Niranjan Reddy
-
సభలో టీడీపీని నవ్వులపాలు చేసిన YSRCP ఎంపీలు
-
బాధితుడినే నిందితుడిగా మార్చారు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.ఆ బాధ్యత పోలీసులపై ఉందినిరంజన్రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్ రిమాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రక టించిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అరకొరగా అమలు చేసిందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం నోరు పారేసుకుని దుర్భాషలాడతారా అని బీఆర్ఎస్ మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నేత ఇంతియాజ్ ఇషాక్‌తో కలసి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.రుణమాఫీ తోపా టు ఆరు గ్యారంటీలను రేవంత్ చెప్పిన గడువు లోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తాన ని హరీశ్ అన్నారని అయితే రేవంత్ మాత్రం రుణమాఫీ అమలు పూర్తయిందని దబాయిస్తు న్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రైతు లందరికీ రూ.31వేల కోట్ల రుణమాఫీ జరుగు తుందని చెప్పి, ప్రస్తుతం రూ.17వేల కోట్లకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 1,11,027 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
-
ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఎంపీ నిరంజన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.కాగా, రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు . ఏపీకి ఇచ్చిన హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. నగరాల అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘కేంద్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు. ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్న పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దు. పెట్టుబడిదారుల్లోభయాన్ని తొలగించాలి. అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు. దాని వల్ల దేశానికి జీడీపీకి పెద్దగా ఉపయోగం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ, మరో వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరించిందన్నారు. రాజ్యాంగ నియమాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభా పక్షాలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయని వివరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుతుండగా, రాహుల్‌గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ద్వంద్వ విధానాలకు రాహుల్ గాంధీ స్వస్తి పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 33 శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. దీనిని బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఆగడాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టు కుని దానినే అపహాస్యం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో శనివా రం రాహుల్ గాంధీకి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ .. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశి్నస్తామని, రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్‌ను బీజేపీ ఇక్కట్లకు గురిచేసిన సందర్భంలో పారీ్టలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. -
నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైనందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ కి ఫిర్యాదు
-
అరాచకాన్ని అరికట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా కొనసాగుతున్న దాడులు, హింసాకాండను తక్షణం అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను పార్టీ కోరింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ అల్లరిమూకలు సంధి కాలాన్ని ఎంపిక చేసుకుని విధ్వంసాలకు తెగబడటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టం చేసింది.అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని కోరింది. ఈమేరకు రాష్ట్రపతి, గవర్నర్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్ రెడ్డి గురువారం విడివిడిగా లేఖలు రాశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మరో లేఖ ద్వారా కోరారు. ఆ లేఖల్లో పేర్కొన్న వైఎస్సార్సీపీ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లలపై దాడులు..రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అసాంఘిక శక్తులు యథేచ్చగా హింసాకాండకు పాల్పడుతున్నాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, పిల్లలపై దాడులకు దిగడంతోపాటు ఇక మీదట మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాయి. బాధిత కుటుంబాలు ప్రాణ భయంతో ఇళ్లు, గ్రామాలను విడిచిపెట్టి వెళుతున్నాయి. వైఎస్సార్సీపీకి చెందినవారి ఆస్తులపై దాడులు చేస్తూ జీవనాధారాన్ని నాశనం చేస్తుండటంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు శాఖ నిర్లిప్తతఅల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నా పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందనా లేదు. పరిస్థితి తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత 24 గంటల్లో దాడులు, దౌర్జన్యాలు అమాంతం పెరగడం వెనుక పక్కా కుట్ర ఉంది. ఇవిగో ఆధారాలు వైఎస్సార్‌సీపీనేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై రౌడీమూకల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, మీడియాలో ప్రచురితమైన కథనాలను మీకు సమర్పిస్తున్నాం. వాటిని పరిశీలించి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న విధ్వంసకాండ తీవ్రతను గుర్తించాలని కోరుతున్నాం. తక్షణం దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలి. శాంతి భద్రతలను కాపాడి ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించండి. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
దస్తగిరితో చంద్రబాబే పిటిషన్ వేయించారు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి పిటిషన్ వేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దస్తగిరితో ఈ పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఓ పక్క కేసు విచారణ సాగుతుండగా.. కడప నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, వైఎస్ వివేకా కూతురు.. ఇద్దరూ అవినాశ్‌ను హంతకుడిగా చిత్రీకరించేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇదే కేసులో నిందుతుడు (ఏ–4) దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. అవినాశ్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ సీబీఐ, సునీత తరఫు న్యాయవాదులు వాదించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. వారివి సంబంధం లేని వాదనలు సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అవినాశ్‌కు బెయిల్ ఇచ్చారని చెప్పడం ఈ వాదనలతో సంబంధంలేని అంశం. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కోర్టు అవినాశ్‌కు బెయిల్ ఇచ్చిన తర్వాత వాటిని ఆయన ఉల్లంఘించారా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాలి. ఓ సీనియర్ న్యాయవాది, మరో పీపీ అనవసర వాదనంతా వినిపించారు. న్యాయస్థానం అవినాశ్‌కు విధించిన షరతుల్లో దేన్నీ ఆయన ఉల్లంఘించలేదు. కనీ వినీ ఎరుగని విధంగా బాధితులం అని చెప్పుకుంటున్న వారు అప్రూవర్‌తో కలసి నడుస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇష్టం వచ్చినట్లు అప్రూవర్‌ను ప్రకటించకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినా.. దర్యాప్తు సంస్థే అతన్ని వెనుకేసుకుని వస్తోంది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కిరాయి హంతకుడు దస్తగిరి కూడా చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. వివేకాకు రెండో భార్య ఉందని, ఆమెతో కలిగిన కుమారుడికి, సునీతకు ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది వాస్తవం. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తికే సునీత మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె కోరలేదు. ఎవరు ఏ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అవుతూ అవినాశ్‌ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ, సునీత, కిరాయి హంతుకుడు ఒకే బాటలో సాగుతూ అవినాశ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ ‘ఇక్కడ దస్తగిరి తండ్రిపై దాడి చేశారని, జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారని రెండు ఆరోపణలు చేస్తున్నారు. వీటికి ఒక్క ఆధారమూ లేదు. ఆరోగ్య శిబిరం నిర్వహించిన రోజు చైతన్యరెడ్డితో పాటు పదుల సంఖ్యలో వైద్యులు అక్కడికి వెళ్లారు. జైలు అధికారులంతా వారి వెంట ఉన్నారు. దస్తగిరిని చైతన్యరెడ్డి కలవడం అనేది అసాధ్యం అని జైలు అధికారులు చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలుకు రూ.20 కోట్లు తీసుకొచ్చాడని దస్తగిరి ఆరోపిస్తున్నారు. అంత మంది ఉండగా, అంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం సాధ్యం అవుతుందా? దీనికి, అవినాశ్‌కు ఏమిటి సంబంధం? అలాగే శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్ద దస్తగిరి తండ్రిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, ఎన్నికల్లో దస్తగిరి పోటీ చేయకూడదని బెదిరించారన్నది ఆరోపణ. ఈ కేసుకూ అవినాశ్‌కు సంబంధం ఏమిటో కూడా ఆధారం లేదు. విచిత్రమేమిటంటే.. తనపై దాడి జరిగిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయలేదు. కుమారుడు దస్తగిరి ఒకరోజు తర్వాత చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లోనూ అవినాశ్ ప్రస్తావన లేదు. రోడ్డు ప్రమాదం కారణంగా దస్తగిరి తండ్రికి, యువకులకు మధ్య వివాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇది సమర్థనీయం కాదు. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్‌లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్‌లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్‌కృష్ణ తెలిపారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది: మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
-
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి: నిరంజన్‌రెడ్డి
-
రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకాలను దుబారా అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు భిక్ష అంటున్న కాంగ్రెస్ పార్టీకి, రైతులు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో బ్యాంకు అప్పుల వసూలుకు రైతుల ఇంటి తలుపులు తీసుకెళ్లిన ఘటనలు ఉండేవని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,815 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వెల్లడించారు. కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పాలమూరు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి రైతుల పొలాలకు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ధాన్యం కొనుగోలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగునీటి శిస్తురద్దు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ద్వారా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడం ద్వారా విత్తన రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. నిందలు, వ్యక్తిగత విమర్శలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను పట్టించుకోరన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హింసను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలోకి వెళ్లా రని, అందుకే హింసను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగెస్ర్ నేతలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హిత వు చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడా హింసకు తావివ్వలేదని.. అవహేళనలు, అవమా నాలు, కవ్వింపులు జరిగినా సంయమనం పాటించినట్లు చెప్పారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం హేయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగం, రావుల, పి.చంద్ర శేఖర్, ఎర్ర శేఖర్ల రాకతో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలోనే నేతలకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని, పారాచూట్ నేతలకు టికెట్లిచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు ‘కొనుగోలు’గా మారారని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ ఎంపీపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందే: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సంస్కారం లేని వాడిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పరుష పదజాలంతో స్థాయి మరిచి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తాము తప్ప ఎవరూ అధికారం చేయొద్దు అనే రీతిలో వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. అహింస పద్దతిలో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. కేసిఆర్ ను వ్యూహాత్మకంగా ఢీకొట్టలేక హింసాత్మక సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే నిన్న మా ఎంపీపైన కత్తితో దాడి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకునే సత్తా ఉందని తెలిపారు. పక్క పార్టీల్లో విశ్వాసం కోల్పోయే పరిస్తితి కి వచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
జడ్చర్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలి టీలోని నాగసాల శివారులో సింగిల్‌విండో వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గోదాంల నిల్వసామర్థ్యం 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షుడు వాల్యానాయక్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్‌దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
మట్టిని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్‌లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి. -
వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధి ల్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించా రు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం ఎంతో పురోగతి సాధించింది. జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుంచి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొ క్క ఎదుగుదలను ప్రతి దశలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని మంత్రి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపా రు. మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వల్ల లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. ప్రపంచస్థాయికి తెలంగాణ వ్యవసాయం: తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని నిరంజన్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమన్నారు. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదని అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రం డికెటర్ నగరంలోని అతిపెద్ద ఫార్మ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. -
అయోవా–తెలంగాణ మధ్య పరస్పర సహకారం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అయోవా రాష్ట్రం – తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్‌తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలున్నాయన్నారు. రెండు రాష్ట్రాలూ ఆహారధాన్యాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. పలు విధాన నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందన్నారు. తెలంగాణ సాధించిన విజయాలు గర్వించదగ్గవని ఆడమ్ కితాబిచ్చారు. తెలంగాణలో ఐదు విప్లవాలు అనంతరం నిరంజన్‌రెడ్డి అయోవా సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మైక్ నెయిగ్ను కలిశారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో వృద్ధి సాధించి నీలి విప్లవం సాధించామని చెప్పారు. అలాగే, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్ రెవల్యూషన్ సాధించిన తెలంగాణ, ఇప్పుడు నూనె గింజల ఉత్పత్తిలో పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తోందని వివరించారు. తెలంగాణ సాధించిన అయిదు విప్లవాల గురించి విన్న మైక్ నెయిగ్ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే ప్రపంచంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ వర్సిటీ అయిన అయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను మంత్రి సందర్శించారు. వర్సిటీ ప్రెసిడెంట్ వెండీ వింటర్‌స్టీన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయోవా వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం ఉండాలనే చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఫోటో ఆయన ఇంట్లో ఉంటే నీకేంటి నొప్పి
-
త్వరలోనే తెలంగాణకు వస్తా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వచ్చి వ్యవసాయ ప్రగతి చూస్తానని హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ అన్నారు. తన ఆరోగ్యం కుదుటపడ గానే రాష్ట్రానికి వస్తానని చెప్పారు. చెన్నైలో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్‌తో బుధవారం ఆయన నివాసంలో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావు భేటీ అయ్యారు. అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ విజ యాలను వివరించామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్వామినాథన్ స్ఫూర్తి తోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పామన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, పంటల కొను గోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. 98 ఏళ్ల వయసులోనూ స్వామినాథన్ జ్ఞాపకశక్తి అమోఘమన్నారు. ఈ భేటీలో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు. -
57.24 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వాస్తవంగా గతేడాది వానాకాలం సీజన్లో ఇదే సమయానికి 53.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకంటే ఇప్పుడు ఎక్కువ సాగు కావడం విశేషం. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో 103 శాతం... రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఏకంగా 103.81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 91.55 శాతం, వికారాబాద్ జిల్లాలో 74.30 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 3.93 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జోగుళాంబ జిల్లాల్లో వర్షపాతం తక్కువ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. జూన్‌లో 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఇప్పటివరకు 34.32శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అందుబాటులో ఎరువులు, విత్తనాలు: నిరంజన్ రెడ్డి ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని, ఆశాజనకంగా వ్యవసాయం సాగవుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. -
రుణాలివ్వడమూ సాయమేనా?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి రూ. 20 లక్షల కోట్లు, గొర్రెల కోసం రూ. 23 వేల కోట్ల రుణాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గొప్పగా చెప్పుకోవడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణాలివ్వడమూ సాయమేనా అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదేనని, బీజేపీ పాలనలో కొత్తగా వచ్చింది కాదని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గి, వినియోగం పెరిగిందని విమర్శించారు. రూ.6,300 కోట్లతో ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి అరబస్తా యూరియానైనా రైతుల కోసం ఉత్పత్తి చేశారా? దానిని మార్కెట్లోకి పంపించారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వాస్తవాలను దాచిపెట్టి రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఇస్తే, రైతుబంధును అనుకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.9,500 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. ఫసల్ భీమా యోజన.. బీమా కంపెనీల ప్రయోజనాల కోసమేనని, ఈ పథకం ప్రీమియం ఎక్కువ.. పరిహారం తక్కువ అని వ్యాఖ్యానించారు. పెంచిన మద్దతుధరల గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, పెరిగిన సాగు ఖర్చుల గురించి మాట్లాడాలని, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రైతాంగం నడ్డి విరిగిందని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్రప్రభుత్వం.. రైతుల సాగు ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే, తెలంగాణలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాకూ నిధులు కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. -
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్‌రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. -
‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్‌తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్‌కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్‌లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్‌కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు. -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
రఘునందన్ రావు ఎవరి మెప్పు కోసం నాపై ఆరోపణలు చేశారో తెలియదు
-
ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్గల్లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. రఘునందన్‌పై చట్టపరంగా ముందుకెళ్తాం పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్‌లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్‌రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా? -
165 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్‌రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కట్టుకుంటే తాము కట్టుకోవద్దా అని మంత్రులు కూడా ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారన్నారు. రఘునందన్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూడు ఫామ్‌హౌస్‌లు కట్టిన వ్యవసాయ మంత్రి ‘వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం మూడు ఫామ్‌హౌస్‌లు కట్టారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాల విసీర్ణంలో ఒక ఫామ్‌హౌస్ నిర్మించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారు. ఈ భూమిలో మూడున్నర ఎకరాల సీసీ రోడ్డు నిర్మించారు. గిరిజనుల పేరిట రూ.7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా కట్టారు?. నదిలో గోడ కట్టడంతో పాటు, మట్టి నింపి రీ సిల్టింగ్ చేయడం.. ఇవన్నీ నేరాలే. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఓ గిరిజన సోదరి పేరు నుంచి మంత్రి కుటుంబసభ్యుల పేర్లపైకి బదిలీ అయ్యాయి. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకుని కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. మానవపాడు మండల తహశీల్దార్ కార్యాలయం 2021 అక్టోబర్‌లో తగలబడి ఈ ఫామ్‌హౌస్ భూములకు సంబంధించిన రికార్డులు కాలి బూడిదయ్యాయి. అధికారులు కేసు పెట్టాక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, ఇప్పటివరకు చార్జిషీట్ వేయలేదు. ఇదిలావుండగా పాన్‌గల్ మండలం కొత్తపేట గ్రామ పంచాయితీలో వంద ఎకరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి మరో ఫామ్‌హౌస్ కట్టారు. పెద్ద మందాడి మండలం మోజర్ల సమీపంలో 50 ఎకరాల్లో ఇంకొక ఫామ్‌హౌస్ కట్టారు. ఇంకా చాలామంది మంత్రుల ఫామ్‌హౌస్‌ల చరిత్రలు నా వద్ద ఉన్నాయి..’అని రఘునందన్ చెప్పారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలి ‘గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను, అంతకుముందు ఓ దళిత మంత్రిని కేబినెట్ నుంచి తొలగించారు. మరి ఇప్పుడు నిరంజన్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోవడం లేదు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఒక న్యాయం.. అగ్రకులాల వారికి మరో న్యాయమా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. అవినీతిని ఉపేక్షించకుండా సీఎం కేసీఆర్ మంత్రిపై చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను కబ్జా చేస్తున్న వారిని, తహసీల్ ఆఫీస్‌లను తగులబెట్టి, రికార్డులు లేవు కాబట్టి తమ పేరిట ఆస్తులు మార్చుకోవాలని చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..’అని రఘునందన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర వేదికలను కూడా ఆశ్రయిస్తామని అన్నారు. -
అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను ఇరికించే కుట్ర
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును టీడీపీ నేతలు, వైఎస్ సునీత కలసి తప్పుదారి పట్టిస్తున్నారని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించేందుకు కుట్ర సాగుతోందని భాస్కర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. టీడీపీ నేతలు, సునీతకు సీబీఐ దర్యాప్తు అధికారి కూడా పూర్తిగా సహకరించారని చెప్పారు. దర్యాప్తు సరిగా చేయడం లేదని భావించిన సుప్రీంకోర్టు ఆ అధికారిని విచారణ నుంచి తప్పించిందని వివరించారు. ప్రత్యక్ష సాక్షులను, ఆధారాలను పట్టించుకోకుండా దస్తగిరి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించినా, బెయిల్ ఇచ్చినా సునీత మౌనంగా ఉండటం వెనుక కుట్ర దాగి ఉందని వెల్లడించారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ చెప్పినట్లు ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, అతనికి బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలివ్వాలి’ అని కోరుతూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలంలో చెప్పిన వాటికి సాక్ష్యం లేదు. ఇలా ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒకరు చెప్పారంటూ వ్యక్తులను నేరంలోకి నెట్టడం చట్టవ్యతిరేకం. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీరిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇచ్చారు. దస్తగిరిని కస్టడీలోకి తీసుకోలేదు. విచారణా జరపలేదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు దస్తగిరి హత్యలో కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. అతని వద్ద కొంత నగదు కూడా దొరికింది. ఆయుధాన్ని అతనే తెచ్చినట్లు, హత్యలో ప్రధాన పాత్ర పోషించినట్లు కూడా ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అతన్ని అప్రూవర్‌గా ప్రకటించేలా కడప కోర్టులో సీబీఐ కౌంటర్ వేసింది. 2021 ఆగస్టులో అనుకూల వాంగ్మూలం ఇచ్చిన కారణంగానే అక్టోబర్‌లో బెయిల్‌కు సీబీఐ సహకరించింది. మన వెనుక అవినాశ్, భాస్కర్‌రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ చెబుతోంది. అసలు ఎవరి పేర్లూ చెప్పలేదని గంగిరెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడంలేదు. వారికి ఏది కావాలో దాన్నే పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తు్తన్నారు. గూగుల్ టేక్ అవుట్ డేటాను ఆధారంగా చేసుకోవడం సరికాదు’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. టీడీపీతో సునీత మిలాఖత్ ‘వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు. ఇది మొదటి భార్య, కూతురు సునీత, అల్లుడికి నచ్చలేదు. ఆస్తుల విషయంలోనూ వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు కూడా ఉన్నాయి. అలాగే తన తల్లితో వివేకా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సునీల్ యాదవ్ చెప్పాడు. ఇలాంటి వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగింది. వీటిని కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్‌తో వివేకా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నికల్లో అవినాశ్ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. వివేకా హత్య తర్వాత ఇదే విషయాన్ని సునీత కూడా చెప్పారు. టీడీపీతో ఆమె మిలాఖత్ అయినప్పటి నుంచి మాట మార్చారు. విభేదాలు ఉన్న వారిని వదిలిపెట్టి.. సన్నిహితులను కేసులో ఇరికించేందుకు పథకం సాగుతోంది. దస్తగిరిపై వాచ్‌మేన్ రంగన్న చెప్పిన ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధం. అతనికి బెయిల్ ఇచ్చే సమయంలోనూ అన్ని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్ చట్టప్రకారం ఇవ్వలేదు కనుక కడప కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. దర్యాప్తు అధికారులకు అవినాశ్, భాస్కర్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. విచారణకు హాజరవుతున్నారు. భాస్కర్‌రెడ్డిని నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌రెడ్డి నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
'పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు.. 9 ఏళ్లుగా ఆత్మాభిమానం ఎటుపోయింది'
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. 'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది. కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్‌ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ -
గద్వాలలో సరెండర్ లొల్లి!.. హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం
సాక్షి, మహబూబ్‌నగర్: గద్వా ల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ సరెండర్..ఆ తర్వాత ఆమె కలెక్టర్ వల్లూరి క్రాంతిపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సీఈఓ ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా పరిపాలనకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విజయ నాయక్‌ను పంచా యతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేస్తూ గద్వాల కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్‌మీట్ నుంచే మంత్రికి ఫోన్.. తనను కలెక్టర్ వల్లూరు క్రాంతి సరెండర్ చేసి అన్యా యం చేశారంటూ ప్రెస్‌మీట్ నుంచే జెడ్పీ సీఈఓ..మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్ చేశా రు. తనను అన్యాయంగా సరెండర్ చేశా రని..ఈ ఉత్తర్వులను ఆపి న్యాయం చేయాలని కోరారు. తాను జిల్లాలో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నానని.. విధులు ఎలా నిర్వర్తిస్తున్నానో తన టూర్ డైరీని పరిశీలించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆమె ఆదివారం ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తానని చెప్పగా.. ఆయన సరేనని సమాధానమి చ్చారు. కాగా.. జెడ్పీ సీఈఓ గతంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించినట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదనపు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడం, మహిళా దినోత్సవం రోజు ఓ మహిళా అధి కారితో గొడవపడటం వంటి ఘటనలు ఉన్నాయని.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో బాధితులను విజయ నాయక్ పట్టించుకోరనే ఫిర్యాదు కలెక్టర్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
అవినాశ్‌పై తొందరపాటు చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లో పూర్తిగా సీల్డ్ కవర్లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది. పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. ‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు. మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్‌రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్‌పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్‌ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్‌కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్‌కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్‌ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డితోపాటు భాస్కర్‌రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు. వీడియో రికార్డింగ్‌తోనే విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్‌పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్‌లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్‌రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్‌రెడ్డికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. వివేకా లేఖను తొక్కిపెట్టారు.. ‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు. -
ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ మాదాపూర్: సాగులో నూతన పద్ధతులు, ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉంటూ వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పా రు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. పంటల సాగు కు అనేక రాయితీలను అందిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కిసాన్ అగ్రి షో–2023ను కిసాన్ ఫోరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కన్వినర్ నిరంజన్ దేశ్‌పాండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. నగరంలో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న పలు ఆవిష్కరణలను చూస్తుంటే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్ఛితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకురాగలదని అనిపిస్తోందని అన్నారు. వినూత్న ఆవిష్కరణలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అధిక దిగుబడులను పొందాలని రైతులకు సూచించారు. మనకు అవసరమైన పంటలతో పాటు విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరారు. దేశంలో పప్పు దినుసులు, వంటనూనెల కొరత నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ, ప్రపంచ అవసరాలకు సరిపడే విధంగా రైతాంగం తమ పంటలను పండించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు. నూతన సాంకేతికతల వినియోగానికి.. హైదరాబాద్‌లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడంపై నిరంజన్ దేశ్ పాండే హర్షం వ్యక్తం చేశారు. వ్యవ సాయ రంగంలో నూతన సాంకేతికతల వినియోగానికి ఈ ప్రదర్శన బాట వేయగలదన్నారు. 20కి పైగా అగ్రి స్టార్టప్స్ నూతన సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. జ్ఞాన కేంద్రం వద్ద రైతులు తెలంగాణకు పనికొచ్చే నూతన సాంకేతికతల గురించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పారు. 160కి పైగా కంపెనీల అనుసంధానం అగ్రి స్టార్టప్స్ ప్రత్యేక విభాగమైన స్పార్క్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాష్ట్ర వ్యవసాయ వర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం సహా పెద్ద సంఖ్యలో ప్రధాన పరిశ్రమలు ఈ షో కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. మూడురోజుల పాటు కొనసా గే ఈ ఎక్స్‌పోలో 150కి పైగా ఎగ్జిబిట ర్లు పాల్గొంటున్నా రు. ఈ వేదిక ద్వారా 160కి పైగా కంపెనీలు అనుసంధానం కాగలవని అంచనా. ఆకట్టుకుంటున్న స్టాళ్లు.. అగ్రి ఇన్పుట్, నీటి నిర్వహణ, పరికరాలు, ఉపకరణాలు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్‌కు సంబంధించిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలు, ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగా అభివృద్ధి చేసిన ఎన్నో వినూత్న వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. -
అవును.. అప్పుడు పేదలు గట్కే తిన్నరు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు ఆకలి రాజ్యమేలింది. తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న గట్క, సజ్జలు, ఒట్టు వడ్లు, నల్లవడ్లు, మొక్కజొన్న గట్క తిని పేదలు బతికేవారు. మా ఊళ్లో మేం గట్క తిని, గంజి తాగేవాళ్లం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం వల్లే ఆకలి రాజ్యంపోయింది’అని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యంలో కాసాని సోమవారం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తూ నిరంజన్‌రెడ్డి దొరలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని ఎద్దేవా చేశారు. 15 రోజులలోనే ఒట్టు వడ్ల పంట వచ్చేదని, ఆ 15 రోజులలోనే కొన్ని వేలమంది ప్రజలు తిండికి అలమటించేవారని గుర్తుచేశారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పేదలకు కడుపు నిండా తినే అవకాశం రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా ఇచ్చారని పునరుద్ఘాటించారు. కారంతో ముద్ద తిని ఆకలి తీర్చుకున్న ఆ రోజుల్లో ధమ్ బిర్యానీ ఎక్కడ దొరికిందో నిరంజన్‌రెడ్డి చెప్పాలని, హైదరాబాద్‌లోని పాతబస్తీ హోటళ్లలో దొరికిన ధమ్ బిర్యానీ మహబూబ్‌నగర్‌లో దొరికిందా అని ప్రశ్నించారు. దొరలకు కూడా ఆనాడు సన్న బియ్యం దొరికేది కాదని, రాజహంస అనే బియ్యం అక్కడక్కడ లభించేవని పేర్కొన్నారు. పచ్చజొన్నలు తినడం కరెక్టు కాదా? ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ఇచ్చారా.. లేదా..? ఆహార భద్రత తెలుగుదేశం పార్టీ వచ్చాకే వచ్చిందనడం వాస్తవం కాదా? చర్చకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని ఆయన సవాల్ విసిరారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రూ.2కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికి పరాకాష్ట అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, 15వ శతాబ్దం నుంచే హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి అని పేర్కొన్నారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేకసార్లు ప్రస్తావించారని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ప్రసిద్ధి అని వివరించారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల వరకు గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్ధికి బాటలు వేశారని వివరించారు. అక్కసు, ఆక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అని, 1956లో ఆంధ్రలో విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని పేర్కొన్నారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జొన్నకలి, జొన్నయంబలి జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’ అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
5.42 లక్షల మందికి రుణాలు మాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రూ. 36 వేల వరకు రుణాలున్న 5.42 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్లో రూ. 90 వేల వరకున్న రుణాల మాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు. శాసనసభలో ఆదివారం సభ్యులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బిగాల గణే‹Ù, నలమోతు భాస్కర్‌రావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ కొల్లాపూర్ మండలం రాంపూర్‌లో రూ. 5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, త్వరలోనే అక్కడ మార్కెట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. -
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్‌రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటాం
సాక్షి, హైదరాబాద్: కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించామని, మొక్కలు నాటేందుకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా కంపెనీలు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని, రైతు వేదికలలో శిక్షణ ఇప్పించాలని, ఆయిల్ పామ్ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు వారికి అవగాహన, ఇతర సహకారం కల్పించాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుపై శనివారం రెడ్‌హిల్స్ ఉద్యాన శిక్షణ కేంద్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా 1,502 ఎకరాల్లో 38 ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి కావాలని ఆదేశించారు. 2023– 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్ పామ్ మొక్కలు ఉన్నాయని, ఇవి మరో 1.50 లక్షల ఎకరాలకు సరిపోతాయని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ జరిగిందని, నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ఈ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్ కంపెనీలకు టీఎస్ఐఐసీ ద్వారా భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బొప్పాస్పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల కేంద్రాల ఏర్పాటుపై పరిశీలనకు అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఓట్ల కోసం ఏదైనా చేస్తారు
సాక్షి, సిద్దిపేట: ‘గోవును, గుడిలో భగవంతున్ని పూజించేది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌లతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి అని ప్రశ్నించారు. ధరలు పెంచడం తప్ప ఎవరికి ఏం చేశారని నిలదీశారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కోట్ల కొలువులు ఇస్తా మని ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభు త్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. మిషన్ 90 సీట్లు కాదు: నిరంజన్‌రెడ్డి మిషన్ 90 సీట్ల పేరుతో తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని ఓ బీజేపీ నాయకుడు అన్నాడని, వాళ్లు మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికష్టాలొచ్చినా సీఎం కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందని.. అలాంటి కేసీఆర్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీకి చెందిన వ్యక్తికి చెక్కు ఆపేశా..: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన చెక్కును ఆపేశానని చెప్పారు. ’’ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెక్కు రాలేదని అడిగాడు.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎందుకు..ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావ్ ’’అని అడిగానని బాజిరెడ్డి తెలిపారు. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని ప్రశ్నించానని చెప్పా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర సైతం ఓ గుండు గాడు ఉన్నాడని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ’’బీజేపీ వాళ్లు జై శ్రీరామ్ అని అంటున్నారు.. మోదీకి భార్య లేదు కాబట్టి శ్రీరాముని భార్య సీతను కూడా విడదీస్తారా.. జై సీతారామ అనాలి’’అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు తెలంగాణ ద్రోహి: నిరంజన్ రెడ్డి
-
టీఆర్ఎస్లో పీక్ స్టేజ్‌కు పాలిటిక్స్.. మంత్రితో జెడ్పీ చైర్మన్ వాగ్వాదం!
వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతలుగా జిల్లాకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం హెల్త్ సెక్టార్ గ్రాంట్స్ రూ.84 లక్షలు, రూ.2.10 కోట్ల నిధుల కేటాయించగా.. వాటిని వినియోగించే అంశంలో జెడ్పీ సమావేశంలో మంత్రి అధికారులు సూచనలు చేశారు. అయితే ‘మా ప్రమేయం లేకుండా పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ చేస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు జనం గౌరవం ఏముంటుంది. ఈ పాటిదానికి గ్రాంట్ జెడ్పీకి ఇవ్వటం దేనికి.. నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి మీరే పనులు చేయిస్తే.. సరిపోతుంది కదా.’ అని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి నిలదీశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ప్రభుత్వం నిధులతో పాటు ఇచ్చిన నిబంధనలను పాటించి నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. గ్రాంట్ విడుదలైన తర్వాత నాలుగుసార్లు నిధులను వెచ్చించే నిబంధనలను మార్చుతూ.. సర్క్యులర్ పంపించారు. ఎంత వరకు సమంజసం అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశంలో కూర్చోవాలా.. వెళ్లిపోనా.. అంటూ జెడ్పీ చైర్మన్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన నిమ్మకుండిపోయారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల జిల్లాఅధికారుల ఎదుట మంత్రి, జెడ్పీ చైర్మన్ విభేదించుకోవటం చూసి నివ్వెరపోయారు. కొద్దిసేపటికే.. మంత్రి సమావేశం నుంచి మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందంటూ.. వెళ్లిపోయారు. -
అత్యాధునిక టెక్నాలజీతో విత్తన పరీక్షా కేంద్రం
ఏజీవర్సిటీ(హైదరాబాద్): ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ మారిందని, మన విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని విత్తన పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయస్థాయి విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణకే కాకుండా భారత విత్తన పరిశ్రమకు సేవలు అందించడానికి అత్యా«ధునిక టెక్నాల జీతో విత్తన పరీక్షాకేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విత్తనోత్పత్తిదారులకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ వర్క్‌షాప్‌ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తనరంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ ఈ విత్తన పరీక్షాకేంద్రంలో మనదేశంలోని విత్తనోత్పత్తి సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతుల తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఎంతో నేర్చు కోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణుడు ఎడ్డీ గోల్డ్‌శాక్(సౌతాఫ్రికా) మాట్లాడుతూ తెలంగాణలో నాణ్య మైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ విత్తనోత్పత్తి రంగానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, అందుకే తెలంగాణ అంతర్జాతీయస్థాయి కార్యక్రమానికి వేదిక అయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన సంస్థ ఎం.డి. కేశవులు మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో అను భవజ్ఞులైన అంతర్జాతీయస్థాయి విత్తన ప్రముఖులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే వర్క్‌షాప్‌లో ఇండియాతోపాటు టాంజానియా, కెన్యా, ఇండోనేíసియా, డెన్మార్క్, దక్షిణ కొరియా, నైజీరియా, ఆస్ట్రే లియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్‌రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు బేడీలంటే భయం లేదు.. నేను పులి బిడ్డను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటాను. అవినీతిపై మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు అంత వణుకెందుకు?. అవినీతిపై చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిది నోరా? మోరినా? అని ఆగ్రహం చేశారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు. పోలీసులు టీఆర్ఎస్కు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను టీఆర్ఎస్లో విలీనం చేయాలి. మంత్రి నిరంజన్ రెడ్డిపై మేము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేసి పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గంగాపూర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడక్కడా మిగిలిన పనులను సైతం సీఎం కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. -
తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు!
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం.. గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు. తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌తో పాటు ఆర్బీకే చానల్ తరహాలో ఓ అగ్రి చానల్‌ను ప్రారంభిస్తామని నిరంజన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్‌లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్లో ఉన్న మినుము సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలిస్తారు. -
విశ్వసాహితీ మూర్తి సినారె
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, విశ్వ సాహితీమూర్తి సి.నారాయణరెడ్డి చిరస్మరణీయుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవం తెచ్చి పెట్టారన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పుర స్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి అంశాల చుట్టూనే సాగిందన్నారు. ఆలోచనాత్మక కావ్యం విశ్వంభర ఆయనను విశ్వసాహితీ పీఠంపై నిలబెట్టిందని అభినందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా.. ఆయన తన ప్రతి పదవికీ వన్నె తీసు కొచ్చారని గుర్తుచేశారు. సినారె తెలుగుదనానికి నిలువెత్తు సంతకమన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో మాతృభాష బిల్లు ప్రధానమైందన్నారు. ఉన్నత విద్యవరకు మాతృభాష ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని పట్టుబట్టారని, నూత న జాతీయ విద్యావిధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన ఆకాంక్షించిందేనని చెప్పారు. ప్రతిభారాయ్ మాట్లాడుతూ, సినారె పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ ప్రారంభంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య, రచయిత్రి ఓల్గా, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
రుణంతో సాగు చేసినా సబ్సిడీ: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులు రుణం తీసుకుని ఆయిల్‌పామ్ సాగు చేసినా వారికి చెందాల్సిన సబ్సిడీని అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రుణం అనేది ఆప్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్‌పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తేయడంలేదని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ డిమాండ్‌ను గమనించే ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇప్పటి వరకు 30 వేలమంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామని వెల్లడించారు. -
తెలంగాణపై కేంద్రం అక్కసు
గజ్వేల్: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం అక్కసు వెళ్లగక్కుతోందని.. నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల్లో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రకు తెరలేపిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎరువుల రేక్ పాయింట్, గూడ్స్ రైలును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయామని చెబుతారా?, నీతి ఆయోగ్ చెప్పినా.. రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని చెబుతారా?, ఐటీఐఆర్‌ను రద్దు చేశామని చెబుతారా? అంటూ ప్రశ్నిం చారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో రాష్ట్రం ఖర్చుపెట్టిందే ఎక్కువన్నారు. భూసేకరణ, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ.650 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. రైలు లాభాలు ఇలా.. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల మేర కొత్తగా బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.1,160.47 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్ గా ఆవిర్భవించనుంది. ఇది పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. సిద్ది పేట జిల్లాతోపాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీదుగా కొడకండ్ల వరకు 43 కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్‌ను ప్రత్యామ్నాయంగా మార్చి.. దేశంలోని ముఖ్యమైన నగరాలకు కొన్ని కొత్త రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించారు. ఇక్కడి రేక్ పాయింట్‌కు తొలిరోజు సోమవారం గూడ్స్ రైలు ద్వారా ఏపీలోని కాకినాడ నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్‌కు చెందిన 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయి. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ గోదాములకు, అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల తరలింపు, కూరగాయల రవాణా కోసం వినియోగించనున్నారు. -
రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎంపికైన వైఎస్సార్సీపీ సభ్యులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్య తెలుగులో, నిరంజన్‌రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు, తెలంగాణ నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిలతో కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ తదితరులు హాజరయ్యారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి నూతన ఎంపీలుగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం) -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్ రెడ్డి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చేతుల -
వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బీసీలకు సముచిత స్థానం: బొత్స అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నామినేటెడ్ పదవులతోపాటు నామినేషన్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: సజ్జల బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే.. 1.ర్యాగ కృష్ణయ్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 13, 1954 విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. ► 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2. వేణుంబాక విజయసాయిరెడ్డి పుట్టిన తేదీ: జూలై 1, 1957 సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ పదవులు: ► ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. ► వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు)కు ఎంపికయ్యారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3. బీద మస్తాన్‌రావు పుట్టిన తేదీ: జూలై 2, 1958 సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్) ► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ► చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్‌లో ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేశారు. ► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు. ► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. ► బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ► 2019 డిసెంబర్లో వైఎస్సార్సీపీలో చేరారు. ► బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ► కోవిడ్ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్‌కు విరాళం ఇచ్చారు. ► 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ వాషింగ్టన్, యూఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 4. నిరంజన్‌రెడ్డి పుట్టిన తేదీ: జూలై 22, 1970 సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ విద్యార్హతలు: హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. -
నిరంజన్‌రెడ్డి: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై పట్టున్న న్యాయ నిపుణుడు
సాక్షి, నిర్మల్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయన. పైగా కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉంది ఈయనకు. అందుకే రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. జులై 22, 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు నిరంజన్‌రెడ్డి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి చేశారు. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు.. నేపథ్యాలు ఇవే!
సాక్షి, అమరావతి: జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తూ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది వైఎస్సార్సీపీ. పైగా గత మూడేళ్లలో అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది కూడా. తాజాగా పెద్దల సభకు పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే.. ఆర్ కృష్ణయ్య ► ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. ► సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ► ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. ► విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ► నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. ► 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్‌రావు ► ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు. ► జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జననం. ► విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ► బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. ► బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. ► రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విజయసాయి రెడ్డి ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. ► 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. ► చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ► రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. ► రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. ► జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ► ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ► రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
రాజ్యసభకు నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖరారు
-
ఏపీ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు. -
‘పంజాబ్‌లో మీ పార్టీని ఈడ్చి తన్నారు’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ వరంగల్ ‘రైతు సంఘర్షణ సభ’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే బీజేపీలో చేరుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘రెండు పర్యాయాలు క్షమించకనే ఓడించారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది మేము చేస్తున్నాం. మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?. పంజాబ్ లో ఈడ్చి తన్నారు. మీ కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని పంజాబ్ ప్రజలు శిక్షించారు. తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోంది.రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతుంది. మీరు ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారు.జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదు. ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాదించుకున్నాం.పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్దించింది. నిన్న మొన్న కాంగ్రెస్‌ను తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి👉టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు -
వారు తిష్ట వేసినా ఫలితం ఉండదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కాదు. ఢిల్లీ నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలాంటి వాళ్లు వచ్చి ఇక్కడే తిష్ట వేసినా ఫలి తం ఉండదు’అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అడ్డాలో ఎవరి ఆటలు సాగవన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అబద్ధాలతో నిం దిస్తే ప్రజల అభిప్రాయం మారదన్నారు. అపరిపక్వ రాష్ట్ర బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో నడ్డా వీధిరౌడీలాగా మాట్లాడారని దునుమాడారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్‌కు అవార్డులు ఇస్తే, నడ్డా మాత్రం అవినీతి టీఆర్ఎస్ ప్రభు త్వం అంటూ విమర్శలు చేయడం చోద్యంగా ఉందన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి నిరూపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడ్డాకు సిగ్గుంటే 2014లో మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతలను చేపట్టాలన్నారు. బండి సంజయ్ మాటలు డబ్బాలో రాళ్లేసినట్లు ఉంటాయని ఎద్దేవా చేశారు. సీఎంను ఏక వచనంతో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తా నని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిన్నటిదాకా సోనియా, రాహుల్‌ను బూతులు తిట్టి మళ్లీ అక్కడే రాజకీయ ఆశ్రయం పొందారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రుడాలి (చనిపోయినప్పుడు ఏడ్చేందుకు వచ్చే అద్దె మనుషులు) పాత్ర పోషిస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్‌కు చావు డిక్లరేషన్ అవుతుంద న్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారన్నారు. ‘2018 ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చింది.. అయినా ప్రజలు తిరస్కరించారు.. ఇప్పుడదే పాత పాట పాడుతోంది’ అని విమర్శించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి
‘‘రాజమౌళిగారు ఓ బాట వేశారు. ఇక ఏ డైరెక్టర్ తీసినా సరే అది ఇండియన్ సినిమా అయిపోతుంది. మొన్న సుకుమార్‌గారు తీసిన ‘పుష్ప’ ఇండియన్ సినిమా అయిపోయింది. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ అయిపోయింది. అల్లు అర్జున్, యశ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. అఫ్కోర్స్ వీరందరి కంటే ముందు ప్రభాస్... పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. కంటెంట్‌లో బలం ఉంటే ఏ ప్రాంతం వారయినా అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అందరూ పాన్ ఇండియా డైరెక్టర్సే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు చెరిగిపోవాలి. భాషతో సంబంధం లేకుండా ఇది ఇండియన్ సినిమా. ప్రతి యాక్టర్ కూడా ఇండియన్ యాక్టర్.. అనేది రావాలి.. వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘1988లో నాగబాబు ‘రుద్రవీణ’ సినిమా నిర్మించారు. ఆ సినిమాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడానికి మేం ఢిల్లీ వెళ్లాం. కార్యక్రమానికి ముందు హైటీ ఉంటుంది. ఆ హాలులో ఇండియా సినిమా వైభవం అంటూ కొన్ని సినిమాల పోస్టర్స్, యాక్టర్స్.. అంటూ క్లుప్తంగా కొంత నోట్స్ ఉంది. పృథ్వీ రాజ్‌కుమార్, దిలీప్‌కుమార్, దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్రగార్ల ఫొటోలు ఉన్నాయి. ఎమ్జీఆర్గారు, జయలలితగారు ఉన్న స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్‌గారి ఫోటో ఉంది. అంతే... కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌గారిది కానీ విష్ణువర్ధన్ గారిది కానీ, మన గొప్ప నటులు ఎన్టీ రామారావుగారు, నాగేశ్వరరావుగార్లు కానీ, తమిళంలో శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ లేవు. ఆ సమయంలో నేను చాలా హ్యూములిటీకి లోనయ్యాను. చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే ఏదో హిందీ సినిమా అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. ఇటు ప్రాంతీయ సినిమాలకు కూడా సరైన గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను మద్రాస్‌లో కూడా ఈ విషయాలను ప్రెస్‌తో పంచుకున్నాను. కానీ నా ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసింది. మావన్నీ ఇండియన్ సినిమాలే అని ప్రతి ఒక్కరు గర్వపడేలా, ఆశ్చర్యపోయేలా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలాంటి సినిమాలు మనం రొమ్మువిరుచుకుని నిలబడేలా చేశాయి. అలాంటి సినిమాల రూపకర్త రాజమౌళి. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళిగారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిని సభాముఖంగా అభినందిస్తున్నాను. రాజమౌళిగారు ప్రోత్సహించడం వల్లే ‘ఆచార్య’ సాధ్యమైంది. చరణ్‌ను, నన్ను కలిసి స్క్రీన్‌పై సురేఖ చూడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పటికీ చరణ్ ‘ఆచార్య’ చేయడానికి రాజమౌళిగారు ఒప్పుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మా ఇంటి సభ్యుడైపోయారు. ‘డాడీ సినిమాలో నేను కనబడితే చాలు అని!’ శివతో చరణ్ అన్నాడట. నేనంటాను... చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతానా? లేదా? అన్న డౌట్ వచ్చింది. రాజమౌళిగారితో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలకు, వారి తర్వాతి సినిమాలు ఫ్లాప్స్ అనే టాక్ విన్నాను. అది ‘ఆచార్య’ రూపుమాపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మరో హిట్ అవుతుంది’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మగధీర’ టైమ్‌లో కథ చెప్పినపుడు చరణ్ విషయాలు చిరంజీవిగారే దగ్గరుండి చూసుకుంటారనుకున్నాను. కానీ తర్వాతి కాలంలో చిరంజీవిగారు చరణ్‌కి ఎటువంటి సలహాలు ఇవ్వరని తెలుసుకున్నాను. తన తప్పులను దిద్దుకొని, దర్శకుడు చెప్పిన ప్రతీది నేర్చుకొని, తనకు తానుగా ఎదిగిన వ్యక్తి రామ్‌చరణ్. చిరంజీవిగారు తనతో కలిసి నటించే వ్యక్తులతో, చివరికి ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఇది చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. చిరంజీవిగారి అభిమానిగా చెబుతున్నా... చిరంజీవిగారు ఎంత బాగా నటించినా నా హీరో చరణే.. సినిమాలో బాగా నటించాడు (నవ్వుతూ). మంచి సందేశాలిచ్చే సినిమాల దర్శకుడు కొరటాల శివ. మాస్ చిత్రంగా ముందుకు వస్తున్న ‘ఆచార్య’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘నాన్ కరెప్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. సినిమాల ద్వారానే నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నేను మా నాన్నగారిని ఇన్నేళ్లుగా చూసి ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ, మారేడుమిల్లిలో 20 రోజులు నాన్నగారితో నటించి, దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవాలతో పోలిస్తే ఈ 20 ఏళ్లు నథింగ్ అనిపించింది. నాన్నగారితో నటించడం డబుల్ బొనాంజాలా భావిస్తున్నా. మా నిర్మాతలు పెద్ద పిల్లర్స్‌గా నిలిచారు’’ అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘1991లో నిర్మల్‌లోని ఓ థియేటర్‌కు వచ్చారు చిరంజీవిగారు. రోడ్లపై ఉన్న ఆ జనసందోహంలో నేనూ ఒకడిని. చిరంజీవిగారిని కలిస్తే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేయగలిగా. యాక్టర్స్, రెమ్యునరేషన్స్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అసలు పారితోషికం తీసుకోకుండానే సినిమా చేశారు. సినిమా రానివ్వండి.. వచ్చిన తరవాత తీసుకుంటాము అని నాకు సపోర్ట్ చేసిన నా ఇద్దరు హీరో (చిరంజీవి–చరణ్)లు, దర్శకుడికి థ్యాంక్స్. సినిమాల బిజినెస్ ఆంధ్రాలో ఎక్కువగా ఉండేది. తెలంగాణలో తక్కువ. అలా తెలంగాణలో బిజినెస్ పరంగా కోటి, రెండు కోట్లు, మూడు కోట్లు .. ఇలా సినిమాల కలెక్షన్స్ పెరిగాయి. ఫలితంగా థియేటర్స్ పెరిగాయి. చిరంజీవిగారి సినిమాలతోనే అది జరిగింది. ఈ రోజు తెలుగు సినిమా పాన్ ఇండియా గురించి ఆలోచించగులుతోందంటే కారణం చిరంజీవిగారే’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి సినిమాల టికెట్ల కోసం కొట్టుకొని చొక్కాలు చించుకున్నాం. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలనుకుంటే ఇప్పుడు ఆయనతో కెమెరా, యాక్షన్ అంటూ సినిమాకి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. సినిమాకు ‘ఆచార్య’ అని టైటిల్ పెట్టాం. కానీ మాకు చిరంజీవి అనే ఒక ఆచార్య దొరికారు’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఈ సినిమాలో మాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు: రామ్‌చరణ్ వెబ్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
కిషన్ రెడ్డి పై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
అది ‘వ్యాపార’ కేంద్రం!
ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. – వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం నిరంజన్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం’’అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్‌లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు. -
‘ఉప్పుడు’ నిప్పు.. పీయూష్, రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధం
యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు బియ్యంపై రాజకీయ నిప్పు రాజుకుంది!! పరస్పర విమర్శలు, వాగ్వాదానికి దారితీసింది!! ‘కేవలం ముడి బియ్యం ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి? మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలా కాదు.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి... మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనాలని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్రం సేకరణ విధానం మార్చుకోవాలి’ అని సూచించగా ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’ అంటూ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ‘మాకూ సమయం వస్తుంది’ అని అన్నట్లు తెలిసింది. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి చర్చించేందుకు భేటీ అయిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడితే, డిమాండ్ లేని సరుకును మార్కెట్లో ఎలా అమ్ముతారంటూ కేంద్రమంత్రి ప్రశ్నించడంతో సమావేశంలో వేడి రాజుకుంది. ఓ దశలో ధాన్యం సేకరణ అంశం పక్కకు వెళ్లి, రాజకీయ ప్రకటనలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులంటే, మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండంటూ పీయూష్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో భేటీ మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్.. ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేకేలతో కూడిన బృందం.. గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎక్కువ సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించినట్లు తెలిసింది. 20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించాం: నిరంజన్‌రెడ్డి తొలుత ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే 20 లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించామని, సాగైన మేరకు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉంటుందని, బాయిల్డ్ రైస్‌ను తీసుకునేలా కేంద్రం విధానపరమైన నిర్ణ యం చేయాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘కేవలం రారైస్ ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి?, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలాకాదు బాయిల్డ్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి. మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి..’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు.. పీయూష్‌కు గట్టిగా బదులిచ్చిన నిరంజన్‌రెడ్డి.. ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనమని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర విధానం మార్చుకోవాలి..’అని అన్నారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో మాకూ సమయం వస్తుందంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. పరస్పరం వీడియోలు, క్లిప్పింగ్‌ల ప్రదర్శన ఇదే సమయంలో వ్యవసాయం, రైతులకు మద్దతుగా 2013లో ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యాక గుజరాత్ అగ్రికల్చర్ సమ్మిట్‌లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు చూపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆలోచనలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తు తం తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చూపాలి కదా?, సానుకూల నిర్ణయాలు చేయాలి కదా? అని అన్నారు. పీయూష్ మాట్లాడుతూ ఇది తన పరిధి కాదని, ప్రధాని స్థాయిలో నిర్ణయం చేయాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలను మంత్రులు భేటీలో ప్రస్తావిస్తే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర రాష్ట్ర నేతలు ధాన్యం పండించండి. వంద శాతం కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు..’ అని చెప్పారు. ఆయా వ్యాఖ్యల వీడియోలు చూపించారు. కాగా ప్రధాని మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను కేంద్ర అధికారి ఒకరు చూపించినట్టు తెలిసింది. -
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్‌రెడ్డి
-
భారతీయ మహిళలది విశిష్ట స్థానం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు. -
నదులకు జీవం పోశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదులకూ హక్కులున్నాయి: వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు. దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్‌లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్ ఫ్యామిలీ చైర్మన్ ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
80 దేశాలకు విత్తనాల ఎగుమతులు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్‌ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
27న రాష్ట్రస్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి, సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు,ను నిర్వహిస్తున్నట్లు గాంధీ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని పంటలను ప్రోత్సహిస్తూ వస్తున్నామన్నారు. -
ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం ఉంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం టోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరం జన్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాల ను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావే శంలో మంత్రి మాట్లాడారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలని సూచించారు. అంతర్జాతీ యంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పంట కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగులో మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నారు నాణ్యతను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా బీచుపల్లి ఫ్యాక్టరీ అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా ఖమ్మం జిల్లా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం స్థలసేకరణకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్‌లో 84 ఎకరాల్లో ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి విత్తన నిల్వకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఉన్నతాధికారులు లక్ష్మీబాయి, యాదిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.