deposit
-
డిపాజిట్లా.. స్టాక్మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?
చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.1. పోస్ట్ఆఫీస్వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.* ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. * చాలా తక్కువ రాబడి. * పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. * డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. * ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు. * ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.2. బ్యాంకు డిపాజిట్వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. * ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. * తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) చార్జీలు వసూలు చేస్తారు.* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు. * మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.3. స్టాక్ మార్కెట్కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. * డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. * పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. * పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం). * మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. * బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్‌కు మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. * చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్‌కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దుసేల్ డీడ్‌లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్ఐపీ) కాంబో ప్రొడక్ట్సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్మెంట్లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్ఐపీను డిజిటల్‌గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.తాజా ప్రొడక్టులు జన్ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది. -
రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి. బ్యాంకులు– ఫిన్‌టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు. -
తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్ఎఫ్బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌ఎఫ్‌బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్మరిన్ని విశేషాలు..నెట్‌వర్క్‌పరంగా ఎస్‌ఎఫ్‌బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది. తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్ఎఫ్బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.ఎస్ఎఫ్బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి. -
డిపాజిట్ల పెంపుపైనే దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) డిపాజిట్ వృద్ధిని మెరుగుపరచాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థికమంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో బ్యాంకింగ్ పనితీరు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత కొన్ని నెలల్లో రుణ వృద్ధి కంటే డిపాజిట్ల పరుగు 300–400 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితి బ్యాంకులకు అసెట్–లయబిలిటీ (రుణాలు–డిపాజిట్లు) అసమతుల్యతను సృష్టిస్తోంది. ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తి వల్లే...ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంవల్లే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి రేటు పడిపోతోందన్న ఆందోళనలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇటీవలే స్వయంగా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని ఆయన కోరారు. ‘పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్–రిటైల్ డిపాజిట్లు, ఇతర సాధనాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. డిపాజిట్లు పెరక్కపోవడం బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలకు గురిచేసే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు. రిటైల్ కస్టమర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్న ఆయన, ఫలితంగా బ్యాంకులు రుణ వృద్ధికి వెనుకంజలో ఉన్న డిపాజిట్లతో నిధుల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆరి్థకమంత్రి డిపాజిట్లపైనే ప్రత్యేకించి దిశా నిర్దేశం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో చర్చనీయాంశలను ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సమీక్షా సమావేశ ముఖ్యాంశాలు.. 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి సమీక్ష సమావేశం ఇది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతోసహా ప్రభుత్వం వివిధ ప్రధాన పథకాల అమలులో బ్యాంకుల ఆరి్థక పనితీరు, పురోగతిని ఆర్థిక మంత్రి సమీక్షించారు.కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించాలని, వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్ వృద్ధి వేగాన్ని పెంచాలని బ్యాంకుల చీఫ్‌ను ఆర్థిక మంత్రి కోరారు.సమర్థవంతమైన కస్టమర్ సేవల డెలివరీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉండాలని సీతారామన్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఉద్యోగులు తమ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేలా చూడాలని ఆమె బ్యాంకులను కోరారు.వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ బ్యాంకింగ్‌కు స్వేచ్ఛనిచ్చిందని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆమె సూచించారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే నష్టాలపై కూడా ఈ సమీక్షా సమావేశం చర్చించింది. మోసం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన సమస్యలు అలాగే మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పురోగతికి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై హర్షం2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. దాదాపు రూ.1 లక్ష కోట్ల అధిక బేస్‌పై గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కలిసి 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ఎక్స్ఛేంజీల్లో ప్రచురితమైన సంఖ్యల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.141,203 కోట్ల మొత్తం లాభంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటానే 40 శాతానికి పైగా ఉంది. ఎస్బీఐ ఆర్జిత లాభం రూ.61,077 కోట్లయితే, వార్షిక వృద్ధి 22 శాతం. 2022–23లో ఈ వృద్ధి రూ.50,232 కోట్లు. 2023–24 ఆరి్థక సంవత్సరం అన్ని వ్యాపార అంశాల్లో బ్యాంకింగ్ మెరుగైన పనితీరును ప్రదర్శించడంపట్ల తాజా సమీక్షా సమావేశంలో హర్షం వ్యక్తం అయ్యింది. నికర మొండిబకాయిలు 0.76 శాతానికి తగ్గడం, మూలధన నిష్పత్తి తగిన స్థాయిలో 15.15 శాతంగా నమోదుకావడం, నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం) 3.22 శాతంగా నమోదుకావడం, షేర్ హోల్డర్లకు రూ.27,830 కోట్ల డివిడెండ్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సానుకూల అంశాలు మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయని సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో డీఎఫ్ఎస్ సెక్రటరీ వివేక్ జోషి, సెక్రటరీ డిజిగ్నేటెడ్ ఎం నాగరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (డీఎఫ్ఎస్) సీనియర్ అధికారులు పాల్గొన్నారు.అధిక వడ్డీ మార్గాలపై యువత దృష్టి: ఎస్బీఐదేశంలోని యువ జనాభా బ్యాంకింగ్ డిపాజిట్లపై కాకుండా అధిక వడ్డీరేటు లభించే ఇతర మార్గాలను అన్వేషిస్తోందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తల నివేదిక తాజాగా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని దాదాపు సగం టర్మ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లవేనని పేర్కొన్న నివేదిక, రుణ వృద్ధి రేటుతో పోటీగా డిపాజిట్ల వృద్ధి రేటుకు దోహదపడ్డానికి డిపాజిట్లపై పన్ను విధానంలో మార్పులు అవసరమని స్పష్టం చేసింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే, డిపాజిట్ల వృద్ధి రూ.61 లక్షల కోట్లయితే, రుణ వృద్ధి 59 లక్షల కోట్లుగా ఉందని పేర్కొనడం గమనార్హం. గడచిన 26 నెలల్లో డిపాజిట్ల స్పీడ్ మందగమనం ఉందని ఆర్బీఐ 2024 జూన్‌లో విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, గడచిన కాలం చూస్తే మూడు నుంచి నాలుగేళ్లు డిపాజిట్ల వృద్ది రేటుకన్నా, రుణ వృద్ధి స్పీడ్‌గా ఉన్న చరిత్ర ఉందని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన తాజా పరిస్థితి (డిపాజిట్ల మందగమనం) 2025 జూన్–అక్టోబర్ మధ్య ముగిసే అవకాశం ఉందని అంచనావేసింది. తాజా డిపాజిట్–రుణ పరిస్థితి ఇదీ..ఈ ఏడాది జూలై 12 నాటికి వార్షికంగా చూస్తే, బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుత తక్కువ వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందన్నది ప్రధాన విశ్లేషణ. ఆర్ఆర్బీల సేవలు పెరగాలిసూక్ష్మ, లఘు, మధ్య, చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రొడక్టులను రూపొందించాలని ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులు (ఆర్ఆర్బీ), వాటి స్పాన్సర్డ్ బ్యాంకుల సీఈఓలకు ఆర్థిక మంత్రి ఈ సమీక్షా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. వాటికి రుణ లభ్యత సకాలంలో లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణ ఫోర్ట్‌ఫోలియోను పెంచడానికి అపారమైన అవకాశాలు ఉన్న వస్త్ర, చెక్క ఫర్నీచర్, తోలు, ఆహార ప్రాసెసింగ్ వంటి చిన్న సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. అలాగే సాంకేతిక రంగంలో పురోగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు. -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎస్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.ఐడీఎఫ్సీఐడీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయిబ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.ఆర్బీఎల్లో వడ్డీ రేట్లు ఆర్బీఎల్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఆర్బీఎల్ బ్యాంక్ 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్‌పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50 -
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్‌వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి డిపాజిట్ ఎలా కట్టాడో తెలుసా?
ప్రతి ఎన్నికలలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జబల్పూర్ వ్యక్తి కూడా ఇలాగే వార్తల్లో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా జబల్పూర్లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వినయ్ చక్రవర్తి ఎన్నికల డిపాజిట్‌ను చిల్లర నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ ఫారమ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడానికి రూ. 25,000 నాణేలతో బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు. రూ. 10, రూ. 5, రూ. 2 నాణేల రూపంలో రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్, ఆన్లైన్ విధానంలో డిపాజిట్ చెల్లించే సౌకర్యం లేదని అందుకే తన వద్ద ఉన్న నాణేల రూపంలో డిపాజిట్ చెల్లించానని చక్రవర్తి తెలిపారు. దీనిపై జబల్పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ, అభ్యర్థి నాణేలలో రూపంలో చెల్లించిన డిపాజిట్‌ను స్వీకరించి దానికి సంబంధించిన రశీదును అతనికి అందించినట్లు చెప్పారు. లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని అరడజను స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఈ బ్యాంకుల్లో 2 సంవత్సరాల డిపాజిట్లపై 7.25% వడ్డీ
-
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్‌సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్‌కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్‌పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్‌పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
ఆర్బీఐ కార్యాలయాల ముందు క్యూ
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్పిడి, డిపాజిట్‌కు సెపె్టంబర్ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?
తమిళనాడులోని పళనికి చెందిన రాజ్‌కుమార్ అనే డ్రైవర్‌కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్ ఎదురైనా అనుభవం ఇది. ఇంతకీ ఏమైంది అంటే.. రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక ఎగిరి గంతేశాడు. కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం తూత్తుకుడి బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్‌కి ట్రాన్సఫర్ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్‌కుమార్ లాయర్లతో బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
ఇంకా రూ. లక్ష కోట్లు రావాలి! రూ.2 వేల నోట్లపై కీలక సమాచారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించిన రూ. 2,000 కరెన్సీ నోట్లను సెప్టెంబర్ చివరి నాటికి మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరిన ఆర్బీఐ ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. కాగా ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కివచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మొత్తంగా రూ.3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉండగా మూడింట రెండు వంతులకు పైగా నోట్లు తిరిగి వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా రూ.2,000 నోట్లను వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఈ స్కీమ్ గడువు పెంపు!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్నిఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాస్తవానికి 2023 జూన్ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
వ్యాల్యూ స్టాక్ గుర్తించడం ఎలా?
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్‌టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
Amrit Kalash : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 400 రోజుల గడువు కలిగిన ఈ ప్లాన్ వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
రక్షణ ‘ఫిక్స్డ్’.. రాబడి కాదు!
ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ డిపాజిట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్బీఐ ‘డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే. ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు. నికర రాబడి సున్నా.. ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్‌కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్డీపై ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీలపై ఎస్బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్డీలపై ఎస్బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు, ఆర్బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది. రక్షణ ఒక్కటే కాదు.. నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్డీలు లిక్విడ్ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్డీపై రుణం (లోన్ ఎగైనెస్ట్ డిపాజిట్/ఓవర్‌డ్రాఫ్ట్) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్డీలు ఒక్కటే లిక్విడ్ సాధనం అనుకోవడానికి లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లిక్విడ్ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్‌లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు. లక్ష్యానికి అనుగుణంగానే.. కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్ పథకాలు, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు, ఈటీఎఫ్‌లు, ఈఎల్ఎస్ఎస్లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్, లో డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఎఫ్డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్‌డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎఫ్డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీడియం టు లాంగ్ డ్యురేషన్ నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్ ఫండ్స్ స్థాయిలోనే ఉంటాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ఇవి గుర్తు పెట్టుకోవాలి.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే ఫండ్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్ తీసుకుని డెట్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్‌కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కార్పొరేట్/ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు కార్పొరేట్, ఎన్బీఎఫ్సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది. మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు. పీపీఎఫ్ అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. వీపీఎఫ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో కింద భవిష్యనిధి స్కీమ్ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్‌కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ బ్యాలన్స్‌పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్‌లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు డెట్ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ హబ్రిడ్ ఫండ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసేవి అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు. వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్ ఫండ్స్ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలు, డెట్‌కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్/మిడ్‌క్యాప్/స్మాల్‌క్యాప్ లార్జ్‌క్యాప్ కంపెనీలు ఎలాంటి మార్కెట్ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక. రిస్క్ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్ తీసుకునే వారు మిడ్‌క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్‌క్యాప్ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు.