గనుల కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు అవసరం | mining labour must open bank accounts | Sakshi
Sakshi News home page

గనుల కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు అవసరం

Published Sat, Dec 17 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

గనుల కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు అవసరం

గనుల కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు అవసరం

సైదాపురం: జిల్లాలోని మైనింగ్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ సేప్టీ అధికారి నీరజ్‌కుమార్‌ పేర్కొన్నారు. కలిచేడు వీటీసీ కేంద్రంలో శుక్రవారం జిల్లాలోని మైనింగ్‌ పరిశ్రమల కార్మికులు, యాజమానులు, సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

సైదాపురం: జిల్లాలోని మైనింగ్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంక్‌ ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌  మైన్స్‌ అండ్‌ సేప్టీ అధికారి నీరజ్‌కుమార్‌ పేర్కొన్నారు. కలిచేడు వీటీసీ కేంద్రంలో శుక్రవారం జిల్లాలోని మైనింగ్‌ పరిశ్రమల కార్మికులు, యాజమానులు, సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇక నుంచి మైనింగ్‌ పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని కోరారు. అనంతరం కల్యాణరామ మైకామైన్‌ యాజమాని సర్వజ్ఞకుమార కృష్ణయాచేంద్ర మాట్లాడారు. ప్రస్తుతం మైనింగ్‌ పరిశ్రమపై పెద్దనోట్ల ప్రభావం తీవ్రంగా చూపిందన్నారు. గతంలో నగదును డ్రా చేసి కూలీలసు ఇచ్చేవాళ్లమని, అయితే ఇప్పుడు నగదు కొరతతో వేతనాలను చెల్లించేందుకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఇక నుంచి వేతనాలను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ద్వారకానాథ్‌రెడ్డి, చిత్తరంజన్‌దాస్, భరత్‌బాబు, సురేష్‌రెడ్డి, మేనేజర్లు తిరుమలయ్య, వాసు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement