State Bank of India (SBI)
-
రుణగ్రహీతలకు శుభవార్త
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు చెప్పింది. రుణ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. దీనితో గృహ రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల (ఈఎంఐ) భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవలే పావుశాతం తగ్గించిన నేపథ్యంలో (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్లు ఇలా...→ వివిధ రుణాలకు వర్తించే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), అలాగే రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. → అయితే బ్యాంక్ మార్జినల్ కాస్ట్–బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్), బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను (బీపీఎల్ఆర్) యథాతథంగా కొనసాగించింది. రెపో ఆధారిత రుణల విషయానికి వస్తే...రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రత్యక్షంగా రెపో రేటుకు అనుసంధానమై ఉంటుంది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఈ రేటు 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గుతుంది. దీనితో ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాణిజ్య రుణాలు తగ్గుతాయి. ఆకర్షణీయం..ఈబీఎల్ఆర్ లేదా ఆర్ఎల్ఎల్ఆర్కు అనుసంధానమైన రుణ గ్రహీతల రుణ నిబంధనలను బట్టి వారి ఈఎంఐలు లేదా రుణ వ్యవధి తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలను మరింత ఆకర్షణీయంగా చేస్తూ, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ను ఎస్బీఐ తగ్గించడం కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ తగ్గిన రుణ రేటు ప్రయోజనాలు పొందడానికి మార్జినల్ కాస్ట్ రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కస్టమర్లు తక్కువ వడ్డీరేటు రుణ విధానానికి మారవలసి ఉంటుంది. ‘రుణ’ పునఃపరిశీలనకు సూచన...తాజా రుణ రేట్లు, సంబంధిత పరిణామాల నేపథ్యంలో కొత్త రుణగ్రహీతలు రుణదాతను (బ్యాంక్) ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల రుణ రేట్లను సరిపోల్చుకోవాలని, వారి సామర్థ్యానికి అనువైన రుణ రేట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రుణగ్రహీతలు తప్పనిసరిగా తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. అవసరమైతే రీఫైనాన్సింగ్ ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ రెపో తగ్గింపు నేపథ్యంలో కెనరా బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించాయి. ఈ బ్యాంకుల నుండి గృహ రుణ గ్రహీతలు తమ ఈఎంఐలను అలాగే రుణ చెల్లింపు వ్యవధి కాల పరిమితులను సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈబీఎల్ఆర్ అంటే?ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్. ఎస్బీఐ 2019 అక్టోబర్ నుంచి తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను అనుసంధానించడానికి ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంది. దీనితో అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లకు వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమవుతాయి. తాజా నిర్ణయంతో గృహ రుణ ఫ్లోటింగ్ రేట్లు తగ్గుతాయన్న మాట. దీనితోపాటు ఈబీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని వ్యక్తిగత ఇతర రిటైల్ రుణాలు సైతం దిగివస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈబీఎల్ ఆర్ 9.15% నుంచి 8.90 శాతానికి తగ్గింది. -
ఓటేసిన మహిళలు 25 శాతం పెరిగారు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటులో ఒక శాతం పెరుగుదలతో ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25 శాతం పెరిగింది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇవే కాకుండా వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి అక్షరాస్యత రేటుతో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి ఉపాధి పథకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా సుమారు 36 లక్షల మంది మహిళా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. పరిశుభ్రత కూడా ఒక కీలక అంశంగా మారి, మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. పరిశుభ్రత ప్రచారం, దాని ప్రభావం కారణంగా మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 21 లక్షలు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇవే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలు కూడా మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. అయితే వీటి వల్ల ఓటు వేయాలనే స్ఫూర్తిని పొందిన మహిళల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఎన్నికలలో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో మహిళలకు గృహ యాజమాన్య హక్కులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. పీఎం ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్లలో 74 శాతం మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించింది. విద్య, ఉపాధి, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలోవారి భాగస్వామ్యాన్ని పెంచవచ్చని నివేదిక పేర్కొంది. -
చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉండాలి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు. చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
భారత్‌లో తగ్గిన పేదరికం
న్యూఢిల్లీ: భారత్‌లో గ్రామీణ, పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023–24లో 4.86 శాతానికి దిగివచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇక ఇదే సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే, 2022–23లో 7.2 శాతంగా గ్రామీణ పేదరికం ఉంటే, పట్టణ పేదరికం 4.6 శాతంగా ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే (7.2 శాతం నుంచి 4.86 శాతానికి), పట్టణ పేదరికం స్వల్పంగా (4.06 శాతం నుంచి 4.09 శాతం) పెరిగింది. ఇక భారత్‌లో పేదరికం రేట్లు ఇప్పుడు 4–4.5 శాతం పరిధిలో ఉండవచ్చని సర్వే భావించింది. ప్రభుత్వ కార్యక్రమాల దన్ను పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. నేరుగా లబ్ధిదారులకు నిధుల బదిలీ (డీబీటీ), గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలను ఆ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. వినియోగం, వ్యయాలపై ఎస్బీఐ సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాల్లో 5% వరకూ పెరుగుదల కనిపించింది. → ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. → గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో గ్రామీణ–పట్టణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి. 2023 ఆగస్టు–2024 జూలై మధ్య గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. → ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు (31%) కంటే అధిక పొదులపు రేటును నమెదుచేసుకున్నాయి. → ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో తక్కువ సేవింగ్స్ రేటు కనిపించింది. అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుంచి వలసలు దీనికి కారణం కావచ్చు. → పట్టణ పేదరికం మరింత తగ్గుతుందని విశ్వసిస్తున్నాము. -
ఎస్బీఐ రెండు కొత్త డిపాజిట్ పథకాలు
న్యూఢిల్లీ: డిపాజిట్‌దారుల కోసం ఎస్బీఐ రెండు వినూత్నమైన పథకాలను ప్రకటించింది. ఇందులో ఒకటి ‘హర్ ఘర్ లఖ్పతి’ కాగా, మరొకటి ‘ఎస్బీఐ పాట్రాన్స్’. ఇందులో హర్ ఘర్ లఖ్పతి పథకం కింద రూ.లక్ష లేదా అంతకుమించి రూ.లక్ష చొప్పున ఎంత వరకు అయిన సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన రికరింగ్ డిపాజిట్ పథకం. ఆర్థిక లక్ష్యాల సాధనను ఈ పథకం సులభతరం చేస్తుందని, కస్టమర్లు ప్రణాళిక మేరకు పొదుపు చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ‘ఎస్బీఐ పాట్రాన్స్’ అన్నది 80 ఏళ్లు, అంతకుమించి వయసున్న వృద్ధుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన టర్మ్ డిపాజిట్ పథకం. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేసే రేటుపై అదనంగా 0.10% వడ్డీ రేటును ఈ పథకం కింద ప్రస్తుత డిపాజిటర్లతోపాటు, కొత్త టర్మ్ డిపాజిటర్లకు ఇవ్వనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఇవి కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడంతోపాటు అదనపు రాబడులను అందిస్తాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. -
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
ఎస్బీఐ లాభం రయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,782 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పాటునిచ్చాయి. స్టాండెలోన్ లాభం సైతం రూ. 18,331 కోట్లకు ఎగసింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 14,330 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 5 శాతంపైగా పుంజుకుని రూ. 41,620 కోట్లకు చేరింది. రుణాల్లో 15 శాతం వృద్ధి ఇందుకు సహకరించినప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.15% నీరసించి 3.14 శాతానికి పరిమితమయ్యాయి. ఫారెక్స్, ట్రెజరీ మద్దతుతో వడ్డీయేతర ఆదాయం 42% జంప్‌చేసి రూ. 15,721 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1.29 లక్షల కోట్లకు చేరింది. రుణాల్లో 14–16% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. అయితే డిపాజిట్లలో వృద్ధి 10 శాతానికి పరిమితంకావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెపె్టంబర్) రూ. 63,895 కోట్ల నిర్వహణ లాభం సాధించినట్లు తెలియజేశారు. ఈ బాటలో నికర లాభాల్లోనూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్పీఏలు తగ్గాయ్... ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 3,831 కోట్లకు పరిమితంకాగా.. రూ. 2,300 కోట్ల రికవరీలు అందుకుంది. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.76 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల విషయానికొస్తే జీవిత బీమా విభాగం నికర లాభం ఆరు నెలల్లో రూ. 761 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు జంప్‌చేసింది. క్రెడిట్ కార్డుల విభాగం లాభం మాత్రం రూ. 1,196 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు తగ్గింది. ఏఎంసీ నికర లాభం రూ. 940 కోట్ల నుంచి రూ. 1,374 కోట్లకు పెరిగింది. ఇక సాధారణ బీమా సంస్థ లాభం రూ. 60 కోట్ల నుంచి రూ.414 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ధర 2 శాతం నష్టంతో రూ.843 వద్ద ముగిసింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు. -
ఎస్బీఐ రుణ రేట్లు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆగస్టు 15 నుంచి తాజా 0.1% రుణ రేటు పెరుగుదల అన్ని వర్తిస్తుందని తన వెబ్సైట్లో బ్యాంక్ పేర్కొంది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన కస్టమర్ల రుణాల వడ్డీరేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. తాజా రేట్లను పరిశీలిస్తే..⇒ ఆటో, వ్యక్తిగత రుణాలకు సాధారణంగా వర్తించే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 8.85% నుంచి 8.95%కి పెరిగింది. ⇒ రెండేళ్ల రేటు 9.05%కి, మూడేళ్లరేటు 9.10 శాతానికి ఎగసింది. ⇒ నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితుల రేట్లు 8.45 శాతం–8.85 శాతం శ్రేణిలో ఉంటాయి. ఓవర్‌నైట్ కాలపరిమితి రేటు 8.10 శాతం నుంచి 8.20 శాతం ఎగసింది. ⇒ పీఎన్బీ రుణ రేటు ఇటీవలే అన్ని కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్లు పెరగ్గా, బీఓఐ కేవలం బెంచ్‌మార్క్ ఏడాది రుణ రేటును ఇదే స్థాయిలో 0.05 శాతం పెంచింది. ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ కూడా రుణ రేట్లను అన్ని కాలపరిమితుల 5 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజాగా ఎస్బీఐ మూడవసారి పెంచింది. -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
SBI: ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారమని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేలి్చచెప్పింది. ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేశ్ బాత్రా మార్చి 13న దరఖాస్తు చేశారు. -
Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో ఆ సమస్త వివరాలను ఈసీ వెంటనే తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతోసహా దాతలు, వాటిని అందుకున్న గ్రహీతల(రాజకీయ పార్టీలు) జాబితాను విడివిడిగా ఈసీ పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లను బట్టి ఏ ఎలక్టోరల్ బాండ్ మొత్తాన్ని ఈ రాజకీయ పార్టీ విరాళంగా పొందిందో సులభంగా తెల్సుకోవచ్చు. సుప్రీంకోర్టు గత ఆదేశాల సమయంలో ఈ ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లు లేకుండానే బాండ్లు, వాటి గ్రహీతల జాబితాను ఈసీకి ఎస్బీఐ ఇచ్చింది. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. సమస్త వివరాలను ఈసీకి ఇవ్వాలని ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎస్బీఐ గురువారం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను ఈసీకి అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రిలయన్స్ సంబంధ సంస్థ నుంచి బీజేపీకి రూ.395 కోట్లు ఈసీ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బీజేపీకి రూ.395 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2022లో శివసేన పార్టీకి రూ.25 కోట్ల విరాళాలు అందజేసింది. 2021–22, 2023–24కాలంలో బాండ్లు కొని విరాళంగా ఇచి్చన మూడో అతిపెద్ద దాతగా క్విక్ సప్లై చైన్ నిలిచింది. ఈకాలంలో ఈ సంస్థ రూ.410 కోట్ల బాండ్లను కొనుగోలుచేసింది. అత్యధికంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలుచేయడం తెల్సిందే. ఈ సంస్థ 2022 అక్టోబర్ వరకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీపార్టీకి రూ.540 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా టీఎంసీ నిలిచింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్‌హోటల్ సర్వీసెస్ నుంచి బీజేపీ రూ.100 కోట్ల విరాళాలు పొందింది. ఈ సంస్థ కాంగ్రెస్‌కు రూ.50 కోట్ల విరాళం ఇచ్చింది. సిక్కిం క్రాంతికారీ మోర్చా సైతం ఈ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించింది. తమిళనాడులోని డీఎంకేకు ఈ సంస్థ ఏకంగా రూ.509 కోట్ల విరాళాలు ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న హానీవెల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సైతం రూ.30 కోట్ల బాండ్లను కొని మొత్తం బీజేపీకే విరాళంగా ఇచ్చింది. ఈసీకి ఇచ్చేశాం: ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా ఎన్నికల సంఘానికి అందజేశామని ఎస్బీ ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాతలు ఇచ్చిన బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల బ్యాంక్ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బయటపెట్టడం లేదని వెల్లడించారు. -
బాండ్ల నంబర్లేవి?
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న పారీ్టల వివరాలను బయట పెట్టే యునిక్ బాండ్ నంబర్లను ఎందుకు వెల్లడించలేదని బ్యాంకును నిలదీసింది. బాండ్ల వివరాలను ఒక్కటొక్కటిగా కాకుండా ఈ నెల 21 సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో ఈసీకి అందజేయాలని ఆదేశించింది. ‘‘యునిక్ బాండ్ నంబర్లతో పాటు బ్యాంకు దగ్గరున్న మొత్తం సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదు’’ అని కుండబద్దలు కొట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ అందజేసిన వివరాలన్నిటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. చైర్మన్, ఎండీ అఫిడవిట్ దాఖలు చేయాలి ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధమని, దాతలు, గ్రహీతల వివరాలను మార్చి 13వ తేదీ కల్లా వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్‌ను ఈ నెల 11న న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల అరకొర వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎస్బీఐని సోమవారం సంజాయిషీ కోరింది. ‘‘21వ తేదీ సాయంత్రానికల్లా పూర్తి వివరాలు ఈసీకివ్వండి. ఎన్నికల బాండ్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారమతటినీ ఈసీకి అందించామని, ఇంతకుమించి ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొంటూ ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని స్పష్టం చేసింది. బాండ్ల వివరాలను వెల్లడించరాదన్న తమ పిటిషన్లపై సత్వరం విచారణ జరపాలన్న పరిశ్రమల సంఘాల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచి్చంది. ఎన్నికల బాండ్ల పథకం మొదలైన 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ దాకా విక్రయించిన బాండ్ల వివరాలను బయట పెట్టాలన్న పిటిషన్‌నూ కొట్టేసింది. బాండ్ల వివరాలను వెల్లడించాలన్న తీర్పుపై సుమోటోగా సమీక్ష జరపాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిశ్ సి.అగర్వాలా రాసిన లేఖను కూడా బుట్టదాఖలు చేసింది. ఇవన్నీ ప్రచార స్టంట్లంటూ సీజేఐ మండిపడ్డారు. కామెంట్లకు మేమూ అతీతం కాదు! ఎన్నికల బాండ్ల తీర్పును సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని, కేంద్రంపై అభ్యంతరకర కామెంట్లు పెడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్నవారే దీనిపై ఇంటర్వ్యూలిస్తూ కావాలనే సుప్రీంకోర్టుకు కూడా ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. ‘‘మా తీర్పులను ఎవరెలా వ్యాఖ్యానిస్తున్నారన్న దానితో మాకు సంబంధం లేదు. మా ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే మాకు ముఖ్యం. న్యాయమూర్తులుగా మేం రాజ్యాంగబద్ధంగా తీర్పులు వెల్లడిస్తాం. చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం. మీడియా, సోషల్ మీడియా కామెంట్లకు మేం కూడా అతీతమేమీ కాదు. కానీ వాటిని తట్టుకునే శక్తి మాకు, న్యాయవ్యవస్థకు ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు!
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించటానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ సందర్భంలోనే – భారతీయ స్టేట్ బ్యాంకు ఇంతవరకు తాను కోనుగోలు చేసిన బాండ్ల వివరాలను నిర్ణీత గడువులోపు ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించడంతో బ్యాంకు పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ కొంతమేరకైనా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. అయితే, ప్రశ్నేమిటంటే... ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకు చేత ఇంతకాలంగా వివరాలు వెల్లడించనివ్వకుండా చేయిస్తున్నది ఎవరు అని! అయితే ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు! నా తొలి బ్యాంకు ఖాతా ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో ఉండేది. నా పేరిట నాన్న దానిని తెరిచినప్పుడు నా వయసు 16 ఏళ్లు. మా పూర్వీకుల భూములను విక్రయించటం ద్వారా నా వాటాగా వచ్చిన మొత్తాన్ని జమ చేసేందుకు ఉద్దేశించిన ఖాతా అది. ఆ ఖాతాను ప్రతి నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్‌కు జత కలిపారు. ఆ వడ్డీ పెద్ద మొత్తమేమీ కాదు కానీ, నేనొక డబ్బు గల ఆసామినన్న భావన నాలో కలిగించింది. నాన్న సొంత ఖాతా గ్రిండ్లేస్ బ్యాంకులో ఉండేది. ఆ బ్యాంకు ఇప్పుడు ఉనికిలో లేదు. నాన్న నా కోసం ఆ రోజు ఎస్.బి.ఐ. బ్యాంకును ఎందుకు ఎంచుకున్నారో నాకు గుర్తులేదు కానీ, ఆ సంస్థ పట్ల ఆయన ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని అనుకుంటాను. డెబ్బయ్‌లలో బ్యాంకింగ్ చాలా భిన్నంగా ఉండేది. నగదు లావాదేవీల టెల్లర్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఉండేవి. సొంత చెక్కులకు డబ్బు ఇవ్వడానికి కూడా వారి ఖాతాలను తనిఖీ చేసేవారు. అదంతా కూడా అమిత ప్రయాసతో కూడిన దుర్భరమైన తతంగంలా ఉండేది. ఆ దశలో అకస్మాత్తుగా ఎస్.బి.ఐ. మన ఖాతాలో సరిపడా నిధులు ఉన్నాయా, లేవా అన్నది కూడా నిర్ధారణ చేసుకోకుండానే సెల్ఫ్–చెక్కులను ఒక నిర్ణీత పరిమితి వరకు నగదుగా మార్చుకునే అవకాశం కల్పించిన మొదటి బ్యాంకుగా అవతరించింది. ఆ దెబ్బతో, అరగంట పట్టే పని... నిమిషాల్లో అయిపోవడం మొదలైంది. ఆఖరికి నాగర్వాలా నగదు కుంభకోణం కూడా ఎస్.బి.ఐ. దేదీప్యాన్ని చెక్కుచెదర్చలేక పోయింది. ఎగతాళిగా నవ్వినవారు లేకపోలేదు కానీ, బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకున్న వారు చాలా తక్కువ. అలాంటి కుంభకోణాలు ఊహించినవే. అయినా అవి నేరారోపణలు వచ్చేంతగా పరిగణన పొందనివి. ఆ రోజుల్లో మా అమ్మ 50 పైసలు, 1 రూపాయి నాణేలను పొదుపు చేసేవారు. ఒక పాత టప్పర్‌వేర్ బ్రెడ్ బాక్సులో వాటిని ఆమె భద్రంగా దాస్తూ ఉండేవారు. అలా కూడబెట్టిన ఆ అపురూపమైన నాణేలను ఎస్.బి.ఐ.కి తీసుకెళ్లి ఆమె ఖాతాలో జమ చేసి రావడం అనే బాధ్యత నాపై పడుతుండేది. కౌంటర్లో ఉండే టెల్లర్ ఆ నాణేలను తూకం వేసి చూసి, మా అమ్మలోని ఇలా పోగేసే గృహిణి నైజాన్ని ప్రశంసించేవారు. ‘‘మేరీ బీవీ భీ యహీ కర్తీ హై’’ (మా ఇంటావిడ కూడా ఇలాగే చేస్తుంటుంది) అనే అతడి మాట నాలోని టీనేజ్ బిడియాన్ని పోగొట్టేది. ఆయన అలా అనేవరకు కూడా నన్ను నేను మురికి నాణేలను సంచిలో మూట కట్టుకుని బ్యాంకుకు వెళ్లే వ్యాపారిలానే భావించుకున్నాను. స్టో లేదా కేంబ్రిడ్జి నుండి సెలవులకు వచ్చినప్పుడు పార్లమెంటు స్ట్రీట్ బ్రాంచి నిరంతరం నాకు పని కల్పించేది. నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికి! ఎందుకు అని నన్నడక్కండి. అనుకోకుండా ఎందుకో వెళ్లేవాళ్లం. వెళ్లిన ప్రతిసారీ ఇలా వెళ్లి అలా వచ్చేయటం అన్నట్లుగా ఉండకపోయే వాళ్లం. కనుక, ఆ ప్రదేశంపై నాకు మక్కువ ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. తరచుగా ఏం జరిగేదంటే, గ్రౌండ్ ఫ్లోర్లో నా పని పూర్తి అయినప్పుడు పై అంతస్థులకు కూడా వెళ్లి, నా చిన్న మొత్తాల పొదుపుపై సలహాలు అడుగుతుండేవాడిని. 20 ఏళ్ల యువకుడిలోని ఆ అతిక్రమణను ఐదవ అంతస్థులోని మేనేజర్లు గొప్ప సంసిద్ధతతో క్షమించేసేవారు. నా ప్రశ్నల్ని వారు స్వాగతించారని కూడా నాకు గట్టిగా అనిపించేది. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసిన బ్యాంకు ఎప్పుడూ కూడా గత వారం ఎస్.బి.ఐ. వ్యవహరించిన విధంగా అయితే లేదు. సుప్రీంకోర్టు మందలింపుతో బహుశా ఆ బ్యాంకు సిబ్బంది ముడుచుకుపోయి ఉండొచ్చు. మనకున్న అత్యుత్తమ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన మదన్ లోకూర్, ‘‘బ్యాంకుకు ఇది చెంపపెట్టు’’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా ఆయన పని చేసిన ఇన్నేళ్లలోనూ ఇలా ఒక బ్యాంకు మందలింపునకు గురైన సంఘటనను ఆయన గుర్తు చేసుకోలేదు. గత సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి అడిగిన ఒక ప్రశ్న ఎస్.బి.ఐ.ని నెలల తరబడి, కాదంటే ఏళ్ల తరబడి వేధిస్తుందా అని నా ఆందోళన. ‘‘ఆదేశాలను పాటించటం మీకు కష్టంగా ఉందని మీరు చెబుతున్నారా?’’ అని ఆయన అడిగారు. ‘‘గత 26 రోజులలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఆ విషయంలో మీరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎస్.బి.ఐ. నుంచి ఒక స్థాయి నిజాయితీని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు. నా బ్యాంకు ఇంతగా తక్కువ కావటం – ఇప్పటికీ అది నా బ్యాంకులలో ఒకటి కావటం – నాకు బాధను కలిగిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందని అడక్కండి. బహుశా ఇది అర్ధ శతాబ్దం పాటు సాగిన బాంధవ్య పరిణామం కావచ్చు. లేదా, నాకు అలా అనిపిస్తుండొచ్చు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది తప్ప వేరొక వివరణ నాకు తోచటం లేదు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే – సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎస్.బి.ఐ. ఉద్దేశపూర్వకంగా తనకు అవసరమైన రీతిలో తప్పుగా అన్వయించుకోవటం ద్వారా, కోర్టు ఆదేశించిన ఒక సాధారణమైన పనిని కావాలనే క్లిష్టతరం చేసి, ఆ ఆదేశాన్ని పాటించలేకపోవటానికి తిరిగి ఆ సంక్లిష్టతనే ఒక నెపంగా చూపిందా అన్న అనుమానానికి ఆస్కారం కలగడం. ఒక గౌరవప్రదమైన బ్యాంకు నుంచి మీరు ఇలాంటిది ఊహించలేరు. దీర్ఘకాలంగా మీరు అనుబంధం కలిగి ఉన్న ఒక బ్యాంకు విషయంలో ఇలా జరిగినప్పుడు భ్రమలు తొలిగినట్లుగా అనిపిస్తుంది. ప్రభుత్వమే వెనుక ఉండి ఇలా జరిపించిందా? ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు. అయినప్పటికీ మీలోని లక్షల మందికి, ఆ లక్షల్లో ఎక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. కానీ ఈ ప్రశ్న అడగటం వెనుక ఉన్న వాస్తవం బాధను కలిగిస్తుంది. ఆ బాధ అందరికంటే ఎక్కువగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పారీ్టలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. నిబంధనల ప్రకారం.. జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వల్ల మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్‌కుమార్ ఖరా బుధవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రతి బాండ్‌ను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదార్ల పేర్లు, బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్న తేదీ వంటి అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి డిజిటల్ రూపంలో అందజేశామని తెలిపారు. -
ఇన్ని రోజులు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టిలు పొందిన విరాళాల వివరాలను మంగళవారం సాయంత్రంకల్లా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సమరి్పంచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. దీంతో మరింత గడువు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘‘రాజకీయ పార్టిలు పొందిన విరాళాల సమగ్ర వివరాలను 12వ తేదీ పనిగంటలు ముగిసేలోగా ఈసీకి వెల్లడించాలి. తర్వాత అందరికీ బహిర్గతం చేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐను ఆదేశించింది. మరోవైపు, మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలకల్లా తమ అధికారిక వెబ్సైట్లో సమగ్ర వివరాలను పొందుపరచాలని ఈసీకి కోర్టు సూచించింది. బ్యాంక్‌కు ఆదేశాలు, గడువుకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఇచి్చన ఉత్తర్వుల ఉల్లంఘనకు బ్యాంక్ పాల్పడితే బ్యాంక్‌పై చర్చలు తీసుకునేందుకు వెనకాడబోమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ ఆ పద్దతిని రద్దుచేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం ఫిబ్రవరిలో చరిత్రాత్మక తీర్పునివ్వడం తెల్సిందే. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఎస్బీఐ ద్వారా జరిగిన ఎలక్టోరల్ బాండ్ల అధికారిక కొనుగోలు, డిపాజిట్ లావాదేవీల వివరాలను మార్చి ఆరో తేదీలోపు ఈసీకి ఇవ్వాలని కోర్టు గతంలోనే ఆదేశించడం తెల్సిందే. దీంతోజూన్ 30వ తేదీకా గడువు పొడిగించాలని ఎస్బీఐ కోర్టును కోరడం, అలా గడవు కోరడాన్ని కోర్టు ధిక్కారణగా పరిగణించాలంటూ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలవడం తెల్సిందే. ఎస్బీఐ తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే వాదించారు. ‘‘ బాండ్లను కొనుగోలు చేసిన వారు, డిపాజిట్ చేసుకున్న వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సరిపోల్చి నివేదించాల్సిఉంది. వేర్వేరు చోట ఉన్న బ్రాంచీల్లో నిక్షిప్తమైన డేటాను సరిపోల్చేందుకు చాలా సమయంపడుతుంది. అందుకే గడువు పెంచండి’ అని కోరారు. ‘‘ విరాళాల దాతలు, గ్రహీతల వివరాలను సరిపోల్చి మ్యాచింగ్ వివరాలని ఇవ్వాలని మేం అడగలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్లుగా సీల్డ్ కవర్ లోంచి తీసి ఈసీకిస్తే చాలు’’ అని ఆదేశించింది. ‘‘ ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. అంటే ఈ 26 రోజుల నుంచి ఏం చేసినట్లు? ఇంతకాలం మౌనంవహించి ఇప్పుడొచ్చి గడువు పెంచమంటారా? కోర్టు ఉత్తర్వులపై ఇంత నిర్లక్ష్యమా?’’ అని దుయ్యబట్టింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. భారీ కాంట్రాక్టులను సంపాదించేందుకు బీజేపీకి భారీగా విరాళాల విరాళాలిచ్చిన వారి వివరాలూ బయటికొచ్చేలా ఉత్తర్వులిస్తే బాగుండేదని పేర్కొంది. ‘‘స్విస్ ఖాతాల నుంచి కోట్ల నల్లధనం తెస్తామన్న వాళ్లే తమ సొంత ఖాతాల వివరాలు సుప్రీం కంటబడకుండా దాచేస్తున్నారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. -
సుప్రీంకోర్టు తలుపు తట్టిన SBI
సాక్షి, ఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఆమధ్య సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల బాండ్ల విషయంలో విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై.. చర్చనీయాంశమైన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఆ సమయంలో.. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లపై వివరాలు అందిస్తే.. వాటిని వారం రోజుల్లో ఈసీ తన సైట్లో పొందుపర్చాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విధించిన మూడు వారాల గడువు ప్రకారం.. మార్చి 6వ తేదీనే ఎస్బీఐ కేంద్ర ఎన్నికల సంఘానికి డాటా సమర్పించాల్సి ఉంది. అయితే ఇందుకు సమయం సరిపోదని.. జూన్ 30వ తేదీ దాకా గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది ఎస్బీఐ. ఇక ఎస్బీఐ పిటిషన్‌పై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ స్పందించారు. లంచాలు, కాంట్రాక్టులు పొందిన వివరాలు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికలు ముగిసే వరకు సమయం కోరుతున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. -
ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అరెస్ట్
హిమాయత్‌నగర్: సస్పెన్షన్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తిగుళ్ల ప్రవీణ్‌ను నగర సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్ ఫౌండ్రీలోని స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన బై–లాస్‌ను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలో సభ్యులు కాని వారికి రూ.1.42 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. దీంతో కోట్ల రూపాయలు రుణాలు సొసైటీ అనుమతి లేకుండా ఇవ్వడంపై ఉన్నతాధికారులు గతంలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు తిగుళ్ల ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర సహాయ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. -
ఎస్బీఐ లాభం 35% డౌన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో రూ. 9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.14,205 కోట్లతో పోలిస్తే లాభం 35 శాతం తగ్గింది. ప్రధానంగా వేతనాలు, పెన్షన్ల కోసం వన్‌టైమ్ ప్రొవిజనింగ్ బ్యాంక్ లాభదాయకతకు గండి కొట్టింది. ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న 17% వేతన సెటిల్మెంట్ కారణంగా వేతనాలు, పెన్షన్ల కోసం అదనపు వన్‌టైమ్ ప్రొవిజనింగ్‌ను చేయాల్సి వచి్చందని, ఇది గనుక లేకపోతే నికర లాభం రూ.16,264 కోట్లుగా ఉండేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత లాభదాయకత ప్రకారం, రూ.40,000 కోట్లను సులభంగా సమీకరించగమని ఖారా చెప్పారు. అవి లేకుండా కూడా అదనంగా రూ.7.5 లక్షల కోట్ల రుణాలిచ్చే లిక్విడిటీ బఫర్ ఉందని ఆయన వివరించారు. మొండి బకాయిలు దిగొచ్చాయ్... క్యూ3లో స్థూల మొండి బకాయిలు 72 బేసిస్ పాయింట్లు దిగొచ్చి 2.42 శాతానికి (రూ.86,749 కోట్లు) తగ్గాయి. /æక నికర మొండి బకాయిలు కూడా 13 బేసిస్ పాయింట్లు తగ్గి 0.64 శాతానికి (రూ.22,408 కోట్లు) చేరాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి అని ఖారా పేర్కొన్నారు. కాగా, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 1 శాతం తగ్గి 3.28 శాతానికి పరిమితమైంది. మొత్తం రుణాలు 14.38 శాతం ఎగబాకి రూ.35.84 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 13.02 శాతం పెరిగి రూ. 47.62 లక్షల కోట్లకు ఎగిశాయి. పేటీఎం కస్టమర్లకు స్వాగతం... మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను దాదాపు నిలిపేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో, పేటీఎం కస్టమర్లకు (ఎక్కువ మంది వ్యాపారులే) సాయపడేందుకు ఎస్బీఐ సిద్ధంగా ఉందని చైర్మన్ ఖారా చెప్పారు. -
రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించామని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్బీఐ ఈ విషయం చెప్పింది. ‘‘2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా 29 దఫాలుగా ఎలక్టోరల్ బాండ్లను విక్రయించాం. వాటి మొత్తం విలువ రూ.15,956.30 కోట్లు. ఇందులో రూ.23.88 కోట్ల విలువైన 194 బాండ్లు ఏ రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతాలో జమకాని కారణంగా ఆ బాండ్ల మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్)కు బదిలీ చేశాం’’ అని బ్యాంక్ తెలిపింది. లోకేశ్ బాత్రా అనే మాజీ నావికా అధికారి ఆర్టీఐ చట్టం కింద అభ్యరి్థంచడంతో బ్యాంక్ పై విధంగా సమాధానమిచి్చంది. -
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు - ఇలా ఉన్నాయి
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది.. అంతకంటే ముందు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ.. అవన్నీ ఈ రోజు (డిసెంబర్ 27) నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI తాజాగా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. SBI కొత్త వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 4.75 శాతం 180 రోజుల నుంచి 210 రోజులు - 5.75 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.80 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 7.00 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.75 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 6.50 శాతం సీనియర్ సిటిజన్స్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 4 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 5.25 శాతం 180 రోజుల నుంచి 210 రోజులకు - 6.25 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరాల లోపు - 6.5 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు - 7.30 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు - 7.50 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు - 7.25 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 7.5 శాతం SBI ఇప్పడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది, అయితే ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, డీసీబీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేటును పెంచుతూ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ కథనంలో పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే వివరాలు తెలుసుకుందాం. ఎస్బీఐ బేస్ రేటు ఇప్పుడు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగింది. అంటే కొత్త బేస్ రేటు గతం కంటే కూడా 0.15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 15) నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది 8 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంది. ఓవర్ నైట్ ఎమ్సీఎల్ఆర్ రేటు 8.0 శాతం వద్ద ఉంది. ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఆరు నెలలకు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, సంవత్సర కాల వ్యవధికి 8.55 శాతం నుంచి 8.65 శాతానికి, రెండు సంవత్సరాలకు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 8.75 నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమలులో ఉంటాయి. -
కార్పొరేట్లకు మద్దతులో ఎస్బీఐ పాత్ర భేష్
కొలంబో: భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోసైతం కార్పొరేట్లకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న సేవలు అద్భుతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అంతక్రితం ఆమె శ్రీలంక తూర్పు ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో ఎస్బీఐ శాఖను ప్రారంభించారు. తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు విచ్చేసిన సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎస్బీఐ బ్రాంచ్‌ను ప్రారంభించే ముందు నగరంలో ప్రధాన హిందూ దేవాలయాన్ని సైతం సందర్శించి పూజలు చేశారు. అనంతరం లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఎస్బీఐ శాఖ ప్రారంభం అనంతరం ఆమె ఏమన్నారంటే. వాణిజ్యాభివృద్ధిలో ఎస్బీఐ 159 సంవత్సరాల గణనీయమైన ప్రభావాన్ని కలిగిఉంది. ఇది శ్రీలంకలో అత్యంత పురాతనమైన బ్యాంక్. స్వదేశంతో పాటు విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్ 1 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన క్రెడిట్ లైన్‌ను సజావుగా కొనసాగించడానికి ఎస్బీఐ మార్గం సుగమం చేసింది. శ్రీలంకలోని బ్రాంచ్ కార్యకలాపాలతో పాటు, ఎస్బీఐ శ్రీలంక యోనో యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బలమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఎస్బీఐ నిర్వహిస్తోంది. తద్వారా డిజిటల్ చెల్లింపుల పురోగతికి దోహదపడుతోంది. ద్వైపాక్షిక చర్చల పునఃప్రారంభ నేపథ్యం... దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఈటీసీఏ) కోసం భారత్– శ్రీలంక ఉన్నతాధికారుల మధ్య చర్చల పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీలంక మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నుంచి 2018 వరకు ఇరుదేశాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలు నిలిచిపోయాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య 12వ దఫా చర్చలు జరిగాయి. 12వ రౌండ్లో వస్తు సేవలు, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, నివారణ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన అనేక ప్రముఖ కంపెనీలు శ్రీలంకలో ఇప్పటికే పెట్టుబ డులు పెట్టాయి. పెట్రోలియం రిటైల్, టూరిజం, హోటల్, తయారీ, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలలో భారతదేశం నుండి ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి. 2022–23లో శ్రీలంకకు భారత్ ఎగుమతులు 5.11 బిలియన్ డాలర్లు. 2021–22లో ఈ విలువ 5.8 బిలియన్ డాలర్లు. ఇక భారత్ దిగుమతులు చూస్తే, 2021–22లో ఈ విలువ ఒక బిలియన్ కాగా, 2022–23లో 1.07 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
ఇంటి వద్దకే ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, చేతిలో ఇమిడిపోయే మొబైల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా కూడా సేవలు అందించే విధానాన్ని ఆవిష్కరించింది. నేరుగా ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే కియోస్క్ బ్యాంకింగ్ సరీ్వసులను తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులు మొదలైన వారికి ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సరీ్వసులు అందించడంలో కస్టమర్ సరీ్వస్ పాయింట్ ఏజెంట్లకు వీటితో వెసులుబాటు లభిస్తుందన్నారు. నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్ వంటి అయిదు రకాల సర్వీసులు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అకౌంటు తెరవడం వంటి ఇతర సేవలను కూడా చేర్చే యోచనలో ఎస్బీఐ ఉంది. -
ఎస్బీఐ నిధుల సమీకరణ - బాండ్ల జారీతో రూ. 10,000 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకుంది. 7.49 శాతం కూపన్ రేటుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేసినట్లు వెల్లడించింది. వెరసి ఎస్బీఐ నాలుగోసారి ఇన్ఫ్రా బాండ్ల జారీని చేపట్టగా.. నిధులను మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు కేటాయించనుంది. నిజానికి ఎస్బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించేందుకు బాండ్ల ఇష్యూకి తెరతీసింది. అయితే ఐదు రెట్లు అధికంగా అంటే రూ. 21,045 కోట్ల విలువైన 134 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రావిడెండ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాల నుంచి సబ్స్క్రిప్షన్ లభించినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇక ఇదే మార్గంలో ఆగస్ట్‌లోనూ బ్యాంక్ రూ. 10,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఇష్యూతో కలిపి మొత్తం రూ. 39,718 కోట్ల విలువైన దీర్ఘకాలిక బాండ్లను జారీ చేసినట్లయ్యింది. -
ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!
SBI Amrit Kalash: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'ఎస్బీఐ' (SBI) గత కొన్ని నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించిన స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం 2023 జూన్ 30 నాటికి ముగిసింది. అయితే డిపాజిట్ల స్వీకరణకు గడువు మళ్ళీ ఇప్పుడు పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమృత్ కలశ్ (Amrit Kalash) అనే పేరుగల ఈ స్కీమ్ గడువు ఇప్పటికే ముగిసింది. కానీ ఇప్పుడు SBI దీని గడువుని 2023 ఆగష్టు 15కి పెంచింది. అంటే ఈ స్కీమ్ ఇక కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీని ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. తక్కువ కాలంలో మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి. అమృత్ కలశ్ స్కీమ్ వడ్డీ.. నిజానికి అమృత్ కలశ్ స్కీమ్ కాల వ్యవధి కేవలం 400 రోజులు మాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టిన తరువాత సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా ఎస్బీఐ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) అమృత్ కలశ్ స్కీమ్ కింద ఒక సీనియర్ సిటిజన్ రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. అతనికి 400 రోజులకు 7.6 శాతం వడ్డీ ప్రకారం రూ. 86,000 వడ్డీ, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ లెక్కన రూ. 80,170 వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) అమృత్ కలశ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి వెళ్ళవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
వచ్చే పాలసీలోనూ రేటు యథాతథమే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెలలో (ఆగస్టు 8 నుంచి 10 మధ్య) జరిగే ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో కూడా రెపో రేటుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. పలు విభాగాలకు సంబంధించి గణాంకాలు... ముఖ్యంగా అదుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం తన అంచనాలకు కారణమని ఇండస్ట్రీ వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ 2.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో గడచిన రెండు ద్వైమాసికాల్లో ఈ రేటును ఆర్బీఐ కమిటీ యథాతథంగా కొనసాగిస్తోంది. సీఐఐ సమావేశంలో ఖరా ఏమన్నారంటే... ► కార్పొరేట్ రంగ ప్రైవేట్ మూలధన వ్యయం (క్యాపెక్స్) రిటైల్ డిమాండ్‌లో పటిష్టతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వినియోగం పెరుగుతోంది. దీనితో కార్పొరేట్ రంగం క్యాపెక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయంలో సానుకూల సంకేతాలనే మేము చూస్తున్నాం. ► అందరికీ ఆర్థిక సేవలు అందడం... సామాజిక–ఆర్థిక సాధికారతకు కీలకమైన పునాది. ఇది ప్రజల సమగ్రాభివృద్ధికి తగిన మార్గం. అందరినీ ఆర్థిక రంగంలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. ► 2014లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనసహా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, యూపీఐ వంటి సామాజిక భద్రతా పథకాలు ప్రజలను ఆర్థిక వ్యవస్థతో మమేకం చేస్తున్నాయి. ► ఆర్థిక సేవల పరిశ్రమలో మరో ముఖ్యమైన పురోగతి... ఫిన్‌టెక్‌ల పెరుగుదల. ఆయా సంస్థలు విస్తృత శ్రేణిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఈ విషయంలో కొత్త సానుకూల నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్ చైన్, డేటా–అనలిటిక్స్ వంటి వినూత్న సాంకేతికతలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!
SBI home loans processing fees waiver: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలను తీసుకునే ఖాతాదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై రాయితీతోపాటు, 50 - 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ వెసులు బాటును అందిస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఆగస్ట్ 31 వరకే హోమ్ లోన్స్‌పై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, నాన్ శాలరీడ్ హోమ్ లోన్, ప్రివైలేజ్ హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ వంటి వాటిపై ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందనేది గమనార్హం.రాయితీ లేకుండా ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రుణంపై 0.35శాతం, జీఎస్టీ కలుపుకొని కనిష్టంగా రూ.2,000 - రూ. 10వేల మధ్య ఉంటుంది. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ♦ హెచ్ఎల్ రీసేల్, రడీ టూ మూవ్ ప్రాపర్టీలకు గతంలో సూచించిన రేట్ల కంటే 20 bps అదనపు రాయితీ. అయితే సిబిల్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ♦ బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్లకుపైన పేర్కొన్న సిఫార్సు చేసిన రేట్ల కంటే 5 bps ఎక్కువ తగ్గింపు. ♦ శౌర్య, శౌర్య ఫ్లెక్సీ పై ప్రతిపాదిత రేట్ల కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల రాయితీ. హెచ్ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతోపాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు. అలాగే ఇన్స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మోర్ట్గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాపెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. మ రోవైపు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను తాజాగా పెంచింది. కాల వ్యవధి ఆధారంగా దీన్ని 8 శాతం నుంచి 8.75 శాతం మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) -
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు జూమ్
ముంబై: దేశంలోనే మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) పరంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 90 వేల కోట్ల మేర ఆస్తులను పెంచుకుంది. దీంతో సంస్థ నిర్వహణలోని మొత్తం ఏయూఎం మార్చి నాటికి ఉన్న రూ.7.10 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీపీ సింగ్ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతర్గతంగా విధించుకున్నట్టు చెప్పారు. మార్కెట్లో ఏదైనా తీవ్ర పతనాన్ని చూస్తే తప్పితే, తాము దీన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఏయూఎం జూన్ చివరికి రూ.43.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 8 శాతం మార్కెట్ వాటా: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.43.2 లక్షల కోట్ల ప్రకారం చూస్తే, ఎస్బీఐ ఫండ్ ఏయూఎం వాటా 18%. ఇందులో రూ.5.5 లక్షల కోట్ల ఆస్తులు ఈక్విటీలకు సంబంధించినవిగా సింగ్ వెల్లడించారు. ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో తమ పథకాల్లోకి రూ.2,200 కోట్లు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ పెట్టుబడులు టాప్–30 పట్టణాల నుంచి ఉన్నాయన్నారు. ఎస్బీఐ నిర్వహణలోని ఫోలియోల్లో (పెట్టుబడి ఖాతా) 35% చిన్న పట్టణాలవేనని తెలిపారు. -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్‌లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
ఎస్బీఐ కార్డ్ నిధుల సమీకరణ!
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డ్ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు ఎన్‌ఎఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 918 వద్ద ముగిసింది. -
ఏఐ వినియోగానికి మరింత ఆసక్తి చూపుతున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి అధునాతన టెక్నాలజీల వినియోగాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెక్ట్స్‌జెన్ డేటా వేర్‌హౌస్, డేటా లేక్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఫిన్‌టెక్ సంస్థలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కలిసి రుణాలిచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ఎస్బీఐ ఈ విషయాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళికరాజకీయపరమైన సవాళ్లు, చైనాలో కోవిడ్ మళ్లీ విజృంభించడం మొదలైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతీయ ఎకానమీ దీటుగా నిల్చిందని, తమ బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో కూడా ఇది ప్రతిబింబించిందని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. తమ బ్యాంకు గత మూడేళ్లుగా వరుసగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తోందని ఆయన వివరించారు. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..) ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద గుర్తించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక విద్యుత్ తదితర కొత్త రంగాలకు రుణాలు కల్పించడం ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు ఖరా చెప్పారు. 2022–23లో ఎస్బీఐ నికర లాభం (స్టాండెలోన్) 58 శాతం పెరిగి రూ. 31,676 కోట్ల నుంచి రూ. 50,232 కోట్లకు ఎగిసింది. -
ఎస్బీఐ సేవల్లో అంతరాయం.. సర్వర్ డౌనా? సైబర్ అటాకా?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు సోమవారం రోజు (3-4-2023) సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈరోజు 4వ రోజు. మార్చి 31 నుంచి ఎస్బీఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయి. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్లలో పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. Second working day of the new financial year and the SBI website is down. @TheOfficialSBI @RBI pic.twitter.com/mpRVH5ESBb — Gaurav Dutta (@dgaurav7) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 -
గోద్రెజ్ గ్రూప్, ఎస్బీఐ ఒప్పందం
ముంబై: గోద్రెజ్ గ్రూప్‌లో భాగమైన గోద్రెజ్ క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. బ్యాంకింగ్ సాధనాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ తదితర ఆర్థిక సేవలను ఎస్బీఐ మరింత విస్తృతంగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందడాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా చేసేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా తెలిపారు. -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
FIFA: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్నఫైనల్తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తన దేశం తరపున చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్ కొట్టడమే గాక సూపర్ అసిస్ట్స్తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్ కొట్టాలని కోరుకుందాం. అయితే అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు చెందిన పాస్‌బుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్బీఐ పాక్బుక్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్బీఐ పాస్ బుక్ రంగు ఒకటి కావడమే. అర్జెంటీనా జెర్సీ లైట్ బ్లూ, వైట్ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్బీఐ పాస్‌బుక్ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎస్బీఐ పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ పాస్‌బుక్ ఫొటోలు ట్విటర్లో వైరల్‌గా మారింది. SBI's lunch time = Argentina's Whole Match https://t.co/u2kt12FyRX — Harshad (@_anxious_one) December 15, 2022 Reason why Indians support Argentina Indians feel if Argentina loose they will loose all their money 😉#India #FIFAWorldCup #GOAT𓃵 #FIFAWorldCupQatar2022 #Argentina #WorldCup2022 #WorldCup #finale #mumbai #Delhi #Kerala #TamilNadu #Karnataka #Bengaluru #SBI #Bank pic.twitter.com/CTi7TW5X3Y — We want United India 🇮🇳 (@_IndiaIndia) December 15, 2022 State Bank of India (SBI) is also supporting Argentina 😆#FIFA #FIFAWorldCupQatar2022 #FIFAWorldCup2022 #ArgentinaVsFrance #Argentina @TheOfficialSBI pic.twitter.com/4gRYXItziq — Maghfoor Ahmad (@maghfoormalkana) December 15, 2022 చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు -
బ్యాంకింగ్ వ్యవస్థ బాగు... బాగు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ గతంకంటే ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేఖ కుమార్ ఖరా తెలిపారు. అలాగే అధిక రుణ వృద్ధిని కొనసాగించే పరిస్థితులు కనబడుతున్నాయని వివరించారు. ఎస్బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► రుణ అండర్‌రైటింగ్, రిస్క్ దృక్పథం పరిస్థితులకు సంబంధించి బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయి. ► బ్యాంకింగ్ రుణ నిర్ణయాల్లో ఇప్పుడు శాస్త్రీయత పెరిగింది. అలాగే బ్యాంకింగ్ వద్ద ప్రస్తుతం తగిన మూలధన నిల్వలు ఉన్నాయి. ► పలు సంవత్సరాలుగా వార్షిక రుణ వృద్ధిని రెండంకెలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడిన బ్యాంకింగ్ వ్యవస్థ నవంబర్ 4తో ముగిసిన పక్షం రోజుల్లో 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ► గతం తరహాలో కాకుండా, కార్పొరేట్లు కూడా తమ బ్యాలెన్స్ షీట్స్‌లో రుణ భారాల సమతౌల్యతను పాటిస్తున్నాయి. ► బ్యాంకింగ్ ఆధారపడే డేటా, రుణ నిర్వహణ, చర్యల వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దివాలా కోడ్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్ డేటా, రేటింగ్స్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అందుతున్న గణాంకాలు, క్రెడిట్ బ్యూరోల రిపోర్టుల వంటి సానుకూల అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా బ్యాంకింగ్‌సహా అన్ని రంగాలకూ భారీ భరోసాను అందించే అంశం. ► ఈ కాలంలో మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న డెట్ మార్కెట్ మరింత పటిష్టం కావాలి. ► భారత్ బ్యాంకింగ్, జీఐఎఫ్‌టీ సిటీ తరహా ప్రత్యామ్నాయ యంత్రాంగాలు రాబోయే కాలంలో భారత్ సమగ్ర వృద్ధికి దోహదపడ్డానికి కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారీ లాభాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. -
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
జేఏఎల్‌పై ఎస్బీఐ దివాలా పిటీషన్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా పిటీషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్ 15 నాటికి కంపెనీ మొత్తం రూ. 6,893 కోట్ల మేర బాకీ పడిందని పేర్కొంది. జేఏఎల్ రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతున్నందున దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం నెలకొందని ఎస్బీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి భువన్ మదన్‌ను తాత్కాలిక పరిష్కార నిపుణుడిగా నియమించాలంటూ ప్రతిపాదించింది. మరోవైపు, రుణాల చెల్లింపు కోసం తమ సిమెంటు ప్లాంట్లను విక్రయించినట్లు జేఏఎల్ తెలిపింది. రుణదాతలకు చెల్లింపులు జరిపేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. -
రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో కరౌలీ జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెహందీపూర్ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎస్బీఐ మెహందీపూర్ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
SBI: ఇళ్లు కట్టాలంటే ఇబ్బందే.. హోంలోన్స్‌పై వడ్డీరేట్ల పెంపు
ముంబై: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేట్లను 7.55 శాతానికి పెంచింది. బుధవారం నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మేలో ఈ రేటు 4% నుంచి 4.4%కి చేరిన సంగతి తెలిసిందే. వెబ్సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంపుదల చేసింది. ప్రస్తుతం ఈ రేటు 6.65 శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలిగి ఉంది. తాజాగా ఈ రేటు 7.15 శాతానికి చేరింది. బీఓబీ డిపాజిట్ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు 40 బేసిస్ పాయింట్ల వరకూ బుధవారం ప్రకటించింది. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
డిజిటల్ మోసాలతో జాగ్రత్త..
న్యూఢిల్లీ: ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇందుకోసం పాటించతగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికీ ఎప్పుడూ పాస్వర్డ్లు వెల్లడించరాదని, తమ పరికరాల్లో ’ఆటో సేవ్’, ’రిమెంబర్ (గుర్తుపెట్టుకో)’ ఆప్షన్లను డిజేబుల్ చేయడం ద్వారా డివైజ్‌లో కీలక వివరాలు ఉండకుండా చూసుకోవాలని సూచించింది. ఖాతాదారులు తమ డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు, సోషల్ మీడియా సెక్యూరిటీకి సంబంధించి అన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. సంక్లిష్టమైన, విశిష్టమైన పాస్వర్డ్ ఉపయోగించాలని, తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ‘ఎన్నడూ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు లేదా పిన్ నంబర్లను డివైజ్‌లో భద్రపర్చుకోవడం లేదా రాసిపెట్టుకోవడం, ఎవరికైనా చెప్పడం లాంటివి చేయొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎన్నడూ మీ యూజర్ ఐడీ/పాస్వర్డ్లు/కార్డ్ నంబరు/పిన్/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలు అడగదు‘ అని ఎస్బీఐ పేర్కొంది. మార్గదర్శకాల్లో మరిన్ని.. ► ఆన్లైన్ లావాదేవీల్లో భద్రత కోసం బ్యాంక్ వెబ్సైట్ అడ్రెస్లో ’https’ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ వై–ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించవద్దు. లావాదేవీ పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ అవ్వాలి. బ్రౌజర్‌ను మూసివేయాలి. ► యూపీఐ లావాదేవీలకు సంబంధించి మొబైల్ పిన్, యూపీఐ పిన్ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ► గుర్తు తెలియని యూపీఐ అభ్యర్థనలకు స్పందించవద్దు. ఇలాంటి వాటిని తక్షణమే బ్యాంకు దృష్టికి తీసుకురావాలి. నగదును పంపేందుకు మాత్రమే పిన్ అవసరం, అందుకునేందుకు అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ► కస్టమర్లు తమకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగిందని గుర్తిస్తే వెంటనే తమ ఖాతా నుండి యూపీఐ సర్వీసును డిజేబుల్ చేయాలి. ► ఏటీఎం మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ డివైజ్‌ల దగ్గర లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ► ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, పీవోఎస్, ఏటీఎం మెషీన్లలో లావాదేవీలకు సంబంధించి పరిమితులు సెట్ చేసి ఉంచుకోవాలి. ► మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ విషయానికొస్తే కస్టమర్లు పటిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. తమ ఫోన్లు మొదలైన వాటిల్లో వీలైతే బయోమెట్రిక్ ధ్రువీకరణను ఉపయోగించాలి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరికైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం వెల్లడించడం లేదా వ్యక్తిగత వివరాలను చర్చించడం వంటివి చేయొద్దు. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఈ ఫోన్ నెంబర్స్‌తో జాగ్రత్త..లేకపోతే..!
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్ వెబ్సైట్లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. ఈ నంబర్ల పట్ల జాగ్రత్త..! తాజాగా ఎస్బీఐ కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్ నంబర్లను ట్విటర్లో పేర్కొంది. కేవైసీ అప్డేట్ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్, మెసేజ్స్ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించంది. ఈ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్స్ను ఒపెన్ చేయకూడదని విన్నవించింది. ఈ మెసేజ్స్తో ఖాతాదారులు అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ హ్యండిల్లో పేర్కొంది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది. Do not engage with these numbers, & don't click on #phishing links for KYC updates as they aren't associated with SBI. #BeAlert & #SafeWithSBI https://t.co/47tG8l03aH — State Bank of India (@TheOfficialSBI) April 20, 2022 చదవండి: ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్ -
గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా ఎస్బీఐకి రూ.3,800 కోట్లు
ముంబై: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ తాజాగా ఐఎఫ్ఎస్సీ గిఫ్ట్ సిటీ బ్రాంచీ ద్వారా 50 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)ను సమీకరించింది. గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా తొలిసారి ఆఫ్‌షోర్ యూఎస్ డాలరు సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేటు(ఎస్వోఎఫ్ఆర్) ఆధారిత సిండికేట్ రుణాన్ని అందుకున్నట్లు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) పేర్కొంది. 40 కోట్ల డాలర్ల విలువైన ఈ రుణ సౌకర్యంతోపాటు గ్రీన్‌షూ ఆప్షన్‌కింద మరో 10 కోట్ల డాలర్లను సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ మార్కెట్లలో బ్యాంకు సృష్టించుకున్న గుర్తింపునకు తాజా రుణ సమీకరణ నిదర్శనమని ఎస్బీఐ తెలియజేసింది. అంతేకాకుండా ఐఎఫ్ఎస్సీ గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ ఫైనాన్షియల్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో బ్యాంకుకున్న కట్టుబాటుకు ఇది మరో ముందడుగుగా అభివర్ణించింది. ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం నీరసించి రూ. 510 వద్ద ముగిసింది. చదవండి: ఎస్బీఐ షాకింగ్ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..! -
ఎస్బీఐ షాకింగ్ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు ఏప్రిల్ 15, 2022 నుంచి అమలులోకి రానుంది. ఎస్బీఐ అందించే లోన్ల వడ్డీ రేటు మరో 0.10 శాతం పెరగనుంది. ఈ పెంపు అన్ని రకాల టెన్యూర్స్‌కు వర్తించనుంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లను తీసుకునే వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. ఇక గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎస్బీఐ సవరించిన ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. ఒక నెల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతం. 3 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. 6 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతం. ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతం. రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతం. మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతం. ఎంసీఎల్ఆర్ పెంపు...ఎస్బీఐ రుణ గ్రహీతలపై ప్రభావం..! సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే సదరు లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)2016లో ప్రవేశపెట్టింది. ఎంసీఎల్ఆర్ పెరుగుదలతో...ఎస్బీఐ గృహ, ఇతర రుణగ్రహీతలు సంతోషంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సవరణ ప్రస్తుత, భవిష్యత్తు రుణగ్రహీతలకు వర్తిస్తుంది. చదవండి: జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...! -
సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు
సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు? ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రామకృష్ణ కోరారు. -
ఎన్పీఏల విక్రయానికి ఎస్బీఐ రెడీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు), ఎన్బీఎఫ్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇవీ ఖాతాలు: ఎస్బీఐ విక్రయించనున్న ఎన్పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌వర్త్ ఉర్జా అండ్ మెటల్స్(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్ అలాయ్స్కు రూ. 178.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్పీఏ ఖాతాలకు ఏప్రిల్ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు. -
బ్యాంకులకు కుచ్చు టోపీ...రూ. 22,842 కోట్ల మోసం
న్యూఢిల్లీ: అక్షరాలా రూ.22,842 కోట్లు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వ్యాపారం కోసమంటూ రుణాలుగా తీసుకున్నారు. చెల్లించకుండా చేతులెత్తేశారు. దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటిదాకా నమోదు చేసిన బ్యాంకు మోసాల్లో అతి పెద్దదిగా భావిస్తున్నారు. నిధులు మింగేసిన ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ (ఏబీజీఎస్‌ఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్‌కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెతియాతో పాటు మరో సంస్థ ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పింది. ‘‘ఈ కంపెనీలకు, నిందితులకు చెందిన సూరత్, భరూచా, ముంబై, పుణే తదితర పట్టణాల్లో 13 ప్రాంతాల్లో సోదాలు చేశాం. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపింది. ఎస్బీఐ రుణం రూ.2,468.51 కోట్లు రుణాలు తీసుకొని చెల్లించలేదంటూ 2019 నవంబర్ 8న సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. 2020 మార్చి12న సీబీఐ మరిన్ని వివరాలు కోరింది. 2020 ఆగస్టులో ఎస్బీఐ మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును ఏడాదిన్నరపాటు క్షుణ్నంగా పరిశీలించిన సీబీఐ ఈ నెల 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చాయి. ఎస్బీఐ ఒక్కటే రూ.2,468.51 కోట్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 2012–17 వరకు కంపెనీ కార్యకలాపాలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. నిందితులంతా కుమ్మక్కై నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది. ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ లోన్ అకౌంట్‌ను 2016 జూలైలో నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏ) బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. ఏబీజీ గ్రూప్‌నకు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రధానంగా నౌకల నిర్మాణం, మరమ్మతులు చేస్తున్నట్లు ఎస్బీఐ ఫిర్యాదులో పేర్కొంది. గుజరాత్ కేంద్రంగా పని చేసే దీనికి భారత నౌకా నిర్మాణ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీగా పేరుంది. గత 16 ఏళ్లలో ఇది 165కు పైగా నౌకలను నిర్మించింది. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
మహమ్మారిని ఎదుర్కొనడంపైనే బడ్జెట్ దృష్టి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు. ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కొనసాగించాలి. -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..!
త్వరలో రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో కొనుగోలు చేసే వస్తువుల మీద 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ను తన వినియోగదారులకు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సోమవారం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో చేతులు కలిపింది. ఈ సేల్ ఎప్పటి లాగానే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందుగానే ప్రారంభమవుతాయి. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఏడాది ముందుగానే రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ఏడాది గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ ఈనెల 20 నుంచి ప్రారంభమై 23న ముగుస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం జనవరి 16-17 నుంచి ప్రారంభమవుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తే, ఫ్యాషన్ వస్త్రాల మీద 80 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. కాగా, ఈ సేల్‌లో ముఖ్యంగా లేటేస్ట్ ఫోన్లు అయిన వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ, ఐక్యూ జెడ్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్ల యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!) -
మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన
కోల్‌కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది. చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది. అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది. మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది. మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్‌కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి. -
భౌతిక–డిజిటల్ విధానాల కలయిక తప్పనిసరి
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సేవలకు సంబంధించి భారత్‌లో భౌతిక (ఫిజికల్), డిజిటల్ విధానాల మేలు కలయిక తప్పనిసరని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా స్పష్టం చేశారు. విస్తృత భౌగోళిక అంశాలు దీనికి కారణంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్ ఆర్థిక వ్యవస్థ పయనం దిశలో సవాళ్లు– పరిష్కారాలు’ అన్న అంశంపై ఫిక్కీ, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్‌ఐబీఏసీ 2021 వర్చువల్ సమావేశాల్లో చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► భారతదేశంలో బ్యాంకింగ్ పలు రకాల వినియోగదారులకు సేవలను అందిస్తోంది. మేము డిజిటల్ అవగాహన ఉన్నవారికి అలాగే ఫోన్ క్లిక్‌ల ద్వారా భౌతికంగా ఏమీ పొందాలనుకోని వారికి కూడా సేవ చేస్తాము. ఆర్థిక–డిజిటల్ అక్షరాస్యత లేని వినియోగదారులు భారత్‌లో ఉన్న విషయాన్ని గమనించాలి. ► కనుక భారతదేశం వంటి దేశంలో వినియోగదారులకు భౌతిక, డిజిటల్ ఆర్థిక సేవలు రెండూ అవసరమని, ఈ విషయంలో సహజీవనం చేయక తప్పదని నేను భావిస్తున్నాను. ► భారత్‌లో కో–లెండింగ్ నమూనా ఆవిర్భావం విషయానికి వస్తే, దేశంలో మారుమూల ఉన్న వారికిసైతం ఆర్థిక సేవలు అందాలన్న ప్రధాన ధ్యేయంతో ఏర్పడిన యంత్రాంగం ఇది. ప్రస్తుతం సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బీఐకి 65% శాఖలు ఉన్నాయని, ఇలాంటప్పుడు కూడా కో–లెండింగ్ భాగస్వామి అవసరమా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు ఇంకా చొచ్చుకువెళ్లాల్సి ఉందని అనుకుంటున్నాను. రుణగ్రహీతల అవసరాల గురించిన తగిన సమాచారాన్ని çకో–లెండింగ్ భాగస్వామి వ్యవస్థ తగిన విధంగా అందించగలుగుతుందని భావిస్తున్నాను. ► ఎస్బీఐ అటువంటి రెండు భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మరికొందరితో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకోడానికి వారి వద్దనున్న సమాచారం దోహదపడుతుంది. టెక్నాలజీతో ఆర్థిక సేవల్లో పెను మార్పులు: కేవీ కామత్ కొంగొత్త టెక్నాలజీల రాకతో ఆర్థిక సేవల రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ బ్యాంకరు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. టెక్ ఆధారిత కొత్త తరం సంస్థలను కూడా నియంత్రణ నిబంధనల పరిధిలోకి తెచ్చేలా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. తద్వారా సదరు రంగంలోని సంస్థలన్నింటికీ సమాన హోదా, నిబంధనలు వర్తించేలా కృషి చేయాలని ఫిక్కీ–ఎఫ్‌ఐబీఏసీ 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కామత్ తెలిపారు. డిజిటల్‌తో తగ్గిన బ్యాంకింగ్ భారం: గోయెల్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, యుకో బ్యాంక్ సీఈఓ ఏకే గోయెల్ సమావేశంలో ప్రసంగిస్తూ, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ వల్ల బ్రాంచీలపై భారం తగ్గిందని అన్నారు. అయితే ఇప్పటికీ 30 శాతం మంది ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్న విషయం ఒక సమస్యగా ఉందని అన్నారు. సహ రుణ (కో–లెండింగ్) విధానం ద్వారా లేదా ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యంతో డిజిటల్ రుణాలను మెరుగుపరచవచ్చని, ఇది బ్యాంకు శాఖల భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త: ఎస్బీఐ నుంచి మరో భారీ నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థ! శాఖలను విస్తరిస్తూ.. సేవలను విస్తృతం చేస్తోంది. నిత్యం కొలువుల భర్తీ చేపడుతూ.. ఉద్యోగార్థులకు కేరాఫ్‌గా నిలుస్తోంది! తాజాగా.. మరో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా బ్యాంకు పరిధిలోని ఐదు సర్కిళ్లలో.. పన్నెండు వందలకు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, విజయం సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువు దక్కిం దంటే.. లైఫ్ సెటిల్ అయినట్లే! ఇక కెరీర్లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. ఆకర్షణీయ వేతనం, ఉజ్వల భవిష్యత్ సొంతమవుతాయి. అందుకే బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. తాజాగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ►మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 1226 ►ప్రారంభ వేతన శ్రేణి: రూ.36,100–రూ.63,840 ►అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►అనుభవం: డిసెంబర్ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభ వం తప్పనిసరి. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ అనుభవం పొంది ఉండాలి. ►వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 21–30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ ఎస్బీఐ సీబీఓ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్ష ఇలా ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది నాలుగు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు– 40 మార్కులు, జనరల్ అవేర్నెస్/ఎకానమీ 30 ప్రశ్నలు–30 మార్కులు, కంప్యూటర్ అప్టిట్యూడ్ 20 ప్రశ్నలు–20 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్ పరీక్ష ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లిష్ భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహి స్తారు. ఈ డిస్క్రిప్టివ్ పరీక్షలో భాగంగా అభ్యర్థులు లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ రాయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖా స్తు, అనుభవం, ధ్రువపత్రాలను స్కీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. సంస్థ కోరుకుంటున్న ఉద్యోగ అనుభవం అభ్యర్థికి ఉందని కమిటీ సంతృప్తి చెందితేనే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. పర్సనల్ ఇంటర్వ్యూ రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించా రు. అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన అంశాలపై అవగాహన, బ్యాంకింగ్ రంగంపై పరిజ్ఞానాన్ని పరిశీలించేవిధంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపిక అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను వెయిటేజీ ఆధారంగా క్రోడీకరించి.. తుది విజేతలను ప్రకటిస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంట ర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు.ఆ తర్వాత తుది విజేతలను ఖరారు చేస్తారు. లాంగ్వేజ్ టెస్ట్ సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికారిక భాషపై లాంగ్వేజ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన భాష పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే నియామకం ఖరారు చేస్తారు. పదో తరగతి, 12వ తరగతిని సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివిన వారికి ఈ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు కల్పిస్తారు. కెరీర్ ఇలా ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. ఈ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. ఇలా పూర్తిస్థాయి నియామకం ఖరారైన వారికి జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్–1 హోదా కల్పిస్తారు. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. రాత పరీక్షలో రాణించాలంటే ఎస్బీఐ సీబీఓ రాత పరీక్షలో విజయం సాధించాలంటే..అభ్యర్థులు మొదటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. ఆయా సబ్జెక్ట్‌లు, విభాగాల వారీగా దృష్టి సారించి.. ప్రిపరేషన్ కొనసాగించాలి. ►ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో స్కోర్ కోసం బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ►జనరల్ ఎవేర్నెస్/ఎకానమీ: ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పరిణామాలు, విధానాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో.. కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్‌తోపాటు ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకానమీకి సంబంధించి జీడీపీ మూల భావనలు, సమ్మిళిత వృద్ధి, మైక్రో, మాక్రో ఎకనామిక్స్ భావనలు తెలుసుకోవాలి. ►బ్యాంకింగ్ నాలెడ్జ్: ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ►కంప్యూటర్ అప్టిట్యూడ్: ఈ విభాగానికి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా కంప్యూటర్ పదజాలం, బ్యాంకింగ్ రంగంలో వినియోగించే సాఫ్ట్వేర్ల గురించి అవగాహన పెంచుకోవాలి. ►ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో.. లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లో రాణించడానికి బిజినెస్ లెటర్స్, అఫిషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్‌ను రాయడం అలవర్చుకోవాలి. వీటిలో పంక్చుయేషన్స్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ఎస్సే రైటింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ రంగ పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ వ్యాసాలు రాయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దిన పత్రికల్లో ప్రచురించే బిజినెస్ న్యూస్, అనాలిసిస్‌లను అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి సారాంశాన్ని గ్రహించి.. ఎస్సే రాయగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ►ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం: సీబీఓ అభ్యర్థులు ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష విజయంలో ప్రాక్టీస్ ఎంతో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి పాత ప్రశ్న పత్రాలు, మోడల్ ప్రశ్న పత్రాల సాధనకు సమయం కేటాయించాలి. ప్రతి రోజు కనీసం 8 నుంచి పది గంటలు సమయం వెచ్చించే విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎస్బీఐ సీబీఓ–ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021 ►కాల్ లెటర్: జనవరి 12, 2022 నుంచి ►పరీక్ష తేదీ: జనవరి 2022లో ►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ►ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2022 రెండో వారం/మూడో వారం ►పర్సనల్ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి/ఏప్రిల్ ►వెబ్సైట్: https://bank.sbi/careers -
ఇక వడ్డీ రేట్లు పైపైకే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరెంతోకాలం సరళతర ద్రవ్య, పరపతి విధానాన్ని కొనసాగించలేదన్న సంకేతాలు అందుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్ల పెంపు దిశగా తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. మరికొన్ని బ్యాంకులూ దీనిని అనుసరించే అవకాశం ఉంది. ఎస్బీఐ విషయానికి వస్తే కొన్ని డిపాజిట్ రేట్లను– రుణరేట్లను పెంచుతూ బ్యాంకింగ్ దిగ్గజం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుకు సంబంధించిన బేస్ రేటునూ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. దీనితో బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా బేస్ రేటు 7.55 శాతానికి చేరింది. ఎస్బీఐ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలిపింది. బేస్ రేటు అంటే ఒక బ్యాంక్ అనుసరించే కనీస వడ్డీరేటు. బేస్ రేటుకు అనుసంధానమైన వడ్డీరేట్లు ఇంతకన్నా (బేస్ రేటు) తక్కువ ఉండవు. కొత్త రేటు డిసెంబర్ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కూడా బ్యాంక్ వెబ్సైట్ వివరించింది. గడచిన రెండేళ్లలో ఎస్బీఐ బేస్ రేటును పెంచడం ఇదే తొలిసారి. అయితే ఎస్బీఐ మొత్తం రుణాల్లో బేస్ రేటుకు అనుసంధానమై ఉన్నవి కేవలం 2.5% మాత్రమే కావడం గమనార్హం. 2019 జనవరి ముందు రుణాలకు వర్తింపు కాగా తాజా నిర్ణయం జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారికి వర్తించదు. అంతకుముందు రుణం తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వడ్డీరేట్ల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా 2019 జనవరి నుంచీ బేస్ రేటు విధానం నుంచి ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) విధానానికి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)కు ఈబీఎల్ఆర్ అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు మార్పులకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి, రుణ, డిమాండ్, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమావేశాల్లో సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా కీలక రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ కూడా... బేస్ రేటు విధానం ప్రారంభానికి (2010 జూలై 1) ముందు అమల్లో ఉన్న బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)నూ 10 బేసిస్ పా యింట్లు అంటే 12.2% నుంచి 12.3 %కి పెంచింది. డిపాజిట్ రేటు పెంపు తీరు.. మరోవైపు రూ.2 కోట్లు పైబడి విలువ కలిగిన డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 7.55 శాతానికి చేరింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు... రెండు పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)– బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఐదు సంవత్సరాల వరకూ డిపాజిట్లపై ఈ నెలారంభంలో వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచాయి. డిసెంబర్ 10 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది. దీనితో బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం నుంచి 6.55 శాతానికి పెరిగింది. కీలక సమయం ఆసన్నం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి. అయితే ఇక్కడ క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవద్దని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం నుంచి వైదొలగాలని చెప్పడం ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తు ప్రయోజనాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సమయం ఆసన్నమైంది. ఉదయ్ కోటక్, కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ మరెంతో కాలం సాగదు... మహమ్మారి నేపథ్యంలో మనం అతి తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను చూశాం. అయితే ఇది ఎంతోకాలం సాగా పరిస్థితి లేదు. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులకు సంబంధించి ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంలో పొందుతున్న వడ్డీరేట్లలో పెరుగుదలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ రేటు 3.35 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఈ స్థాయి నుంచి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష నిర్ణయాలపై బ్యాంకింగ్ వేచి చూస్తోంది – అశిష్ పార్థసారథి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్రజరీ చీఫ్ ఒక శాతం పెరిగే అవకాశం భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) సరళతర విధానాల నుంచి వెనక్కు మళ్లే అవకాశం ఉంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) ఒక శాతం పెరగవచ్చు. 2022ని భారతదేశం ‘సాధారణ పాలసీ సంవత్సరంగా’ పరిగణిస్తోంది. వినియోగం ద్వారా వృద్ధి రికవరీ పటిష్టం అవుతుందని భావిస్తున్నాం. 2–6 శాతం శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుంద్నది మా అభిప్రాయం. – బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక -
ఎస్బీఐ ఆఫర్, రూ.342తో రూ.4 లక్షల బెన్ఫిట్
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై కీలక ప్రకటన చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పథకాల్లోని ఇన్స్యూరెన్స్ పాలసీలపై రూ. 342 ప్రీమియం చెల్లిస్తే రూ.4 లక్షలు బెనిఫిట్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ చెప్పింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. మహమ్మారి నుంచి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు పాలసీ దారులు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఆయా ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన( పీఎంజేజేబీవై) స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 అయితే తాజాగా ఎస్బీఐ ఈ స్కీములకు సంబంధించిన ప్రీమియం అంశంపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న పాలసీదారులు ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకం కింద సంవత్సరానికి రూ.12 ప్రమియం చెల్లిస్తే యాక్సిడెంట్లో మరణించినా, పూర్తిగా వికలాంగులైనా రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతను/ఆమె రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో 18 నుంచి 50ఏళ్ల లోపు వయస్సున్న సభ్యులు పాలసీ కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు పరిహారాన్ని అందిస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. ఇక ఈ ప్రీమియం ధర సంవత్సరానికి రూ.330గా ఉందని చెప్పింది. -
ఎస్బీఐ కార్డ్ లాభం 67 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) నికర లాభం 67 శాతం ఎగిసింది. రూ. 345 కోట్లకు పెరిగింది. రిటైల్, కార్పొరేట్ కస్టమర్లు గణనీయంగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 206 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ. 2,510 కోట్ల నుంచి రూ. 2,695 కోట్లకు పెరిగింది. ఫీజులు, సర్వీసుల విభాగాల నుంచి మరింత ఆదాయం రావడం ఇందుకు తోడ్పడినట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. సమీక్షాకాలంలో నిర్వహణ వ్యయాలు 25 శాతం పెరిగి రూ. 1,383 కోట్లకు చేరినట్లు వివరించింది. వ్యాపార పరిమాణం పెరగడం ఇందుకు కారణమైనట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. మొండిబాకీలు తదితర అంశాలకు సంబంధించిన వ్యయాలు రూ. 862 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు దిగి వచ్చాయి. కొత్త ఖాతాల సంఖ్య 6,88,000 నుంచి 39 శాతం వృద్ధి చెంది 9,53,000కు చేరింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య 14 శాతం పెరిగి 1.26 కోట్లకు చేరినట్లు, ఈ విషయంలో తమ మార్కెట్ వాటా 19.4 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. బీఎస్ఈలో గురువారం ఎస్బీఐ కార్డ్ షేరు సుమారు 1 శాతం క్షీణించి రూ. 1,124 వద్ద క్లోజయ్యింది. -
డిజిటల్ లావాదేవీలపట్ల జాగ్రత్త: ఎస్బీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపట్ల బ్యాంక్ వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. తెలియని నంబర్లు, ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. ‘కస్టమర్లకు ఎస్బీఐ ఎటువంటి లింక్స్ పంపదు. ఓటీపీ చెప్పాలంటూ ఫోన్ ద్వారా మా బ్యాంక్ సిబ్బంది కోరరు. బ్యాంక్ శాఖ ద్వారానే లావాదేవీలు ఉంటాయి. ఓటీపీలు, సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు’ అని వివరించారు. ఎస్బీఐ ‘మీటింగ్ కస్టమర్స్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యానికి గురువారం ఆయన విచ్చేశారు. చాలా ఏళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ తమ కస్టమర్‌గా ఉం దని గుర్తుచేశారు. అద్భుతమైన సంస్థకు రావ డం ఆనందంగా ఉందన్నారు. సీజీఎంతోపాటు బ్యాంక్ అధికారులు సురేంద్ర నాయక్, పి.ఎల్.శ్రీనివాస్ రావు, పల్లవి శర్మ, మారుతి, సంతోష్ ఉన్నారు. -
గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ మార్కెట్లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించింది. ► రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. ► ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది. రిటైల్ రుణాలపై బీఓబీ ఆఫర్లు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని రిటైల్ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్ రుణ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ తగ్గించింది. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఉత్పాదక రంగంలో భారత్ అగ్రగామి కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్ పవర్ నుంచి సోలార్ పవర్ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్ అభివృద్ధిలో ఎస్బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఎంఎఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కి సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఒడిదుడుకుల ఈక్విటీ మార్కెట్లు పెరిగేటప్పుడు ఒనగూరే అపరిమిత ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించడం, పతనమైనప్పుడు వాటిల్లే నష్టాలను ఓ మోస్తరు స్థాయికి పరిమితం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను పెంచడం ఈ ఫండ్ లక్ష్యం. క్రిసిల్ హైబ్రిడ్ 50+50 – మోడరేట్ ఇండెక్స్ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. వేల్యు యేషన్లు, ఆదాయాల వృద్ధికి కారణమయ్యే అంశాలు, అధిక రాబడులు అందించగలిగే సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాలు, రీట్స్, ఇన్విట్స్ మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందని సంస్థ ఎండీ వినయ్ ఎం టోన్సే తెలిపారు. -
గృహ రుణాలపై ప్రాసెస్ ఫీజు మినహాయింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం హౌసింగ్ లోన్స్ మీద ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతంగా ఉంది. ఎస్బీఐ మాన్సూన్ ధమాకా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, గృహ రుణ కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతాయని.. ఇల్లు కొనేందుకు ఇంతకుమించి మంచి తరుణం లేదని పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకు గృహ రుణాలకు 5 బీపీఎస్ (0.05 శాతం), మహిళ గృహ రుణగ్రహీతలకు 0.05 శాతం రాయితీకి అర్హులని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. -
Sate Bank Day: డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. టైటన్ వాచెస్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. తన యోనో యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది. కాగా ఎస్బీఐ నేడు ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అలాగే తమకు అండగా నిలిచిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ) Get Flat 20% OFF* on all TITAN PAY watches through YONO. Make fast, contactless and secure transactions via Titan Pay. Download now: https://t.co/FpPOSnsD5V #StateBankDay #TitanPay #Titan #ContactlessPayment #TitanWatch #Watch #YONOSBI pic.twitter.com/gTDf05Ndqr — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
విలీనాల తర్వాత బ్యాంక్ ‘సేవలు’ ఎలా ఉన్నాయ్?
ముంబై: బ్యాంకింగ్ విలీనాల తర్వాత కస్టమర్లు ఎలాంటి సేవలు పొందుతున్నారు? ఆయా అంశాల పట్ల వారిలో సంతృప్తి ఎలా ఉంది? వంటి అంశాలను బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలుసుకోనుంది. ఈ మేరకు ఒక సర్వే నిర్వహణకు తగిన కసరత్తు ప్రారంభించింది. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే... ►కస్టమర్ల సేవల కోణంలో విలీనాల వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా? అన్న ప్రధాన ప్రశ్నతోపాటు 22 ప్రశ్నలు సర్వేలో భాగం కానున్నాయి. ►ఎంపికకు వీలుగా ఐదు ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్లీ ఎగ్రీ, ఎగ్రీ, న్యూట్రల్, డిస్‌ఎగ్రీ, స్ట్రాంగ్లీ డిస్‌ఎగ్రీ (గట్టిగా ఆమోదిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, తటస్థం, వ్యతిరేకిస్తున్నా, గట్టిగా వ్యతిరేకిస్తున్నా) అనే ఐదింటిలో ఒకదానికి వినియోగదారు ఓటు చేయాల్సి ఉంటుంది. ►తెలుగురాష్ట్రాలుసహా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు మొత్తం 21 రాష్ట్రాల నుంచి 20,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరగనుంది. ►22 ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు ప్రత్యేకంగా కస్టమర్లకు అందుతున్న సేవలు, 2019, 2020ల్లో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్ బ్రాంచీల్లో వివాద పరిష్కార యంత్రాంగం పనితీరుకు సంబంధించినవై ఉంటాయి. ►‘విలీనాల తర్వాత నేను ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనలేదు’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే...’ వంటి ప్రశ్నలు ఉంటాయి. ►‘బ్యాంక్ కస్టమర్లు– సేవల విషయంలో వారి సంతృప్తికి సంబంధించి సర్వే’ అనే పేరుతో నిర్వహించాలనుకుంటున్న ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి ఆర్బీఐ అప్పగించనుంది. ఈ విషయంలో కొటేషన్ల దాఖలుకు సంస్థలను ఆహ్వానిస్తోంది. ►నియమిత ఏజెన్సీ కస్టమర్ అభిప్రాయ సేకరణ జరుపుతుంది. ఈ అభిప్రాయాన్ని తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్, రాష్ట్రం, బ్రాంచీ, ఖాతా నెంబర్, పేరు వంటి వివరాలను కస్టమర్ నుంచి సవివరంగా తెలుసుకోవాలి. ►సర్వేకు వీలుగా 21 రాష్ట్రాల్లో ఎంపికచేసిన బ్యాంక్ బ్రాంచీల కస్టమర్ల ఫోన్ నెంబర్లను నియమిత ఏజెన్సీకి ఆర్బీఐ సమకూర్చుతుంది. ఏజెన్సీ 2021 జూన్ 22వ తేదీ నాటికి సర్వే పూర్తిచేసి ఆర్బీఐకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 27 నుంచి 12కు బ్యాంకులు.. పలు విలీన చర్యల నేపథ్యంలో 2017 మార్చిలో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కు పడిపోయింది. 2019లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసింది. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఐదు అనుబంధ బ్యాంకులను అలాగే భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసింది. ఇక 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాలుగింటిగా మార్పుతూ చేసిన విలీన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో విలీనం చేసింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌తో విలీనంకాగా, అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌తో కలిసిపోయింది. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్‌లో విలీనమయ్యింది. ఐడీబీఐ బ్యాంక్ కాకుండా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. రూ.1.75 లక్షల కోట్ల సమీకరణకు ఉద్దేశించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ విలీన విధానానికి కేంద్రం అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను స్వయంగా ఆర్థికమంత్రి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ, ఎస్బీఐ పరిమాణం తరహాలో భారత్‌కు మరికొన్ని దిగ్గజ బ్యాంకుల అవసరం ఉందని పేర్కొంటున్నారు. విలీనాలకు నిరసనగా బ్యాంకింగ్ సిబ్బంది సమ్మె సమస్యలను ప్రస్తావిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. పైన పేర్కొన్న ఆరు(ఎస్బీఐ,బీఓబీ, పీఎన్బీ, కెనరా బ్యాం క్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సిస్బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. -
ఎస్బీఐ బంపర్ ఆఫర్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ తగ్గింది. 6.70 శాతం నుంచీ గృహ రుణాలను ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తాలు, సిబిల్ స్కోర్ ఆధారంగా ఆఫర్ చేస్తున్న తాజా రుణ రేట్లు 2021 మార్చి 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం, రూ.75 లక్షల వరకూ రుణాలపై వడ్డీ 6.70 శాతం నుంచీ ప్రారంభమవుతుంది. రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ రుణ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ పూర్తిగా మినహాయిస్తుంది. పండుగల సీజన్ నేపథ్యం.. పండుగల సీజన్‌ను ప్రత్యేకించి మార్చి 29వ తేదీ హోలీని పురస్కరించుకుని తాజా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బిజినెస్) సలోనీ నారాయణ్ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా రుణ గ్రహీతలకు ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యోనో యాప్ వినియోగించే కస్టమర్లకు కూడా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. రీపేమెంట్ల వ్యవస్థ సజావుగా ఉందని సలోనీ నారాయణ్ పేర్కొన్నారు. రుణాల రీపేమెంట్ సవాలుతో కూడిన అంశంగా తాము భావించడం లేదనీ ఆయన వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కస్టమర్‌తో కలిసి ఆ సమస్య పరిష్కారంపై బ్యాంక్ దృష్టి పెడుతుందన్నారు. ఈ అంశానికి సంబంధించి బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. గృహ రుణ విభాగంలో ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) 0.67% నుంచి 0.68% వరకూ ఉన్నట్లు చైర్మన్ దినేష్ ఖారా గత నెల్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల కోట్లకుపైగా వ్యాపారం... ఎస్బీఐ గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లపైగా ఉంది. బ్యాంక్ రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 2012లో రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించింది. 2023–24 చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసానికి ఈ విభాగం నిదర్శనమని చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు సాంకేతికత, వ్యక్తిగత సేవలు కారణమన్నారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఇందులో రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటి. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇది. -
రూ.5 లక్షల కోట్లు దాటిన ఎస్బీఐ గృహ రుణ వ్యాపారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లను దాటింది. రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం గడచిన పదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగిందని బ్యాంక్ బుధవారం తెలిపింది. 2011లో ఈ విభాగానికి సంబంధించి ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించిందని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. 2012లో రూ. లక్ష కోట్ల పోర్ట్‌ఫోలియోతో ఒక ప్రత్యేక ఆర్‌ఈహెచ్‌బీయూ విభాగం ప్రారంభమైంది. అచంచల విశ్వాసానికి నిదర్శనం బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసం అచంచలంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు వినియోగిస్తున్న సాంకేతికత, అలాగే వ్యక్తిగత సేవలు కారణమని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యాధునిక సమ్మిళిత వేదిక– రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటని తెలిపారు. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇదని పేర్కొన్నారు. -
ఎస్బీఐ పరిస్థితి భేష్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ నాణ్యత బాగుందని చైర్మన్ దినేశ్ ఖారా గురువారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో అంచనాలకు మించి జరుగుతున్న రికవరీ– బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ లో ప్రతికూలతలను పరిమిత స్థాయిలోనే కట్టడి చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అయితే కోవిడ్–19కు సంబంధించి రుణ పునర్ వ్యవస్థీకరణ సంబంధ అంశాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించలేదు. త్వరలో ప్రకటించనున్న బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలే దీనికి కారణమని పేర్కొన్నారు. భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని, ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం– 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుందని తెలిపింది. తీవ్ర స్థాయిల్లో పీఎస్‌బీల ఎన్పీఏలు 17.6 శాతం పెరిగే అవకాశమూ లేకపోలేదని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంక్ రుణ నాణ్యతపై ఖరా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎకానమీకి సంబంధించి ఏప్రిల్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో అన్ని రంగాల్లో రికవరీ ప్రక్రియ ఊపందుకుంది. ► ఒక దశలో దేశ ఆర్థిక రంగానికి సంబంధించి కీలక విభాగాలు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కార్పొరేట్లకు నగదు లభ్యతపై సైతం ఆందోళన నెలకొంది. ఇప్పుడు పరిస్థితులు వేగంగా కుదుటపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు కారణం. ► కోవిడ్–19 రోగులకు ఉత్తమ చికిత్స, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వంటి అంశాలు ఆర్థిక రికవరీని వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతున్నాయి. ► ప్రస్తుత కీలక తరుణంలో బ్యాంకులు రుణ గ్రహీతకు అవసరమైన సలహాలను అందించాలి. ► బడ్జెట్ అంచనాలపై ఇప్పుడే చేసే వ్యాఖ్య ఏదీ లేదు. ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో మా అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ లిస్టింగ్ అంతక్రితం ఇండియా ఐఎన్ఎక్స్ గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్ (జీఎస్ఎం) ప్లాట్‌ఫామ్‌పై ఎస్బీఐ 600 మిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ బాండ్ ఇష్యూ లిస్టింగ్ కార్యక్రమంలో ఖరా పాల్గొన్నారు. తన 10 బిలియన్ డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ లండన్ బ్రాంచ్ తాజా ఇష్యూ లిస్ట్ చేసింది. బాండ్ కూపన్ రేటు 1.80 శాతం. 2008 తర్వాత ఇంత తక్కువ కూపన్ రేటు ఇదే తొలిసారి. ఇండియా ఐఎన్ఎక్స్పై భారీగా ఫారిన్ కరెన్సీ ఇష్యూ చేస్తున్న జాబితాలో ఎస్బీఐ ఒకటి. తాజా లిస్టింగ్‌తో కలిపి దాదాపు 2.6 బిలియన్ డాలర్ల బాండ్లను బ్యాంక్ ఇప్పటికి లిస్ట్ చేసింది. తద్వారా నిధుల సమీకరణ బ్యాంకుకే కాకుండా, భారత్ ఆర్థిక వ్యవస్థలోనూ విశ్వాసాన్ని నింపుతుందని గురువారం కార్యక్రమం సందర్భంగా ఖరా అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఎస్బీఐ చాటి చెబుతోందని పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఎండీలుగా స్వామినాథన్, తివారీ బాధ్యతలు
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్లు్లగా(ఎండీ) గురువారం స్వామినాథన్ జే, అశ్వినీ కుమార్ తివారీ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు వీరు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్‌లోనే స్వామినాథన్, తివారీల నియామకానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సిఫారసు చేసింది. ఎస్బీఐ చైర్మన్‌కు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహాయ సహకారాలను అందిస్తారు. సీఎస్ శెట్టి, అశ్వినీ భాటియాలు ప్రస్తుతం ఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా బాధ్యతలకు ముందు స్వామినాథన్ ఎస్బీఐ ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక తివారీ ఇప్పటి వరకూ ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు. -
గృహ రుణాలపై ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లూ వివరించింది. కొత్త గృహ రుణ వడ్డీరేట్లను సిబిల్ స్కోర్‌ను అనుసంధానిస్తున్నట్లు కూడా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంటే సిబిల్ స్కోర్ బాగుంటే, వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. క్తొత వడ్డీరేట్లు చూస్తే... ► రూ. 30 లక్షల వరకూ రుణాలపై వడ్డీరేటు 6.80 వద్ద మొదలవుతుంది. ► రూ.30 లక్షలుపైబడిన రుణాలపై వడ్డీరేటు 6.95 నుంచి ఉంటుంది. ► మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ కూడా లభిస్తుంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తుకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించడం, అందరికీ గృహ సౌలభ్యం లక్ష్యంగా తాజా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రూ.5 కోట్ల వరకూ రుణాలకు ఎనిమిది మెట్రో పట్టణాల్లోనూ 30 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. యోనో యాప్ ద్వారా కూడా గృహ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా అదనంగా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ పొందవచ్చు. 2021 మార్చి వరకూ తాజా రేట్లు అమల్లో ఉంటాయి. టాప్–అప్ గృహ రుణాలకు కూడా అవకాశం ఉంది. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
ఎస్బీఐ బొనాంజా..!
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. ప్రకటనకు సంబంధించి మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ► ఎనిమిది మెట్రో నగరాల విషయంలో రూ.3 కోట్ల రుణం వరకూ ఇదే క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీరేటు విధానం అమలవుతుంది. యోనో ద్వారా దరఖాస్తుచేస్తే, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. ► ప్రస్తుతం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలుపైబడితే ఈ రేటు 7 శాతంగా ఉంది. ఈ విషయంలో మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఉంది. ► ఎస్బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది. ► కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా అందిస్తోంది. ► వ్యక్తిగత రుణాలపై 9.6% నుంచి వడ్డీ రేటు ఉంటోంది. ► ఎస్బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. డిమాండ్ వృద్ధిపై విశ్వాసం: ఎస్బీఐ కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధి్దకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. రుణ వృద్ధి పలు సంవత్సరాల కనిష్టస్థాయి 6 శాతం వద్దే కొనసాగుతుండడం గమనార్హం. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల పోటీ... పండుగల సీజన్లో డిమాండ్‌ను సొంతం చేసుకోడానికి ప్రైవేటు బ్యాంకులూ ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యస్‌బ్యాంక్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణాలు, తక్కువ వ్యయ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు రద్దుసహా పలు ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ‘ఖుషియోంకీ కరే జిమ్మెదారి సే తయారీ’ పేరిట ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 శాతం ఆన్–రోడ్ ధరతో 7.99 శాతం నుంచి కారు రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 72 నెలల అత్యధిక కాలవ్యవధితో 10.45 శాతం ప్రారంభ వడ్డీకి రూ.50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం పొందే సౌలభ్యం ఉన్నట్లు వివరించింది. రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కారు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహన, నిర్మాణ పరికరాల రుణాలకు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు అమలవుతుంది. బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే, రూ.250 వోచర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు ఈ వోచర్‌ను వినియోగిచుకోవచ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతానికి గృహ రుణ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం
ముంబై: రుణ నాణ్యత, ఉద్యోగుల భద్రత, కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్ తొలి ప్రాధాన్యతలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దినేష్ కుమార్ మూడేళ్ల కాలానికి చైర్మన్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కోవిడ్–19 నేపథ్యంలో పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే ఆర్బీఐ నిర్దేశిస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కంపెనీలకు తగిన మద్దతు అందించడానికి బ్యాంక్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. ► రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. అయితే ఇక్కడ రుణ పునర్వ్యవస్థీకరణను కోరుతున్న కస్టమర్ల సంఖ్యను చూస్తే, బ్యాంక్ నిర్వహించదగిన స్థాయిలోనే ఈ పరిమాణం ఉంది. ► మూలధనం విషయంలో బ్యాంక్ పరిస్థితి పటిష్టంగా కొనసాగుతోంది. ► ఎస్బీఐ డిజిటల్ సేవల వేదిక అయిన ‘యోనో’ను ప్రత్యేక సబ్సిడరీ (పూర్తి అనుబంధ సంస్థ)గా వేరు చేయాలన్న అంశంపై పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. తగిన సమయంలో ఆయా అంశలను వెల్లడిస్తాం.