సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వచ్చి వ్యవసాయ ప్రగతి చూస్తానని హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ అన్నారు. తన ఆరోగ్యం కుదుటపడ గానే రాష్ట్రానికి వస్తానని చెప్పారు. చెన్నైలో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్‌తో బుధవారం ఆయన నివాసంలో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావు భేటీ అయ్యారు. అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా స్వామినాథన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ విజ యాలను వివరించామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్వామినాథన్ స్ఫూర్తి తోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పామన్నారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, పంటల కొను గోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. 98 ఏళ్ల వయసులోనూ స్వామినాథన్ జ్ఞాపకశక్తి అమోఘమన్నారు. ఈ భేటీలో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment