న్యూఢిల్లీ: సుమారు ఏడున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో గత ఏడాది చివరి నాటికి డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 44.23 కోట్లకు పైగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎమ్ జెడివై) ఖాతాల్లో మొత్తం బ్యాలెన్స్ డిసెంబర్ చివరి, 2021 నాటికి రూ.1,50,939.36 కోట్లుగా ఉంది. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రకటించారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. మొత్తం 44.23 కోట్ల ఖాతాల్లో 34.9 కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలో, 8.05 కోట్ల ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో, మిగిలిన 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉన్నాయి. అలాగే, 31.28 కోట్ల మంది పిఎంజెడివై లబ్ధిదారులకు రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు. డిసెంబర్ 29, 2021 నాటికి దాదాపు 24.61 కోట్ల మంది మహిళలకు ఖాతాలు ఉన్నాయి. ఈ పథకం మొదటి సంవత్సరంలో 17.90 కోట్లు పిఎంజెడివై ఖాతాలు తెరవబడ్డాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) మార్గదర్శకాల ప్రకారం.. జన్ ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బిఎస్బిడి) ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 8, 2021 నాటికి మొత్తం సున్నా బ్యాలెన్స్ గల ఖాతాల సంఖ్య 3.65 కోట్లు. ఈ ఖాతాలలో మొత్తం జన్ ధన్ ఖాతాలలో 8.3 శాతం. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) పథకం.
(చదవండి: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్...! ఈ లింకుల పట్ల జాగ్రత్త..! లేకపోతే..)
Comments
Please login to add a commentAdd a comment