ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్లు్లగా(ఎండీ) గురువారం స్వామినాథన్ జే, అశ్వినీ కుమార్ తివారీ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు వీరు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్‌లోనే స్వామినాథన్, తివారీల నియామకానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సిఫారసు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్‌కు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహాయ సహకారాలను అందిస్తారు. సీఎస్ శెట్టి, అశ్వినీ భాటియాలు ప్రస్తుతం ఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా బాధ్యతలకు ముందు స్వామినాథన్ ఎస్‌బీఐ ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక తివారీ ఇప్పటి వరకూ ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment