7 రోజుల్లో... రూ.1,14,139 కోట్లు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్లపై ఎస్‌బీఐ ప్రకటన
ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు అనంతరం ఏడు రోజుల్లో రూ.1,14,139 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడు రోజుల్లో 240.90 లక్షల నగదు డిపాజిట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నవంబర్ 10 నుంచీ బ్యాంకులు లావాదేవీలు జరిపారుు. అరుుతే 14వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయలేదు.
నవంబర్ 10వ తేదీ నుంచీ రూ.500 రూ.1,000 నోట్ల పాత నోట్ల మార్పిడి విలువ రూ.5,776 కోట్లు. రూ.18,665 కోట్ల విత్‌డ్రాయల్స్ జరిగారుు. ఇందుకు సంబంధించి లావాదేవీల సంఖ్య 151.93 లక్షల కోట్లు. రోజుకు రూ.4,500కు సమానమైన రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణల పరిమితి రోజుకు రూ.2,500. ఏటీఎం విత్‌డ్రాయల్స్‌సహా స్లిప్ లేదా చెక్ ద్వారా వారానికి రూ.24,000 విత్‌డ్రాయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
డిపాజిట్లు పడిపోతారుు: మూడీస్
బ్యాంకింగ్‌లో భారీ డిపాజిట్లపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ తాజాగా స్పందించింది. విత్‌డ్రాయల్ నిబంధనలు సడలించిన వెంటనే బ్యాంక్ డిపాజట్లు బారీగా పడిపోతాయని పేర్కొంది. డిపాజిట్ల జోరు మరో 3-4 వారాలు కొనసాగుతుందని అంచనా వేసింది. గత వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కావడం తెలిసిందే.