
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్‌చార్జి శేఖర్‌తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం.
అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment