న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే నెలలో (ఆగస్టు 8 నుంచి 10 మధ్య) జరిగే ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో కూడా రెపో రేటుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. పలు విభాగాలకు సంబంధించి గణాంకాలు... ముఖ్యంగా అదుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం తన అంచనాలకు కారణమని ఇండస్ట్రీ వేదిక సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ 2.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో గడచిన రెండు ద్వైమాసికాల్లో ఈ రేటును ఆర్‌బీఐ కమిటీ యథాతథంగా కొనసాగిస్తోంది. సీఐఐ సమావేశంలో ఖరా ఏమన్నారంటే...
► కార్పొరేట్ రంగ ప్రైవేట్ మూలధన వ్యయం (క్యాపెక్స్) రిటైల్ డిమాండ్‌లో పటిష్టతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వినియోగం పెరుగుతోంది. దీనితో కార్పొరేట్ రంగం క్యాపెక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయంలో సానుకూల సంకేతాలనే మేము చూస్తున్నాం.
► అందరికీ ఆర్థిక సేవలు అందడం... సామాజిక–ఆర్థిక సాధికారతకు కీలకమైన పునాది. ఇది ప్రజల సమగ్రాభివృద్ధికి తగిన మార్గం. అందరినీ ఆర్థిక రంగంలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తోంది.
► 2014లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనసహా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, యూపీఐ వంటి సామాజిక భద్రతా పథకాలు ప్రజలను ఆర్థిక వ్యవస్థతో మమేకం చేస్తున్నాయి.
► ఆర్థిక సేవల పరిశ్రమలో మరో ముఖ్యమైన పురోగతి... ఫిన్‌టెక్‌ల పెరుగుదల. ఆయా సంస్థలు విస్తృత శ్రేణిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఈ విషయంలో కొత్త సానుకూల నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్ చైన్, డేటా–అనలిటిక్స్ వంటి వినూత్న సాంకేతికతలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment