Cancel big notes
-
ఆదాయం ఢమాల్..
⇒ఆబ్కారీ శాఖ మినహా.. సర్కారీ విభాగాల కుదేలు ⇒పెద్ద నోట్ల రద్దుతో భారీ గండి ⇒లక్ష్య సాధనలో చతికిలబడ్డ శాఖలు సిటీబ్యూరో: ఆదాయార్జనలో నగరంలోని పలు ప్రభుత్వ విభాగాలు చతికిలపడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆబ్కారీ శాఖ మినహా.. రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఈ శాఖలు ఆర్జించిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. పెద్దనోట్ల రద్దు దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సకల వ్యాపార, వాణిజ్య రంగాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యానికి భారీగా గండిపడింది. ఆర్టీఏ ఆదాయానికి బ్రేకులు.. ఈ ఏడాది (2016–2017) రవాణాశాఖ ఆదాయానికి బ్రేకులు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గడంతో పాటు.. జీవితకాల పన్నుపై భారీగా ప్రభావం చూపాయి. త్రైమాసిక పన్ను కూడా కొంతమేర తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం లక్ష్యంలో 85 శాతమే సాధించగలిగారు. అంటే అనుకున్న లక్ష్యంలో 15 శాతం మేర కోత పడింది. తగ్గిన ‘వాణిజ్య పన్నుల’ రాబడి గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్య సాధనలో వెనుకబడింది. 2016–17లో సుమారు రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ మార్చి చివరి నాటికి కేవలం రూ.19 వేల కోట్లతో సరిపెటుకొంది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో మహానగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, సిటీలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి నుంచే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. కానీ, అధికారులు చేతివాటం, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంతో ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ తీరును కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. లక్ష్యం చేరని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సైతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడింది. 2016–17లో గ్రేటర్లో రూ.3 వేల కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ మార్చి చివరికి రూ.2400 కోట్లకు మించలేదు. పెద్దనోట్ల రద్దు, కరెన్సీ కట్టడితో స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు (డీఆర్) ఉండగా అందులో మహానగరంలో నాలుగు డీఆర్ పరిధులు ఉన్నాయి. వీటిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం ఉంది. కానీ, ఈ ఏడాది వరుసగా ఐదు మాసాలుగా స్థిరాస్తి రంగం స్తబ్ధతగా మారడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖపై పడినట్లయింది. -
జీహెచ్ఎంసీ ఆల్‌టైమ్ రికార్డ్
⇒పెరిగిన ఆస్తిపన్ను వసూళ్లు ⇒గత ఆర్థిక సంవత్సరం రూ.1025 కోట్లు ⇒ఈ మార్చి 30 నాటికి రూ.1137 కోట్లు ⇒నేడు అర్ధరాత్రి వరకు సీఎస్సీల సేవలు సిటీబ్యూరో: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురిపించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆస్తిపన్నుగా రూ.180 కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెల చివరి వారం.. చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ పన్ను వసూలయ్యేది. మార్చి 31న ఒక్కరోజే రూ.వందకోట్లకు పైగా వసూలైన ఘటనలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో పన్ను బకాయిలపై వడ్డీ రద్దు చేయడం వంటి కారణాలతో ప్రజలు చివరి వరకు వేచి చూసేవారు. ఈసారి వడ్డీ మాఫీ ఉండదని ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. పెద్దనోట్లరద్దు, వడ్డీ మాఫీ ఉండదని తెలియజేయడంతో ఆస్తిపన్ను చెల్లించేవారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే చెల్లింపులు చేశారు. ఇంకా చెల్లించని వారుంటే గతంలో మాదిరిగా చివరిరోజు చెల్లిస్తారని భావిస్తున్నారు. ఇలా మరో రూ.50 కోట్లకు పైగా వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఆస్తిపన్ను వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.1200 కోట్లకు చేరే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. అర్ధరాత్రి వరకు సీఎస్సీలు సేవలు ఆస్తిపన్ను చెల్లింపునకు శుక్రవారం చివరిరోజు కావడంతో జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఆన్లైన్లో చెల్లించండి.. ఆస్తిపన్ను చెల్లింపునకు చివరి రోజైన శుక్రవారం సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో అధిక రద్దీ ఉండే దృష్ట్యా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఇందుకు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inÌZలోని పేమెంట్స్ ట్యాబ్‌పై క్లిక్‌చేసి, అందులోని సూచనలకు అనుగుణంగా పన్ను చెల్లించవచ్చని విజ్ఞప్తి చేశారు. -
7 రోజుల్లో... రూ.1,14,139 కోట్లు
-
క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు తగ్గాయ్
30 శాతం వరకు క్షీణత కరెన్సీ నోట్ల రద్దే కారణం న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు వచ్చే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్లు తగ్గారుు. దాదాపు 30 శాతం వరకు క్షీణించారుు. సీవోడీలు తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వపు నిర్ణయాన్ని ఆయా ఈ-కామర్స్ ఆహ్వానించడం విశేషం. నోట్ల రద్దు చర్య దీర్ఘకాలంలో పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారుు. ‘కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పుడు అమ్మకాలు తగ్గారుు. కానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అర్డర్లు క్రమంగా పెరగుతున్నారుు’ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ తెలిపారు. సీవోడీ ఆర్డర్లు దాదాపు 30 శాతానికి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. తమ సీవోడీ ఆర్డర్లు 15 శాతంమేర క్షీణించాయని షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ సేథి తెలిపారు. 30 శాతానికి ఆర్డర్లు: మొత్తం విక్రయాల్లో సీవోడీ ఆర్డర్లు 30%కి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు ఒకానొక సందర్భంలో సంస్థ మొత్తం అమ్మకాల్లో 70%కి చేరారుు. ఇవి తర్వాత 50%కి పడ్డారుు. కానీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆర్డర్లు ఒక్కసారిగా దాదాపు 30%కి క్షీణించారుు. ఇప్పుడు అరుుతే స్వల్పంగా పెరిగారుు. ఆర్డర్లు త్వరలోనే యథాస్థారుుకి చేరుతాయని భావిస్తున్నాం’ అని వివరించారు. సేవలు యథాతథం: కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన అనంతరం అమెజాన్, పేటీఎం వంటి సంస్థలు వాటి సీవోడీ ఆర్డర్లను సగానికి కుదించుకున్నారుు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు ఆర్డర్ల విలువపై పరిమితులను విధించారుు. అరుుతే ఇప్పుడు అమెజాన్ వాటి సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ అరుుతే బుధవారం నుంచి తన సేవలను పూర్తిగా పునరుద్ధరించింది. ధీమాగా వాలెట్ సంస్థలు: పేటీఎం, ఫ్రీచార్జ్, మోబిక్విక్ వంటి మొబైల్ వాలెట్ సంస్థలు రానున్న రోజుల్లో వారి యూజర్ల సంఖ్యతోపాటు లావాదేవీలు కూడా బాగా పెరుగుతాయని ధీమాగా ఉన్నారుు. ఫ్రీచార్జ్ లావాదేవీ లు గణనీయంగా ఎగశాయని కూనల్ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ పెరుగుదల వల్ల ఈ-కామర్స్ సం స్థలకు దీర్ఘకాలంలో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది వారి చెల్లింపుల కోసం డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఎంచుకుంటున్నారని బన్సాల్ తెలిపారు. -
7 రోజుల్లో... రూ.1,14,139 కోట్లు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్లపై ఎస్బీఐ ప్రకటన ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు అనంతరం ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడు రోజుల్లో 240.90 లక్షల నగదు డిపాజిట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నవంబర్ 10 నుంచీ బ్యాంకులు లావాదేవీలు జరిపారుు. అరుుతే 14వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు. నవంబర్ 10వ తేదీ నుంచీ రూ.500 రూ.1,000 నోట్ల పాత నోట్ల మార్పిడి విలువ రూ.5,776 కోట్లు. రూ.18,665 కోట్ల విత్‌డ్రాయల్స్ జరిగారుు. ఇందుకు సంబంధించి లావాదేవీల సంఖ్య 151.93 లక్షల కోట్లు. రోజుకు రూ.4,500కు సమానమైన రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణల పరిమితి రోజుకు రూ.2,500. ఏటీఎం విత్డ్రాయల్స్సహా స్లిప్ లేదా చెక్ ద్వారా వారానికి రూ.24,000 విత్‌డ్రాయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిపాజిట్లు పడిపోతారుు: మూడీస్ బ్యాంకింగ్‌లో భారీ డిపాజిట్లపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ తాజాగా స్పందించింది. విత్‌డ్రాయల్ నిబంధనలు సడలించిన వెంటనే బ్యాంక్ డిపాజట్లు బారీగా పడిపోతాయని పేర్కొంది. డిపాజిట్ల జోరు మరో 3-4 వారాలు కొనసాగుతుందని అంచనా వేసింది. గత వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కావడం తెలిసిందే. -
రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్...
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ అంచనా... ముంబై: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు పెరిగిపోతుండడంతో ఈ ప్రక్రియ తర్వాత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు యాక్సిస్ బ్యాంకు తెలిపింది. సేవింగ్స, కరెంటు ఖాతాల్లో డిపాజిట్లపై బ్యాంకులకు వ్యయం చాలా తక్కువని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరగడం వల్ల నిధుల సేకరణ వ్యయం తగ్గుతుందని యాక్సిస్‌బ్యాంక్ రిటైల్ కార్యకలాపాల అధిపతి రాజీవ్ ఆనంద్ తెలిపారు. నిధుల సేకరణ వ్యయం తగ్గితే కొంత కాలానికి రుణాలపై రేట్లు కూడా దిగి వస్తాయన్నారు. ఓ నివేదిక ప్రకారం గత శుక్రవారానికి బ్యాంకుల్లో రూ.60 వేల కోట్ల నగదు డిపాజిట్ అరుుంది. ‘‘తాజా పరిణామాలతో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి డిపాజిట్లపై వ్యయం 0.03 నుంచి 0.10 శాతం వరకు తగ్గనుంది. ఈ మేరకు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బ్యాంకులు బదలారుుంచే అవకాశం ఉంది’’ అని రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. రూ.13.5 లక్షల కోట్ల రూపాయల మేర డిపాజిట్లకు అవకాశం ఉన్నప్పటికీ, నగదు మార్పిడి, రోజువారీ అవసరాలకు నగదు ఉపసంహరణలతో వాస్తవిక వృద్ధి ఆ స్థారుులో ఉండకపోవచ్చని ఇక్రా తెలిపింది. మొత్తం మీద బ్యాంకు డిపాజిట్లలో 1.3 శాతం నుంచి 3.5 శాతం మేర పెరుగుదల ఉంటుంది. -
చలో మనీ...
• బ్యాంకుల ముందు బారులు తీరిన జనం • పాత రూ.500..రూ.1000 నోట్ల మార్పిడి • తొలిరోజు 40 జాతీయ బ్యాంకుల్లో రూ.1.80 కోట్ల లావాదేవీలు • నేటి నుంచి 950 పోస్టాఫీసుల్లో కొత్త కరెన్సీ • గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్ర సేవలు తిరుపతి (అలిపిరి) : పెద్దనోట్ల రద్దుతో జిల్లా ప్ర జల అవస్థలు అవర్ణనాతీతంగా మారారుు. ఉదయం నుంచే ప్రజ లు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఏ బ్యాంకు చూసిన ప్రజా సందోహంతో కిక్కిరిసారుు. పాత రూ.500, వెరుు్య నోట్లు చేత పట్టుకుని బ్యాంకు ముందు పడిగాపులు కాశారు. ఒక్క గురువారం రోజున జిల్లాలోని 40 జాతీయ బ్యాంకులకు చెందిన 592 శాఖ ల్లో రూ.1.80 కోట్లు లావాదేవీ లు జరిగారుు. జిల్లాలోని 950 పోస్టాఫీస్లుల్లోనూ ప్రజ లు పాత నోట్లను మార్పు చేసుకున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంట ల వరకు లావాదేవీలు కొనసాగారుు. లీడ్ బ్యాంక్ సమాచారం మేరకు రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు, పోస్టాపీసుల్లో గురవారం ఒక్కరోజు లావాదేవీల్లో రూ.1.80 కోట్లు మేరకు ఉంటుందని అంచనా. బ్యాంకు లు, పోసా్టీఫీసులకు వచ్చిన ప్రజలకు రూ.20,రూ.100,కొత్త రూ.2 వేల నోట్ల ను అందజేశారు. శుక్రవారం రోజున కూ డా రూ.1.80 కోట్లు లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో రూ.800 నుంచి రూ.1200 కోట్ల లావాదేవీలు జరగనున్నట్లు లీడ్ బ్యాంక్ అంచ నా వేస్తోంది. శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు అందుబాటులో ఉంటాయ న్న సమాచారంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఒక వ్యక్తికి రూ.4 వేల వంతున జిల్లాలోని 950 పోస్టాఫీసుల్లో శుక్రవారం నుంచి ప్రజల కు కరెన్సీని అందజేయనున్నారు. నేటి నుంచి బ్యాంకు మిత్రల సేవలు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుం డా జిల్లాలోని గ్రామాల్లో బ్యాంకు మి త్రలు సేవలందించనున్నారు. 739 మం ది బ్యాంకు మిత్రలు గ్రామీణ ప్రజలకు అవసరమైన నగదు మార్పిడికి సహకరిం చనున్నారు. చిన్న మొత్తంలో పాత నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. నేటి నుంచి అందుబాటులో ఏటీఎంలు పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల చుట్టూ ప్ర దక్షిణలు చేస్తున్న ప్రజలకు శుక్రవారం నుంచి కాస్త ఊరట లభించనుంది. ఏటీఎంలను బ్యాంకు యాజమాన్యాలు అం దుబాటులోకి రానున్నారుు. రూ.100 నో ట్లు ఏటీఎం ద్వారా ప్రజలు పొందే వెసులుబాటును కల్పించారు. ప్రజలకు అందుబాటులో కొత్తనోట్లు కొత్త రూ.2వేల నోట్లు శుక్రవారం నుంచి ప్రజలకు పూర్తిస్థారుులో అందుబాటులోకి వస్తాయని లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్రావు తెలిపారు. ఏటీఎం లు పునఃప్రారంభిస్తుండడంతో బ్యాంకు ల్లో ప్రజల రద్దీ తగ్గే అవకాశం ఉం దన్నా రు. వ్యక్తిగత గుర్తింపు కార్డుతో ఒక వ్యక్తి రూ.4 వేలు తీసుకునే వెసులుబాటును కల్పించినట్లు తెలిపారు. మరో రెండు రో జులు కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు. నేటి నుంచి పోస్టాఫీసుల్లో పెద్ద నోట్ల మార్పిడి జిల్లాలోని హెడ్, సబ్‌పోస్టాఫీసుల్లో శుక్రవా రం నుంచి పాత రూ.500, వెరుు్య నోట్లను రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం కల్పించారు. తిరుపతి పోస్టల్ డివిజన్ పరిధిలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరిలో హెడ్పోస్టాఫీసులున్నా రుు. వీటి పరిధిలో మొత్తం 396 బ్రాంచ్ పోస్టాఫీసులు, 69 సబ్ పోస్టాఫీసులున్నా రుు. చిత్తూరు పోస్టల్ డివిజన్ పరిధిలో పలమనేరు, మదనపల్లి, చిత్తూరులో హెడ్పోస్టాఫీసులున్నారుు. వీటి పరిధిలో 543 బ్రాంచ్ పోస్టాఫీసులు, 52 సబ్పోస్టాఫీసులున్నారుు. వీటిలో పాత నోట్ల మార్పిడి అ వకాశం కల్పించారు. అలాగే అన్ని పోస్టాఫీ సు స్కీములు, పథకాల ద్వారా జమ చేసుకునే లావాదేవీలు బ్యాంకు నిబంధనల మే రకే ఉంటారుు. అలాగే నగదు విత్‌డ్రా సౌకర్యాన్ని రోజుకు రూ.10వేలు, వారానికి రూ. 20 వేలుగా నిర్ణరుుంచారు. పోస్టల్ ఏటీఎంల ద్వారా రోజుకు రూ. 2వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. శని, ఆదివారాలు బ్యాంకు పనిదినాలు చిత్తూరు ఎడ్యుకేషన్ : శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవులు అరుునప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకులు పనిచేస్తాయని జిల్లా జారుుంట్ కలెక్టర్ గిరీషా అన్నారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకు అధికారులు, పోలీసుల అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఆయన మాట్లాడుతూ రూ.500, వెరుు్య నోట్ల రద్దుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నగదు మార్పిడికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకుల్లో ఒక్కొక్క వ్యక్తి రూ.4వేలను ఈనెల 24వ తేదీ లోపు జమ చేసి వంద రూపాయాల నోట్లను పొందవచ్చన్నారు. ఎల్డీఎం రామ్మోహన్రావు, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఎదురైతే తెలపండి జిల్లాలోని బ్యాంకుల్లో రూ.500, వెరుు్య నోట్లను జమ చేసేం దుకు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తమకు తెలియజేయవచ్చని జారుుంట్ కలెక్టర్ గిరీషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలు తెలపడానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ 94906 90275, వాట్సాప్ నంబర్ 96526 16786, జిల్లా కలెక్టరేట్ వాట్సాప్ నంబర్ 99850 77584, కంట్రోల్ రూమ్ నంబర్ 08572 - 240500లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు.