ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, చేతిలో ఇమిడిపోయే మొబైల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా కూడా సేవలు అందించే విధానాన్ని ఆవిష్కరించింది. నేరుగా ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే కియోస్క్ బ్యాంకింగ్ సరీ్వసులను తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులు మొదలైన వారికి ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సరీ్వసులు అందించడంలో కస్టమర్ సరీ్వస్ పాయింట్ ఏజెంట్లకు వీటితో వెసులుబాటు లభిస్తుందన్నారు. నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్స్ వంటి అయిదు రకాల సర్వీసులు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అకౌంటు తెరవడం వంటి ఇతర సేవలను కూడా చేర్చే యోచనలో ఎస్‌బీఐ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment