Konaseema District
-
కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడిగంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
రిబ్బన్ కటింగ్‌కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలంలో క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడోత్సవాల కోసం అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. స్కూల్ మేనేజజ్మెంట్ కమిటీకి కనీసం హెచ్ఎంకు కూడా భాగస్వాము లేకుండా క్రీడోత్సవాలు ఏర్పాటు చేయటంపై ఆయన మండిపడ్డారు.కనీసం స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు, రిబ్బన్ కటింగ్‌కి కత్తెర కూడా సకాలంలో అందచేయలేకపోవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు చెబితే క్రీడోత్సవాల ఏర్పాట్లు తామే చేసుకుంటామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎంఈవోలను కూటమి నేతలు నిలదీశారు. దీంతో తూతూ మంత్రంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి అలిగి వెళ్లిపోయారు. -
రాష్ట్ర పండగగా ప్రభల తీర్థం
అంబాజీపేట: మండలంలోని జగ్గన్నతోటలో ఏటా సంక్రాంతికి నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని ఏకాదశ రుద్రాలయాల అర్చకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్టు నిర్వాహకులు తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని వారు కోరారు. వ్యాఘ్రేశ్వరం (బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి), కె.పెదపూడి (పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి), ఇరుసుమండ (బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి), వక్కలంక (అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి), నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత రాఘవేశ్వర స్వామి), మొసలపల్లి (బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి), పాలగుమ్మి (శ్యామలాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామి), గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి), గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి), పుల్లేటికుర్రు (బాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు) జగ్గన్నతోటలో కనుమ రోజున కొలువుదీరుతారు. ఈ తీర్థానికి జాతీయస్థాయి గుర్తింపు రావడంతో 2020లో ఈ ఉత్సవానికి సంబంధించి ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులకు లేఖ రాశారు. అలాగే శృంగేరి పీఠాధిపతులు మరొక లేఖను పంపించారు. రెండేళ్ల క్రితం శివకేశవ యూత్ సభ్యులు, ప్రభల నిర్వాహకులు జగన్నతోట ప్రభల తీర్ధ విశిష్టతను కేంద్ర, రాష్ట్రాలకు లేఖ ద్వారా వివరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలలో ప్రభలతీర్థాన్ని కళాజాతను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏకాదశ రుద్ర ఆలయాలకు నిధులు మంజూరు చేసి ఈ తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించాలని వారు కోరుతున్నారు. -
AP: జనసేన నేత రేవ్ పార్టీ.. యువతులతో అసభ్యకర డ్యాన్స్!
సాక్షి, కోనసీమ: న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన నేతలు రెచ్చిపోయారు. వేడుకల కోసం జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ అర్థరాత్రి హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన రేవ్ పార్టీ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. గొల్లపుంత రోడ్లో ఉన్న బుద్ధా స్టాచ్యూ ఓం సిటీ లేఅవుట్లో రేవ్ పార్టీ జరిపారు. సమాజం తలదించుకునేలా అసభ్యకర నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ రేవ్ పార్టీకి జనసేన నాయకులు సహా మరికొందరు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీలో జనసేన నాయకుడు సహా అక్కడున్న వారంతా హంగామా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై ఆరాతీసిన పోలీసులు.. జనసేన నాయకుడితో సహా నలుగురిపై మండపేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అయితే, జనసేన నేతలపై కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులకు హెచ్చరికలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. -
అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి?
సాక్షి, అమలాపురం: హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని అరెస్ట్ చేస్తే.. గత గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మందికి చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. అమలాపురంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ దుర్ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసి, అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు.నాడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదుఅమలాపురం టౌన్: రాజమహేంద్రవరంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని, నాడు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రశ్నించారు. తొక్కిసలాట, మృతి కారణంగా ఇప్పుడు సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. అమలాపురంలో ఆయన శుక్రవారం రాత్రి స్థానిక మీడియాతో మాట్లాడారు. నాడు పుష్కరాల్లో జరిగిన ఘోరానికి చంద్రబాబును అరెస్ట్ చేయనప్పుడు.. ఇప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తప్పే అవుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ‘ఎన్నో తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందరో చనిపోతూంటారు. అలాంటిచోట్లకు వెళ్లిన లెజెండ్లను అలా చేయమని ఎవరూ చెప్పరు. యాదృచ్ఛికంగా జరిగిన తొక్కిసలాటలకు వారిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. పైపెచ్చు ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి అరెస్టులను, ఘటనలను ప్రజలు సమర్థించరని హర్షకుమార్ స్పష్టం చేశారు.నేషనల్ రోలర్ స్కేటింగ్‌లో ప్రతిభఅంబాజీపేట: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఇసుకపూడి శివారు పెండిపేటకు చెందిన కుంచే హన్షిత్ సిల్వర్ మెడల్ సాధించాడు. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్– 2024 పోటీలు నిర్వహించారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు బాలుర విభాగంలో హన్షిత్ పాల్గొని సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు కుంచే రమేష్, శ్వేత శుక్రవారం చెప్పారు. ఇప్పటి వరకూ హన్షిత్ పలు పతకాలు సాధించాడు. 2024లో రాయపూర్‌లో జరిగిన ఆరేళ్ల గ్రూప్ ఓపెన్ నేషనల్స్‌లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, అక్టోబర్‌లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓపెన్ నేషనల్స్‌లో సిల్వర్ మెడల్, జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, నవంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. చిన్న వయసులోనే తమ కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.16న జాబ్మేళాకాకినాడ సిటీ: కలెక్టరేట్లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టారస్ కంపెనీలో బీపీఓ, వరుణ్ మోటార్స్‌లో టీమ్ లీడర్, ఎగ్జిక్యూటివ్ సేల్స్, అడ్వైజర్, పెయింటర్ అండ్ డెంటర్, రిలయన్స్ ట్రెండ్స్‌లో రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇండో ఎంఐఎం, హోండాస్ మోబీస్, పానసోనిక్ అండ్ కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు. -
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం
-
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం
సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్‌వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.మెడికల్ ఆఫీసర్లను డీఎంహెచ్‌వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికిరావడంతో బంధువుల షాక్..
-
రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఆర్‌ఏడీ యాప్
అమలాపురం టౌన్: తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అందుకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా (ఐఆర్‌ఏడీ) యాప్‌ను రూపొందించి దాని అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసు శాఖ ఈ యాప్‌ను వినియోగించే విధానాలపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకూ ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తోంది. ఎస్పీ బి.కృష్ణారావు ఈ నెల 16న యాప్‌ను ప్రారంభించారు. ఐఆర్ఏ డేట్ బేస్ నమోదు గురించి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు స్టేషన్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐఆర్‌ఏడీ రోల్ అవుట్ మేనేజర్ జీవీ రామారావు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్బీ) సీఐ వి.శ్రీనివాసరావుల ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షించారు.రోడ్డు ప్రమాదాల స్పాట్లను గుర్తించేది ఇలా..ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్ దర్యాప్తు అధికారి (ఐవో) వెళ్లి అక్కడ ఐఆర్‌ఏడీ యాప్ ద్వారా ప్రమాద సమాచారాన్ని నమోదు చేయాలి. ఇదే స్పాట్లో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయా? లేదా? అనే అంశంపై ఆ అధికారి అక్కడే అధ్యయనం చేస్తారు. ఒకవేళ అదే స్పాట్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటే ఆ విషయాన్ని యాప్‌లో నమోదు చేయాలి. ఈ సమాచారాన్ని ఇటు ఎస్పీ కార్యాలయానికి, అటు రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి యాప్ ద్వారా పంపించాలి. యాప్‌లో రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేస్తూనే అక్కడ ఇక ముందు రోడ్డు ప్రమాదాల జరగకుండా సూచనలు, జాగ్రత్తలతో అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడతారు. వాహనాల డ్రైవర్లకు తెలిసేలా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేస్తారు.అవగాహన పెంచాలికొత్తగా వచ్చిన ఐఆర్‌ఏడీ యాప్‌పై పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయి అవగాహనతో ఉండడమే కాకుండా వాహన చోదకులకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఎస్పీ కృష్ణారావు యాప్ శిక్షణ తరగతుల్లో సూచించారు. వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, సీటు బెల్ట్‌లు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా, పరధ్యానంగా నడపకుండా డ్రైవింగ్ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో వాహన చోదకులకు పోలీసు అధికారులు తరుచూ కౌన్సెలింగ్ ద్వారా తెలియజేయాలన్నారు. లైసెన్స్‌ను లేకుండా టీనేజ్ పిల్లలకు మోటారు సైకిళ్లు నడిపే అధికారం లేదని, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభిస్తుందో, ఎంతటి నష్టం చేకూరుతుందో డ్రైవింగ్ చేసే వ్యక్తులకు కనువిప్పు కలిగేలా వివరించాలని ఎస్పీ కృష్ణారావు జిల్లా పోలీస్ సిబ్బందికి సూచించారు. -
మహాసేన రాజేష్‌పై కేసు నమోదు
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్‌పై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌పై కేసు నమోదుచేశారు పోలీసులు. మహాసేన రాజేష్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
చనిపోయినా నలుగురిలో సజీవంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
-
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం
సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోనసీమ జిల్లాలో జాతీయజెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్య్య దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం పంచాయతీలో జాతీయజెండాను టీడీపీ నేతలు తిరగేసి ఆవిష్కరించారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు టీడీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర దినోత్సవం.. ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలకు వారి త్యాగాలకు నిదర్శనం.. అందుకే ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎంతో విశిష్టత కలిగిన మూడు రంగుల జెండా.. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ.. ఐక్య భావానికి, విజయ గీతానికి సూచికగా నిలుస్తోంది. అలాంటి జాతీయ జెండాను టీడీపీ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
రాజమండ్రి : గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
కోనసీమలో భారీ వర్షాలు..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
రెచ్చిపోయిన జనసేన.. అర్ధరాత్రి విధ్వంసం..
-
నేనున్నాను.. అంబులెన్స్‌లో పేషెంట్‌కు సీఎం జగన్ భరోసా
మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం. నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్‌ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌కు మరింత సహాయం కావాలని సీఎం జగన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
TDP సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్‌లెట్‌ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం