YSR Sunna Vaddi Scheme
-
ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా నిలిచామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెట్టుబడి సాయంతోపాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 64 లక్షల 37 వేల మంది ఖాతాలకు 1,294 కోట్ల రూపాయలు బదిలీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Live: వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం
-
వైయస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు..!
-
AP: పేదరికంపై గెలుపు.. మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు
ఉండటానికి ఇల్లు.. తినటానికి తిండి.. కట్టుకోవటానికి బట్ట... ఈ మూడూ లేక ఇబ్బందులు పడేవారే పేదలన్నది ఒకప్పటి ప్రాతిపదిక. కానీ రోజులు మారాయి. ఈ మూడూ ఉండటమే కాదు... అవి నాణ్యంగా ఉండాలి. నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగించటానికి అవసరమైన సదుపాయాలు వారికి అందుబాటులోకి రావాలి. అదిగో... అప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు. స్థూలంగా చెప్పాలంటే వీటన్నిటినీ సాధించడానికి పేదల ఆదాయాలు పెరగాలి. అలా పెరగటంతో పాటు... భవిష్యత్తుపై భరోసా ఉండేలా వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గృహ వసతితో పాటు తాగునీరు, పౌష్టికాహారం అందటం.. మాతా శిశు మరణాలు తగ్గటం... ఇవన్నీ జరిగితేనే పేదరికం తగ్గినట్లని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. నాణ్యమైన విద్య, వైద్యం అందితే పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొంది. విశేషమేమిటంటే... నవరత్నాలతో పేదలకు అండగా నిలిచి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను పేదలకు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇక్కడ పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో ఏకంగా 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి మాత్రమే పరిమితమయింది. ఇదీ... కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించిన వాస్తవం. ఇదీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన మార్పు. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పథకాల ద్వారా జాతీయ స్థాయిలో 2019–21లో 14.96 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నవరత్నాలతో 2019–21లో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించిందని కూడా తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్.జగన్ సర్కారు డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.4.21 లక్షల కోట్లను సాయంగా అందించటంతో ఎక్కడికక్కడ మహిళలు సైతం తమ కాళ్లపై నిలబడి సొంత వ్యాపారాలు చేసుకోవటం... ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూళ్లకు పంపించటంతో గ్రాస్ ఎన్రోల్మెంట్రేíÙయో ఏకంగా 100 శాతానికి చేరటం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక వివరించింది. 2015–16 సంవత్సరం, 2019–21 సంవత్సరం, 2022–23 సంవత్సరాల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పేదరికం ఎలా తగ్గుతూ వస్తోందనే విషయాన్ని నీతి ఆయోగ్ ఈ నివేదికలో వెల్లడించింది. పౌష్టికాహారం అందుతోందా? శిశు మరణాల రేటు ఎలా ఉంది? తల్లుల ఆరోగ్యం మెరుగుపడిందా? పాఠశాలలకు పిల్లల హాజరు శాతం ఎంత? వంటకు ఏ రకమైన ఇంధనం వినియోగిస్తున్నారు? పరిశుభ్రత పరిస్థితులు, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు చెందిన బహుముఖ సూచికల ఆధారంగా పేదరికం శాతాన్ని నీతి ఆయోగ్ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించటం, పారిశుద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై తీసుకుంటున్న చర్యలు కారణంగా పేదరికం శాతం గణనీయంగా తగ్గిందని నివేదికలో వివరించింది. ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. నిబద్ధతతో వేగంగా అడుగులు... రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోంది. దీంతో పేదరికం శాతం కూడా అదే స్థాయిలో తగ్గుతోంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేయటం... ఇలా పలు కార్యక్రమాలు చేపడుతూ వరుసగా నాలుగేళ్ల పాటు ఫోకస్డ్గా పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అంతే కాకుండా నవరత్నాల్లో ప్రతి పథకాన్నీ పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు రావటానికే అన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంది. పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూనే... ఆ స్కూళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని నాణ్యమైన విద్యను అందించటానికి వేల కోట్ల రూపాయల్ని ఖర్చుచేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. చదువు చెప్పే తీరును, చదువుకునే పద్ధతిని ఆధునిక స్థాయిలకు తీసుకెళ్లి సమూలంగా మార్చింది. అలాగే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను, స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. ఇక వైద్య సేవల విషయంలో ఈ రాష్ట్రంలో పేదలకున్న భరోసా మరెక్కడా లేదనే చెప్పాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవల్ని ఏకంగా రూ.25 లక్షల పరిమితి వరకూ అందిస్తోంది. వీటన్నిటితో పాటు నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31.91 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణాలనూ చేపట్టింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్ద పీట వేస్తూ అత్యధికంగా వ్యయం చేస్తుండటంతో రాష్ట్రంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ‘ఆసరా’ సంకల్పం సాకారమైన వేళ.. ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే... కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబ పరిస్థితి మెరుగుపడితే... ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊళ్లన్నీ పురోగమిస్తే రాష్ట్రం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆసరా కల్పించేందుకు సంకల్పించారు. 2014 ఏప్రిల్ 11వ తేదీనాటికి బ్యాంకుకు బకాయిపడిన మొత్తాన్ని వారు సక్రమంగా చెల్లిస్తే నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా కింద వాపసు చేస్తానని హామీ ఇచ్చారు. దానిని తూచా తప్పకుండా పాటించారు. ఆయన ఆలోచన నిజమైంది. ఆయన సంకల్పం సాకారమైంది. ఇప్పుడు ఆసరా అందించిన తోడ్పాటుతో ఎంతగానో ఎదుగుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన లక్ష్మీదేవి పాడిపశువుల పెంపకం చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు కమలమ్మ ఓ ఇంటినే కొనుగోలు చేశారు. ఏలూరు జిల్లాకు చెందిన సుంకరబుజ్జమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి విజయగాథలు చాలవా... జగనన్న సంకల్పం ఎంతగొప్పదో? – సాక్షి, నెట్వర్క్ పాడి వ్యాపారంతో కుటుంబానికి బాసట మాది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నేను శివ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ఆసరా పథకం కింద అందిస్తున్న డ్వాక్రా రుణమాఫీ సొమ్మును పాడి పశువుల పెంపకానికి వినియోగిస్తున్నాను. ఇప్పటివరకూ ఏడాదికి రూ.18,750లు వంతున మొత్తం రూ.75వేలు వచ్చింది. ఆ సొమ్ముతో పాడిపశువులు కొని పాల వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాను. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – లక్ష్మీదేవి, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ముద్దనూరు వైఎస్సార్ జిల్లా ఇల్లు కొనుగోలుకు సాయపడింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని దోర్నాదులవారి వీధికి చెందిన ఈమె పేరు గూడూరు కమలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పొదుపు గ్రూపులో సభ్యురాలైన ఈమెకు వైఎస్సార్ఆసరా పథకం కింద ఏడాదికి రూ.16,780 వేల చొప్పున ఇప్పటివరకూ రూ.67,120 నగదు ఆమె వ్యక్తిగత ఖాతాలో జమయింది. ఆ మొత్తంతో తాము అద్దెకు ఉంటున్న ఇంటినే కొనుగోలు చేయగలిగామనీ, పిండిమర ఇంట్లో ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. కేవలం సీఎం జగన్ వల్లే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. – గూడూరు కమలమ్మ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా కూరగాయల వ్యాపారానికి ఆధారం ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఈమె పేరు సుంకర బుజ్జమ్మ. వనిత గ్రూపు సభ్యురాలైన ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లల పోషణభారం ఈమెపై పడింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు రాగా ఆ మొత్తంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. దీనికి మరో రూ.2 లక్షల రుణంతో వ్యాపారం విస్తరించారు. ఇప్పుడు పిల్లలను గౌరవంగా చదివించగలుగుతున్నానన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. – సుంకర బుజ్జమ్మ, మండవల్లి, ఏలూరు జిల్లా బిడ్డల చదువుకు తోడ్పడుతున్నా... ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.60 వేలు వచ్చాయి. వీటితో చిల్లరకొట్టు, కూరగాయల వ్యాపారం చేస్తున్నా. వచ్చిన ఆదాయంతో మా పాప ఇంజినీరింగ్, మా బాబును సివిల్స్ కోచింగ్‌కు పంపాం. వారిద్దరికీ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన వచ్చాయి. సీఎం జగనన్న సాయంతోనే మా కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంది. – మిర్యాల ఉషారాణి, ఈలప్రోలు, ఎన్టీఆర్ జిల్లా -
ఆర్థిక చక్రానికి 'ఆసరా'
‘మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అనే సూత్రంపైనే ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతగా ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేశారు. నా అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యమని చెబుతూ మేనిఫెస్టోలో చెప్పినట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు పథకాల ద్వారా అందిన రూ.38,273.95 కోట్ల (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు) సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి తమ కుటుంబాలను ఒడ్డున పడేశారు. వెరసి బ్యాంక్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గ్రామీణ ఆర్థిక చక్రం వేగంగా తిరిగింది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. ఎల్లుండి నుంచి ఆఖరి విడత ‘వైఎస్సార్ ఆసరా’ గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570. 80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి : వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 79 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో సమూల మార్పులకు, వారి ఆత్మగౌరవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా వారి ఆర్థిక కష్టాలు తీర్చింది. అంతటితో ఆగకుండా వారు సొంతంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చేయి పట్టుకుని నడిపించింది. పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకానికి ఊతం అందించింది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పరిస్థితి అగమ్యగోచరం. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కారు. దీంతో ఆ సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. వీరి దుస్థితిని తన పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న రూ.25,570.80 కోట్ల అప్పును మనందరి ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆసరా’ పథకం పేరుతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఆ మాట మేరకు ఇప్పటికే మూడు విడతలుగా రూ.19175.97 కోట్ల సొమ్ము చెల్లించారు. దీనికి తోడు చేయూత పథకం కింద రూ.14,129 కోట్లు లబ్ధి చేకూర్చారు. సున్నా వడ్డీ పథకం కింద రూ.4,969 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.38,274 కోట్లు లబ్ధి కలిగించారు. తద్వారా ఇప్పుడు ఆ పేదింటి పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ఆర్థిక వ్యవçస్థకే ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల క్రితం బ్యాంకుల వద్ద ఎన్పీఏలుగా ముద్రపడిన లక్షలాది పొదుపు సంఘాలు నేడు బలపడ్డాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మ«ధ్యలో ఆపేసిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ.. సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ డబ్బులను ప్రభుత్వమే ఏ ఏడాదికి ఆ ఏడాదే చెల్లిస్తుండడంతో ఇప్పుడు వందకు 99.83 శాతం పొదుపు మహిళలు అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో పొదుపు సంఘాల మహిళలకు చాలా తక్కువ వడ్డీకే ఎంతైనా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు గత 56 నెలల కాలంలో రూ.1,54,929.92 కోట్లు బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలకు రుణాలుగా అందజేశాయి. 83 శాతం సంఘాలు రూ.ఐదు లక్షలకు పైబడే రుణాలు తీసుకోగలిగాయి. అంటే దాదాపు ప్రతి పొదుపు సంఘం మహిళ గత 56 నెలల కాలంలో ఏడాదికి దాదాపు రూ.50 వేల చొప్పున కొత్త రుణం అందుకోగలిగారు. తీసుకున్న అప్పును కూడా మహిళలు తమ కుటుంబ ఆదాయాలు పెంచుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడి పెట్టగలిగేలా ప్రోత్సాహం ప్రపంచంలోనే ఎక్కువ జనాభాకు తోడు పేదరికం కలిగిన మన దేశం ఆర్థికాభివృద్ధిలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలంటే ప్రజల్లో పెట్టుబడి పెట్టగలిగే స్థాయి పెరగాలి. అంటే ఆ పెట్టుబడి ఏదో రూపంలో వారికి అందాలి. తద్వారానే దేశ ఆర్థికవృద్ధి చక్రం ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వాల నుంచే ప్రత్యేకించి పేద ప్రజలకు రకరకాల రూపాల్లో డబ్బులు చేరాల్సి ఉంటుంది. ఈ పరంపరలోనే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. తద్వారా వారు ఆ డబ్బులను పూర్తి స్థాయిలో తమ కుటుంబ ఆదాయం పెంచే మార్గాల్లో తిరిగి పెట్టుబడి పెట్టేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబ స్ధిర ఆదాయాలు పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. వెరసి రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పెరుగుదలలో భాగస్వాములవుతున్నారు. – ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ 54 శాతం మందికి అదనంగా రూ.60 వేల ఆదాయం పొదుపు సంఘాల మహిళల ఐదేళ్ల క్రితం నాటి మొత్తం అప్పు రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేçయడంతో పాటు ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. పేద కుటుంబాల్లో టర్నోవర్ పెరిగింది. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. లక్షల పేద కుటుంబాల్లో ఇటీవల కొత్తగా ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. చాలా కుటుంబాలు అప్పు తీసుకొనే అవసరం లేకుండానే వ్యవసాయ పెట్టుబడులు మ కూర్చుకోగలుగుతున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై నిర్వహించిన ఓ సర్వేలోనే ఈ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్ధిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. 31,04,314 మంది పేదింటి పొదుపు మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. నాడు బాబు హామీ నమ్మి దివాలా 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,203.58 కోట్ల మేర అప్పులున్నాయి. ఆ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే.. ‘తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణ మాఫీ చేస్తుంది.. బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను ఎవరూ చెల్లించొద్దు.. బ్యాంకుల్లో కుదువ పెట్టిన మీ బంగారాన్ని విడిపించేస్తాం’ అని చంద్రబాబు ఊరూరా ప్రచారం చేశారు. అంతకు ముందు వరకు కిస్తీల రూపంలో సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే అలవాటు ఉన్న లక్షలాది మంది మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకులకు కిస్తీలు చెల్లించడం మానేశారు. మాయ మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీతనే అసెంబ్లీలో తమ (టీడీపీ) ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. దీంతో పొదుపు సంఘాల మహిళలందరూ అప్పట్లో తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. పేద మహిళలందరూ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాధారణంగా గ్రామాల్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని చెల్లించకపోతే దివాలా తీశారని ప్రచారం చేస్తుంటారు.. అలా, అప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్న మహిళలు ప్రతి ఐదుగురిలో ఒకరిని బ్యాంకులు ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – ఒక రకంగా దివాలా) జాబితాలో పెట్టాయి. -
సున్నావడ్డీపై వక్ర రాతలు
-
రైతులపై భారం దించుతున్న వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు
-
సున్నా వడ్డీ, ఆసరా వంటి పథకాలతో ప్రభుత్వం అందించే సహకారంతో మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాను..!
-
మన ప్రభుత్వం అందించే తోడ్పాటుతో అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు..!
-
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగులు
-
వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి..!
-
నేడు అందిస్తున్న ₹1,353.76 కోట్లతో కలిపి ఈ నాలుగేళ్లలో కేవలం వైయస్ఆర్ సున్నావడ్డీ ద్వారా ₹4,969.05 కోట్లు.
-
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమం.
-
వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ
-
ఇంట్లో ఆడవాళ్లు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని నమ్మిన ప్రభుత్వం మనది
-
గతంలో సంపాదించింది అంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది.. ఇప్పుడు మాకు ఆ బాధ లేదు
-
మా ఆర్థిక స్వావలంబనకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు
-
విశాఖ జిల్లాలో డ్వాక్రా మహిళలకు నాలుగో విడత YSR సున్నా వడ్డీ సొమ్ము జమ
-
అమలాపురంలో నాలుగో ఏడాది సున్నా వడ్డీ పంపిణీ
-
సీఎం జగన్‌కు జేజేలు.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
వైఎస్సార్ సున్నా వడ్డీ: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
అమలాపురం బహిరంగ సభలో మహిళ సూపర్ స్పీచ్
-
శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు: సీఎం జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే.. నారా వారిదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయని అన్నారు. అది నారా వారి ఘన చరిత్ర.. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. బాబు హయాంలో 14వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే అని స్పష్టం చేశారు. అది వారి చరిత్ర.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. ప్రతిపక్షాల ఫ్యూజులు ఔట్.. ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?. మీ బిడ్డల భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారు. తనకు గిట్టని వారి అంతుచూస్తాడట.. చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరగదు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందు కోసమే చంద్రబాబు అధికారం ఇవ్వాలట. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నాడు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెదిరించాడు. చంద్రబాబు మాటంటే విలువ లేదు, విశ్వసనీయత లేదు. వీరికి కావాల్సింది.. దోచుకోవడం.. పంచుకోవడం. ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకివ్వాలి.. మొన్నటి పుంగనూరు ఘటన చేస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక రూట్లో పర్మిషన్ తీసుకుని ఇంకో రూట్లో వెళ్లాడు. 47 మంది పోలీసులకు గాయాలు చేశాడు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీసు కన్ను పోగొట్టాడు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారు. మీ బిడ్డకు మీరే ధైర్యం. మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని అన్నారు. ఇది కూడా చదవండి: ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర: సీఎం జగన్ -
ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర: సీఎం జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ నాలుగున్నరేళ్లలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేశామన్నారు. అక్కచెల్లెమ్మలు సంతోషమే ముఖ్యం.. పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీభారం పడకూడదు. మహిళల జోవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశామన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించాం.. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం తీసుకొచ్చాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేశాం. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఆయుధం. వైఎస్సార్ చేయూత ద్వారం 14వేల 129 కోట్లు అందిచామన్నారు. వసతి దీవెన కింద ప్రతీ ఏటా రూ.20వేలు ఇస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఈ స్థాయిలో గతంలో ఇళ్ల పట్టాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలకు ఇంతటి మేలు చేయలేదు. ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర.. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. సూర్యోదయం కంటే ముందే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు అందిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో 2లక్షల 31వేల 123 కోట్లు ఇచ్చాం. బాలింతల కోసం 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బాలింతల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.400 కోట్లే. ఇది మన ప్రభుత్వం సృష్టించిన చరిత్ర అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకువచ్చాం. కోటి 24లక్షల మంది దిశ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. దిశ యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చేస్తున్నారు. -
స్టాళ్లను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ ప్రసంగం ►దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం ►అక్క చెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం ►కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. ►గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. ►బాబు హయాంలో 14వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ►మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసింది ►గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ►1,05,13,365 మంది పొదుపు మహిళలకు లబ్ధి ►రూ.1353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ ►ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం 4969.05 కోట్లు ►పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకూడదు ►మహిళల జీవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు ►మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే ►మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం ►వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు ►చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది ►2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్ధు చేశారు ►అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం. ►దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. ►లబ్దిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధిచేరుకుంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే వాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్క బటన్ నొక్కడంతో నేరుగా మా ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయి. పాదయాత్రలో అక్కచెల్లెలమ్మల బాధ చూసి మీరు మాకోసం ఎంతో చేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం లబ్ధిదారులు ఖండించారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. జగనన్న మా కోసం ఎంతో చేస్తున్నారని తెలిపారు. ► పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫొటో దిగారు. ► స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్. ఈ క్రమంలోనే మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు. ► అమలాపురం చేరుకున్న సీఎం జగన్. ► సాక్షి, అమలాపురం/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటిస్తున్నారు. ► ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు. ► అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. ► పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్న సంగతి తెలిసిందే. ► ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ► అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. ► ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లెమ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. ► ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ► కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం
-
నేడు అమలాపురానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి చేరుకొని.. బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును ముఖ్యమంత్రి జగన్ జమ చేస్తారు. కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
నేడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ నగదు జమ
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ వైఎస్సార్ సున్నా వడ్డీ (మహిళలు) పథకం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ఈ రూ.1,353.76 కోట్లతో కలిపి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్న సంగతి తెలిసిందే. ► ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ► అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. ► ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లెమ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. ► ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. -
జగనన్న సుపరిపాలనలో అభివృద్ధి పథంలో నడుస్తున్న అక్కచెల్లెమ్మలు
-
ఏది నిజం ?: ‘సున్నా వడ్డీ’లోనూ వక్రమార్కుడు.. రామోజీ విషపు రాతలు
బురదజల్లుడు, అబద్ధాలు అచ్చేయడం, అర్థంపర్థంలేని వార్తలు వండి వార్చడంలో తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్న ఎల్లో జర్నలిస్ట్ రామోజీరావు ఎప్పటిలాగే టీడీపీ వైపు తన చేతివాటాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈసారి ఆయన రూటు సాగువైపు మళ్లింది. ‘వడ్డీ రాయితీ పెద్ద సున్నా’ అంటూ ఆయన తాజాగా అచ్చోసిన అసత్యాల కథనం నిజంగానే నిజాల్ని దాచి వండిన వంటకం. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈనాడు పత్రిక కూడా ఆ పాఠకులకు అంతే హానికరం. ఎందుకంటే.. రాష్ట్రంలో చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి’ 2019లో శ్రీకారం చుట్టింది. రూ.లక్షలోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాకముందే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ వారికి అండగా నిలుస్తోంది. కానీ, టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 3.5 ఏళ్లలో 73.88 లక్షల మంది వాస్తవ సాగుదారులకు ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు రూ.1,838.61 కోట్లు చెల్లించింది. వీటిలో రూ.1,180.66 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలే. ఇలా బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఏటా క్రమం తప్పకుండా అర్హతగల ప్రతీ రైతుకు అణా పైసలతో సహా వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈనాడు రామోజీరావు కళ్లున్న కబోదిలా ప్రవర్తిస్తూ ఆ పత్రికల పాఠకులపై చిమ్ముతున్న విషానికి అంతులేకుండా పోతోంది. నిజానికి.. గతంలో ఇంతపెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా వడ్డీ రాయితీ పథకాన్ని అమలుచేసిన దాఖలాల్లేవు. అయినా ఇవేమీ ఎల్లో జర్నల్ అయిన ఈనాడుకు కన్పించవు. అర్హుల జాబితా ప్రదర్శించినా అక్కసే.. మరోవైపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి మరింత మెరుగులద్ది పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా ఏర్పాటుచేశారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాల) పోర్టల్ https://karshak. ap. gov. in/ ysrsvpr/లోకి వెళ్లి హోంపేజీలో ‘know your status‘ అనే విండో ఓపెన్ చేసి తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ ఏడాదిలోగా రూ.లక్షలోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా జమచేస్తున్నా ఈనాడు తట్టుకోలేకపోతోంది. అంతేకదా.. రామోజీ. ఎక్కువమంది లబ్ధి పొందేలా విస్తృత ప్రచారం ఇక రూ.లక్ష లోపు రుణం సకాలంలో చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వడ్డీ భారం నుంచి రైతులు విముక్తి పొందేందుకు వీలుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత నెల 28న రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్లలో అర్హత పొందిన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు జమచేశారు. ఇలా గడిచిన మూడున్నరేళ్లలో పాత బకాయిలు కలిపి 73.88 లక్షల మందికి రూ.1,838.61 కోట్లు చెల్లించారు. పాత బకాయిలకు సంబంధించే కాదు గడిచిన మూడేళ్లకు సంబంధించి కూడా ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా అర్హుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ రాయితీ జమచేశారు. అయినా ఇవన్నీ విస్మరించి ఎందుకు రామోజీ ఈ వయస్సులో అబద్ధాల సాగుకు అంత ఆయాసం..? రూ.1,180.66 కోట్ల బకాయిలు ఈనాడుకు కన్పించవు కానీ, ఈ పరిస్థితులకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెట్టింది. వడ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ (డీబీటీ) చేసేలా మార్పుచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోని బకాయిల చెల్లింపునకూ ముందుకొచ్చి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు. ఇలా 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 39.08 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్ల బకాయిలను చెల్లించారు. బాబు ఎగ్గొట్టిన ఈ బకాయిలపై ‘ఘనత వహించిన’ ఈనాడు ఏనాడు దీనిపై వార్త రాసిన పాపానపోలేదు. అలాగే, ఐదేళ్లలో కేవలం 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లిస్తే ఎందుకింత తక్కువ చెల్లించారని కూడా ప్రశ్నించడానికి రామోజీకి పెన్ను పెగలలేదు. రామోజీ.. అప్పట్లో అప్పులకు జమచేసుకోలేదా? వాస్తవానికి ప్రతీ సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. రూ.లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగిలిన 4 శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో వీలునుబట్టి బ్యాంకులకు అరకొరగా జమచేసేవారు. ఈ మొత్తం జమకాగానే బ్యాంకులు వెంటనే రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసేసేవారు. అలాగే, గతంలో క్లెయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచీలకు మాత్రమే వీలుండేది. దీంతో ఎంతమంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు శాఖలకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. -
మేలు.. చూడండి
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచి చేయిపట్టి నడిపిస్తున్నాం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా ఎన్నో అమలు చేయడం ద్వారా వారికెంతో మేలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేలు జరిగింది? ఇప్పుడు గత మూడున్నరేళ్లలో ఎంత మేలు జరిగిందో ఒక్కసారి తేడా గమనించమని కోరుతున్నా. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలిచి మేలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంట రుణాలివ్వడంతో పాటు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీని చెల్లిస్తూ కొత్త ఒరవడి తెచ్చామన్నారు. రైతులపై పైసా కూడా భారం పడకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు నష్టపోతే బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్ రాకముందే అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022లో వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రైతులనుద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రైతన్నకు ఎంత చేసినా తక్కువే రైతులకు ఎంత చేసినా తక్కువే. వారంతా సంతోషంగా ఉండాలని అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాది జూలై – అక్టోబర్ మధ్య వరదలు, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 45,998 మంది రైతులకు ఇవాళ రూ.39.39 కోట్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 21.31 లక్షల మంది రైతులకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ ఇస్తున్న సొమ్ముతో కలిపి ఇప్పటివరకూ రూ.1,834.78 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే సన్న, చిన్నకారు రైతులు, వాస్తవ సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని చెల్లిస్తూ అండగా నిలుస్తున్నాం. వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద రబీ 2020–21, ఖరీఫ్ –2021 సీజన్లలో అర్హత పొందిన 8,22,411 మంది రైతులకు ఈరోజు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈరోజు ఇస్తున్న మొత్తంతో 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. బాబొచ్చారు.. బంగారం పోయింది! రైతన్నలకు అందించే సాయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తెస్తున్నా. గతంలో వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకం లేదు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా రుణమాఫీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారమంతా ఇంటికి తిరిగి రావాలంటే ‘బాబు’ సీఎం కావాలంటూ ప్రచారం చేసి చివరకు నిలువునా మోసగించారు. అప్పులపై వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు కలిపి రైతులకు తడిసి మోపెడయ్యాయి. నాడు నోటీసులు ఇచ్చి బ్యాంకుల్లో కుదువబెట్టిన బంగారాన్ని వేలం వేయడం పేపర్లలో చూశాం. ఐదేళ్లలో ఆ పెద్దమనిషి రుణమాఫీ పేరిట చెల్లించింది రూ.15 వేల కోట్లు మాత్రమే. అది కూడా రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టి. అప్పటివరకు అందుబాటులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారానే మూడున్నరేళ్లలో మన ప్రభుత్వం రూ.25,971 కోట్లను రైతన్నలకు అందించింది. నాడు ఐదేళ్లూ కరువు కాటకాలే.. గతంలో పంటల బీమా కోసం తమ వాటా ప్రీమియాన్ని రైతులే చెల్లించారు. ఆ ఐదేళ్లలో వరుసగా కరువు కాటకాలే. ప్రతి సీజన్లోనూ కరువు మండలాలను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ సొమ్ము పెరగాలి. కానీ అలా జరగలేదు. ఆ ఐదేళ్లలో బీమా కింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చాక రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. ఈ–క్రాప్ ద్వారా పంటలు వేసే ప్రతి రైతుకూ పంటల బీమా వర్తింపచేశాం. రైతుల ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇప్పటివరకు రూ.6,685 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించాం. గతంలో కొంతమందికే ఇన్సూరెన్స్ రాగా ఇప్పుడు ప్రతి రైతుకూ వర్తిస్తోంది. కరువు సాయంలో తేడా చూస్తే.. కరువు సాయం అందించడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. మన పాలనలో ఒక్కటైనా కరువు మండలాన్ని ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున ఏటా సగం కరువు మండలాలే. సాయం మాత్రం అంతంత మాత్రమే. 2015 నవంబర్, డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు రూ.260 కోట్లు, 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832 కోట్లు, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే అందించిన సాయం సున్నా. అదే మన ప్రభుత్వ హయాంలో చూస్తే సీజన్ ముగియకుండానే పరిహారం అందిస్తున్నాం. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285 కోట్ల పంట నష్ట పరిహారాన్ని అదే ఏడాది అక్టోబర్‌లో అందజేశాం. 2020 నవంబర్‌లో నివర్ తుపాను వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నెల తిరగకుండానే డిసెంబర్లో జమ చేశాం. 2021 సెప్టెంబర్‌లో గులాబ్ తుపాను, నవంబర్‌లో కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 6.31 లక్షల మంది రైతులకు రూ.564 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అదే ఏడాది నవంబర్‌లో అందజేశాం. ఇలా ఇప్పటి వరకు సీజన్ ముగియకుండానే రూ.1,835 కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీని రైతులకు అందించాం సున్నా వడ్డీలో ఎంత తేడా అంటే.. సున్నా వడ్డీ విషయంలో గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,180 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును పూర్తిగా చెల్లించడమే కాకుండా 73.88 లక్షల మంది రైతులకు మూడున్నరేళ్లలో మొత్తం రూ.1,834.55 కోట్లు అందజేశాం. గత ప్రభుత్వం ఏనాడూ రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం 9 గంటల పాటు క్వాలిటీ విద్యుత్‌ను పగటిపూట అందిస్తోంది. సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.1,700 కోట్లు ఖర్చుచేశాం. గతంలో రైతులకివ్వాల్సిన రూ.9 వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టింది కూడా చంద్రబాబే. గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంవత్సరానికి రూ.7–8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మన ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వెచ్చిస్తోంది. గత సర్కారు ఐదేళ్లలో ధాన్యం సేకరణ కోసం చేసిన ఖర్చును మనం మూడేళ్లలోనే అధిగమించి ధాన్యం సేకరణ చేస్తున్నాం. 2014 నుంచి 2019 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలోనే సగటున 167 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఏడాదికి 13 లక్షల టన్నులు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు, కంపెనీల పాల సేకరణ ధరలు ఏ రకంగా పెరిగాయో రాష్ట్రమంతా కనిపిస్తోంది. కార్యక్రమంలో మంత్రి కాకాణి తదితరులు పాల్గొన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకూ అండగా.. ఆర్బీకేలు రైతన్నలకు నాణ్యమైన, సర్టిఫైడ్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందిస్తున్నాయి. అన్నదాతలకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఈ–క్రాప్ నమోదు చేస్తున్నాయి. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతుకు అందించడంతో పాటు పంటల కొనుగోలు సమయంలో ఇబ్బంది కలగకుండా సహాయకారిగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి గొప్ప వ్యవస్థ మన కళ్లముందే కనిపిస్తోంది. ఇలాంటి విధానం గతంలో లేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. 2–3 సీజన్ల తర్వాత అరకొరగా అందించిన పరిస్థితులు చూశాం. ఇప్పుడు ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులందరికీ ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారాన్ని జమ చేస్తున్నాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలలో అర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి కూడా పొరపాటున జాబితాలో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాటిని మళ్లీ వెరిఫై చేసి ఏటా జూలై, డిసెంబరులో మిస్ అయిన వారికి మేలు చేస్తున్నాం. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది బీసీ కులానికి చెందిన ఒంటరి మహిళనైన నాకు మూడెకరాల పొలం ఉంది. రూ.87 వేల రుణం తీసుకొని సకాలంలో చెల్లించా. సున్నా వడ్డీ కింద రూ.1,791 వచ్చాయి. కంది సాగు చేసి నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.42 వేలు అందాయి. ఖరీఫ్ పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నా. ఆర్బీకేలో రసీదు ఇచ్చారు. గతంలో విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడ్డాం. ఇప్పుడన్నీ ఆర్బీకేల ద్వారా అందుతున్నాయి. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని రుజువు చేశారు. పదికాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి. – జయమ్మ,రైతు, ఎర్రవంకపల్లి, శ్రీసత్యసాయి జిల్లా ఇంట్లో అందరికీ అన్నీ.. గోదావరి వరదల సమయంలో మీరు నాటు పడవలో మా లంక గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా? అని అడిగారు. అందని వారికి మరుసటి రోజే రూ.2 వేలు ఆర్థ్ధిక సాయం అందేలా చేశారు. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మా లంక గ్రామాలకు రాలేదు. మాకు వంతెన కూడా మంజూరు చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నక్కా శ్రీనివాసరావు, రైతు, జి. పెద్దపూడి లంక, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామంలో వంతెన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షల సాయం నాకు రెండెకరాల భూమి ఉంది. రూ.93 వేల రుణం తీసుకుని సకాలంలో చెల్లించా. రూ.3,700 వడ్డీ రాయితీ వచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ నమోదు బాగుంది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు బాగా పండుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సచివాలయంలో పరిష్కరిస్తున్నారు. నాకు రైతు భరోసా, చేయూత, నా పిల్లలకు అమ్మ ఒడి సాయం అందింది. నేను ఈ ప్రభుత్వంలో రూ.5 లక్షలు అందుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నాలా చాలా మంది లబ్ధి పొందారు. – వెంకట లక్ష్మి, మహిళా రైతు, ముద్దాడ, శ్రీకాకుళం జిల్లా దేశానికే ఆదర్శంగా గతంలో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు ఈ–క్రాప్ ఆధారంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మూడేళ్లుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ముందుగానే సాగునీరు విడుదల చేయగలిగాం. ఊహకు అందని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేస్తోంది. టీడీపీ హయాంలో నిత్యం కరువు కాటకాలతో రాష్ట్రం విలవిలలాడింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేలే గ్రూపులుగా విడిపోయి నీళ్ల కోసం ఘర్షణలకు దిగిన పరిస్థితి. టీడీపీ హయాంలో 1,623 కరువు మండలాలు ప్రకటించగా ఇప్పుడు మూడేళ్లుగా ఒక్క కరువు మండలం కూడా లేదు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది : సీఎం జగన్
-
చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొట్టింది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గతంలో రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. కానీ రైతు భరోసా కిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రైతులకు సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ‘‘వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైన బాగుంటుందన్నారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. జులై-అక్టోబర్ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘మన ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి.. గతంలో రైతు భరోసా పథకం లేదు. ఒకేసారి రైతులకు రెండు రకాల సాయం అందించాం. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొట్టింది’’ అని సీఎం అన్నారు. ‘‘పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. రబీ 2020–21 సీజన్లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమ చేశారు. ఇప్పటివరకు రూ.1,795కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ.. ఇక గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేసినట్లవుతుంది. అలాగే, గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందించారు. గతంలో అంతా గందరగోళమే.. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారు. కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నారు. అంతేకాక.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతుభరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు.. అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. చదవండి: ఏది నిజం?: 3 అబద్ధాలు 6 అభాండాలు.. ‘ఈనాడు’ మరో విష కథనం -
అక్కా చెల్లెమ్మలకు అండగా.. పథకాలు మెండుగా..
రాయచోటి: సంక్షేమమే ఊపిరిగా.. అభివృద్ధి అజెండాగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల ఇబ్బందులు నాడు పాదయాత్రలో స్వయంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా లబ్ధి పొందిన మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను వేనోళ్లా కొనియాడుతున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద (డీఆర్డీఏ) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 18,450 డ్వాక్రా సంఘాలకు రూ. 44.09 కోట్లు, రెండో విడత 20,730 డ్వాక్రా సంఘాలకు రూ. 59.69 కోట్లు, మూడో విడత 21,641 డ్వాక్రా సంఘాలకు రూ. 62.622 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద మొత్తం మూడు విడతలలో రూ. 166.402 కోట్లు రాష్ట్రప్రభుత్వం జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద (మెప్మా) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 3053 డ్వాక్వా సంఘాలకు రూ. 5.34 కోట్లు, రెండో విడత 3144 డ్వాక్వా సంఘాలకు రూ. 4.97 కోట్లు, మూడో విడత 3442 డ్వాక్వా సంఘాలకు రూ. 5.21 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సున్నా వడ్డీ పథకం కింద మొత్తం విడతలలో రూ. 15.52 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బ్యాంకు లింకేజీ: బ్యాంకు లింకేజీ ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి (డీఆర్డీఏ) ద్వారా జిల్లా వ్యాప్తంగా 17,335 డ్వాక్రా సంఘాలకు రూ. 73.352 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో 7381 డ్వాక్రా సంఘాలకు రూ. 53,416 లక్షలు రుణం రూపంలో అందజేశారు. స్త్రీనిధి: స్త్రీనిధి ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డీఆర్డీఏ ద్వారా జిల్లా వ్యాప్తంగా 27,260 డ్వాక్రా సభ్యులకు రూ. 136.3 కోట్లు టార్గెట్ పెట్టుకోగా 24341 డ్వాక్రా సంఘాలకు రూ. 91.47 కోట్లు రుణం రూపంలో అందజేశారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివద్ధి మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలకు మహిళలనే ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేసి మహిళామణులుగా నిలుపుతున్నారు. స్వయం సహాయక సంఘ మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దిగువ, మధ్య తరగతి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బ్యాంకులతోపాటు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. –గిరీషా పీఎస్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ప్రస్తుతం బ్యాంకుల నుంచి స్త్రీనిధి, ఉన్నతి లాంటి అనేక పథకాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం వలన పెట్టుబడికి నిధుల కొరత ఉండటం లేదు. మహిళల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. అలాగే మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ వలన పరపతి సౌకర్యం బాగా పెరిగింది. –బి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ, అన్నమయ్య జిల్లా మహిళల సంక్షేమానికి పెద్దపీట నాపేరు ఎస్ శ్రీదేవి.నేను టి సుండుపల్లి మండలం జి.రెడ్డివారిపల్లిలో నివసిస్తున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 1,25,000లు శ్రీనిధి ద్వారా రూ. 50,000లు రుణం తీసుకున్నాను. నేను మా ఊరిలోనే కిరాణా దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, ఎలక్ట్రికల్, స్లిప్పర్స్ షాపు పెట్టుకున్నాను. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాకు వర్తించింది. సీజన్‌ను బట్టి నెలకూ రూ. 8వేలు నుంచి రూ. 15వేలు ఆదాయం వస్తుంది. మహిళల సంక్షేమానికి, ఆర్థిక పురోగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు నాపేరు ఎస్ కరీమున్.టి సుండుపల్లె మండల కేంద్రంలో నివసిస్తున్నాను. అల్లాహ్ పొదుపు సంఘంలో సభ్యురాలిని. కెనరా బ్యాంకులో పొదుపు సంఘం తరపున రూ. 1.30లక్షలు రుణం తీసుకున్నాం. మా సంఘానికి ఆసరా పథకం, సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో నేను, నా భర్త కలిసి ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాము. ప్రతి నెల రూ. 15వేలు ఆదాయం వస్తుంది. జగనన్న చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు నాపేరు పసుపులేటి పద్మావతి. కురబలకోట మండలం పూజారివారిపల్లిలో నివసిస్తున్నా. వెన్నెల పొదుపు సంఘంలో బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నా. వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ. 2.30 లక్షలు, సున్నా వడ్డీ పథకం కింద రూ. 27 వేలు డబ్బులు జమ అయ్యాయి. మిల్లెట్ ఫుడ్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాను. ఇచ్చిన మాట నెరవేరుస్తున్న సీఎం మహిళల పాలిట దేవుడు. -
AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్‌లోని అర్హుల జాబితా లెక్కతేలింది. ఈ సీజన్‌కు సంబంధించి 10.76 లక్షల మంది రూ.లక్ష లోపు రుణాలు పొందినట్లు గుర్తించగా, వారిలో నిర్ణీత గడువులోగా చెల్లించడం, ఈ–క్రాప్ ప్రామాణికంగా పంటలు సాగుచేసిన 5.68 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరికి రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అలాగే, రబీ 2020–21 సీజన్లో 2.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.45.22 కోట్లు జమచేయనున్నారు. ఈ జాబితాలను జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ఈ నెల 19–22 వరకు ప్రదర్శిస్తుండగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం నుంచి 25వరకు ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఎస్వీపీఆర్ పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ హోంపేజీలో ''know your status''అనే విండోలో తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ వివరాలు సరిచూసుకుని వారి పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లలో తప్పులుంటే తగిన వివరాలు సంబంధిత ఆర్బీకే సిబ్బందికి అందించి సరిచేసుకోవాలి. అర్హత కలిగి తమ పేరులేని రైతులు బ్యాంకు అధికారి సంతకంతో ధృవీకరించి ఆర్బీకేల్లో దరఖాస్తు సమర్పిస్తే పునఃపరిశీలన చేసి అర్హత ఉంటే జాబితాల్లో చేరుస్తారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి 8.22లక్షల మంది ఖాతాలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఈ నెల 28న సీఎం జగన్ జమ చేస్తారు. -
29న వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: అన్నదాతల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే లక్ష్యంతో రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీనందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమ చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇప్పటికే రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో ఆదివారం (నేటి) నుంచి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. ఖరీఫ్–2021 జాబితా వాలిడేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీనందిస్తోంది. టీడీపీ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు చెల్లిస్తూ రైతులకు బాసటగా నిలిచింది. 2014–19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్–2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019–20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్ 2020 సీజన్లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. రబీ 2020–21తో పాటు ఖరీఫ్–2021 సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమచేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించనుంది. అలాగే, రబీ 2020–21 సీజన్లో సున్నా వడ్డీ రాయితీ పొందేందుకు 2,54,568 మంది అర్హత పొందినట్లుగా నిర్ధారించారు. వీరికి ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమచేస్తారు. జిల్లాల వారీగా వీరి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఈనెల 22లోగా వీటిని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ వివరాలను ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నా వడ్డీ పంట రుణాల పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ అనే వెబ్సైట్లో "know your status" విండోలో తమ ఆధార్ నంబర్ ఎంటర్‌చేస్తే వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు.. నవంబర్ 29న ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన రైతులకు కూడా సున్నా వడ్డీ రాయితీని జమచేయనున్నారు. ఈ సీజన్లో పంట రుణాలు తీసుకున్న 10.76 లక్షల మంది వివరాలను బ్యాంకర్లు అప్లోడ్ చేయగా, వారిలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణం పొందడం, ఈ–క్రాప్‌లో పంటల నమోదు ప్రామాణికంగా వ్యాలిడేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఖరీఫ్–2021 అర్హుల జాబితాను కూడా సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. తప్పొప్పులు సరిచేసుకోవచ్చు.. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకుని తమ పేర్లు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ఒకవేళ అర్హత ఉండి తమ పేరు జాబితాలో లేకపోతే పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత బ్యాంకు అధికారి ధ్రువీకరణతో రైతుభరోసా కేంద్రాల్లో సమర్పిస్తే పునః పరిశీలన చేసి అర్హుల జాబితాలో చేరుస్తారు. – చేవూరు హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
జగనన్న సర్కార్ అండతో పెరిగిన పరపతి
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, ఎవ్వరూ బ్యాంకులకు కంతులు చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మహిళలు మోసపోయారు. అప్పటి వరకు సక్రమంగా కంతులు చెల్లించిన వారు ఒక్కసారిగా డీఫాల్టర్లుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు వరకు బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ‘వైఎస్సార్ ఆసరా’ కింద విడతల వారీగా సంఘాలకు చెల్లించింది. ప్రభుత్వ చేయూత ద్వారా మహిళలు అప్పులు తీర్చేశారు. బ్యాంకులతో కొత్తగా రుణాలు ఇప్పించడంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. సంఘాల సభ్యులు సక్రమంగా కంతులు చెల్లించడం ద్వారా అగ్రపథంలో నిలిచి పరపతి పెంచుకున్నారు. అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై బ్యాంకులకు అపార నమ్మకం. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో తీరుస్తుండటమే ఇందుకు కారణం. సంఘాలు అడిగిన వెంటనే బ్యాంకులు రూ.కోట్లలో రుణం మంజూరు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు జగనన్న సర్కార్ వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన మూడేళ్లలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకులు రూ.5,423 కోట్ల రుణం మంజూరు చేశాయి. 99.62 శాతం రుణ చెల్లింపు స్వయం సహాయక సంఘాలకు గడిచిన మూడేళ్లలో బ్యాంకులు రూ.5,423 కోట్లు రుణం మంజూరు చేస్తే అందులో సగటున 99.62 శాతం చెల్లింపులు జరిగాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 47,358 సంఘాలకు బ్యాంకులు రూ.1,587 కోట్ల రుణం మంజూరు చేస్తే 99.61 శాతం చెల్లించారు. 2020–21లో 59,849 సంఘాలకు రూ.1,726 కోట్ల రుణం ఇవ్వగా చెల్లింపులు 99.60 శాతం ఉన్నాయి. 2021–22లో 55,221 సంఘాలకు రూ.2,110 కోట్లు రుణం మంజూరు చేస్తే చెల్లింపులు 99.65 శాతం జరిగాయి. రూ.387.01 కోట్ల సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాలు నిర్వహించుకుంటూ ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.137.72 కోట్లు, 2020–21లో రూ.118.35 కోట్లు, 2021–22లో రూ.130.25 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. సీఎంకు రుణపడి ఉంటాం మహిళల అర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. మా సంఘం ద్వారా ప్రతిసారి రూ.5 లక్షల రుణం తీసుకుంటున్నాం. సకాలంలో కంతులు కడుతున్నాం. మేము తీసుకున్న రుణానికి వడ్డీని ప్రభుత్వం సున్నావడ్డీ పథకం ద్వారా చెల్లిస్తోంది. ఇదే కాకుండా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు. – సునీత, సత్యసాయి మహిళా సంఘం, అనంతపురం సక్రమంగా చెల్లిస్తున్నాం మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాము. ఇటీవలనే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. తొలి నుంచి కంతులు సక్రమంగా చెల్లిస్తుండడంతో అడిగిన వెంటనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తున్నారు. ఈ అప్పు తీరిన వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. సున్నావడ్డీ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. – సుమంగళమ్మ, నైథిలి మహిళా సంఘం, బ్రహ్మసముద్రం రికవరీ సంతృప్తికరం మహిళలు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో వారు అడిగిన వెంటనే బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రుణాల రికవరీ 95 నుంచి 99 శాతంతో సంతృప్తికరంగా ఉంది. సంఘాలకు రుణం మంజూరు, చెల్లింపు విషయంలో సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. దీంతో చెల్లింపులు బాగుంటున్నాయి. – బి.నాగరాజరెడ్డి, ఎల్డీఎం బాధ్యతగా రుణ చెల్లింపులు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు బాధ్యతగా చెల్లిస్తున్నారు. ఏటా లక్ష్యానికి మించి బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఏదేని సంఘం రుణం సకాలంలో చెల్లించకపోతే అది సున్నావడ్డీ పథకానికి అర్హత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో రుణం మంజూరు చేయించడంతో పాటు వారు సక్రమంగా చెల్లించే విషయంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ బ్యాంకుల సంపూర్ణ సహకారం పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణం మంజూరు చేయడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. రుణం తీసుకున్న సంఘ సభ్యులూ బాధ్యతగా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇక నారీశక్తి కింద మహిళలకు యూనియన్ బ్యాంక్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. – విజయలక్ష్మి, పీడీ, మెప్మా -
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
సీఎం జగన్ ఆసరాతో డ్వాక్రా సంఘాలు బలోపేతం
సాక్షి, నెట్వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్.. ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా ఆయుష్షు పోశారని మహిళలు కొనియాడారు. గురువారం అనంతపురం జిల్లా గుంతకల్లులోని మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి మహిళా సంఘాల సభ్యులకు చెక్కు అందజేశారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్, కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి చెక్కులు అందజేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గోకరాజు రామరాజు చెక్కులు పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం బోగోలులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇది కూడా చదవండి: అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తేనే సమాజాభివృద్ధి -
సీఎం చిత్ర పటాలకు క్షీరాభిషేకం
సాక్షి నెట్వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం కర్నూలు నగరంలోని స్థానిక కేవీఆర్ గార్డెన్స్‌లోని సచివాలయంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గంలోని నందనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గోకరాజు రామరాజు ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు చెక్కులు పంపిణీ చేశారు. -
పొదుపు సంఘాల మహిళల్లో ఆనందోత్సాహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా చొరవ తీసుకున్న ప్రభుత్వం.. వీరు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని తాజాగా జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా మూడో ఏడాది సొమ్మును వారి ఖాతాల్లో నేరుగా వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పాణ్యం, గడివేముల మండలాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. మహిళలకు చెక్కులు అందజేశారు. -
పండుగలా వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవాలు శనివారం రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వారిలో సీఎం జగన్ తర్వాతే ఎవరైనా అని నినాదాలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించి వరుసగా మూడో ఏడాది ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ పాల్గొని మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో జరిగిన ఉత్సవానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళ సుబ్బారావు నగర్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు, కృష్ణా జిల్లా గూడూరులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ మహిళలతో కలిసి ప్లకార్డు చూపుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సున్నా వడ్డీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది. -
YSR Sunna Vaddi Scheme: ‘సున్నా వడ్డీ’ సంబరాలు
సాక్షి, అమరావతి: వచ్చే ఆరు రోజుల పాటు మండలాల వారీగా పొదుపు సంఘాల సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు వారు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను వరుసగా మూడో ఏడాది కూడా ప్రభుత్వమే చెల్లించిన నేపథ్యంలో.. సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలో శనివారం నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. చదవండి: పథకాలు ఆపేయాలట! సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులతో జరిగే ఈ సమావేశాల్లో.. గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో రోజుకో మండలం చొప్పున అన్ని మండలాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులను కూడా ఆయా కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. -
పథకాలు ఆపేయాలట!
గత 35 నెలల్లో రూ.1,36,694 కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ఇందులో రూ.94,318 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లింది. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం. నా ఇబ్బందులు నాకు ఉన్నా, వాటి ముందు మీ ఇబ్బందులే ఇంకా ఎక్కువ అని భావించి మీ సోదరుడిగా మీకు తోడుగా నిలిచాను. ఇంతలా మనసున్న పాలనను గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? ఇంతటి సంక్షేమాభివృద్ధికి కారణమైన పథకాలను వాళ్లు ఆపేయాలంటున్నారు.. ఆపేయాలా? మీరే చెప్పండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుండటం చూసి దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్, టీవీ5.. వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముద్ర పడటంతో వారికి కడుపు మంట పెరిగిపోయిందని చెప్పారు. అక్కచెల్లెమ్మలందరూ సొంత కాళ్లపై నిలబడేలా పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతుండటం తట్టుకోలేక విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఆపేయాలని, లేదంటే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ‘మీరే చెప్పండి.. ఈ పథకాలన్నీ ఆపేయాలా?’ అని అక్కచెల్లెమ్మలను ప్రశ్నించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆయన ఒంగోలులో ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ జగనన్న కాలనీలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. తదితర పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల చరిత్రను మార్చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పేదల కడుపు నింపడం తమాషాలా? – ఏ పథకంలోనూ ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు. బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నాం. ఏ పథకంలో అయినా ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జూన్‌లో, డిసెంబర్లో అందిస్తున్నాం. – అయితే ఇలాంటి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడు అంటున్నారు. ఈనాడులో వాళ్లు రాస్తున్న రాతలు ఏంటో తెలుసా? ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలట.. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం.. ఉచితంతో ఆర్థిక విధ్వంసం.. ఇవి రోజూ మన చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5లు మాట్లాడుతూ కలిసి రాస్తున్నారు. – ఇబ్బందులు పడుతున్న నా అక్కచెల్లెమ్మలు, రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ, తాతలు, పేదరికంతో అలమటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని నా వాళ్లందరికీ పథకాలు అమలు చేయడానికి వీలు లేదనేది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడి ఉద్దేశం. – తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకుందో అది వారి అధికార గెజిట్ పేపర్లో చెబుతుంటారు. దాదాపు రోజూ ఇటువంటి మాటలే. ఇటువంటి రాతలే. ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబులా.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే, ప్రజలకు వెళ్లాల్సిన సొమ్మంతా పాలకుల జేబుల్లోకి వెళితే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీరు ఒప్పుకుంటారా? – లంచాలకు తావులేకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా? ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని, చంద్రబాబుకు ఓటు వేస్తే వీటన్నింటినీ ఆపేస్తారని చెప్పకనే చెబుతున్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. దీనికి మీరు ఒప్పుకుంటారా? (ఒప్పుకోమంటూ అందరూ చేతులు పైకెత్తి ఊపారు) మీరు ఇలా గట్టిగా చెప్పడం వల్ల ఇప్పటికైనా ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం. – మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ రూ.13,022 కోట్లు జగనన్న అమ్మ ఒడి ద్వారా లబ్ధి కలిగించాం. ఈ పథకాన్ని ఆపేయాలా? – 52.40 లక్షల మంది రైతులు, కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కగానే వారి అకౌంట్లోకి డబ్బు వెళ్లిపోతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు, అసైన్డ్ రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతన్నల కుటుంబాలు.. 52.40 లక్షల మందికి ఏకంగా రూ.20,162 కోట్లు నేరుగా ఇచ్చి మేలు చేశాం. ఈ పథకాన్నీ నిలిపివేయాలా? – ఏకంగా 25 లక్షల మంది 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులోని అక్కచెల్లెమ్మలందరికీ మంచి చేస్తూ వైఎస్సార్ చేయూత పథకం తీసుకొచ్చాం. ఏటా వారికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తూ.. రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థతో ఒప్పందాలు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేసి జీవనోపాధి చూపించాం. రూ.9,180 కోట్లతో అమలు చేస్తున్న ఈ పథకాన్నీ ఆపేయాలా? – గతంలో చంద్రబాబు మోసం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.25,517 కోట్ల మేర అప్పులపాలయ్యారు. సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేశారు. అప్పులు తడిసి మోపెడై 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా మారి ఎదురీదారు. మనందరి ప్రభుత్వంలో 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇస్తే..ఆ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా? – ఈ రోజు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాల్లో ఇల్లు కట్టించే ఒక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇది పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. మొత్తంగా రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు వారి చేతుల్లో పెట్టినట్లు అవుతుంది. ఇటువంటి గొప్ప పథకాన్నీ ఆపేయాలా? (ఈ ప్రశ్నలన్నింటికీ ఒద్దు.. ఒద్దు.. అని ప్రజలు సమాధానమిచ్చారు) ఇలా ఎన్నో పథకాల ద్వారా మీకు తోడుగా నిలుస్తున్నాం. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తే కొద్దో గొప్పో మంచి జర్నలిజం అనేది కనిపిస్తుంది. మీరు కూడా ప్రశ్నించండి – 18.50 లక్షల పంపు సెట్లకు ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద ద్వారా జరుగుతున్న మంచి ఏమిటో మీ అందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు, ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. – వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా దాదాపు లక్ష మంది చేనేత కుటుంబాలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.3 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరుగుతోంది. – జగనన్న చేదోడు ద్వారా మన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు.. మొత్తం 3 లక్షల మంది కుటుంబాలకు మంచి జరుగుతోంది. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారం చేస్తున్న 14.16 లక్షల మందికి మేలు కలిగింది. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, సొంత క్యాబ్‌లు ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు మంచి జరుగుతోంది. – వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకుని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇంకా గోరుముద్దు, సంపూర్ణ పోషణ.. ఇలాంటి పథకాలు కార్యక్రమాలన్నీ తీసి వేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. – ఈ రోజు జగన్ చేస్తున్నది మంచా.. చెడా అన్నది మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ పథకాలన్నింటినీ నిలిపేయాలంటున్న ఎల్లో పార్టీలు, ఎల్లో మీడియా, వారి దత్తపుత్రుడిని నేను మీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ప్రశ్నించండి. నిజంగా మీరు మనుషులేనా? అని అడగండి. ఇంత మంచి ఎలా చేయగలుగుతున్నానో ఆలోచించండి – జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోంది. – రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ రోజు 70 శాతం మంత్రి పదవులు వచ్చాయి. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాల వారికి ఇవ్వడం మహా సామాజిక విప్లవం. మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఈ వర్గాల వారే ఉన్నారు. – ఎక్కడో ఎందుకు.. ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటున్న విజయవాడను ఒక్కసారి ఉదాహరణగా తీసుకుందాం. విజయవాడ మేయర్ జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా జనరల్ స్థానంలో బీసీ మహిళ కనిపిస్తోంది. కనకదుర్గమ్మ తల్లి ఆలయ చైర్మన్‌గా బీసీ వ్యక్తికే అవకాశం కల్పించాం. 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లలో తొమ్మిది మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా.. ఈ రోజు మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకున్నాను. మీకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అప్పులు దాదాపు ఒకటే. ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో ఆయన కంటే మనమే తక్కువ అప్పులు చేస్తున్నాం. మరి అలాంటప్పుడు జగన్ ఎలా ఇంత మంచి చేస్తున్నాడు? ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు? అని అందరూ ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోందని సగర్వంగా తెలియజేస్తున్నా. -
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.. మూడో విడత జమ (ఫొటోలు)
-
గత ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా సాధికారత సారధులకు అభినందనలు తెలియజేశారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ప్రభుత్వం రూ.1,258 కోట్లు చెల్లించిందని, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, వరుసగా ఇప్పుడు మూడో ఏడాది రూ. 1,261 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్ తెలియజేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రసంగం అనంతరం.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి జమచేశారు. చదవండి👉🏼: దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్ -
మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం: సీఎం జగన్
-
CM Jagan Ongole Tour: ఒంగోలు పర్యటనకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 22వ తేదీ శుక్రవారం ఒంగోలు రానున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వివరాలను తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కే.నాగేశ్వరరెడ్డి విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని హెలిప్యాడ్ వద్దకు వెళతారు. హెలిప్యాడ్ నుంచి 9.40 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఒంగోలుకు బయలుదేరుతారు. ఉదయం 10.10 గంటలకు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఏబీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలిక్యాప్టర్ చేరుకుంటుంది. 10.25 గంటల వరకు ఏబీఎం గ్రౌండ్‌లోనే స్థానిక నాయకులతో, అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10.40కి ఏబీఎం నుంచి రోడ్డు మార్గం ద్వారా రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. చదవండి: (YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ) పది నిమిషాల పాటు ప్రాంగణంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. 10.55 గంటలకు పీవీఆర్ ప్రాంగణంలోని వేదిక మీదకు చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 11.05 నుంచి 11.10 గంటల మధ్య కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు సున్నా వడ్డీ కార్యక్రమం, జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తారు. అనంతరం డ్వాక్రా గ్రూపులకు చెందిన సున్నా వడ్డీ లబ్ధిదారుల పరిచయ కార్యక్రమం, వాళ్ల అనుభవాలు వివరిస్తారు. తరువాత 11.45 నుంచి 12.15 గంటల వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటల తరువాత వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కటం ద్వారా నేరుగా డ్వాక్రా గ్రూపుల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నారు. 12.25 నుంచి 12.30 లోపు సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి మొదలుకొని అధికారులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. సభా స్థలి నుంచి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవి శంకర్ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ రవి శంకర్ కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. రవి శంకర్ నివాసం నుంచి 12.55కు ఏబీఎం గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 1.05 కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళతారు. -
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. కుమార మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను సందర్శిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. రేపు ఒంగోలులో పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను
సాక్షి, అమరావతి: వర్తన చిన్ని... రెండేళ్లుగా ఇంట్లోనే ఓ చిన్న దుకాణం నడుపుతోంది. పెట్టుబడి దాదాపు 70 వేలు. అన్ని సరుకులూ దొరుకుతుండటంతో వ్యాపారం బానే సాగుతోంది. రోజు గడవటానికి ఇబ్బంది లేదు. కాకుంటే రెండేళ్ల కిందట మాత్రం ఈ పరిస్థితి లేదు. అల్లూరి జిల్లా పాడేరు మండలానికి చెందిన చిన్ని.... ఇక్కడి గుడివాడ గ్రామంలో శ్రీనివాస డ్వాక్రా సంఘ సభ్యురాలే. కానీ సంఘాలు సరిగా అప్పులు తీర్చటం లేదని బ్యాంకులు వీటివైపు చూడటం మానేశాయి. చిన్ని లాంటి మహిళలకు అప్పు పుట్టడమే గగనం. దీంతో రోజు గడవటానికీ ఇబ్బంది పడేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ ఆసరా కింద రూ.20వేలు అందింది. దీనికి తోడుగా బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుంది. ఈ పెట్టుబడే ఆమెను నిలబెట్టింది. తలెత్తుకునేలా చేసింది. బ్యాంకు రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో... అదీ ఆమెకు వ్యాపార లాభంగానే మిగులుతోంది. క్రమం తప్పకుండా రుణం తీరుస్తుండటంతో మరికొంత రుణమివ్వటానికి బ్యాంకు సిద్ధంగా ఉంది. ఎవరు తన కథ అడిగినా... సున్నా వడ్డీ పథకం తన జీవితానికి దిగుల్లేకుండా చేసిందంటుంది చిన్ని. చిన్ని లాంటి కథలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 9.76 లక్షల పొదుపు సంఘాల్లో చాలాచోట్ల వినిపిస్తాయి. ఇంటిని చక్కదిద్దే స్థాయిలో మహిళలు సొంత కాళ్లపై నిలబడ్డారు. దుకాణాలు, జిరాక్స్, ఫ్యాన్సీ షాపులు, బర్రెలు, ఆవులు.. మేకల పెంపకం, ఇలా రకరకాల వ్యాపారాలతో కుటుంబానికి దన్నుగా నిలబడ్డారు. వారు క్రమం తప్పకుండా అప్పు చెల్లిస్తున్నారు కాబట్టే... ప్రభుత్వం కూడా క్రమం తప్పకుండా వడ్డీ రాయితీని చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు రూ.2,354 కోట్లను వడ్డీ రాయితీగా చెల్లించిన ప్రభుత్వం... మూడో ఏడాది కూడా రూ.1,261 కోట్ల మొత్తాన్ని ఈ నెల 22న జమ చేయబోతోంది. ఏటేటా పెరుగుదల పొదుపు సంఘ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అందజేస్తోన్న తోడ్పాటుతో మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,85,615 సంఘాలు సకాలంలో తమ రుణాలు చెల్లిస్తే.. 2020–21 ఆర్థిక సంవత్సంలో ఈ సంఖ్య 9,41,088కి పెరిగింది. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9,76,116 సంఘాలకు చెందిన మహిళలు తమ రుణ కిస్తీలను సకాలంలో చెల్లించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించగా... నాటి నుంచి మహిళలు తమ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందుతూ వస్తున్నారు. ఇలా గత రెండు విడతల్లో రూ.2,354.22 కోట్ల మొత్తాన్ని అందుకున్నారు. మూడో విడతగా ఇప్పుడు మరో రూ.1,261.07 కోట్ల మొత్తాన్ని అందుకోబోతున్నారు. అప్పట్లో హామీ ఇచ్చి నట్టేట ముంచిన చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మరిచిపోయారు. దీంతో నాడు రాష్టంలో పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఫలితంగా సంఘాల కార్యకలాపాల్లో కీలకమైన మహిళలు ప్రతి నెలా పొదుపు చేయడాన్ని అప్పట్లో (2014–18 మధ్య) పక్కన పెట్టేశారు. నెల నెలా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవడం మానేశారు. రుణాలు చెల్లించడం కూడా తగ్గిపోయింది. దీంతో పలు సంఘాలు ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)గా మారిపోయాయి. రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు కూడా ముందుకు రాలేదు. దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పావలా వడ్డీ వంటి పథకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు నిలిపి వేసింది. ఈ కారణాలన్నింటి వల్ల పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలివ్వటం తగ్గించేశాయి. కోటి రెండు లక్షల మందికి లబ్ధి కోటి రెండు లక్షల మంది మహిళలు 9,76,116 పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,261.07 కోట్ల వడ్డీ డబ్బును ప్రభుత్వం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేయబోతుంది. ఈ నెల 22వ తేదీన మూడో ఏడాది సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ మహిళలు తమ రుణం మొత్తం చెల్లించడం ద్వారా ఆ రుణ ఖాతా క్లోజ్ అయి ఉంటే అలాంటి సందర్భంలో ఆయా సంఘాల పొదుపు ఖాతాలో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు జమ చేయనున్నట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వెల్లడించారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు ► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 18.36 శాతం సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించక బ్యాంకుల వద్ద ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)గా ముద్ర వేసుకున్నాయి. ► ప్రస్తుతం 99.27 శాతం సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో తమ రుణాలు కిస్తీలను చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎన్పీఏలు కేవలం 0.63 శాతం సంఘాలే. ► ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు సంఘంలో మహిళలందరూ సమావేశమై చర్చించుకోవడం, పొదుపు చేసుకోవడం, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని, బాగా కార్యకలాపాలు నిర్వహించుకునే వాటికి ఏ గ్రేడ్ ఇస్తారు. తర్వాత స్థాయిలో ఉన్న వాటికి బీ, సీ, డీ గ్రేడ్లు కేటాయిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 శాతం సంఘాలు సీ, డీ గ్రేడ్లలో ఉంటే.. కేవలం 40 శాతం సంఘాలు మాత్రమే ఏ, బీ గ్రేడ్‌లో ఉన్నాయి. ► వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 91 శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లో ఉండగా, కేవలం తొమ్మిది శాతం సంఘాలు మాత్రమే సీ, డీ గ్రేడ్‌లో ఉన్నాయి. ► మహిళల్లో పొదుపు అలవాటు మరింత పెరిగింది. ఇప్పటి దాకా రాష్ట్రంలోని పొదుపు సంఘాలన్నింటి పేరిట ఉన్న పొదుపు సంఘాల సంఘ నిధి మొత్తం రూ.12,067 కోట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ► గత 34 నెలల కాలంలో ప్రభుత్వం పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.71,673.69 కోట్ల మొత్తాన్ని రుణాలుగా ఇప్పించింది. ► డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి, వడ్డీ శాతం 13.5 నుంచి 9.5కు తగ్గించింది. ఇలా మన రాష్ట్రంలో మాత్రమే జరిగింది. దీంతో పొదుపు సంఘాల కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ► మరోవైపు.. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా (గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాన్ని ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా మహిళలకే అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక భారం తగ్గింది సున్నా వడ్డీ పథకం మాకు కొండంత అండగా నిలుస్తోంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నందున జీవనోపాధి మెరుగైంది. ఈ పథకం కింద నాకు మొదటి విడతగా రూ.5,800, రెండో విడతగా రూ.6,300 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో ఏడాది సున్నా వడ్డీ సొమ్ము అందనుంది. మా గ్రూప్ సభ్యులంతా కలిసి సక్రమంగా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాం. – మడ్డు రాజేశ్వరి, అక్కుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా జిరాక్స్ షాపు బాగా జరుగుతోంది మా సంఘానికి రూ.10 లక్షల రుణం మంజూరైంది. అందరం కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇందులో నా వాటాగా రూ.లక్ష వచ్చింది. నేను జిరాక్స్ షాపు పెట్టుకున్నాను. బాగా జరుగుతోంది. నా అప్పునకు గాను నాకు గత ఏడాది వడ్డీ కింద రూ.3,400 వచ్చింది. ఈ షాపు పెట్టుకోవడం ద్వారా ఆర్థికంగా నాలుగు డబ్బులు కళ్ల జూస్తున్నాను. నాలాగ ఎంతో మంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బులు ఇస్తోంది. ఈ వారంలో మరో దఫా సున్నా వడ్డీ జమ కానుండటం సంతోషకరం. – వి.శాంతి, ముత్యాలమ్మ గ్రూపు సభ్యురాలు, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా. -
పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పుపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదును సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వైద్య సిబ్బందిని నియమించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మంత్రులందరూ రాజీనామా ఇచ్చినట్లు తెలిపిన పేర్నినాని.. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తమ సామర్ధ్యాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామన్నారని, ఇప్పుడున్న వారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఉండవచ్చన్నారు. ‘ఎనిమిది మండలాలతో పులివెందుల, ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపాం. పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా 12 ఉద్యోగాలకు ఆమెదం.. ఏపీ మిల్లెట్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం. తొగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌కు 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్‌పోస్టులు మంజూరు. దర్శి డిగ్రీ కాలేజ్‌లో 34 టీచింగ్ పోస్టులు మంజూరు. చదవండి: మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు పవన్ హాబీగా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదు. ఆయన అవకాశ రాజకీయాలు చేస్తున్నారు.పవన్ మాటలనే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. పవన్ మాటలకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా.. పవన్‌లా మాట మార్చితే ప్రజలు మండిపడతారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును కలిశాను అంటారు. ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా? పార్టీ పెట్టి చంద్రబాబును కలవడం ఎందుకు. పవన్.. చెగువేరా.. పూలే అందరూ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఫోటో పెట్టుకున్నాడు. పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం. 2014లో పవన్ ఎవరి పల్లకీ మోశాడు’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. చదవండి: మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే.. -
అన్నదాతకు ఆలంబన
సాక్షి, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్‌లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది. 2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అర్హత పొందాలంటే.. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్‌ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
36,75,996 టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: శాసన సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుకొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పినట్లుగానే భావించాలని సభాపతి కోరారు. సభలో పలువురు వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇలా ఉన్నాయి.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నాం. ఇందుకోసం 7,000 వరి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వరి సేకరణలో 21,000 మంది నిమగ్నమై ఉన్నారు. రైతు క్షేత్రం నుంచి మిల్లు వరకు అన్ని రకాల వ్యయాలను ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 36,75,996 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశాం. రైతులకు రూ.4,676.96 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,282.11 కోట్ల చెల్లింపులు రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలపై ఏడు శాతం వడ్డీని విధిస్తున్నాయి. ఇందులో రూ.లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం 3 శాతం వడ్డీ సబ్సిడీగా ఇస్తుంటే, రాష్ట్రం వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 4 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 65,65,191 మంది రైతులకు రూ.1,282.11 కోట్లు చెల్లించాం. రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6,16,689 మంది నిరుద్యోగులు ఉండగా అందులో 4,22,055 మంది పురుషులు, 1,94,634 మంది మహిళలు ఉన్నారు. కోవిడ్ చికిత్సకు రూ.2,893.41 కోట్లు రాష్ట్రంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం రూ.2,893.41 కోట్లు వ్యయం చేశాం. వ్యాక్సిన్ కోసం రూ.85.79 కోట్లు ఖర్చు చేశాం. ఓటీఎస్‌కు డిమాండ్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా నివాసం ఉంటున్న వారికి ఇంటిపై పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం కోసం ఇప్పటివరకు 9,86,966 దరఖాస్తులు రాగా 2022 మార్చి 2 నాటికి 4,47,713 మందికి యాజమాన్య హక్కులు ఇచ్చాం. రూ.36,303.86 కోట్ల పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఔట్రీచ్ పేరిట పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిద్వారా 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.36,303.86 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చి, 91 మెగా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 70మెగా ప్రాజెక్టులకు రూ.1,61,154.85 కోట్ల పెట్టుబడులు క్రియాశీలకంగా అమల్లో ఉన్నాయి. మరో రూ.41,434 కోట్ల పెట్టుబడులతో 31 ప్రాజెకులు ప్రారంభ దశలో ఉన్నాయి. -
నవరత్నాల ద్వారా రూ.1.30 లక్షల కోట్లు బదిలీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభ జరగనివ్వకుండా గందరగోళం సృష్టించారు. స్పీకర్ మీదకు వారు రాకుండా డఫేదార్లు రక్షణ గోడగా నిలబడ్డారు. ఒకపక్క ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నా అధికార పార్టీ సభ్యులు ఎక్కడా స్పందించకుండా సభను కొనసాగించడంతో నినాదాలు నెమ్మదించాయి. ఇక నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు వంటి సభ్యులు నిలబడలేక మెట్లపై కూర్చుండిపోయారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తికాగానే టీ విరామం కోసం సభను 15 నిమిషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు. ఈ స్థాయి సంక్షేమం ఎక్కడాలేదు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు నవరత్న పథకాల ద్వారా అర్హులైన పేదలకు రూ.1.30 లక్షల కోట్ల నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కాసు మహేష్‌రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మూలే సుధీర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. లబ్ధి పొందిన వారిలో అత్యధికంగా 47.93 శాతం బీసీ వర్గాలు ఉండగా.. ఎస్సీలకు 16.30 శాతం, ఎస్టీలకు 5.18 శాతం, మైనారిటీలకు 3.91 శాతం, కాపులకు 8.76 శాతం, ఇతరులకు 17.93 శాతం చొప్పున ప్రయోజనం కలిగినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా తమ ప్రభుత్వం వృద్ధులకు ప్రతీనెలా రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోందని.. దీన్ని క్రమేపీ రూ.3,000కు పెంచనున్నట్లు బుగ్గన తెలిపారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించడంతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఒక్కో రోగికి రూ.7లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేసినట్లు బుగ్గన తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా కూడా ‘సంక్షేమం’ రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు వివిధ సంక్షేమ, ఇతర కార్యక్రమాలు ద్వారా రూ.86,144.01 కోట్లు అందించామని.. దీని ద్వారా 4,73,83,044 మంది ప్రయోజనం పొందినట్లు ఆయన తెలిపారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. వివిధ చేతివృత్తుల వారికి ఇప్పటివరకు రూ.2,272.31 కోట్లు ఇచ్చామని, దీని ద్వారా 11,73,018 మంది లబ్ధిపొందారన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా.. ఇక వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా 98,00,626 మంది స్వయం సహాయక మహిళలు లబ్ధిపొందినట్లు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభకు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. దీని ద్వారా మొత్తం 9,41,088 స్వయం సహాయక సంఘాలకు రూ.2,354.22 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ► మరో ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బదులిస్తూ.. జగనన్న వసతి దీవెన కింద 19,20,926 మంది విద్యార్థులకు రూ.2,304.97 కోట్లు అందజేశామన్నారు. ► అలాగే, నాడు–నేడు కింద తొలిదశలో 352 గిరిజన సంక్షేమ పాఠశాలలను రూ.137.13 కోట్లతో ఆధునీకరించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ► అలాగే, ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.16,000 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. రాష్ట్రంలోని 2,530 గిరిజన పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
'అగ్రి' తాంబూలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తూ చేయూతనిస్తోంది. పొలం దమ్ముల నుంచి పంటల విక్రయం వరకూ అన్నిదశల్లోనూ ఆసరాగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జై కిసాన్ అంటూ.. వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. విపత్తులతో పంట నష్టపోయిన కర్షకులను నేనున్నాంటూ ఆదుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల ఎకరాలకుపైగా.. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉండగా, ఖరీఫ్‌లో పూర్తి సాగు ఉంది. రబీ సీజన్లో 6.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, పొగాకు, ఆయిల్‌పామ్, అపరాలు, ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంది. ప్రభుత్వం విత్తు నుంచి పంటల విక్రయం వరకూ సేవలందిస్తున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రాయితీపై పంపిణీ, ఉచిత పంటల బీమా, పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధరలు, పంట నష్టపరిహారం అందజేత, పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రెండున్నరేళ్లలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. భరోసా.. రైతు కులాసా జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ఏడాదికి రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. మొదటి రెండేళ్లలో రూ.917.25 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. 2021–22లో ఇప్పటివరకూ 3.19 లక్షల మంది రైతులకు రూ.430.30 కోట్లు అందించారు. సున్నా వడ్డీ రుణాలు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.లక్ష రుణం తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది. 2019–20లో 1.30 లక్షల మందికి రూ.29.19 కోట్లు, 2020 (ఖరీఫ్)లో 78,417 మందికి రూ.19.60 కోట్లను అందించారు. యంత్ర సాయం వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు, అధునాతన యంత్రాలు అందిస్తున్నారు. జిల్లాలో క్లస్టర్ సీహెచ్‌సీల ద్వారా 22 వరి కోత యంత్రాలను రూ.1.94 కోట్ల రాయితీపై అందించారు. 1.39 లక్షల మందికి హక్కు పత్రాలు జిల్లాలో 2021–22లో 1.39 లక్షల మందికి పంట సాగుదారుల హక్కుల పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. వీరిలో 43,525 మందికి రూ.197 కోట్ల రుణాలు అందించారు. బీమాతో ధీమా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద జిల్లాలో ఈ–క్రాప్‌ను పెద్ద ఎత్తున నమోదు చేశారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమాను వర్తింపజేస్తున్నారు. 2020లో ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన 1,02,140 మంది రైతులకు రూ.170 కోట్లు అందించారు. 2020–21లో సంభవించిన ఆరు ప్రకృతి వైపరీత్యాల్లో 54 వేల హెక్టార్ల పంట నష్టపోగా బాధిత 1.12 లక్షల మంది రైతులకు రూ.81 కోట్లను పరిహారంగా అందించారు. 2021 ఏప్రిల్, నవంబర్ మాసాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన 29,624 మంది రైతులకు ఈనెల 15న రూ.20.97 కోట్లను అందించి ప్రభుత్వం వారిని ఆదుకుంది. రాయితీపై బ్యాటరీ స్ప్రేయర్ నాకు ప్రభుత్వం సబ్సిడీపై బ్యాటర్ స్ప్రేయర్ అందించింది. దీంతో చీడపీడల నివారణకు మందు పిచికారీ చేస్తున్నాను. రైతు భరోసా కేంద్రం ద్వారా రాయితీపై ఎరువులు కొంటున్నాను. అలాగే ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్ కూడా ఇక్కడ నుంచే కొనుగోలు చేశాను. ఇలా ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటోంది. రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. –అంకం వరప్రసాద్, చొదిమెళ్ల, ఏలూరు రూరల్ సేంద్రియ ఎరువులతో భూసారం నేను రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి పొలం భూసార పరీక్ష చేయించాను. సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకోవాలని అక్కడ సిబ్బంది సూచించారు. జీలుగు, మినుము తదితర నవధాన్యాల కిట్ తీసుకుని ఐదెకరాల్లో వెదజల్లాను. ప్రస్తుతం ఏపుగా పచ్చిరొట్ట పెరిగింది. దీనిని దున్ని పొలాన్ని సారవంతం చేసుకుంటాను. దీనిద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. –మాగంటి సుబ్రహ్మణ్యం, చొదిమెళ్ల, ఏలూరు రూరల్ -
9.05 లక్షల మందికి మూడో విడత ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ పథకంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం మూడో విడత కింద లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, స్వయం సహాయక సంఘాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక తదితర పథకాల అమలుపై సోమవారం మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..జగనన్న తోడు మూడో విడత కార్యక్రమాన్ని ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా రుణాలు పొందిన 6,91,530 మందితో పాటు కొత్తగా మరో 1,57,760 మందికి మూడో విడతలో బ్యాంకు రుణాలు అందించనున్నట్లు వివరించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మూడో విడత సున్నా వడ్డీ పథకం కోసం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మొదటి విడతలో దాదాపు 81 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.1,207.14 కోట్లు, రెండో విడతలో 97 లక్షల మంది మహిళలకు రూ.1,081.23 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మూడో విడత కింద పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను ఆధార్ లింక్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకంగా పింఛన్ల పంపిణీ చర్యలు చేపట్టాలని సూచించారు. పొదుపు సంఘాలకు సంబంధించి గ్రామ సమాఖ్యలో నిధుల దుర్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని.. గ్రామ సమాఖ్యల కార్యక్రమాలపై పర్యవేక్షణ, పరిశీలన కోసం ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. -
ఇప్పుడిది రైతాంధ్ర
ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవి. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇలాగే కష్టపడి చదివితే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారు. మీకు ఏం కావాలన్నా తగిన సహకారం అందిస్తాం. గిరిజన, వెనకబడిన ప్రాంతాల నుంచి కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదివే పరిస్థితి వస్తుంది. – విద్యార్థులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపే గొప్ప వ్యవస్థను నెలకొల్పి స్పష్టమైన మార్పు తెచ్చామన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి బృందాలు ఏపీకి వస్తున్నాయని, ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న గొప్ప మార్పు అని గుర్తు చేశారు. కరోనా సవాల్ విసిరినా రైతుల కోసం అడుగులు ముందుకేస్తూ అండగా నిలిచామన్నారు. వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానని, రైతుల కళ్లలో దీపావళి కాంతులు ముందుగానే చూడాలని ఆకాంక్షిస్తూ మూడు పథకాల నిధులను ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు రూ.2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టైంది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ... రైతన్నల కళ్లల్లో ముందే దీపావళి వెలుగులు ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపు 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం అక్టోబరులో ఇవ్వాల్సిన డబ్బులను జమ చేస్తున్నాం. రైతు భరోసా కింద గత ఆగస్టులో విడుదల చేసిన డబ్బులతో కలిపి ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో రూ.2,052 కోట్లు ఇస్తున్నాం. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు రైతులకు సైతం రైతు భరోసా.. ఈ రెండున్నరేళ్లలో ఒక్క రైతు భరోసా పథకానికే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమిని సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ... వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు రూ.112.70 కోట్లను సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. ఇ–క్రాప్ డేటా ఆధారంగా రూ.లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఇందులో గత సర్కారు సున్నా వడ్డీ కింద ఎగ్గొట్టిన బకాయిలు రూ.1,180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద ఈరోజు 1,720 రైతు గ్రూపులకు అంటే ఒక్కో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీనిద్వారా రైతులు నిర్దేశించిన సరసమైన అద్దెకే యంత్రసేవలు వారికి అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా ఐదు చొప్పున 1,035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్టాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) అందుబాటులోకి తెస్తున్నాం. 29 నెలల్లో గణనీయమైన మార్పులు.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తెచ్చామన్నది ఈ సందర్భంగా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 29 నెలల్లో రైతుల కోసం ఎన్నెన్నో.. 9,160 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం. త్వరలో మిగిలిన ఆర్బీకేల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. ► కరోనా సవాల్ విసిరినప్పటికీ మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది. కరువుసీమలో సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రైతన్నలు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ► రైతులు నష్టపోకూడదని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తెచ్చాం. మద్దతు ధర రాక పొగాకు రైతులు ఇబ్బంది పడుతుంటే కొనుగోళ్లలో జోక్యం చేసుకుని బాసటగా నిల్చాం. ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) అందుబాటులోకి తెచ్చాం. కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కనీస మద్దతు బాటు ధరలు కల్పించాం. ► రైతు భరోసా కేంద్రాలను వన్ స్టాప్ సెంటర్లుగా (అన్ని అవసరాలు తీర్చే) తీర్చిదిద్దాం. ► వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు ద్వారా రైతులకు అన్ని విధాలుగా సలహాలు, సూచనలు ఇచ్చి.. ప్రతి అడుగులో తోడుగా నిలుస్తున్నాం. ► ఇ– క్రాపింగ్ ద్వారా పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు లాంటివి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ► కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేస్తూ మార్కెటింగ్ వ్యవస్థలో ఏఎంసీలను కూడా ఆధునికీకరిస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ► రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3,716 కోట్లు అందించగలిగాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ► రైతులకు పాల వెల్లువ, వైఎస్సార్ జలకళ.. ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ద్వారా తోడుగా నిలిచాం. జేఎఫ్ కెన్నడీ ఏమన్నారంటే.. ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా రైతు తాను పంట పండించడానికి కావాల్సిన అన్నింటినీ ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్‌గా కొనుగోలు చేస్తాడు. తాను కష్టపడి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్‌సేల్‌గా అమ్ముకునే పరిస్ధితి నెలకొందని అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ అప్పట్లోనే చెప్పారు. మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితిని మనం మారుస్తున్నాం. పొలం వద్దకే ఆర్బీకే సిబ్బంది గిరిజన రైతునైన నాకు మీరు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ రైతు భరోసా మూడు దఫాలు అందింది. చాలా అనందంగా ఉన్నాం సార్. వైఎస్సార్ తరువాత ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మీ ప్రభుత్వంలో ఇచ్చారు. పోడు వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం. గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటారు. ఆర్బీకే సిబ్బంది నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు. –ఎం.విశ్వేశ్వర రావు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం, విశాఖపట్టణం జిల్లా ఇప్పుడు అన్నీ గ్రామంలోనే మీరు రైతాంగానికి వెన్నెముకలా నిలిచారు. వ్యవసాయ అధికారులు మా దగ్గరకు వచ్చి పంటల గురించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్ రైతులు ఆనందంగా ఉన్నారు. కరెంట్ బిల్లులు కట్టలేని సమయంలో వైఎస్సార్, మీరు చేసిన సాయం మరువలేం. ఇప్పుడు అన్నీ మా గ్రామంలోనే అందుతున్నాయి. –కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా మా కళ్లలో ఆనందం రైతు భరోసా ద్వారా మీరు అన్నదాతల కళ్లలో ఆనందం నింపారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్లి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. –శ్రీదేవమ్మ, లక్ష్మీదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా రైతులపై ప్రేమ మరోసారి చాటారు... సీఎం సార్.. మీరు చెప్పారంటే చేస్తారంతే అని రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి దీపావళి కంటే ముందే రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, యంత్ర సేవా పథకం సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఈరోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్ కూడా అధికారులను పిలిచి అభినందించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి ఆర్బీకే మోడల్‌ను తాము కూడా అనుసరిస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్పుట్స్ ఇవ్వటానికే పరిమితం కాకుండా ఆర్బీకేలను విజ్ఞాన కేంద్రంగా, సేవా నిలయాలుగా మార్చడం గొప్ప విషయం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు. కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?. రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?. దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. చదవండి: (రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింది. అక్టోబర్ నెల రైతుకు చాలా కీలకం. అందుకే మూడు విడతలుగా విభజించాము. రైతులకు మేలు చేయడం కోసం రూ.12,500 నుంచి 13,500 చేశారు. కౌలు రైతులకు కూడా ఈ భరోసా అందిస్తున్నాం. చెప్పిన మాట చెప్పినట్లుగా విడుదల చేస్తున్న ప్రభుత్వం మాది. ఇంత సంక్షోభంలోనూ అమలు చేయడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. -
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల
-
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు చెల్లించాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. ఒకేసారి మూడు పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. (చదవండి: మాది రైతు పక్షపాత ప్రభుత్వం: సీఎం జగన్) ముఖ్యమంత్రి ఏమన్నారంటే... ‘‘ వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, యంత్రసేవా పథకం... ఈ మూడు పథకాలకోసం రూ. 2190 కోట్ల లబ్ధి. వరుసగా మూడో సంవత్సరం.. రెండో విడత కింద రూ.2052 కోట్ల రూపాయలను జమచేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టు మాసంలో రూ. 977 కోట్లు ఇచ్చాం. కేవలం ఈ ఒక్క రైతు భరోసా కింద మాత్రమే రూ.18,777కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా కూడాలేని విధంగా, జరగని విధంగా సొంత భూములను సాగుచేసుకుంటున్న రైతులతోపాటు, కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు ప్రతి ఏటా రూ.13500రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 6,67లక్షల రైతులకు రూ.112 కోట్లకుపైగ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం. ఏడాదిలోపే పంటరుణాలు చెల్లించిన వారికి.. వారు కట్టీని వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటిన నుంచి సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1674 కోట్ల రూపాయలు ఇచ్చాం. 10778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 మంది బ్యాంకింగ్ కరస్పాండెట్లను కూడా పెట్టాం. మిగిలిన చోట్లా కూడా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంటరుణాలు అందుకునేందుకు బ్యాకింగ్ కరస్పాండెంట్ల సేవలు మీకు బాగా ఉపయోగపడతాయి. వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీతోపాటు వైయస్సార్ యంత్రసేవా పథకం కింద 1720 గ్రూపులకు రూ. 25.55 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ♦రాష్ట్రవ్యాప్తంగా రూ.2134 కోట్లతో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లను పెడుతున్నాం ♦29 నెలల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం ♦దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం.. నీటితో పుష్కలంగా ఉంది ♦రైతుకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు ♦కరోనా సవాల్ విసిరినా.. రైతు అడుగు ముందుకేస్తున్నాడు ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం ♦వ్యవస్థలను సరిదిద్దుతున్నాం ♦మార్కెటింగ్ మీద విపరీతమైన శ్రద్ధ కూడా పెట్టాం ♦ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసుకు వచ్చాం ♦పొగాకుకు కూడా ధరల స్థిరీకరణను వర్తింప చేస్తాం ♦జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాం ♦విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా అన్నింట్లోనూ కూడా రైతులను చేయిపట్టుకుని ఆర్బీకేలు నడిపిస్తున్నాయి ♦ఇలాంటి గొప్ప మార్పులు తీసుకు వస్తున్నాం ♦వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేస్తాం ♦ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. నాలుగు అంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేశాం ♦సలహాలు, సూచనలతో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాం ♦ఇ- క్రాపింగ్ అన్నది.. ప్రతి రైతుకు, ప్రతి పంటకూ నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు, పంటరుణాలు, సున్నావడ్డీలు ఇవన్నీ కూడా పారదర్శకంగా అందిస్తున్నాం ♦ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పథకానికి ఇ- క్రాపింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నాం ♦యంత్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ♦గ్రామ స్థాయిలో వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తున్నాం ♦ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకులను ఉంచాం ♦ప్రతి సేవను వారిద్వారా అందిస్తున్నాం ♦సహకార వ్యవస్థలో హెచ్ఆర్విధానాన్ని తీసుకు వస్తున్నాం ♦ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నాం ♦సీఎం యాప్‌ద్వారా.. రైతులు ధరల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే.. వెంటనే వారిని ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం ♦ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే కనీస గిట్టుబాటు ధరలను వర్తింపు చేయడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఎంఎస్పీ వర్తింపు చేస్తున్నాం: ♦ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది ♦కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు మంజూరుచేస్తూ... వ్యవసాయ మార్కెట్లను కూడా ఆధునీకరిస్తున్నాం ♦కల్తీ నివారణమీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు ♦కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నాం ♦ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా కల్తీలేని వాటిని అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం ♦పగటిపూటే రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశాం ♦ఇది కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది ♦నాణ్యమైన కరెంటు ఇచేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీడర్ల అభివృద్ది కోసం రూ.1700 కోట్ల రూపాయలు కూడామనం ఖర్చు చేశాం ♦29 నెలల కాలంలో వైయస్సార్ ఉచిత పంటల భీమా ద్వారా 31.7లక్షలమంది రైతులకు రూ. 3716 కోట్ల రూపాయలు అందించగలిగాం ♦ఇది కాక ధాన్యం సేకరణకోసం రూ.35వేల కోట్ల పైచిలుకు ఖర్చుచేశాం ♦మరో రూ.1800 కోట్ల రూపాయలతో పత్తిపంటను కూడా కొనుగోలు చేశాం ♦ఇతర పంటలకోసం రూ.6400 కోట్లకుపైగా ఖర్చు చేశాం ♦ధరలు పడిపోకూడదు.. రైతు నష్టపోకూడదని.. ఈ కార్యక్రమాలు చేశాం ♦గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలను కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది ♦గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల రూపాయల విత్తన బకాయిలను కూడా మనమే చెల్లించాం ♦ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో అందించేలా చేస్తున్నాం ♦ఇన్పుట్ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్లో నే ఇచ్చే కొత్త ఒరవడిని తీసుకు వచ్చాం ♦ఏపీ అమూల్ పాలవెల్లువను తీసుకు రాగలిగాం ♦ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద రూ.1.5కే యూనిట్ అందిస్తున్నాం ♦రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు సబ్సిడీ రూపంలో ఆక్వారైతులకు ఇచ్చాం ♦రైతన్నల ఆత్మహత్యలు చూడ్డానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాలనుంచి బృందాలు వస్తున్నాయి ♦సకాలంలో మంచి వర్షాలు పడాలని, వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను -
రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ మరింత భరోసా కల్పిస్తున్నారు. పంటల సాగు కోసం వైఎస్సార్ రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం ఇంకా అవసరమై తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలు చేస్తోంది. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ నగదు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తున్నామన్నారు.మాది రైతు పక్షపాత ప్రభుత్వం. మూడో సంవత్సరం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.18,777 కోట్లు విడుదల చేశామని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని’’ సీఎం అన్నారు. (చదవండి: టార్గెట్.. జాబ్స్) 50.37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా ఖరీఫ్ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీన్లో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది. (చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..) ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు 2019–20లో 45.23 లక్షల మంది కుటుంబాలకు రూ.6,162.45 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో 49.40 లక్షల మంది రైతులకు రూ. 6,750.67 కోట్లు అందజేసింది. అటవీభూమి సాగుచేస్తున్న వారితోపాటు కౌలుదారులు కలిపి తొలి ఏడాది 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది లబ్ధిపొందారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా మే 13న రూ.3,811.96 కోట్ల సాయమందించిన ప్రభుత్వం రెండోవిడతగా నేడు 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్లు అందిస్తోంది. భూమిలేని 1.50 లక్షల మందికి భరోసా ఈ ఏడాది లబ్ధిపొందుతున్న రైతు కుటుంబాల్లో 48,86,361 మంది భూ యజమానులు కాగా, అటవీభూములు సాగుచేస్తున్న వారు 82,251 మందితోపాటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగు(కౌలు)దారులు 68,737 మంది లబ్ధిపొందుతున్నారు. మూడేళ్లుగా లబ్ధి పొందుతున్న వారిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రెండోవిడత సాయంతో కలిపి 2019 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు రూ.18,777 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. (చదవండి: దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు) పారదర్శకంగా అర్హుల ఎంపిక ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్ పోర్టల్‌లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు. 6.67 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీమేరకు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నావడ్డీ కింద రాయితీ ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు బాసటగా ఉండటమేగాక ఏడాది తిరక్కుండానే ఈ వడ్డీ రాయితీ సొమ్మును జమచేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు ముఖ్యమంత్రి వారిఖాతాల్లో జమచేస్తున్నారు. 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 50 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేసింది. ఖరీఫ్–2019 సీజన్లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ–2019–20 సీజన్లో 5.55 లక్షల మందికి రూ.92.38 కోట్లు చెల్లించింది. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా.. ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించాలని సంకల్పించారు. ఈ సీజన్లో రూ.లక్షలోపు 11,03,228 మందికి రూ.6,389 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ–క్రాప్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వీరిలో 6.67 లక్షల మంది సున్నావడ్డీకి అర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఇలా అర్హత పొందినవారి ఖాతాలకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కింద రూ.112.70 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. యాంత్రీకరణకు చేయూత చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను నేడు రైతు గ్రూపులకు జమ చేసింది. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఇప్పటికే 789 యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించగా, తాజాగా మరో 1,720 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవాపథకం కింద గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలతో 10,750, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలతో కూడిన 1,035 యంత్ర సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.2,134 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను 11,785 రైతుగ్రూపుల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తంలో 854 కోట్లు (40 శాతం) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుండగా, 10 శాతం (రూ.213 కోట్లు) రైతు కమిటీలు భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం (1,067 కోట్లు) బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. తొలివిడతగా గ్రామస్థాయిలో 3,250 సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కాగా ఇప్పటికే 789 సీహెచ్‌సీలను రైతు దినోత్సవం రోజైన జూలై 8వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రూ.9.07 కోట్ల సబ్సిడీని జమచేశారు. తాజాగా రూ.69.87 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో 1,720 యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 40 శాతం సబ్సిడీ మొత్తం రూ.25.55 కోట్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు. -
సున్నా వడ్డీ పొందేలా చూసుకోండి
ఇంకా రుణం చెల్లించని వాళ్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబర్‌లోగా రుణాలు చెల్లించండి. ఆటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మళ్లీ మీకు రూ.10 వేలు బ్యాంకు రుణం ఇస్తుంది. మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం. అలా చెప్పకపోతే ఇది తెలియక మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారనేది మా భయం. అలాంటి పరిస్థితి రాకూడదన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సకాలంలో కిస్తీలు కట్టడం ద్వారా బ్యాంకర్ల విశ్వాసం పొందాలని సూచించారు. నెల నెలా కిస్తీలు కట్టకపోతే సున్నా వడ్డీ రుణం పొందడానికి వీలుండదని, అటువంటి పరిస్థితిని తెచ్చుకుని మళ్లీ వడ్డీ వ్యాపారుల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో రుణం చెల్లించిన చిరు వ్యాపారులు సున్నా వడ్డీ రాయితీ పొందడమే కాకుండా మళ్లీ సున్నా వడ్డీకి కొత్త రుణం పొందవచ్చని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2021 జూన్‌లో రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా రెండు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి అమలు చేస్తామన్నారు. రుణం తీసుకున్న వారి కాల పరిమితి డిసెంబర్ నాటికి పూర్తయితే, ఆ లోన్ క్లోజ్ చేసి.. వారి వడ్డీ డబ్బులు వెనక్కిస్తామని తెలిపారు. ఒకసారి డిసెంబర్లో, మరోసారి జూన్ నెలలో ఇలా చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు చెల్లించిన వారికి వడ్డీ సొమ్ము వెనక్కు ఇవ్వడంతో పాటు అదే రోజు మళ్లీ కొత్తగా రుణాలిచ్చే కార్యక్రమాన్ని కలిపి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి ► ఈ పథకానికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి. మళ్లీ డిసెంబర్లో, జూన్‌లో తిరిగి వడ్డీ లేని రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో కానీ ఎవరికైనా సందేహాలుంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు. ► తాజాగా బ్యాంకర్ల నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్పీఏలు, 11 శాతం ఓవర్ డ్యూస్గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి. ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం అని, అవగాహన కల్పించడం కోసం అక్టోబర్‌లోనే వడ్డీ జమ చేస్తున్నాం. ఇందులో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. ► గ్రామ సచివాలయం, వలంటీర్లు, కలెక్టర్లు అందరూ భాగస్వాములై ఈ విషయం లబ్ధిదారులందరికీ తెలిసేలా చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టకపోతే గడువు దాటినట్లే. అంటే ఓవర్ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజులు కట్టకపోతే ఎన్పీఏ (నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్) కింద మారుస్తారు. ఈ విషయాలన్నీ వారికి వివరించాలి. ఏ ఖాతా అయినా ఎన్పీఏ అయిందంటే ప్రభుత్వం నుంచి సున్నా వడ్డీ అందని పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. వీళ్ల పరిస్థితి మారాలనేదే లక్ష్యం ► చిరు వ్యాపారుల పరిస్థితి మార్చి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. వారి ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇప్పించేలా ఒప్పించి ఈ పథకాన్ని గతేడాది ప్రారంభించాం. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం తిరిగి వారికి వెనక్కు ఇస్తుంది. ► దాదాపు 9,05,458 మందికి రూ.10 వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. గత ఏడాది నవంబర్ 25 నుంచి 5 లక్షల 35 వేల మందికి మొదటి విడతలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 8 నుంచి రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాలు పంపిణీ చేశాం. ► ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు ► తోపుడు బండ్ల మీద పండ్లు, సామాన్లు అమ్ముకునే వారు, నగరాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన చిన్న బంక్ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్ మీద వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునే వాళ్లు.. ప్రతి ఊళ్లో కనిపిస్తుంటారు. ► ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చే స్తోమత వీళ్లకు ఉండదు. గతంలో ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితి. లోన్లు అందక వీరి జీవితాలు తల్లడిల్లిపోయాయి. ► అలాంటి వాళ్లు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ.1,000 వర్కింగ్ క్యాపిటల్ కింద అప్పు తీసుకుంటే రూ.900 మాత్రమే చేతికిస్తారు. అయితే రోజుకు రూ.100 చొప్పున మొత్తం రూ.1,000 కట్టాలి. ఇలాంటి పరిస్థితులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. దుకాణం ఏర్పాటు చేసుకున్నా.. వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసే స్థాయి నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాను. రోజుకు నాలుగు ఐదు వందల రూపాయల ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.15 వేల ఆదాయం వస్తోంది. ఆసరా పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశాను. దాని ద్వారా కూడా ఆర్థికంగా అండ లభించింది. మీ మేలు మరవలేను. – పిలకా పద్మ, సీహెచ్ రాజాం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా అధిక వడ్డీల భారం తప్పింది అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. మీరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా నాకు పది వేల రూపాయలు రుణం వస్తుందని మా వలంటీరు చెప్పాడు. అలా రుణం తీసుకుని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను. మీ వల్ల మా స్కూలు బాగుపడిందని మా పాప చెబుతోంది. మా లాంటి వాళ్లందరం సంతోషంగా ఉన్నాం. –మాధవి, లబ్ధిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా అన్నా.. నేను ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నా జగనన్నా.. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం ద్వారా స్టేట్ బ్యాంక్‌లో రూ.10 వేల రుణం పొందాను. వార్డు వలంటీర్ ద్వారా ఈ పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు ఇచ్చిన రుణంతో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాను. కరోనా సమయంలో ఇది నాకు చాలా మేలు చేసింది. మీరు అమలు చేస్తున్న ఇతరత్రా పథకాల ద్వారా మేము ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. ఆరోగ్యశ్రీ, దిశ యాప్, సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతం. – కె.నాగజ్యోతి, ఆర్ ఆర్ పేట, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా -
భరోసా ఇచ్చిన ‘ఆసరా’
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బుధవారం పెద్ద షామియానా వేశారు. ప్రాంగణం అంతా రంగు రంగుల బెలూన్లు, బంతిపూల తోరణాలతో కళకళలాడుతోంది. కొందరు మహిళలు ముగ్గులు వేస్తోంటే.. మరికొందరు వాటికి రంగులు అద్దడంలో నిమగ్నమయ్యారు. ‘ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదైనా పంక్షనా?’ అని అడిగితే.. ‘అవును.. వైఎస్సార్ ఆసరా పండుగ. 2014 ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తానని చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక చంద్రబాబు మమ్మల్ని నిలువునా ముంచాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాం. డ్వాక్రా సంఘాల్లో చాలా వరకు ఆ దెబ్బతో మూతపడ్డాయి. ఆ సమయంలో పాదయాత్రగా వచ్చిన జగనన్నకు మా కష్టాలు చెప్పుకున్నాం. ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సీఎం ఆయ్యాక మా అప్పు మొత్తాన్ని 4 విడతలుగా మా చేతిలో పెడుతున్నాడు. గత ఏడాది మొదటి దఫా ఇచ్చారు. ఇప్పుడు రెండో దఫా ఇస్తున్నారు. అన్ని విధాలా జగనన్న మా తల రాత మార్చారు. అందుకే పండుగ చేసుకుంటున్నాం’ అని తెలిపారు. ‘గత ఏడాది మొదటి విడతలో నాకు రూ.10 వేలు వచ్చింది. ఇప్పుడు రెండో దఫా రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. మాకు ఆర్థిక భరోసానిచ్చిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని మేం సంబరంగా నిర్వహించుకుంటున్నాం. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు, ఎమ్మెల్యే అందుకే ఈ ప్రాంగణాన్ని మేమే స్వయంగా ముస్తాబు చేస్తున్నాం’ అని ఉయ్యూరు మండలం కలాసమాలపల్లికి చెందిన నెహ్రూ గ్రూప్ సభ్యురాలు గుమ్మడి చంద్రమ్మ చెప్పింది. ‘గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన రుణంతో రెండు గేదెలు కొన్నాను. వాటి ద్వారా ప్రతి నెలా రూ.10 వేలు సంపాదిస్తున్నాను. చదువుకుంటున్న నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. మా అత్త విజయలక్ష్మికి వైఎస్సార్ చేయూత సాయం అందింది. మా ఊళ్లో చాలా మంది నాలాగే లబ్ధి పొందారు’ అని చంద్రమ్మ వివరించింది. తోట్లవల్లూరు మండలం పాముల్లంక గ్రామానికి చెందిన సాయూ గ్రూప్ అధ్యక్షురాలు మోటూరు అనిత, యలమర్రుకు చెందిన సోని, అప్పకట్లకు చెందిన కుంపటి వీరమ్మ, యలమర్రుకు చెందిన వరస జయలక్ష్మి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రీతిలో మహిళలు ‘ఆసరా’ పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఎమ్మెల్యే రమేష్ నుంచి ఆసరా చెక్కు అందుకుంటున్న లబ్ధిదారులు ఊరూరా సంబరాలు ► బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 52 చోట్ల (ఉప ఎన్నిక వల్ల వైఎస్సార్ జిల్లాలో వాయిదా) సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పథకం రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలోని 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు12 జిల్లాల్లో 4,74,832 సంఘాల్లోని 46,86,241 మంది మహిళల ఖాతాల్లో రూ.3,815.31 కోట్లు మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాగా, బుధవారం సెలవు కారణంగా డబ్బు జమ కాలేదు. ► అనంతపురం జిల్లా గోరంట్లలో మంత్రి శంకరనారాయణ, నల్లచెరువులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కణేకల్లులో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు కొనసాగాయి. కణేకల్లులో పలువురు మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు చూపారు. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొన్నారు. వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, పశివేదలలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా 1,291 సంఘాలకు రూ.10.45 కోట్లను అందించారు. ► ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. ఒంగోలులో మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ► శ్రీకాకుళం జిల్లా పొందూరులో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జరిగిన ఆసరా ఉత్సవాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
AP Budget 2021: మహిళా సాధికారతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021 ఏడాదికి గాను బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. ఇందుకోసం రూపొందించిన వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాలకు కేటాయింపులు చేశారు. వైఎస్ఆర్ ఆసరా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కలగజేయడం కోసం.. అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిల్లో.. మొదటి విడతగా 2020 సెప్టెంబర్ 11న 6,337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండవ విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6,337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఏపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సారానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి 1400 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. 2021-22కు గాను మరో 1,112 కోట్ల రూపాయలను కేటాయించింది. వైఎస్ఆర్ చేయూత మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం 2020 ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 45-60 ఏళ్ల లోపు షెడ్యూల్డ్ కులాల, తెగల, వెనకబడిన తరగతుల, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండో విడతలో భాగంగా 2021-22కు గాను మరో 4,455 కోట్లు కేటాయించింది. చదవండి: AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు -
మహిళా సాధికారతలో రాష్ట్రం అగ్రగామి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మహిళ వ్యాపార దక్షతతో ఎదిగేందుకు ఓ అన్నగా, తమ్ముడిగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను జమ చేసిన సందర్భంగా లబ్ధిదారులైన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు శుక్రవారం ఆయన స్వయంగా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సున్నావడ్డీ కింద ఇప్పుడిస్తున్న రూ.1,109 కోట్లతోపాటు జూన్‌లో ‘వైఎస్సార్ చేయూత’ కింద సుమారు రూ.4,500 కోట్లు, సెప్టెంబర్‌లో ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా రూ.6,792 కోట్లు, జనవరిలో ‘అమ్మఒడి’ ద్వారా రూ.6,500 కోట్లు ఇస్తామన్నారు. ఇలా వివిధ పథకాల కింద 2021–22లో అక్కచెల్లెమ్మలకు సుమారుగా రూ.18,901 కోట్లు అందచేస్తామన్నారు. -
ప్రతి అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలి
‘‘మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా తెలియజేస్తున్నా’’ ‘‘ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా? స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయా? రాజ్యాంగపరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ఈ సమాజంలో రక్షణ ఉందా?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. ఇవన్నీ మహిళలకు ఏ సమాజంలో పూర్తిగా లభిస్తున్నాయో అక్కడ మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్నీ ఉన్నట్లే.. అన్నీ బాగున్నట్లే. అలాంటి సమాజాన్ని నిర్మించుకునేందుకు మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 23 నెలలుగా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారత మహిళ రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సీఎం ఆకాంక్షించారు. ‘ప్రతి అమ్మాయి కనీసం గ్రాడ్యుయేట్ కావాలి. ప్రతి అక్కచెల్లెమ్మ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారి కావాలి. ప్రతి మహిళ గౌరవప్రదంగా పూర్తి రక్షణతో జీవించే పరిస్థితి కల్పించాలి. లింగ వివక్షతను రూపుమాపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది’ అని సీఎం తెలిపారు. ఆర్థిక స్వావలంబనతో మొదలయ్యే ఈ ప్రయాణం సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టే పరిస్థితి రావాలన్నారు. మహిళా సాధికారత కోసం ఈ 23 నెలల్లో పలు అడుగులు వేశామని, గర్భంలో ఉన్న శిశువు మొదలు అవ్వల వరకు ప్రతి అడుగులో వారికి అండగా నిలబడ్డామని సీఎం తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మంది పొదుపు మహిళలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సెర్ప్ సీఈవో రాజబాబు, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ కేవీ నాంచారయ్య, ఎస్ఎల్బీసీ ప్రతినిధిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం రమేష్ వేగేతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన సంఘాల సభ్యులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. మనపై నమ్మకానికి నిదర్శనం.. ఇవాళ మళ్లీ ఒక మంచి కార్యక్రమం. 9.34 లక్షల స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషిస్తున్నా. దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వడం ఒక అంశమైతే.. రెండో అంశం అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. అవి బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రుణాలు సకాలంలో చెల్లించిన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుస్తూ వారి రుణ ఖాతాల్లో రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇవాళ 9.34 లక్షలకు చేరాయి. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా పథకంలో రూ.6,792 కోట్లు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి, 2019–20లో సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి.. మొత్తంగా అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి పొదుపు సంఘాల సంఖ్య పెరుగుదలే ఒక పెద్ద నిదర్శనం. గత సర్కారు మోసంతో చక్రవడ్డీలు.. 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ మాట దేవుడెరుగు. అప్పటివరకు ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా 2016 నుంచి రద్దు చేసింది. ఈ మోసం వల్ల ‘ఏ’ గ్రేడ్ సంఘాలు ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్‌కు పడిపోగా, ‘బీ’ గ్రేడ్, ‘సీ’ గ్రేడ్ సంఘాలు అప్పుల పాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక మూతబడే స్థితికి చేరాయి. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలు అప్పట్లో అక్షరాలా రూ.3 వేల కోట్ల వడ్డీ రాయితీకి అర్హత కోల్పోయే పరిస్థితి కూడా చూశాం. వారు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సి వచ్చింది. మనందరి ప్రభుత్వ హయాంలో.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8.71 లక్షల సంఘాలకు చెందిన 87 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద దాదాపు రూ.1,400 కోట్లు వారి రుణ ఖాతాల కింద ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత ఆసరా కింద మరో రూ.6,792 కోట్లు కూడా ఇచ్చాం. వడ్డీ భారం కూడా తగ్గించాం.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాలలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.3 లక్షల రుణ పరిమితి వరకు 7 శాతం వడ్డీ చొప్పున, మిగిలిన ఏడు జిల్లాలలో 12.5 శాతం నుంచి 13.5 శాతం వరకు వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మనం అధికారంలోకి రాగానే బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారాన్ని 12.5 – 13.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగలిగాం. దీనివల్ల దాదాపు రూ.590 కోట్ల భారం అక్కచెల్లెమ్మలకు తగ్గింది. వారి రుణాల వడ్డీ కింద ఇప్పుడు రూ.1,109 కోట్లు జమ చేస్తున్నాం. మహిళా సాధికారత కోసం ఏం చేశామంటే.. గత 23 నెలల కాలంలో మహిళల సాధికారత కోసం ప్రతి అడుగులో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాం. అమ్మ ఒడి ద్వారా దాదాపు 44.5 లక్షల మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ఒక్కొకరికి ఏటా రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.6,500 కోట్లు వంతున రెండేళ్లలో ఇప్పటికే దాదాపు రూ,13.023 కోట్లు ఒక అన్నగా అందజేశాం. ► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఇస్తున్న 61 లక్షల పెన్షన్లలో 36.73 లక్షలు మంది అవ్వలు, మహిళా దివ్యాంగులు, వితంతువులున్నారు. వారికి పెన్షన్ కింద అందజేసిన మొత్తం రూ.16,444 కోట్లు. ► వైఎస్సార్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా బృందాలలో 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మనం అధికారంలోకి వచ్చే నాటికి వారికి ఉన్న రుణం రూ.27,168 కోట్ల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడతగా రూ.6,792 కోట్లు గత ఏడాది సెప్టెంబరు 11న జమ చేశాం. రెండో విడతగా రూ.6,792 కోట్లు ఈ సెప్టెంబరులో జమ చేస్తాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 4.56 లక్షల మంది 45 – 60 మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద అక్క చెల్లెమ్మలకు ఒకొక్కరికి రూ.18,750 చొప్పున మొదటి విడతగా 2020 ఆగస్టులో రూ.4,604 కోట్లు లబ్ధి చేకూర్చాం. నాలుగు విడతల్లో అందించే మొత్తం దాదాపు రూ.18,500 కోట్లు అని ఒక అన్నగా, తమ్ముడిగా సగర్వంగా చెబుతున్నా. ► వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హెచ్‌యూఎల్, రిలయన్స్, అల్లానా లాంటి ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల్లో భాగంగా వారికి వ్యాపారంలో తోడుగా నిలిచేలా ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అక్కచెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 69 వేల షాపులు ఏర్పాటయ్యాయని గర్వంగా చెబుతున్నా. ► జగనన్న జీవక్రాంతి ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచేందుకు చేయూత, ఆసరా పథకాలను అనుసంధానం చేస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్నాం. పాల ఉత్పత్తిలో అమూల్‌తో ఒప్పందం చేసుకుని లీటరు పాలకు రూ.5 నుంచి రూ.7 వరకు అధికంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ► జగనన్న పాలవెల్లువ పథకంలో ఆవులు, గేదెలకు సంబంధించి 1.12 లక్షల యూనిట్లు కావాలని అక్క చెల్లెమ్మలు కోరారు. వాటిని అందజేస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నాం. మేకలు, గొర్రెలు 72,179 యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. ఒక్కో యూనిట్లో 15 మేకలు, ఒక మేకపోతు ఉంటాయి. వాటిని కూడా చేయూత, ఆసరా కింద ఇస్తున్నాం. ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న దాదాపు నాలుగు లక్షల మంది అగ్రవర్ణాల పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో ఒక్కొక్కరికి రూ.45 వేల చొప్పున ఇచ్చేందుకు ఈ ఏడాది నుంచి రూ.600 కోట్లు కేటాయించాం. వచ్చే మూడేళ్లలో రూ.1,800 కోట్లు వారికి ఇస్తాం. ► వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, గృహ నిర్మాణాల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నాం. అంటే ఇది రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి మేలు చేసే కార్యక్రమం. ఇప్పటికే ఇళ్ల స్థలాలు పంచడమే కాకుండా మొదటి దశ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాం. అన్ని వసతుల కల్పన ద్వారా ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఆ విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచబోతున్నాం. ► జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్) ద్వారా 10.88 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా, అక్క చెల్లెమ్మల చేతిలో నేరుగా డబ్బులు పెడుతున్నాం. నాలుగు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.2,800 కోట్లు వారి చేతిలో పెడుతున్నాం. అందులో తొలి త్రైమాసిక ఫీజుల కింద మొన్ననే వారి చేతికి రూ.671 కోట్లు ఇచ్చాం. ► జగనన్న వసతి దీవెన కింద పిల్లల హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రెండు దఫాల్లో రూ.20 వేల వరకు ఇసున్నాం. ఇప్పటివరకు రూ.1,221 కోట్లు అందజేశాం. ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా ఈనెల 28న దాదాపు మరో రూ.1,200 కోట్లు తల్లుల ఖాతాల్లో వేస్తాం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పుడు ఇస్తున్న రూ.1,109 కోట్లు కూడా కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.2,509 కోట్లు ఈ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏటా రూ.1,863 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనిపై గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే వ్యయం చేసేవారు. ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 55,607 అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. ► నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు బాలికల సంఖ్య పెంచి స్కూళ్లకు వచ్చే విధంగా ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తున్నాం. ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.492 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తంతో 82 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.384 కోట్లు, వైఎస్సార్ బీమా ద్వారా 17,03,703 మంది మహిళలకు రూ.176 కోట్లు. వైఎస్సార్ వాహనమిత్రతో 24 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.45.7 కోట్లు, జగనన్న చేదోడు పథకం ద్వారా 1.36 లక్షల అక్క చెల్లెమ్మలకు రూ.136 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2.73 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.824 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా 94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.50.66 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా 21.67 లక్షల మంది చిట్టి తల్లులకు రూ.335 కోట్ల మేర సహాయం అందించాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి అడుగులోనూ ప్రాధాన్యం.. ఇవాళ ప్రతి అడుగులో అక్కచెల్లెమ్మల బాగు కోసం చేస్తున్న కృషి కనిపిస్తోంది. చివరకు మంత్రివర్గాన్ని చూసినా ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వగా, హోంమంత్రి కూడా మహిళకే ఇచ్చాం. మున్సిపల్ పదవుల్లో కూడా మహిళలకు 61 శాతం ఇచ్చామని గర్వంగా చెబుతున్నా. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో సగం మహిళలకు ఇస్తూ చట్టాలు చేశాం. బీసీ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, చివరకు ఆలయాల బోర్డులలో కూడా సగం మహిళలే కనిపిస్తారని సగర్వంగా తెలియజేస్తున్నా. దిశ చట్టం – యాప్.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ దేశంలోనే విప్లవాత్మక పరిణామంగా ఏపీ దిశ చట్టాన్ని చేసి కేంద్రానికి పంపాం. ఇçప్పటికే 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 18 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, దిశ యాప్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. 900 పెట్రోలింగ్ వాహనాలు: మహిళా కానిస్టేబుళ్ల పెట్రోలింగ్ కోసం కొత్తగా 900 వాహనాల కొనుగోలు చేసి జీపీఎస్ అనుసంధానం చేశాం. వారు పోలీసు కంట్రోల్ రూమ్‌తో పాటు డివిజన్ స్థాయి కార్యాలయంతో అనుసంధానమై ఉంటారు. విద్యార్థినిలపై నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న మార్కెట్ ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీల వద్ద పక్కాగా పెట్రోలింగ్ ఏర్పాట్లు చేశాం. సహాయక డెస్కులు మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సహాయక డెస్కులు ఏర్పాటు చేశాం. వాటిలో మహిళలే పని చేస్తారు. బాధిత మహిళల సమస్య వినడం మొదలు ఫిర్యాదు చేసేవరకు సహాయం చేస్తారు. ఇంకా సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. దశలవారీగా మద్య నియంత్రణ.. మహిళల సాధికారత, సంతోషంగా ఉండేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. దాదాపు 4,380 పర్మిట్ రూమ్‌లను కూడా రద్దు చేశాం. దీనివల్ల మహిళలకు మరింత భద్రత ఏర్పడిందని గర్వంగా చెబుతున్నా. గతంలో మద్యం షాపులు రాత్రి 11 వరకు ఉండగా ఇప్పుడు రాత్రి 8 గంటలకే మూసివేయిస్తున్నాం. ఉదయం 11 గంటలకు మాత్రమే తెరుస్తూ వాటిని ప్రభుత్వమే నడుపుతోంది. మద్యం షాపులను మూడో వంతు తగ్గించడంతో ఇప్పుడు కేవలం 2,966 షాపులు మాత్రమే మిగిలాయి. ధరలు బాగా పెంచడం వల్ల మద్యం అమ్మకాలు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చాలా తగ్గాయి. 2018–19లో 3.80 కోట్ల కేసుల లిక్కర్ అమ్మితే ఇవాళ (2020–21లో) 1.87 కోట్ల కేసులకు లిక్కర్ అమ్మకాలు తగ్గాయి. అంటే దాదాపు 51 శాతం తగ్గాయి. 2018–19లో 2.90 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోతే 2020–21లో కేవలం 57.02 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడు పోయాయి. అంటే దాదాపు 80 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇలా ప్రతి మహిళకు సంతోషం కలిగించాలన్న తాపత్రయం, తపనతో ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా అడుగులు వేస్తున్నానని సగర్వంగా చెబుతున్నా. నిజమైన హీరో మీరే.. ‘దివంగత వైఎస్సార్ పావలావడ్డీ ప్రవేశపెట్టి మహిళా సంఘాలకు ప్రాణం పోస్తే మీరు వైఎస్సార్ సున్నా వడ్డీ తెచ్చి ఆర్థిక చేయూత అందిస్తున్నారు. గత ఏడాది మేం కట్టాల్సిన వడ్డీని మా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మనసున్న సీఎంగా నిలిచారు. బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాల మహిళలకు వడ్డీని 12.5% నుంచి 9.5 శాతానికి తగ్గించిన ఘనత మీదే. మీ పథకాల వల్ల మాకు సంఘంలో గౌరవం పెరిగింది. సినిమాల్లో హీరో ఎన్నో చేస్తాడు.. కానీ నిజ జీవితంలో ఇన్ని కోట్ల మందికి మేలు చేస్తున్న మీరు రియల్ హీరో. మా పిల్లలకు మీరే రోల్ మోడల్. పది కాలాల పాటు మీరే సీఎంగా ఉండాలి’ – మల్లేశ్వరి. బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా కుటుంబాలు బాగు పడుతున్నాయి.. ‘నాడు పావలా వడ్డీతో వైఎస్సార్ ఆదుకుంటే మీరు మరో అడుగు ముందుకు వేసి వైఎస్సార్ సున్నా వడ్డీని అమలు చేస్తున్నారు. నవరత్నాలను మాట తప్పకుండా అమలు చేస్తూ ప్రతి పథకాన్ని మహిళలకే అందచేస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు చాలా బాగు పడుతున్నాయి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణమాఫీ పేరుతో మోసం చేసింది. మీరు అందిస్తున్న భరోసాతో చీరల వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ.20 వేలు సంపాదించుకుంటున్నా. మహిళలకు ఇంత మేలు చేస్తున్న జగనన్న ఎప్పుడూ సీఎంగా ఉండాలి’ – మౌలానీ, కొత్తపల్లి మండలం, కర్నూలు జిల్లా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ‘మా సంఘానికి బ్యాంకు నుంచి రూ.9 లక్షల రుణం వచ్చింది. వడ్డీ భారాన్ని పొదుపు సంఘాల ఖాతాకు ప్రభుత్వమే జమ చేసింది. కరోనా విపత్కర పరిస్థితిలోనూ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. మీరు ఇస్తున్న భరోసాతో నేను, మా అత్త ఫ్యాన్సీ, కిరాణా షాప్ పెట్టుకుని నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి?’ – కృష్ణవేణి, మద్దూరు, కృష్ణా జిలా మహిళా పక్షపాత ప్రభుత్వం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ‘సీఎం జగన్‌ది విలక్షణ పాలన. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. దేశంలో ఏ సీఎం కూడా అలా చేయలేదు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. ఇది మహిళ పక్షపాత ప్రభుత్వం. దాదాపు 20 పథకాలలో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. గత ఏడాది కంటే రుణాల సంఖ్య పెరిగినా వెనుకంజ వేయలేదు. బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీని తగ్గించడం వల్ల మహిళలపై రూ.590 కోట్ల వడ్డీ భారం తగ్గింది. ఒక క్యాలెండర్ ప్రకటించి పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా ఏ ఒక్క పథకం విషయంలోనూ వెనుకంజ వేయడం లేదు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు 4.65 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ పథకాల ద్వారా వారికి మేలు జరుగుతోంది’ నాడు మహిళలు బంగారం అమ్ముకున్నారు – బొత్స సత్యనారాయణ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ కింద గత ఏడాది రూ.1,400 కోట్లు ఇవ్వగా ఈసారి రుణాల సంఖ్య పెరిగినా రూ.1,109 కోట్లు ఇస్తున్నామంటే అందుకు కారణం బ్యాంకులు వడ్డీని 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించడమే. చంద్రబాబు మాట ఇచ్చి డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయకపోగా చివరకు సున్నా వడ్డీని కూడా అమలు చేయలేదు. దీంతో కొందరు డ్వాక్రా మహిళలు చివరకు బంగారం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ డబ్బులు జమ చేయడం సంతోషకరం’ తోబుట్టువులు లేని లోటు తీరుస్తున్నారు మాకు తోబుట్టువులు లేని లోటును మీరు తీరుస్తున్నారు. ఒక కుమార్తెకు తండ్రిలా.. ఒక చెల్లెకు అన్నలా అండగా నిలుస్తున్నారు. మేం చేసిన రుణాలను మీరు తీరుస్తున్నారు. నాకు ఈ ఏడాది రూ.3,500 సున్నా వడ్డీ రాయితీ లభించింది. గత ఏడాది సున్నా వడ్డీని ప్రకటించి ఆదుకున్నారు. ఆనాడు మైక్రోఫైనాన్స్ కబంధ హస్తాల నుంచి వైఎస్సార్ మమ్మల్ని రక్షించారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడిలా ఆదుకుంటున్నారు. – పి.సాయిలీల, ప్రశాంతి మహిళా సంఘం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా -
‘సున్నా వడ్డీ నగదు’ జమ చేసిన సీఎం జగన్
-
‘సున్నా వడ్డీ నగదు’ జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించింది. ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ‘‘మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగాం. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నాం. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. అక్కాచెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. మహిళా సాధికారత మా నినాదం కాదు.. మా విధానం. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా.. మహిళలకు 50 శాతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామని.. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళల కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామని పేర్కొన్నారు. 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామన్నారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు -
నేడు అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్‌గా శుక్రవారం బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను జమ చేయనుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్ 24న చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను సరిగ్గా ఏడాదికి.. శుక్రవారం చెల్లించనున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన అక్కచెల్లెమ్మలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. సంఘాల వారీగా వడ్డీ డబ్బులను సీఎం వైఎస్ జగన్ ఆన్లైన్ విధానంలోశుక్రవారం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 9.34 లక్షల సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆయా సంఘాలు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన రుణాలపై రూ.1,109 కోట్ల మేర వడ్డీ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పారదర్శకత కోసం ప్రతి ఊరిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించింది. మహిళలకు లేఖ రాసిన సీఎం.. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులను చెల్లిస్తున్న సందర్భంగా సీఎం జగన్ లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను లేఖలో వివరించారు. లబ్ధిదారులకు శుక్రవారం నుంచి వీటిని పంపిణీ చేస్తారు. చదవండి: (ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్) -
చేతల సర్కారు.. చేవ చూపారు
సాక్షి, అమరావతి: ఇప్పుడు రైతులపై నమ్మకంతో బ్యాంకులు విరివిగా రుణాలిస్తున్నాయి. సకాలంలో రుణాలను తిరిగి చెల్లిస్తుండటంతో మాపై గురి కుదిరింది. కౌలు రైతులకు సైతం రుణాలు అందుతున్నాయి. ఏది కావాలన్నా మా గ్రామంలోని ఆర్బీకేల్లోనే దొరుకుతున్నాయి. పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి తప్పింది...! మీది చేతల ప్రభుత్వం.. చేవ కలిగిన ప్రభుత్వం..! వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ లబ్ధిదారులైన రైతుల సంతోషం ఇదీ. మంగళవారం సీఎం జగన్‌తో వీడియోకాన్ఫరెన్స్‌లో పలు జిల్లాలకు చెందిన రైతులు మాట్లాడారు. ఆయిల్ పామ్ రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే దేశంలో ఆయిల్ పామ్ రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే. ధర లేక నష్టాల పాలవుతున్న ఆయిల్ పామ్ రైతులకు రూ.80 కోట్లు కేటాయించి ఆదుకున్నారు. మాకు ఈ రోజు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద రూ.3,900 వచ్చింది. రైతుభరోసా కింద అందిస్తున్న సాయంతో పెట్టుబడి అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల అదనంగా వడ్డీ రాయితీ లభిస్తోంది. బ్యాంకుల వద్ద పరపతి పెరుగుతోంది. ఇప్పుడు బ్యాంకులు మాకు రెండు ఎకరాలకు రూ.లక్ష వరకు రుణం ఇస్తామని చెబుతున్నాయి. రైతులకు చాలా సౌలభ్యంగా ఉండేలా పరిపాలన చేస్తున్నారు. –దాట్ల వెంకటపతి, రాజానగరం మండలం, కల్వచర్ల గ్రామం, తూర్పు గోదావరిజిల్లా తొలిసారి లోన్ వచ్చింది.. సొంత భూమితో పాటు ఐదు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 2019లో ప్రభుత్వం కౌలు రైతుకార్డు ఇవ్వడంతో బ్యాంకు ద్వారా రూ.60 వేల రుణం తీసుకుని సకాలంలో చెల్లించా. రూ.2,400 వడ్డీ రాయితీ రావడం చాలా సంతోషంగా అనిపించింది. కౌలుదారులకు ఎక్కడా రుణాలివ్వరు. మొదటిసారి వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాకు లోన్ వచ్చింది. సున్నావడ్డీ కింద ఇప్పుడు వడ్డీ రాయితీ అందింది. రూ.90 వేలకుగానూ రూ.3,600 చొప్పున మా కుటుంబానికి వడ్డీ రాయితీ వచ్చింది. నోటిఫైడ్ పంటల్లో మినుము, పెసర కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. – శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, వల్లూరు మండలం, వైఎస్సార్ కడప జిల్లా కౌలు రైతుల కళ్లల్లో వెలుగులు.. రైతు కళ్లలో వెలుగులు చూడాలని తపిస్తున్న మీరు ఎప్పుడూ సీఎంగా వుండాలి. సహకార సంఘం ద్వారా రూ.98 వేలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించడంతో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద వడ్డీ రాయితీ రూపంలో నాకు తాజాగా రూ.3,620 వచ్చాయి. మా కుటుంబానికి వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.12 వేల మేరకు లబ్ధి కలుగుతోంది. బ్యాంకుకు వెళ్లకుండానే వడ్డీ రాయితీ గురించి ఆర్బీకేల్లోని జాబితా చూసుకుంటే వివరాలు తెలుస్తున్నాయి. గతంలో వడ్డీ రాయితీ వర్తిస్తుందో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు ఆర్బీకే వద్దకు వెళ్తే చాలు. మీది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. – గాజుల మాధవరావు, బందరు మండలం, పొట్లపాలెం గ్రామం, కృష్ణా జిల్లా నమ్మకంతో రుణాలు అందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సున్నావడ్డీ రైతుల పాలిట వరం. దీనిద్వారా రైతులు సకాలంలో రుణాలు పొంది సకాలంలో జమ చేస్తున్నారు. దీనివల్ల రైతులకు, బ్యాంకులకు మధ్య నమ్మకం ఏర్పడింది. నేను బ్యాంకుల నుంచి రూ.30 వేలు పంట రుణం పొందా. దాని కింద సుమారు రూ.1,100 వడ్డీ రాయితీ ఇప్పుడు అందుతోంది. అప్పు చేయాల్సిన పని లేకుండా రైతుభరోసా డబ్బులతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేలోనే కొనుగోలు చేస్తాం. పంట వేసిన నాటి నుంచి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు రైతుభరోసా కేంద్రాలు సాయం చేస్తున్నాయి. – ప్రవీణ్‌కుమార్, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా -
రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది
తప్పనిసరిగా నమోదు చేసుకోండి ఇప్పుడు 6.28 లక్షల మంది రైతుల్లో దాదాపు 2.50 లక్షల మంది వివరాలు ఈ–క్రాప్‌లో లేకపోయినా వారి పట్ల ఉదారంగా ఉండేందుకు అందరికీ సున్నా వడ్డీ ఇస్తున్నాం. ఏ ఒక్క రైతుకూ సున్నా వడ్డీ అంద కుండా ఉండొద్దు. ప్రతి అడుగులోనూ ఒక మంచి జరుగుతున్నప్పుడు రైతన్నలు సహకరించాలి. ప్రభుత్వం ఏ సహాయం చేయాలన్నా ఈ–క్రాపింగ్ చాలా అవసరం. దీన్ని ఏ ఒక్క రైతు కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ ఈ–క్రాపింగ్ నమోదు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఈ–క్రాపింగ్‌లో నమోదు చేయించుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. – ముఖ్యమంత్రి జగన్ రైతుబిడ్డగా చెబుతున్నా... నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లను స్వయంగా చూశా. వారికి ఎలా మేలు చేయాలన్నది ఆనాడే ఆలోచించా. రైతుల కష్ట నష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. ఒకటి... పెట్టుబడి ఖర్చు బాగా పెరగడం. రెండో కారణం.. రైతు కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారుల ప్రమేయం. మూడో కారణం... పంటలకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడం. నాలుగో కారణం... ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ 22 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు అండగా నిలబడ్డామని ఒక రైతు బిడ్డగా, మీ అందరి బిడ్డగా, ఒక అన్నగా సగర్వంగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ ఒకరోజు ముందే రైతులకు పండుగ రెండు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తున్నాను. బ్యాంకు నుంచి రూ.90 వేలు రుణం తీసుకున్నా. సకాలంలో చెల్లించినందుకు నాకు సున్నా వడ్డీ కింద రూ.3,600 జమ అవుతున్నట్లు ఆర్బీకేలోని జాబితాలో ఉంది. శ్రీరామనవమి ఈరోజే వచ్చినంత సంతోషంగా ఉంది. 2సార్లు రైతు భరోసా కూడా అందింది. పంటల బీమాకు మీరు ఒక్క రూపాయి కడితే చాలన్నారు. మొదటి ఏడాది పత్తి, కందికి కట్టా. పంటనష్ట పరిహారం కూడా అందింది. – సీహెచ్ శ్రీనివాస్, దువ్వల, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా అన్నదాతల సంక్షేమం కోసం ఖర్చు చేశామని మీ అందరి బిడ్డగా, ఒక రైతు బిడ్డగా సగర్వంగా చెబుతున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విత్తనం సరఫరా మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులు ఏ పరిస్థితుల్లో నష్టపోతారో గ్రహించడమే కాకుండా వాటిని నివారించేలా సాగుదారుల కోసం పలు చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలుగా ప్రతి రైతు తమ పంటల వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపచేస్తోంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు, అధికారులనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. రైతు బాగుంటేనే.. ఏప్రిల్‌లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వారిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డ దాదాపు 62 శాతం జనాభా బాగా బతికే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్అండ్ఏ) సర్వే ప్రకారం భూమి మీద ఉన్న దాదాపు 780 కోట్ల మంది ప్రజల్లో 60 శాతం మంది వ్యవసాయం, అనుబంధ విభాగాలపై ఆధారపడి ఉన్నట్లు తేలింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే చెబుతున్నాం. ప్రతి అడుగులో రైతన్నల సంక్షేమం.. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 22 నెలల్లో ప్రతి అడుగులో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశాం. రాష్ట్రంలో 18.70 లక్షల పంపుసెట్లు ఉండగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలని ఏటా దాదాపు రూ.8,800 కోట్ల చొప్పున రెండేళ్లలో దాదాపు రూ.17,600 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల నాణ్యత కోసం అదనంగా మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని ఒక రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంకో నాలుగు అడుగులు.. నాన్న వైఎస్సార్ రైతుల కోసం కొన్ని అడుగులు వేస్తే ఇప్పుడు ఆయన కంటే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నా. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో అర హెక్టారు (1.25 ఎకరాలు) ఉన్న రైతులు 60 శాతం, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) ఉన్న రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. రైతులకు ఏటా మనం ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం వారికి దాదాపు 80 శాతం వరకు ఉపయోగపడుతోంది. రైతులకు ఏటా మూడు విడతల్లో ఆ సాయం అందిస్తున్నాం. ఇప్పటికే రెండేళ్లు ఇచ్చాం. మూడో ఏడాది కూడా ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండేళ్లలో 51.59 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున మొత్తం రూ.13,101 కోట్లు ఖర్చు చేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సంతోషంగా తెలియజేస్తున్నా. ఆర్బీకేలు.. విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అవి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుస్తున్నాయి. రైతుల చేయి పట్టుకుని నడిపిసున్నాయి. ఆ విధంగా గ్రామ స్థాయిలోనే సేవలు అందిస్తున్నాం. ఉచిత బీమా.. కేవలం ఒక్క రూపాయి కడితే చాలు రైతులకు బీమా సదుపాయం కల్పిస్తున్నాం. అన్ని ఆర్బీకేలలో ఈ–క్రాప్ డేటాలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు 22 నెలల వ్యవధిలో రూ.1,968 కోట్లకు పైగా బీమా పరిహారం చెల్లించాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఆ మేరకు దాదాపు రూ.1,056 కోట్లు ఇవ్వగలిగామని మీ బిడ్డగా చెబుతున్నా. సున్నా వడ్డీ.. సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత సర్కారు వదిలేసిన బకాయిలు దాదాపు రూ.850 కోట్లు (బ్యాంకులు అప్లోడ్ చేసినవి) మన ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2019 – 20 ఖరీఫ్‌కు సంబంధించి రూ.289 కోట్లు ఇచ్చా. అదే ఏడాది రబీకి సంబంధించి ఇవాళ రూ.128.47 కోట్లు ఇస్తున్నాం. ప్రత్యేక నిధితో సహాయం.. ఇవి కాకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధికి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించడమే కాకుండా కనీస మద్దతు ధర లేని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రూ.4,761 కోట్లు ఖర్చు చేసి పలు పంటలు కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు కోసం రూ.18,344 కోట్లు ఖర్చు చేశాం. పాడి రైతులకు అండ.. పాడి ద్వారా రైతులు బాగు పడాలని చర్యలు తీసుకున్నాం. లీటరు పాలు, మినరల్ వాటర్ ధరల మధ్య తేడా లేదని రైతులు చెప్పారు. అందుకే పాడి రైతులు, అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు ఏపీ–అమూల్ పాలవెల్లువ ద్వారా నాలుగు జిల్లాలలోని దాదాపు 600 గ్రామాలలో పాల సేకరణ చేపట్టాం. ఒక్కో లీటరుపై పాడి రైతులకు దాదాపు రూ.7 ఎక్కువ గిట్టుబాటు అవుతోంది. జగనన్న జీవక్రాంతి పథకంలో దాదాపు 1.20 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూతలో పాడి గేదెలు అందచేస్తున్నాం. ఆ కుటుంబాలను ఆదుకున్నాం.. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఏటా దాదాపు రూ.780 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే ఆలోచన చేయకుండా గత సర్కారు దాదాపు 434 కుటుంబాలను వదిలేస్తే మన ప్రభుత్వం వచ్చాక ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. ఇంకా మన ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 82 మంది రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, ఎస్సెల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి అధికారులు, పెద్ద సంఖ్యలో రైతుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏటా రూ.46 వేలు సంతోషంగా ఇస్తున్నాం.. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం ద్వారా వారికి చాలా లాభం కలుగుతుంది. ఉదాహరణకు ఒక రైతు 7.5 హెచ్‌పీ మోటారు వినియోగిçస్తుంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. అలా రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా ప్రకారం చూస్తే రోజుకు 45 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అంటే నెలకు ఆ రైతు వినియోగించే విద్యుత్ 1,350 యూనిట్లు. ఇవాళ మార్కెట్లో మనం సేకరిస్తున్న యూనిట్ విద్యుత్ సగటు ధర రూ.5.20 చొప్పున లెక్క వేస్తే నెలకు దాదాపు రూ.7,020 అవుతుంది. ఏటా సగటున 200 రోజులు రైతులు విద్యుత్ వినియోగిస్తారని లెక్కిస్తే ఆ మొత్తం వ్యయం దాదాపు రూ.46 వేలు అవుతుంది. ఆ మొత్తాన్ని కూడా రైతుల కోసం సంతోషంగా వ్యయం చేస్తున్నాం. ప్రతి రైతుకు మంచి జరగాలి.. రైతులు అప్పులపాలు కాకుండా వారికి సున్నా వడ్డీ రుణాలు అందాలి. ప్రతి ఒక్క రైతు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. ఏ పంట, ఏ రైతు, ఎన్ని ఎకరాల్లో వేశారన్న పూర్తి సమాచారం ఉంటుంది. పంట రుణాలు, సున్నా వడ్డీ, బీమా, చివరకు గిట్టుబాటు ధర కోసం కూడా ఈ–క్రాప్ డేటా అవసరం. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారే నమోదు చేస్తారు. వచ్చే నెలలో రైతు భరోసా, ఖరీఫ్ 2020కి సంబంధించి బీమా పరిహారం విడుదల ఉంటుంది. ఆ డబ్బు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి రైతుకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. మనసా వాచా కర్మణా.. మేనిఫెస్టోలో నవరత్నాల తొలి వాగ్దానాలన్నీ రైతులకు సంబంధించినవే. అందులో చెప్పిన ప్రతిదీ మనసా వాచా కర్మణా ఈ రెండేళ్లలో అమలు చేశానని ఒక రైతుబిడ్డగా సగర్వంగా చెబుతున్నా. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లను గత ఏడాది (2020) రబీకి సంబంధించి సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. గత ఏడాది పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులందరికీ ఈ పథకంతో మేలు కలుగుతోంది. 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 61,22,588 మంది రైతులకు రూ.1,132.54 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిన బకాయిలతో కలిపి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తంతో పాటు ఇవాళ ఇస్తున్న మొత్తం కూడా కలిపితే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు దాదాపుగా రూ.1,300 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట అమలు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి అమలు చేస్తున్నారు. దీంతో హరిత విప్లవం సాకారమవుతోంది. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నుంచి నీరు విడుదల చేయడంతో ఎక్కడా పంటలు ఎండిపోవడం లేదు. ఏ సీజన్‌కు సంబంధించి అదే సీజన్లో అన్నీ అందిస్తున్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు దాదాపు రూ.129 కోట్లు సున్నా వడ్డీ రాయితీ కింద ఇస్తున్నాం. 2014 – 15 నుంచి 2018 – 19 వరకు గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు దాదాపు రూ.1,180 కోట్లు సైతం ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం ఇచ్చారు. సామాజిక తనిఖీ, సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన వల్ల పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్
-
రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019-20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ అందించింది. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇక లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. తొలుత ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే ఈ-క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. చదవండి: రూ.912.84 కోట్లతో పోలవరం ఎత్తిపోతల పనులు -
నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’
సాక్షి, అమరావతి: రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది. (చదవండి: ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) -
అన్నదాతలకు శుభవార్త
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రబీ–2019లో అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టినప్పటికీ.. రబీ–2019 సీజన్‌కు ఆ నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుండగా.. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు వర్తింపు వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు (కిస్తీలు) చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ (4 శాతం) మొత్తాన్ని ‘వడ్డీ లేని రుణ పథకం’ కింద గతంలో బ్యాంకులకు జమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. అలాంటిది రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్–2019 సీజన్లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.25 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ కింద గతేడాది నవంబర్‌లో రూ.289.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. 6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లు రబీ–2019–20 సీజన్లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో ఇప్పటివరకు 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో బ్యాంకర్లు అప్లోడ్ చేశారు. వాస్తవ సాగుదారులకు మాత్రమే వడ్డీ రాయితీ అందించాలన్న సంకల్పంతో ఈ జాబితాను ఈ–క్రాప్‌తో సరిపోల్చి 2,50,550 మంది రైతులను వ్యవసాయ శాఖ అర్హులుగా గుర్తించింది. రైతులకు సాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. దీంతో బ్యాంకర్లు అప్లోడ్ చేసిన 6,27,906 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఈ నెల 20వ తేదీన రూ.128.47 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. పాత బకాయిలూ చెల్లింపు వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ విధంగా 35 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.789.36 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది. ఇంకా సున్నా వడ్డీ రాయితీ కింద రూ.78 కోట్లతోపాటు పావలా వడ్డీ కింద రూ.42.39 కోట్ల బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకే.. రబీ 2019–20 సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేశాం. అయితే, ఎస్వీపీఆర్ పోర్టల్‌లో బ్యాంకర్లు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. బ్యాంకర్లు అప్లోడ్ చేసిన జాబితాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకూ వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ అందనుంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 90 శాతం హామీలు అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ధర్నాలు చేసినా పరిహారం వచ్చేది కాదు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. – శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా సాక్షి, అమరావతి : ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ఈ రోజు నిజంగా మరో ఘట్టం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదని, మొదటిసారిగా ఆ నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుతోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు గతంలో ఏం జరిగింది? ► గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015–16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ► 2015–18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ► ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ► అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ఎవరికైనా ఈ పథకాలు మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. ► వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. పేద రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. రైతుల కోసం బకాయిలు చెల్లించాం ► గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8,655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1,180 కోట్లు ఇస్తున్నాం. ► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ► పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. అన్నదాతల కోసం ఎన్నెన్నో చేస్తున్నాం ► 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ► పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. ► 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలోనూ రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ.3,218 వడ్డీ మాఫీ వచ్చింది. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. – ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గుంటూరు జిల్లా నంబూరు రైతులు మీ పట్ల నమ్మకం పెరిగింది మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. మీ పనితీరు పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. – విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా -
ఇది రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే 90 శాతం వాగ్దానాలను అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. సాక్షి, అమరావతి: ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసం రైతుల్లో కలిగించామన్నారు. మాట చెబితే ఆ మాటపై నిలబడతామనే నమ్మకం కల్పించామని చెప్పారు. 2019 ఖరీఫ్‌కు చెందిన 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లను చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ తొలి దశలో మూడు జిల్లాల్లో ఈ నెల 26 నుంచి చేపడుతున్నామన్నారు. ‘ఈ రోజు నిజంగా మరో ఘట్టం. రైతులకు మంచి చేసే విషయంలో ఎంతో సంతోషం కలిగించేది. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుందన్న నమ్మకం కలుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదు. మొదటిసారిగా ప్రభుత్వంపై విశ్వసనీయత కలుగుతోంది. ఆ నమ్మకం ఇవ్వగలుగుతున్నాం’ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 18 నెలల్లో 90 శాతం హామీలు అమలు ►ఈ నెలాఖరుకు మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఎన్నికల హామీలు ప్రకటించి, ఆ తర్వాత దాన్ని పట్టించుకోని వారిని చూశాం. కానీ మనం మన మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి 90 శాతం హామీలు అమలు చేశాం. ► రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ 14.58 లక్షల రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510 కోట్లు జమ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. ఆర్బీకేలు - రైతు భరోసా ► రైతు భరోసా కేంద్రాల గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా ఏర్పాటు చేశాం. నవరత్నాలులో తొలి మాట రైతు భరోసా రూ.12,500కు బదులుగా రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లకు బదులుగా 5 ఏళ్లు ఇస్తున్నాం. వరసగా రెండో ఏడాది కూడా జమ చేశాం. ► రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా అందుతోంది. గతంలో ఏం జరిగింది? ►గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015-16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ►2015-18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ►ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ►అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ►వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. వారికి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. అర్హత ఉండి రాకపోతే.. ►అర్హత ఉన్నప్పటికీ ఇప్పుడు లబ్ధి కలగకపోతే కంగారు పడొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది. అర్హుల జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించాం. ఎవరికైనా మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. 155251 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ►అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా మిగిలి పోకూడదని ఆరాటపడే ప్రభుత్వం ఇది. అందుకే ఈ నెలలోనే వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాం. పలు పథకాల్లో కొత్త వారికి ప్రయోజనం కల్పించాం. రైతుల కోసం ఎన్నెన్నో.. ►గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1180 కోట్లు ఇస్తున్నాం. ►రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ►పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు ►13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షించి, నిర్ధారించి అందిస్తున్నాం. గతంలో ఏనాడూ ఇది జరగలేదు. దీంట్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించి క్వాలిటీ చూడాలని చెప్పాం. 26 నుంచి అమూల్ పాల సేకరణ ►రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ►పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలు ►2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో రూ.3,200 కోట్లతో బత్తాయి, అరటి, మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు, టమాట తదితర పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ►అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మీకు ఏ సమస్య వచ్చినా మీ బిడ్డ తోడుగా ఉంటాడని చెబుతున్నాను. దేవుడు రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ►ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక సీజన్లోనే వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అక్టోబర్‌లో జరిగిన పంట నష్టానికి నెల రోజుల వ్యవధిలోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. అందుకు మీకు రైతుల తరఫున కృతజ్ఞతలు. - కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. పిల్లలు కూడా వదిలేయమన్నారు. రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ. 3,218 వడ్డీ మాఫీ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో లక్షకు రూ.2 వేలు పై చిలుకు మేమే ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్లం. కానీ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. - ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా మీ పట్ల నమ్మకం పెరిగింది గ్రామ సచివాలయాలు ఓ చరిత్ర, అద్భుతంగా పని చేస్తున్నాయి. ఎక్కడ నుంచి ఇన్ని పథకాలకు మీరు డబ్బులు తెస్తున్నారని అడుగుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ రాయితీ ఇస్తుందని మీ పనితీరు ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. - విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా రైతుల పాలిట మీరు దేవుడు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. గతంలో ఈ డబ్బులు రెండేళ్లైనా వచ్చేవి కావు. మీ వల్ల అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. - శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా