Bank accounts
-
బ్యాంక్ ఖాతాలు వారివే ఎక్కువ: డేటా విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ‘ఉమన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024: సెలెక్టెడ్ ఇండికేటర్స్, డేటా’ పేరుతో గణాంకాలు, పథకాల అమలు శాఖ నివేదిక విడుదల చేసింది.దీని ప్రకారం మహిళల ఖాతాల ద్వారా మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో 39.7 శాతం లభిస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య బలపడుతూ వస్తోంది. 2021 మార్చి 31లో నమోదైన 33.26 మిలియన్ డీమ్యా ట్ ఖాతాలు 2024 నవంబర్ 30కల్లా 143.02 మిలియన్లకు చేరాయి. వెరసి నాలుగు రెట్లుపైగా ఎగశాయి. వీటిలో పురుషుల ఖాతాలు భారీగా 26.59 మిలియన్ల నుంచి 115.31 మిలియన్లకు జంప్‌చేశాయి. అయితే మహిళల ఖాతాలు సైతం 6.67 మిలియన్ల నుంచి 27.71 మిలియన్లకు ఎగశాయి.1952లో 17.32 కోట్లుగా నమోదైన మహిళా ఓటర్ల సంఖ్య 2024 కల్లా 97.8 కోట్లకు జంప్‌చేసింది. కనీసం ఒక మహిళా డైరెక్టర్గల.. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లలోనూ పురోగతి కనిపిస్తోంది. 2017లో ఈ తరహా స్టార్టప్‌లు 1,943 నమోదుకాగా.. 2024కల్లా 17,405కు ఎగశాయి. వెరసి మహిళా ఎంటర్‌ప్రెన్సూర్స్ సంఖ్య బలపడుతోంది. -
సైబర్ నేరగాళ్లతో ప్రైవేటు బ్యాంకుల అధికారులు కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: నేపాల్, చైనాల్లో కూర్చుని, దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, యాప్‌ల ద్వారా వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో స్థానిక ప్రైవేటు బ్యాంకుల మేనేజర్లూ కుమ్మక్కవుతుండటం ఆందోళన కలిగించే అంశం. రెండు కేసుల దర్యాప్తు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వీరి పాత్రను గుర్తించారు. ఆర్బీఎల్, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రత్యేక బృందాలు పది రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో వీరితో సహా 52 మందిని పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నిందితులపై నగరంలో 33, రాష్ట్రంలో 74, దేశ వ్యాప్తంగా 576 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామన్నారు. డీసీపీ దార కవిత, ఏసీపీ ఆర్జీ శివ మారుతిలతో కలిసి బుధవారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వివరాలు వెల్లడించారు. సేవింగ్‌కు ఒక రేటు కరెంటుకు ఒక రేటు..సైబర్ నేరాల సూత్రధారులకు బాధితులతో నగదు డిపాజిట్ చేయించుకోవడానికి సేవింగ్స్ ఖాతా, కాజేసిన భారీ మొత్తాలను డ్రా చేసుకోవడానికి కరెంట్ ఖాతాలు అవసరం. దీనికోసం వీళ్లు నేపాల్‌కు చెందిన కొందరిని దళారులుగా మార్చుకుంటున్నారు. వీరు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచరిస్తూ స్థానిక మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలేవీ పట్టించుకోకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వాలని, లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనలను కూడా చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. సేవింగ్ ఖాతాకు రూ.50 వేల వరకు, కరెంట్ ఖాతాకు రూ.80 వేల వరకు తీసుకుంటున్న బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఆయా ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్‌ను ఆపరేట్ చేయడానికి అవసరమైన వివరాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారా సూత్రధారులకు చేరుతున్నాయి. కేసుల దర్యాప్తులో వెలుగు చూసిన లింకులునేపాల్కు చెందిన మహేష్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు విద్యారణ్యపురలోని ఆర్బీఎల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ ఝా, మల్లీశ్వరంలోని యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్, ఫ్యాబ్రికేషన్ వ్యాపారి ఆర్.మోహన్ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వివిధ బ్యాంకుల్లో 20 బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీరు సహకరించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.23 కోట్లు కాజేశా రు. హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన రూ.93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యా ప్తులో బెంగళూరు లింకులు గుర్తించిన పోలీ సులు ఆ ముగ్గురినీ కటకటాల్లోకి పంపారు. అలాగే గతంలోనే జరిగిన, రూ.2.06 కోట్లతో ముడిపడి ఉన్న మరో ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్న కొటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాటా శ్రీనివాస్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సహకరించిన వారినీ పోలీసులు అరెస్టు చేశారు.తొలిసారిగా క్రిప్టో కరెన్సీ స్వాధీనంఈ ఫ్రాడ్‌లో పలువురు నిందితులు నగరానికి చెందిన వారే అని తేలింది. వీరంతా టెలి గ్రామ్ యాప్ ద్వారా నేరగాళ్ల నెట్‌వర్క్‌లోకి ప్రవేశించారు. వీరి నుంచి రూ.47.5 లక్షల నగదుతో పాటు క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న రూ.40 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. క్రిప్టో కరెన్సీని సీజ్ చేయడం నగర పోలీసు చరిత్ర లో ఇదే తొలిసారి. కాగా ఈ ఖా తాల ద్వారా జరిగే ప్రతి లావా దేవీకి గాను కాటా శ్రీనివాస్‌కు ఒక శాతం కమీషన్‌గా ముట్టడం గమనార్హం.పలు మోసాల్లో నిందితులుగా..ఈ కేసులో వీరితో పాటు అరెస్టు అయిన 52 మంది నిందితులు ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఎర వేసి, వివిధ రకాలైన పేర్లు చెప్పి నగర వాసుల నుంచి రూ.8.83 కోట్లు కాజేసిన కేసు ల్లోనూ నిందితులుగా ఉన్నారు. సోషల్‌మీడియా గ్రూపుల ద్వారా ఎర వేసి, పెట్టుబడుల పేరుతో స్వాహా చేసే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో పాటు డిజిటల్ స్కామ్స్ కేసుల్లోనూ వీళ్లు నిందితులుగా ఉన్నారు. కాగా వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.87 కోట్లు ఫ్రీజ్ చేశారు. ‘సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పిరామల్ ఫైనాన్స్ సంస్థతో కలిసి పని చేస్తున్నాం..’ అని కమిషనర్ చెప్పారు. -
జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్..
దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌ను అరికట్టడం, బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.రిస్క్‌లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.డార్మాంట్ అకౌంట్లుడార్మాంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.ఇనాక్టివ్ అకౌంట్లునిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. -
ఆ బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష కోట్లు.. ఆర్బీఐ ఆదేశాలు
ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాల సంఖ్యను సత్వరమే తగ్గించుకోవాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇనాపరేటివ్ ఖాతాలకు సంబంధించి గణాంకాలను ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ఆర్బీఐకి నివేదించాలని కోరింది.ఈ తరహా ఇనాపరేటివ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండిపోవడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సమస్యల కారణంగా ఖాతాలు నిరుపయోగంగా లేదా స్తంభించిపోయినట్టు తమ తనిఖీల్లో తెలిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల సంఖ్య అధికంగా ఉండడం, వాటిల్లో నిధులు ఉండిపోవడాన్ని ఆర్బీఐ గుర్తించింది.దీంతో వాటిని తగ్గించుకోవాలని, సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని సైతం పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 చివరి నాటికి ఇనాపరేటివ్ ఖాతాలలో రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్లు స్తంభించాయి. వీటిలో రూ. 42,270 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?ప్రభుత్వరంగ ఎస్బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇక కస్టమర్లకు సంబంధించి ఆధార్ అప్డేటెషన్ సేవలను సైతం అందించాలని, ఆధార్ ఆధారిత సేవలకు వీలు కల్పించాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇనాపరేటివ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదించినప్పటికీ, పేరు ఇతర వివరాలు సరిపోకపోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. -
ఏపీలో 98% మందికి బ్యాంకు ఖాతాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండిన వారిలో 98 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. జాతీయ సగటును మించి ఏపీలో బ్యాంకు అకౌంట్లు ఉండటం విశేషం. జాతీయంగా సగటున 94.6 శాతం మందికే బ్యాంకు ఖాతాలున్నాయి. సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే–2022–23 వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళల్లో ఎంత మందికి వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఖాతాలున్నాయో సర్వే వెల్లడించింది. అత్యధికంగా బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో కర్ణాటక, ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. అత్యల్పంగా బ్యాంకు ఖాతాలు మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, గుజరాత్లో ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కొద్దిపాటి తేడాతో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల్లో కలిపి పురుషులకు 98.1 శాతం బ్యాంకు ఖాతాలుండగా, మహిళలకు 97.9 శాతం ఉన్నాయి. ఇదే జాతీయ సగటున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పురుషులకు 96.2 శాతం ఉండగా, మహిళలకు 92.8 శాతం బ్యాంకు ఖాతాలున్నాయి. -
డబ్బులు ఊరికే రావు !
సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి కోసం కొందరు చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. మీరు ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ. వేల నుంచి లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చని సైబర్ ముఠాల కేటుగాళ్లు అమాయకులకు గాలం వేస్తున్నారు. వారు చెప్పే మాయమాటలు నమ్మి తమ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్స్‌ను) కమీషన్ల కోసం ఇస్తున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరంలో భాగస్తులవుతారు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ఖాతాలపై నిఘాకొన్ని బ్యాంకు ఖాతాల్లో అప్పటివరకు రూ.వందల్లో లావాదేవీలు జరిగి..ఒక్కసారిగా లక్షల రూపాయలు క్రెడిట్, డెబిట్ అవుతున్నాయంటే అది కచ్చితంగా అనుమా నాస్పద ఖాతాగానే గుర్తించాలి. సైబర్ నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఎక్కడా తమ వివరాలు బయటకు పొక్కకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధితుల సొమ్మును అప్పనంగా కొట్టేసేందుకు, అమాయకులైన ప్రజల బ్యాంకు ఖాతాలనే వాడుకుంటున్నారు. ఇదే తరహా కేసులపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోకస్ పెంచింది. ఎక్కువ ఆర్థిక మోసాల్లో ఆరితేరిన వారు తమ అవసరాలు తీర్చుకునేందుకు కొందరికి కమీషన్లు ఆశచూపి ఇలా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి సాంకేతికతతో ఈ తరహా బ్యాంకు ఖాతాలపై నిఘా పెడుతున్న టెక్నికల్ టీంలు, నిందితుల పూర్తి వివరాలను వెలుగులోకి తెస్తున్నాయి. రాజస్తాన్‌లో చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లోనూ 27 మంది నిందితుల అరెస్టులో సాంకేతికత విశ్లేషణ బృందాలు కీలకంగా పనిచేశాయి.విదేశాల్లో ఉంటూ ఇక్కడి ఏజెంట్లతో...సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్న ముఠాలపైనా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా కొనసాగుతోంది. గత నెలలోనూ ఇదే తరహాలో ఓ ముఠాను గుర్తించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట ఒకరి నుంచి రూ.5.27 కోట్లు కొల్లగొట్టిన కేసులో టీజీ సీఎస్బీ దర్యాప్తులో మ్యూల్ బ్యాంక్ ఖాతాల గుట్టు రట్టయ్యింది. అల్మాస్గూడ వినాయకహిల్స్కు చెందిన కందుకూరి రవీందర్‌రెడ్డి, అత్తాపూర్ నలందనగర్కు చెందిన బండ్లమూడి రవి సైబర్ నేరగాళ్లకు కమీషన్ల బేసిస్‌లో బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్ చేస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. నెలకు రూ.5వేల వరకు ఆశజూపి వనస్థలిపురానికి చెందిన రమణమురళికృష్ణ, కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్‌కు చెందిన మాధవరావులతో కలిసి మొత్తం14 కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయించినట్టు వెల్లడైంది. ఒక్కో అకౌంట్‌కు రూ.25 వేల చొప్పున సైబర్ నేరగాళ్ల నుంచి కమీషన్ పొందుతున్న ఈ దళారులు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నట్టు తేలింది.అత్యాశకు పోయితమ బ్యాంకు వివరాలను కమీషన్ల కోసం ఇస్తున్న వారిలో ఎక్కువ మంది తెలిసే ఈ ‘మ్యూల్’దందాలోకి దిగుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. టీజీ సీఎస్బీ అధికారులు రాజస్తాన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో గుర్తించిన వారే ఇందుకు నిదర్శనంగా వారు పేర్కొంటున్నారు. పట్టుబడిన 27 మందిలో ప్రైవేట్ కాంట్రాక్టర్, జిమ్ ట్రైనర్, హోటల్ వ్యాపారి, వస్త్ర వ్యాపారి, డేటాఎంట్రీ వర్కర్, అగర్బత్తీల వ్యాపారి, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యవసాయం చేసేవారు సైతం ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ తరహాలో తెలంగాణలోనూ మ్యూల్ బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇస్తున్న వారు పెరుగుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాల్లో వాడిన బ్యాంకు ఖాతాలు ఎవరివి అయితే వారికి కూడా నేరంలో భాగం ఉంటుందన్నది మరవొద్దని వారు హెచ్చరిస్తున్నారు. -
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న డబ్బు ఎంత?
సాధారణంగా డబ్బును లక్ష్మిదేవితో పోలుస్తాం. లోకంలోని సమస్త ధనరాసికి దేవత ‘ఆమె’నే.. మరి అలాంటి లక్ష్మిదేవి పేరు మాత్రమే మహిళలకు మిగిలింది. దేశంలోని బ్యాంకు ఖాతాల్లో పురుషుల వద్దే అత్యధిక ధనం పోగుపడింది. ధన దేవత ‘లక్ష్మి’ పేరుండే మహిళల ఖాతాల్లో ఉన్నది కేవలం 21 శాతమే...నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా “మెన్ అండ్ విమెన్” నివేదిక ప్రకారం, దేశంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 20.8 శాతం లేదా దాదాపు ఐదవ వంతు మాత్రమే మహిళా ఖాతాదారులకు చెందినది. దేశంలో 91.77 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే వీటిలో 36.4% మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.దేశంలోని మొత్తం బ్యాంకు అకౌంట్లలో 187 లక్షల కోట్లు ఉండగా ఇందులో మహిళ ఖాతాల్లో ఉన్న మొత్తం కేవలం 39 లక్షల కోట్లు. దేశంలోని హిందూ అవిభాజ్య కుటుంబాలు, నివాసితులు, రైతులు, వ్యాపారులు, నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వేతనజీవులు, ఇతరులు అందరి బ్యాంకు ఖాతాలను లెక్కలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.ఇక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా గణాంకాలను పరిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం డిపాజిట్లలో 16.5% లేదా 1.9 లక్షల కోట్లు మాత్రమే మహిళలకు చెందినవి. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 30% లేదా రూ.5.91 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో జన్ ధన్ ఖాతాలు విస్తృతంగా విస్తరించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. -
ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
లక్షలాది అకౌంట్లు.. ఆర్బీఐ ఆశ్చర్యం!!
మోసపూరిత లావాదేవీలు, ఎవర్‌గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది అకౌంట్లను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బిజినెస్ స్టాండర్ట్ కథనం ప్రకారం.. “గత రెండు సంవత్సరాల్లో మరింత దృష్టి కేంద్రీకరించిన అంశం.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణ. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉన్నాయని మేము గుర్తించాం” అని మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్.జె పేర్కొన్నారు.ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు , రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని, వీలైనంత తగ్గించాలని సీఎఫ్‌లకు స్వామినాథన్ సూచించారు. గత వారం బ్యాంక్ చీఫ్‌లతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. మ్యూల్ ఖాతాలను (చట్టవిరుద్ధమైన ఖాతాలు), డిజిటల్ మోసాలను అరికట్టాలని కోరారు. -
ఈసారీ బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి పంపిణీ చేసే పింఛన్‌ను కూడా ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. మే నెలలో ఇంటివద్ద పింఛను పొందిన వారికి ఈసారి కూడా 1–5 తేదీల మధ్య ఇంటివద్దే ఆ డబ్బు అందిస్తారు. జూన్ ఒకటికి కొత్తగా 80 ఏళ్లు వచ్చిన వారికి కూడా ఇంటి వద్దే పింఛన్ డబ్బు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే ఠంచన్‌గా పింఛన్ లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందించేది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేప«థ్యంలో ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ చేసిన ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచింది. దీంతో రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు, తదితరులకు అందించే పింఛన్ల పంపిణీలో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం ఇంటి వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛను డబ్బులను పంపిణీ జరిగింది. జూన్ నెలలోనూ ఇదేవిధంగా జరగనుంది. 73% లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం రూ.1,939.35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. లబి్ధదారుల్లో 47,74,733 మంది (73.11 శాతం)కి డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటో తేదీనే జమ చేస్తారు. మిగిలిన 17,56,105 మంది (26.89 శాతం)కి ఇంటి వద్దే పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్ పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇతర రాష్ట్రాల కోఆపరేటివ్ బ్యాంకులలో బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు కూడా డీబీటీ రూపంలో కాకుండా జూన్ 1 – 5 తేదీల మధ్య ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. రీడమ్ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్బీఐతో పాటు పలు ప్రైవేట్ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్బీఐ ఖాతాదారుల్ని సైబర్ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్ చేసింది. Your safety is our top priority.Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024 ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ఏపీఏకే ఫైల్స్, మెసేజెస్ పంపిస్తారు. వాటిని క్లిక్ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల ఎస్బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి. Don't get caught in the web of fake links! Stay sharp, stay safe!@CyberdostTo report Cyber Crime, visit https://t.co/qb66kKVmLw or Dial 1930 for assistance#FoolTheFraudster #Fraud #Awareness #PNB #Digital pic.twitter.com/LOYUBy0nYf— Punjab National Bank (@pnbindia) May 1, 2024Stay vigilant against investment or task-based fraud! Protect your financial and personal information by verifying sources, researching thoroughly, and never sharing sensitive details online. #StaySafe #FraudPrevention pic.twitter.com/87xrfSd2Sy— Axis Bank (@AxisBank) May 13, 2024Is that scan hiding a potential scam? Watch the video to uncover the hidden risks of QUISHING and learn how to stay one step ahead of the fraudsters.To report a fraud,📞National Cyber Crime Helpline on 1930 or🌐Visit https://t.co/5QHgCWZl7n#BeatTheCheats #SafeBanking pic.twitter.com/MSMs2jti1l— ICICI Bank (@ICICIBank) May 19, 2024 -
మరోసారి అమెరికా జోక్యం.. ఈసారి కాంగ్రెస్ ఖాతాలపై
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా స్పందన మరవకముందే.. అగ్రరాజ్యం భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరంపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తకు బుధవారం సమన్లు కూడా జారీ చేయటం తెలిసిందే. అయితే ఘటన మరవకముందే అమెరికా భారత్‌కు సంబంధించిన మరో అంశంపై స్పందించటం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన అంశంపై మరోసారి అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేయకుండా ఆ పార్టీకి సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు మాకు తెలుసు. ఈ విషయంలో కూడా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయ ప్రక్రియను ప్రోత్సహిస్తాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్యు మిల్లర్ అన్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ విషయంలో స్పందించిన అమెరికా రాయబారికి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. ఆదేశ దౌత్యవేతకు భారత్ ఇచ్చిన సమన్లపై స్పందింస్తూ.. ‘నేను ప్రైవేట్ దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయదలుచుకోలేను. కానీ, సీఎం కేజ్రీవాల్ విషయంలో నేను ఇక్కడి నుంచే బహిరంగంగా మేము పారదర్శకత, సమయానుకూల న్యాయప్రక్రియను ప్రోత్సహిస్తాం అని. మా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మేం పట్టించుకోం. ఇదే విషయాన్ని మేము ప్రైవేట్‌గా కూడా ఇలాగే స్పష్టం చేస్తాం’అని మాత్యు మిల్లర్ స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 210 కోట్ల ఆదాయపన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉందని ఇటీవల కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా అమెరికా స్పందించటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనికి భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. -
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్‌కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్‌కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్‌డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్‌పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్‌తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి. -
ఆరుగ్యారెంటీల లబ్దిదారులపై కన్నేసిన సైబర్ దొంగలు
-
అకస్మాత్తుగా ఖాతాల్లో డబ్బులు జమ.. అంత డబ్బు ఎలా వచ్చింది?
శాంతినగర్: చేనేత కార్మికుల ఖాతాల్లోకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడటంతో అటు ఆనందం వ్యక్తం చేయాలో లేక ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటామోనని ఆందోళన చెందుతున్నారు. రాజోళిలో 3,800 కుటుంబాలకు పైగా చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,100 మగ్గాలు ఉండగా.. మంగళవారం అకస్మాత్తుగా 168 మంది ఖాతాల్లో రూ.21,14,681లు జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు ఎవరు వేశారో తెలవకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయింది. అదే సమయంలో గ్రామానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్లు ఫోన్లు చేసి తామే డబ్బులు బదిలీ చేయించామని, 90 శాతం డబ్బులు తిరిగి తమ అకౌంట్లలోకి పంపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేనేత కార్మికులందరూ మాట్లాడుకుని సగం డబ్బులు తిరిగి పంపేందుకు ఒప్పుకుని కొందరు పంపగా.. మరికొందరు పంపలేదు. డబ్బులు పంపిన వారి ఖాతాల్లోకి తిరిగి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మళ్లీ జమయ్యాయి. అసలు డబ్బులు ఎందుకు పడుతున్నాయి.. ఎవరు పంపిస్తున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. అంతేగాక కొందరికి రూ.7 వేలు, మరికొందరికి రూ.15 వేలు, ఇంకొందరి ఖాతాల్లో రూ.25 వేల వరకు నగదు జమ కావడంతో చేనేత కార్మికులు ఆశ్చర్యపోతున్నారు. ఖాతాల్లోకి దాతలు వేశారా.. లేక సైబర్ నేరగాళ్లు లేక బ్లాక్‌మనీ ఉన్న వారు వేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో.. గతంలో కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు రాజోళి చేనేత కార్మికులు ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా... ఇప్పుడు కార్మికుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసి ఉంటారని కొందరు చెప్పుకుంటున్నారు. మాస్టర్ వీవర్స్ మాత్రం తామే అకౌంట్లలో డబ్బులు వేయించామని వాటిని తమకు పంపాలని ఒత్తిడి తెస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు మాత్రం దాతలు పంపి ఉంటారని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీస్, చేనేత జౌళిశాఖ అధికారులు స్పందించి చేనేత కార్మికుల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించి.. 1,100 మంది చేనేత కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కార్వీ మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ - సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) క్లయింట్ల నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి రూ. 1.80 కోట్లు రాబట్టేందుకు కార్వీ గ్రూప్ మాజీ అధికారులైన ముగ్గురి బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వీరిలో మాజీ వీపీ (ఫైనాన్స్, అకౌంట్స్) కృష్ణ హరి జి., మాజీ కాంప్లయెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతి ఉంటుంది. క్లయింట్ల సెక్యూరిటీలను వారికి తెలియకుండా తనఖా పెట్టి కేఎస్‌బీఎల్ దాదాపు రూ. 2,033 కోట్ల మేర నిధులు సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది మే నెలలో సెబీ కృష్ణ హరికి రూ. 1 కోటి, రాజుకి రూ. 40 లక్షలు, శ్రీకృష్ణకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. వడ్డీలు, ఇతర వ్యయాలతో సహా మొత్తం సుమారు రూ. 1.8 కోట్లు కట్టాలంటూ గత నెల డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
ఒకటో తేదీనే అవ్వాతాతల చేతికి రూ.1,359.35 కోట్లు
ఠంఛన్‌గా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పింఛన్ డబ్బులు పంపిణీ చేసింది. వలంటీర్లు లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి 49,32,936 మందికి రూ.1,359.35 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. సాక్షి, అమరావతి: ఠంఛన్‌గా ఒకటో తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు ప్రభుత్వం పంపిణీ చేసింది. బుధవారం తెల్లవారు జాము నుంచే వలంటీర్లు లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి సాయంత్రం వరకు 49,32,936 మందికి రూ.1,359.35 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. నవంబర్‌లో మొత్తం 65.54 లక్షల మందికి పింఛన్ల పంపిణీ గాను రూ.1806.90 కోట్లను ప్రభుత్వం మంగళవారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 75.26 శాతం మందికి బుధవారమే పింఛన్ల పంపిణీ పూర్తి కాగా, మిగిలిన వారి కోసం ఈ నెల ఐదో తేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్దిదారు ఇంటి వద్దనే పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
50 కోట్ల మార్క్‌ను దాటిన జన్‌ధన్ యోజన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఈ మైలురాయి నమోదైంది. ఇందులో 56 శాతం ఖాతాలు మహిళల పేరిట ప్రారంభమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం జన్‌ధన్ ఖాతాల్లో 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి ఉన్నట్టు పేర్కొంది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా అందించినట్టు తెలిపింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఒక్కో ఖాతాలో సగటు బ్యాలన్స్ రూ.4,076గా ఉందని.. 5.5 కోట్ల ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు అందుకుంటున్నట్టు వెల్లడించింది. 2014 ఆగస్ట్ 28న ఈ పథకం ప్రారంభం కావడం గమనార్హం. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ నిర్వించాల్సిన అవసరం ఉండదు. రూ.2 లక్షల ప్రమాద మరణ బీమాతో కూడిన రూపే కార్డు ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఖాతా నుంచి రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్‌బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
రుణమాఫీ సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ సొమ్ము కొందరు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కి వస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రైతుల రుణ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌లో ఉండటం లేదా డిఫాల్ట్లో ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అనేకమంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు రూ.50 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. మూడు సీజన్లలో చెల్లించకుంటే డిఫాల్టరే... రాష్ట్రంలో ప్రతీ ఏటా సరాసరి 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే, తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పుడు టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) హామీ ఇచ్చి న సంగతి తెలిసిందే. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.1,200 కోట్లకు పైగా రుణమాఫీ చేశారు. మిగిలిన మొత్తం సొమ్మును మరో నెలన్నరలో మాఫీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సొమ్మును విడతల వారీగా జమ చేస్తున్నారు. బకాయిలు చెల్లించమని సర్కారు విన్నవించినా... ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేకమంది రైతులకు రెన్యువల్ సమస్య వచ్చి ంది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు గుంజుకున్నాయి. అలా రెన్యువల్ చేశాయి. రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం గతంలో విన్నవించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు అలా చెల్లించగా, మరికొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా. రుణమాఫీ అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో జరగడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడింది. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. -
కొత్త రకం మోసం.. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని లావాదేవీలు..
సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’ ... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్‌ను కొత్త ఫోన్లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు. సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు. ఎక్కువగా ఈ దేశాల నుంచే.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్బీఐ ఏం చేయాలంటే.. ♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెట్టాలి. ♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. ♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి. ♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి. -
వన్-వ్యూ ఫీచర్: ఒకే యాప్‌లో అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలన్నింటినీ ఒకే చోట చూసుకునేందుకు వీలుగా యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్‌లో వన్–వ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. దీనితో యాక్సిస్ బ్యాంక్‌యేతర ఖాతాలను కూడా తమ కస్టమర్లు.. అకౌంట్లకు జోడించుకుని బ్యాలెన్స్‌లు, వ్యయాలు, లావాదేవీల స్టేట్మెంట్లను ఒకే చోట చూసుకునేందుకు వీలుంటుందని బ్యాంకు ప్రెసిడెంట్ సమీర్ శెట్టి తెలిపారు. అకౌంట్ అగ్రిగేటర్ విధానాన్ని ఉపయోగించి ఈ కొత్త తరహా బ్యాంకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో పలు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను చూసుకోవాల్సిన శ్రమ తప్పుతుందని, లింకు చేసిన ఖాతాల నుంచి కస్టమర్లు లావాదేవీల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని లేదా ఈమెయిల్‌కు పంపుకోవచ్చని తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే ఎప్పుడైనా ఆయా ఖాతాల లింకును తీసివేయొచ్చని వివరించారు. -
Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి? ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది. एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck ▪️ यह ख़बर #फ़र्ज़ी है। ▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9 — PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023 -
తొమ్మిది జిల్లాలకు డిజిటల్ బ్యాంకింగ్ హోదా
సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటికే తొమ్మిదింటిని 100 శాతం డిజిటల్ జిల్లాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. మరో 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చే ప్రక్రియను మొదలు పెట్టింది. ఒక జిల్లాలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారంతా డెబిట్ కార్డు లేదా ఫోన్, నెట్ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకటి వినియోగిస్తుంటే ఆ జిల్లాను డిజిటల్ జిల్లాగా గుర్తిస్తారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టగా రాష్ట్రంలో తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో వైఎస్సార్, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాలు డిజిటల్ జిల్లాలుగా మారాయి. ఇప్పుడు నాలుగో దశలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు 100 శాతం డిజిటల్ బ్యాంకింగ్ జిల్లాలుగా మారడంపై సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి కృషి చేయాలని బ్యాంకింగ్ వర్గాలను కోరారు. విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన కల్పిం చడానికి పాఠశాలల సిలబస్‌లో ఆరి్థక సేవలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వికాస్ జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,12,419 బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా ఆర్థి క సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7,769 బ్యాంక్ బ్రాంచ్‌లు కాగా బిజినెస్ కరస్పాండెంట్లు 94,097, ఏటీఎంలు 10,553 ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను డిజిటల్ జిల్లాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేయొచ్చు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బినావీులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 17 ప్రకారం సంబంధిత అధీకృత అధికారి చర్యలు చేపట్టవచ్చునని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవ్వా గోపాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవి పేరు మీద ఉన్న యాక్సిస్, యూనియన్ బ్యాంకుల ఖాతాల నుంచి 15 రోజుల పాటు ఎలాంటి నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఈడీ అధీకృత అధికారి సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీదేవి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా స్తంభింపచేయాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పంపిన ఈ–మెయిళ్లను రద్దు చేసింది. సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేయని కారణంతోనే ఈ–మెయిళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ మంగళవారం తీర్పునిచ్చారు. అశోక్ లేలాండ్ సంస్థ నుంచి బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినావీులపై పోలీసులు 46 కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. కొల్లగొట్టిన సొమ్మును ప్రభాకర్‌రెడ్డి బినామీ గోపాల్‌రెడ్డి తన కుమారుడు, భార్య బ్యాంకు ఖాతాల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా చూడాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లు పంపారు. బ్యాంకు అధికారులు లావాదేవీలు నిలిపివేశారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లను సవాలు చేస్తూ గోపాల్‌రెడ్డి అండ్ కో, దాని మేనేజింగ్ పార్ట్నర్ గోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవీలు హైకోర్టులో 2022లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి రవినాథ్ తిల్హరీ గత నెలలో పూర్తిస్థాయిలో వాదనలు విన్నారు. ఈడీ తరఫున జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున న్యాయవాది ఐ.కోటిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. -
ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!
సాక్షి, హైదరాబాద్: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మోసాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్’బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్ హెచ్చరించారు. ఖాతాలు.. కమీషన్లు.. వర్క్‌ఫ్రం హోం పేరిట.. ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు. డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్‌ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్లైన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కమిషన్ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్ బటన్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులను వాడి వీరికి ఎస్ఎంఎస్ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్బటన్ యాప్‌లను వాడాలని సూచిస్తారు. మొత్తానికి.. సైబర్ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్బటన్ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్ తెలిపారు. ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్ నేరస్తులకు సహకరించినవారే. సైబర్ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్ భద్రత నిపుణులు ‘పారసైట్’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్కాయిన్లుగా మార్చి.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్లైన్లో బిట్కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. అవన్నీ కూడా తమ కంప్యూటర్ సర్వర్లను హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు. -
పెన్షన్.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అప్డేట్ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది. చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
‘రూపీ ట్రేడింగ్’ కోసం రష్యన్ బ్యాంకుల వోస్ట్రో ఖాతాలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వ్యాపార లావాదేవీల నిర్వహణకు సంబంధించి తొమ్మిది రష్యన్ బ్యాంకులు భారత్‌లో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలు తెరిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నట్లు వివరించారు. సెబెర్బ్యాంక్, వీటీబీ బ్యాంక్, గాజ్ప్రోమ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
సేవింగ్ అకౌంట్‌తో డబ్బులు సంపాదించండిలా
మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్‌లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్‌కు స్వీప్ - ఇన్ ఎఫ్డీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్‌ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్గాను, వినియోగించకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్‌లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్వీప్-ఇన్ స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్‌గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్‌ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్‌పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది? కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్‌ను .. ఫిక్స్డ్ డిపాజిట్‌కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అంతే సంగతి
-
అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త! యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది. ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్లు, పాస్వర్డ్లు సహా ఇతర డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. తక్షణమే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను సంస్థ గుర్తించింది. ఇవి మొబైల్ ఫోన్లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది. గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది కనుక తక్షణమే తొలగించాలని సూచించింది. డ్రాపర్ యాప్‌ల జాబితా కాల్ రికార్డర్ APK రూస్టర్ VPN సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్ యూనివర్సల్ సేవర్ ప్రో ఈగిల్ ఫోటో ఎడిటర్ కాల్ రికార్డర్ ప్రో+ అదనపు క్లీనర్ క్రిప్టో యుటిల్స్ ఫిక్స్ క్లీనర్ యూనివర్సల్ సేవర్ ప్రో లక్కీ క్లీనర్ జస్ట్ ఇన్: వీడియో మోషన్ డాక్యుమెంట్ స్కానర్ ప్రో కాంకర్ డార్క్నెస్ సింప్లీ క్లీనర్ Unicc QR స్కానర్ కాపీ క్యాట్ యాప్‌లను నిషేధించేలా గూగుల్ కొత్త విధానాన్ని తీసుకురానుందని సమాచారం. ఇతర యాప్‌ల నుండి లోగోలు, డిజైన్లు లేదా టైటిల్స్‌ను క్లోన్ చేసే యాప్‌లపై ఆగస్టు 31 నుండి నిషేధం అమలు కానుంది. వినియోగదారు డేటాను ట్రాక్ చేసే, క్లిక్ ద్వారా ప్రకటనలకు దారి మళ్లించే వీపీఎన్ఎస్ సర్వీస్ ఇందులో భాగం. అంతేకాదు మొబైల్ గేమ్స్‌లో ఫుల్ పేజీప్రకటనలపై, 15 సెకన్ల తర్వాత కూడా క్లోజ్ కాని యాడ్స్ డెవలపర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 30 నుంచి అమలు కానున్నాయి. స్క్రీన్ లోడింగ్ సమయంలో/గేమ్ ముందు లేదా తరువాతి లెవల్ ప్రారంభించే ముందు కనిపించే ప్రకటనల్ని గూగుల్ నిరోధిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, గేమ్‌లో రివార్డ్‌లను అన్‌లాక్ చేసే ప్రకటనలకు ఇది వర్తించదట. -
మనీ లాండరింగ్ కేసు: వివోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే రూ. 250 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి ఈడీ దాడులు, బ్యాంకు ఖాతాల సీజ్‌పై వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే 2,826 కోట్ల రూపాయల నెలవారీ జీతాలు చెల్లించలేమని పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వివో తరపున సీనియర్ న్యాయ వాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ బ్యాంకు ఖాతాలను సీజ్ వల్ల వివో కార్యకలాపాలు నిలిచి పోయాయని వాదించారు. కాగా పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.465 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.73 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్‌సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా? అంతకంతకూ ముదురుతున్న వివాదాలు అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు. ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఈపీఎస్ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్లు తహతహలాడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్లో ఓపీఎస్ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు. మలి అడుగు ఎలా..? ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్‌సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అంశాలు ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్ నారాయణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. -
సత్యం రామలింగరాజు తల్లికి ఊరట
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆమెకున్న అకౌంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అప్పలనర్సమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున వినోద్‌కుమార్ దేశ్‌పాండే, సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.నాగేందర్ వాదనలు వినిపించారు. అప్పలనర్సమ్మ కుమారులపై కేసు నమోదు చేసినప్పుడు బంధువులతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలనూ ఫ్రీజ్ చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే సీబీఐ చార్జీషీట్లో ఆమె పేరు ఎక్కడా లేదని, నిందితులకు ఆర్థిక నేరాల కింద శిక్ష కూడా విధించారని చెప్పారు. పిటిషనర్ 85 ఏళ్ల వృద్ధురాలని, రోజు వారీ అవసరాలకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అనంతరం నాగేందర్ వాదనలు వినిపిస్తూ.. రామలింగరాజు ఆర్థిక నేరాలతో పిటిషనర్ కూడా లబ్ధి పొందారన్నారు. 1999 నుంచి 2001 వరకు ఆమె పేరుపై 3,92,500 షేర్లు ఉన్నాయన్నారు. నేరాలు మోపబడిన కంపెనీలో ఆమె డైరెక్టర్‌గానీ, ప్రమోటర్‌గానీ కాకపోవడంతో చార్జీషీట్లో పేరు చేర్చలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించారు. వారెవ్వా (క్లిక్: హైదరాబాద్.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు) -
కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం
రెండు రోజుల క్రితం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’సినిమా లింక్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిముషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. కడపలోని ఏడు రోడ్ల కూడలిలోని ఓ మొబైల్ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ కొన్నారు. ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది. తెలంగాణలో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు మెయిల్‌కు ఓ లింక్ వచ్చింది. సిబ్బంది దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకులోని సొమ్ము మాయమైంది. ఇందులో బ్యాంకు సిబ్బందితోపాటు నైజీరియా దేశస్తులను తెలంగాణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సాక్షి, కడప కార్పొరేషన్/అర్బన్: మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమై పోతోంది. చివరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్సైట లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడపలోని ఓ బ్యాంకులో నెల రోజుల వ్యవధిలోనే 50 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే... బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. ఇంట్లో భద్రం కాదని అనుమానంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడ కూడా భద్రత ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. 2021లో యోనో కేవైసీ, ఫేక్ మనీ యాప్స్, ఫ్లిప్‌కార్ట్ లాటరీ, గిఫ్ట్ మనీ, క్రెడ్ యాప్, ఓటీపీ, ఇన్స్రూె ఓఎల్ఎక్స్, జాబ్, ఏనీ డెస్క్ వంటి వాటి ద్వారా 326 మంది రూ.50.04లక్షలు మోసపోయారు. ఎఫ్ఐఆర్ వరకూ రాని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఏఈపీఎస్ ద్వారా కూడా మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు మాసాల్లో దీని ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10వేల వరకూ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు రూపాల్లో ప్రజల వేలిముద్రలు సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బులు దోచేçస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి చేయొద్దు ►కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ►ఎవరైనా క్యాష్ ఇవ్వండి. ఫోన్ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్రావా పంపితే అమౌంట్ వచ్చినట్లు చూపుతుంది. కానీ మన ఖాతాలో జమ కాదు. ►ఇటీవల హిట్ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది. ►మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ►ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ►ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులు అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. తెలియని కాల్స్, మెయిల్స్‌పై క్లిక్ చేయవద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్‌ను లాక్ చేసుకోవాలి. రుణాలు ఇస్తామని, క్రెడిట్, డెబిట్ కార్డు గడువు తీరిపోయాయని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదు. – దుర్గాప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – కేకేఎన్ అన్బురాజన్, వైఎస్సార్ జిల్లా ఎస్పీ -
మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం: సీఎం జగన్
-
లింకు నొక్కితే ఖాతా ఖాళీ
రెండు రోజుల క్రితం కొన్ని గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా లింక్ వచ్చింది. సినిమా చూద్దామన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిమిషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఈ నెల 19న అనంతపురం సప్తగిరి సర్కిల్లోని ఓ మొబైల్‌షాపులో ఇద్దరు యువకులు వచ్చి మొబైల్ ఫోన్ కొన్నారు. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్‌పే యాప్ ద్వారా చెల్లింపులు చేశారని తేలింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశం మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోతోంది. చివరకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా గానీ, నంబర్ల నుంచి నేరుగా గానీ వెబ్సైట్ లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు లాగేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని ఓ బ్యాంకులో నెల వ్యవధిలోనే 58 ఫిర్యాదులు అందాయి. తాజాగా అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన శ్రీనివాసులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు మాయమైంది. బ్యాంకు మేనేజర్‌ను కలిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే.. బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. దీంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడా భద్రత ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఏఈపీఎస్ ద్వారానూ మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారానూ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇలా మోసపోయిన బాధితులు జిల్లాలో 30 మందికి పైగానే ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10 వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల వేలిముద్రలను సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పొరపాట్లు చేయొద్దు.. ► కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ► ఎవరైనా క్యాష్ ఇవ్వండి.. ఫోన్‌పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్వారా పంపితే అమౌంట్ వచ్చినట్టు చూపిస్తుంది కానీ మన ఖాతాలో జమకాదు. ► ఇటీవల హిట్ సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం ప్రమాదకరం. ► మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశముంది. ► ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ► ఫోన్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. అప్రమత్తంగా ఉండాల్సిందే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి లింకులూ క్లిక్ చేయొద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించొద్దు. ముఖ్యంగా వివిధ బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులూ అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. వాటిపై క్లిక్ చేయొద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్‌ను లాక్ చేసుకోవాలి. ఈజీ లావాదేవీల కోసం ప్రైవేటు యాప్‌లను ఆశ్రయించడం మంచిది కాదు. –జి.భాస్కర్‌రెడ్డి, చీఫ్ మేనేజర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా -
Jan Dhan Yojana: జన్ ధన్ యోజన ఖాతాలో భారీగా నగదు జమ..!
న్యూఢిల్లీ: సుమారు ఏడున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో గత ఏడాది చివరి నాటికి డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 44.23 కోట్లకు పైగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎమ్ జెడివై) ఖాతాల్లో మొత్తం బ్యాలెన్స్ డిసెంబర్ చివరి, 2021 నాటికి రూ.1,50,939.36 కోట్లుగా ఉంది. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. మొత్తం 44.23 కోట్ల ఖాతాల్లో 34.9 కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలో, 8.05 కోట్ల ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో, మిగిలిన 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉన్నాయి. అలాగే, 31.28 కోట్ల మంది పిఎంజెడివై లబ్ధిదారులకు రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు. డిసెంబర్ 29, 2021 నాటికి దాదాపు 24.61 కోట్ల మంది మహిళలకు ఖాతాలు ఉన్నాయి. ఈ పథకం మొదటి సంవత్సరంలో 17.90 కోట్లు పిఎంజెడివై ఖాతాలు తెరవబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) మార్గదర్శకాల ప్రకారం.. జన్ ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బిఎస్బిడి) ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 8, 2021 నాటికి మొత్తం సున్నా బ్యాలెన్స్ గల ఖాతాల సంఖ్య 3.65 కోట్లు. ఈ ఖాతాలలో మొత్తం జన్ ధన్ ఖాతాలలో 8.3 శాతం. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) పథకం. (చదవండి: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్...! ఈ లింకుల పట్ల జాగ్రత్త..! లేకపోతే..) -
బ్యాంక్ అకౌంట్‌కు పొరపాటున డబ్బులు పంపారా? తిరిగి పొందాలంటే!
ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆన్లైన్లో నెఫ్ట్/ఆర్టీజీఎస్, యూపీఐ, గూగుల్‌పే, బీమ్ యాప్‌తో పాటు ఇతర బ్యాంకింగ్ సేవల్ని సులభంగా చేసుకోవచ్చు. దీంతో డబ్బులు డ్రా చేసేందుకు, డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌ల ఎదుట క్యూ కట్టే అవకాశం లేకుండా సెకన్ల వ్యవధిలో డబ్బుల్ని ఆన్లైన్ ద్వారా పంపే వెసలు బాటు ఉంది. అయితే ఆన్లైన్లో డబ్బు పంపడం, తీసుకోవడం చాలా సులభమే. ఒక్కోసారి ఆన్లైట్ ట్రాన్సాక్షన్లలో తప్పులు దొర్లుతుంటాయి. ఒకరికి పంపాల్సిన డబ్బుల్ని మరొకరికి పంపిస్తుంటాం. తెగ హైరానా పడిపోతుంటాం. ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అయితే చాలు మీరు తప్పుగా పంపిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. డబ్బును తిరిగి పొందాలంటే? ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మీరు పంపే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కాంటాక్ట్ నెంబర్ తప్పుంటే..డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేం. అందుకే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో జాగ్రత్తగా అకౌంట్ నెంబర్ చెక్ చేసి పంపాలి. అయినా కొన్ని బ్యాంక్ అకౌంట్లలో మాత్రం మీరు పంపాలనుకున్నవారికి మాత్రమే కాకుండా వేరే వాళ్లకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. పంపే ముందు ఐఎఫ్ఎస్ఈ కోడ్ చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ గా ఉన్నా ఐఎఫ్ఎస్ కోడ్ కరెక్ట్‌గా లేకపోతే డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వవు. ► ఒకవేళ డబ్బులు గుర్తు తెలియని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయితే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి. ► మీరు ఏ అకౌంట్‌కు డబ్బులు పంపారో ఆ అకౌంట్ నెంబర్ చెప్పండి. ► కస్టమర్ కేర్‌లో ఫిర్యాదు చేయండి. ► లావాదేవీ తేదీ, సమయం, అలాగే మీ అకౌంట్ నెంబర్, డబ్బుల ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంట్ నెంబర్‌ను నోట్ చేసుకోండి. ► సంబధిత బ్యాంక్‌ను సందర్శించి బ్యాంక్ వివరాలతో పాటు తప్పుగా వేరే బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేశామని ఓ లెటర్ రాయిలి. ► మనం పైన చెప్పుకున్నట్లుగా మీరు ఎవరికైతే తప్పుగా పంపారో స్క్రీన్ షాట్లను ఆ లెటర్‌కు అటాచ్ చేయాలి. ► దీంతో బ్యాంక్ అధికారులు మీకు సంబంధిత అకౌంట్ హోల్డర్ వివరాల్ని అందిస్తారు. ► అదే బ్యాంక్ బ్రాంచ్ అయినట్లేతే నేరుగా పంపిన డబ్బుల్ని తిరిగి మీ అకౌంట్ పంపాలని బ్యాంక్ అధికారులు రిక్వెస్ట్ పంపిస్తారు. ► అది వేరే బ్యాంక్ అయితే మీరు ఎవరికైతే పంపారో వారి బ్యాంక్‌ను సందర్శించి లెటర్,ఈమెయిల్, స్క్రీన్షాట్లను సబ్మిట్ చేయాలి. ► మీరు ఇచ్చిన వివరాలు చెక్ చేసుకొని ఆ బ్యాంక్ అధికారులు సంబంధిత బ్యాంక్ అకౌంట్ హోల్డర్‌కు కాల్ చేసి డబ్బులు తిరిగి పంపాలని రిక్వెస్ట్ చేస్తారు. ► అలా రిక్వెస్ట్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ బ్యాంక్ నిర్దేశించిన రోజుల్లో డబ్బులు తిరిగి మీ అకౌంట్‌కు పంపిస్తాడు. ► అప్పటికి పంపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం. అకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండా డబ్బుల్ని తీసుకోలేమా? మీరు తప్పుగా పంపిన బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అనుమతి లేకుండా డబ్బుల్ని తిరిగి తీసుకోవడం అసాధ్యం. కానీ అకౌంట్ హోల్డర్‌కి మీరు పొరపాటున డబ్బులు పంపించారని సదరు అకౌంట్ హోల్డర్ అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తిరిగి డబ్బుల్ని తీసుకోవడం సాధ్యమవుతుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
మీరు వినియోగించని బ్యాంక్ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా?
సహకార బ్యాంకులు సహా బ్యాంకింగ్ వ్యవస్థలో వినియోగంలో లేని ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.26,697 కోట్లని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు సీతారామన్ సమాధానం చెబుతూ, 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి దాదాపు తొమ్మిది కోట్ల అకౌంట్లలో ఈ భారీ మొత్తాలు ఉన్నట్లు వివరించారు. ఈ అకౌంట్లు దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవని తెలిపారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో 8,13,34,849 అకౌంట్లలో రూ.24,356 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో (యూసీబీ)ల్లోని 77,03,819 అకౌంట్లలో రూ.2,341 కోట్ల డబ్బు ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లోని 64 అకౌంట్లలో ఉన్న సొమ్ము రూ.0.71 కోట్లు. కాగా ఈ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను వెతికి పట్టుకోడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి బ్యాంకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. నిర్వహణ లేకుండా రెండేళ్లు పైబడితేనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి జాబితాను బ్యాంకుల నోటీస్ బోర్డ్‌ల్లో ఉంచాలని కూడా బ్యాంకులకు నిర్దేశించడం జరిగిందన్నారు. అలాగే వినియోగంలో లేని ఖాతాల్లో డబ్బును డిపాజిటర్ల విద్య, అవగాహనా ఫండ్ స్కీమ్, 2014కు బదలాయించి నిధిని సద్వినియోగ పరిచే చర్యలూ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ప్రతి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బోర్డు (హెచ్ఎఫ్సి) తన నిధుల వ్యయం, మార్జిన్, రిస్క్ ప్రీమియం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేటు నమూనాను అవలంబించవచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. చదవండి: దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు! -
హ్యాకర్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్
కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్‌లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్ అటాక్స్ చేసి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్ దాడులకు గురవుతున్నారు. సైబర్ నేరస్తులు దాడులు చేసే విధానం అయితే ఇలాంటి సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. ►ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తారు. ► వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ► బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. ► ఆ మెయిల్స్‌లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ► ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ► ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ► ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు. ► https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది. ► నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి. ► మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు ► ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు. ► ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్‌లు,పాస్వర్డ్లు మీ రహస్యం.మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్‌ను, సూచనల్ని పాటించి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండండి. -
‘మేకింగ్ మనీ యాప్’ పేరిట మోసం
కడప అర్బన్: ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్సీసీ మేకింగ్ మనీ యాప్ పేరిట సెల్ఫోన్లకు లింకులు పంపి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుని మోసాలకు తెగబడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను గుర్తించి, అందులోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని స్తంభింప (ఫ్రీజ్) చేశారు. కడప వన్‌టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల్లో దాదాపు 100 మంది బాధితులకు రూ.11 కోట్ల మేరకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నేరం ఇలా చేస్తారు.. ► మేకింగ్ మనీ, ఆర్సీసీ, ఇతర యాప్‌ల పేరిట బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపుతారు. ఈ లింకులను క్లిక్ చేసి.. పెట్టుబడి పెడితే కమీషన్ ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఊరిస్తారు. ► రిజిస్టర్ చేసుకుని, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ టాస్క్ పేరిట వస్తువును ఆన్లైన్లో కొనేందుకు టాస్క్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెబుతారు. టాస్క్‌లో పాల్గొని అధిక మొత్తంలో డబ్బులు కమీషన్ రూపంలో సంపాదించాలనే ఆశతో బాధితులు నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ► తొలుత కమీషన్ రూపంలో కొంత మొత్తాన్ని పంపిస్తారు. ఇలా డబ్బులు నిజంగా వస్తాయేమోనన్న ఆశతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేస్తారు. వాట్సాప్ ద్వారా చాట్ చేస్తూ మోసాన్ని కొనసాగిస్తారు. ► టాస్క్ అతి సులువుగా ఉండటంతో చాలా మంది తమ సన్నిహితులతో పెట్టుబడి పెట్టిస్తారు. వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ ఐడీ) ద్వారా డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేయించుకుంటారు. ► ఆర్సీసీ, మనీ మేకింగ్, ఇతర యాప్‌లలో బాధితుల ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తుంటుంది. అయితే అదంతా ఫేక్ డిస్ప్లే. అప్పటికే బాధితుల మొత్తాన్ని ఇతర ఖాతాలకు తరలించి సైబర్ నేరగాళ్లు దానిని క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు. ఇలా పట్టుబడ్డారు.. ► కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన గౌస్‌బాషా ఫిర్యాదుతో నిఘా పెట్టి, తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన గోకుల్ వెందన్ (28), ఈరోడ్‌కు చెందిన మురుగానందన్ (50)లే నిందితులుగా గుర్తించారు. వీరు ఎంతో మందిని మోసం చేశారు. అయితే ఇదే తరహా నేరం చేసిన ఘటనలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్ ద్వారా వారిని కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచి, కస్టడీలోకి తీసుకున్నారు. ► బాధితుడు గౌస్‌బాషా స్నేహితుడు దండు నాగచైతన్య కూడా రూ.99,980 మోసపోయాడు. ఇకపై ఎవరూ ఇలాంటి లింకులను క్లిక్ చేయొద్దు. ఎవరైనా మోసపోయి ఉంటే పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. -
రూ.5 లక్షలు ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది?
ముంబై: డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్ట సవరణ ప్రకారం 90 రోజుల్లోపు రూ. 5,00,000 చెల్లింపులకు అర్హత కలిగిన ఖాతా దారుల జాబితాను రూపొందించాలని మారటోరియంలో ఉన్న 21 సహకార బ్యాంకులను డీఐసీజీసీ ఆదేశించింది. అక్టోబర్ 15లోపు క్లయిమ్ జాబితా సిద్ధం కావాలని స్పష్టం చేసింది. దీనిలో పీఎంసీ బ్యాంక్ కూడా ఒకటి. మారటోరియంలో ఉన్న 21 బ్యాంకుల్లో 11 మహారాష్ట్రవికాగా, ఐదు కర్ణాటక రాష్ట్రానికి చెందినవి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, రాజస్తాన్‌లకు చెందిన ఒక్కొక్క బ్యాంక్ ఉన్నాయి. -
బ్యాంక్ అకౌంట్లపై సెబీ కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నిర్వహించాలని సెబీ కోరింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను స్వీకరించేందుకు.. అదే విధంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులను తిరిగి చెల్లించేందుకు, డివిడెండ్ చెల్లింపులు సులభంగా ఉండేందుకే సెబీ ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన అభ్యర్థనకు వీలుగా ఈ మేరకు వివరణ ఇస్తున్నట్టు సెబీ స్పష్టం చేసింది. తప్పనిసరిగా బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన బ్యాంకును ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుందని.. దీనివల్ల వేగంగా నిధుల బదిలీకి వీలు పడుతుందని తెలిపింది. క్రెడిట్ సదుపాయాలను (నగదు, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో) వినియోగించుకున్న కస్టమర్లకు కరెంట్ ఖాతాలను తెరవొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన విషయాన్ని ఫండ్స్ పరిశ్రమ సెబీ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత సమీక్షలో భాగంగా.. నూతన ఫండ్ పథకాలు, డివిడెండ్ చెల్లింపులు, షేర్ల బైబ్యాక్ తదితరాలకు ఖాతాలు తెరవొచ్చని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. నిబంధనల అమలుకు మరింత గడువు బ్యాంకులు కరెంట్ ఖాతాలకు సంబంధించి మార్పులను అమలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్ వరకు గడువును ఆర్బీఐ పొడిగించింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో కరెంట్ ఖాతాల స్తంభనతో చిన్న వ్యాపార సంస్థలు ఇబ్బంది పడుతున్నట్టు తెలియడంతో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రుణాల పరంగా రుణ గ్రహీతల్లో క్రమశిక్షణను పెంచడం, రుణాలపై బ్యాంకుల నుంచి మరింత పర్యవేక్షణకు వీలుగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. వ్యాపార సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వాటి కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిబంధనలను ఆచరణలో పెట్టాలని కోరింది. -
ఇది నకిలీ ‘టీఎస్–బీపాస్’
సాక్షి, హైదరాబాద్: భవనాలు, లేఅవుట్లకు ఆన్లైన్లో అనుమతుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక టీఎస్–బీపాస్ పోర్టల్ (https:// tsbpass. tela ngana.gov.in)ను పోలినట్లుగా ఓ నకిలీ పోర్టల్ పుట్టుకొచ్చింది. గూగుల్‌లో ‘టీఎస్‌బీపాస్’అని సెర్చ్ చేస్తే ఒరిజినల్ పోర్టల్ కిందనే నకిలీ పోర్టల్ (http://10061994. xyz/ tsbpass2/ index. html) సైతం కనపడుతోంది. దరఖాస్తుదారులను మోసగించి వారికి సంబంధించిన పేటీఎం, ఫోన్‌పే, డెబిట్/క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు ఈ పోర్టల్‌ను తయారు చేశారు. అసలు పోర్టల్ హోం పేజీని పోలిన విధంగా నకిలీ హోం పేజీని డిజైన్ చేశారు. ‘తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం’పేరు, తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో ఇందులోనూ ఉండటంతో ప్రజలు సులువుగా మోసపోవడానికి అవకాశాలున్నాయి. ఒరిజినల్ పోర్టల్ తరహాలోనే నకిలీ దాంట్లోనూ ‘పర్సనల్ ఇన్ఫర్మేషన్, బిల్డింగ్ డిటైల్స్, పేమెంట్, ఫినిష్’పేర్లతో నాలుగు అంచెల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పేమెంట్ ఆప్షన్లో పేటీఎం, ఫోన్‌పే, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం ఉన్నట్లు చూపుతోంది. ఆన్లైన్లో టీఎస్–బీపాస్ పోర్టల్‌ను సెర్చ్ చేసే క్రమంలో ‘సాక్షి’ప్రతినిధి ఈ అనుమానాస్పద వెబ్‌సైట్‌ను గుర్తించి రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. ఆయన ఆ పోర్టల్‌ను పరిశీలించి నకిలీగా నిర్ధారించారు. దీనిపై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు గూగుల్‌కు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు.. సైబర్ క్రైం భాషలో ఏదైనా అసలు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తే దాన్ని స్ఫూఫింగ్ వెబ్సైట్ (Spoofing) అంటారు. గతంలో ప్రముఖ బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లను సైబర్ నేరస్తులు సృష్టించి అమాయక ప్రజల నుంచి ఫీజుల పేరుతో ఆన్లైన్లో డబ్బులు వసూలు చేయడంతోపాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. ఇలా సున్నితమైన సమాచారాన్ని తస్కరించడాన్ని ఫిషింగ్ ( Phishing) అటాక్ అంటారు. -
రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది: సీఎం జగన్
-
రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, తాడేపల్లి: రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని అన్నారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్టు తెలిపారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్టు వెల్లడించారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని, ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపినట్టు సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రైతులకు ఎంత చేసినా తక్కువే.18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చాం. రైతుభరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నాం. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నాం. రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశాం. గత ప్రభుత్వం సున్నవడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల ఆ బకాయిలన్నింటినీ మేమే చెల్లించాం. ఏ సీజన్లో పంట నష్టపోతే.. అదే సీజన్లో రైతులను ఆదుకుంటున్నాం. నెల రోజుల్లోపే రూ.132 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు. -
చక్రవడ్డీ మాఫీ.. అకౌంట్లలో జమ ప్రారంభం!
న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో నిర్దిష్ట రుణ అకౌంట్లపై చార్జీ చేసిన చక్రవడ్డీ రుణ గ్రహీతలకు రిఫండ్ చేయడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. ‘‘కోవిడ్–19 రిలీఫ్ ఎక్స్‌గ్రేషియా మీ అకౌంట్లో నవంబర్ 3న క్రెడిట్ అయ్యింది’’ అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ నుంచి ఒక మెస్సేజ్ వచ్చినట్లు ఒక కస్టమర్ తెలిపారు. రూ.2 కోట్ల రుణం వరకూ ఆరు నెలల మారటోరియం (2020 మార్చి 1– ఆగస్టు 31 మధ్య) సమయంలో అమలు చేసిన చక్రవడ్డీ రద్దు పథకాన్ని నవంబర్ 5వ తేదీలోపు అమలు చేయాలని గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలుసహా అన్ని బ్యాంకులకు సూచించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో నిర్దిష్ట రుణ అకౌంట్లలో ఆరు నెలల కాలానికి చార్జ్ చేసిన చక్రవడ్డీ–సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతలకు ఎక్స్‌గ్రేషియో గ్రాంట్‌గా అందించే పథకాన్ని గత నెల్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ పరిధిలోకి గృహ, విద్యా, క్రెడిట్ కార్డ్, ఆటో, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కన్జూమర్ డ్యూరబుల్స్, వినియోగ రుణాలు వస్తున్నాయి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ క్రియాశీలతకు సంబంధించిన రుణాలకు ఈ పథకం వర్తించదు. అక్టోబర్ 23న ఆర్థిక మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించి ఒక నిర్వహణా పరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తొలుత ఈ పరిహారాన్ని బ్యాంకింగ్ రుణ గ్రహీతలకు చెల్లిస్తుంది. అటు తర్వాత కేంద్రం నుంచి తిరిగి పొందుతుంది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రిఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. (చదవండి: కామత్ కమిటీ ఏం సూచించింది..?) నేపథ్యం ఇది... కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంత కాలం వాయిదా వేసుకునే వీలు కలి్పస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. -
సొంత కారులేదు.. అప్పులూ లేవు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), జీవిత బీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది. ► మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది. ► ప్రధాని సేవింగ్స్ అకౌంట్లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి. ► గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు. ► నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది. ► గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది. ► ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు. అమిత్ షా ఆస్తులు తగ్గాయ్ ! కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తుల విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. షేర్ మార్కెట్లో డబ్బులు ఉంచడంతో ఆయనకి ఉన్న చరాస్తుల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది అమిత్ షా వద్ద రూ. 32.3 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ. 28.63 కోట్లకి తగ్గిపోయాయి. ఇక రూ.13.56 కోట్ల విలువైన స్థిరాస్తులు షా పేరు మీద ఉన్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. షా బ్యాంకు ఖాతాలో రూ.1.04 కోట్లు ఉంటే ఆయన దగ్గర నగదు రూపంలో రూ.15,814 ఉన్నాయి. రూ.44.47 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
కోవిడ్ పేషెంట్లకు కొత్తగాలం
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’.. ఈ సామెత సైబర్ నేరగాళ్లకు చక్కగా సరిపోతుంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న వేళ.. సైబర్ నేరగాళ్లు సైతం పరిస్థితికి తగినట్లుగా నేరాల రూటు మార్చుకుంటున్నారు. మొన్నటిదాకా పీఎం కేర్స్, ఆరోగ్యసేతు, టిక్‌టాక్ ప్రో యాప్‌లతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు నేరుగా కోవిడ్ పేషెంట్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇందుకోసం కోవిడ్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడే ఆక్సిమీటర్లను ఎంచుకున్నారు. ఆక్సిమీటర్లను అమ్ముతామంటూ ఫోన్లకు మాల్వేర్లను పంపిస్తూ డబ్బులను కొల్లగొడుతున్నారు. ఏంటి ఈ ఆక్సిమీటర్లు? సాధారణంగా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన పరికరమే ఈ ఆక్సిమీటర్. ఇవి బహిరంగ మార్కెట్లో రూ.500 నుంచి రూ.5,000 వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు ఈ కామర్స్ వెబ్సైట్లు, మెడికల్ షాపులు అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నాయి. కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవుండే ఈ పరికరాన్ని చూపుడువేలు చివరన అమరుస్తారు. దానిపై ఉన్న డిజిటల్ తెరపై రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా ఉందా? సంతృప్త స్థాయిలో ఉందా? అన్నది తెలిసిపోతుంది. మాల్వేర్ పంపి.. తమ కుటుంబంలో ఒకరికి కోవిడ్ సోకి.. ఆక్సిమీటర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తోన్న అమాయకులను సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోవిడ్ పేషెంట్లలో ముందుగా ప్రభావితమయ్యే భాగాలు ఊపిరితిత్తులు. ఒక్కొసారి కొందరిలో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అలాంటి వారిలో ఆక్సిజన్ స్థాయిలు లెక్కించేందుకు వాడే ఈ పరికరం కోసం చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆక్సిమీటర్లు అమ్ముతామంటూ అందరి సెల్ఫోన్లకు మాల్వేర్ ఉన్న లింకులను పంపుతున్నారు. ఈ మాల్వేర్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వైరస్లు ఉంటాయి. ఫలితంగా ఈ లింకును క్లిక్ చేసిన క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లోని మొత్తం నగదు మాయమవుతుంది. ఇలాంటి పరికరాలేమైనా కొనాలనుకుంటే గుర్తింపు ఉన్న ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ మెడికల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు పంపిన అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి చేతిలో డబ్బులు పోగొట్టుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
'మొబైల్ యాప్స్ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'
సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్‌ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు. -
ఆగిన పోస్టల్ నగదు పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వ చేయూత రూ.1500లు పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. పోస్టల్ శాఖ బీఎస్ఎన్ఎల్ లైన్ డిస్ కనెక్షన్ కావడంతో టీఎస్ ఆన్లైన్ సర్వర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో శుక్రవారం ఆహార భద్రత కార్డుదారులకు నగదు పంపిణీని నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. టీఎస్ ఆన్లైన్ సర్వర్‌తో బీఎస్ఎన్ఎల్ లైన్ పునరుద్ధరణ అనంతరం తిరిగి చెల్లింపులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, లబ్ధిదారులైన నిరుపేదలు సమాచారం తెలియక పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టి నిరాశకు గురయ్యారు. నిరాశకు గురైన నిరు పేదలు లాక్డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డులు కలిగిన పేద కుటుంబాలకు గత నెల ఏప్రిల్‌లో ఉచిత బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల కోసం వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.1500ల నగదు జమ చేసిన విషయం తెలిసిందే. బ్యాంక్ అకౌంట్‌లేని వారిని సైతం గుర్తించి వారి నగదు పోస్టాఫీసుల్లో జమ చేసి రేషన్ కార్డు నంబర్ ఆధారంగా డబ్బు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పోస్టల్ శాఖ నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో)తో కలిపి సుమారు 24 పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తోంది. నిరుపేదలు పోస్టాఫీసుల ద్వారా నగదు తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారం రోజుల నుంచి మండుటెండల్లో పోస్టాఫీసుల ముందు నగదు కోసం గంటల కొద్దీ కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. కాగా శుక్రవారం సాంకేతిక సమస్య కారణంగా పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీని నిలిపివేయడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. -
రూ.1500 అందలేదా?.. నో టెన్షన్ ప్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆహారభద్రత కార్డుదారులా..? లాక్ డౌన్ నేపథ్యంలో ఉచిత బియ్యం కోటా డ్రా చేసినా..నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వ సహాయం రూ.1500 నగదు మీ బ్యాంక్ ఖాతాలో జమ జరుగలేదా..? మీ కార్డులోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ(మహిళ) ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమై ఉన్నా... నగదు జమ కాలేదా? రెండు మూడు బ్యాంక్ ఖాతాలుంటే నగదు ఏ ఖాతాలో జరిగిందో తెలియదా? ..పరేషాన్‌కావల్సిన పనిలేదు. ఆహార భద్రత కార్డుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ల్యాండ్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ల్యాండ్ ఫోన్ 040–23324614, 23324615 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా నెంబర్లకు ఫోన్ చేసి మీ ఆహార భద్రత కార్డు కొత్త నంబర్ చెబితే సరిపోతుంది. మీ నగదు బ్యాంక్ ద్వారా లేదా పోస్టాఫీస్‌లో జమ అయిందా..? కాలేదా ? ఆన్లైన్లో పరిశీలించి తెలియజేస్తారు. బ్యాంక్‌లో జమ జరిగితే కుటుంబంలోని ఎవరి ఖాతాలో, ఎ బ్యాంక్‌లో జమ జరిగిందో వివరిస్తారు. బ్యాంక్‌లో పెండింగ్ ఉంటే దానికి గల స్టేటస్ తెలియజేస్తారు. బ్యాంక్ ఖాతా లేకుంటే పోస్టల్ ద్వారా నగదు జమ అయింది లేనిది కూడా తెలియ జేస్తారు. ఒక వేళ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీసుల్లో కూడా నగదు జమ కాకుంటే ఎందుకు జమ కాలేదో స్టేటస్ వివరిస్తారు. పోస్టాఫీసులో నగదు పంపిణీ ఇలా... బ్యాంకు ఎకౌంట్ లేని వారు సమీప పోస్టాఫీసుకు వెళ్లి ఆహార భద్రత (రేషన్) కార్డు చూపించినా.. లేదా రేషన్ కార్డు కొత్త నెంబర్ మౌఖింగా తెలియజేసినా చాలు. పోస్టల్ శాఖ సిబ్బంది వెంటనే బయోమెట్రిక్ (వేలిముద్ర) తీసుకొని రూ.1500 నగదు అందజేస్తారు. అయితే ఆహార భద్రత నిబంధన ప్రకారం కార్డు లోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ (కుటుంబ పెద్ద) మహిళ మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. గురువారం హైదారబాద్ అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో)లో చీఫ్ పోస్ట్ మాస్టర్ జయరాజ్ బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారులకు నగదు అందించే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద 5,21,641 కార్డుదారులకు బ్యాంక్ అకౌంట్ లేదని గుర్తించారు. అందులో హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు1.62 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంక్ అకౌంట్ లేని వారి కోసం సుమారు రూ.78,24, 55,500 నగదును ప్రభుత్వం తపాలాశాఖæ ఖాతాలో జమ చేసింది. బ్యాంక్ అకౌంట్ లేని పేదలకే అవకాశం బ్యాంక్ అకౌంట్ లేని వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా నగదు అందజేస్తామని చీఫ్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ఉండి ఇన్ అక్టివ్‌లో ఉంటే వారి నగదు బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయిందని చెప్పారు. ఎలాంటి బ్యాంక్ అకౌంట్ తెరువని వారు మాత్రమే సమీప పోస్టాఫీసు ద్వారా నగదు పొందవచ్చని ఆయన వివరించారు. -
రూ.50 వేలు దాటితే.. రుజువు చూపాల్సిందే..
కరీంనగర్,కోరుట్ల: ‘మీరు మున్సిపల్ ఏరియాల్లో ఉంటున్నారా..? మీ అవసరాల కోసం రూ. 50 వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళుతున్నారా..? కాస్త జాగ్రత్త పడండి.. ఆ డబ్బుకు చెందిన డ్రా చేసిన వివరాలు..బ్యాంకుకు చెందిన స్లిప్పులు వెంట ఉంచుకోండి...లేకుంటే మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సదరు డబ్బు సీజ్ అయ్యే అవకాశముంది’.. మున్సిపాల్టీల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అభ్యర్థుల అడ్డగోలు డబ్బు పంపిణీకి చేయడానికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. కాసుల పంపిణీకి చెక్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కార్పొరేషన్లో రూ.1.50 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ. లక్ష వ్యయం చేయడానికి వీలుంది. వీటికి సంబంధించిన లెక్కలు ప్రతీ రోజు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాల్టీల్లో ఆడిటర్లకు ప్రతీరోజు అప్పగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నేరుగా డబ్బు పంపిణీ చేయడానికి అవకాశమున్న క్రమంలో డబ్బు తీసుకెళ్లడానికి మున్సిపల్ ఎన్నికల చట్టం–2019 సెక్షన్ 226 ప్రకారం రూ.50 వేలు పరిమితిగా నిర్ణయించారు. ఈ పరిమితికి మించి డబ్బు ఎవరైనా తీసుకెళితే ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారో..ఎందుకు వాడుతున్నారో తెలపడంతోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బు సీజ్కావడమే కాకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నిఘా టీంలు మున్సిపాల్టీల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టకుండా నియంత్రించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్లయింగ్ స్క్వాడ్ ఫీల్డ్ పర్యవేక్షణ బృందం, స్థిర పర్యవేక్షణ బృందాలుగా పిలుచుకుంటున్నారు. ఈ బృందాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకోసం నియమించిన సిబ్బందితోపాటు పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారు. మున్సిపాల్టీల్లోని జనాభా ప్రకారం ఈ బృందాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల మున్సిపాల్టీల్లో ఐదు ప్లయింగ్ స్క్వాడ్‌కు, ఐదు స్థిర పర్యవేక్షణ బృందాలు ఐదు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీల్లో మూడు చొప్పున ఆరు టీంలు, రాయికల్, ధర్మపురి మున్సిపాల్టీల్లో రెండు చొప్పున నాలుగు టీంలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు వస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు..వారికి సంబంధించిన వ్యక్తులు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు వస్తే సదరు వ్యక్తి వద్ద రూ.50 వేలకు తక్కువగా రూ.10 వేలు ఉన్నా సదరు డబ్బు సీజ్ చేసే అవకాశముంది. సదరు వ్యక్తి పోటీలోని అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బు పంచడానికి వెళుతున్నారా..లేదా ఇతర అవసరాల కోసం తీసుకెళుతున్నారా..? అన్న అంశాన్ని ప్లయింగ్ స్క్వాడ్ బృందం నిర్ధారించుకున్న తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటారు. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
‘ఆధార్’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జూలైలో ఆధార్ సవరణ చట్టం సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది. ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఆధార్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది. -
ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెన్షన్ పొందేందుకు ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది. ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు. అద్దాల భవంతులపై ఆధారాల్లేవు.. అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు. -
గద్దె నెక్కిస్తే చోరీ చేస్తారా?
►ముఖ్యమంత్రి ఎవరు? నా బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించడానికి? వాటినిప్రైవేటు వ్యక్తులకు అందించడానికి? ►ముఖ్యమంత్రి ఎవరు? నా ఆధార్ కార్డు వివరాలు దొంగతనం చేయడానికి? వాటిని టీడీపీకి యాప్‌ను తయారుచేసిన ఐటీ కంపెనీకి ఇవ్వడానికి? ►ముఖ్యమంత్రి ఎవరు? భారతీయ ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండాల్సిన కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తస్కరించడానికి? తన పార్టీ అవసరాల కోసం ఒక ప్రైవేటు ఐటీ కంపెనీకి ఇవ్వడానికి? సాక్షి, అమరావతి: ఇప్పుడు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి? తమ వ్యక్తిగత సమాచారం పోయిందన్న ఆందోళన, ఆగ్రహంతో వేస్తున్న ప్రశ్నలివి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల సమాచారంతో పాటు పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమకు ధర్మకర్తగా ఉండాల్సింది పోయి తమకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ధర్మమా? అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం ఒక ప్రైవేటు కంపెనీ కలిగి ఉన్నందుకు, ఆ కంపెనీపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేస దర్యాప్తు కోసం సిట్‌ను వేసిన సంగతి తెలిసిందే. తమ ప్రజల సమాచార భద్రతకు సంబంధించిన ఇటువంటి కేసుల్లో తన వంతు ధర్మంగా సహకరించాల్సిన ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎదురుదాడి చేయడం విస్మయం కలిగిస్తోంది. అసలు కీలకమైన డేటాను ఎలా దొంగిలించారు? దీనికి బాధ్యులు ఎవరు? కేసులేమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే.. ప్రైవేటు చేతిలో రెండు రాష్ట్రాల డేటా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాలతో పాటు పల్స్ సర్వే, ఆర్టీజీఎస్ వివరాలు, కులం, మతం, ప్రభుత్వ పథకాల ద్వారా అందిన లబ్ధి, రాజకీయ పార్టీలపై అభిప్రాయం ఇలా పలు అంశాలతో కూడిన డేటాను ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం, అవి తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో కూడా ఉండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమకు అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఈ ఐటీ గ్రిడ్స్‌లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించడానికి, ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ప్రణాళికతోనే ఈ వ్యవహారాన్ని చాపకింద నీరులా నడిపించినట్లు పోలీసులు విచారణలో తేలుతోంది. అలాగే చంద్రబాబు డేటా చోరీ వ్యవహారం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నివ్వెరపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఫలితాలను తారుమారు చేయించడానికి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు ప్రయత్నించారని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డేటా చోరీ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేసి దోషులెవరో తేల్చాలని నిర్ణయించింది. పల్స్ సర్వే పేరుతో స్మార్ట్‌గా కోట్టేశారు.. 2014 ఎన్నికల సమయంలోనే చంద్రబాబునాయుడు అడ్డదారుల్లో ప్రత్యర్థి పార్టీ ఓట్ల తొలగింపు ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. సరిగ్గా తాను అధికారం చేపట్టే నాటికే తనకు కావలసిన ఐటీ కంపెనీలను సిద్ధం చేయించుకొని తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లను తొలగించే ప్రణాళికను అమల్లోకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన పనులు గమనిస్తే అవన్నీ నిజమేననిపిస్తాయి. ఆ పనులేంటంటే.. ►అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం ద్వారా చేయించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సిబ్బందిని పంపి వారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు, వారు చేస్తున్న ఉద్యోగాలు, ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం, అందిన ప్రభుత్వ పథకాలు, వారికి రాజకీయంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు.. ఇలా అన్ని రకాల వివరాలను సేకరింపజేసింది. ►వీటిని స్టేట్ రెసిడెంట్స్ డేటా (రాష్ట్రంలో నివసించేవారి సమాచారం) హబ్‌లో నిక్షిప్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీఎస్) సర్వర్లలో భద్రపరిచింది. ►ఈ ఆర్టీజీఎస్ సీఈఓగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అత్యంత నమ్మకస్తుడైన అహ్మద్ బాబును నియమించుకున్నారు. ప్రజాసాధికార సర్వే సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ మళ్లీ ఆయా ప్రజానీకానికి ఫోన్లు చేసి పథకాల అమలు తీరు, ప్రభుత్వంపై వారికి ఉన్న సంతృప్తి, అసంతృప్తి తదితర వివరాలను సేకరించింది. బ్లూ ఫ్రాగ్ చేతిలో 27 ప్రభుత్వ శాఖల సమాచారం ►ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని, తాను ఫోన్ల ద్వారా సాగించిన సర్వే వివరాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా ఆర్టీజీఎస్ సమీకరించి బ్లూ ఫ్రాగ్ సంస్థకు అందించింది. దాదాపు 27 రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో బ్లూ ఫ్రాగ్ సేవలు కొనసాగుతున్నాయి. ►ప్రజాసాధికార సర్వే, ఆర్టీజీఎస్ నిర్వహించిన సర్వే వివరాలతో పాటు దాదాపు 27 శాఖల సమాచారం ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ చేతుల్లో ప్రభుత్వం పెట్టింది. ►ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు తమకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దాకవరపు అశోక్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థను ఏర్పాటు చేయించి దానికి బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ప్రభుత్వ సమాచారం యావత్తూ తరలింపజేశారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థకు తరలింపజేశారు. సేవామిత్ర యాప్‌తో అభిప్రాయ సేకరణ ►ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలుగుదేశానికి సేవామిత్ర యాప్‌ను రూపొందించి సర్వేలు చేయిస్తోంది. తమకు ఆర్టీజీఎస్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఫోన్లు చేసి ప్రజలనుంచి పలు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించింది. దాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ఏర్పాటు చేయించిన సేవామిత్రులకు పంపి ప్రజలనుంచి నేరుగా ఆయా అంశాలపై అభిప్రాయ సేకరణ జరిపించింది. ►సేవా మిత్రులనుంచి వచ్చిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ లోతుగా విశ్లేషించి వారిలో ప్రభుత్వ అనుకూలురు ఎవరు? ప్రతికూలురు ఎవరు? అన్న సమాచారాన్ని బూత్ స్థాయిలోని టీడీపీ ముఖ్య నాయకులకు అందజేసింది. ఓట్లు ఇలా తొలగించేశారు.. టీడీపీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ టీడీపీ ప్రతికూల ఓట్లను తొలగించేలా జిల్లా స్థాయిలోని ఎన్నికల అధికారులకు అభ్యర్థనలు అందించారు. వీటి పరిశీలనకు బూత్ స్థాయిలో పరిశీలకులుగా తామే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించిన అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించుకోవడం ద్వారా తప్పుడు నివేదికలు రూపొందింపచేశారు. ఎమ్మార్వోల అనుమతితో తమ ప్రతికూల ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తూ వచ్చారు. ఈ ప్రక్రియను చంద్రబాబునాయడు, ఆయన బృందం గతకొన్నేళ్లుగా ఒక పథకం ప్రకారం కొనసాగించి లక్షలాది టీడీపీ ప్రతికూల ఓట్లను గల్లంతు చేయించింది. కలర్ ఫోటోలతో కూడిన జాబితా ఎలా వచ్చింది? మీరెప్పుడైనా ఓటర్ల జాబితాలో కలర్ ఫోటోలను చూశారా? కేవలం కేంద్ర ఎన్నికల సంఘం మాస్టర్ డేటాలో మాత్రమే ఈ కలర్ ఫోటో ఉంటుంది. మిగతా ఎవరి దగ్గరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో కూడిన ఓటరు జాబితా మాత్రమే ఉంటుంది. మరి ప్రైవేటు సంస్థలైన బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్ సంస్థలకు కలర్ ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఎలా వచ్చింది? అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్షానికి సాధ్యమా? ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తాము ఇవ్వలేదని చెప్పాయి. మరి ఐటీ కంపెనీలకు ఈ జాబితా ఎవరు ఇచ్చారు? ప్రతిపక్ష పార్టీలు దగ్గర ఈ సమాచారం ఉండే అవకాశమే లేదు. దీనినబట్టి చూస్తే అధికార తెలుగుదేశం పార్టీనే ఈ డేటాను చోరీ చేసిందని తెలుస్తూనే ఉంది. ఈ ముఖ్య విషయంతో పాటు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్, జన్మభూమి కమిటీలు, అంగన్వాడీ వర్కర్లు, సేవామిత్రల పాత్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. అడ్డంగా దొరికి ఎదురుదాడి చంద్రబాబునాయుడు, ఆయన బృందం సైబర్ నేరానికి పాల్పడినట్లు తేటతెల్లమవుతున్నా మళ్లీ ఎప్పటిలాగే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. దీనిని తెలంగాణ, ఏపీ మధ్య వివాదంగా సృష్టిస్తున్నారు. తమ డేటా పోలేదని ఒకసారి, దొంగిలించారని మరోసారి, అది పార్టీకి చెందిన 65 లక్షల మంది డేటా అని ఇంకోసారి ప్రకటనలు చేస్తూ చివరకు మంత్రులతో ఎదురు కేసు పెట్టించారు. నిజానికి పార్టీ డేటా పోతే ఆ డేటాను ఎవరికి అప్పగించారో ఆ ఐటీ గ్రిడ్స్ సంస్థపై, ఆ సంస్థ ఎమ్డీ దాకవరపు అశోక్‌పై వారు కేసు పెట్టాలి. ఆ సంస్థ హైదరాబాద్‌లో ఉంది కనుక హైదరాబాద్‌లో కేసు నమోదు చేయించాలి. చంద్రబాబు అలా చేయకుండా గుంటూరులో కేసు పెట్టించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఆ చోరీ జరిగి ఉంటే అశోక్ చేత హైదరాబాద్‌లో పోలీసు కేసు పెట్టించాలి. అదేమీ చేయకుండా అశోక్‌ను చంద్రబాబునాయుడు ఎందుకు వెనకేసుకు వస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. పైగా పార్టీ సమాచారం పోయిందని చెబుతున్న చంద్రబాబునాయుడు ఆ ప్రైవేటు సమాచారంపై ప్రభుత్వం ద్వారా అత్యున్నత స్థాయిలో సిట్లు ఏర్పాటుచేయడం చూసి జనం విస్తుపోతున్నారు. పోలీసు శాఖను తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా బాబు మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు భరోసా ఇవ్వకుండా.. తమ వ్యక్తిగత సమచారం పోయిందని ప్రజల మనసుల్లో ఉన్న ఆందోళన, భయాన్ని తొలగించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం గర్హనీయం. -
బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేయడం అంటే ఇదేనేమో! ఓ బ్యాంకు మేనేజర్ తాను పనిచేస్తున్న బ్రాంచ్‌ను నిలువుగా ముంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్.కృష్ణఆదిత్య అదే బ్యాంకులో తన పేరిట సేవింగ్ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) అకౌంట్ తెరిచాడు. ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్లైన్ ద్వారా సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్‌పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్ ఖాతాలోకి మళ్లించినట్టు బ్యాంకు రీజినల్ మేనేజర్ అంతర్గత విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగకుండా కృష్ణఆదిత్య 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. దుర్గాభవానీ, జై భవానీ మద్యం దుకాణాలకు ఎలాంటి రుణ ష్యూరిటీ పత్రాలు లేకుండానే రూ.60 లక్షలు రుణాలు మంజూరు చేశాడు. గ్రూప్ ఆఫ్ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు గుర్తించారు. అయితే, ఈ వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినట్టు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్ తెలిపారు. తనకు సమాచారం లేకుండా తన అకౌంట్ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్లో వేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపగా మొత్తం కుంభకోణం బయటపడిందని దుర్గప్రసాద్ సీబీఐకి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఆదిత్యతోపాటు క్యాషియర్ కమ్ క్లర్క్ లేళ్ల శశిధర్, తాత్కాలిక మేనేజర్ ఆరె సత్యం, అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్, సుజాత్ అలీ సిద్దిఖీ, ఇతడి స్నేహితులు మహ్మద్ అబ్దుల్ ఖలీముల్లా షబ్బీర్, మహ్మద్ జబీరుల్లాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. -
హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్‌బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించలేదని జీఎస్టీ ఆరోపించింది. సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులిచ్చింది. గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను ఎటాచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. ఈ కాలానికి మొత్తం 18.5 లక్షల రూపాయలు బకాయి ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్‌కు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతోసహా మొత్తం 73.5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. -
ఆ ముగ్గురి మధ్యే.. గూడుపుఠాణి!
సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్లల్లో రూ.వేల కోట్ల టర్నోవర్ సాగించిన, బ్యాంకు ఖాతాల్లో కనీసం రూ.వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ గ్రూప్ వ్యవహారాలన్నీ సీఈఓ నౌహీరా షేక్‌తో పాటు ఆమెకు అత్యంత సన్నిహితులైన బిజూ థామస్, మోలీ థామస్లకే తెలిసి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వీరితో పాటు కీలక సూత్రధారిగా ఉన్న మరో అజ్ఞాత వ్యక్తి విదేశాల్లో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకువచ్చేందుకు అవసరమైన అనుమతులు పొందటంపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. తిరుపతికి చెందిన నౌహీరా షేక్ హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినా ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా రికార్డులు లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయంపై దృష్టి సారించారు. ఈ వివరాలన్నీ ఆ ముగ్గురికే తెలిసి ఉంటాయని, నగదు దేశం దాటిందనే అనుమానాల నేపథ్యంలో అక్కడా ఓ కీలక వ్యక్తి ఉంటారని భావిస్తూ ఆ వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు తాము భారీ స్థాయిలో బంగారం ఖరీదు చేస్తామని, ఈ నేపథ్యంలోనే మార్కెట్ ధరకు గరిష్టంగా 20 శాతం తక్కువకు పసిడి వస్తుందని చెప్పుకొచ్చారు. విపణిలో బంగారు ధరలు పెరిగిన వెంటనే ఆ మొత్తం అమ్మేసి భారీ లాభాలు పొందుతామంటూ పేర్కొన్నారు. ఈ పసిడి క్రయవిక్రయాల రికార్డులు సమర్పించనందున ఈ విషయాన్నీ పూర్తిగా నమ్మలేమని అధికారులు పేర్కొన్నారు. నౌహీరా కొన్నేళ్ల క్రితం కేరళలో ఓ ఈవెంట్ నిర్వహణకు వెళ్లినప్పుడు మోలీ థామస్‌తో పరిచయమైంది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చిన నౌహీరా తన కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈమె ద్వారానే బిజూ సైతం నౌహీరాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచీ ఈ ముగ్గురూ కలిసి పని చేయడంతో పాటు తమ వ్యాపార కార్యకలాపాలు బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో 95 శాతం మందిని మోలీ కేరళ నుంచే తీసుకువచ్చారు. వీరికైతే ఇక్కడి వారితో సంబంధాలు ఉండవని, తమ గుట్టు బయటపడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క కేరళలో నౌహీరా షేక్ కార్యాలయం బిజూ థామస్‌కు చెందిన భవనంలోనే ఉంది. ఈ కేసులో తెరవెనుక ఉన్న కీలక నిందితులు, వారితో నిందితులకు ఉన్న సంబంధాలు నిర్థారించేందుకు వారి కాల్ డేటా సేకరించి విశ్లేషించాలని భావించారు. హీరా గ్రూప్ సీఈఓగా, వేల కోట్ల టర్నోవర్ కలిగిన నౌహీరా షేక్‌కు సొంతంగా సెల్‌ఫోన్ కూడా లేదని తేలింది. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వారి ఫోన్లతో మాట్లాడుతుందే తప్ప ఆమెకు సొంతంగా సెల్‌ఫోన్, సిమ్‌కార్డులు లేవని వెల్లడైంది. మరోపక్క ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరాను సిటీకి తీసుకువచ్చేందుకు అధికారులు పీటీ వారెంట్ పొందారు. త్వరలో ఓ బృందం ముంబై వెళ్లి ఈమెను తీసుకురానుంది. బిజూ థామస్‌ను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్న కూకట్పల్లి పోలీసులు విచారణ పూర్తి కావడంతో జైలుకు పంపారు. న్యాయస్థానం అనుమతితో మోలీ థామస్‌ను విచారించిన సీసీఎస్ పోలీసులు ఆమె కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో మళ్లీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్‌కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్‌కు ఫలక్‌నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్‌ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది. -
ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఏ, డీఏల చెల్లింపులను నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గతంలో పోలింగ్ ముగిసిన తరువాత పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని నగదు రూపంలో చెల్లించే వారు. నగదు రూపంలో చెల్లింపులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన ఎన్నికల కమిషన్.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముందస్తు శాసనసభ ఎన్నికలలో భాగంగా డిసెంబర్ 7న జరుగనున్న పోలింగ్ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించే ఉద్యోగుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే, ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ అధికారి (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారి(ఏపీవో)లకు శిక్షణ ఇస్తున్నారు. దశల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కొనసాగించనున్నారు. సిబ్బంది పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ రోజున విధులు నిర్వహించి, ఓటింగ్ యంత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలు ముగిసిన తరువాత రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి టీఏ, డీఏలను చెల్లించే వారు. అయితే, కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు, ఇతర ఉద్యోగులు పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భత్యం పంపిణీ చేయలేరనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక భత్యం చెల్లింపునకు ఎక్కువ సమయం పట్టడంతో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఇబ్బంది పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది టీఏ, డీఏలను బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ద్వారానే జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పోలింగ్ విధులకు ఎంపికైన ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను రిటర్నింగ్ అధికారులకు అందించాలని సూచించడంతో ఉద్యోగులు తమ వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల జిరాక్సు కాపీలను అందజేస్తున్నారు. -
సిమ్ బ్లాక్.. ఖాతాకు షాక్
రామనాథ్ బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆన్లైన్, మొబైల్ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇటీవల నాలుగురోజులు ఆయన సిమ్ పనిచేయలేదు. ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని మరో ఫోన్ వాడారు. కొద్దిరోజులకు బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటే భారీగా తేడా కనిపించింది. అయ్యో అనుకుంటూ బ్యాంకుకు వెళ్తే లావాదేవీల వివరాలన్నీ మీ సిమ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. కానీ అతని సిమ్ నంబరుతో మరొకరు అప్పటికే సిమ్ తీసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తేలింది. ఈ తరహా నేరాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. కర్ణాటక, బనశంకరి:సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులు, పోలీసు సైబర్ క్రైమ్ విభాగాలు ఎన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రజల కష్టార్జితానికి భద్రత ఇవ్వలేకపోతున్నారు. ఆన్‌లైన వంచకులు రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త తరహా పద్ధతుల్లో ప్రజల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులకు ఫోన్లు చేసి తమను తాము బ్యాంకు ప్రతినిధులుగా పరిచయం చేసుకొని లేదా లాటరీ వచ్చిందని, విదేశాల నుంచి బహుమతులు వచ్చాయని అందుకు డబ్బులు చెల్లించాలంటూ ఖాతాదారులను నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం లేదా డబ్బు డిపాజిట్ చేయించుకుంటూ దోచుకునేవారు. బ్యాంకులు, సైబర్ క్రైమ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మరోవైపు ఇటువంటి మోసాలపై ప్రజలకు కూడా అవగాహన కలగడంతో సైబర్ క్రైమ్ నిందితులు రూటు మార్చారు. మొబైల్ బ్యాంకింగ్దారులే లక్ష్యం తాజాగా సైబర్ వంచకులు మొబైల్‌సిమ్ స్వైపింగ్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్‌బ్యాంకింగ్ వ్యవహారాలను నిర్వహించేవారి మొబైల్ సిమ్ కార్డులను బ్లాక్ చేసి అవే నంబర్లతో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసి అకౌంట్లకు కన్నం వేస్తున్న నేరాలు వెలుగుచూస్తున్నాయి. సిమ్ స్వైపింగ్ లేదా సిమ్ క్లోనింగ్ పేరుతో కొత్తమార్గాలను సైబర్ నేరగాళ్లు అన్వేషిస్తుండటంతో పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఇప్పటికి 12 కేసులు వెలుగులోకి నగరంలో దీనిపై ఇప్పటివరకు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు హరీశ్ అనే వంచకుడిని అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు అందించి సిమ్, బ్యాంక్ అకౌంట్ తెరిచిన నేపథ్యంలో వంచకుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారుతోందని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యశవంతకుమార్ తెలిపారు. మోసం జరుగుతుంది ఇలా ఈ మోసాలకు ఎలా పాల్పడతారంటే... నెట్ బ్యాంకింగ్ ఉన్న బ్యాంకు కస్టమర్లు మొబైల్ నెంబర్ తీసుకున్న తరువాత గుర్తింపు కార్డు దొంగలించి నకిలీ ఐడీ కార్డు సృష్టిస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మూడు నాలుగు రోజుల వరుస సెలవుల సమయంలో సిమ్ పోయిందని తెలిపి నకిలీ ఐడీకార్డు అందించి కొత్త సిమ్ సంపాదిస్తారు. దీంతో కస్టమర్లు అసలు సిమ్‌కార్డు బ్లాక్ అవుతుంది. వరుస సెలవులు ఉన్నందున కస్టమర్లు విచారించడానికి వెళ్లినా సిమ్ దుకాణాలు తెరిచి ఉండవు. ఈ సమయంలో వంచకులు సిమ్ ఆక్టివ్ చేసుకుని నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ అవుతారు. ఓటీపీ కొత్త సిమ్ రావడం, మోసగాళ్లు జనం బ్యాంక్ అకౌంట్ల నుంచి నగదు దోచుకోవడం జరిగిపోతుంది. మోసపోతున్న బాధితులు కస్టమర్లు సిమ్‌కార్డు బ్లాక్ చేయడం పట్ల సిమ్‌కార్డు దుకాణం వద్ద కు వెళ్లి విచారించినప్పటికీ ఈ సమయంలో ఏమి జరిగింది అనేది తెలీదు. దీంతో ఎలాంటి అనుమానం లేకుండా మరో కొత్త సిమ్ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. కానీ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే వంచన వెలుగులోకి వస్తుంది. అంతలోగా సైబర్‌నేరగాళ్లు కస్టమర్లు అకౌంట్లులో ఉన్న నగదు నొక్కేస్తారు. సిమ్ బ్లాక్ అయితేజాగ్రత్త ♦ ఒక్కసారిగా సిమ్‌కార్డు బ్లాక్ అయితే ఏదో జరగరానిది జరిగిందని అనుమానించాలి. ♦ సిమ్ ఆపరేటర్ దుకాణానికి వెళ్లి ఫిర్యాదు చేయాలి. ♦ బ్యాంకుకు వెళ్లి ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయించండి. లావాదేవీల ఎస్ఎంఎస్లను మరో సిమ్ నంబరుకు మార్చుకోవడం చేయాలి. ♦ పాత సిమ్‌ను తొలగించి అదే నంబరుతో కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలి. -
పాక్ బ్యాంకులపై సైబర్ దాడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వేలాది మంది బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్ గురయ్యాయి. గత నెలలో జరిగిన ఈ సైబర్ చొరబాటు కారణంగా కోట్లాది రూపాయలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. పలువురి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై విచారణ ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28లలో జరిగిన ఈ సైబర్ దాడుల్లో సుమారు 12 బ్యాంకులకు చెందిన 8 వేల మంది ఖాతాదారులు నగదు కోల్పోయారు. అక్టోబర్ 27న అంతర్జాతీయ కార్డుల రూపంలో తమ బ్యాంకు రూ.26 లక్షలు కోల్పోయిందని, అప్పటి నుంచి అలాంటి చెల్లింపులను నిలిపివేసినట్లు బ్యాంక్ ఇస్లామి తెలిపింది. తన ఖాతా నుంచి హ్యాకర్లు రూ.30 లక్షలు దోచుకున్నారని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ఆధారంగా జరిపే అంతర్జాతీయ చెల్లింపులను తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ బాధిత బ్యాంకులను ఆదేశించింది. -
ఖాతా ప్రారంభానికి ఆధార్ తప్పనిసరి కాదు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకా రం బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఆధార్ తప్పనిసరి కాదని, అయితే.. ఖాతాదారులు స్వచ్ఛందంగా ఆధార్ సమర్పించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఆధార్ స్కీంను గొప్ప సౌలభ్యతగా అభివర్ణించిన ఆయన.. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ‘ఆన్లైన్ ద్వారా కేవలం 5 నిమి షాల్లోనే ఖాతా ప్రారంభమవడమే కాకుండా, తక్షణ నిర్వహణ సౌకర్యం అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం ఆధార్. 80–85 శాతం బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయి. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 27,000 డిజిటల్ అకౌంట్లు ప్రారంభమవుతున్నాయి.’ అని వివరించారు. ఐఎల్ఎఫ్ఎస్ నుంచి ‘నిధుల’ ప్రతిపాదన లేదు కాగా సంక్షోభంలో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు నుంచి అదనపు నిధులు కావాలంటూ ఎటువంటి నిర్మాణాత్మక ప్రతిపాదన తమకు రాలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో ఎస్బీఐకి 6.42 శాతం వాటా ఉంది. పలు డెట్ చెల్లింపుల్లో ఇటీవల ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూపునకు మొత్తం రూ.91,000 కోట్ల రుణ భారం ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నుంచి నిర్మాణాత్మక ప్రతిపాదన తమ ముందుకు వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. అపోలో హాస్పిటల్స్‌తో కలసి ఎస్బీఐ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించిన అనంతరం రజనీష్ ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందించారు. -
జన్‌ధన్ ఓవర్–డ్రాఫ్ట్ రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా మరింత మంది బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నందున.. పథకాన్ని కొనసాగించడంతోపాటు ప్రస్తుతమున్న రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్‌ను రూ.10వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ.2వేల వరకు ఓవర్–డ్రాఫ్ట్ ఎలాంటి షరతులు ఉండవని.. ఈ సదుపాయాన్ని పొందేందుకు గరిష్ట వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటుగా ఆగస్టు 28 నుంచి జన్‌ధన్ అకౌంట్లపై ఉన్న ఉచిత ప్రమాదబీమా మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 32.41కోట్ల జన్‌ధన్ అకౌంట్లు తెరవగా.. వీటిలో రూ.81,200కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల మంది ఓవర్–డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ఆగస్టు 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను మొదట నాలుగేళ్లు మాత్రమే అమలుచేయాలనుకున్నా.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కొనసాగించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. అటు, దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వ నిధులతో నడిచే ‘వన్యప్రాణి నివాస సమగ్రాభివృద్ధి’ పథకాన్ని 2019–20 వరకు కొనసాగించాలని కూడా కేబినెట్ నిర్ణయిచింది. -
‘సైబర్’ ఘంటికలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన శ్రీధర్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.2 లక్షల జీతం తీసుకుంటున్న శ్రీధర్‌కు వారం రోజుల క్రితం ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘సార్ మీ ఏటీఎం కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసి పంపుతున్నాం, పాత కార్డు డీటైల్స్ చెబుతాం చెక్ చేసుకోండి’అని అన్నారు. శ్రీధర్ వద్ద ఉన్న ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్‌ను కూడా చెప్పారు. దీంతో నిజంగానే బ్యాంక్ కాల్ అనుకున్న శ్రీధర్.. కార్డు సీవీవీ నంబర్ చెప్పమని అడగడంతోనే చెప్పేశాడు. అంతే కార్డు స్వైపింగ్ చేసినట్టు క్షణాల్లో మొబైల్ నంబర్‌కు సందేశాలు వచ్చాయి. కంగుతున్న శ్రీధర్ హైదరాబాద్ నగర కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా శ్రీధర్ మాత్రమే కాదు అనేక మంది ఉద్యోగులు, విద్యావంతులు సైతం విష్షింగ్ కాల్స్ గ్యాంగుల మోసానికి గురవుతున్నారు. ఏటా విషింగ్ కాల్స్ మోసాలపై నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సైబర్ నేరాల్లో ఇవే టాప్ పెద్ద నోట్ల రద్దు తర్వాత అన్ని చెల్లింపులను ఆన్లైన్ ద్వారా చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే దీని చాటున నేరగాళ్లు పన్నుతున్న వలలో చిక్కిపోతున్నారు. కొందరు విషింగ్ కాల్స్‌కు మోసపోతే, మరికొందరు ఈమెయిల్ సందేశాలకు, ఇంకొందరు స్కిమ్మింగ్, క్లోనింగ్‌కు, ఫోన్ హ్యాకింగ్, రాన్సమ్ వేర్ అటాక్‌కు గురై డబ్బుతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో ఫోన్లు, మెయిల్స్‌ను హ్యాక్‌చేసి సైబర్ గ్యాంగులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నాయి. ఇక లాటరీల పేరుతో బురిడీ కొట్టిస్తూ నైజీరియన్ గ్యాంగులు భారీగా దోచుకుంటున్నాయి. రాష్ట్రంలో విషింగ్ కాల్స్‌తో మోసపోయిన కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్మెయిల్ రాష్ట్రంలో ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో అధిక శాతం డబ్బుకు సంబంధించినవి కాగా, కొన్ని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలే. తెలియని వ్యక్తులతో పరిచయం అవడం, వారితో వ్యక్తిగత విషయాలను పంచుకునేలా చాటింగ్ చేయడం.. ఆపై ఎదుటి వ్యక్తి బ్లాక్‌మెయిలింగ్‌కు బయపడి లొంగిపోవడం జరుగుతున్న కేసులున్నాయి. అదేవిధంగా పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్ సైట్లలో తప్పుడు బయోడేటా పెట్టుకొని అమాయక యువతులను మోసం చేస్తున్న కేసులున్నాయి. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న కేసులు నమోదయ్యాయి. 1 శాతం కూడా శిక్ష పడట్లేదు.. సైబర్ నేరాలు వేలాదిగా నమోదవుతున్నా.. నిందితులను గుర్తించడం, వారిని అరెస్ట్ చేయడం కష్టసాధ్యమవుతోంది. సోషల్ మీడియాలో వేధింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు వారికి శిక్షపడేలా చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. వందలో 1 శాతం కేసుల్లో కూడా శిక్ష పడట్లేదు. 2016, 2017లో కేవలం 5 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షపడింది. సాధారణంగా సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలు ఎక్కువగా జరగడంవల్ల, బాధితుల డబ్బు కోల్పోకుండా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు బ్యాంకుల ద్వారా నేరస్తులకు డబ్బు చేరకుండా ఆపుతున్నారు. కానీ వేల కేసులు నమోదైతే.. నిందితులను అరెస్టు చేసింది కేవలం 29 శాతం కేసుల్లోనే. మిగిలిన కేసుల్లో నిందితులను గుర్తించడం కష్టంకాగా, గుర్తించిన వారిని విదేశాల నుంచి తెచ్చే అవకాశం లేకపోవడంతో కేసుల పెండింగ్ పెరిగిపోతోంది. ఈ మూడేళ్లలో సైబర్ నేరాల ద్వారా రూ. 32 కోట్ల మేర బాధితులు నష్టపోయినట్టు సీఐడీ సైబర్ క్రైమ్ అధికారులు స్పష్టంచేశారు. -
‘ఆర్థిక లావాదేవీలు’ అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఓ నేరం చేసిన తర్వాత తాము చిక్కినా పర్వాలేదు కానీ డబ్బు మాత్రం చేతులు దాటకూడదనే లా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్థిక లావాదేవీల కోసం వెబ్సైట్లకు చెందిన గేట్వేలు వాడుతున్నారు. దీంతో బాధితులు పంపిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేలోపు ఆ మొత్తాన్ని మళ్లించేస్తున్నారు. ఈ సరికొత్త పంథా అనుసరించిన ఢిల్లీ క్రిమినల్స్.. నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.4.5 లక్షలు కాజేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే... గౌలిపురకు చెందిన వ్యాపారి వికాస్ అగర్వాల్‌కు ఢిల్లీకి చెందిన ‘ఎక్స్‌ప్రెస్ టు కాట్’ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఇటీవల ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తమ కంపెనీ నిర్వహించిన డ్రాలో వికాస్ ఫోన్‌కు బహుమతి వచ్చిందని, రూ.25 వేలు విలువ చేసే ఎల్ఈడీ టీవీని కేవలం రూ.7,200కు అందిస్తున్నామని చెప్పి, తమ కంపెనీ వెబ్‌సైట్‌కు చెందిన ఓ లింకును పంపారు. అందులోకి ప్రవేశించిన వికాస్ డెబిట్‌కార్డు వివరాలతో పాటు ఓటీపీ సైతం ఎంటర్ చేయడంతో నగదు కట్ అయింది. కొన్ని రోజులు వేచి చూసినా తనకు టీవీ రాకపోవడంతో వికాస్ మళ్లీ వారిని సంప్రదించారు. దీంతో మీకు వచ్చిన బహుమతి నగదుగా మారిందని, రూ.లక్ష అందుకోవడానికి మరికొంత చెల్లించాలని చెప్పారు. ఇలా బహుమతి మొత్తంతో పాటు దాని కోసం చెల్లించాల్సిన డిపాజిట్‌ను పెంచుకుంటూ వెళ్లారు. మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాక మోసపోయిన విషయం తెలుసుకున్న వికాస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ నగదు ఏ ఖాతాలోకి వెళ్లిందో తెలియలేదు. గేట్ వేలను ఆశ్రయిస్తున్న నేరగాళ్లు... సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేయడానికి తొలినాళ్లలో తమ బ్యాంకు ఖాతాల వివరాలే ఇచ్చేవారు. మూడునాలుగేళ్లుగా పేటీఎం సహా ఇతర యాప్స్ మార్గాలు ఎంచుకునేవారు. వాటిలోకే బాధితుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకునేవారు. వీటిలో ఏ పంథా అనుసరించినా బాధితులు తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఫలితంగా డబ్బు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంలేదు. దీంతో తాజాగా సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు. పేమెంట్ గేట్వేలను ఆశ్రయిస్తున్నారని వికాస్ అగర్వాల్ కేసు స్పష్టం చేస్తోంది. సమాచార సేకరణ ఆలస్యం వికాస్ అగర్వాల్ నుంచి డబ్బు వసూలు చేసిన ‘ఎక్స్‌ప్రెస్ టు కాట్’వెబ్సైట్ ‘పేయూ’గేట్ వేతో అనుసంధానించి ఉంది. సైబర్ నేరగాళ్లు పంపిన లింకు ద్వారా వికాస్ పే చేసిన మొత్తం ఈ గేట్ వే ద్వారా దానికి అనుసంధానించి ఉన్న బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వికాస్ ఫిర్యాదు చేసిన వెంటనే డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది తెలుసుకోవడం సైబర్ క్రైమ్ పోలీసులకు సాధ్యం కాలేదు. దీనికోసం వారు తొలుత వికాస్ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అందులో ఉన్న వివరాలను బట్టి పేయూ ఖాతాను గుర్తించి, దాని సమాచారం కోరుతూ నిర్వాహకులకు లేఖ రాయాలి. వారి నుంచి సమాధానం వచ్చే వరకు ఏ బ్యాంకు ఖాతాలోకి నగదు వెళ్లిందో గుర్తించడం సాధ్యం కాదు. ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి ఆధారాలతో సదరు బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయించాలి. దీనికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లోపు సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లో ఉన్న డబ్బు మరోచోటుకు మళ్లించడమో, ఖర్చు చేసేయడమో జరిగిపోతుంది. ఫలితంగా నేరగాళ్ళు చిక్కినప్పుటికీ డబ్బు రికవరీ మాత్రం అసాధ్యంగా మారుతుంది. ఈ తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వీటి నిరోధానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. -
మోదీ వచ్చాకే పేదలకు బ్యాంకు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను జాతీయం చేసినా మోదీ ప్రభు త్వం వచ్చిన తర్వాతనే కోట్లాది మంది పేదలకు బ్యాంకు ఖాతాలు సమకూరాయని బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్చార్జి పురందేశ్వరి అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 32 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతా లు వచ్చాయని, ఇది మోదీ సాధించిన పెద్ద విజయమని అభివర్ణించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జన్‌ధన్ పథకంతో అనేక మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వం: కె.లక్ష్మణ్ కేంద్రంలో మోదీ పాలనకు, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఎక్కడా పోలికే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో నియంతృత్వపాలన సాగుతోందన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదన్నారు. ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో అంటకాగు తున్నారని విమర్శించారు. ఈ నెలలో నిర్వ హించే జనచైతన్య యాత్రలో టీఆర్ఎస్ విధానాలను ఎండగడతామన్నారు. అనంతరం తెలుగు యువత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాజె రమేశ్, బీసీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్ బీజేపీలో చేరారు. వీరికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ, పార్టీ కార్యదర్శి గౌరి, మహిళామోర్చా నేతలు సరళ, నాగపరిమళ, ఎస్సీమోర్చా నేత శ్రుతి పాల్గొన్నారు. -
కార్మికులకు పదో వేజ్‌బోర్డ్ ఏరియర్స్
సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది. అయితే కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది. -
ఆసరా..బ్యాంకుల్లోనే !
ఇన్నాళ్లు ఆసరా పింఛన్లు పోస్టాఫీసు ద్వారా ఇచ్చేవారు. ఈ పద్ధతికి పులిస్టాప్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇకనుంచి వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు త్వరగా ఇవ్వాలని ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉమ్మడి జిల్లాలో 4,21,008 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. నల్లగొండ : ఆసరా పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి..! పింఛన్ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సమస్యల వల్ల పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల మార్గాన్ని ఎంచుకుంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం రెండు నెలలకోసారి పింఛన్లు పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులు ఒక నెల పింఛన్, మరొక నెలలో తీసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నెల పింఛన్ ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది. ప్రతి నెల మొదటివారంలో చేతికందాల్సిన పింఛన్ ఆలస్యం కావడంతో నెలాఖరు వరకు ఎదరుచూడాల్సి వస్తోంది. అదీగాక పింఛన్ల కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి కష్టాల నుంచి గట్టేక్కేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు మండలాల్లో అయితే ఎంపీడీఓలకు, పట్టణాల్లో మున్సిపల్ క మిషనర్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నీ ఆధారాలు తప్పనిసరి... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,21,008 మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెల నల్లగొండ జిల్లాలో రూ.23.33 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.17.19 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.9.90 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయడం ఉండదు కాబట్టి బ్యాంకుల్లో ఆర్థికలా వాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు మాత్రమే అధికారులకు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలి. ప్రధానంగా లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమకాగానే ఆ సమాచారం లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటిదాకా ఈ సెల్‌నెంబరు అనేది లేకపోవడంతో వికలాంగులు, మరికొంత మంది లబ్ధిదారులు నష్టపోవడం జరిగింది. వికలాంగుల సదరమ్ సర్టిఫికెట్ గడువు ముగిశాక, మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందే వరకు (రీ అసెస్మెంట్) పింఛన్లు పంపిణీ చేయరు. తిరిగి సర్టిఫికెట్ పొందాక ఆగిపోయిన పింఛన్లు (ఎరియర్స్) పంపిణీ చేస్తారు. అయితే చాలా మంది వికలాంగులు ఈ విషయం తెలియక నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయాలనుకోవడం, ఆ సమాచారాన్ని లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరవేయడంతో మేలు జరుగుతుంది. ఈ సారైనా అమలయ్యేనా..! పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారా చేయాలన్న ఆలోచన పాతదే. 2008–09లో మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే చెల్లించారు. వివిధ కారణాల దృష్ట్యా మళ్లీ పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పింఛన్‌దారులను బ్యాంకుల వైపునకు మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ ఆచరణలో సాధ్యం కాకపోవడంతో పోస్టాఫీసులనే కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండటం, పలు చోట్ల పింఛన్ నిధులు దుర్వినియోగం అవుతుండటంతో బ్యాంకులైతేనే శ్రేయస్కరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మేనెల నుంచే బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం ఆసరా చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం. మే నెల నుంచి పింఛన్ చెల్లింపులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. సెల్‌నంబరు, ఆధార్‌కార్డు తప్ప నిసరి. – రింగు అంజయ్య, డీఆర్డీఓ -
కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభం సగం భారత్‌లోనే
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా 2014–17 మధ్య కాలంలో కొత్తగా ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఫిండెక్స్ నివేదిక భారత ప్రయత్నాలను గుర్తించిందన్నారు. సామాన్యులను కూడా బ్యాంకు సేవలకు చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన జన్‌ధన్ యోజన కార్యక్రమం విజయాన్ని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు ఫిండెక్స్ నివేదిక ప్రకారం 2014లో వయోజనుల బ్యాంకు ఖాతాలు 53 శాతంగా ఉండగా, అవి 2017 నాటికి 80 శాతానికి పెరిగాయని రాజీవ్ కుమార్ తెలిపారు. 2014లో బ్యాంకు ఖాతాల పరంగా స్త్రీ, పురుషుల మధ్య 20 శాతం అంతరం ఉంటే, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అది 6 శాతానికి తగ్గిందని చెప్పారు. -
ఆధార్ : కేంద్రంపై మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆధార్ నెంబర్ లింక్ చేయలేదని బ్యాంకు అకౌంట్లు మూసివేయడం, ఫ్రీజ్ చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఐదుగురు జడ్జీలు గల రాజ్యాంగ బెంచ్ ఆధార్‌పై నమోదైన పిటిషన్లను గురువారం విచారించింది. ఈ విచారణలో కేంద్రంపై సుప్రీం సీరియస్ అయింది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌లో ఉన్న పలు ప్రొవిజిన్లను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమెరికా కాంగ్రెస్ ముందు విచారణకు హాజరైన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను కోట్ చేస్తూ.. సాంకేతిక పరిజ్ఞానమనేది సామూహిక పర్యవేక్షణకు అత్యంత శక్తివంతమైనదని తెలిపింది. ఇది అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలిగిందని పేర్కొంది. ఆధార్ లింక్ చేయలేదన్న కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారు? ఎలా ఫ్రీజ్ చేస్తారు? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, తన సొంత నగదునే ప్రజలు విత్‌డ్రా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర అధికారిక వాలిడ్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ, ఆధార్ తప్పనిసరి చేయాల్సినవసరం ఏమిటి? అని కూడా టాప్ కోర్టు ప్రశ్నించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ ఏకే సిక్రి, ఏఎం ఖాన్విల్కర్, డి వై చంద్రకుడ్, అశోక్ భూషణ్‌లు ఉన్నారు. కాగ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, క్రెడిట్ కార్డులు ఆధార్ నెంబర్‌ను షేర్ చేయాలని కస్టమర్లను కోరుతున్నాయి. కేవలం ఫైనాన్సియల్ సర్వీసు కంపెనీలు మాత్రమే కాక, టెలికాం కంపెనీలు సైతం మొబైల్ నెంబర్లను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నాయి. వీటికి తొలుత 2017 డిసెంబర్ 31 తుది గడువుగా పేర్కొనగా.. అనంతరం ఆ తేదీని 2018 మార్చి 31 వరకు పొడిగించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన జడ్జిమెంట్‌లో తాము ఆధార్‌పై విచారణ జరిపేంత వరకు ఆధార్ లింక్ చేపట్టాలని రాజ్యాంగ బెంచ్ చెప్పింది. కానీ ఆధార్ లింక్ చేయలేదని బ్యాంకు అకౌంట్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. -
టెక్ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు
-
టెక్ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు
చెన్నై : టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్, ఐటీ డిపార్ట్మెంట్కు రూ.420 కోట్ల పన్నును వెంటనే కట్టాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో వీటిని చెల్లించాలని పేర్కొంది. రూ.2800 కోట్ల పన్ను ఐటీ డిపార్ట్మెంట్కు కాగ్నిజెంట్ బాకీ పడిందనే ఆరోపణల నేపథ్యంలో, దానిలో 15 శాతం అంటే రూ.420 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఈ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం కంపెనీకి చెందిన ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాను తిరిగి నడిచేలా చేయాలని కోర్టు పేర్కొంది. కాగ్నిజెంట్ సుమారు రూ.2800 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై, ముంబైలలో సంస్థకు చెందిన 64 బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేశారు. అయితే తాము అన్ని పన్నులను చెల్లించినట్టు కాగ్నిజెంట్ చెబుతోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల ప్రొసీడింగ్స్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ... పన్నులోని 15శాతం అంటే దాదాపు రూ.420కోట్లను రెండు రోజుల్లోగా కాగ్నిజెంట్ చెల్లించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాకు సడలింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్బీఐ, డ్యుయిస్, కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ వంటి ఇతర బ్యాంకుల్లోని ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ 2013-16 మధ్యకాలంలో తన మాతృసంస్థకు డివిడెంట్లను పంపిణీ చేసింది. ఈ డివిడెంట్ల పంపిణీ విషయంలో, ఐటీ శాఖకు రూ.2800 కోట్ల మేర డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఐటీ డిపార్ట్మెంట్కు కట్టాల్సి ఉంది. కానీ ఆ పన్ను కాగ్నిజెంట్ కట్టలేదు. దీంతో ఈ కంపెనీకి ఐటీ డిపార్ట్మెంట్ పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కాగ్నిజెంట్ స్పందించలేదు. దీంతో ముంబై, చెన్నైలలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. తమ కంపెనీ బ్యాంకు ఖాతాల నిలుపుదలను ఎత్తేయాలని కోరుతూ కాగ్నిజెంట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. పన్నులో 15 శాతం ఐటీ డిపార్ట్మెంట్కు కట్టాలని ఆదేశించింది. -
వెలుగులోకి వారిద్దరి సీక్రెట్ అకౌంట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు చెందిన సీక్రెట్ బ్యాంకు అకౌంట్లను ఆదాయపు పన్ను శాఖ పట్టేసింది. భారత్‌కు వెలుపల వీరిద్దరికీ సుమారు 50 సీక్రెట్ బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు గుర్తించింది. ఈ బ్యాంకు అకౌంట్లు లండన్, హాంకాంగ్, యూఏఈ, మోరోక్కోతో పాటు పలు పన్ను ఎగవేత దేశాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఐటీ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి ఇండియాటుడే.ఇన్‌కి ధృవీకరించారు. ప్రస్తుతం ఈ బ్యాంకు అకౌంట్లు విచారణలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం 50 సీక్రెట్ బ్యాంకు అకౌంట్లలో 40 బ్యాంకు అకౌంట్లు నీరవ్ మోదీకి చెందినవి కాగ, 8 నుంచి 10 బ్యాంకు అకౌంట్లు మెహుల్ చౌక్సి పేరుతో తెరిచి ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ బ్యాంకు అకౌంట్ల వివరాలను నీరవ్ కానీ, చౌక్సి కానీ ఇద్దరూ ఏజెన్సీకి వెల్లడించలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో కూడా వీటిని ఫైల్ చేయలేదు. ప్రస్తుతం లెక్కల్లో చూపని వీరి బ్యాంకు అకౌంట్లను, కంపెనీల్లో పెట్టుబడులను, ఇతర షేర్ హోల్డింగ్స్‌ను, విదేశీ ఆస్తులను విచారిస్తున్నారు. ఈ 50 సీక్రెట్ బ్యాంకు అకౌంట్లలో ఎంత మొత్తంలో దాచి ఉంచారన్నది కూడా తెలియరాలేదు. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాల కోరుతూ ఆయా దేశాలకు ఐటీ డిపార్ట్మెంట్ లెటర్ రోగటరీ కూడా జారీచేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించడం కోసం వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లను మోదీ, చౌక్సిలు క్రియేట్ చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ అకౌంట్లను షెల్ కంపెనీల పేరుతో తెరిచినట్టు తెలిపాయి. -
కాగ్నిజెంట్‌కు ఐటీ షాక్
సాక్షి, చెన్నై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. పన్నుఎగవేత ఆరోపణలతో వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. 2016-17 సంవత్సరానికి సంబంధించిన రూ.2500కోట్లకు పైగా పన్నులు చెల్లించలేదంటూ ఆదాయ పన్ను శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి) 2,500 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించలేదని సీనియర్ టాక్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ గతవారం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కాగ్నిజెంట్ అధికారి ప్రతినిధి అన్నిబకాయిలను చెల్లించామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని ప్రకటించారు. అయితే మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు. -
మార్చి 31 తరువాత కూడా!
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానం తలనొప్పి ప్రస్తుతానికి తొలగింది. వివిధ సేవలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధాన గడువైన మార్చి 31వ తేదీ దగ్గరికొస్తుండటంపై ఆందోళన చెందుతున్నవారు ఊపిరి పీల్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించుకునే గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే, మార్చి 31 తరువాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు, ఆధార్ అనుసంధాన ప్రక్రియను పౌరులు, వినియోగదారులు కొనసాగించుకోవచ్చు. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను మార్చి 31 తరువాత కూడా యథావిధిగా కోరవచ్చని స్పష్టతనిచ్చింది. తత్కాల్ పాస్‌పోర్ట్‌కూ అవసరం లేదు వివిధ సేవలు, సంక్షేమ పథకాలతో ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన మార్చి 31 గడువుని పొడిగించేందుకు సిద్ధమని కేంద్రం ఇదివరకే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ‘ ఆధార్ చట్టబద్ధతపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసి, తుది తీర్పు వెలువరించే వరకు.. ఆధార్ అనుసంధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన మార్చి 31 గడువును నిరవధికంగా పొడిగించాలని ఆదేశిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. అలాగే, తత్కాల్ పాస్‌పోర్ట్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది. మంగళవారం జరిగిన విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు పి.చిదంబరం, కేవీ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఆధార్ చట్టబద్ధత, దానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన సంగతి తెలిసిందే. సబ్సిడీల పంపిణీలో అవాంతరాలు వద్దు ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించడం వల్ల ఆ చట్టంలోని సెక్షన్ 7 పరిధిలోకి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధార్ చట్టంలోని నిబంధన 7 ప్రకారం.. లబ్ధిదారుడి గుర్తింపును ధ్రువీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ వివరాలు కోరొచ్చు. ఆధార్ పొందని వారు కూడా ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని నిరూపించగలిగితే ప్రభుత్వ ప్రయోజనాలు పొందొచ్చు. అలాంటి వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తారు. ఆధార్ చట్టబద్ధతను సవాల్ చేసిన పిటిషనర్లలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తరఫున హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం వాదిస్తూ.. ఆధార్ బిల్లును లోక్‌సభ స్పీకర్ తప్పుగా మనీ బిల్లుగా పేర్కొని, అది రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆధార్ తప్పనిసరే: యూఐడీఏఐ బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్‌పోర్టులకు ఆధార్ తప్పనిసరియేనని ఆధార్ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. అయితే ఆధార్ ఇంకా పొందని వారు, దానికి దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ సంఖ్యతో ఆ సేవలు పొందొచ్చని పేర్కొంది. ‘సంబంధిత చట్టాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్‌పోర్టులకు ఆధార్ తప్పనిసరి అని చెబుతున్న నిబంధన కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ తెలిపింది. -
ఆధార్ లింక్ గడువు పెంపు?
న్యూఢిల్లీ: ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానికి ఇచ్చిన గడువును పొడిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇది అవసరమని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. పీఎన్బీ స్కామ్ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) సిబ్బంది తమ ప్రధాన వ్యాపారాన్ని కాపాడుకునే క్రమంలో ఉన్నారని, ఆధార్ అనుసంధానం కోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బయటకు రాలేదని, మార్చి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు నిర్వహణ రహితంగా మారిపోయే రూపంలో ఎదురయ్యే మరో సవాలుకు సిద్ధంగా లేదని పేర్కొంది. ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే, కస్టమర్ల ఖాతాలన్నింటినీ మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానించడం సవాలుతో కూడుకున్నదని, కనుక గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆధార్‌తో అనుసంధాన లక్ష్యాన్ని చేరేకంటే ముందుగానే బ్యాంకులు ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. -
80 శాతం ఖాతాలకు ఆధార్ లింకు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌తో అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే 80 శాతం బ్యాంకు ఖాతాలు, 60 శాతం ఫోన్ నంబర్లతో ప్రజలు ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఏడీఏఐ) వెల్లడించింది. లెక్కలోకి రాని డబ్బును ఏరివేసేందుకు ప్రతి బ్యాంకు ఖాతాను 12 అంకెల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం 2018 మార్చి 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అలాగే పాన్ నంబర్‌ను కూడా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. మొత్తం 109.9 కోట్ల బ్యాంకు ఖాతాలకు గాను 87 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు. -
అమ్మాయిలదే అగ్రస్థానం!
గడచిన దశాబ్దకాలం మహిళకు ఒక టర్నింగ్ ఎరాగా నిలిచింది. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే అమెరికా యూనివర్సిటీల్లో కూడా అమ్మాయిలు తక్కువగా ఉండేవారు. గత పదేళ్లుగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2009 నుంచి మొదలైన పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. రాజ్యాంగ ప్రవేశికలో.. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగా అవకాశాలు, గౌరవమర్యాదలు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటాయి అని రాజ్యాంగ ప్రవేశిక చెప్తోంది. అంటే మహిళలు, మగవాళ్లు అనే తేడా రాజ్యాంగంలో చెప్పడం లేదు. మరి సమాజంలో ఈ అంతరం ఎందుకు ? అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే, పెద్దయ్యాక ఎమోషనల్‌గా ఖర్చు చేయరు. ‘ఆడవాళ్లకు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చేతకాదు’ అనే అపోహను తుడిచివేయవచ్చు. ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకోబోయే వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కౌన్సెలింగ్ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణ తలెత్తకుండా ఎవరి స్వాతంత్య్రాన్ని వాళ్లు కాపాడుకుంటూ సాధికారతను నిలబెట్టుకోవడం నేర్పిస్తారు. మహిళల బ్యాంకు అకౌంట్లు గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నాయి. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ముద్రా రుణాలను నేరుగా బ్యాంకు అకౌంట్లోనే జమ చేయడం, ఉపాధి హామీ పథకాల డబ్బును కూడా అకౌంట్లోనే జమ చేయడం వంటి నిర్ణయాలతో అకౌంట్లు యాక్టివ్‌గా ఉంటున్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే? - మహిళలకు తమ శక్తిసామర్థ్యాల మీద అవగాహన కల్పించడం - తమకు ఇష్టమైన రంగాలను గుర్తించగలగడం, వాటిని కెరీర్‌గా ఎంచుకునే హక్కు కలిగి ఉండడం - సమాన అవకాశాలు పొందడానికి ఉన్న దారులను తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం - తమ మీద, తమ జీవితం మీద సంపూర్ణ అధికారం తమదే అనే స్పృహ మహిళలో కలిగించడం, దానిని నియంత్రించుకోగలిగిన శక్తిని, సంపాదించుకునే హక్కు కలిగి ఉండడం - ఆర్థిక అంశాలతోపాటు సమాజానికి మరింత ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చేటట్లు శక్తి పెంపొందించడం(ఇవి... మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి సూచించిన సూత్రాలు) 358 మిలియన్ల భారతీయ మహిళలకు బ్యాంకు అకౌంట్లున్నాయి.గతంలో అకౌంట్ ఉన్నప్పటికీ చాలా వరకు లావాదేవీలు జరిగేవి కాదు. ఇప్పుడు యాక్టివ్ అకౌంట్లు 29 నుంచి 42 శాతానికి పెరిగాయి. కెన్యా, టాంజానియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియాలతో పోలిస్తే భారతీయ మహిళలు చాలా ముందున్నారు. మహిళా బ్యాంకుల ఏర్పాటు ఒక విప్లవం. జార్ఖండ్‌లో 10 మహిళా బ్యాంకుల స్థాపన వల్ల 32,000 మంది మహిళలు బ్యాంకు లావాదేవీలతో అనుసంధానమయ్యారు. వారిలో 17,000మంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ లబ్ధిదారులు. పిఎమ్‌జెడివై (ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన) పథకంలో ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్లలో ఎక్కువ భాగం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలకు బ్యాంకు ఖాతాలు పెరగడానికి అది కూడా ఓ కారణం. ఓపెన్ అయిన అకౌంట్లను నిరర్థకంగా వదిలేయకుండా లావాదేవీలు నిర్వహించడం మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక చైతన్యానికి సూచిక. -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్
బెంగళూరు : పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆ కంపెనీ. నో యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలు సమర్పించనప్పటికీ, పేటీఎం వాలెట్‌లోకి నగదును లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డిజిటల్ వాలెట్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ వివరాలు సమర్పించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. లేదంటే వాలెట్లు పనిచేయవని, వాలెట్స్‌లోకి కొత్తగా నగదును పంపించుకోవడం జరుగదని పేర్కొంది. అయితే ప్రస్తుతం పేటీఎం యూజర్లు కేవైసీ వివరాలు సమర్పించనప్పటికీ, గిఫ్ట్ ఓచర్ల ద్వారా వాలెట్‌లోకి నగదును లోడ్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఈ గిఫ్ట్ ఓచర్లను ఇతరులకు పంపించుకోవడం కానీ, బ్యాంకు అకౌంట్లలోకి ట్రాన్సఫర్ చేసుకోవడం కానీ జరుగదు. ఆర్బీఐ యూజర్లు తీసుకొచ్చిన ఈ నిబంధనలతో డిజిటల్ వాలెట్లు భారీ ఎత్తున్న తమ కస్టమర్లను కోల్పోతున్నారు. అమెజాన్ ఇండియా తన ఈ-వాలెట్ యూజర్ బేస్‌లో 30 శాతం క్షీణతను నమోదుచేసింది. పేటీఎం కూడా తన కోర్ ఈ-వాలెట్ బిజినెస్‌లను ఇతర వ్యాపారాలకు విస్తరిస్తోంది. మరోవైపు తగ్గిపోతున్న యూజర్ బేస్‌ను కాపాడుకోవడానికి ఈ గిఫ్ట్ ఓచర్లను కూడా పేటీఎం జారీచేస్తోంది. ఈ గిఫ్ట్ ఓచర్లను గ్రే ఏరియాలో ఆపరేటింగ్ చేస్తున్నట్టు కూడా ఓ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. -
కార్తీకి ఐదు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరంను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. కార్తీకి సంబంధించి ఈ కేసుల్లో ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయని వీటిని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు మార్చి 6 వరకు కార్తీ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి సునీల్ స్పష్టం చేశారు. కార్తీ విదేశాలకు వెళ్లి అక్రమ నిధులు దాచుకున్న వివాదాస్పద బ్యాంకు అకౌంట్లను క్లోజ్ చేశారని, దీనికి సంబంధించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆధారాలున్నాయని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఒకరోజు కస్టడీ ముగియటంతో సీబీఐ గురువారం ప్రత్యేక కోర్టుముందు కార్తీని ప్రవేశపెట్టింది. ఈ సమయంలో చిదంబరం, ఆయన భార్య నళిని (ఇద్దరూ సీనియర్ లాయర్లే) కోర్టు హాల్లో ఉన్నారు. వీరిద్దరూ కార్తీతో కాసేపు మాట్లాడారు. కుట్రను బయటపెట్టండి: జడ్జి కార్తీ కస్టోడియల్ విచారణ ద్వారా ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన భారీ కుట్ర బయటపెట్టాలని జడ్జి సీబీఐకి సూచించారు. సీబీఐ చూపించే దస్తావేజులు, సహ నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలతో కార్తీ అసలు విషయాన్ని అంగీకరించేందుకు ఈ కస్టడీ అవసరమన్నారు. కేసు డైరీ, రోజువారీ నివేదికల ఆధారంగా ఈ కేసు ఇప్పుడు కీలకదశలో ఉందని.. విచారణ ద్వారా మరిన్ని విషయాలు బయటపడే∙అవకాశం ఉన్నందునే కస్టడీ పొడిగించినట్లు జడ్జి తెలిపారు. సీబీఐ కస్టడీ సందర్భంగా న్యాయవాది సహకారం (రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున) తీసుకునేందుకు కార్తీకి స్వేచ్ఛ కల్పించాలని ఆదేశించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుపై ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులను విచారించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు కమిటీ ముందు కార్తీ పలువురు సహనిందితులు పేర్కొన్న విషయాలను అంగీకరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. రాజకీయ దురుద్దేశం లేదు సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ వాదిస్తూ.. ‘ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్టు కాదు. ఆర్టికల్ 21 ప్రకారమే విచారణ జరుగుతోంది. విదేశాలకు వెళ్లి కార్తీ చిదంబరం ఏం చేశాడో తెలిపే ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయి’ అని జడ్జికి తెలిపారు. కార్తీ సాధారణ మెడికల్ చెకప్ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ బుధవారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కార్డియాక్ కేర్ యూనిట్లో చికిత్స చేశారు. తర్వాతే గురువారం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చినందున కార్తీ ఒకరోజు కస్టడీ వృధా అయ్యిందికనుకే కస్టడీని పొడిగించాలని జడ్జిని కోరారు. కార్తీ తరపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ.. ‘గతేడాది మేలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయన్ను 22 గంటలపాటు విచారించిన సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. సహకరించటం లేదనే కారణంతోనే అరెస్టు చేస్తారా? ఇది దారుణం’ అని అన్నారు. మెహుల్ చోక్సీకి మేలుచేసేలా.. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం ద్వారా చాలా మంది బంగారు, వజ్రాభరణాల వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలోని బీజేపీ సభ్యులు ఆరోపించారు. పీఎన్బీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ మనీలాండరింగ్ కేసూ ఇందులో భాగమేనన్నారు. గురువారం రెవెన్యూ కార్యదర్శి, ఈడీ ఉన్నతాధికారులు, ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర మండలి (సీబీఈసీ)ల అధికారులు పీఏసీ సబ్ కమిటీ ముందు హాజరయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా దేశ ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందంటూ.. 2016లో కాగ్ ఇచ్చిన నివేదికపై వీరు చర్చించారు. ఈ పథకంలో భాగంగా వజ్రాల వ్యాపారులు ఒక డాలర్ సంపాదించేందుకు ప్రభుత్వం సుంకం రూపంలో రూ.221.75 చెల్లించింది. దీని ద్వారా దేశం నుంచి నల్లధనం బయటకెళ్లి వైట్ మనీగా తిరిగొచ్చిందని వారన్నారు. కోర్టు బయట కార్తీ. కోర్టుకు వస్తున్న కార్తీ తల్లిదండ్రులు నళిని, చిదంబరం విచారణ లిస్టులో చిదంబరం కార్తీతోపాటు చిదంబరం సీబీఐ, ఈడీ విచారణ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల ఒప్పందానికి అనుమతివ్వటంలో చిదంబరం పాత్ర ఉందని సీబీఐ వాదిస్తోంది. కాగా, ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి మే 2007లో ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతులు తర్వాతి పరిణామాలపై కార్తీ ఏవిధంగా ఒత్తిడితెచ్చారనే అంశాన్ని విచారిస్తున్నామని సీబీఐ తెలిపింది. ‘మా దగ్గర కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కి నిధులు బదిలీ అయినట్లు పేర్కొనే ఈ–మెయిల్స్, బిల్లులు ఉన్నాయి. కార్తీని దోషిగా నిలబెట్టేందుకు అవసరమైన సాక్ష్యాలున్నాయి. ఈయన నుంచి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నాం. వీటన్నింటికోసం కనీసం 14రోజుల కస్టడీ అవసరం’ అని మెహతా కోర్టును కోరారు. -
నీరవ్ మోదీపై భారీ ఎత్తున కొరడా
న్యూఢిల్లీ : పీఎన్బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా కొరడా ఝుళిపిస్తున్నారు. నిన్న కాక మొన్ననే రూ.5100 కోట్ల వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీబీఐ అధికారులు సీజ్ చేయగా.. నేడు ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసింది. పన్ను ఎగవేత విచారణ కింద నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాక విదేశాల్లో ఆయన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపిస్తూ... ఆయనపై యాంటీ-బ్లాక్ మనీ యాక్ట్‌ను ప్రయోగించారు. ఈ ఆస్తులు సింగపూర్‌లో ఉన్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త చట్టం కింద లెక్కలో చూపించని విదేశీ ఆస్తులు, ఆదాయంపై 120 శాతం పన్ను వేస్తారు. అంతేకాక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్స్ 276 సీ(1), 277 ఏ, 278 బీ, 278 ఈ కింద మోదీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27 ఈ కేసును కోర్టు విచారించనుంది. సూరత్, ముంబై, జైపూర్, ఢిల్లీలో ఉన్న నీరవ్ మోదీ, ఆయన భార్య ఆమీ, సంస్థలకు చెందిన స్థిరాస్తులకు పన్ను అధికారులు ఈ అటాచ్మెంట్ నోటీసు పంపారు. మోదీ, ఆయన కుటుంబం, కంపెనీలకు చెందిన మొత్తం 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీకి మొత్తం 150 షెల్ కంపెనీలతో లింక్‌లున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి నీరవ్‌మోదీ పాల్పడ్డ సంగతి తెలిసిందే. పీఎన్బీ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడి, ప్రస్తుతం విదేశాలకు పారిపోయారు. ఈయనను పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. -
రెండేళ్లలో బ్యాంకు ఖాతాలకు నేరుగా సొమ్ము
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు నెలానెలా కొంత మొత్తం ప్రభుత్వం సమకూర్చే విధానం కార్యాచరణకు నోచుకోనుంది. రానున్న రెండేళ్లలో సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకాన్ని ఒకటి రెండు రాష్ట్రాలైనా అమలు చేస్తాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నా పెద్దా, ధనిక..పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనీస మొత్తం చెల్లించాలని 2016-17 ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. కాగా,వచ్చే రెండేళ్లలో ఒకట్రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా యూబీఐని అమలుచేస్తాయని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతిలో కూరుకుపోవడంతో వాటితో పోలిస్తే సార్వత్రిక కనీస రాబడి కింద అందే మొత్తం పౌరుల కనీస అవసరాలను చాలావరకూ తీర్చవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఒకటి, రెండు రాష్ట్రాలు ఈ పథకాన్ని తలకెత్తుకున్నా వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా యూబీఐని దశలవారీగా విస్తరిస్తారు. -
ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ
భువనేశ్వర్: చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో ఆయన పేరు మీద రూ. 165 కోట్లు జమ అయి ఉన్నట్లు గుర్తించారు. రూ. 50 లక్షల నగదుకు సంబంధించిన వివరణ సంతృప్తికరంగా లేనందున ఇండస్ ఇండ్ బ్యాంకు ఖాతాని ఇటీవల స్తంభింపజేశారు. బాసుదేవ్‌పూర్‌లో ఎమ్మెల్యే ఇంటి నుంచి బ్యాంకు సిబ్బంది వ్యక్తిగతంగా తీసుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంపట్ల బ్యాంకు అధికార వర్గం, ఎమ్మెల్యే సంతృప్తికరమైన వివరణ దాఖలు చేయడంలో విఫలం అయ్యారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బ్యాంకు మేనేజరుగా పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా లావాదేవీల్ని స్తంభింపజేసి వివరణ కోరుతు పోలీసులు ఎమ్మెల్యేకి తాఖీదు జారీ చేశారు. వివరణ దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే 20 రోజుల గడువు కోరినట్లు తెలిపారు. ఆరోగ్య కారణాలతో గడువు అభ్యర్థించడంతో అనుమతించారు. గడువు ముగిసిన ఎమ్మెల్యే పోలీసుల ముందు హాజరు కానందున బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసినట్లు తెలిపారు. కొత్త పార్టీ సన్నాహాలు! స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్న కెంజొహర్ జిల్లా చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు సొంత పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక ప్రక్రియ ముగిసింది. జన సమృద్ధ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951 సెక్షన్ 29–ఎ కింద కొత్త పార్టీకి దరఖాస్తు దాఖలు చేశారు. భారత ఎన్నికల కమిషను ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు. కెంజొహర్‌గొడొ కాశీపూర్–బలరామ్‌పూర్ పార్టీ ప్రధాన కార్యాలయంగా నమోదు చేశారు. కొత్త పార్టీ అధ్యక్షుడు సనాతన్ మహాకుడు కాగా సరోజ్ సాహు కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రాథమిక దరఖాస్తులో వివరాల్ని దాఖలు చేశారు. వీరివురితో మరో 8 మందిని పార్టీ సభ్యులుగా పేర్కొన్నారు. అభ్యర్థన మేరకు అంతా సజావుగా ముగిస్తే జన సమృద్ధ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని సనాతన్ మహాకుడు ప్రకటించారు. శ్రీ జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ క్షేత్రం(పూరీ) నుంచి పార్టీ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూరీ నుంచి కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ మా తరిణి దేవస్థానం వరకు కొత్త పార్టీ కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ సన్నాహాల వెనక అదృశ్య హస్తం ఉన్నట్లు అధికార పక్షం బిజూ జనతా దళ్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ తీవ్ర ప్రకంపనలు ప్రేరేపిస్తుందని సనాతన్ అనుచరులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. కెంజొహర్ జిల్లా గనుల అక్రమ తవ్వకాల నిధులతో ఇదంతా సాగుతున్నట్లు రాజకీయ శిబిరాల్లో ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సనాతన్ లోగడ సనా సేన పేరుతో ఒక సంస్థ నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు సనాతన్ మహాకుడు అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరుతారని భావించారు. ఈ ఊహలు తలకిందులు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. కెంజొహర్ జిల్లా దళిత వర్గాలత్లో సనాతన్ మహాకుడుకు గట్టి పట్టు ఉంది. సనాతన్ మహాకుడు ఏర్పాటు చేసిన కొత్త పార్టీ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు కెంజొహర్ జిల్లాలో పక్కలో బల్లెంగా మారుతుందని కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆధార్ వివరాలతో అక్రమంగా మనీ విత్‌డ్రా
ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లు చోరి మరింత పెరిగింది. కస్టమర్ల ఆధార్ డేటా వాడుతూ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసినట్టు వెల్లడైంది. ఇలా మొత్తం ఐదు కేసుల వరకు నమోదయ్యాయి. కస్టమర్లకు కనీసం సమాచారం లేకుండా ఆధార్ వివరాలు వాడుతూ.. రూ.4,20,098 విత్‌డ్రా అయినట్టు ఆంధ్రాబ్యాంకులో నాలుగు కేసులు నమోదుకాగ, సిండికేట్ బ్యాంకు నుంచి రూ.1,21,500 విత్‌డ్రా అయినట్టు మరో కేసు నమోదైంది. ఈ కేసులు మాత్రమే కాక, 2015 నుంచి ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.7.65 లక్షలు మోసపూరితంగా విత్‌డ్రా అయినట్టు మొత్తం 20 ఫిర్యాదులు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్కు వెల్లువెత్తాయి. ఈ 20 కేసులు కూడా ఐదు బ్యాంకులకు చెందినవి మాత్రమే.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గరిష్టంగా 15 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రెండు కేసులు, యూసీఓ బ్యాంకులో ఒక కేసు నమోదైనట్టు కేంద్రప్రభుత్వం లోక్‌సభకు చెప్పింది. ఆర్థికమంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మొత్తంగా రికార్డైన 25 కేసుల్లో ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.13.06 లక్షలు విత్‌డ్రా అయినట్టు తెలిసింది. అయితే ఇలా పోయిన నగదును బ్యాంకు తన కస్టమర్లకు 10 రోజుల్లో క్రెడిట్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ఆధార్‌ను అన్నింటికీ ఆధారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు అకౌంట్లకు, ఇన్సూరెన్స్ పాలసీలకు, పాన్ వంటి వాటికి కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 2017 డిసెంబర్ 15 నాటికి 106.41 కోట్ల కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, 82.47 కోట్ల అకౌంట్లు ఆధార్‌తో లింక్ అయ్యి ఉన్నాయి. అయితే ఆధార్ డేటా లీకైందని వస్తున్న వార్తలపై యూఐడీఏఐ గట్టిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆధార్డేటా చోరి చేయడానికి వీలులేదని, ఈ దొంగతనం జరుగలేదంటూ కొట్టిపారేసింది. -
బ్యాంక్ ఖాతాలు తెరవండి
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జీవోలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు నెలలోగా ప్రభుత్వం నిర్దేశించిన 32 బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలను ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) 2010 ప్రకారం విదేశీ విరాళాలను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని తెలిపింది. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల్లో ఎస్బీఐ, విజయ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10వేల ఎఫ్ఆర్సీఏ గుర్తింపు పొందిన ఎన్జీవోలు ఉన్నాయి. -
ఆధార్ లింక్‌పై కేంద్రం మరో గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ అనుసంధానంపై కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకునే డెడ్‌లైన్ డిసెంబర్ 31ను విత్‌డ్రా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త డెడ్‌లైన్‌ను కేంద్రం త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతమైతే డిసెంబర్ 31గా ఉన్న తుది గడువును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అన్ని బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మిగతా అన్ని సర్వీసులకు ఆధార్‌ను అనుసంధానించే తుది గడువుల్లో ఎలాంటి మార్పు లేదు. పాన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానించే తుది గడువు 2018 మార్చి 31 వరకు ఉండగా.. మొబైల్ నెంబర్లను ఆధార్‌తో లింక్ చేసుకునే తుది గడువు 2018 ఫిబ్రవరి 6తో ముగియనుంది. ప్రభుత్వం అందించే అన్ని సామాజిక భద్రత, సంక్షేమ పథకాలకు సంబంధిత అధికార విభాగాలకు ఆధార్ వివరాలను అందించే ప్రక్రియకు తుది గడువు 2017 డిసెంబర్ 31గా ఉంది. అదేవిధంగా ఆధార్, పాన్‌ను ఫైనాన్సియల్ సర్వీసెస్‌తో లింక్ చేసే ప్రక్రియను మార్చి 31 వరకు చేపట్టవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు పొందని వారి కోసం, ఇటీవలే ఆధార్ నెంబర్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
మార్చి 31 వరకు ఆధార్ గడువు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుందని పేర్కొంది. ఆధార్ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధార్ నమోదు కార్యక్రమంపై స్టే విధించాలంటూ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ వాదనలు జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు విన్పిస్తూ.. కొన్ని ఏళ్లుగా అమలవుతున్న ఆధార్ పథకంపై ఎటువంటి స్టే విధించరాదని, డిసెంబర్ 31తో ముగుస్తున్న ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించనున్నట్లు కోర్టుకి తెలిపారు. పెళ్లయితే మతం మారదు అన్య మతస్తుడిని పెళ్లాడితే మహిళ మతం మారిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్శి మహిళ వేరే మతస్తుడిని వివాహమాడితే ఆమె మత గుర్తింపు మారుతుందా? అన్న కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ‘ ఇతర మతస్తుడిని పెళ్లి చేసుకున్న తరువాత సదరు మహిళ తన పుట్టింటి మతాన్ని కోల్పోతుందని చెప్పే చట్టాలేం లేవు. పైగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం...ఇద్దరు దంపతులు తమ సొంత మతాలనే ఆచరించొచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. లాయర్ల ‘అల్లరి’పై సీరియస్ ఇటీవల జరిగిన కొన్ని ప్రముఖ కేసుల విచారణ సందర్భంగా సీనియర్ లాయర్లు గట్టిగా అరవడం, వాగ్వాదానికి దిగి జడ్జీలను బెదిరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు హాల్లో అరుపులు, కేకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంది. బాబ్రీ మసీదు , ఢిల్లీ ప్రభుత్వం–కేంద్రం వివాదాల విచారణ సమయంలో సీనియర్ లాయర్ల మితిమీరిన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయోధ్య కేసు విచారణను 2019 జూలై వరకు వాయిదా వేయాలని కోరుతూ సీనియర్ లాయర్లు కపిల్ సిబల్ తదితరులు మొండి పట్టుదలకు పోవడం తెలిసిందే. ‘లాయర్లను న్యాయ పరిరక్షకులుగా భావిస్తారు. కొందరు లాయర్లు తాము గళమెత్తి న్యాయ వ్యవస్థతోనే వాగ్వాదానికి దిగగలమని అనుకుంటున్నారు. గట్టిగా అరవడం వారి అసమర్థత, అపరిపక్వతనే సూచిస్తుంది’ అని బెంచ్ పేర్కొంది. విడిగా ఉన్న భార్యకూ భరణం విడాకులు తీసుకున్న భార్య తరహాలోనే చట్టబద్ధంగా విడిగా ఉంటున్న భార్యకు ఆమె భర్త భరణం చెల్లించాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. విడిగా ఉంటున్న భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పునిచ్చింది. నెలకు రూ.4 వేలు భరణం చెల్లింపును నిరాకరించడానికి హైకోర్టు చూపిన కారణాలు సహేతుకంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టుకు సూచించింది. -
సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు టార్గెట్, నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్లాక్‌మనీ హోల్డర్స్పై కొరడా ఝళిపిస్తూ వెళ్తున్న ఆదాయపు పన్ను శాఖ అథారిటీలు తాజాగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను టార్గెట్ చేశారు. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు కలిగిన వారికి విచారణ నోటీసులు పంపుతున్నారు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ కింద అమెరికా, భారత్‌తో వీరి సమాచారాన్ని షేర్ చేస్తోంది. ఈ లేఖలు అందిన వారిలో బహుళ జాతీయ కంపెన్లీ పనిచేస్తూ కొన్ని ఏళ్ల క్రితం భారత్‌కు వచ్చిన టాప్-ర్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్‌లున్నారు. అమెరికా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డివిడెంట్లపై వివరణ ఇవ్వాలని వీరిని, ఆదాయపు పన్ను శాఖ ఆదేశిస్తోంది. అమెరికాలో బ్యాంకు అకౌంట్లు మాత్రమే కాక, ఫైనాన్సియల్‌గా కలిగి ఉన్న వాటిపై కూడా వివరణ ఇవ్వాలని కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపింది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా 2015 సెప్టెంబర్ నుంచే భారత్, అమెరికాతో సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ పంపుతున్న నోటీసుల్లో బ్యాంకు అకౌంట్లో కలిగి ఉన్న డివిడెండ్లు, ఆదాయంపై వడ్డీ, ఇతర డిపాజిట్లపై సమాచారం కోరుతున్నట్టు తెలిసింది. అయితే ఎంతమందికి ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపిందో తెలియదు. విదేశాల్లో సంపదను కలిగి ఉండి, వాటిని దాచిపెడితే లెక్కల్లో చూపని విదేశీ ఆదాయం, ఆస్తుల యాక్ట్ కింద 10 ఏళ్ల వరకు కఠిన శిక్ష ఉంటుంది. 120 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్ ద్వారా పొందిన సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాథమికంగా ఫిల్డర్‌చేసి, ప్రాసెస్ చేపడుతోంది. -
గడువు తేదీ చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: బ్యాంకులు, టెలికాం సంస్థలు తమ వినియోగదా రులతో సంప్రదింపుల సమయంలో బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకునే ఆఖరి తేదీ గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకోవ డానికి ఆఖరితేదీ డిసెంబర్ 31. మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకోవడానికి చివరి తేదీ 2018 ఫిబ్రవరి 6. ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధత.. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లను ఆధార్ సంఖ్యతో అనుసంధానించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెలాఖరులో రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆఖరి తేదీ లేకుండా సందేశాలు పంపొ ద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, టెలికాం సంస్థలను ఆదేశిం చాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం బ్యాంకులు, టెలికాం సంస్థలు పంపే ఎస్ఎంఎస్ల్లో బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ లింకింగ్‌కు చివరి తేదీలను స్పష్టం చేయాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలకు డిసెంబర్ 31, మొబైల్ నంబర్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ అని వాటిలో తెలియజేయాలంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్న ప్రధాన పిటిషన్‌తో పాటు నాలుగు వేర్వేరు పిటిషన్లను సైతం కలిపి రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్నట్టు వెల్లడించిన బెంచ్.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. -
బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
-
బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
ముంబై: బ్యాంకు ఖాతాలను ఆధార్ నంబరుతో అనుసంధానించడం తప్పనిసరి అంటూ భార తీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శనివారం స్పష్టతనిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కు తీసుకొచ్చిన సవరణలను అనుసరించి బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించుకోవాల్సిందేనంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానంపై ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదంటూ మీడియాలో వస్తున్న వదంతులకు రిజర్వు బ్యాంకు స్పందించి తాజా ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 31కల్లా అన్ని బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించాలని జూన్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. బ్యాంకు వారికి ఆధార్‌ను ఇవ్వకపోతే ఖాతాను నిలిపివేస్తామనీ, రూ.50 వేలకు పైబడి జరిపే లావాదేవీలకు కూడా ఆధార్ తప్పనిసరని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే పన్ను ఎగవేతదారులకు కళ్లెం వేసేందుకు ఆధార్, పాన్‌ను అనుసంధానించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడం విదితమే. -
ఆధార్ తప్పనిసరి : ఆర్బీఐ
సాక్షి, ముంబై : బ్యాంక్ ఖాతాలను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా శనివారం మరోమారు స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక లావాదేవీలను నియంత్రించే క్రమంలో బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదంటూ వస్తున్న కథనాలను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా మనీ లాండరింగ్ నిరోధక చట్టం - 2017 ప్రకారం ఇది తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది. డిపెంబర్ 31 లోగా ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం - 2017ను అనుసరించి అన్ని బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా.. అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. -
‘జన్ ధన్’ పైసా వసూల్ చేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘జన్ ధన్ యోజన’ పథకం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకున్నారు. ముమ్మాటికి ఆ మాట నిజమంటూ ఆయన మంత్రివర్గ సహచరులు ఆయనకు వంత పాడారు. ఈ పథకాన్ని ప్రారంభించి ఆగస్టు 27వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మంత్రివర్గం ఈ మేరకు ప్రకటనలను గుప్పించింది. ఈ పథకం ద్వారా 29.51 కోట్ల మంది ప్రజలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిపించామని, తద్వారా 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని వారు గర్వంగా చెప్పుకున్నారు. వారి మాటల్లో ఎంత వరకు నిజముంది? కొత్తగా ఖాతాలు తెరవడం వల్లన వారికి కలిగిన ప్రయోజనం ఏమిటీ? అసలు ఏ లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు, లక్ష్యాల్లో ఏ మేరకు విజయం సాధించారు? జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరచిన వారికి ‘ఓవర్ డ్రాప్ట్’ తీసుకోవచ్చని, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని, ఏటీఎం సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చని, భీమా సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం ఆశ చూపించింది. ఖాతాలను తెరచేందుకు కనీస డిపాటిట్ నిబంధన కూడా లేకుండా జీరో బ్యాలెన్స్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన పెద్దగా రాకపోవడంతో దేశం నుంచి తరలిపోతున్న నల్లడబ్బును తీసుకొచ్చి తలా 15 లక్షల రూపాయల చొప్పున జన్ ధన్ యోజన ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి కాస్త స్పందన పెరిగింది. 15 లక్షల రూపాయలు జీవిత కాలంలో వచ్చే అవకాశం ఎవరికీ లేకపోయినప్పటికీ ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయన్న అంశాన్ని మాత్రం బేరీజు వేయాల్సి ఉంది. ఈ పథకం కారణంగా నేడు 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని ప్రభుత్వం ప్రకటిం^è గా, 90 శాతం ఇళ్లవారిని మాత్రమే తీసుకరాగలిగిందని ‘మాన్యుల క్రిస్టిన్ గుంతర్’ అనే అంతర్జాతీయ సంస్థ ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. ఓ ఇంటిలో ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉన్న ఆ ఇల్లు బ్యాంకు లావాదేవీల పరిధిలోకి వచ్చినట్లే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన దాదాపు 30 కోట్ల మందిలో 79 శాతం మందికి అందరిలాగే అంతకుముందే రెగ్యులర్ ఖాతాలు ఉన్నాయట. 21 శాతం మంది మాత్రమే కొత్తగా బ్యాంకింగ్ పరిధిలోకి ఈ పథకం కింద వచ్చారన్న మాట. ఈ బ్యాంకు ఖాతాల వల్ల ఓవర్‌డ్రాప్ట్ ప్రయోజనం కలగడం మరో ముఖ్యమైన ఆకర్షణ. అయితే 2016, డిసెంబర్ నెల వరకు ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాప్ట్‌లను కేవలం 44.28 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారు. వారిలో కూడా సగం మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఖాతాదారులందరికి ‘రూపే కార్డు’ ఇచ్చామన్నది ప్రభుత్వం చెప్పుకుంటున్న మరో విజయం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇలాంటి కార్డులకు డిమాండ్ పెరిగినప్పటికీ గత ఆగస్టు 16వ తేదీ వరకు 76 శాతం ఖాతాదారులకు మాత్రమే రూపే కార్డులు మంజూరు చేయగలిగింది. వీటిలో కూడా ప్రతి ఐదుగురు ఖాతాదారుల్లో ఒకరు కార్డును అసలే ఉపయోగించడం లేదని రూపే చెల్పింపులను నిర్వహిస్తున్న భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ మాజీ చీఫ్ ఏపీ హోతా వెల్లడించారు. 2014, ఆగస్టు నుంచి 2015, మార్చి లోపల జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి 30 వేల రూపాయల జీవిత బీమాను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం ఈ పథకం వల్ల కలిగే మరో ప్రయోజనం. ఈ నిర్దేశించిన కాలంలో 14.71 కోట్ల మంది ఖాతాలు తెరిచారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2016, డిసెంబర్ 23వ తేదీ వరకు 3,936 క్లెయిమ్‌లు రాగా, వాటిలో 3,421 మంది క్లెయిమ్‌లను కేంద్రం క్లియర్ చేసింది. మిగతా క్లెయిమ్‌లను తిరస్కరించింది. మొత్తం జీవిత భీమా అర్హుల్లో 0.002 శాతం మందికి మాత్రమే బీమాను చెల్లించింది. ఈ పథకం కింద బ్యాంకు ఖాతాలను తెరచి ఆరు నెలల వరకు కూడా వాటి లావాదేవీలు అసలే ప్రారంభం కాలేదని, ఆ తర్వాత లావాదేవీలు ప్రారంభం అయినప్పటికీ మందకొడిగానే సాగుతున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గత మే నెలలో జరిపిన అధ్యయనంలో తేలింది. ఇంటికి ఒక్క ఖాతా ఉన్నట్లయితే కనీసం ఇంట్లోని ఇద్దరు, ముగ్గురైన ఉమ్మడిగా ఆ ఖాతాను ఉపయోగిస్తారని ప్రభుత్వం ఆశించింది. అది అడియాశేనని మరో అధ్యయనంలో తేలింది. అలా ఒక్క ఖాతను ఉమ్మడి ఖాతాగా ఉపయోగించే వారు జన్ ధన్ యోజన ఖాతాదారుల్లో రెండు శాతానికి మించి లేరని తేల్చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు వచ్చి ఈ ఖాతాలకు చేరడం వల్లనే అంతో ఇంతో ఈ ఖాతాల లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారమే పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఖాతాల్లో 59,810 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా 49వేల రూపాయలకు లోపున డిపాజిట్ అవడం వల్ల వాటిని విత్‌డ్రా చేసుకోనీయకుండా కూడా ప్రభుత్వ అడ్డుపడలేక పోయింది. ఏదేమైనప్పటికీ భారతీయులందరిని బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి వారి నుంచి ‘పైసా వసూల్’ చేయాలన్న ప్రభుత్వం అంతిమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. -
హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..
♦ డేటా లీక్ అయ్యిందంటూ హెచ్చరికలు ♦ అటుపై సాయమందిస్తామంటూ హామీ ♦ చివరకు సేవల పేరుతో ఆదాయం ముంబై: మోసపూరిత ఈ–మెయిల్స్/కాల్స్.. బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం.. క్రెడిట్ కార్డుల సమాచారం కొట్టేయడం.. ఇలా వివిధ మార్గాల్లో హ్యాకర్లు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీరు స్టార్టప్స్‌పై పడుతున్నారు. వీటిని భయపెట్టి ఆదాయం పొందాలని చూస్తున్నారు. అదెలాగంటే.. దేశీ క్రెడిట్ స్కోర్ మేనేజ్మెంట్ కంపెనీ ‘క్రెడిట్‌సేవ’ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని సర్వర్‌లో నిక్షిప్తమై ఉన్న దాదాపు 40,000 మంది రుణగ్రహీతల వివరాలు లీక్ అయ్యాయని ఒక యూరోపియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ దీన్ని హెచ్చరించింది. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సాయమందిస్తామని హామీ కూడా ఇచ్చింది. అలర్ట్ అయిన క్రెడిట్‌సేవ సంస్థ వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో డేటా భద్రంగానే ఉందని, ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే లండన్‌కు చెందిన ఒక బ్లాగర్ కూడా డేటా లీక్ జరిగిందని కథనం వడ్డించేసింది. కానీ క్రెడిట్‌సేవ సీఈవో సత్య విష్ణుభొట్ల మాత్రం డేటా లీక్ అవ్వలేదని, భద్రంగానే ఉందని స్పష్టం చేశారు. సమస్య సృష్టించేదీ...సొల్యూషన్ ఇచ్చేదీ వారే... ఇక్కడ మరొక కొత్త సమస్య ఉత్పన్నమౌతోంది. కొందరు నిష్ణాతులైన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇండియన్ కంపెనీలను భయపెడుతున్నారు. వీరు ఎలాంటి వారంటే వ్యాపారం కోసం సిస్టమ్ హ్యాక్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే వారే సమస్యను సృష్టించి, దానికి సొల్యూషన్‌ను అందిస్తారు. స్టార్టప్స్ ఈ ఉదాహరణను ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలని స్థానిక సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరించింది. ఫిన్‌టెక్ విభాగంలో బిజినెస్‌కు సంబంధించి సెక్యూరిటీ అనేది ముఖ్యమైన అంశమని తెలిపింది. స్టార్టప్స్ ఎప్పుడూ వ్యాపార విస్తరణతో పాటు సైబర్ దాడులు, డేటా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. స్టార్టప్‌ను నడిపించడం కష్టమైన పనే. మీ సిస్టమ్‌లో లోపాలున్నాయని, సమస్య పరిష్కారానికి మా సేవలు ఉపయోగపడతాయని కొందరు సెక్యూరిటీ కన్సల్టెంట్స్ మీ వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్టప్ నిర్వహణ మరింత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి సేవలు తీసుకోవడానికి మనం నిరాకరిస్తే.. డేటా లీక్ అయ్యిందంటూ వీరు మీడియాకు తెలియజేస్తారు. మా పోర్ట్‌ఫోలియోలోని ఒక కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మీ వరకు కూడా ఈ సమస్య రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త. – స్టీవెన్ టంగ్ , బూట్‌క్యాంప్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్, క్రెడిట్‌సేవ ఇన్వెస్టర్ -
సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు
మరోసారి సుప్రీం స్పష్టీకరణ సంక్షేమేతర పథకాలకు ఆధార్‌ను అడ్డుకోం న్యూఢిల్లీ: సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ కార్డును తప్పనిసరి చేయలేవని చెప్పింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ఐటీ రిటర్న్ దాఖలు వంటి సంక్షేమేతర అంశాలకు ఆధార్‌ను అడ్డుకోమని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం పేర్కొంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ భంగం కలిగిస్తుందన్న ఫిర్యాదు నేపథ్యంలో.. ఆధార్ పథ కాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ వాదిస్తూ.. ఆధార్ తప్పనిసరి కాదు స్వచ్ఛందమేనంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఆధార్ కార్డు పథకాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధార్ పథకాన్ని పర్యవేక్షిస్తున్న యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఏదైనా చట్టం, లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడలేదని, బయోమెట్రిక్ వివరాల్ని ప్రైవేట్ సంస్థల ద్వారా పొందుతుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015లోనే తప్పనిసరి కాదన్న సుప్రీంకోర్టు ఆగస్టు 11, 2015న... ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆధార్ పథకం కోసం సేకరించిన సమాచారాన్ని అధికారులు బయటకు వెల్లడించ కూడదంది. అక్టోబర్ 15, 2015న కోర్టు అంతకముందు విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తూ.. పథకాలకు ఆధార్‌ను స్వచ్ఛందంగా వాడుకోవచ్చంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పింఛన్ పథకాలు, పీఎఫ్, జన్ ధన్ యోజనలకు స్వచ్ఛందంగా ఇస్తే ఆధార్‌ను తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకూ ప్రభుత్వ పథకాలకు ఆధార్ స్వచ్ఛందమే గానీ తప్పనిసరి కాదని పేర్కొంది. -
నగదు రహితం.. మంచిదే!
పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి దేశంలో నగదు లావాదేవీల స్వరూపమే మారిపోయింది. సామాన్యులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడుతున్నారు. దీంతో మున్ముందు నగదురహిత లావాదేవీల ప్రాధాన్యం మరింత పెరగనుంది. సాధారణంగా ఆర్థికాంశాలన్నీ ఎక్కడో ఒక దగ్గర పన్నులతోనే ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పన్నులకు సంబంధించి నగదురహిత లావాదేవీల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియజేసే ప్రయత్నమే ఈ కథనం. ఆదాయ పన్ను చెల్లింపులు పెరుగుతాయి నగదు రహిత లావాదేవీలన్నీ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉండటం వల్ల లావాదేవీల మూలాలను ఇట్టే గుర్తించవచ్చు. కాబట్టి ఎవరూ కూడా తమ ఆదాయాలను దాచి పెట్టే అవకాశం ఉండదు. పైగా ప్రతి ఒక్కరి అకౌంటును పాన్, ఆధార్ నంబరుతో అనుసంధానం చేయడం వల్ల ఎవరిదగ్గర ఎంత మొత్తం ఉందన్నది సులువుగా కనిపెట్టేయొచ్చు. కనుక.. ఆదాయాన్ని తక్కువ చూపించడం, తక్కువ ఆదాయ పన్ను కట్టడం వంటివి కుదరవు. దీంతో.. మరింత మంది ప్రజలు వాస్తవంగా కట్టాల్సినంత పన్ను కట్టక తప్పదు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల చెల్లింపుల పెరుగుదల వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా.. కంపెనీలు, కార్పొరేట్లు నిర్వహించే ఆర్థిక లావాదేవీల్లోనూ డీమోనిటైజేషన్ పారదర్శకత పెంచింది. నగదు లావాదేవీల పరిమాణం తగ్గింది. కార్డు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు పెరిగాయి. ఇది ఆయా కంపెనీల అకౌంటింగ్ పుస్తకాల్లో కూడా పారదర్శకత పెరిగేందుకు దోహదపడుతుంది. ఆ రకంగా అవి వాస్తవంగా కట్టాల్సినంత ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్నులు కూడా కచ్చితంగా కడతాయి. ఈ పన్ను చెల్లింపులు పెరుగుతాయి. భవిష్యత్‌లో పరోక్ష పన్నుల తగ్గుదల అక్రమంగా డబ్బు కూడబెట్టడాన్ని నిరోధించడం, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా తమ ఆదాయాలను వెల్లడించి.. కట్టాల్సిన పన్నులు కట్టేలా చూడటమే డిజిటల్, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఆదాయ పన్నుల చెల్లింపులు పెరిగే కొద్దీ ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దీంతో మనం కొనుగోలు చేసే వస్తువులు, సర్వీసులపై చెల్లించే పరోక్ష పన్నుల వడ్డింపు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రజల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు కూడా కొంత పెరగవచ్చు. పన్ను మినహాయింపులు నగదురహిత లావాదేవీలను ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం.. పలు సర్వీసులపై చార్జీలు మొదలైన వాటికి మినహాయింపులు ప్రకటించింది. రూ. 2,000 దాకా చెల్లింపులు కార్డు ద్వారా చేస్తే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపునిస్తోంది. అలాగే నెట్ బ్యాంకింగ్ లేదా కార్డుల ద్వారా రైలు టికెట్లు, హైవే టోల్, పెట్రోల్.. డీజిల్ మొదలైనవాటికి చెల్లింపులు చేస్తే కనిష్టంగా 0.5 శాతం మేర లావాదేవీ మొత్తంపై డిస్కౌంటు ప్రకటించింది. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆన్లైన్లో ప్రీమియం చెల్లిస్తే కొంత డిస్కౌంటు ఉంటోంది. సింహభాగం నగదు వాడకమే ఉన్న దేశం.. రాత్రికి రాత్రే నగదురహిత లావాదేవీలకు మారిపోవడం అంత సులభమైన వ్యవహారమేమీ కాదు. ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. అంతా సర్దుకునేందుకు కాస్త సమయం పడుతుంది. దైనందిన జీవితంలోని ఇతరత్రా లావాదేవీలతో పాటు పన్నులు కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ప్రాధాన్యమైన అంశమే. ఎందుకంటే ఖర్చు చేయగలిగేంత నగదు చేతిలో ఉండటమనేది ... పన్నులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఏదైతేనేం..క్యాష్‌లెస్ లావాదేవీల వల్ల చోటు చేసుకునే అత్యంత కీలకమైన పరిణామం ఏదైనా ఉందంటే.. అది ఆదాయ పన్నుల వసూళ్లు పెరగడమే. భవిష్యత్‌లో పన్నులు తగ్గేందుకు, కొనుగోలు శక్తి పెరిగేందుకు ఇదే దోహదపడే అవకాశం ఉంది. -
కూలీల సంఖ్య పెంచకుంటే చర్యలు
► రోజూ 50వేల మందికి ‘ఉపాధి’ కల్పించాలి ►26న మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటన ► నగదు రహిత గ్రామాలుగా 61 ఎంపిక ► వీడియోకాన్ఫరెరన్స్ లో జేసీ యాస్మిన్ బాషా సాక్షి, సిరిసిల్ల : ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల్లో కూలీల సంఖ్య పెంచకపోతే ఏపీవోలపై చర్యలు తీసుకుంటామని జేసీ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించా రు. సోమవారం మండల అధికారులతో సిరిసిల్ల నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజూ 50 వేల మందికి పైగా కూలీలకు పని కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతీగ్రామంలో ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి జిల్లాను వందశా తం బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని అన్నారు. కేంద్ర బృందం మూడుసార్లు జిల్లాలో పర్యటించి నిర్ధారించుకున్నాకే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తుందన్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలకు 61 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ గ్రామాల్లోని ప్రజలందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించాలన్నారు. హరితహారంలో నర్సరీల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామపంచాయతీలకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.10 వేలు మంజూరు చేశామని, వీటిని వినియోగించి పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు వంద శాతం ఉపయోగంలో ఉండాలన్నారు. డీఆర్డీవో పీడీ ఎన్ .హన్మంతరావు, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్‌వో ఆర్.రమేశ్, అధికారులు పాల్గొన్నారు. -
మరో కీలక ఆర్ధిక దిశగా మోదీ సర్కార్?
-
నాన్న, బాబాయ్‌లకు ఊహించని షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో రాజీకోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీని పూర్తిగా తన ఆధిపత్యంలోకి తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అఖిలేష్ వర్గం.. ములాయం, శివపాల్‌లకు మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్పీకి చెందిన బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపజేయాలని కోరుతూ అఖిలేష్ వర్గం బ్యాంకులను కోరినట్టు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. ఎస్పీకి విరాళాల రూపంలో వచ్చిన డబ్బు 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఎస్పీకి సంబంధించి ప్రస్తుతం శివపాల్ యాదవ్ సంతకంపై బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నాయి. ములాయం, శివపాల్లతో విభేదిస్తున్న అఖిలేష్ వర్గం.. ఎస్పీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను, యూపీ పార్టీ శాఖ చీఫ్ పదవి నుంచి శివపాల్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ఆయనకు మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు సీనియర్ నేతలు,ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. అఖిలేష్ వర్గం ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ గుర్తు సైకిల్‌ను తమకు కేటాయించాల్సిందిగా కోరింది. ఆధిపత్య పోరులో ములాయం దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆయన శిబిరంలో తమ్ముడు శివపాల్, సన్నిహితుడు అమర్ సింగ్, కొద్ది మంది నేతలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
శభాష్.. శామీర్‌పేట
వంద శాతం నగదు రహిత గ్రామంగా రికార్డు అధికారికంగా ప్రకటించిన శాసనమండలి విప్ సాక్షి, జనగామ: ఒకప్పుడు బూట్ల చప్పుడు.. పోలీసుల కవాతులతో ఉలిక్కిపడిన కుగ్రామం ఇప్పుడు ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గ్రామ స్తులు ఇప్పుడు ఐక్యతతో నడుం కట్టారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాలోని శామీర్‌పేటను శాసనమండలివిప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ శ్రీదేవసేనలు సంపూర్ణ నగదు రహిత గ్రామంగా సోమవారం ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన శామీర్ పేటలో 669 గృహాలు ఉండగా 2,686 మంది జనాభా ఉన్నారు. 18ఏళ్లు నిండి యువతీ యువకులు 1,830 మంది ఉన్నారు. వీరిలో 1,820మందికి బ్యాంకు ఖాతాలను అందిం చారు. 1,820 ఖాతాలను ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుకు అనుసంధానం చేశా రు. ఇప్పటికీ 1,008మంది ఏటీఎం, డెబిట్ కార్డులతో లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికి ఖాతాలు.. సీఎంతో జరిగిన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న నగదు రహిత లావాదేవీలను కొన సాగించేటట్లు కలెక్టర్లు కృషిచేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దీనితో కలెక్టర్ శ్రీదేవసేన బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించి శామీర్ పేటను నగదు రహిత గ్రామంగా తీర్చిది ద్దడానికి ఎంచుకున్నారు. 54 మహిళ సంఘా లు, ఐదు యూత్ క్లబ్‌ల సభ్యులతో ఇంటింటి సర్వే చేపటి బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం పిన్ నంబర్లు ఇచ్చారు. ఆరు మిషన్లను దత్తత తీసుకున్న ఎస్బీఐ జనగామ శాఖ గ్రామానికి అందించింది. వారం రోజుల నుంచి కిరాణం షాపుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. -
నగదు డిపాజిట్లపై ఆర్బీఐ యూటర్న్
-
తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ
ముంబై : డిపాజిట్‌దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యూలర్ జారీచేసిన సంగతి తెలిసిందే. రూ.5000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వారు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో బ్యాంకులకు తెలపాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు చెప్పే సమాధానాలు బ్యాంకు సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేతతో కేవైసీ అకౌంట్లలో డిసెంబర్ 30 వరకు ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 8న పాత నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఆ నోట్లను డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులను ఆర్బీఐ తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లతో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడమేమిటని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజా నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. -
గనుల కార్మికులకు బ్యాంక్ ఖాతాలు అవసరం
సైదాపురం: జిల్లాలోని మైనింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంక్ ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ సేప్టీ అధికారి నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. కలిచేడు వీటీసీ కేంద్రంలో శుక్రవారం జిల్లాలోని మైనింగ్ పరిశ్రమల కార్మికులు, యాజమానులు, సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇక నుంచి మైనింగ్ పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని కోరారు. అనంతరం కల్యాణరామ మైకామైన్ యాజమాని సర్వజ్ఞకుమార కృష్ణయాచేంద్ర మాట్లాడారు. ప్రస్తుతం మైనింగ్ పరిశ్రమపై పెద్దనోట్ల ప్రభావం తీవ్రంగా చూపిందన్నారు. గతంలో నగదును డ్రా చేసి కూలీలసు ఇచ్చేవాళ్లమని, అయితే ఇప్పుడు నగదు కొరతతో వేతనాలను చెల్లించేందుకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇక నుంచి వేతనాలను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ద్వారకానాథ్‌రెడ్డి, చిత్తరంజన్‌దాస్, భరత్‌బాబు, సురేష్‌రెడ్డి, మేనేజర్లు తిరుమలయ్య, వాసు, తదితరులు పాల్గొన్నారు. -
దశలవారీగా నగదురహితం
-
దశలవారీగా నగదురహితం
- ముందు పట్టణాల్లో,తర్వాత గ్రామాల్లో - 60 శాతం లక్ష్య సాధనకు కృషి - ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకేసారి నగదురహితం సాధ్యం కాదని, దాన్ని దశలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదించింది. నగదురహిత లావాదేవీలపై ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నగదు రూపం లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నిం టినీ ముందుగా నగదురహితంగా మార్చాలని సూచిం చింది. ‘‘సమాజాన్ని నగదురహితం చేయడం ఒకే సారి సాధ్యం కాదు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే సరైన ఫలితముంటుంది. భారీ స్థాయి లో నగదు లావాదేవీలు జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే గనుక అక్కడే ముందుగా అమలు చేస్తే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు’’ అని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగా ణలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేం దుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయడం తెలిసిందే. పలు దఫాల సమావేశాల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు కమిటీ నివేదిక అందజేసింది. అందులోని ముఖ్యాంశాలు... 60 శాతం నగదురహితం లక్ష్యం ► నెట్ బ్యాంకింగ్, కార్డులు, మొబైల్ సేవలతో పాటు చెక్కులను ఉపయోగించాలి. అధిక విలువ కలిగిన లావాదేవీలపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలి. దీంతో 60 శాతం మొత్తం లెక్కలోకి, పన్నుల పరిధిలోకి వస్తుంది. ► ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలి... ► నగదురహిత లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ అక్షరాస్యత పట్టణాల్లో ఉన్నందున అమలు సులభం. గ్రామాల్లో జరిగే లావాదేవీలు తక్కువే. ► పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు ఎక్కువగా సాగితే ఉన్న నగదును గ్రామీణ ప్రాంతాలకు తరలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా అందరికీ బ్యాంకు ఖాతాలుండేలా చూడాలి. వారందరికీ రూపే కార్డులిచ్చి పని చేసేలా చూడాలి. ప్రభుత్వం, బ్యాంకర్లు రూపే కార్డులను ప్రోత్సహించాలి. ► బ్యాంకు ఖాతాలున్న ప్రతిఒక్కరికీ రూపే కార్డులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి ► డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ► చౌకధర దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలను అమలు చేయాలి ► మార్కెట్ యార్డుల్లో రైతుల ఉత్పత్తులకు చేసే చెల్లింపులను బ్యాంక్ ఖాతాల్లోనే జమచేయాలి ► వంట గ్యాస్ సిలిండర్‌కు చెల్లింపులు నగదు రహితంగానే జరిగేలా చూడాలి ► ముందుగా ప్రభుత్వ లావాదేవీల్లో నగదురహిత విధానాన్ని అమల్లోకి తేవాలి ► రూ.500కు మించి ప్రభుత్వం చేసే, ప్రభుత్వానికి చేసే చెల్లింపులన్నీ డిజిటల్ పద్ధతిలో జరగాలి ►ఆన్లైన్లో విద్యుత్, మంచినీటి బిల్లుల చెల్లింపులపై సర్వీస్ చార్జీలను తొలగించాలి ►80 శాతం వరకు ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ► ప్రైవేట్ రంగంలోనూ అధిక విలువ కలిగిన లావాదేవీలు నగదురహితంగా జరిపేలా ప్రోత్సహించాలి ► రూ.5,000కు మించిన కొనుగోళ్లు.. రూ.1,000కి మించిన చెల్లింపులు నగదురహితంగా జరిగేలా చూడాలి ► నగదురహిత లావాదేవీల అమలు, పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి ► ఆన్లైన్, మొబైల్ సేవల్లో మోసాలు, అన్యాయాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి -
కార్మికులు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు శిబిరాలు: కేంద్రం
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. బ్యాంకు ఖాతాలు లేని వారికోసం నవంబర్ 26న దీన్ని మొదలుపెట్టామని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మికులందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించడం, వేతనాలు వాటిలో జమయ్యేలా చూసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల సమన్వయంతో కార్మిక శాఖ తన విభాగాలైన ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ, కార్మిక కార్యాలయాల ద్వారా జిల్లా స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంది. -
బ్యాంకు ఖాతాలకే ఆసరా పింఛన్లు
జనవరి 1 నుంచి అమల్లోకి లబ్ధిదారులకు నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం పరిధి లోని లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు పొందేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాతాలు పొందిన లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ అయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేయడంపై సచివాలయంలో కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులతో బుధవా రం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. జనవరి 1 నుంచి ఆసరా పింఛన్లు క్యాష్ లెస్ పద్ధతిలోనే పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ లింకేజీతో కూడిన బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్ ఇచ్చేలా బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు. క్యాష్ లెస్ విధానం వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించడంతో పాటు, ఆ దిశగా గ్రామీణ ప్రజలను కూడా సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు తీసుకుంటున్న 17.81 లక్షల లబ్ధిదారులకు కూడా బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాష్ లెస్ పంచాయతీల ఏర్పాటుపై చర్చించేం దుకు నాలుగైదు రోజుల్లో బ్యాంకింగ్ , పోస్టల్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణ లోని 8,691 పంచాయతీల్లో, మహిళా సంఘాలకు కూడా స్వైపింగ్ మిషన్ల ఏర్పాటు కు పంచాయతీరాజ్ శాఖ ఆలోచన చేస్తోందన్నారు. పంచాయతీ పన్నులన్ని స్వైపింగ్ ద్వారా వసూలు చేయడం వల్ల క్యాష్ లెస్ అవడంతో పాటు, అవకతవకలకు కూడా ఆస్కారం ఉండదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా బ్యాంకులు, పోస్టాఫీసులు లేని గ్రామ పంచాయతీల వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. -
డీమానిటైజేషన్: ఉప్పు పరిశ్రమ
అహ్మదాబాద్: డీమానిటైజేషన్ ప్రభావంతో ఉప్పు ఉత్పత్తిదారులు కూడా తగిన చర్యలకు ఉపక్రమించారు. నగదు రహిత లావాదేవీలు కోసం ముందుకొచ్చిన ఉప్పు తయారీదారులు కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. జీతాలు చెల్లింపులో ఆలస్యం ఉత్పత్తిని ప్రభావితం చేయొచ్చనే ఆందోళన, రుతుపవనాలు అనంతరం ఉప్పు ఉత్పత్తికి సీజన్ ప్రారంభం కావడంతో తయారీదారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పు పరిశ్రమలో సుమారు 400,000 పనివారు ఉన్నారని ఉప్పు తయారీదారులు చెపుతున్నారు. దాదాపు 75-80 శాతం వలస కార్మికులు ఉన్నారనీ, నగదుకొరతతో వీరికి వేతనాలు చెల్లింపు ఇబ్బంది మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సకాలంలో వారికి జీతాలు చెల్లించలేకపోతే, దాని ప్రభావం ఉప్పు తయారీపై పడుతుందని, తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి దారితీయవచ్చన్నారు. అందుకే కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఉప్పు తయారీదారుల అసోసియేషన్ అధ్యక్షుడు భరత రావల్ తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులతో చర్చించడంతోపాటు,సంబంధిత పత్రాల సమర్పణ కోసం కార్మికులకు సహకరిస్తున్నామని చెప్పారు. డీమానిటైజేషన్ మంచి ఎత్తుగడ అనీ , మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ జలాన్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో తమతో సహా అన్ని వర్గాల కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతానికి సరిపడా ఉప్పు నిల్వలు న్నాయని పేర్కొన్నారు. వలస కార్మికుల డాక్యుమెంటేషన్ పెద్ద సమస్యగా పరిణమించిందని కాంట్రాక్టర్లు చెప్పారు. వారివారి సొంత గ్రామాలనుంచి సంబంధిత గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నట్టు కచ్ ప్రాంతంలోని కాంట్రాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. తాము ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను ప్రక్రియ మొదలుపెట్టామని దేవ్ ఉప్పు ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ జీఎస్ ఝాలా తెలిపారు. కార్మికులం సంక్షేమం, తద్వారా ఉప్పు సరఫరాలో ఎటువంటి సమస్య రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మరోవైపు డీమానిటైజేషన్ ప్రభావం మిగిలిన అన్ని పరిశ్రమలతో పాటు ఉప్పు పరిశ్రమపై కూడా పడింది. కాస్టిక్ సోడా తదితర సోడా ఉత్పత్తులపై ఇప్పటివరకు కొద్దిమేర ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలుచెబుతున్నాయి. కాగా దేశంలో సంవత్సరం ఉప్పు 27.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఇందులో1.4 మిలియన్ టన్నులు పారిశ్రామిక అవసరాల కోసం 6.6 మిలియన్ టన్నులు ఆహారంలో వినియోగం కో్సంకేటాయిస్తారు. ఆరు మిలియన్ టన్నుల ఎగుమతి చేస్తుంటారు. కాగా గుజరాత్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. గుజరాత్ లో 22.7 మిలియన్ టన్నులు, రాజస్థాన్‌లో 2.4 మిలియన్లు, తమిళనాడు లో దాదాపు రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి జరుగుతుంది. -
అంతటా క్యాష్‌లెస్!
- నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించండి - జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొంతకాలం పాటు కరెన్సీ కొరత కొనసాగనున్నందున అత్యవసరంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించా లని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని, తగిన ప్రచారం చేయాలంది. వ్యాపార వాణిజ్య లావాదేవీలు సజావుగా సాగేందుకు ఎన్ని స్వైపింగ్ మిషన్లు కావాలో అంచనా వేయాలంది. ఖాతాలు లేని వయోజ నులందరికీ అకౌంట్లు తెరిపించేందుకు బ్యాం కర్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించా లని కోరింది. వాణిజ్య పన్నుల చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా డీలర్లు, వ్యాపారు లను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఖాతాదారులందరికీ రూపే కార్డులు రాష్ట్రంలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అందరి వద్ద రూపే కార్డులు లేవు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు ఖాతాదారునికి రూపే కార్డును, పిన్ను అందించాలని ప్రభు త్వం కోరింది. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కలెక్టర్లను ఆదే శించింది. ఖాతా నంబరు తెలియకపోరుునా ఆధార్ సాయంతో సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఎక్కడ్నుంచైనా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేయాలని కోరింది. ప్రతి వంద, రెండొందల కుటుంబాల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఓ అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రతి గ్రామంలో బ్యాంక్ కోఆర్డినేటర్‌ను అం దుబాటులో ఉంచాలంది. లీడ్‌బ్యాంక్ మేనే జర్లతో పాటు మీసేవ సెంటర్ల ఇన్చార్జిలు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలంది. జిల్లాల పరిధిలో చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, వర్గాలతో సమావేశమై డిజిటల్ చెల్లింపులకు అవసరమైన వ్యూహ రచన చేయాలని సూచించింది. ఆర్టీసీ బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు నగదు రహిత చెల్లింపులకు ప్రభుత్వ శాఖల్లో కార్డ్ స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతా నికి స్వైపింగ్ మిషన్ల కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున బిల్లులు చెల్లింపులు జరిగే మార్కెట్ యార్డులు, సహకార సంస్థలు, రైతు బజార్లు, రేషన్ దుకాణాలు, ఆర్టీసీ బస్సులు, మీసేవా కేంద్రాల్లో ఈ యంత్రాలను ఏర్పా టు చేయాలని ఆదేశించింది. పెద్దఎత్తున చెల్లింపులు జరిగే విత్తనాలు, ఎరువుల దుకాణాలు, ప్రైవేటు ఆసుపత్రులు, మందుల దుకాణాలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. వయోజనులందరికీ ఖాతాలు 18 ఏళ్లు ఆపై వయసున్న పౌరులందరికీ బ్యాంకు ఖాతాలను ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ప్రధానంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించేం దుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. -
బెజవాడలో నోట్ల మార్పిడి ఉదంతం
సిబ్బంది పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి నగదు జమ చేసిన కళాశాల యాజమాన్యం విజయవాడ (వన్‌టౌన్): విజయవాడలో నోట్ల మార్పిడికి సంబంధించి మరో ఉదంతం వెలుగుచూసింది. విజయవాడ పాతబస్తీలోని గాంధీజీ మహిళా కళాశాల యాజమాన్యం ఆ కళాశాలలో పని చేస్తున్న 29 మంది సిబ్బందికి ఈ నెల 10న స్థానిక తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో కొత్త ఖాతాలను తెరిపించింది. అప్పటికే అదే బ్యాంకులో కళాశాలకు చెందిన మరో 14 మందికి ఖాతాలు ఉన్నారుు. ఈ మొత్తం ఖాతాల్లో రూ.12 లక్షలు కళాశాల యాజమాన్యం డిపాజిట్ చేసింది. ఒక్కొక్క ఖాతాలో రూ. 20 నుంచి రూ.48 వేల వరకూ డిపా జిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అందులో సుమారు ఆరు లక్షల వరకూ విత్‌డ్రాలు జరిగాయి. అయితే ఈ అంశంలో కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గుణదలకు చెందిన కడియం జూడీ అనే మహిళ తన వద్ద బలవంతంగా ఖాళీ డిపాజిట్, విత్‌డ్రా ఫారాలపై సంతకాలు తీసుకొని తనకు తెలియకుండా తన ఖాతాలో నగదు డిపాజిట్ చేశారని సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బ్యాంకు ఖాతాలు, కళాశాల ఆర్థిక లావాదేవీల పుస్తకాలను పరిశీలించేందుకు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా 43 మంది సిబ్బందిని, బ్యాంకు అధికారులను మంగళవారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీనిపై డీసీపీ పాలరాజు మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని చెప్పారు. -
గుండెల్లో లబ్‌డబ్బు
చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవు. ఉన్నవారికి రూపే, ఏటీఎం కార్డుల్లేవు. అరుునా సరే.. పాలకులు నగదు రహిత లావాదేవీలంటున్నారు. డిసెంబర్ ఒకటి నుంచే శ్రీకారం చుడతామంటున్నారు. అందరూ అకౌంట్లు తెరవాల్సిందే.. కార్డులు తీసుకోవాల్సిందేనని పీక మీద కత్తి పెడుతున్నారు. అకౌంట్లు తెరిచేదెప్పుడు.. కార్డులు పొందేదెప్పుడు.. పింఛన్లు దక్కేదెప్పుడని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.మరోవైపు కరెన్సీ సంక్షోభం పాడి రైతులను ఎటూ పాలుపోనీయకుండా చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత గత కొన్నాళ్లుగా డెరుురీ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితులన్నింటిపై ఫోకస్.. పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఒక్క నవంబర్లోనే ఊహించని రీతిలో పింఛన్‌దారుల్లో కోతపడింది. గడిచిన మూడు నెలల్లో మంజూరైన పింఛన్లను పరిశీలిస్తేఈవిషయం స్పష్టమవుతోంది. సెప్టెంబర్‌లో 3,25,008 మందికి మంజూరు చేస్తే, ఆ సంఖ్య అక్టోబర్‌లో 3,24,259కు తగ్గింది. ఇక నవంబర్‌లో పెద్దనోట్ల దెబ్బకు కేవలం 3,02,737 మందికి మాత్రమే పంపిణీ చేయ గలిగారు. ఇక డిసెంబర్లో పరిస్థితి ఎలాఉంటుందో ఎంతమందికి పింఛన్లు అందు తాయో చెప్పలేని గందర గోళ పరిస్థితులు నెలకొన్నారుు. సాధారణంగా జిల్లాలో ఉన్న పింఛన్ దారుల సంఖ్యను బట్టి ప్రతినెలా రూ.35.06కోట్ల ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 15వ తేదీ కల్లా వీటిని నగదు రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. వచ్చే నెల నుంచి పింఛన్ సొమ్మును వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 3.24లక్షల పింఛన్ దారుల్లో ఆధార్‌సీడింగ్ జరిగిన అకౌంట్స్ కలిగిన వారి సంఖ్య కేవలం 2,04,184 మంది మాత్రమే ఉన్నారు. మరో 71,575 మందికి అకౌంట్స్ఉన్నప్పటికీ ఇంకా ఆధార్ సీడింగ్ కాలేదు. మరో46,149 మందికి అసలు అకౌంట్సే లేవు. పోనీ ఆధార్, అకౌంట్ సీడింగ్ కలిగిన 2,04,184 మందికై నా నేరుగా వారి ఖాతాల్లో పించన్ సొమ్ము జమ చేద్దామన్నా వారెవరికి రూపేకార్డుల్లేవు. మొత్తం పింఛన్‌దారుల్లో రూపే కార్డులుకలిగిన వారు కేవలం 528 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 2,85,231 మందికి రూపేకార్డుల పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని పంపిణీ చేయాలన్నా కనీసం రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్ నెలకు పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేసే పరిస్థితులు ఏమాత్రం కన్పించడం లేదు. దీంతో పాతపద్ధతిన నగదు రూపంలోనే ఇవ్వాలి. పింఛన్ల పంపిణీలో కీలకమైన రూ.500లు, రూ.వెరుు్య నోట్లు రద్దు కావడంతో పరిస్థితి జటిలంగా మారింది. -
బ్యాంకు ఖాతాల స్పెషల్ డ్రైవ్ నేటి నుంచే..
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు?
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ ఒకటి నుంచే ఈ ప్రక్రియ చేపట్టేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,821 మంది లబ్ధిదారులు వివిధ కేటగిరీల్లో సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు. వీరందరికీ రూపే కార్డులను బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. పింఛన్ పొందుతున్న వారిలో ఇంకా 67,400 మందికి బ్యాంకు ఖాతాలు లేనట్లు గుర్తించారు. వీరితో పాటు 91వేల మందికి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు గ్రామీణ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేని వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, దరఖాస్తు, డిక్లరేషన్‌పై లబ్ధిదారులతో సంతకాలు తీసుకుని నేరుగా పింఛన్ పంపిణీ చేసే అధికారులే బ్యాంకు అధికారులకు వాటిని అందజేసి, ఖాతాలు తెరిపించాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తి చేసి సోమవారంలోగా ఖాతాలు లేని వారందరికీ తెరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర నోట్ల సమస్య ఏర్పడటంతో ఎలాగైనా డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అమలైతే ఇప్పటిలాగా పింఛన్ కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. నేరుగా వారి ఖాతాలోనే పింఛన్ సొమ్ము పడుతుంది కాబట్టి లబ్ధిదారులు రూపేకార్డు/ఏటీఎం కార్డులతో ఎప్పుడైనా సొమ్మును డ్రా చేసుకునే వీలుంటుంది. కాగా చాలా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ ఏటీఎంల వినియోగంపై సరైన అవగాహన లేదు. దీనికితోడు మార్కెట్లో రూపేకార్డులను ఉపయోగించి వస్తువులను ఎలా కొనుగోలు చేయాలో తెలియదు. ఈ కారణంగా చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘నో అకౌంట్’లోనూ మనం ఘనులమే
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్ల నగదు మార్పిడికి ఇచ్చిన గడువు ముగిసి పోవడంతో బ్యాంకు ఖాతాలులేని ప్రజల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. బ్యాంకులకు వెళ్లి ఖాతాలు తెరుద్దామంటే విధి నిర్వహణలో తలమున్కలై ఉన్న బ్యాంకు సిబ్బంది తర్వాత రమ్మని తిప్పి పంపిస్తున్నారు. ఎలాంటి గుర్తింపులేని వలస ప్రజలకు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయాలో తోచ క వారంతా మీడియా ముందు గోడు వెల్లబోసుకుంటున్నారు. పాత 500, 1000 రూపాయల నోట్లతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పుడో చెప్పినప్పటికీ ఆ దిశగా నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. ‘ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ఇండియా’ 2015లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 23.30 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు లేవు. ప్రపంచంలో బ్యాంకు ఖాతాల్లేని అతి పెద్ద దేశాల్లో భారత్ ఏడవ స్థానంలో ఉంది. అంటే ఇది బంగ్లాదేశ్ జనాభాకన్నా ఎక్కువ. 2011లో బ్యాంక్ ఖాతాల్లేని వారి సంఖ్య 55.70 కోట్ల మంది ఉండేవారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన’ పథకం కింద దాదాపు 21 కోట్ల ఖాతాలను తెరవడం వల్ల ఖాతాలేని వారి సంఖ్య 23.30 కోట్లుకు పడిపోయింది. 2016 జూన్ నాటికి జన్‌ధన్ యోజన కింద మరో 6.80 కోట్ల మంది ఖాతాలు తెరిచారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారి లెక్కలను కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం 16.50 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. వీరంతా పేద వర్గాలు, నిరక్ష రాస్యులే. సరైన గుర్తింపు కార్డులు లేనివారే. సరే, ఏదోరకంగా ప్రభుత్వం వీరికి కూడా బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఇస్తే బ్యాంకులపై అదనపు భారం ఎంతో పడుతుంది. ఇప్పటికే సకాలంలో విధులు నిర్వర్తించలేకపోతున్న బ్యాంకులు ఈ అదనపు భారాన్ని ఎలా భరిస్తాయన్నది మరో ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ప్రజలకు సరాసరి సగటున 43 ఏటీఎంలు ఉండగా, భారత్‌లో 18 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. బ్యాంకుల బ్రాంచిల విషయంలో మాత్రం లక్ష మందికి 13.4 బ్యాంకుల బ్రాంచిలతో దాదాపు ప్రపంచ సగటుకు సమానంగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలన్నీ డిజిటల్ క్యాష్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండగా, భారత్ మాత్రం ఎంతో వెనకబడి పోయింది. -
బ్యాంకు ఖాతాల స్పెషల్ డ్రైవ్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం కార్మిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులకు బ్యాంకు ఖాతాల కోసం స్పెషల్ డ్రైవ్ ఈ (శనివారం) నుంచే మొదలు కానుంది. నవంబర్ 26, 2016 నుంచి ప్రత్యేక శిబిరాలద్వారా బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి జిల్లాలో నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ డ్రైవ్ ను నిర్వహించనుంచనుంది. డిజిటల్ లావాదేవీలను మరింత తీవ్రం చేసే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఫైనాన్షియల్ శాఖ సేవల సహకారంతో ఈ ప్రచారం ప్రారంభించనున్నట్టు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై యజమానులు నేరుగా కాకుండా బ్యాంకుల ద్వారానే కార్మిక వేతనాలు చెల్లించేలా ఖాతాలు లేని కార్మికులందరికీ తక్షణమే సమీప బ్యాంకుల్లో కొత్త ఖాతాలు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా చురుకుగా ఉన్నామని, ఈ విషయంలో సహరాన్ని అభ్యర్థిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం జనధన్ యోజన ద్వారా 2014 తరువాత 25 కోట్లపై పైగా బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంతో కోట్లాదిమంది పేదవారికి లబ్ధి చేకూరినట్టు చెప్పారు. ఆర్ధికపరమైన ప్రతి లావాదేవీ డిజిటలైజేషన్ తోపాటుపారదర్శకంగా జరగాలన్నదే తమ అభిమతమని కేంద్ర మంత్రి వివరించారు. -
సినీఫక్కీలో మోసం
అమడగూరు : డబ్బులకోసం ఆశ పడిన మహిళలు సినీఫక్కీలో మోసపోయిన ఘటన గురువారం రెడ్డివారిపల్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళల వివరాల మేరకు.. రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బెంగుళూరులో ఒక కంపెనీలో పనిచేస్తూ యజమానికి నమ్మిన బంటుగా ఉన్నాడు. అయితే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ యజమానికి చిక్కొచ్చి పడింది. దీనికోసం ప్రసాద్‌ను పావుగా వాడుకున్నాడు. తెలిసిన వాళ్ల బ్యాంకు ఖాతాలు కావాలన్న యజమాని కోరిక మేరకు ప్రసాద్ తన సొంతూరి మహిళలను ఉపయోగించుకున్నాడు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన వారితో ఫోన్లో మాట్లాడి ఆధార్‌కార్డు, గుర్తింపుకార్డు తీసుకువస్తే డబ్బులు ఇస్తామని తెలిపాడు. దీంతో ఆశ పడి కూలి పనులు చేసుకునే 22 మంది మహిళలు బాడుగ వాహనంలో యశ్వంతపురంలోని బసవేశ్వర నగర్‌కు చేరుకుని ప్రసాద్‌ను కలిశారు. అయితే అక్కడికెళ్లగానే వేలిముద్రలు వేసేవారు అవసరం లేదని సంతకం చేసేవారే కావాలని 22 మందిలో 9 మందిని ఎంపిక చేసుకున్నారు. ఆ తొమ్మిది మందిని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి ఫొటోలు తీసి, ఒక్కొక్కరి దగ్గర 42 సంతకాలు చేయించుకున్నారు. అందులో ఖాళీ చెక్కులు కూడా ఉన్నాయి. మహిళలు అక్కడుండగానే వారి పేరు మీద ఖాతా పుస్తకాలు, ఏటీఎం కార్డులు సైతం వచ్చేశాయి. దీంతో ప్రసాద్ అందరినీ తీసుకుని రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని ప్రతి మహిళకూ రూ. 500 ఇచ్చాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న మహిళల భర్తలు తమను మోసం చేశారంటూ ప్రసాద్‌తో గొడవకు దిగారు. గురువారం పలువురి పెద్దమనుషుల తీర్మానం మేరకు బెంగుళూరుకు వెళ్లి బ్యాంకు ఖాతాలు రద్దు చేయించాలని తీర్మానించుకున్నారు. అనుకున్న ప్రకారం గురువారం మధ్యాహ్నం పెద్దమనుషులతో పాటుగా మహిళలు బెంగుళూరుకు వెళ్లి ఖాతాలు రద్దు చేయించుకున్నారు. -
ఆధార్ తప్పనిసరి
అనంతపురం ఎడ్యుకేషన్ : 2014, 2015 సంవత్సరాల్లో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్పు (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన, 9, 10 తరగతుల విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలని డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11లోగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలని, లేదంటే వారికి స్కాలర్‌షిప్పు మంజూరుకాదని వివరించారు. -
జన్‌ధన్‌లోకి 58 లక్షల పెన్షనర్ల అకౌంట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై)లోకి 58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు వెళ్లనున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సబ్సిడీలు, సంక్షేమ పథకాలన్నింటినీ ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పథకం కిందకు తీసుకు రావాలన్నది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షనర్ల ఖాతాలను జన్‌ధన్‌లోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖను కేబినెట్ సెక్రటేరియట్ కోరింది. ఈ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకునేలా చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. ఆధార్ తో అనుసంధానం చేసిన జన్‌ధన్ అకౌంట్లను ప్రధాన అకౌంట్ (సింగిల్ అకౌంట్)గా ఉపయోగించుకునేలా చూడాలని కేబినెట్ సెక్రటేరియట్ కింద పనిచేసే డీబీటీ మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్)ను కోరింది. ప్రభుత్వ పరంగా లభించే ప్రయోజనాలన్నింటినీ ఈ అకౌంట్‌కు అందించేందుకు కేబినెట్ సెక్రటేరియట్ ప్రయత్నిస్తోంది. దీంతోపాటు జన్‌ధన్ యోజన లబ్ధిదారులకు రూ. లక్ష ప్రమాద బీమాగల రూపే డెబిట్ కార్డులను అందిస్తారు. ఈ అకౌంట్ల నుంచే అన్ని ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల) ప్రయోజనాలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద అందించడానికి ఇది దోహదపడుతుంది. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 22.65 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. ఇవి రూ. 40,750 కోట్ల నిల్వను కలిగి ఉన్నాయి. -
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌తో సంబందాలున్నాయన్న ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణికి మరో షాక్ తగిలింది. ఈ బ్యూటి ఆర్థిక లావాదేవిల మీద దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మమతా కులకర్ణికి సంబందించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్‌ను సీజ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క మలాద్ బ్యాంక్ ఎకౌంట్ లోనే 67 లక్షల రూపాయల నగదు ఉండగా.. ఇతర అకౌంట్లన్నింటిలో కలిపి మరో 26 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవిలు జరపలేదని తెలిపారు. త్వరలో ఇండియాలో ఉన్న మమత ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. -
ఉపాధికీ బదిలీ
పీఎంజీవైలో కూలీలకు బ్యాంక్ ఖాతాలు సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలు తొలివిడతగా 29 మండలాల్లో అమలవుతున్న వైనం జిల్లావ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు నగదు బదిలీని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగదు బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) చర్యలు చేపట్టింది. కూలీలందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిపించి, ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయనుంది. – కాకినాడ సిటీ దశలవారీగా జిల్లాలోని 62 గ్రామీణ మండలాల్లో నగదు బదిలీని సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో డ్వామా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాల ప్రక్రియ పూర్తయితే, అన్నిచోట్లా మైక్రో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నగదు బదిలీకి నోడల్ బ్యాంక్‌గా ఆంధ్రాబ్యాంక్ వ్యవహరిస్తోంది. నోడల్ బ్యాంక్ నుంచి ఎప్పటికప్పుడు ఉపాది కూలీల సొమ్ము నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది. వారం రోజులకు ఓసారి ఖాతాకు జమయ్యే కూలీ సొమ్ము తీసుకోకపోయినా, వారి ఖాతాలో నిల్వ ఉన్నందున ఆ మొత్తానికి వడ్డీ కూడా వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆధార్ అనుసంధానంతో.. ఉపాధి హామీ పథకం ప్రారంభంలో కూలీల నుంచి వేలిముద్రలు, సంతకాలు తీసుకుని, తపాలా సిబ్బంది నగదును పంపిణీ చేసేవారు. ఈ విధానంలో అక్రమాలు జరగడంతో, ప్రభుత్వం స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టి.. బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా కూలీలకు సకాలంలో డబ్బు అందకపోవడం, ఇతర కారణాలతో చెల్లింపుల్లో మార్పులు తీసుకువచ్చి, ఆధార్ ఎనైబుల్ పేమెంట్ సిస్టం (ఆధార్ అనుసంధానం) ద్వారా పంపిణీ చేస్తున్నారు. జాబ్ కార్డులున్న వారందరికీ.. ఇప్పుడు అన్ని సబ్సిడీ పథకాను ఒక గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి ప్రత్యక్ష నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పీఎంజేడీవై లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంకులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కూలీల ఖాతాల అనుసంధాన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లాలోని 62 గ్రామీణ మండలాల్లో 1,075 పంచాయతీల్లో సుమారు 7 లక్షల మందికి ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులున్నాయి. వీరిలో 4.80 లక్షల మంది జాబ్ కార్డులను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేశారు. 117 పంచాయతీల్లో అమలు జిల్లాలో తొలి విడతగా 29 మండలాల్లోని 117 పంచాయతీల్లో 22,544 మంది కూలీలకు నగదు బదిలీ ప్రక్రియ అమలు జరుగుతోంది. త్వరలోనే రెండో విడతగా 41 పంచాయతీల్లోని 53,342 మంది కూలీలకు ఈ ప్రక్రియ అమలు చేయనున్నాం. – ఎ.నాగేశ్వరరావు, పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ========== పోలవరం నిర్వాసితుల రాస్తారోకో lరెండు గంటలు స్తంభించిన రాకపోకలు నెల్లిపాకను ముంపుగా ప్రకటించాలని డిమాండ్ పోలవరం నిర్వాసితులు, ఆందోళన, ట్రాఫిక్ఇక్కట్లు నెల్లిపాక : తమ గ్రామాన్ని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నెల్లిపాక వాసులు రోడ్డెక్కారు. 30వ నంబర్ జాతీయరహదారిపై రెండుగంటల సేపు వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో రాకపోకలు స్తంభించాయి. పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమానికి సీపీఎం, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు వలన ఎటపాక మండలంలో అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం తప్పుడు సర్వేలు చేసి కేవలం కొన్ని గ్రామాలనే ముంపు ప్రాంతాలుగా గుర్తించటం అన్యాయమని వారు పేర్కొన్నారు. తమ గ్రామాన్ని ముంపుగా గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నినాదాలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ ముంపు బాధితులకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో వివక్షచూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన విధంగానే కొత్త భూసేకరణ చట్టప్రకారం పోలవరం ముంపు బాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు నెల్లిపాక చేరుకుని రాస్తారోకో విరమింపజేశాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాంబాబు, నెల్లిపాక ఎంపీటీసీ సభ్యుడు దుద్దుకూరి సింహాద్రి, సర్పంచ్ కొర్సా రుక్మిణమ్మ, సీపీఎం మండల కార్యదర్శి ఐ. వెంకటేశ్వర్లు, కాక అర్జున్, గద్దల రమణయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
టాప్ సింగర్ బ్యాంక్ ఖాతాల పేరుతో మోసం
⇒ కొరియన్ టాప్ సింగర్ పేరుతోనూ బ్యాంక్ అకౌంట్ ⇒ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షల్లో దండుకున్న ఆన్లైన్ నేరగాళ్లు ⇒ డబ్బుల బదిలీకి ఖాతాలు వినియోగించిన నిందితులు ⇒మోసపోయిన ఐదుగురు నగరవాసులు ⇒ ముగ్గురు నిందితుల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లో నివసిస్తున్న కొరియన్ టాప్ సింగర్ బాయి సుజీ ఫొటోను ఉపయోగించి రెండు వేర్వేరు పేర్లతో రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు ఆన్లైన్ మోసగాళ్లు. ఇంటర్నెట్ నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసి ఈ తతంగాన్ని పూర్తి చేశారు. అమెరికా, కెనడాల్లో ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి రూ.లక్షలు ఈ ఖాతాలకు బదిలీ చేయించారు. తాము డబ్బులు బదిలీ చేసింది కొరియన్ టాప్ సింగ్ బాయి సుజీ బ్యాంక్ ఖాతాకు అని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడవడంతో నిరుద్యోగులు అవాక్కయ్యారు. బృంద నాయకుడు, నైజీరియన్ వాసి జేమ్స్ మార్టిన్, క్రిస్టోఫర్, లాల్‌కన్హిమి, ఐజ్వాల్, మిజోరానికి చెందిన ఎమాన్యూల్ లల్తియాగిహ్లమా తదితరులు బెంగళూర్ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. అమెరికా, కెనడా నంబర్లు వినియోగించి నిరుద్యోగులకు ఫోన్లు చేసి బడా కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారని జీడిమెట్ల, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ నేతృత్వంలోని బృందం శంషాబాద్‌లో క్రిస్టోఫర్, లాల్‌కన్హిమి, లల్తియాగిహ్లమాలను మంగళవారం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.లక్ష, 15 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, 13 పాన్‌కార్డులు, ఆరు ఓటరు ఐడీలు, 13 డ్రైవింగ్ లెసైన్స్‌లు, 22 ఏటీఎం కార్డులు, 15 సిమ్‌కార్డులు, ఆరు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలు తెరిచాక ఇళ్లు ఖాళీ.. లాల్‌కన్హిమి, ఎమాన్యూల్ లల్తియాగిహ్లమాలు శంషాబాద్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రెంటల్ అగ్రిమెంట్ కాపీ, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వివిధ బ్యాంక్‌ల్లో 70 ఖాతాలు ఓపెన్ చేశారు. బ్యాంక్ చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు తీసుకున్నాక ఆ ఇంటి నుంచి నిందితులు వెళ్లిపోయారు. ఈ బ్యాంక్ ఖాతా వివరాలను నైజీరియన్లు జేమ్స్ మార్టిన్, క్రిస్టోఫర్‌లకు తెలిపారు. దీంతో వారు ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల వివరాలు సేకరించి యూఎస్, కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు ఫోన్‌కాల్స్ చేసేవారు. బెంగళూర్ నుంచే వీరు మాట్లాడుతున్నా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు కెనడా, అమెరికా సిమ్‌లు ఉపయోగించేవారు. భారీ ప్యాకేజీతో పాటు ఇన్సూరెన్స్ కవరేజీ, ఇళ్లు, కారు, స్వదేశానికి వెళ్లేందుకు రెండు నెలల పాటు సెలవులు ఉంటాయని ఆశ కల్పించేవారు. వీరి ఉచ్చులో చిక్కుకున్న జీడిమెట్ల, ఎల్‌బీనగర్‌లకు చెందిన ఐదుగురు యువకులు తలా రూ.5 లక్షలు మోసపోయినట్లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు. వీరు కొత్త మొబైల్ ఫోన్లు, సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయిస్తామని ఓఎల్ఎక్స్లో నకిలీ ప్రకటనలు ఇచ్చి చాలా మందిని మోసగించారని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరాం, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. -
బెట్టింగ్స్ వయా బ్యాంక్ అకౌంట్స్!
* ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా * దాడి చేసి ముగ్గురిని పట్టుకున్న ఎస్ఓటీ కాప్స్ * రూ.9 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్స్ స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు తెలివిమీరుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎక్కడా పంటర్లు ‘ప్రత్యక్ష సంబంధాలు’ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠాను మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.9 లక్షల నగదు, ల్యాప్టాప్స్, టీవీ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఈ.రామ్చంద్రారెడ్డి తెలిపారు. బెట్టింగ్స్ సాంకేతిక పరిభాషలో పందాలు నిర్వహించే వాళ్లను బుకీలని, పందాలు కాసే వ్యక్తుల్ని పంటర్లనీ అంటారు. సికింద్రాబాద్‌లోని సింధి కాలనీకి చెందిన పి.మహేష్‌బాబు నేతృత్వంలో హస్మత్‌పేట్‌కు చెందిన మహేష్‌కుమార్, రసూల్పురవాసి బి.కిరణ్‌కుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ త్రయం దాదాపు ఐదేళ్లుగా బెట్టింగ్ దందా నిర్వహిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జిత్తు ద్వారా ఎప్పటికప్పుడు బెట్టింగ్ రేట్లు తెలుసుకోవడంతో పాటు ఫోన్స్ కనెక్టింగ్ బాక్స్ల్నీ సమీకరించుకున్నారు. ఈ ముగ్గురూ బెట్టింగ్స్ నిర్వహణలో ఏ కోణంలోనూ పోలీసుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్‌బాబు మల్కాజ్‌గిరిలోని వాణి నగర్లో నివసించే తన రెండో భార్య ఫ్లాట్‌నే డెన్‌గా మార్చుకున్నాడు. అక్కడే టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్లు తదితరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు బుకీలు ఇతడికి సహకరిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా బెట్టింగ్స్ అంగీకరిస్తున్న ఈ ముఠా... అందుకు సంబంధించిన డబ్బును నేరుగా తీసుకునేదికాదు. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడం, వాటి ద్వారానే బదిలీ చేయడం చేసేది. ఈ గ్యాంగ్ ఉప్పల్‌లో జరుగుతున్న మంగళవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ కోసం బెట్టింగ్స్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఓటీకి సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం వాణినగర్‌లోని ఫ్లాట్‌పై దాడి చేసి మహేష్‌బాబు, మహేష్ కుమార్, కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న జిత్తు కోసం గాలిస్తోంది. -
అందని ‘ఆసరా’
సాక్షి, హైదరాబాద్: నెలాఖరు వచ్చినా పింఛన్ కోసం పెన్షనర్లకు నిరీక్షణ తప్పడం లేదు. మార్చి ఒకటి నుంచి పంపిణీ చేయాల్సిన ఫిబ్రవరి పెన్షన్లను ఇప్పటికీ సర్కారు ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.394.11 కోట్లకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.200 కోట్లే. దీంతో ఏడు జిల్లాల్లో మాత్రమే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిధుల లేమి కారణంగా మిగిలిన నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పెన్షనర్లు మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర కేటగిరీల్లో మొత్తం 35.74 లక్షలమంది పెన్షనర్లు ఉండగా, కొన్ని నెలలుగా వీరందరికీ ఆసరా పింఛన్లు సకాలంలో అందడం లేదు. పింఛన్ పంపిణీ ఎప్పట్నుంచి ప్రారంభిస్తారనే విషయమై ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాచారం లేకపోవడంతో లక్షలాదిమంది బ్యాంకులు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దశలవారీగా బ్యాంకు ఖాతాలకు... ప్రభుత్వం నుంచి అరకొర నిధులు అందినందున, ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో బ్యాంకు ఖాతాలున్న పెన్షనర్లకు దశలవారీగా పింఛను సొమ్ము జమ చేస్తున్నామని, ఖాతాల్లేనివారికి మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం రెండ్రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని, అవి అందగానే నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామంటున్నారు. -
బ్యాంకు ఖాతాలు తెరిపిస్తానంటూ మహిళలకు టోకరా
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఎస్బీఐ బ్యాంకు శాఖ వద్ద ఓ కేటుగాడు ఎనిమిది మంది మహిళలను బురిడీ కొట్టించాడు. బాధితుల కథనం మేరకు... వంటగ్యాస్ కనెక్షన్ కోసం ఖాతాలు తెరిచేందుకు కందరాడ గ్రామానికి చెందిన ఎమిమిది మంది మహిళలు బుధవారం బ్యాంకుకు వచ్చారు. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. వారు ఎందుకు వచ్చిందీ వివరాలు తెలుసుకుని... ఏజెంట్ వచ్చేందుకు సమయం పడుతుందని, తాను ఖాతాలు తెరిపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశాడు. ఆ తర్వాత రెవెన్యూ స్టాంపులు తీసుకురావాలని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా అతడు పరారయ్యాడు. స్టాంపులతో బ్యాంకు శాఖకు తిరిగి వచ్చిన మహిళలు తాము మోసపోయామని తెలుసుకుని బ్యాంకు వారిని సంప్రదించారు. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గ్యాస్ దారిలోనే కిరోసిన్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కేంద్రం, పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాయితీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ విషయంలోకూడా ఇదే విధానాన్ని అనుసరించాలనే యోచనలో ఉంది. కిరోసిన్ సరఫరాలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు నగదు బదిలీనే ఉత్తమ మార్గమని ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు తేల్చిచెప్పగా, తాజాగా కేంద్ర వ్యయ నిర్వహణ కమిషన్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో కేంద్రం ఆ దిశగా ఆలోచన చేసింది. రాష్ట్రాల్లోని ఆయిల్ కంపెనీలను సంప్రదించి, ఆధార్, బ్యాంకు సీడింగ్ వివరాలన్నీ లెక్క తీశాక దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వంటగ్యాస్ రాయితీపై వేల కోట్లు వెచ్చిస్తున్నా అందులో 25 నుంచి 30 శాతం మేర నిధులు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో నగదు బదిలీ కోసం ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానించిన 61.99 లక్షల మంది లబ్ధిదారులకి రాయితీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఇదే విధానాన్ని కిరోసిన్‌కు వర్తింపజేయాలని గత ఏడాది కేంద్రం భావించినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనిపై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇటీవలే పెట్రోలియం శాఖ అధికారులు కిరోసిన్‌కు నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల అభిప్రాయాలను సేకరించగా వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో లీటర్ కిరోసిన్ రూ.59 వరకు ఉండగా, కేంద్రం రూ.34 రాయితీని భరించి రూ.15కే లబ్ధిదారులకు ఇస్తుంది. రాష్ట్రం పరిధిలో పంపిణీ చేస్తున్న కిరోసిన్‌పై పడుతున్న రాయితీ భారం ఏటా రూ.660 కోట్ల వరకూ ఉంటోంది. అయితే రాయితీ కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌ను అడ్డుకునేందుకు లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ చేయడమే మేలని అధికారులు సూచిం చారు. రాష్ట్రంలో ఆధార్ సీడింగ్ దాదాపు పూర్తి కావడం, 80% మందికి బ్యాంకు ఖాతాలు ఉండటంతో నగదు బదిలీని అమలు చేయడం ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపినట్లు సమాచారం. -
ఆ అధికారం మీకెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని పలు బ్యాంకులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు లేఖలు రాయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ లేఖలకు స్పందిస్తూ ఏపీ ఇంటర్ బోర్డు బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తూ ఎస్బీఐ ఎంజే మార్కెట్ శాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు లేఖ రాసే అధికారం మీకెక్కడిదని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిని నిలదీసింది. ముందూ వెనుకా చూసుకోకుండా ఏపీ బోర్డు బ్యాంకు ఖాతాను ఎలా స్తంభింపజేస్తారని ఎస్బీఐని ప్రశ్నించింది. దీనివల్ల ఫీజులు కట్టిన విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? అని తెలంగాణ బోర్డు, ఎస్బీఐలపై మండిపడింది. బ్యాంకు ఖాతా స్తంభన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యారు. తాను రాసిన లేఖలపై వివరణ ఇచ్చారు. దీనిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ బోర్డు బ్యాంకు ఖాతాల స్తంభనకు లేఖలు రాయాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తారని, విచారణను గురువారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. పూర్తి రికార్డులతో గురువారం కోర్టు ముందు హాజరు కావాలని తెలంగాణ బోర్డు కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ బ్యాంకు ఖాతాను ఎస్బీఐ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
ఈ వాలెట్‌తో లాభమేనా?
► సొంత వాలెట్లతో ముందుకొస్తున్న ఈ-కామర్స్ సంస్థలు ► ఇతర సంస్థలతో ఒప్పందంతో సెమీ క్లోజ్డ్ వాలెట్లు కూడా ► భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు ► ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు ► డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు ► దీని దృష్ట్యా అవసరం లేకున్నా డబ్బులు వేస్తే నష్టమేనని సూచన బ్యాంకు ఖాతాలు అందరికీ తెలిసినవే. ఈ ఖాతాలో డబ్బులుంటే కావాల్సినపుడు తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఖాతా ఉంటే ఆ డబ్బులతో ఆన్లైన్ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. ఈ-వాలెట్ లేదా డిజిటల్ వాలెట్లు కూడా ఇలాంటివే. ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు సాయంతో వీటిలో కొంత డబ్బు డిపాజిట్ చేసుకుని, ఆన్లైన్ లావాదేవీలకు ఆ డబ్బును వాడుకోవచ్చు. ఒకవేళ ఇదే వాలెట్‌ను మొబైల్ ద్వారా వినియోగిస్తే దాన్ని మొబైల్ వాలెట్‌గా వ్యవహరిస్తారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్. ఓలా క్యాబ్‌ను బుక్ చేసినపుడు... ఓలా మనీతో చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫరుంది... చెప్పాడు సురేష్. పేటీఎం వాలెట్‌తో రీచార్జ్ చేయిస్తే 20 శాతం అదనపు టాక్‌టైమ్ ఇస్తారట... చెప్పాడు శ్రీనివాస్. ఇవన్నీ వింటున్న అజయ్‌కి ముందు అర్థం కాలేదు. తనకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్... ఇవన్నీ తెలుసు గానీ ఈ ఓలా మనీ... పేటీఎం వాలెట్ తెలీవు. శేఖర్ ఒక్కడికే కాదు. ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ మొబైల్, ఇంటర్నెట్ వాలెట్ల గురించి చాలా మందికి తెలీదు. మరి ఈ వ్యాలెట్ల కథేంటి? వీటితో ఏం చేయొచ్చు? అసలు ఎన్ని రకాల వాలెట్లుంటాయి? ఇంతకీ ఇవి వాడటం లాభమేనా..? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్. క్లోజ్డ్ వాలెట్... క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలాంటివన్నీ క్లోజ్డ్ వాలెట్లే. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వాటిలో జరిపే లావాదేవీలకే వినియోగించాలి. వేరే లావాదేవీలకు ఉపయోగించటం కానీ, ఒకసారి వేసిన డబ్బును వెనక్కి తీసుకోవటం కానీ కుదరదు. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల నియంత్రణలో ఉంటాయి కనక వీటికి ఆర్బీఐ అనుమతి కూడా అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సెమీ క్లోజ్డ్... ఈ-వాలెట్లలో డబ్బులు డిపాజిట్ చేసుకున్నాక వీటిని ఇతర ఆన్లైన్ సైట్లలో కూడా పరిమితంగా వినియోగించుకునే అవకాశముంటుంది. కాకపోతే సదరు వాలెట్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ఏఏ కంపెనీలతో ఒప్పందాలున్నాయో ఆ కంపెనీలు మా త్రమే ఈ వాలెట్లను అనుమతిస్తాయి. వాటితో జరిపే లావాదేవీలకు మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. మొబిక్విక్, పేయు, పేటీఎం, సిట్రస్ క్యాష్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు మాత్రమే చెల్లింపులు చేయొచ్చు. పెపైచ్చు ఈ చెల్లింపుల పరిమితి కూడా రూ.10వేల లోపే. వీటిలో కూడా ఒకసారి డిపాజిట్ చేసిన సొమ్మును లావాదేవీలకు వాడుకోవాలే తప్ప విత్‌డ్రా చెయ్యలేం. ఓపెన్... ఒక ఓపెన్ వాలెట్ల విషయానికొస్తే వీటి ద్వారా డబ్బులు వెయ్యటం, విత్‌డ్రా చెయ్యటం సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేసుకోవచ్చు. వీటిలో ఉన్న సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వాలెట్లను బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. అయితే వొడాఫోన్ ఎంపైసాను సెమీక్లోజ్డ్ వాలెట్ రూపంలో కూడా ఆఫర్ చేస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్ల ద్వారా నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు. ఇక ఈ ఓపెన్ డిజిటల్ వాలెట్లు పేమెంట్ బ్యాం కుల్లాంటివేనా... అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి రుణాలివ్వటం, డిపాజిట్లు సేకరించటం కానీ చెయ్యలేవు. డెబిట్ కార్డులు కూడా జారీ చేయవు. పెపైచ్చు వీటిలో రూ.లక్ష కన్నా ఎక్కువ ఉంచలేం. ఎయిర్టెల్ మనీ, ఎయిర్‌సెల్ మొబైల్ మనీ, టాటా టెలీ ఎం-రుపీ ఇలాంటివే. డిజిటల్ వాలెట్లతో లాభాలివీ... భద్రత: నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి తాలూకు ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటాయి. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు. ఒకవేళ డిజిటల్ వాలెట్ పాస్వర్డ్ వేరొకరికి తెలిసిపోయినా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది. సులువు: ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నాయి. యాపిల్ పే మాటల్లో చెప్పాలంటే... స్టోర్లలో, ఆన్లైన్లో చెల్లింపులు ఇప్పుడున్నంత ఈజీగా ఇంతకు ముందెన్నడూ లేవు. వినూత్న డిస్కౌంట్లు: వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావటంతో పాటు లాయల్టీ పాయింట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అయి ఉంటాయి కనక... దేన్ని కొనుగోలు చేయడానికి ఏ కార్డు వాడితే బెటరనే ఆలోచన అవసరం లేదు. నష్టాలూ ఉన్నాయ్! - ఓపెన్ వాలెట్లకు ఆర్బీఐ అనుమతి ఉంటుంది. వాటిలో డబ్బులు అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక సెమీక్లోజ్డ్గానీ, క్లోజ్డ్ గానీ ఏ వాలెట్లోనైనా డబ్బులు వేస్తే మళ్లీ తీసుకునే వీలుండదు. పెపైచ్చు ఈ వాలెట్లలో దేన్లో డబ్బులు వేసినా ఎలాంటి వడ్డీ రాదన్నది గుర్తుంచుకోవాలి. అందుబాటులో ఉన్నాయి కదా అని వివిధ రకాల వ్యాలెట్లలో డబ్బులు వేసేస్తే... అవసరం పడేంత వరకూ ఆ డబ్బులు వృథాగా పడి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. - ఒకోసారి మన వాలెట్లో డబ్బులున్న కంపెనీకి బదులు వేరే కంపెనీ సేవల్ని వినియోగించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నాయి. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవనుకుందాం. మరో కంపెనీ క్యాబ్‌ను అప్పటికప్పుడు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!. అంతెందుకు! ఓలా ఇటీవల కొనుగోలు చేసిన ట్యాక్సీ ఫర్ స్యూర్ తాలూకు క్యాబ్‌లన్నీ ఓలా యాప్‌లోనే ఉంటాయి. వాటిని ఆ యాప్ నుంచే బుక్ చేసినా... చివరికి డబ్బులివ్వాల్సి వచ్చినపుడు మాత్రం ఓలా మనీ నుంచి ఇస్తామంటే కుదరదు. నేరుగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నాయి. ఏదైనా కొనాలనుకున్నపుడు వివిధ ఈకామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి? డిజిటల్ వాలెట్లలో డిపాజిట్ చేసేముందు అవి ఎంతవరకూ అవసరమవుతాయన్నది ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడో ఒకసారి పడే అవసరం కోసం ముందే డబ్బులు వేసుకుని ఉంచటం తెలివైన పని కాదనేది నిపుణుల మాట. -
ఖాతాల నుంచి రూ. 7 లక్షలు మాయం
-
ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు మాయం
హైదరాబాద్ : నగరంలోని పికెట్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు మాయమైన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. బ్యాంకులోని మొత్తం 19 మంది ఖాతాదారుల నుంచి సుమారు రూ. 7 లక్షల నగదు మాయమైంది. ఆ విషయం గమనించిన ఖాతాదారులు బ్యాంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి... ఖాతాదారులకు నగదు అందేలా చర్యలు తీసుకుంటానని బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే తంతూ నగరంలోని మరికొన్ని బ్యాంకుల్లో కూడా జరిగినట్లు సమాచారం. అయితే ముంబైకి చెందిన కొంతమంది దుండగులు ఏటీఎమ్ క్లోనింగ్ల ద్వారా ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
ఇక బ్యాంకుల ద్వారానే పింఛన్లు
- జాప్యానికి అడ్డుకట్ట.. పారదర్శకతకు పెద్దపీట - అభివృద్ధికి నమునాగా గజ్వేల్ - నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్: ఆసరా పింఛన్లను ఇక పై బ్యాంకు ఖాతాల ద్వారా అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను మంత్రి శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం పింఛన్లను పోస్టాఫీస్‌ల ద్వారా అందజేస్తున్నామని.. అయితే పంపిణీలో జాప్యం జరుగుతుందన్నారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే పారదర్శకత పెరిగే అవకాశముందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఐదు వేల జనాభాకు తప్పనిసరిగా ఓ బ్యాంకు ఉండాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. కొత్తగా ఏర్పడుతున్న బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ప్రత్యేకించి రైతులకు, మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందించి వారి ఆదరణ చూరగొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి నమునాగా మారుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే పెద్దఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని వెల్లడించారు. దేశంలోనే నంబర్-2గా పీఎన్బీ సేవల్లో తమ బ్యాంకు దేశంలోనే ఎస్బీఐ తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిందని పంజాబ్ నేషనల్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ ఛటర్జీ అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 61 శాఖలు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్పర్సన్ అరుణ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, గజ్వేల్ నేతలు ఆకుల దేవేందర్, బెండ మధు, కౌన్సిలర్లు రామదాసు, బోస్ పాల్గొన్నారు. -
‘జనధన’కు ఆర్బీఐ బూస్ట్
ముంబై: జన్‌ధన్ యోజన కింద రూ.5,000 వరకూ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్... ప్రాధాన్యతా రంగానికి రుణంగా పరిగణించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంక్ అకౌంట్లకు రూ.5,000 వరకూ ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఇవ్వాలన్నది కేంద్ర విధానం. బలహీన వర్గాలు, నిర్దిష్టంగా ప్రకటించిన కొన్ని కీలక రంగాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రుణాలుగా పేర్కొంటారు.తప్పనిసరిగా ఆయా రంగాలకు బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. తక్కువ రుణ రేటూ దీని ప్రత్యేకత. ఆధార్‌కు అనుసంధానమై, ఆరు నెలలపాటు సంతృప్తికరమైన స్థాయి లో అకౌంట్ నిర్వహణ ఉన్న జన్‌ధన్ అకౌంట్లకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం వర్తిస్తుంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ జన్‌ధన్ యోజనను ప్రారంభించారు. జనవరి 31నాటికి ఈ పథకం కింద 12.54 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. -
ఖాతాల ఏరివేతే రుణ మాఫీ
-
ఖాతాల ఏరివేతే రుణ మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక కోటీ 14 లక్షల ఖాతాలుంటే అందులో 82.66 లక్షల ఖాతాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటామంటూ.. మిగతావాటిని (31.34 లక్షల ఖాతాలు) అసలు రుణ మాఫీకి పరిగణనలోకి తీసుకోకుండానే మొదట్లోనే ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులు, ఒకే సర్వే నంబర్‌తో రెండు బ్యాంకుల్లో రుణం తీసుకున్నారా? స్థానికులా కాదా? ఎలాంటి పంటలు వేశారు? కుటుంబంలో ఒక్కరేనా కాదా? బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికే రుణం తీసుకున్నారా? వంటి రకరకాల కొర్రీలతో తొలి విడత రెండో విడత అంటూ మొత్తంమీద ఇప్పటివరకు సగానికిపైగా రైతుల ఖాతాలను రుణ మాఫీ పరిధి నుంచి ప్రభుత్వం ఏరివేసింది. రెండో దశలో 17.23 లక్షల ఖాతాలకు ఎగనామం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్‌తోపాటు రబీ సీజన్ కూడా పూర్తి అయినప్పటికీ రైతులను రుణ భారం నుంచి చంద్రబాబు సర్కారు విముక్తులను చేయలేదు. ఇప్పటివరకు మొదటి విడత పూర్తి చేశామనీ రెండో విడతలో రైతుల నుంచి పలు వివరాలు సేకరిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తోంది. అయితే మొదటి విడతలోని ఖాతాలకే ఇంకా విముక్తి లభించలేదు. ఆ రైతులపై పడిన వడ్డీ భారం సంగతేంటో తెలియదు. ఇప్పుడు రెండో విడత లెక్కలకు కూడా ప్రభుత్వం కట్టుబడటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ 4న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండోదశలో 42.23 లక్షల ఖాతాలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం 25 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే కోరుతూ ఆ మేరకు రెండో దశ జాబితాలను విడుదల చేశారు. తద్వారా 17.23 లక్షల ఖాతాలను రెండో దశలోకి అసలు పరిగణనలోకి తీసుకోకుండానే తిరస్కరించారు. ఇక 25 లక్షల ఖాతాలకుగాను కేవలం 14 లక్షల ఖాతాలకు చెందిన ఆధార్, రేషన్ కార్డు, భూమి రికార్డుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. అంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోనే 11 లక్షల రైతు ఖాతాలను తిరస్కరించారు. తొలిదశకు చెందిన ఆరు లక్షల రైతుల ఖాతాలకు ఇప్పటివరకు నయాపైసా జమ చేయలేదు. మిగిలిన ఖాతాల్లో అరకొరగా జమ చేసినా సంబంధిత రైతుల ఖాతాల్లో ఇంకా అసలు, వడ్డీ భారం అలాగే ఉంది. అదెటూ తేలకముందే ఇప్పుడు ఖాతాల్లో కోతలు పెడుతూ రెండోదశ అంటున్నారు. అందులోనూ తొలివిడతగా 20 శాతం చెల్లిస్తామన్న డబ్బు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే తప్ప ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. తొలి దశ రూ.5 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటివరకు రూ.4,300 కోట్లనే వ్యయం చేశారు. తొలి దశలో ఆరు లక్షల ఖాతాలు, రెండో దశలో వివరాలు స్వీకరించిన 14 లక్షల ఖాతాల్లో అర్హులెవరు, అనర్హులెవరో స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ నుంచి తీసే ప్రక్రియ మొదలుపెట్టారు. స్టేట్ రెసిడెంట్ డేటా హబ్.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కుటుంబం యూనిట్‌గా లెక్కిస్తుంది. ఈ ఖాతాల్లో ఆధార్, రేషన్ కార్డులు, భూమి రికార్డులు సరిగా లేనివి తిరస్కరణకు గురవుతాయి. ఈ రకమైన రకరకాల జిమ్మిక్కులతో నేరుగా రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రైతులు మాత్రం బ్యాంకుల్లో వడ్డీ పేరుకుపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని బ్యాంకులైతే రైతులు కుదవ పెట్టిన బంగారాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యాయి. అధికారం చేపట్టిన మరుక్షణమే.. తొలి సంతకంతోనే రైతుల రుణాలన్నీ మాఫీ అవుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 9 నెలలవుతోంది. రైతుల రుణాలన్నీ ఎప్పట్లాగే ఉన్నాయి. పెపైచ్చు అపరాధ వడ్డీ భారంతో రైతు నడ్డి విరిచారు. రైతుల పాసు పుస్తకాలు, బంగారు ఆభరణా లన్నీ బ్యాంకుల్లో తనఖాలోనే ఉన్నాయి. మరి ఇంతకాలం ఏం చేశారని ఒక్కసారి తరచి చూస్తే... రుణ మాఫీ పేరుతో అంతా హైడ్రామానే నడిపించారని స్పష్టమవుతుంది. చంద్రబాబు సహా మాట్లాడే ప్రతి నాయకుడూ రుణాలన్నీ మాఫీ అయ్యాయంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకూ రుణం మాఫీ కాలేదు. ఇదే బాబుగారి మార్కు మాయాజాలం. తొలి విడత, రెండో విడత... ఇలా విడతల వారీగా ఖాతాలు లెక్కించే పేరుతో కాలయాపన చేస్తున్న సర్కారు, రుణాలు మాఫీ చేయకుండానే ఖరీఫ్, ర బీ సీజన్లను విజయవంతంగా దాటేసింది. రైతులు రుణ విముక్తులు కాలేదు గానీ వారిపై మరింత రుణ భారం పడింది. రూ.50 వేల లోపు ఒకేసారి చెల్లింపులోనూ నిజం లేదు కుటుంబానికి రూ.50 వేలలోపు రుణాలను ఒకేసారి చెల్లించేశామని చెబుతున్న ప్రభుత్వ వాదనలోనూ నిజం లేదు. ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయం బయటపడింది. రూ.50 వేలలోపు రుణాలను చెల్లించినందున ఆయా రైతుల రుణ ఖాతాలను మూసివేయాలని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రైతులు తీసుకున్న రుణం కన్నా తక్కువగా చెల్లించినందున మిగతా రుణాన్ని, వడ్డీని రైతులు చెల్లిస్తేగానీ ఆ ఖాతాలను మూసివేయలేమని స్పష్టం చేశారు. దీంతో రూ.50 వేలలోపు రుణాలను కూడా ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదని తేలిపోయింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణం కన్నా తక్కువ చెల్లించడంతో ఆయా కుటుంబాలకు పూర్తిగా రుణమాఫీ జరగలేదు. దీంతో ఆ రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను, భూమి పత్రాలను బ్యాంకులు వారికి తిరిగి ఇవ్వడం లేదు. ఖాతాలను తిరస్కరించడమే రుణ మాఫీలో మాయ మొత్తం వ్యవసాయ రుణాల ఖాతాలు: 1.14 కోట్లు మొదట్లోనే తిరస్కరించిన ఖాతాలు: 31.34 లక్షలు తొలివిడత పరిగణనలోకి తీసుకున్నట్టుగా ప్రకటించిన ఖాతాలు: 82.66 లక్షలు తొలి దశలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సీఎం {పకటించిన ఖాతాలు: 40.43 లక్షలు రెండో దశలో పరిగణనలోకి తీసుకున్నట్టు బాబు చెప్పిన ఖాతాలు:42.23 లక్షలు రెండో దశలో విడుదలైన జాబితాల్లోని వాస్తవ ఖాతాలు: 25 లక్షలు అంటే రెండో దశలో ఏరివేసిన ఖాతాలు: 17.23 లక్షలు తీరా రెండో దశ 25 లక్షల ఖాతాల్లో 14 లక్షల ఖాతాల వివరాలే స్వీకరణ వివిధ కారణాలతో తిరస్కరించిన ఖాతాలు: మరో 11 లక్షలు స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌లో వేశాక మరిన్ని ఖాతాలకు ఎగనామం -
మోదీ జన్ధన్యోజనకు గిన్నిస్ రికార్డు
-
బ్యాంకింగ్ వ్యవస్థలోకి 99.74 శాతం కుటుంబాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన ధన యోజన కింద ఇప్పటికి దాదాపు 11.5 కోట్ల బ్యాంక్ ఖాతాలు ప్రారంభమైనట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం తెలిపారు. లక్ష్యం 10 కోట్లకన్నా ఇది అధికమన్న విషయాన్ని ఆర్థికమంత్రి గుర్తుచేసారు. పాత ఖాతాలతో సహా తాజా జనధన ఖాతాలతో 99.74 శాతం కుటుంబాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ప్రారంభమైనట్లయ్యిందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు. భారత్ యావత్తూ దాదాపు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించినట్లయ్యిందని కూడా పేర్కొన్నారు. జన ధన అకౌంట్లలో రూ.9,000 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. దేశంలో ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా జన ధన పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2015 జనవరి 26 నాటికి పేదల చేత 7.5 కోట్ల అకౌంట్లను ప్రారంభించాలన్నది ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం. ఆ తర్వాత లక్ష్యాన్ని 10 కోట్లకు పెంచారు. గిన్నిస్ రికార్డు... ఇదిలావుండగా ప్రధాని జనధన యోజన కింద ఒకేవారంలో అత్యధిక బ్యాంకు అకౌంట్లు ప్రారంభం కావడం గిన్నిస్ రికార్డుల్లో కూడా నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హాస్ముఖ్ అధియా తెలిపారు. 2014 ఆగస్టు 23 నుంచి 29వ తేదీల మధ్య 1,80,96,130 అకౌంట్లు ప్రారంభమయ్యాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖకు వరల్డ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం లభించిందన్నారు. గొప్ప మార్పు: ప్రధాని జన్‌ధన్ యోజన మంచి ఫలితాలను సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్వీట్ చేశారు. కేవలం నాలుగు నెలల్లో ఈ విజయాన్ని సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరి భాగస్వామ్యం దేశ ఆర్థిక విజయానికి దోహదపడే అంశమని పేర్కొన్నారు. -
బ్యాంకు అకౌంట్లు నిలిపేయడం దారుణం: గంటా
విశాఖపట్నం: ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు అకౌంట్లు నిలిపివేయడం దారుణమని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కేసీఆర్ కు అభివృద్ధికంటే వివాదాలంటేనే ఇష్టమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్నింటినీ అంగీకరిస్తున్నామన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా ముందుగా ప్రకటించిన తేదీలోనే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఐఐఎమ్ కు గంభీరంలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. భూములు నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందిస్తామన్నారు. ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్ ను వేరొక చోటుకు తరలిస్తామన్నారు. -
ఇదేం మెలిక !
బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే గ్యాస్ సిలిండర్ జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు : 5,84,544 ఏజెన్సీలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 4,58,992 బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 3,14,308 పండగపూట కూడా...గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఆధార్‌తోపాటు బ్యాంకు ఖాతాలు సమర్పించిన వారికే సిలిండర్లు ఇస్తున్నారు. మూడునెలల దాకా గడువు ఉన్నా జిల్లా అధికారుల తొందరపాటు చర్యల కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -నల్లగొండ పండగ పూట గ్యాస్ వినియోగదారుల కష్టాలు నల్లగొండ: సంక్రాంతికి ముందుగానే ప్రజలు వంటగ్యాస్ కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండగ సెలవులు మూడు రోజులు అయినప్పటికి అంతకంటే ముందుగానే రెండో శనివారం, ఆదివారాలు కూడా సెలవు దినాలు కావడంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం సందడి చేస్తోంది. అయితే సంక్రాంతి రోజున రకరకాల పిండివంటలు చేసుకుద్దామంటే ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతున్నాయి. జిల్లా అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లుకు ఆధార్‌నంబర్లు తప్పని సరిగా సమర్పించాలి. దీంతోపాటు బ్యాంకు ఖాతాల నంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నెల నుంచే జిల్లాలో నగదు బదిలీ పథకం ఆరంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే ఏజెన్సీలు రీఫిల్ ఇస్తున్నారు. అదేమంటే జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో పండుగపూట ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల తొందరపాటు... నగదు బదిలీ పథకం ప్రారంభమైన నాటినుంచి మూడు మాసాల్లోగా బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు కేంద్ర వెసులుబాటు కల్పించింది. కానీ ఏజెన్సీల ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ రీఫిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. గుట్టచప్పుడు కాకుండా జారీ అయిన ఈ ఉత్తర్వులను బయటకు పొక్కనీయకుండా ఏజెన్సీలు తమ ప్రతాపాన్ని వినియోగదారులపై చూపుతున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇవ్వకుండా సిలిండర్ తెచ్చుకునేందుకు వెళ్లిన వినియోగదారులకు ఏజెన్సీలు ఈ ఉత్తర్వులను చూపించి గ్యాస్ ఇవ్వకుండా తిప్పిపంపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గడువు మేరకు మార్చి నెలాఖరులోగా వినియోగదారులు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ సీడింగ్ పూర్తిచేయాలి. నత్తనడకన ఆధార్ సీడింగ్.. జిల్లాలో మొత్తం 5.84 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 4.58 లక్షల కనె క్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానమయ్యాయి. ఇంకా 1,25,552 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 3.14 లక్షల కనెక్షన్లు మాత్రమే సీడింగ్ పూర్తయ్యాయి. ఆధార్ సీడింగ్ పూర్తయి ఏజెన్సీలకు బ్యాంకు ఖాతానంబర్లు ఇవ్వాల్సిన కనెక్షన్లు 1.44 లక్షలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా పూర్తికావడానికి మూడు మాసాల వరకు గడువు ఉంది. కానీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఏజెన్సీలు గ్యాస్ రీఫిల్ ఇవ్వకుండా కొత్త సమస్య సృష్టిస్తున్నారు. -
అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే క్రిమినల్ చర్యలు
బ్యాంకులకు ఏపీ ఉన్నత విద్యామండలి లేఖ సాక్షి, హైదరాబాద్: తమ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆయా బ్యాంకులపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఖాతాలను స్తంభింపచేసేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో.. ఆ బ్యాంకు అధికారులకు మండలి ఘాటైన పదజాలంతో ప్రత్యుత్తరమిచ్చింది. ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆలోచనలు చేస్తోంది. మరికొన్ని అకౌంట్లపైనా టి.మండలి లేఖలు:ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన అకౌంట్లను కూడా స్తంభింపచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యామండలి మరికొన్ని ఇతర బ్యాంకులకు లేఖలు పంపింది. శుక్రవారం శాంతినగర్ ఎస్బీఐ శాఖకు తెలంగాణ మండలి లేఖ పంపింది.