సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.
ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టాలి
పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించామని మం త్రి చెప్పారు. వచ్చే వానాకాలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొ క్కలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. పత్తి మద్దతు ధర రూ. 6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7 వేలకు పైగా పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు భారీగా పత్తి సాగు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment