
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ఆయనకు అనుబంధముంది. డీమోనిటైజేషన్‌ను గట్టిగా సమర్ధించిన వారిలో ఆయన కూడా ఒకరు.
తమిళ పత్రిక తుగ్లక్‌కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలన్న ఉద్దేశంతోనే నేనెప్పుడూ ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో డైరెక్టర్‌షిప్ బాధ్యతలు తీసుకోలేదు. ప్రజలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చాలనే అభిప్రాయంతోనే ఈ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించాను‘ అని గురుమూర్తి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment