కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు అనంతరం ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడు రోజుల్లో 240.90 లక్షల నగదు డిపాజిట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నవంబర్ 10 నుంచీ బ్యాంకులు లావాదేవీలు జరిపారుు. అరుుతే 14వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు.