How To Get Back Money After Transferred To Wrong Bank Account In Telugu - Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ అకౌంట్‌కు పొరపాటున డబ్బులు పంపారా? తిరిగి పొందాలంటే!

Published Sun, Dec 26 2021 2:46 PM | Last Updated on Sun, Dec 26 2021 3:41 PM

How To Get Your Money Back If Transferred Money To Wrong Account - Sakshi

ప్రస్తుతం ఒమిక్రాన్‌ కారణంగా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆన్‌లైన్‌లో నెఫ్ట్‌/ఆర్టీజీఎస్‌, యూపీఐ, గూగుల్‌పే, బీమ్‌ యాప్‌తో పాటు ఇతర బ్యాంకింగ్‌ సేవల్ని సులభంగా చేసుకోవచ్చు. దీంతో డబ్బులు డ్రా చేసేందుకు, డిపాజిట్‌ చేసేందుకు బ్యాంక్‌ల ఎదుట క్యూ కట్టే అవకాశం లేకుండా సెకన్ల వ్యవధిలో డబ్బుల్ని ఆన్‌లైన్‌ ద్వారా పంపే వెసలు బాటు ఉంది. అయితే ఆన్‌లైన్‌లో డబ్బు పంపడం, తీసుకోవడం చాలా సులభమే. ఒక్కోసారి  ఆన్‌లైట్‌ ట్రాన్సాక్షన్‌లలో తప్పులు దొర్లుతుంటాయి. ఒకరికి పంపాల్సిన డబ్బుల్ని మరొకరికి పంపిస్తుంటాం. తెగ హైరానా పడిపోతుంటాం. ఈ సింపుల్‌ ప్రొసీజర్‌ను ఫాలో అయితే చాలు మీరు తప్పుగా పంపిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. 

డబ్బును తిరిగి పొందాలంటే?

ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే సమయంలో మీరు పంపే బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ తప్పుంటే..డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయలేం. అందుకే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసే సమయంలో జాగ్రత్తగా అకౌంట్‌ నెంబర్‌ చెక్‌ చేసి పంపాలి. అయినా కొన్ని బ్యాంక్‌ అకౌంట్‌లలో మాత్రం మీరు పంపాలనుకున్నవారికి మాత్రమే కాకుండా వేరే వాళ్లకు ట్రాన్స్‌ ఫర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. పంపే ముందు ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌ చెక్‌ చేసుకోవాలి. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ కరెక్ట్‌ గా ఉన్నా ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ కరెక్ట్‌గా లేకపోతే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవ్వవు.  

► ఒకవేళ  డబ్బులు గుర్తు తెలియని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయితే వెంటనే బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేయండి. 

► మీరు ఏ అకౌంట్‌కు డబ్బులు పంపారో ఆ అకౌంట్‌ నెంబర్‌ చెప్పండి. 

► కస్టమర్‌ కేర్‌లో ఫిర్యాదు చేయండి.  

► లావాదేవీ తేదీ, సమయం, అలాగే మీ అకౌంట్‌  నెంబర్, డబ్బుల ట్రాన్స్‌ ఫర్‌ చేసిన అకౌంట్‌ నెంబర్‌ను నోట్‌ చేసుకోండి. 

► సంబధిత బ్యాంక్‌ను సందర్శించి  బ్యాంక్‌ వివరాలతో పాటు తప్పుగా వేరే బ్యాంక్‌ అకౌంట్‌కు  ట్రాన్స్‌ ఫర్‌ చేశామని ఓ లెటర్‌ రాయిలి. 

► మనం పైన చెప్పుకున్నట్లుగా మీరు ఎవరికైతే తప్పుగా పంపారో స్క్రీన్‌ షాట్‌లను ఆ లెటర్‌కు అటాచ్‌ చేయాలి. 

► దీంతో బ్యాంక్‌ అధికారులు మీకు సంబంధిత అకౌంట్‌ హోల్డర్‌ వివరాల్ని అందిస్తారు. 

► అదే బ్యాంక్‌ బ్రాంచ్‌ అయినట్లేతే నేరుగా పంపిన డబ్బుల్ని తిరిగి మీ అకౌంట్‌ పంపాలని బ్యాంక్‌ అధికారులు రిక్వెస్ట్‌ పంపిస్తారు.  

► అది వేరే బ్యాంక్‌ అయితే మీరు ఎవరికైతే పంపారో వారి బ్యాంక్‌ను సందర్శించి లెటర్‌,ఈమెయిల్‌, స్క్రీన్‌షాట్‌లను సబ్మిట్‌ చేయాలి. 

► మీరు ఇచ్చిన వివరాలు చెక్‌ చేసుకొని ఆ బ్యాంక్‌ అధికారులు సంబంధిత బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్‌కు కాల్‌ చేసి డబ్బులు తిరిగి పంపాలని రిక్వెస్ట్‌ చేస్తారు. 

► అలా రిక్వెస్ట్‌ చేసిన వెంటనే బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్‌ బ్యాంక్‌ నిర్దేశించిన రోజుల్లో డబ్బులు తిరిగి మీ అకౌంట్‌కు పంపిస్తాడు.

► అప్పటికి పంపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం.  

అకౌంట్‌ హోల్డర్‌  ప్రమేయం లేకుండా డబ్బుల్ని తీసుకోలేమా? 

మీరు తప్పుగా పంపిన బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్‌ అనుమతి లేకుండా డబ్బుల్ని తిరిగి తీసుకోవడం అసాధ్యం. కానీ అకౌంట్‌ హోల్డర్‌కి మీరు పొరపాటున డబ్బులు పంపించారని సదరు అకౌంట్‌ హోల్డర్‌ అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తిరిగి డబ్బుల్ని తీసుకోవడం సాధ్యమవుతుంది.  

చదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే.. మీ ఆధార్‌ కార్డు సేఫ్‌..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement