Oilseeds
-
భారీగా తగ్గిన... నూనె గింజల సాగు
ఆహార పంటల తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో ఈ పంటల సాధారణ విస్తీర్ణమే 20 లక్షల ఎకరాలు. దాంట్లో వేరుశనగ, 18.30 లక్షల ఎకరాలుండగా, ఆముదం, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి ఇతర నూనెగింజల పంటలన్నీ కలిపి 1.77 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఖరీఫ్–2024 సీజన్లో 17.25 లక్షల ఎకరాల్లో వేరుశనగ, ఇతర పంటలన్నీ కలిపి సాగు చేయాలని నిర్ధేశించగా.. కేవలం 8.45 లక్షల ఎకరాలే సాగయ్యింది. – సాక్షి, అమరావతిఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినా..రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో కృష్ణ, గోదావరి, వంశధార, నాగావళి నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి. భూగర్భ జలాలన్నీ ఎగసి పడుతున్నాయి. వాస్తవానికి నూనె గింజల పంటలు కూడా రికార్డు స్థాయిలో సాగవ్వాలి. కానీ ఊహించని రీతిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు భారీ వర్షాలు ఈ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మరొకపక్క ప్రభుత్వ అలసత్వం తోడవడంతో నిర్ధేశించిన లక్ష్యంలో సగం కూడా సాగవని పరిస్థితి నెలకొంది. సాగుకు దూరమైన వేరుశనగ రైతురాష్ట్రంలో ఏటా 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే వేరుశనగ ఈసారి కేవలం 7.17 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేరుశనగ పంట అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 6.95 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇతర నూనె గింజల పంటలను పరిశీలిస్తే సన్‌ఫ్లవర్ సాధారణ విస్తీర్ణం 13వేల ఎకరాలు కాగా, 3785 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఆ తర్వాత నువ్వులు సాధారణ విస్తీర్ణం 50వేల ఎకరాలు కాగా, సాగైంది కేవలం 20వేల ఎకరాలే. ఆముదం సాధారణ విస్తీర్ణం 92వేల ఎకరాలు కాగా, 88వేల ఎకరాల్లోనే సాగయ్యింది. సీమలో సగానికి తగ్గిన సాగువర్షాభావ పరిస్థితుల వలన రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ స్థానంలో సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా ప్రత్యామ్నాయ పంటలు సాగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క రాయలసీమ జిల్లాలోనే 3.50లక్షల ఎకరాలు వేరుశనగ పంట వేయలేని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.6,783 కాగా, ప్రస్తుతం కనిష్ట ధర రూ.3,300 ధర ఉండగా, గరిష్టంగా రూ.7వేల వరకు పలుకుతోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు ధర లేకపోవడం, తెగుళ్ల బారిన పడడం, పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం ఈసారి వేరుశనగ విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించేలా రాయితీపై మినీ కిట్స్ ఇచ్చేవారు. ఆర్బీకేల ద్వారా అన్ని రకాలుగా అవసరమైన చేయూతనిచ్చేవారు. సాగులో అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు. -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
పప్పు, నూనెగింజల సాగుపై రైతుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టాలి పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించామని మం త్రి చెప్పారు. వచ్చే వానాకాలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొ క్కలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. పత్తి మద్దతు ధర రూ. 6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7 వేలకు పైగా పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు భారీగా పత్తి సాగు చేయాలని సూచించారు. -
నూనెగింజల సాగులో మొండి చేయి..
ఆహార భద్రత పథకాన్ని పక్కాగా అమలు చేసి ఆహాధాన్యాల కొరతను అధిగమిస్తామని ప్రభుత్వం చెబుతోంది.అందుకు అవసరమైన ప్రణాళికలను జిల్లా నుంచి పంపినా పట్టించుకోలేదు. నూనెగింజల పథకానికి నిధులు కేటాయిస్తూ జీఓలు మాత్రం జిల్లా వ్యవసాయశాఖకు పంపింది. పరికరాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలకు, కంపెనీల మధ్య డీల్ కుదరక, ధరలు ఖరారుకాక పథకాలు మూలన పడిపోయాయని వ్యవసాయశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కడప అగ్రికల్చర్ : నూనెగింజల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏడాది కేడాది నూనెగింజల పంటల సాగు తగ్గిపోతోంది. జిల్లాకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎస్ఎఫ్ఎం), నూనె విత్తుల పథకం (ఐసోఫాం)ను మొన్నటి వరకు వేర్వేరుగా నిర్వహించే వారు, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి జాతీయ ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారు.ఇందుకగాను 600 సాగునీటిపైపుల యూనిట్లు జిల్లాకు కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా తుంపర సేద్య పరికరాలు 600 యూనిట్లు, మరొక పథకానికి కలిపి రూ.50 లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేసింది. ఈ పథకాల్లోని పరికరాల కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో గత ఏడాది ఇచ్చిన ధరలకే ఇప్పుడు టెండర్లు కోట్ చేయాలనే సంకేతాలు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఖరీప్ నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలు నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఉన్నాయి.ఈ టెండర్లు ఖరారై ధరలు నిర్ణయమయ్యే లోపు ఖరీఫ్ పంటకాలం ముగిసిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు భగీరథ పోరాటాలు చేస్తున్నారు. సాగునీటి కష్టాలు కర్షకులకు కన్నీటిగాథను మిగులుస్తోంది. సేద్యపు జలాలను పొదుపుగా వాడడం కోసం సబ్సిడీ పైపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతుల కళ్లల్లో కాంతులు నింపలేదు. సేద్యపు నీటి కష్టాలు తీర్చలేదు. 600 యూనిట్లు మంజూరు జాతీయ ఆహార భద్రత పథకం కింద సాగు నీటిపైపులు 600 యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్లో ఎకరాకు 60 పైపులు ఇవ్వనున్నారు.సాగునీటి పైపులకు గత ఏడాది రూ.7500 రాయితీ ఇచ్చారు. ఈ పథకం మొత్తానికిగాను రూ.35లక్షలు కేటాయించారు. అదే విధంగా నూనె గింజల అభివృద్ధి పథకం కింద దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పథకాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో యూనిట్‌కు 60 పైపులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు పథక ఫలాలు అందడం లేదు. మార్కెట్లో పైపులు, తుంపర సేద్య పరికరాల ధరలు అధికంగా ఉంటున్నాయని, డీజిల్, పెట్రోలు ధరలు పెరిగినందున పాత ధరలకు ఇవ్వలేమని కంపెనీలు నిరాకరించినందున, తాము కూడా ఆయా కంపెనీలు కొత్తగా ప్రకటించిన ధరలకు పైపులు, తుంపర సేద్య పరికరాలు కొనుగోలు చేసి అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేయ్యడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం కంటే ఇచ్చేదేదో మాకే ఇస్తే తుంపర సేద్య పరికరాలు, పైపులు మేమే తెచ్చుకుంటాం..కదా? అని రైతులు అంటున్నారు. రైతుల ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు రైతులకందించే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. సాగునీటి పైపుల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉంది. కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు ఏమైనా చేస్తారు. రైతులు ఏమై పోయినా ఫర్వాలేదు.. మాకు రావలసిన ఆమ్యామ్యాలు వస్తే చాలని అనుకుంటారు. జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
నూనె గింజలకు కనీస మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: నూనెగింజలకు కనీస మద్దతు ధర రూ.50 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ఈమేరకు 2016-17 పంటలపై కనీస మద్దతు ధరలను వ్యవసాయ మద్దతు ధర కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2016-17 ఖరీఫ్ సీజన్లో పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.60, సోయాబీన్ (పసుపురకం) 100 క్వింటాళ్లకు రూ. 75 కనీస మద్దతు ధర పెంపు ఉండాలని ప్రతిపాదించింది. పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.50, క్వింటా వేరుశెనగకు రూ.90 కనీస మద్దతు ధర పెంపు ఉండాలని వ్యవసాయ మద్దతు ధర కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలనుంచి కూడా అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కేబినెట్లో చర్చించి తుదినిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం
నగరి: నగరిలో బుధవారం శ్రీనివాసకల్యాణం అంగరంగ వైభవంగా జరి గింది. తిరుమల వెళ్లి కలియుగ దైవమైన వెంకటేశుని కల్యాణాన్ని తిలకించలేని భక్తులు నగరి పట్టణంలోనే ఆ వైభవాన్ని తిలకించి మధురానుభూతిని పొందారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో భాగంగా నగరి డిగ్రీ కళాశాల మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన భారీ వేదికపై కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణాన్ని ఉభయ నాంచారులతో అర్చకులు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామికి కొలువు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో, స్వర్ణాభరణాలతో అలంకరించారు. వేదపండితులు ఆగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. సుముహుర్తానికి శ్రీదేవి, భూదేవితో శ్రీనివాసుని చేతుల నుంచి మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీనివాస కల్యాణంలో పా ల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కల్యాణోత్సవం సందర్భంగా కళాకారులు నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగరికి తిరుమల శోభను తెప్పించాయి. అలాగే టీటీ డీ వారు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవ కార్యక్రమంలో తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసులురాజు, భాస్కర్, ప్రాజెక్టు ఆఫీసర్ రామచంద్రారెడ్డి, ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, జిల్లా ధర్మప్రచార్ మండల అధికారి రాజ్‌కుమార్, మాజీ మంత్రిరెడ్డివారి చెంగారెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, సీఐ నాగేశ్వరరెడ్డి, ఎస్ఐ ప్రసాద్, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
అద్దె వాహనాలపై అధికారుల భక్తి
టీటీడీలో భక్తుల సొమ్ము అద్దెల పాలు లక్షల్లో జేబులు నింపుకుంటున్న కాంట్రాక్టర్లు వారికి వంతపాడుతున్న ట్రాన్స్పోర్ట్ అధికారులు ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో వైట్బోర్డ్లూ హల్చల్ తిరుపతి సిటీ: వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో కార్యకలాపాలు సాగించే టీటీడీలో అద్దెవాహనాల జోరు కొనసాగుతోంది. కొందరు టీటీడీ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో అత్యంత శ్రీమంతుడైన గోవిందుని సేవలో అద్దె వాహనాల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. వాహనాలను కొనే శక్తి ఉన్నా, టీటీడీలో అద్దె వాటినే కొనసాగిస్తుండడంతో ప్రతి నెలా లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్ల పరమవుతున్నాయి. దీనికి వంతపాడుతున్న ట్రాన్స్పోర్ట్ విభాగంలోని అధికారులూ పెద్దస్థాయిలో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఒకప్పుడు 5 నుంచి 10 వాహనాల (కార్లు, జీపు)ను మాత్రమే అద్దెకు పెట్టుకునే ట్రాన్స్పోర్ట్ విభాగం నేడు 100 వాహనాలకు పెంచడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచి కండీషన్ ఉన్నా.. మంచి కండీషన్ కలిగిన వాహనాలను వీఐపీ సేవల పేరుతో నిరంతరం ఖాళీ గా ఉంచుతున్నారు. అదే సమయంలో అద్దె వాహనాలను తిప్పుతున్నారు. పోనీ అద్దె వాహనాల వలన టీటీడీకి ఆదా అవుతోందా? అంటే అదీ లేదు. తిరిగిందానికంటే ఎక్కువ కిలోమీటర్లు నమోదుచేసి టీటీడీ నుంచి డబ్బు లాగుతున్నారనే విమర్శలున్నాయి. అవసరం, అర్హత లేకున్నా అడిగిందే తడవుగా ప్రతి చిన్న అధికారికీ సంబంధిత ముఖ్య అధికారి అద్దె కారును గంటల్లో సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అద్దె వాహనాల సంఖ్య సుమారు 100కు చేరింది. టీటీడీ ఒక్కో అద్దె వాహనానికి(కారు) నెలకు రూ.25 వేల నుంచి రూ.28వేల వరకు చెల్లిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్లు కారు యజమానులకు నెలకు రూ.20 వేలు మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్మును అధికారులతో కలసి వాటాలుగా పంచుకుంటున్నట్లు విమర్శలున్నాయి. చక్రం తిప్పుతున్న డీఐలు అద్దె వాహనాల నిర్వహణలో కాసులు దండుకోవడానికి కాంట్రాక్టర్లకు కొందరు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ దందా సజావుగా సాగేందుకు వారిని ఏళ్ల తరబడి ఉన్న స్థానాలకే పరిమితం చేశారు. ఐదేళ్లుగా ముగ్గురు డీఐలను అలాట్మెంట్ విధుల్లో కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్య అధికారి బంధుగణానికి, మిత్రులకు సపర్యలు చేసేందుకు తిరుమలలో మరో డీఐని ఆరేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైట్ బోర్డులూ హల్చల్ టీటీడీ అద్దెకు పెట్టుకున్న వాహనాల్లో సగానికిపైగా వైట్ బోర్డులతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ‘టీటీడీ ఆన్ డ్యూటీ’ పేరుతో నడుస్తున్న ఈ వాహనాలను ఆర్టీఏ విభాగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఈ వాహనాలు టీటీడీలో ఎక్కువ హల్చల్ చేస్తున్నాయి. జేబులు నిండితే చాలు ఏ బోర్డులైతే మనకేంటని ట్రాన్స్పోర్ట్ అధికారులే స్వయంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మాకు సంబంధం లేదు అద్దె వాహనాలనేవి టీటీడీ పాలసీ విధానంలో ఒక భాగం. ఇక అద్దె వాహన యజమానులతో మాకు సంబంధం లేదు. టెండర్ ద్వారా సరఫరా చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్‌తోనే నడుస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు రూ.25 వేలు ఇస్తున్నాం. అది వారికి చేరుతుందో లేదో మాకు అనవసరం. వైట్‌బోర్డ్ వాహనాలనేవి తాత్కాలికం. రెండు, మూడు రోజులకు వాడుకునే సమయంలో అలాంటివి వస్తుంటాయి. -శేషారెడ్డి, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్