రేవంత్ పాలనపై నిరంజన్‌రెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్‌ఎస్ సహకరించిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైనందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment