Swaminathan
-
స్వామినాథన్ డైరెక్షన్లో నయనతార?
ఏ రంగంలోనైనా విజయం అనేది అవకాశాలను పెంచుతుంది. నటి నయనతార అలాంటి విజయాలతోనే లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. దీంతో నాలుగు పదుల వయసులోనూ కథానాయకిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. రూ. 10 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నా నో పోబ్లమ్ అంటున్నారు నిర్మాతలు. అలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. నయనతార నటించిన టెస్ట్, మన్నాంగట్టి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. తాజాగా మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నారు. తమిళంలో కవిన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా మూక్కుత్తి అమ్మన్ –2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఒప్పందం దశలో ఉన్నాయి. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహారాజా చిత్రం ఫేమ్ నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో నయనతార నటించనున్నట్లు సమాచారం. కురంగు బొమ్మై చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన నితిలన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తగిన సమయం తీసుకుని విజయ్‌సేతుపతి హీరోగా తెరకెక్కించిన చిత్రం మహారాజా. ఇది విజయ్‌సేతుపతి 50వ చిత్రం కావడం విశేషం. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ బహుభాషా నటుడికి మహారాజా చిత్రం సంచలన విజయాన్ని అందించి నూతనోత్సాహాన్ని కలిగించింది. ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. కాగా దర్శకుడు నితిలన్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నయనతార కథానాయకిగా ఈయన తెరకెక్కించనున్న చిత్రానికి మహారాణి అనే టైటిల్‌ను కూడా నిర్ణయించినట్లు సమాచారం. దీని మహారాజా చిత్ర నిర్మాణ సంస్థ ఫాషన్ స్టూడియోస్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రం అధికారిక ప్రకటన కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే తెలంగాణకు వస్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వచ్చి వ్యవసాయ ప్రగతి చూస్తానని హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ అన్నారు. తన ఆరోగ్యం కుదుటపడ గానే రాష్ట్రానికి వస్తానని చెప్పారు. చెన్నైలో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్‌తో బుధవారం ఆయన నివాసంలో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావు భేటీ అయ్యారు. అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ విజ యాలను వివరించామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్వామినాథన్ స్ఫూర్తి తోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పామన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, పంటల కొను గోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. 98 ఏళ్ల వయసులోనూ స్వామినాథన్ జ్ఞాపకశక్తి అమోఘమన్నారు. ఈ భేటీలో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు. -
పంటలకు మద్దతు ధర అరకొరేనా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి. కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వా మినాధన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది. స్వామినాధన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
CII Dakshin 2023: యువత సినీపరిశ్రమకు రావాలి
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్ఆర్ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి. అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు. -
పంటల వైవిధ్యంతోనే ప్రగతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా, సుస్థిరంగా, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు పంటల వైవిధ్యానికి పెద్దపీట వేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో విశ్రాంత ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ దేశీయ వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా ఈ రంగానికి సరైన సమయంలో అవసరమైన చేయూతను అందించాలని సూచించారు. రైతులకు సమయానుగుణ సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తృణధాన్యాల ఉత్పత్తిని మెల్లగా తగ్గిస్తూ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సిరి ధాన్యాల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలని కోరారు. బిందుసేద్యం, సూక్ష్మ సాగునీటి పద్ధతులను పాటిస్తూ సాగునీటి నిర్వహణ విషయంలో రైతులకు మార్గదర్శనం చేస్తూ.. వారు తమ పంట ఉత్పత్తులు పెంచుకునేలా చేయడంలో డాక్టర్ ప్రవీణ్ రావు కృషి చేశారని ఉపరాష్ట్రపతి అభినందించారు. భారత్‌లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ రంగంలో దేశానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించే విషయంలో ప్రొఫెసర్ స్వామినాథన్ సేవలు చిరస్మరణీయమన్నారు. మన దేశంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆయా వస్తువులను ఉత్పత్తి చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ కమతాల పరిమాణాలు తగ్గిపోతుండటం, వర్షంపై ఆధారపడటం, పరిమిత సాగునీటి సదుపాయాలు, సరైన సమయానికి వ్యవసాయ రుణాలు అందకపోవడాన్ని ప్రస్తావించారు. పంట ఉత్పత్తులకు ఊహించినంత మద్దతు ధర అందకపోవడం, అవసరమైనంత మేర శీతల గిడ్డంగుల వ్యవస్థ లేకపోవడం, సరైన మార్కెటింగ్ నెట్ వర్క్ లేమి తదితర అంశాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి ప్రభావితం అవుతోందన్నారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా భారతీయ వ్యవసాయ రంగ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఐసీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ ప్రసాద్, నూజివీడు సీడ్స్ చైర్మన్, ఎండీ ఎం.ప్రభాకర్ రావు పాల్గొన్నారు. రావత్ మృతికి సంతాపం ఈ కార్యక్రమం సాగుతుండగా బిపిన్ రావత్ మృతి గురించి తెలిసి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, సతీమణి మధులిక రావత్, ఇతర ఆర్మీ అధికారులు తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని వెంకయ్య పేర్కొన్నారు. ప్రమాద ఘటన గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నామని చెప్పారు. బిపిన్ రావత్ సహా ఈ ఘటనలో మృతి చెందిన ఆర్మీ అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. -
వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సేవలు దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాయని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఆర్బీకేలు, సమీకృత వ్యవసాయ రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్) ద్వారా అందిస్తున్న సేవలు, ఆర్బీకే చానల్ నిర్వహణ తీరు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ రామస్వామి రాజ్‌కుమార్, డాక్టర్ గోపీనాథ్ గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌తో పాటు కృష్ణా జిల్లాలోని కేసరపల్లి రైతు భరోసా కేంద్రాన్ని శనివారం సందర్శించారు. వాటి పనితీరును పరిశీలించి అక్కడి రైతులతో మమేకమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆత్మ డైరెక్టర్ ప్రమీల వివరించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమిళనాడులో తమ ఫౌండేషన్ నడుపుతున్న కాల్ సెంటర్ కంటే ఇక్కడి కాల్ సెంటర్ చాలా బాగుందన్నారు. కాల్ సెంటర్లో ఏకంగా 80 మంది ఉన్నత విద్యావంతులు పని చేస్తున్నారని, 8 మంది శాస్త్రవేత్తల బృందం సైతం ఈ కాల్ సెంటర్ ద్వారా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. రోజుకు 700 నుంచి 800 కాల్స్ వస్తుండటం కాల్ సెంటర్ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. (చదవండి: ‘శ్రీశైలం’లో ఆగని తెలంగాణ ‘దోపిడీ’ ) ఆర్బీకేల ద్వారా అన్నీ అందించడం గొప్ప విషయం ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గ్రామస్థాయిలోనే రైతులకు అందించడం గొప్ప విషయమని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్బీకేలో కియోస్క్, డిజిటల్ లైబ్రరీ చాలా బాగున్నాయని కితాబిచ్చారు. నాలెడ్జ్ హబ్‌లుగా ఆర్బీకేలను తీర్చిదిద్దిన తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీకే చానల్ నిర్వహణ తీరు చాలా బాగుందని, ఓ వైపు కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు, మరోవైపు ఆదర్శ రైతుల నుంచి సామాన్య రైతుల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ రైతులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తుండటం అభినందనీయమన్నారు. ఎంఎస్ స్వామినాథన్ ఆశించినట్టుగా ఏపీ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శమని, ఇక్కడ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలను తమ ఫౌండేషన్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతున్నాయని పేర్కొన్నారు. (చదవండి: కారణం లేకుండా ‘కోత’ వద్దు) -
ఎస్బీఐ ఎండీలుగా స్వామినాథన్, తివారీ బాధ్యతలు
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్లు్లగా(ఎండీ) గురువారం స్వామినాథన్ జే, అశ్వినీ కుమార్ తివారీ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు వీరు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్‌లోనే స్వామినాథన్, తివారీల నియామకానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) సిఫారసు చేసింది. ఎస్బీఐ చైర్మన్‌కు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహాయ సహకారాలను అందిస్తారు. సీఎస్ శెట్టి, అశ్వినీ భాటియాలు ప్రస్తుతం ఎండీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా బాధ్యతలకు ముందు స్వామినాథన్ ఎస్బీఐ ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక తివారీ ఇప్పటి వరకూ ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు. -
వీసీ ప్రవీణ్‌రావుకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అవార్డుని ఏర్పాటు చేశాయి. దేశంలో వ్యవసాయ రంగ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న శాస్త్రవేత్తలకు, వృత్తి నిపుణులకు రెండేళ్లకోసారి ఈ అవార్డుని అందజేస్తారు. ఐకార్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ పరోడా నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో నిష్ణాతులైన 13 మంది నుంచి వచ్చిన దరఖాస్తులను, రికార్డులను పరిశీలించి ఈ అవార్డుకి ఎంపిక చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రవీణ్‌రావు బోధన, పరిశోధన, విస్తరణలలో తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యల కారణంగా దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ యూనివర్సిటీ ఆరో స్థానంలో నిలిచింది. -
ఉప్పునీటి మొక్కలకు మళ్లీ ఊపిరి!
సాక్షి, అమరావతి : ‘ఈల కూర పప్పులో కూడా ఉప్పేశావా.. టాట్!’.. కోస్తా తీర ప్రాంతాలలో వాడుకలో ఉన్న సామెత ఇది. భార్యతో గొడవ పెట్టుకోవడానికి ఏ కారణం దొరక్కపోతే ఈ సాకుతో పెట్టుకోవచ్చంటారు. ఎందుకంటే ఈల కూర ఆకులే ఉప్పగా ఉంటాయి.. దాన్లో మళ్లీ ఉప్పు వేయాల్సిన పనుండదు కాబట్టి. ఇంత గుర్తింపు ఉన్న ఈ తరహా మొక్కలు మడ అడవులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటి ఆధారంగా పెరుగుతాయి. వీటిని శాస్త్రీయంగా ‘హాలోఫైట్స్’ అంటారు. చాలా రకాల మొక్కలు తెరమరుగైనట్లే ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వృక్ష శాస్త్రవేత్తలు తిరిగి ఈ మొక్కను పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యామ్నాయంగానే సాగు రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు అందుకు నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. కిలో బియ్యం (వరి) పండాలంటే సుమారు 2,800 లీటర్ల నీరు కావాలని శాస్త్రవేత్తలు లెక్కతేల్చారు. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు ఉప్పునీటి భూముల్లోనూ పండే పంటలపై దృష్టిసారించారు. వీటి సాగువల్ల సముద్ర తీరప్రాంత కోతల్ని, తుపాన్లనూ తట్టుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. 1970లలో అమెరికాలో మొదలైన ఈ హాలోఫైట్స్ పంటల సాగు ఇప్పుడు మనకూ వచ్చింది. సెంట్రల్ సాల్ట్, మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ), డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఇందుకు నడుం కట్టాయి. ప్రధానంగా మూడు రకాలు సాగులోకి.. ఉప్పు నీరు పారే భూముల్లో పెరిగే హాలోఫైట్స్లో చాలా రకాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కొబ్బరిచెట్టుపేట వద్ద ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా మూడు రకాల మొక్కలను సాగుచేస్తున్నారు. అవి.. పోర్ట్రేసియా కోయక్టటా, ఫిమ్బ్రిస్టిలిస్ ఫెర్గునియా, పాస్పలమ్ వజినాటమ్ రకాలు. ఇవన్నీ గడ్డి జాతి మొక్కలు. పశుగ్రాసానికి పనికివస్తాయి. శాస్త్రీయ నామాలే తప్ప వీటికి స్థానిక పేర్లు ఖరారు చేయలేదు. ఇవి 180 రోజుల్లో కోతకు వస్తాయి. ఈ గడ్డి రకాలను వాణిజ్య పరంగా సాగుచేయవచ్చా అనే దానిపై ప్రస్తుతం విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మెక్సికో, ఆఫ్రికా తదితర దేశాల్లో చేసిన ప్రయోగాలను బట్టి ఈ రకాల నుంచి ఆయిల్‌ను, జీవ ఇంధనాన్ని, బయోసాల్ట్ను కూడా తయారుచేయవచ్చని తేలింది. ఈ మూడు రకాలు ఉభయతారకం.. ఇవికాక.. సుయోడా మారిటిమా, సేసువియమ్ పోర్చులకాస్ట్రమ్, సాలీకోర్నియా బ్రాచియాట రకాలు అయితే అటు తినడానికి ఇటు పశుగ్రాసానికీ పనికి వస్తాయి. వీటినీ ఉప్పు, మంచినీటిలో సాగుచేయవచ్చు. హెక్టార్‌కు 20 టన్నుల వరకు గడ్డి వస్తుంది. సుయోడా మారిటిమా రకాన్ని స్థానికంగా ఈలకూర అని, సేసువియమ్ పోర్చులకాస్ట్రమ్ను వొంగులేడీ లేదా బుస్కా అని పిలుస్తారు. వీటిని మన పొన్నెగంటి కూర, పాయలాకు, చెంచలాకు, సోయి కూర, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు మాదిరిగా విడిగా లేదా పప్పులో వేసుకుని వండుకోవచ్చు. రొయ్యల కూరలోనూ కలుపుకోవచ్చు. తీరప్రాంత వాసులైతే అచ్చంగా వీటి లేత ఆకులతో కూర తయారుచేస్తుంటారు. ఆకులు ఉప్పగా ఉండడంవల్ల కూర రుచిగా ఉంటుంది. ప్రత్యేకించి వీటి ఆకుల్లో లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో విస్తృత ప్రయోజనాలు కొబ్బరిచెట్టుపేట గ్రామ సమీపంలో పెంచుతున్న ఈలకూర, వొంగులేడి మొక్కలు వాస్తవానికి చాలా ప్రాచీనమైనవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వీటిపై విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. విదేశాల్లో ఈ మొక్కలకు చాలా గిరాకీ ఉంది. ఔషధాల్లోనూ వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లోనూ వీటిని పెంచేలా నారును పోశారు. ఇవి తీరప్రాంత కోతనూ నివారిస్తాయి. మంచిపోషక విలువలున్న ఈ మొక్కల్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. – డాక్టర్ రామసుబ్రమణ్యం, స్వామినాథన్ ఫౌండేషన్, చెన్నై -
విజ్ఞానగని, విశ్వాసమణి ప్రొఫెసర్ విజయం
వాస్తవాన్నే జీవితంగా మలుచుకొని లోకానికి క్రైస్తవాన్ని ఆచరణలో చాటిన ఒక మహా విశ్వాసి ఉదంతం ఈ వారం. గొప్ప మేధావి, పరిశోధకుడు, ఆదర్శప్రాయమైన యూనివర్సిటీ అధ్యాపకుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడు, రచయిత, బైబిల్ పండితుడు, తాను విశ్వసించిన క్రైస్తవాన్ని ఆచరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో జీవించిన మహా విశ్వాసి ప్రొఫెసర్ బి.యి.విజయం, తన 86వ యేట ఈ జనవరి 30న కన్ను మూశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రం (ఎ్ఛౌ ౌజy)లో పట్టభద్రుడై, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి, అత్యున్నత పదవులు అలంకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర విభాగానికి అధిపతిగా, జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా సైంటిస్టుగా, మన దేశపు తూర్పు కనుమల్లో అణుధార్మిక శక్తి కలిగిన అత్యంత విలువైన భూగర్భ ఖనిజ నిల్వల్ని కనుగొనడంలో, బీహార్ ధన్‌బాద్ బొగ్గుగనులకు చెందిన అత్యంత విస్తారమైన నిల్వలను కనుగొనడంలో ఆయన దేశానికి చేసిన సేవ ఆవిరళమైనది. సౌదీ అరేబియా దేశంలో కూడా, ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానం మీద అక్కడికెళ్లి చమురు నిల్వలున్న పలు ప్రదేశాలను అప్పట్లో ఆయనే గుర్తించారు. వారి వైజ్ఞానిక సేవల్ని గుర్తిస్తూ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పతకాన్ని ప్రొ.విజయంకు బహూకరించి ఎం.ఎస్.స్వామినాథన్, వర్గీస్ కురియన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ దిగ్గజాల సరసన ఆయన్ను నిలబెట్టింది. రాయలసీమలోని ఒక గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి పట్టుదలతో, స్వయంకృషితో, ప్రపంచస్థాయి శాస్త్రజ్ఞుడుగా ఎదిగి, పటిష్టమైన క్రైస్తవ పునాదులున్న మచ్చలేని క్రైస్తవ విశ్వాసిగా జీవించిన ప్రొ.విజయం జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన మన దేశమే కాదు మొత్తం ప్రపంచం గర్వించదగిన మహా మేధావి, క్రైస్తవం, మానవత్వం పరిమళించిన మహామనిషి. ఒక్కమాటలో ‘తెలుగు క్రైస్తవం’ సగర్వంగా ప్రపంచానికందించిన మణిమాణిక్యమాయన! ప్రొఫెసర్ విజయం సహాయం పొందిన అసంఖ్యాకుల్లో ఈ రచయిత కూడా ఒకరు. సాక్షిలో క్రైస్తవ వ్యాసాన్ని క్రమం తప్పక చదివి, తన అమూల్యమైన లభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు విజయం. అలా ‘సాక్షి’ ద్వారా మళ్లీ ఏర్పడిన సాన్నిహిత్యంతో తరచుగా కలుసుకొంటున్నపుడు, భూగర్భశాస్త్రంలో ఆయనెంత ప్రవీణుడో, బైబిల్ పరిజ్ఞానంలో కూడా అంతే పట్టుగల్గిన వాడన్నది వెల్లడైంది.. ఈ రచయితతోపాటు ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని సందర్శించినప్పుడు ఎంతో విలువైన సమయం గడపడం సాధ్యమైంది. అప్పుడు ఈజిప్ట్‌లో సీనాయి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా చోట్ల రాళ్లను పరిశీలించి, ‘ఇక్కడ బంగారం నిల్వలున్నాయి’ అన్నారాయన. అదే విషయాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల ధృవీకరించడం వార్తల్లో తెలుసుకొని ఆయన ప్రతిభకు ఆశ్చర్యపోక తప్పలేదు. రాయలసీమ సిఎస్ ఐడియాసిస్కు మొట్టమొదటి భారతీయ బిషప్‌గా నియమించబడ్డ రైట్ రెవ. జాన్ బన్యన్ ఐదుగురు సంతానంలో కనిష్ఠుడాయన. నీతి నియమాలకు కట్టుబడి ఎంతో నిజాయితీగా పరిచర్య చేసిన బిషప్ జాన్ బన్యన్ నుండి క్రమశిక్షణ, భక్తి బాల్యం నుండే ప్రొఫెసర్ విజయంకు అలవడ్డాయి. నిజాయితీపరుడైన బిషప్ కుమారుడుగా విలాసాలకు దూరంగా, అతి సాధారణంగా ఆయన జీవితం సాగింది. పేదరికాన్ని, పేదల నిస్సహాయతను అలా ఆయన చాలా దగ్గరి నుండి చూశారు. అందుకే పేదల్ని, నిరాశ్రయుల్ని, అభాగ్యుల్ని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి ఎన్నో సహాయ కార్యక్రమాలు తన సేవాసంస్థ ద్వారా చేపట్టారు. ‘ఎవరినైనా ఆదుకున్న రోజున భలే నిద్రపడుతుందయ్యా’ అనేవారాయన. నిజ క్రైస్తవానికి ఇంతకు మించిన విశ్లేషణ, నిద్రలేమి అనే భయంకర వ్యాధికి దీన్ని మించిన చికిత్స ఉందా? ఎంతో స్నేహపాత్రుడు, గుండెలో ప్రేమ, కనికరాల ఊటలు ఉన్నాయా అనిపించేంత గొప్పగా స్పందించి సాయం చేసే వితరణ శీలి, సాత్వికుడు, వినయ మనస్కుడు అయిన విజయం లేని లోటు పూడ్చలేనిది. ఆయన విడిచి వెళ్లిన క్రైస్తవ వారసత్వం మాత్రం వెలలేనిది. –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆర్బీఐ డైరెక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ఆయనకు అనుబంధముంది. డీమోనిటైజేషన్ను గట్టిగా సమర్ధించిన వారిలో ఆయన కూడా ఒకరు. తమిళ పత్రిక తుగ్లక్కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలన్న ఉద్దేశంతోనే నేనెప్పుడూ ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో డైరెక్టర్‌షిప్ బాధ్యతలు తీసుకోలేదు. ప్రజలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చాలనే అభిప్రాయంతోనే ఈ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించాను‘ అని గురుమూర్తి ట్వీట్ చేశారు. -
స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయండి
• కేంద్రానికి పోచారం విజ్ఞప్తి • నకిలీ విత్తనాల నియంత్రణకు చట్టం తేనున్నట్లు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పంటల ఉత్పాదకత పెంచి, గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలి 88వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలు రైతులకు ఏ మేరకు లాభం చేకూర్చాయి, విభిన్నమైన భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో పంటల ఉత్పాదకతను పెంచడానికి ఎలాంటి పరిశోధనలు అవసరం అన్న అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో మంత్రి పోచారం పాల్గొని ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పంటకు అయిన పెట్టుబడి కంటే అధికంగా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయంపై స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, దీనిపై ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. కేంద్ర మంత్రితో భేటీ సమావేశంలో ప్రసంగించిన అనంతరం అక్కడే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలని, దీని కోసం తెలంగాణకు మినీ భూసార పరీక్షల లేబోరేటరీలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక జిల్లాలో ఒక పంటను విలేజ్ యూనిట్‌గా పరిగణించి.. మిగతా పంటలను మండల యూనిట్లుగా పరిగణించడం అశాస్త్రీయమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక జిల్లాకు ఒక పంటను విలేజ్ యూనిట్‌గా పరిగణించడంతో రైతులకు పరిహారం అందడంలో ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో.. జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించాలని కోరారు. మిరప విత్తన చట్టం తెస్తాం.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను సరఫరా చేసే ఏజెంట్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అందుకు అనుగుణంగా ప్రత్యేక చట్టాలను రూపొందిస్తామని పోచారం తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మిరప విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతే.. ఆ మేరకు సంబంధిత సంస్థల నుంచి పరిహారం వసూలు చేసి, రైతులకు అందించేలా నిబంధనలు చేర్చుతామని వెల్లడించారు. -
చిన్న చిత్రాలు నిలబడాలంటే..
చిన్న బడ్జెట్ చిత్రాలు బతికి బట్ట కట్టాలంటే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు తమిళ దర్శకుల సంఘం కార్యదర్శి ఆర్కే.సెల్వమణి. నాన్‌కడవుల్ రాజేంద్రన్, లొల్లుసభ స్వామినాథన్,అర్చనాసింగ్, కృష్ణమూర్తి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం యానై మేల్ కుదిరై సవారి. బెట్లర్స్ సినిమా పతాకంపై కథ,మాటలు, పాటలు దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలను కరుప్పయ్య మురుగన్ నిర్వహించారు. హిమాలయన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు పేరరసు అందుకున్నారు. ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ మహానగరాల్లో థియేటర్లు ఐదు నక్షత్రాల స్థాయికి మారిపోతున్నాయన్నారు. చాలా వరకు మల్టీఫ్లెక్స్ థియేటర్లుగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఆ థియేటర్లలో సినిమా చూడాలంటే టికెట్ ధర, ఇతర తినుబండారాలకంటూ ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. సాధారణ ప్రేక్షకులు అంత ఖర్చు పెట్టి సినిమాలు చూడలేరని అన్నారు. అంతే కాకుండా మల్టీఫ్లెక్స్ థియేటర్లలో భారీ బడ్జెట్ చిత్రాలను చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు.అందువల్ల థియేటర్ల యాజమాన్యం అలాంటి చిత్రాలనే ప్రదర్శిస్తారని అన్నారు. అందువల్ల చిన్న బడ్జెట్ చిత్రాలు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ప్రదర్శనకు నోచుకునే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి చిన్న చిన్న నగరాలు, గ్రామాల్లో రూ.50 ధరగా 100 మంది కూర్చుని చూసేలా థియేటర్లను ప్రభుత్వం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.అప్పుడే పైరసీ బాధ తప్పుతుందని, చిన్న నిర్మాతలు బతికి బట్టకట్టగలుగుతారని ఆర్కే.సెల్వమణి అన్నారు. -
యోగం ట్రేడర్స్ మాయాజాలం..
ఉయ్యూరు : పట్టణంలోని యోగం ట్రేడర్స్ మాయాజాలంపై జనం తిరగబడ్డారు. సగం రేట్లకే గృహోపకరణాల వస్తువులు ఇస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు సొమ్ము వసూలు చేసి నిర్వాహకుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు తాము కట్టిన సొమ్ము చెల్లించాలంటూ మంగళవారం సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో టౌన్, రూరల్ ఎస్ఐలు జానకిరామయ్య, యువకుమార్లు సిబ్బందితో వచ్చి బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రూ.12 లక్షలకు టోకరా ! తమిళనాడు రాష్ట్రం వెంపంగుడి ప్రాంతానికి చెందిన స్వామినాధన్ ఉయ్యూరులోని కాకాని గిరిజన కాలనీలో రెండు వారాల క్రితం యోగం ట్రేడర్స్ ఏర్పాటు చేశారు. రూ.100 విలువైన వస్తువును రూ.55కే ఇస్తానని ప్రకటనలు గుప్పించాడు. 650 మంది వద్ద నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. స్కీమ్‌లో చేరిన వారిలో ఒక్కొక్కరూ వెయ్యి నుంచి రూ.30 వేల వరకు కట్టారు. తొలుత కొంతమందికి వస్తువులు అందజేసి ఖాతాదారుల నమ్మకం పొందాడు. సగం ధరకే వస్తువులు వస్తున్నాయన్న ప్రచారం ఆ నోట, ఈ నోట పట్టణమంతా పాకడంతో స్కీం కింద డబ్బులు కట్టి వస్తువులు పొందేందుకు జనం బారులు తీరారు. షాప్ పెట్టిన తొమ్మిది రోజులకే 650 మంది వద్ద రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడం.. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యోగం ట్రేడర్స్‌పై నిఘా ఉంచారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం తో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో స్వామినాధన్ ? స్వామినాధన్ గత ఐదు రోజుల నుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం గిరిజన కాలనీకి చెందిన యోగం ట్రేడర్స్ బాధితులు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఆయన పోలీసు అధికారులతో మాట్లాడి న్యా యం చేయాల్సిందిగా కోరారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టౌన్ పోలీసులు స్వామినాధన్‌తో విచారణ జరిపి, అతడి గుట్టును రట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. బాధితుల్లో ఇప్పటి వరకు 105 మందికి రూ.1.10 లక్షలు విలువ చేసే వస్తువులను అందజేసినట్లు స్వామినాధన్ పోలీసులకు చెబుతున్నాడు. మరో రూ.4 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు దుకాణంలో ఉన్నాయి. రూ.7 లక్షల వరకు సొమ్ము ఏమైందో తేలాల్సి ఉంది. న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ యోగం ట్రేడర్స్ మాయాజాలంపై స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పందించారు. మంగళవారం సంస్థ కార్యాయలం వద్దకు వచ్చి, బాధితులతో మాట్లాడారు. కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించేలా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. -
సీనియర్ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇకలేరు
సినీ జగమెరిగిన శబ్దగ్రాహకుడు ఏఆర్ స్వామినాథన్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో సుమారు 1900 చిత్రాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు. లక్షకు పైగా పాటలకు శబ్దగ్రహణం చేశారు. ప్రపంచంలో ఏ సౌండ్ ఇంజినీరూ ఇన్ని చిత్రాలకు పనిచేయలేదు. నిజంగా ఇదొక రికార్డ్.1927 ఆగస్టు 26న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆరుపాడి గ్రామంలో రామయ్య, ఆలమేలు దంపతులకు పుట్టిన స్వామినాథన్ 1949లో వాహినీ సంస్థ సౌండ్ డిపార్ట్మెంట్లో అప్రెంటీస్‌గా కెరీర్ మొదలుపెట్టారు. మొదట్లో శబ్ద యంత్రాలకు సర్వీసింగ్ పనులు చేసిన ఆయన తర్వాత రికార్డిస్టుగా మారారు. కె. విశ్వనాథ్ అప్పట్లో ఆయనకు కొలీగ్. ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల నిర్మించిన ‘పరోపకారం’ (1953) చిత్రానికి తొలిసారిగా రీరికార్డింగ్ బాధ్యతలు నిర్వహించారు. అప్పటినుంచీ ఆయన వెనుతిరిగి చూడలేదు. రాత్రింబవళ్లూ పాటల రికార్డింగులు, రీరికార్డింగులతో మమేకమైపోయారు. ఇంటిని కూడా మరిచిపోయి రికార్డింగ్ థియేటరే ప్రపంచం అన్నట్టుగా బతికారు. ఎంత ఒత్తిడి ఉన్నా స్వామినాథన్ రీరికార్డింగ్ శ్రద్ధగా, చురుగ్గా చేస్తారని ప్రతీతి. పాండురంగ మహాత్మ్యం, పాండవ వనవాసం, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, సంపూర్ణ రామాయణం వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలకు తన శబ్ద చాతుర్యాన్ని మేళవించి కొత్త సొగసులు తీసుకొచ్చారు. ప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తొలిసారిగా పాడిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలోని ‘ఏమి ఈ వింత మోహము’ పాటను ఆయనే రికార్డ్ చేశారు. 1964 నుంచి 24 ఏళ్ల పాటు ‘విజయా’ రికార్డింగ్ థియేటర్లో పనిచేసి కొన్ని వేల పాటలు రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు చెందిన కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో చేరారు. మేఘసందేశం (1982), సాగర సంగమం (1983), శ్రుతిలయలు (1987), సూత్రధారులు (1989), జగదేక వీరుడు-అతిలోక సుందరి (1990) చిత్రాలకు నందీ పురస్కారాలు అందుకున్నారు. స్వామినాథన్‌కు భార్య రుక్మిణి, కొడుకులు నారాయణ్, శ్రీనివాసన్, కూతుళ్లు ఉషా, శాంతి, లలిత ఉన్నారు. పదిహేను రోజుల క్రితం మంచం మీద నుంచి కింద పడిపోగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేశారు. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం చెన్నైలో స్వామినాథన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.