చింటూగాడి రివెంజ్‌ | Dog Take Sweet Revenge On Car Owner, Damaged His Car Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

వీడియో: చింటూగాడి స్వీట్‌ రివెంజ్‌.. మీరూ ఓ లుక్కేయండి

Published Tue, Jan 21 2025 4:05 PM | Last Updated on Tue, Jan 21 2025 4:44 PM

Dog Sweet Revenge On Car Owner Video Viral

పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుందా? అనే అనుమానాలు.. తరచూ జరిగే కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు కలగకమానదు. అయితే ఇక్కడో చింటూగాడి స్వీట్‌ రివెంట్‌ ఏకంగా నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. 

ప్రహ్లాద్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 17వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన కారులో బయల్దేరాడు. గల్లీ చివర అనుకోకుండా ఓ వీధి కుక్కను డ్యాష్‌ ఇచ్చాడు. దానికి పెద్దగా గాయాలు కాకపోయినా.. అరుస్తూ ఆ కారును కాస్త దూరం వెంబడించిందది. తిరిగి.. అర్ధరాత్రి టైంలో ప్రహ్లాద్‌ ఇంటికి చేరుకున్నాడు. కారును ఇంటి బయట పార్క్‌ చేసి ఆయన కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. 

తెల్లారి లేచి చూసేసరికి కారు మీద గీతలు పడి ఉన్నాయి. చిన్నపిల్లల పనేమో అనుకుని సీసీటీవీ ఫుటేజీ తీసి చూశాడాయన. అయితే అందులో ఓ కుక్క కారుపై కసాబిసా తన ప్రతీకారం తీర్చుకోవడం కనిపించింది. ఆ కుక్క పొద్దున ఆయన కారుతో ఢీ కొట్టిందే. 

ఉదయం తన కారువెంట మొరుగుతూ పరిగెట్టిన కుక్కను చూసి  నవ్వుకున్న ఆయన.. అదే శునకంగారి స్వీట్‌ రివెంజ్‌కు, జరిగిన డ్యామేజ్‌కు ఇప్పుడు తలపట్టుకుని కూర్చుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆ టైంలో తన మొబైల్‌తో ఓ వ్యక్తి తీసిన వీడియో కూడా ఇప్పుడు అక్కడ వైరల్‌ అవుతోంది. 

 సాధారణంగా కుక్కలకు చింటూ అని పేరు పెట్టి.. తెలుగు సోషల్‌ మీడియాలో ఎంతలా వైరల్‌ చేస్తాయో తెలిసిందే కదా. అలా ఈ చింటూగాడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement