మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్‌లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా?
మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్‌కు స్వీప్ - ఇన్ ఎఫ్‌డీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్‌లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఆ అకౌంట్‌ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్‌గాను, వినియోగించకపోతే ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్‌లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ స్వీప్-ఇన్
స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్‌లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్‌ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్‌పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది.
స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది?
కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్‌ను .. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది.
స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు
అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment