CC TV footage
-
వీడని యువతి హత్య మిస్టరీ
గంగాధర(చొప్పదండి): మంచిర్యాల జిల్లాలో అదృశ్యమై, కరీంనగర్ జిల్లాలో శవమై కనిపించిన యువతి హత్య మిస్టరీ వీడటం లేదు. గంగాధర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని యువతి హత్య కేసు నమోదవగా మృతురాలి కుటుంబ వివరాలు మంగళవారం సాయంత్రం తెలిశాయి. అయితే, ఆమెను ఎవరు తీసుకెళ్లారు.. ఎక్కడ హత్య చేశారు, ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కుమారుడి జాడ తెలియలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే మమత కాసిపేటకు చెందిన భరత్‌ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కాగా, మమత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి మంచిర్యాల వచ్చి, తెలిసినవారి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 25న సాయంత్రం నూనె ప్యాకెట్ తీసుకువస్తానని కుమారుడితో కలిసి బయటకు వచ్చింది. ఆమె కారు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తర్వాత కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం కొండన్నపల్లి బస్టాండ్ సమీపంలోని మామిడితోట వద్ద రోడ్డు పక్కన మమత శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఫొటోతో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. మంచిర్యాలలో ఉండే ఆమె కుటుంబసభ్యులు గుర్తించి, మంగళవారం సాయంత్రం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు వారికి అప్పగించారు. మమత హత్యపై, ఆమె కుమారుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతురాలు ఎక్కిన కారు ఎవరిది, అందులో ఉన్నది ఎవరు, ఎటు తీసుకెళ్లారు అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే హత్య మిస్టరీ వీడుతుందని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. -
చింటూగాడి రివెంజ్
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుందా? అనే అనుమానాలు.. తరచూ జరిగే కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు కలగకమానదు. అయితే ఇక్కడో చింటూగాడి స్వీట్ రివెంట్ ఏకంగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 17వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన కారులో బయల్దేరాడు. గల్లీ చివర అనుకోకుండా ఓ వీధి కుక్కను డ్యాష్ ఇచ్చాడు. దానికి పెద్దగా గాయాలు కాకపోయినా.. అరుస్తూ ఆ కారును కాస్త దూరం వెంబడించిందది. తిరిగి.. అర్ధరాత్రి టైంలో ప్రహ్లాద్ ఇంటికి చేరుకున్నాడు. కారును ఇంటి బయట పార్క్ చేసి ఆయన కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసేసరికి కారు మీద గీతలు పడి ఉన్నాయి. చిన్నపిల్లల పనేమో అనుకుని సీసీటీవీ ఫుటేజీ తీసి చూశాడాయన. అయితే అందులో ఓ కుక్క కారుపై కసాబిసా తన ప్రతీకారం తీర్చుకోవడం కనిపించింది. ఆ కుక్క పొద్దున ఆయన కారుతో ఢీ కొట్టిందే. ఉదయం తన కారువెంట మొరుగుతూ పరిగెట్టిన కుక్కను చూసి నవ్వుకున్న ఆయన.. అదే శునకంగారి స్వీట్ రివెంజ్‌కు, జరిగిన డ్యామేజ్‌కు ఇప్పుడు తలపట్టుకుని కూర్చుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆ టైంలో తన మొబైల్‌తో ఓ వ్యక్తి తీసిన వీడియో కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతోంది. Sagar: फिल्मी स्टाइल में कुत्ते ने लिया अपना बदला, टक्कर मारने वाली कार को ढूंढकर मारे स्क्रैच#sagar #dog #madhyapradesh #MPNews #filmystyle #cars pic.twitter.com/rhEWZ8lyHf— Bansal News (@BansalNewsMPCG) January 21, 2025 సాధారణంగా కుక్కలకు చింటూ అని పేరు పెట్టి.. తెలుగు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ చేస్తాయో తెలిసిందే కదా. అలా ఈ చింటూగాడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే
ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్‌గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్‌కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్‌లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్‌లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు. -
టెక్ కంపెనీ సీఈవో, ఎండీ జంట హత్యలు: షాకింగ్ వీడియో వైరల్
సంచలనం సృష్టించిన బెంగుళూరు జంట హత్యల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఈ హత్యలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది. పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. బెంగళూరులోని ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జంట హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురువారం ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. జూలై 11న సాయంత్రం 4:14 గంటలకు మొదటి సీసీటీవీ విజువల్‌లో, ముగ్గురు నిందితులు ఏరోనిక్స్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుతూ కెమెరాకు చిక్కారు. నిందితులు సంతోష్, వినయ్ రెడ్డి ఆఫీసు గేటు నుంచి బయటకు వస్తుండగా, ప్రధాన నిందితుడు శబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ కనిపించారు .కన్నడ ర్యాపర్‌గా చెప్పుకునే ఫిలిక్స్‌కు ఇన్‌స్టాలో 16 వేల మంది ఫాలోయిర్స్ ఉన్నారు. (హెచ్‌సీఎల్ చేతికి జపాన్...279 మిలియన్ డాలర్ల డీల్) వాట్సాప్ స్టేటస్ పెట్టి మరీ హత్య పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘‘తన బిజినెస్‌కు ఇబ్బందిగా మారిన చెడ్డవారిని శిక్షిస్తా..ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, ఫేక్ పొగడ్తలతో ముంచెత్తే వారితో నిండిపోయింది. నేను ఈ భూమిపైనే వారిని శిక్షిస్తాను. మంచివారిని ఎప్పుడూ ఏమీ చేయను” అంటూ వాట్సాప్ స్టేషన్ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఎఫ్ఐఆర్ ప్రకారం ఎయిర్నిక్స్ ఎండీ ఏళ్ల ఫణీంద్ర సుబ్రమణ్య (36), ఆ తర్వాత సీఈవో విను కుమార్ (40)పై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ముగ్గురు అనుమానితులు శబరీష్ , సంతోష్ వినయ్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు VIDEO | Bengaluru double-murder: CCTV footage shows two of the accused, who allegedly killed a managing director and a chief executive officer of a company, fleeing spot after committing the crime. (Source: Third Party) pic.twitter.com/scntpM5dRP — Press Trust of India (@PTI_News) July 13, 2023 -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
ఖలీల్‌వాడి: బోధన్ మండలం ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి వద్ద దోపిడీకి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఎరాజ్‌పల్లికి చెందిన పోతుల పోశెట్టి(55) నుంచి దోపిడీ పాల్పడిన కేసులో ఆర్మూర్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న నల్ల నవీన్, ఇదేకాలనీలో ఉంటున్న గడ్డల దామోదర్, రాస ప్రవీణ్, ఒడ్డెర కాలనీకి చెందిన మేకల హరీశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా దారంగుల గంగాధర్ పరారీలో ఉన్నాడు. ఈ ఐదుగురు జల్సాల కోసం డబ్బు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు రెండు మోటార్ సైకిళ్లపై ఈనెల 23న నిజామాబాద్‌కు బయలు దేరినట్లు వెళ్లారు. గంగాధర్, ప్రవీణ్, హరీశ్, దామోదర్‌లు చిన్నాపూర్ గండి వద్ద కట్టెలు, స్క్రూ డ్రైవర్లతో వేచి ఉన్నారు. నల్లనవీన్ నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌కు అతని మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడ టీతాగుతున్న పోతుల పోశెట్టి దగ్గరకు వెళ్లి అతన్ని చంపుతానని బెదిరించాడు. అతడిని మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టుకొని చిన్నాపూర్ గండి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి స్క్రూడ్రైవర్‌తో పొడిచి కట్టెలతో కొట్టి బాధితుడి వద్ద ఉన్న వెండి, బంగారపు వస్తువులతో పాటు రూ. 600 దోపిడీ చేశారు. అంతేకాకుండా బాధితుడిని ఎరాజ్పల్లిలో తన ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న రూ. 35వేలు దోచుకున్నారు. అనంతరం బాధితుడిని మామిడిపల్లి రోడ్ వద్ద వదిలి ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, ఎస్సై హబీబ్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కిరణ్‌కుమార్ అభినందించారు. -
‘మా’లో వివాదంలో మరో ట్విస్ట్.. రంగంలోకి పోలీసులు
MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా... వివాదం మాత్రం తగ్గడం లేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య హోరా హోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తూందో చూడాలి. -
సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్
Sai Dharam Tej Accident Video: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్.. కొనసాగుతున్న చికిత్స) ప్రస్తుతం సాయిధర్మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియో మీ కోసం.. -
కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం కర్నూల్-సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబిన్లో చిక్కుకున్న లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చదవండి: కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఉదయం ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటన దృష్ట్యా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించే వాటిని సికింద్రాబాద్‌కే పరిమితం చేయడంతో సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు వెళ్లవలసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నాంపల్లి నుంచి ఫలక్‌నుమాకు కూడా సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్నింటిని దారిమళ్లించారు. ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. -
ఒక ఆటో..70 సీసీ కెమెరాలు
బంజారాహిల్స్: సీసీ ఫుటేజీ ఆధారంగా అదృశ్యమైన ఓ బాలికను జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించి తల్లికి క్షేమంగా అప్పగించారు. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్‌కు చెందిన వైష్ణవి(12) యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని నారాయణ స్కూల్లో ఆయాగా పనిచేసేది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన వైష్ణవి తన తమ్ముడితో కలిసి స్కూల్ అయిపోయిన తర్వాత తల్లి వద్దకు వచ్చి ఆడుకుంటుండగా సరిగ్గా చదవడం లేదంటూ అనురాధ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఓ పేపర్‌పై తాను చనిపోయిన తండ్రి వద్దకు వెళుతున్నానని, నువ్వు అక్కర్లేదంటూ తల్లికి లేఖ రాసి తమ్ముడి చేతికి ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైష్ణవి కోసం గాలింపు చేపట్టారు. బాలికను తల్లికి అప్పగిస్తున్నజూబ్లీహిల్స్ పోలీసులు బాలిక నడుచుకుంటూ యూసుఫ్‌గూడ వైపు వెళుతూ శ్రీకృష్ణానగర్ మోర్ సూపర్‌మార్కెట్ వద్ద ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో ముందు గ్రీన్‌కలర్ బోర్డు ఉండటంతో దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆటోను గుర్తించి ఫిలింనగర్‌కు చెందినదిగా చెప్పడంతో ఫిలింనగర్ వైపు నుంచే వచ్చే ఆటోలపై నిఘా వేశారు. మరో 8 గంటలు కష్టపడితే ఎట్టకేలకు ఆ ఆటో కనిపించింది. ఆ రోజు సాయంత్రం మోర్ సూపర్‌మార్కెట్ వద్ద ఓ బాలిక ఆటో ఎక్కి సారథి స్టూడియో వద్ద దిగి సందులోంచి నడుచుకుంటూ వెళ్లిందని చెప్పాడు. అటు వైపు ఎవరున్నట్లు తల్లిని ప్రశ్నించగా తన అత్త ఉంటుందని చెప్పింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా ఆమె అక్కడికి రాలేదని ఫతేనగర్‌లో ఉంటున్న ఆమె బాబాయి ఇంటికి వెళ్లి ఉండవచ్చునని చెప్పింది. పోలీసులు శనివారం రాత్రి ఫతేనగర్ వెళ్లి వైష్ణవి బాబాయిని కలిసి విషయం చెప్పగా శుక్రవారం రాత్రి తమ వద్దకే వచ్చిందని చెప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. శ్రీకృష్ణానగర్ నుంచి సారథి స్టూడియో వరకు, ఇటు ఫిలింనగర్ వైపు 70కిపైగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ ఆటో చాలా చోట్ల కనిపించిందని దీంతో మిస్టరీ ఛేదించినట్లు పోలీసులు వివరించారు. -
మేనకోడలు పాత్రపై అనుమానాలు!
సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనంలో ఆయన మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్న పోలీసులు.. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు రేకెత్తడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచికచెర్ల సర్కిల్ స్టేషన్లో ఉంచి జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించినప్పటికీ అమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జయరామ్, శిఖా చౌదరి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జయరామ్ ఎక్కడెక్కడికి వెళ్లారు? జయరామ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాన్నిబట్టి మొదట దస్పల్లా హోటల్ వద్దకు వెళ్లి అక్కడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. జయరామ్‌తో పాటు ఎవరైనా కొత్తవ్యక్తులు ఉన్నారా అనే కోణంలో హోటల్ సిబ్బందిని విచారించారు. హోటల్ వద్ద జయరామ్‌కు ఓ వ్యక్తి రూ. ఆరు లక్షలు ఇచ్చాడని, హోటల్ గది అప్పటికే ఓ యువతి పేరుమీద ఉన్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు.. శిఖా చౌదరి.. జయరామ్‌కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. జయరామ్ ప్రారంభించిన ఏ వ్యాపారంలోనైనా ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అతను నిర్వహించిన ఓ న్యూస్ చానల్లోనూ శిఖా చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భార్యా పిల్లల కంటే ఈమెకే జయరామ్ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిఖా సోదరి మనీషా చదువు కోసం రూ. కోటి వరకు జయరామ్ చెల్లించినట్లు సమాచారం. జయరామ్ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా శిఖా ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్లేవాడని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చెబుతున్నాడు. గత నెల 29న రాత్రి కూడా ఆమె ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు గురైన రోజున రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి ఒంటరిగా కారు తీసుకుని హడావుడిగా వెళ్లినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోనే హత్యకు స్కెచ్! హత్య కేసులో నందిగామ పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగా జయరామ్ హత్యకు కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జయరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మేనకోడలు పాత్రపై ఆరా తీశారు. దస్పల్లా హోటల్లో జయరామ్ పేరిట 10 రోజులుగా ఓ రూమ్ బుక్ చేయడం, అదే హోటల్లో గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరగడం, అక్కడి నుంచే జయరామ్ ఓ తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో కలిసి కారులో వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. పతంగి టోల్గేట్ వద్ద నమోదైన సీసీ టీవీ ఫుటేజీలోనూ జయరామ్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించినట్లు తేలింది. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి కారు నడిపినట్లు గుర్తించారు. కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు తదితరాలను బట్టి ఈ హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ ఎవరనే కోణంలో ఆరా.. జయరామ్ చెల్లులు సుశీలతోపాటు మేనకోడళ్లు శిఖా చౌదరి, మనీషాలతోపాటు డ్రైవర్ సతీష్‌తోపాటు గన్మెన్లను పోలీసులు విచారిస్తున్నారు. అదే సందర్భంలో మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడుగా భావిస్తున్న రాకేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిఖా చౌదరికి రాకేష్ రూ. 4.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో రెండేళ్లుగా రాకేష్–శిఖా మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన మేనకోడలి అప్పును తీరుస్తానని జయరామ్ హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత డబ్బు సర్దుబాబు చేయకపోవడంతోనే వీరి ముగ్గురి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ వివాదమే హత్యకు దారితీసిందా? అన్న కోణంలో రాకేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్ అనే మరో యువకుడిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ తమ్ముడి కొడుకుతోనూ శిఖాకు పరిచయాలున్నాయని, బీర్ కంపెనీ పెడతానని అతని ద్వారా భారీగా పెట్టుబడి పెట్టించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఏం జరిగింది? జయరాం స్వస్థలం విజయవాడ కాగా గత నెల 30న హైదరాబాద్ నుంచి బయల్దేరారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గత నెల 31వ తేది రాత్రి 2గంటలకు ఆయన కారు సీసీ పుటేజీలో కనిపించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ మిగతా సమయం ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఫోరెన్సిక్ నివేదిక అనుమానస్పద స్థితిలో మృతి చెందిన జయరామ్ మృతదేహంపై పలు భాగాల్లో గట్టిగా దెబ్బలు తగిలిన దాఖలాలేమి కనిపించలేదు. మోచేయి కింద భాగంలో, పొట్ట ఎడమ వైపున, కుడివైపు ఛాతీ పైభాగంలోనూ కందిన గాయాలున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. చేతులు నల్లగా ఉండడం, శరీరంలో నీలిరంగులోకి మారడంతో ఆయనపై ఏదైనా విషప్రయోగం చేశారా? కొట్టి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శరీర భాగాలను వైద్యులు సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక అందాకే హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసు భావిస్తున్నారు కేన్సర్ ఆస్పత్రిలో మృతదేహం జయరామ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని ఇంట్లో గత కొద్దిరోజులుగా జయరామ్ ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలాఉండగా జయరామ్ భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ప్లోరిడాలో మంచు తుఫాను వల్ల హైదరాబాద్ రావడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని భావించినా సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. గది తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసింది: వాచ్మెన్ వెంకటేశ్ జయరామ్ మృతిచెందిన మరుసటిరోజు శిఖా చౌదరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని జయరామ్ ఇంటికి వచ్చి రూం తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసినట్లు జయరామ్ ఇంటి వాచ్మెన్ వెంకటేశ్ తెలిపాడు. తాను తాళాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆ రోజు రాత్రి డ్యూటీకి రాగానే జయరామ్ సార్‌కు ఫోన్ చేశానని, మీటింగ్‌లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడన్నాడు. ఆ తర్వాత గన్‌మెన్ ద్వారా జయరామ్ మృతి విషయం తెలిసిందని, ఎవరు హత్య చేశారో అంతు చిక్కడంలేదన్నారు. రెండేళ్ల కిందట జయరామ్ తల్లి చనిపోయిన సమయంలో శిఖా చౌదరికి, జయరామ్ కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పాడు. తాను గత 20 ఏళ్లుగా జయరామ్ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా, ఇంటి కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. జయరామ్ వైన్ తప్ప మద్యం తాగడని ఆయన స్పష్టం చేశాడు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదు : సర్వశ్రేష్ఠ త్రిపాటి, ఎస్పీ కంచికచెర్ల సర్కిల్ పోలీసు స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన కోడళ్లు, డ్రైవర్, గన్మెన్లతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఎస్పీ త్రిపాఠి విచారించారు. ఈ సందర్బంగా ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘జయరామ్ హత్య కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేవలం అనుమానితులను మాత్రమే విచారణ చేస్తున్నాం. త్వరలోనే కేసుని ఛేదిస్తాం’ అని తెలిపారు. -
ప్రణయ్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
-
పరువు హత్య; సంచలన విషయాలు
సాక్షి, మిర్యాలగూడ: తెలంగాణలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ హైదరాబాద్ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నల్లగొండ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సివుంది. ప్రణయ్‌ను హత్యకు అరగంట ముందు వీరు మిర్యాలగూడ వదిలివెళ్లిపోయారు. (ప్రాథమిక కథనం: హైదరాబాద్ వైపుగా నిందితుడు!) మరోవైపు ప్రణయ్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రణయ్, అమృత ఏడాది క్రితమే పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అమృతకు మైనార్టీ తీరకపోవడంతో వీరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం అమృతకు మైనార్టీ తీరడంతో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. కొంత కాలం అక్కడే ఉండి తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు ప్రణయ్‌ను చంపేస్తానని పెద్ద మనుషులందరీ ముందు మారుతీరావు బెదిరించాడు. ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కిరాయి హంతకుడితో అతడే ఈ హత్య చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో అమృత ఐదో నెల గర్భంతో ఉన్న అమృత ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని డాక్టర్ జ్యోతి తెలిపారు. తన ఆస్పత్రి ముందే ప్రణయ్ హత్యకు గురయ్యాడని, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. భర్త చనిపోయిన విషయాన్ని అమృతకు చెప్పానని, ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని తెలిపారు. పాలీహౌస్, డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నట్టు ప్రణయ్ తనతో చెప్పాడని, విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు వెల్లడించాడన్నారు. రేపు అంత్యక్రియలు ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశముంది. అతడి సోదరుడు విదేశాల నుంచి రావాల్సివుంది. మరోవైపు ప్రణయ్ ఇంటికి దళిత సంఘాల నాయకులు, రాజకీయలు నేతలు పోటెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు శనివారం ప్రణయ్ ఇంటికి వచ్చి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రణయ్ హత్యకు నిరసరగా మిర్యాలగూడలో దళిత సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. -
అసభ్యంగా తాకాడు.. ఆపై...!
జార్జియా: లైంగిక వేధింపులను మౌనంగా భరించే వాళ్లు కొందరైతే.. ఎదురించేవాళ్లు మరికొందరు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గల్ల పట్టి పోలీసులకు అప్పగించారు ఓ మహిళ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఆకతాయిని కటకటాల వెనక్కి నెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే... జార్జియా, సవన్నా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో వచ్చాడు. వెయిట్రెస్ ‘ఈమెలియా(25)’ తన పనిలో నిమగ్నమై ఉండగా.. వెనకాల నుంచి వచ్చిన సదరు వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఆమె అతన్ని గల్ల పట్టి లాగిపడేశారు. వెంటనే పోలీసులకు కేక వేయటంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని వదలకుండా అలాగే పట్టుకున్నారు. చివరకు చేసిన పనికి భార్య, ఇద్దరు పిల్లల ముందే అతగాడు అరెస్ట్ అయ్యాడు. నిందితుడు ర్యాన్ చెర్విన్స్కీ(31)ని రెండు రోజులు జైల్లో ఉండి.. ఆపై బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. జూన్ 30న ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. రెడ్డిట్‌లో వీడియో అప్లోడ్ కాగా, నాలుగు రోజుల్లోనే మిలియన్‌కి పైగా వ్యూవ్స్‌ను రాబట్టిందీ వీడియో. పలువురు ఈమెలియాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘మనం వేసుకునే దుస్తులు కాదు. మగాళ్లు మారాలి. మహిళలకు కూడా వాళ్లను ఎదురించే ధైర్యం రావాలి’ అని ఈమెలియా చెబుతున్నారు. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్‌కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలు
-
కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలు
భోపాల్: అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలకు పాల్పడ్డ కామాంధుడికి యువతులంతా తగిన బుద్ధిచెప్పారు. చిత్తుగా బాది పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ముసుగు ధరించిన ఓ యువకుడు బైక్ మీద వచ్చాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అమ్మాయిల ఎదుట ప్యాంట్ విప్పి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. మరుసటి రోజు అక్కడికొచ్చి అదే పని చేసేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన అమ్మాయిలు అతన్ని దొరకబుచ్చున్నారు. స్థానికుల సాయంతో చితకబాది పోలీసులకు అప్పగించారు. అక్కడి సీసీఫుటేజీలో ఆ ఘటనంతా రికార్డయ్యింది. గతంలో బెంగళూరు సంగలి రాయన్న పార్క్ వద్ద ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటు చేసుకోగా.. మహిళలు తన్ని అతన్ని పోలీసులకు అప్పగించారు. -
కాస్ట్లీ కారు.. క్షణాల్లో బుగ్గిపాలు
పుణే : క్షణాల్లో లక్షలు విలువ చేసే కారు బుగ్గిపాలైంది. పార్కింగ్‌లో ఉన్న ఆడీ కారును తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పుణేలోని ధాయారి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుపై ఏదో విసిరారు. ఆపై నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. క్షణాల్లోనే కారు బుగ్గి పాలైపోయింది. అయితే ఈ ఘటనలో పక్కనే ఉన్న మారుతీ సుజుకీ, హోండా సిటీ కారులు కూడా దహనం అయ్యాయి. కారు యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బేస్మెంట్లోని సీసీ టీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు నమోదు అయ్యాయి. ఆడీ క్యూ-5 మోడల్‌కు చెందిన ఆ కారు ఖరీదు రూ. 50లక్షలు పైగానే తేలింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
లక్షలు విలువ చేసే కారు క్షణాల్లో బుగ్గిపాలైంది
-
దొంగతనాల్లో నయా ట్రెండ్!
విజయనగరం టౌన్: దొంగలు తమ చేతివాటాన్ని చూపడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పగలు, రాత్రి తేడాల్లేకుండా ఇళ్లల్లో దూరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దాహం వేస్తుందనో, ఆకలేస్తుందనో రావడం పరిసరాలను పరిశీలించడం, కొన్ని రోజుల పరిశీలన తర్వాత దొంగతనాలకు దిగడం చేస్తున్నారు. బ్యాంకుల వద్ద, పోస్టాఫీసుల వద్ద వృద్ధులను, మహిళలను పరి శీలించడం, వారు డబ్బులు పట్టుకెళ్లినప్పుడు, సాధారణంగా నిత్యం వచ్చే వారిని చూడటం అదును చూసి దెబ్బకొట్టడం ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్. వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న దొంగలు జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ పుటేజీలు పరి శీలన ఉన్నప్పటికీ, జిల్లా పోలీస్ యంత్రాగం చర్యలు చేపడుతున్నా, వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివాసముండేవారిపైనా, పాఠశాలలకు వచ్చే మహిళలపైన, వృద్ధులను వీరు లక్ష్యం చేస్తున్నారు. ఏమరపాటుగా ఉంటే అంతే... ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మత్తుమందు చల్లి, ఇతరత్రా పద్ధతుల ద్వారా ఒంటిమీద నగలన్నీ గుంజుకుపోతారు. పాఠశాలలకు వెళ్లే మహిళలు మెడలో హారాలు, నగలు తెంపుకొని పోతున్నారు. చైన్ స్నాచింగ్ బ్యాచ్‌లో 20 నుంచి 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు. ♦ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పర్సులో పది వేలు, నగలు పట్టుకుని పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ మహిళకు కోట జంక్షన్ వద్దకు రాగానే , ఇద్దరు మహిళలు ఆటోలో ఎక్కారు. అంబటిసత్రం జంక్షన్ రాగానే ఆ ఇద్దరూ దిగిపోయారు. పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ తన ప్రదేశం రాగానే దిగిపోయి, కొంత దూరం వెళ్లి బ్యాగ్‌లో పర్సు చూసేసరికి మాయమైంది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ♦ బ్యాంకులో రూ.25వేలు విత్ డ్రా చేసుకుని సైకిల్‌కి తగిలించి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఎప్పటి నుంచో గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు, వృద్ధుడ్ని మాటల్లో పెట్టి సైకిల్‌కి తగిలించిన సంచితో ఉడాయించారు. వృద్ధుడు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దొంగతనాల జోరును అరికట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఆ ప్రాంతవాసులందరి వద్ద ఉంచుకోవాలి. లేదా డయల్ 100కి ఫోన్ చేసి వివరాలు చెప్పాలి. ఎవరైనా ఇళ్లు తాళం వేసి ఊర్లకు వెళ్లినా సమాచారమందించాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. – బివిజె.రాజు, టూటౌన్ సీఐ, విజయనగరం -
గర్భిణి హత్య కేసులో అమర్, వికాస్ అరెస్ట్
హైదరాబాద్: గర్భిణి హత్య కేసులో నిందితుడు అమర్‌కాంత్‌ను బిహార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ట్రాన్సిస్ట్ వారెంట్ పై ఇక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ను కూడా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లో తలదాచుకున్న వికాస్‌ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గర్భిణి బింగీ అలియాస్ పింకీ హత్యపై వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు. గర్భిణిని హతమార్చిన అనంతరం శరీర భాగాలను కోసేందుకు స్టోన్ కటింగ్ మిషన్‌ను అమర్‌కాంత్ కొనుగోలు చేశాడు. మమత ఝా బాల్కనీలో కాపలా ఉండగా బాత్రూమ్లో అమర్‌కాంత్, వికాస్ మిషన్‌తో గర్భిణి తల, కాళ్లు, చేతులు వేరు చేసి బస్తాల్లో మూట కట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మమత ఝా, అనిల్ ఝాను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వికాస్, అమర్‌కాంత్‌ను గురువారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. -
కొడుకు కోసమే కడతేర్చాడు!
మర్రిపాలెం(విశాఖ ఉత్తర): కొడుకు కోసం ఓ తండ్రి హంతకునిగా మారిన ఉదంతమిది. పుత్రుని ఎదుగుదలకు పోటీగా మారుతాడని భావించి స్నేహితుడిని అంతమొందించాడు. అందుకోసం రచించిన వ్యూహంలో భాగంగా రాజీ కోసం యోగా గురువు ఇంటికి వెళ్లాడు. అన్నీ మరిచిపోయి స్నేహితులుగా ఉందామంటూ దస్తావేజుపై రాయించుకుని సంతకాలు చేయించుకున్నాడు. అనంతరం నమ్మకంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే ఒప్పందం చేసుకున్న కిరాయి వ్యక్తులతో దాడి చేయించి క్రూరంగా హతమార్చాడు. ఇదీ యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ హత్యకు ముందు జనగోల పత్రిక ఎడిటర్ కిలపర్తి వెంకటరమణ వ్యవహరించిన తీరు. వియత్నాంలో యోగా గురువుగా ఉన్న కుమారుని ఎదుగుదలకు పోటీ లేకుండా చేయడం కోసం జనగోల పత్రిక ఎడిటర్ కిలపర్తి వెంకటరమణ ఈ హత్యకు వ్యూహరచన చేశాడని సీసీ ఫుటేజీ ఆధారంగా లభించిన ఆధారాల ప్రకారం పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరోవైపు కిలపర్తిపై కూడా శనివారం అర్థరాత్రి హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకోవడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. కుమారునికి అడ్డు లేకుండా చేసేందుకే తన కుమారుని ఎదుగుదలకు అడ్డు లేకుండా చేసుకునేందుకే యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణను జనగోల పత్రిక ఎడిటర్ కిలపర్తి వెంకటరమణ హత్య చేయించాడని తెలుస్తోంది. యోగా గురువు పొలమరశెట్టితో పాటు కిలపర్తి వెంకటరమణ కొడుకు ఈశ్వరరావు వియత్నాం దేశంలో యోగా పాఠాలు బోధిస్తున్నా రు. ఈ క్రమంలో తనకంటే పొలమరశెట్టికి పేరు ప్రఖ్యాతలు వస్తుండటంతో విషయాన్ని తండ్రి వెంకటరమణకు ఈశ్వరరావు తెలియజేశాడు. ఇంతలో గత ఏడాది కుటుంబ పనుల మీద పొలమరశెట్టి నగరానికి వచ్చాడు. ఇదే అదునుగా భావించిన కిలపర్తి వెంకటరమణ యోగా గురువు పొలమరశెట్టితో స్నేహం చేస్తున్నట్లు నమ్మించి కేసుల్లో ఇరికించాడు. వియత్నాం వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంకులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో పొలమరశెట్టి కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అతను వియత్నాం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఎలాగైనా అంతమెందించాలని దుండగులతో కిలపర్తి ఒప్పందం చేసుకుని హత్యకు వ్యూహరచన చేశాడని పోలీసులు నిర్థారించారు. ఈశ్వరరావును రప్పించేందుకు యత్నాలు యోగా గురువు హత్య కేసుతో పరోక్షంగా సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న కిలపర్తి వెంకటరమణ కొడుకు ఈశ్వరరావును వియత్నాం నుంచి రప్పించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈశ్వరరావును విచారించడంతో కేసులోని వాస్తవాలు బయటపడవచ్చని భావిస్తున్నారు. పొలమరశెట్టితో ఈశ్వరరావుకు గల మనస్పర్థలు ఏమిటి? హత్యకు పాల్పడిన ఆ నలుగురు ఎవరు? సుఫారీ ఎంత? కేసుతో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న కిలపర్తి పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): యోగా టీచర్ పొలమరశెట్టి వెంకటరమణ హత్య కేసులో నిందితుడైన కిలపర్తి వెంకటరమణపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణానికి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు యోగా గురువు పొలమరశెట్టి హత్య జరిగిన వెంటనే సూత్రధారి కిలపర్తి వెంకటరమణ అని సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుపారీ కోసం నలుగురు దుండగులు ఫోన్ చేయడంతో కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని బర్మాక్యాంపు సమీపంలోని లాల్ బహుదూర్ మైదానం వద్ద ఉన్న స్టీల్‌సిటీ పబ్లిక్ స్కూలు వెనుకకు స్టేషన్ ముందు నుంచే కిలపర్తి వెళ్లాడు. అనంతరం రాత్రి 12 గంటల వరకు అయిదుగురూ అక్కడే ఉండి... తర్వాత గొడవ జరగడంతో కిలపర్తిపై దాడి చేసి దుండగులు పరారయ్యారు. ఈ మొత్తం ఎపిషోడ్‌లో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని... నిందితునిగా గుర్తించిన వెంటనే కిలపర్తిని అదుపులోకి తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని... అందువల్లే అతనిపై హత్యాయత్నం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తీరు మారనందుకే అంతమొదించా..! యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణను తానే హత్య చేయించినట్లు కిలపర్తి వెంకటరమణ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణలో ఏం చెప్పాడంటే... తనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని... వారిలో తన పెద్ద కుమార్తెకు యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ అసభ్యకర మెసేజీలు పెడుతుండడంతో పలుమార్లు హెచ్చరించానని... అయినప్పటికీ అతని ప్రవర్తనలో మా ర్పు రాకపోవడంతో అంతమొదించేందుకు సిద్ధమయ్యా నని... ఇందుకోసం బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్, అతని స్నేహితులు కల్యాణ్, పవన్, కోటిలతో రూ.1.50లక్షలకు ఒప్పందం చేసుకున్నానని అంగీకరించాడు. వారు పొలమరశెట్టిని మర్డర్ చేశాక డబ్బులివ్వమని శనివారం రాత్రి ఫోన్ చేయడంతో బర్మాక్యాంపు సమీపంలోని లాల్ బహుదూర్ మైదానం వద్ద ఉన్న స్టీల్‌సిటీ పబ్లిక్ స్కూలు వెనుక ప్రదేశానికి వెళ్లానని... ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పడంతో గొడవ జరిగి తనపై దాడి చేసి దుండగులు పరారయ్యారని పోలీసులకు కిలపర్తి వెల్లడించినట్లు తెలిసిం ది. స్థానికులు గుర్తించి ఆది వారం తెల్లవారి 7గంటల సమయంలో 108 వాహనంలో కేజీహెచ్‌కు కిలపర్తిని తరలించారు. యోగా గురువును హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్న అజయ్‌కుమార్‌కు నేరచరిత్ర ఉందని, గతంలో భార్య హత్య కేసులో ముద్దాయి అని పోలీసులు గుర్తించారు. దస్తావేజులో ఏముందంటే... యోగా గురువు పి.వెంకటరమణ పేరుతో ఈ నెల 24న రూ.50ల దస్తావేజు కొనుగోలు చేశారు. అందులో పొలమరశెట్టి వెంకటరమణ, కిలపర్తి వెంకటరమణ అనే ఇరువురం 15 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నాం. ఇటీవల పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు కావడంతో దూరంగా ఉంటున్నాం. ఇక నుంచి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అందుకు ఇద్దరం అంగీకరిస్తున్నాం. కోర్టులలో నడుస్తోన్న కేసుల విషయం మీద రాజీకి వచ్చాం అని రాసి ఉంది. దానిపై కిలపర్తి వెంకటరమణ సంతకం చేశాడు. సాక్షులుగా యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ, అతని రెండో భార్య పద్మావతి స్వహస్తాలతో సంతకం చేశారు. రాజీ ఒప్పందం జరిగినట్టు దస్తావేజులో సంతకాలు చేసిన కొద్ది క్షణాలకే యోగా గురువు దారుణంగా హత్యకు గురయ్యాడు. -
నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాడు
-
గూండా రాజ్యం... బూతులు తిడుతూ యువతిపై దాడి
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లో హేయమైన ఘటన వెలుగు చూసింది. అధికారం ఉందన్న మదంతో ఓ యువనేత.. ఓ యువతిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బండబూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ... ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కటంతో అధికార పక్షంపై విమర్శలు మొదలయ్యాయి. హూగ్లీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి(టీఎంసీపీ) జనరల్ సెక్రెటరీ షాహిద్ హసన్ ఖాన్. బాధిత విద్యార్థిని స్థానికంగా ఉన్న రిష్రా కాలేజీలో కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. దీనికి తోడు ఆమె కూడా టీఎంసీపీ స్టూడెంట్ సభ్యురాలే. అయితే పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతూ షాహిద్ అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ విషయంపై సదరు యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను యూనియన్ కార్యాలయానికి రప్పించుకుని మరీ షాహిద్ దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను చితకబాదాడు. కాలితో తన్నటం, జుట్టు పట్టుకుని లాగేయటం.. అసభ్యంగా తాకటం.. అడ్డుకునేందుకు తోటి సభ్యులు ప్రయత్నించినా వారిని తోసేస్తూ ఆమెపై దాడి చేశాడు. డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ సీసీ ఫుటేజీ దృశ్యాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ‘‘షాహిద్ నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. ఒక్కరోజే కాదు. ఈ దాడుల పర్వం కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. లైంగికంగా కూడా నన్ను వేధించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదరిస్తున్నాడు. అతని తండ్రి జహీద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కావటంతో షాహిద్ ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయి. యూనియన్ ఫండ్‌ను దుర్వినియోగం చేయటం.. ఎదురు ప్రశ్నించిన వారిని ఇలా చితకబాదటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాలేజీకి వెళ్లాలంటే భయంగా ఉంది’’ అని యువతి చెబుతున్నారు. షాహిద్‌పై వేటు... కాగా, సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి రావటంతో స్పందించిన రిష్రా కాలేజీ యాజమాన్యం షాహిద్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అతన్ని జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయ దత్తా తెలిపాడు. విద్యాశాఖా మంత్రి పార్థ ఛటర్జీ ఘటనపై అధికారులను సమగ్ర నివేదికను కోరారు. అయితే తనకేం తెలీదని.. ఆ అమ్మాయి తాను మంచి స్నేహితులమని.. పైగా తోటి సభ్యురాలిపై దాడి చేయాల్సిన అవసరం తనకేంటని జహీద్ బుకాయిస్తున్నాడు. మరోవైపు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు షాహిద్‌పై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పాలన గూండా రాజ్యంగా మారిందనటానికి మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అన్నిచోట్లా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక మీడియాలో చర్చనీయాంశమైంది. సీసీ ఫుటేజీ దృశ్యాలు -
కన్నకొడుకే కాలయముడై కడతేర్చాడు
-
గుజరాత్లో దిగ్భ్రాంతికర ఘటన
రాజ్‌కోట్ : కన్నపేగును ఓ కొడుకు కాలయముడై కడతేర్చాడు. కీలక సాక్ష్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటంతో ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఇటీవల జయశ్రీ అనే వృద్ధురాలు తాను నివసిస్తున్న భవనం పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు తర్వాత దర్యాప్తులో విస్మయం కలిగించే విషయం వెలుగు చూసింది. రాజ్‌కోట్‌లోని ఓ ఫార్మసీ కాలేజీలో సందీప్ నతవానీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోగా.. తల్లి జయశ్రీ అతని వద్దే ఉంటున్నారు. జయశ్రీకి ఇద్దరు కూతుళ్లు.. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి కూడా. గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం బాగోటం లేదు. ఈ క్రమంలో హఠాత్తుగా ఆమె మేడ మీద నుంచి పడి చనిపోవటం పలు అనుమానాలకు తావునిచ్చింది. సందీప్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముందు ప్రమాదవశాత్తూ పడిపోయిందని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ మధ్యే జయశ్రీకి పక్షవాతం కూడా సోకిందని.. సరిగ్గా కదల్లేని ఉన్న ఆమె మేడ మీదకు ఎలా వెళ్లగలిగిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పోలీసులను ఆశ్రయించటంతో కేసును లోతుగా దర్యాప్తు జరిగింది. చివరకు అపార్ట్ మెంట్ లోని సీసీ పుటేజీల ద్వారా అసలు విషయాన్ని తేల్చేశారు. సపర్యల కారణంగానే... తల్లికి సపర్యలు చేసే విషయంలో కొంతకాలంగా సందీప్, అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరకు భార్య బలవంతం మేరకు కొడుకు తన తల్లిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 27న తల్లిని డాబా మీదకి తీసుకెళ్లి తోసేశాడు. ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య చిన్నపాటి సంభాషణే జరగగా.. ఆ దృశ్యాలు కూడా గమనించవచ్చు. తల్లిని మెల్లిగా పైకి తీసుకెళ్లిన సందీప్.. ఘటన తర్వాత మళ్లీ ఏమీ తెలియని వాడిలా వచ్చి తలుపేసుకున్నాడు. అపార్ట్మెంట్లో నివసించే మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి జయశ్రీ పడిపోయిన విషయాన్ని వివరించగా.. ఏమీ తెలియని వాడిలా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయని పోలీసులు వెల్లడించారు. నేను అమాయకుణ్ణి : సందీప్ ఘటన తర్వాత ఆరోపణలు రావటంతో వాటిని ఖండించిన సందీప్ ఛాతీలో నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరాడు. మేడ మీదకు తీసుకెళ్లాలని తనను తల్లి కోరిందని.. తిరిగి నీటి కోసం తాను కిందకు వచ్చేసరికి ఘటన జరిగిందంటూ అతను చెబుతున్నాడు. అతను డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకుంటామని.. త్వరలో కేసు చిక్కుముడి విప్పదీస్తామని రాజ్‌కోట్ పోలీసులు వెల్లడించారు. -
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ
మాచారెడ్డి : మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం సోమారంపేట పంచాయతీ పరిధిలోని రోడ్డుబండ తండాలో జరిగింది. మాచారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారంపేట్కు చెందిన గుగ్గిల రేణ రోడ్డుబండ తండా సమీపంలో ఉన్న వాగులో దుస్తులు ఉతకడానికి వెళ్లింది. దుస్తులను ఉతికి ఆరేసిన అనంతరం వాటిని తీసే ప్రయత్నంలో ఉండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఇద్దరు నోరుమూయగా మరో వ్యక్తి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దుండగులు ఎల్లంపేట నుంచి ఇసాయిపేట వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. నిందితులు బైక్‌పై పరారవుతుండగా ఎల్లంపేటలోని సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురు మహిళలను బెదిరించి .. మాక్లూర్ : మండలంలోని కల్లెడి శివారులో ముగ్గురు మహిళలను బెదిరించి మూడు తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రామునాయుడు బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడి తండాకు చెందిన దీపిక, శాంతి, పంచు అనే ముగ్గురు మహిళలు కట్టెల కోసం కల్లెడి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు దుండగులు కత్తులతో వారిని బెదిరించి వారి వద్ద ఉన్న మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిజామాబాద్‌లో దొంగల ముఠా హల్చల్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినయాక్ నగర్ బస్వాగార్డెన్‌లో బుధవారం రాత్రి దొంగలు మల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడటానికి వచ్చిన దొంగలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ముఠాలోని కొందరు దొంగలు స్థానికుల పై దాడికి దిగారు. సుమారు 10 మంది మహారాష్ట్రకు చెందిన దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీ టీవీల్లో రికార్డైన ఆధారాల ప్రకారం పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసుల అదుపులో నలుగురు దొంగలు ఉన్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో పట్టపగలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న వాహనం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
గుంజిళ్లు తీయించి.. కాళ్లు మొక్కించుకున్నారు
♦ కారును ఢీకొట్టాడనే కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై కాంట్రాక్టర్ పైశాచికం ♦ మరమ్మతుకు డబ్బు లేదన్నందుకు కాగితాలు లాక్కుని అవమానం ♦ సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ♦ క్యాబ్ డ్రైవర్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో కీలక ఆధారాలు ♦ కిరణ్‌కుమార్ అనే కాంట్రాక్టర్ అరెస్ట్ హైదరాబాద్: కారును ఢీకొట్టాడనే కోపంతో ఓ క్యాబ్ డ్రైవర్‌తో గుంజిళ్లు తీయించారు. కాళ్లు మొక్కించుకుని అవమానపరిచారు. కారు రిపేర్ చేయించేందుకు డబ్బులు లేవన్నందుకు కారుకు సంబంధించిన కాగితాలు లాక్కుని నరకయాతన పెట్టారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ నేరేడు కుమార్ (40) కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను సీసీ కెమెరాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కిరణ్ స్నేహితుడు సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న పొరపాటుతో.. ఈ నెల 21న హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన కిరణ్‌కుమార్ కారును అమీర్‌పేట సమీపంలోని మల్లాపూర్‌కు చెందిన క్యాబ్‌డ్రైవర్ కుమార్ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ పెద్దది కావడంతో వెంటనే అమీర్‌పేటలో ఉండే తన స్నేహితుడు సాయికి కిరణ్ ఫోన్ చేసి పిలిపించాడు. వారిద్దరు కలసి డ్రైవర్‌ను తీసుకుని బేగంపేటలోని ఎస్పీరోడ్లో ఉన్న కార్ల షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కారును రిపేర్ చేయించేందుకు రూ.5 వేలవుతుందని, ఆ డబ్బు ఇవ్వాలని కుమార్‌ను అడిగారు. తన వద్ద అంత మొత్తం లేదని చెప్పినా.. అతడి ఏటీఎం కార్డును లాక్కుని డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఖాతాలో డబ్బులు లేకపోవడంతో క్యాబ్‌కు సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లెసైన్స్‌ను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కుమార్‌తో గుంజిళ్లు తీయిం చారు, కాళ్లు మొక్కించుకున్నారు. ఈ సంఘటన మొత్తాన్ని డ్రైవర్ నేరేడు కుమార్ క్యాబ్ యజమాని అనిల్‌కుమార్‌రెడ్డికి వివరించాడు. దీంతో వారిద్దరు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హనుమాన్ జయంతి ర్యాలీ విధుల్లో ఉండడంతో కేసు నమోదు చేసుకుని పంపించారు. ఆ తర్వాత తాడ్‌బండ్‌కు వెళ్లిన కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే బాధితుల ఫిర్యాదు ప్రకారం ఆయా ప్రాంతాల్లో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిం చి.. గుంజిళ్లు తీయించిన దృశ్యాలను గుర్తించారు. మేరకు శనివారం మధ్యాహ్నం నిందితుడు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంచిర్యాలకు చెం దిన సాయి పరారీలో ఉన్నాడు. పోస్టుమార్టం అనంతరం నేరేడు కుమార్ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారు అంత్యక్రియల నిమిత్తం కుమార్ స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు సమీపంలోని అనంతపూర్‌కు తీసుకెళ్లారు. -
మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్
-
మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్
కొచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలిని లేడీ బౌన్సర్ చితక్కొట్టింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా వృత్తిపరమైన విబేధాల వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం ముదిరి బాహాబాహీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది. -
మహిళలకు మత్తు మందు ఇచ్చి..
తిరుమలలో ఇద్దరు మహిళలకు మత్తుమందు ఇచ్చి బంగారునగలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గురువారం తమిళనాడుకు చెందిన సత్యవతి, సుస్మితకుమారి అనే ఇద్దరు మహిళలు బుధవారం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చారు. తిరుమల అన్నదానసత్రం వద్ద ఓ వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. మహిళలతో సన్నిహితంగా ఉంటూ అన్నం పెట్టించాడు. ఉండటానికి కౌస్తుభం అతిధి భవనంలో రూం నెం235 ఏర్పాటు చేశాడు. గురువారం ఉదయం సదరు మహిళలకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పృహ వచ్చాక విషయం తెలుసుకున్న మహిళలు తిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకోవడానికి సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి వేధింపుల వల్లే మౌనిక ఆత్మహత్య
ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలో ఈనెల 9న జిల్లా ఆస్పత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పెళ్లి చేసుకుందామని ప్రియుడు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి శనివారం వివరించారు. చండ్రుగొండ మండలం దుబ్బతండాకు చెందిన భూక్యా మౌనిక (19) నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతూ మామిళ్లగూడెంలోని స్వధార్‌హోంలో ఉంటోంది. ఆమెకు ఏడాది క్రితం కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన దేశబోయిన గణేష్ అలియాస్ చందుతో(22)తో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా గణేష్ పెళ్లి చేసుకొందామని మౌనికపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె మాత్రం జీవితంలో స్థిరపడాలనీ, డిగ్రీ అయిపోయిన తర్వాత అంటూ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి. అసలేం జరిగింది..: ఈనెల 8న సాయంత్రం గణేష్ మౌనిక ఉంటున్న హోంకు వెళ్లి గొడవ పడ్డాడు. రోడ్డు మీదనే ఆమెను చెంపమీద కొట్టాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాంత్‌నగర్‌లోని గణేష్ గదికి మౌనిక వెళ్లింది. అక్కడ వీరిద్దరి మధ్య మరోసారి పెళ్లి విషయం తీవ్రంగా ఘర్షణ జరగడంతో గణేష్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చనిపోతానంటూ గోడకు తల కొట్టుకుంది. ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను కిందకు దించి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన స్నేహితుడైన ఆటో డ్రెవర్ను సహాయం అడగగా, అతను స్టేచర్ తీసుకుని వచ్చాడు. అతనే గణేష్‌తో పాటు సీసీ టీవీ పుటేజ్‌లలో కనిపించిన యువకుడని, అతనికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. నల్లగొండ జిల్లా మేళ్ల చెర్వు ప్రాంతంలో గణేష్ తండ్రి చేపలు పట్టడానికి వెళ్లగా, ఆస్పత్రి నుంచి గణేష్ నేరుగా అక్కడికే వెళ్లాడు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు వెళ్లి అతని అదుపులోకి తీసుకున్నారు. -
మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సీసీటీవీ పుటేజీలు మాయం
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సీసీటీవీ పుటేజీల మాయం కలకలం సృష్టించింది. బస్టాండ్‌లో దొంగలు ఒక బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కేసు విషయంలో పోలీసులు గురువారం బస్టాండ్‌కు వెళ్లారు. ఆ కేసు విచారణ నిమిత్తం సీసీటీవీ పుటేజీలను పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే బస్టాండ్‌లో ఉన్న సీసీటీవీ పుటేజీల బ్యాక్అప్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు లేకుండా పోవడంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ, ఇతర పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బస్టాండ్‌లో సుమారు 28 కెమెరాలతో భద్రతా కార్యక్రమాలు చేపట్టినా సీసీటీవీ పుటేజీలు లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఏజెన్సీపైన కేసు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసును ఆఫ్జల్‌గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కమలాపురం స్టేట్ బ్యాంక్‌లో చోరీ
మండపేట(వరంగల్): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్బీఐలో జరిగింది. వివరాలు.. కమలాపురం గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు సీసీ టీవీ పూటేజిల సహాయంతో గుర్తించారు. ఈ చోరీలో నిందితులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలుకాకపోవడంతో విరమించుకున్నారు. దీంతో, బ్యాంకులోని 3 సీపీయూలు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లను వారు దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకులోని లాకర్లలో రూ.93 లక్షలు ఉన్నట్లు వారు తెలిపారు. సోమవారం బ్యాంకు తెరిచిన సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పూటేజిల అధారంగా ఇద్దరు నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్లు, ఫోన్ నంబర్లు సంభాషణల ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారో గుర్తించి, నిందితులను పట్టుకుంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.