న్యూఢిల్లీ: నూనెగింజలకు కనీస మద్దతు ధర రూ.50 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ఈమేరకు 2016-17 పంటలపై కనీస మద్దతు ధరలను వ్యవసాయ మద్దతు ధర కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2016-17 ఖరీఫ్ సీజన్‌లో పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.60, సోయాబీన్ (పసుపురకం) 100 క్వింటాళ్లకు రూ. 75 కనీస మద్దతు ధర పెంపు ఉండాలని ప్రతిపాదించింది.
పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.50, క్వింటా వేరుశెనగకు రూ.90 కనీస మద్దతు ధర పెంపు ఉండాలని వ్యవసాయ మద్దతు ధర కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలనుంచి కూడా అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కేబినెట్‌లో చర్చించి తుదినిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నూనె గింజలకు కనీస మద్దతు ధర పెంపు
Published Thu, Apr 28 2016 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement