Updates..
సీఎం జగన్ ప్రసంగం
►దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం
►అక్క చెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశాం
►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం
►కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది.
►గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.
►బాబు హయాంలో 14వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు.
►మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసింది
►గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం
►1,05,13,365 మంది పొదుపు మహిళలకు లబ్ధి
►రూ.1353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్
►ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం 4969.05 కోట్లు
►పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకూడదు
►మహిళల జీవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు
►మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే
►మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం
►వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు
►చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది
►2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్ధు చేశారు
►అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది.
►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం.
►దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు.
►లబ్దిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధిచేరుకుంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే వాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్క బటన్ నొక్కడంతో నేరుగా మా ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయి. పాదయాత్రలో అక్కచెల్లెలమ్మల బాధ చూసి మీరు మాకోసం ఎంతో చేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం లబ్ధిదారులు ఖండించారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. జగనన్న మా కోసం ఎంతో చేస్తున్నారని తెలిపారు.
► పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫొటో దిగారు.
► స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్. ఈ క్రమంలోనే మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు.
► అమలాపురం చేరుకున్న సీఎం జగన్.
► సాక్షి, అమలాపురం/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటిస్తున్నారు.
► ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు.
► అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు.
► రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది.
► పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్న సంగతి తెలిసిందే.
► ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
► అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది.
► ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లెమ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు.
► ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది.
► కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment