ గిరిని తెరపైకి తేవడమేకాకుండా, అతనికి జిల్లా బాధ్యతలను అప్పగించి తమ దగ్గర ప్రత్యామ్నాయ నాయకుల కొరత ఏమాత్రంలేదని మమతా బెనర్జీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. అంతేగాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నుంచి బరిలో దిగేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే నందిగ్రామ్‌తోనే సాధ్యమని దీదీ అర్థం చేసుకున్నారు. మరోవైపు కొందరు టీఎంసీ నాయకులు తమకు అనుకూలంగా పార్టీ కార్యక్రమాలను మార్చుకోవడంతో పార్టీ నాయకత్వం అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిగా బలపడలేదనే విషయానికి ఇలాంటి ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అయితే పార్టీలోకి వచ్చే ప్రతీ నాయకుడికి పనిచేసేందుకు తగినంత అవకాశమిస్తామని, బీజేపీ కోసం పనిచేసేందుకు వచ్చే నాయకులు ఒక నిర్ణయం తీసుకొని పని ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవల చేసిన ప్రకటన పార్టీ తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. ఒకవేళ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు పునరావృతం అయితే కొత్తగా చేరిన వారిని సైతం తొలగించే ప్రక్రియ జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి ఇలాంటి క్రమశిక్షణ లోపించిన చర్యలను భరించాల్సిన గత్యంతరం తప్ప వేరే అవకాశం ఏదీ లేదనేది స్పష్టమౌతోంది. అలాంటి నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం మాత్రం అసాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు ఇతర రాజకీయపార్టీల్లో అసంతృప్త నాయకులకు బీజేపీలో చేరడం అనేది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. -
బీజేపీ వ్యూహం.. మమతకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా ఎంతో రసవత్తరంగా మారిన పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును దాదాపు పూర్తిచేసింది. ఈ ఏడాది మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అనుకున్న సమయాని కంటే ముందే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేగాక బెంగాల్ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు, కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో జరిగే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 30 తేదీతో ముగియనుంది. 2018లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ హింస అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ప్రత్యర్థులపై రాళ్లు విసరడం వంటివి తరుచూ జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు కూడా ఈసారి ఎన్నికల్లో భారీ హింస జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. హింసకు తోడు, ఈసారి కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. అదనపు పోలింగ్ బూత్‌లు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం సుమారు 28 వేల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లోని పరిస్థితులపై ఎన్నికల సంఘం స్థానిక అధికారుల నుంచి నివేదిక తీసుకోనుంది. గతేడాది జరిగిన బిహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 ప్రోటోకాల్స్ అమలు చేశారు. ఓటర్ల మధ్య భౌతిక దూరం కొనసాగించడానికి పశ్చిమ బెంగాల్లోనూ అదనపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హింసను కట్టడి చేసేందుకు కేంద్ర పోలీసు బలగాలను వెంటనే మోహరించాలని, వీలైనంత త్వరగా ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తేవాలని గత డిసెంబర్లో బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కోరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్! అంతకుముందు పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. అప్పుడు మే 19 తేదీ వరకు ఏడు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి 45 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈసారి సీబీఎస్ఈ పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మార్చి నెల రెండో వారం నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 15న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. -
వారికి అవినీతిపై మాట్లాడే అర్హత లేదు
చెన్నై: కాంగ్రెస్, డీఎంకేలకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వారి హయాంలోనే భారీ 2జీ కుంభకోణం చోటు చేసుకుందని గుర్తు చేశారు. తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ శక్తుల విజయం తథ్యమన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు అపజయం పాలయ్యాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికన్నా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించామన్నారు. ‘2013–14 బడ్జెట్లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం తమిళనాడుకు రూ. 16,155 కోట్లు కేటాయించగా.. మా తాజా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించింది రూ. 32,850 కోట్లు’ అని వివరించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంలో కోవిడ్–19పై దేశం గొప్పగా పోరాడుతోందన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్ కరోనాను సమర్ధంగా ఎదుర్కొందన్నారు. కరోనాపై పోరులో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావడమే అందుకు కారణమన్నారు. ఈ సందర్భంగా, చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 380 కోట్లతో నిర్మించిన ‘తెరవైకందిగై’ రిజర్వాయర్‌ను అమిత్ షా జాతికి అంకితం ఇచ్చారు. అలాగే, సుమారు రూ. 67 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే నేత పళని సామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తదితర నేతలు పాల్గొన్నారు. 2021 ఏప్రిల్– మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ– అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని పళని సామి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి బస చేసిన హోటల్‌కు వెళ్లే దారిలో ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. అమిత్ షా వాహనం దిగి, రోడ్డుపై నడుస్తూ అక్కడ గుమికూడిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. సంబంధిత వీడియోను జతపర్చి.. ‘తమిళనాడులో ఉండటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. చెన్నై చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’ అని షా ట్వీట్ చేశారు. సీఎం పళని సామి, డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం నాయకత్వంలో కరోనాపై పోరులో తమిళనాడు సమర్ధంగా వ్యవహరిస్తోందని ప్రశంసిం చారు, ఇక్కడ కోవిడ్–19 నుంచి కోలుకున్న వారు 97% ఉన్నారన్నారు. డీఎంకేపై విమర్శలు యూపీఏ పదేళ్ల పాలనలో డీఎంకే తమిళనాడుకు ఏం చేసిందో చెప్పాలని, అవసరమైతే దానిపై చర్చకు సిద్ధమని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, కులం వంటి అంశాలపై ప్రధాని మోదీ యుద్ధం ప్రారంభించారని అన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చాలా రాష్ట్రాల్లో వంశపారంపర్య పార్టీలు ఓటమిపాలయ్యాయని ఇప్పుడు తమిళనాడు వంతు వచ్చిందని అన్నారు. -
డీఎంకేకి షాక్.. అమిత్ షా- అళగిరిల భేటీ?!
చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట తన వ్యూహాలను సైలెంట్‌గా అమలు చేస్తోంది. ఈ క్రమంలో డీఎంకేకు చెక్ పెట్లేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా అళగిరి విశ్వాసపాత్రుడు కేపీ రామలింగం నేడు తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురగన్‌ని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భవంగా చెన్నైలో ఆయనతో భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్న అళగిరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏడాది విరామం తర్వాత రాష్ట్రానికి వస్తోన్న అమిత్ షా తమిళనాట పార్టీని బలోపేతం చేసే నిర్ణయాల గురించి క్యాడర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే పర్యటనలో భాగంగా అమిత్ షా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అవుతారని తెలిసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారా లేదా అనే గందరగోళం తలెత్తిన నేపథ్యంలో రజనీ-అమిత్ షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. అలానే అమిత్ షా-అళగిరిల భేటీ కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ ఎల్ మురగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్ షా రజనీకాంత్‌ని కలవరని నేను చెప్పలేను’ అంటూ పరోక్షంగా రజనీ-షాల మీటింగ్ గురించి హింట్ ఇచ్చారు. అంతేకాక ‘అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే దాని గురించి తమకు అధికారిక సమాచారం లేదని.. ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని’ తెలిపారు. (డీఎంకేతో పొత్తు.. కమల్ క్లారిటీ) కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం: అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే వార్తల్ని అళగిరి ఖండిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్ మురగన్ చేసిన వ్యాఖ్యలు విన్నాను. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నా మద్దతుదారులతో చర్చించిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. 2021 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించలేదు. అవన్ని పుకార్లు’ అంటూ కొట్టి పారేశారు. ‘పార్టీ వ్యతిరేక’ కార్యకలాపాల ఆరోపణలతో అళగిరిని 2016 లో డీఎంకే నుంచి బహిష్కరించారు. కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతరం అళగిరిపై వేటు వేశారు. 2018 లో కరుణానిధి మరణించిన వారం తరువాత, అళగిరి తన సోదరుడికి డీఎంకే కార్యకర్తలు తనతో ఉన్నారని బహిరంగంగా సవాలు చేశారు. -
ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహా కూటమితో పొత్తు అనంతరం తమ పార్టీ నుంచి మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తొలి దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన జాబితాను మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విడుదల చేసింది. ఈ లిస్టులో అత్యాచార ఆరోపణలు ఎదర్కొంటున్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లను ఆర్జేడీ నిరాకరించింది. వారి స్థానంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారి భార్యలను నామినేట్ చేసింది. చదవండి : బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్ మైనర్ బాలికపై అఘాయిత్సానికి పాల్పడిన నేరంలో రాజ్ బల్లాబ్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉండటంతో ఆయన భార్య విభ దేవి.. నావాడా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. మరో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ యాదవ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉండి సంవత్సరం నుంచి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి కిరణ్ దేవి భోజ్‌పూర్ జిల్లాలోని సందేశ్ అసెంట్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మహా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతుంది. చదవండి : సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ -
ప్రశాంత్ కిషోర్‌తో మరో సీఎం ఒప్పందం!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల రంగంలోకి దిగేందుకు హస్తం పార్టీ సమయాత్తమవుతోంది. దీనిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చోవాలని సీఎం నిర్ణయించారు. మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపల్పన వంటి అంశాలపై చర్చించాలని ప్రణాళికలు రచించారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్ శాసనసభ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, శిరోమణీ అకలీదళ్, ఆమ్ఆద్మీ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. దశాబ్ధాలుగా బీజేపీతో ఉన్న స్నేహనికి అకాలీదళ్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సుఖ్బీర్సింగ్ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రశాంత్ సేవలను ఉపయోగించుకోవాలని అమరీందర్ సింగ్ ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రశాంత్ కృషి చేసిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ఫలితాలనే పునరావృత్తం చేయాలనుకుంటున్న కెప్టెన్.. వ్యూహకర్తతో ఒప్పందానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రతిపాదనకు ప్రశాంత్ ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఇరు వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా సునీల్) గతంలో అనేక మందికి వ్యూహకర్తగా వ్యహరించి విజయాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో జట్టు కట్టేందుకు ప్రశాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో ప్రశాంత్ ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరంద్రే మోదీని అద్భుతమైన విజయాన్ని అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. -
సరికొత్త బిహార్‌లో నితీశ్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుపరిపాలనపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సుపరిపాలన మరో అయిదేళ్ల పాటు కొనసాగాలన్నారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలతో ఎంత లబ్ధి చేకూరుతుందో గత 15 ఏళ్లుగా బిహార్‌వాసులకి తెలుస్తోందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజ్టెల్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పారాదీప్–హల్దియా–దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఆ రాష్ట్ర ఎన్డీయే కూటమిలో చీలికలు వస్తున్నాయన్న ఊహాగా నాలకు తన ప్రసంగం ద్వారా చెక్ పెట్టారు. -
కలిసే పోటీచేస్తాం: జేపీ నడ్డా
పట్నా: రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల ఒప్పందంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకంపై చర్చించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నితీష్ కుమార్ నాయకత్వంలో ఐక్యంగా ఎదుర్కొంటామని, భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామని ప్రకాష్ నడ్డా తేల్చి చెప్పారు. ఇటీవల రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ, జేడీయూపై వివిధ అంశాలపై తీవ్రంగా విభేదిస్తూ, జేడీయూతో కలిసి పోటీచేయలేమని ప్రకటించింది. ఎల్జేపీతో, జేడీయూకి తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ చొరవ తీసుకుంటుందని నితీష్ కుమార్‌కి హామీయిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటించనుంది. లాలూతో జార్ఖండ్ సీఎం హేమంత్ భేటీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో రాంచీలో భేటీ అయ్యారు. రానున్న బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో జేఎంఎం 12 స్థానాలను డిమాండ్ చేయగా, ఆర్జేడీ దాదాపు 3 సీట్లే ఇవ్వగలమని చెప్పినట్లు తెలుస్తోంది. -
సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్: జేపీ నడ్డా
పాట్నా: బీహార్‌లో బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీలు కలిసి కూటమిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఓ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ.. తమ కూటమి సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని, అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రతిపక్ష పార్టీల పాత్ర నామమాత్రమని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం లేదని, కేవలం అవకాశవాద రాజకీయాలు చేయడానికి పరిమితమయ్యాయని విమర్శించారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు, చిరాగ్ పాశ్వార్ నేతృత్వంలోని ఎల్జేపీకి మధ్య కొద్దికాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, బీజేపీ మాత్రం రెండు భాగస్వామ్య పార్టీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమారే ఉంటారని స్పష్టం చేసింది. -
బిహార్ ఎన్నికల్లో మాదే గెలుపు
ఢిల్లీ/పట్నా: జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పాలనలో బిహార్ రాష్ట్రం జంగిల్‌రాజ్ నుంచి జనతారాజ్ వైపు పయనిస్తోందని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్‌షా ఆదివారం వర్చువల్ ర్యాలీలో బిహార్ ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) హయాంలో బిహార్‌లో వృద్ధిరేటు కేవలం 3.9 శాతం ఉండేదని, ప్రస్తుతం ఎన్డీయే పాలనలో అది 11.3 శాతానికి పెరిగిందని తెలిపారు. బిహార్ లాంతరు రాజ్యం(ఆర్జేడీ గుర్తు లాంతరు) నుంచి ఎల్ఈడీ రాజ్‌గా ఎదుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వర్చువల్ ర్యాలీ చేపట్టడం లేదని, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రారంభించామని అమిత్ షా చెప్పారు. ఇలాంటివి 75 కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బిహార్ సంక్షేమం కోసం సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కష్టపడి పనిచేస్తున్నారని, అయినా వారు ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదని కొనియాడారు. అమిత్‌షా వర్చువల్ ర్యాలీని వ్యతిరేకిస్తూ బిహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల గిన్నెలు, పళ్లాలు మోగిస్తూ చప్పుళ్లు చేశారు. శంఖాలు ఊదారు. -
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
కమల దళంలో కలవరం!
‘బీజేపీ హఠావో– భారత్ బచావో‘ నినాదం రోజురోజుకు బలపడుతోంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కలవరం మొదలైంది. జార్ఖండ్ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పునిచ్చారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్–జే.ఎన్.ఏం కూటమిని గెలి పించారు. జార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలుండగా, కాంగ్రెస్–జె.ఎన్.ఎం (యూపీఏ) కూటమి 48 స్థానాలలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయింది. మోదీ 9 ఎన్నికల సభల్లో ప్రసంగించగా కేవలం 3 చోట్ల మాత్రమే బీజేపీ గట్టెక్కింది. దీంతో ఏడాది కాలంలో వరుసగా 5 రాష్ట్రలలో బీజేపీ అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లలో ప్రజలు బీజేపీని ఇంటికి పంపించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను, బీజేపీ దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే దురుద్దేశంతో తీసుకున్న ఎన్.ఆర్.సి. నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా చూడాలి. భారత రాజ్యాంగ పునాదులను, విలువలను పెకలించేలా, దేశ ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ–షా ద్వయం పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేస్తా మని కలలు కన్న బీజేపీ అధిష్టానానికి, ప్రజలు తమ పార్టీనే వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సాగనంపుతుంటే తల బొప్పి కడుతోంది. 2019లో దేశ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, మెజారిటీ ఉన్నది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో బీజేపీ అనేక ప్రజావ్యతిరేక చట్టాలు తెస్తోంది. కానీ తాము తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, సరైన సమ యంలో, సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆలోచనే బీజేపీకి లేదు. దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద నిర్ణయాలతో మోదీ–షాలు కాలం వెళ్లదీస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కశ్మీర్ నిర్బంధం, సమాచార హక్కు చట్టానికి కోరలు పీకే సవరణలు లాంటి నిర్ణయాలు బీజేపీ అప్రజాస్వామిక పోకడలకు తార్కాణాలు. ఇపుడు, మైనార్టీ వర్గాలను ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. ఈ చట్టం అమలు విషయమై మోదీ–అమిత్ షా ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టా లని చూస్తున్నారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాసే ఈ పౌర చట్టం అమలును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్‌ఘాట్ వేదికగా సత్యాగ్రహం చేపట్టింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. మోదీ–అమిత్ షా ధ్వయానికి అసలు సవాల్ ముందుంది. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కమల దళంలో కలవరపాటు పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మినహా చెప్పుకోదగ్గ పెద్ద రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో లేని బీజేపీకి ఈ ఎన్నికలు కత్తిమీద సాము లాంటివి. జార్ఖండ్ ఎన్నికల్లో లెక్కచేయని బీజే పీతో, బీహార్ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసే విషయమై జేడీయూపార్టీ పునరాలోచనలో పడింది. బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయటానికి బీజేపీ ఎన్ని అల్లర్లు సృష్టించినా అక్కడి ప్రజలు తిప్పికొడుతున్నారు. దీనికి తోడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఇదే ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే, 2020 నాటికి ‘బీజేపీ ముక్త్ భారత్‘ ఖాయంగా కనిపిస్తోంది. కొనగాల మహేష్ వ్యాసకర్త జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
బీజేపీ ప్రాభవం తగ్గుతోంది!
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి తాజాగా జార్ఖండ్ కూడా జారిపోయింది. 2017లో దేశ భూభాగంలోని 71%లో బీజేపీ ఆధికారంలో ఉంది. ఇప్పుడు 2019 డిసెంబర్ నాటికి అది 35 శాతానికి తగ్గిపోయింది. జనాభా విషయానికి వస్తే నాడు 69% జనాభా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండగా, అదిప్పుడు 43 శాతానికి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. త్వరలో ఢిల్లీ, బిహార్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పరంపర 2018 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ఓటమి నుంచి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పట్టున్న సామాజిక వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నేతలను ప్రోత్సహించే విధానాన్ని బీజేపీ వదలాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హరియాణాలో జాట్, మహారాష్ట్రలో మరాఠా, జార్ఖండ్‌లో గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హరియాణా, మహారాష్ట్రల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. తక్కువ సీట్లనే గెలుచుకుంది. హరియాణాలో జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేనతో విభేదాల కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా, జార్ఖండ్‌లో అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం కూడా.. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంతో పోలిస్తే బాగా తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ఓటు శాతం 55 కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 33 శాతానికి తగ్గింది. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం 58 కాగా, అది శాసనసభ ఎన్నికల నాటికి 36 శాతానికి తగ్గింది. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిరం.. తదితర సైద్ధాంతిక హామీలను నెరవేర్చినప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం గమనార్హం. -
జార్ఖండ్‌లో 63.36% పోలింగ్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. -
ఒక్కోపార్టీకి 125 సీట్లు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య సీట్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో 125 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మరో 38 స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున కొత్త వ్యక్తులు ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య పలు స్థానాల్లో సీట్ల మార్పు కూడా ఉంటుందని తెలిపారు. -
బీజేపీ కొత్త ఎన్నికల ఇన్చార్జులు
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్రల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జులను బీజేపీ నియమించింది. ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మహారాష్ట్రకు పార్టీ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌ను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఈ ఏడాది చివరలో, ఢిల్లీలో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మినహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, వాటిని నిలబెట్టుకోవడమే కాకుండా, ఢిల్లీలో పార్టీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో పార్టీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జులుగా నియమించింది. -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు.