ఎస్‌బీఐ రెండు కొత్త డిపాజిట్‌ పథకాలు | SBI launches two new deposit schemes | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ రెండు కొత్త డిపాజిట్‌ పథకాలు

Published Sat, Jan 4 2025 12:33 AM | Last Updated on Sat, Jan 4 2025 12:33 AM

SBI launches two new deposit schemes

80 ఏళ్లు నిండిన వారికి అదనపు రేటు 

న్యూఢిల్లీ: డిపాజిట్‌దారుల కోసం ఎస్‌బీఐ రెండు వినూత్నమైన పథకాలను ప్రకటించింది. ఇందులో ఒకటి ‘హర్‌ ఘర్‌ లఖ్‌పతి’ కాగా, మరొకటి ‘ఎస్‌బీఐ పాట్రాన్స్‌’. ఇందులో హర్‌ ఘర్‌ లఖ్‌పతి పథకం కింద రూ.లక్ష లేదా అంతకుమించి రూ.లక్ష చొప్పున ఎంత వరకు అయిన సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన రికరింగ్‌ డిపాజిట్‌ పథకం. ఆర్థిక లక్ష్యాల సాధనను ఈ పథకం సులభతరం చేస్తుందని, కస్టమర్లు ప్రణాళిక మేరకు పొదుపు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

 ‘ఎస్‌బీఐ పాట్రాన్స్‌’ అన్నది 80 ఏళ్లు, అంతకుమించి వయసున్న వృద్ధుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన టర్మ్‌ డిపాజిట్‌ పథకం. సాధారణంగా సీనియర్‌ సిటిజన్లకు ఆఫర్‌ చేసే రేటుపై అదనంగా 0.10% వడ్డీ రేటును ఈ పథకం కింద ప్రస్తుత డిపాజిటర్లతోపాటు, కొత్త టర్మ్‌ డిపాజిటర్లకు ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఇవి కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడంతోపాటు అదనపు రాబడులను అందిస్తాయని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement