మండపేట(వరంగల్): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్‌బీఐలో జరిగింది. వివరాలు.. కమలాపురం గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు సీసీ టీవీ పూటేజిల సహాయంతో గుర్తించారు. ఈ చోరీలో నిందితులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలుకాకపోవడంతో విరమించుకున్నారు.
దీంతో, బ్యాంకులోని 3 సీపీయూలు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లను వారు దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకులోని లాకర్లలో రూ.93 లక్షలు ఉన్నట్లు వారు తెలిపారు. సోమవారం బ్యాంకు తెరిచిన సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పూటేజిల అధారంగా ఇద్దరు నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్లు, ఫోన్ నంబర్లు సంభాషణల ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారో గుర్తించి, నిందితులను పట్టుకుంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కమలాపురం స్టేట్ బ్యాంక్‌లో చోరీ
Published Mon, Feb 2 2015 2:15 PM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM
Advertisement
Advertisement