Breadcrumb
- HOME
YSR Sunna Vaddi 2022: ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
Published Fri, Apr 22 2022 8:40 AM | Last Updated on Fri, Apr 22 2022 5:46 PM
Live Updates
YSR Sunna Vaddi 2022: ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
ఇంతకంటే సామాజిక న్యాయం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా
70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. 5 డిప్యూటీ సీఎంలుంటే మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలనే కొనసాగించాం. ఇంతకంటే సామాజిక న్యాయం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా. సామాజిక న్యాయమన్నది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాం అని సీఎం జగన్ అన్నారు.
అనంతరం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి జమచేశారు.
35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం
సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగింది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు. మీ ఇబ్బందులే నా ఇబ్బందులుగా భావించాను. ఇంత మంది జరుగుతున్నా కూడా బాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోంది. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్, రామోజీరావు, టీవీ5.
ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు మంచి చేయొద్దని అంటున్నారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మనది
వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. వైఎస్సార్ చేయూతతో రూ.9,180 కోట్లు చెల్లించాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.589 కోట్లు చెల్లించాం. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నాలుగింట ఒకవంతు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం.
చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. జగనన్న విద్యాదీవెనలో 21.55లక్షల మందికి సాయం చేశాం. పిల్లల చదువులకు పూర్తి పీజు రీఎంబర్స్మెంట్ చేశాం. జగనన్న విద్యాదీవెనలో రూ.6,966 కోట్లు ఇచ్చాం. పాతబకాయిలను కూడా మనమే తీర్చాం.
మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం: సీఎం జగన్
మన ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సంఖ్య 80 లక్షల నుంచి కోటీ 2 లక్షలకు పెరిగింది. అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబిలోంచి బయటకు లాగాం. పొదుపు సంఘాల సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం. టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రూ.2500 అవ్వాతాత చేతుల్లో పెడుతున్నాం.
దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది: సీఎం జగన్
అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. ప్రభుత్వంపై నమ్మకమున్న అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టింది.
వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నాం: సీఎం జగన్
ఒంగోలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. సాధికారత సారధులకు అభినందనలు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించాం. రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించాం. వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు చెల్లించాం. కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగింది. గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని గత ప్రభుత్వం ఆలోచించలేదు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం.
సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు: బాలినేని
కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ.. పావలా వడ్డీని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టి డ్వాక్రా మహిళలను మోసం చేశారు. అదే సీఎం జగన్ ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలను నెరవేర్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్
సభాస్థలిలో స్వయం సహాయక సంఘాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్ పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా సభకు వచ్చిన వారి కోసం భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటితో పాటు మొబైల్ టాయిలెట్ల సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భారీ కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ఇతరులకు ప్రత్యేక ద్వారాలు సిద్ధం చేశారు
ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకున్నారు.
ఒంగోలు చేరుకున్న సీఎం జగన్
ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు చేరుకున్నారు. ఏబీఎం గ్రౌండ్లో సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటనకు బయలుదేరారు. మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.
సభాస్థలిలో ప్రత్యేక ఏర్పాట్లు...
సభాస్థలిలో స్వయం సహాయక సంఘాలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సభకు వచ్చిన వారి కోసం భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటితో పాటు మొబైల్ టాయిలెట్ల సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భారీ కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ఇతరులకు ప్రత్యేక ద్వారాలు సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.
ఆర్థిక భరోసా
భారీ ఏర్పాట్లు...
ఒంగోలు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా ఒంగోలులో భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు స్థానిక ఏబీయం కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో సీఎం దిగుతారు. అక్కడ పావుగంట పాటు అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. 10.30 గంటలకు పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఏబీయం కాలేజీ వద్ద నుంచి చర్చిసెంటర్, గవర్నర్ రోడ్డు, కోర్టు స్ట్రీట్, పోలేరమ్మ ఆలయం రోడ్డు మీదుగా సభావేదికకు వెళ్లే మార్గంలో బ్యారికేడ్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నూతన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. గురువారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ మలికాగర్గ్ పర్యవేక్షించారు.
ఒంగోలులో ముఖ్యమంత్రి పర్యటన సాగేదిలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బందర్ రోడ్‌లోని రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళతారు. వారింట్లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి రాకతో పండుగ వాతావరణం
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభానికి ఒంగోలు వేదికవుతోంది. బృహత్తర కార్యక్రమాలను ఇక్కడ నుంచే ప్రారంభిస్తుడటంతో ప్రకాశం జిల్లా పులకిస్తోంది. సంక్షేమ పథకాలను ఉద్యమంలా చేపడుతూ ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోంది. వాటిలో కొన్ని కార్యక్రమాల ప్రారంభానికి వేదికవడం ఒంగోలుకు వరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లా కేంద్రంలో ప్రారంభించడం ద్వారా ప్రకాశంకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 31, 2019న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. నేడు ఐదోసారి వస్తున్నారు. ముఖ్యమంత్రి రాకతో పండుగ వాతావరణం నెలకొంది.
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు
ఇదిలా ఉండగా, వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్ రిటైల్, అమూల్, ఆజియో–రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర అండ్ ఖేతి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదర్చడంతో పాటు రుణాల కోసం బ్యాంకులను అనుసంధానం చేసింది. వడ్డీ శాతాన్ని 13.50 నుంచి 9.50 – 8.50 శాతంకు తగ్గించేలా బ్యాంకులను ఒప్పించింది. అమూల్ సహకారంతో పాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంది.
ప్రభుత్వమే వారి భారాన్ని భరిస్తూ..
బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుంది. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
YSR Sunna Vaddi 2022: సున్నా వడ్డీ పండుగ
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తద్వారా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి కలుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఒంగోలులో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము జమ చేయనున్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లవుతుంది.
Related News By Category
Related News By Tags
-
మహిళా సాధికారతలో రాష్ట్రం అగ్రగామి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మహిళ వ్యాపార దక్షతతో ఎదిగేందుకు ఓ అన్నగా, తమ్ముడిగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు వరు...
-
నేడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ నగదు జమ
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ వైఎస్సార్ సున్నా వడ్డీ (మహిళలు) పథకం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయ...
-
మేలు.. చూడండి
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచి చేయిపట్టి నడిపిస్తున్నాం. ఇచ్చిన హామీలతో ...
-
అక్కా చెల్లెమ్మలకు అండగా.. పథకాలు మెండుగా..
రాయచోటి: సంక్షేమమే ఊపిరిగా.. అభివృద్ధి అజెండాగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అతివలను ...
-
అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను
సాక్షి, అమరావతి: వర్తన చిన్ని... రెండేళ్లుగా ఇంట్లోనే ఓ చిన్న దుకాణం నడుపుతోంది. పెట్టుబడి దాదాపు 70 వేలు. అన్ని సరుకులూ దొరుకుతుండటంతో వ్యాపారం బానే సాగుతోంది. రోజు గడవటానికి ఇబ్బంది లేదు. కాకుంటే రె...
Comments
Please login to add a commentAdd a comment