Kamalapuram
-
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
సాక్షి, వైఎస్సార్: అతను ఓ పోలీస్ అధికారి. అయితే వీధి రౌడీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రవర్తించడం ఆయన నైజం. పని చేసిన ప్రతి చోట వివాదాలు సృష్టించుకోవడం.. ప్రజలతో ఛీ కొట్టించుకోవడం ఆయనకు పరిపాటి. అయితే పుష్ప సినిమాలో లాగా తాను ఏమాత్రం తగ్గేదేలే అనే చందాన వ్యవహరిస్తున్నాడు. తన పద్ధతి, విధానాలను పోలీసుశాఖ లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం ఆయన ప్రత్యేకత. తన సర్కిల్ పరిధిలోని ప్రజలకు రోత పుట్టించే విధంగా విధి నిర్వహణ ఉందంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజానిజాలు బయటపడతాయని సర్కిల్ పరిధిలోని ప్రజలు గుసగుసలాడుతున్నారు. కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు సీఐ రోషన్ వ్యవహార శైలిని గమనిస్తే కడప జిల్లాలో ఎక్కడో గాని ఇలాంటి అధికారి పోలీసుశాఖలో లేడనే చెబుతారు. డబ్బుల కోసం ఏ స్థాయికైనా దిగజారే మనస్తత్వం అని కమలాపురం ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో అనేక భంగపాట్లు ఎదురైనా తనకు ఉన్నతాధికారుల అండ ఉందనే గర్వంతో పోలీసు స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రోషన్ రోత చరిత్ర అనే పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కమలాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ఒక చిన్న స్థాయి వీధి గలాటాకు సంబంధించి వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఓ వ్యక్తిని నాలుగు రోజుల కిందట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అధికార పార్టీ అగ్ర నాయకుడి ఆదేశాలతో ఆ వ్యక్తిపై పోలీసు జులుం ప్రదర్శించాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి 45 వేల రూపాయలు చెల్లించడంతో ఆ డబ్బు తీసుకొని ఏమాత్రం సంతృప్తి చెందక మిగిలిన డబ్బుల కోసం ఆ వ్యక్తిపై వీధి రౌడీలా ప్రతాపాన్ని చూపాడు. సీఐ రోషన్ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోవడంతో కమలాపురానికి చెందిన ఒక వైద్యుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వైద్యం చేయించారు. బాధితుడి కుటుంబీకులు ఈ విషయంపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే కమలాపురం పట్టణంలో ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష లీకేజీ వ్యవహారంలో బాధ్యులు కాని వ్యక్తులపై కూడా అధికార పార్టీ అగ్ర నాయకుడు చెప్పాడనే ఏకైక కారణంతో స్వామి భక్తిని చాటుకునేందుకు.. దీనికితోడు వారి దగ్గర డబ్బును బాగా దండుకోవచ్చనే దురుద్దేశంతో సంబంధం లేని వ్యక్తులను సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. కేసు నమోదు చేసి.. వారిని బెదిరించి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసిన విషయం కమలాపురంలో వీధి వీధినా వ్యాపించింది. డబ్బులు ఇవ్వని కొందరు నిందితులను భారీ స్థాయిలో పోలీస్ కోటింగ్ ఇచ్చిన ఘనత కూడా రోషన్కే దక్కింది. అలాగే చిన్నచెప్పలి గ్రామానికి చెందిన తండ్రి కొడుకుల ఆస్తి వ్యవహారంలో రోషన్ వ్యవహరించిన అత్యుత్సాహం సామాన్యుడిని సైతం నివ్వెర పరిచింది. జిల్లా ఉన్నతాధికారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో రోషన్ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించింది. ఈయన కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి కమలాపురానికి సంబంధించిన ఒక మైనారిటీ వర్గ నాయకుడికి జరిగిన వ్యవహారంలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ఆ మైనార్టీ నాయకుడిని బెదిరించి దాదాపు 15 లక్షలకు పైగా వసూలు చేసుకున్న ఘనాపాటి ఈ సీఐ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక డివిజనల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసి వీడియో దృశ్యాలను చూపించినా ఆ డివిజనల్ అధికారి మిన్నకుండిపోవడం గమనిస్తే ఈ సీఐ ఏ స్థాయిలో అధికారులను తన వైపు తిప్పుకుంటున్నాడో తెలిసిపోతోంది. ఇక ఇటీవల కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈ జీ అశోక్ కుమార్ తమ నియోజకవర్గ నాయకుడికి అత్యంత ఆప్తుడని, అలాగే రేంజ్ పరిధిలో ఉన్న ఓ అధికారి సైతం తమ నాయకుడి మాటే వింటాడని తనను ఎవరూ ఏమీ పీకలేరని బహిరంగంగానే ఈ అధికారి మాట్లాడడం గమనిస్తున్న కమలాపురం ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సీఐ గారికి జీతం ఇచ్చేది నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ అగ్ర నాయకుడా?? లేక పోలీస్ శాఖనా అనే విషయంపై చర్చ కూడా కమలాపురం ప్రాంతంలో జోరుగా జరుగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం పట్టణంలో దాదాపు పదికి పైగా> అధికార పార్టీ అగ్ర నాయకుడి బెల్ట్ షాపులు బహిరంగంగా బార్లను తలదన్నే విధంగా నడుస్తున్నాయంటే వాటి నుంచి ఈయన ఎంత దండుకుంటున్నాడో మరో మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు ఈ సీఐ రోషన్ సహాయంతో నడుస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ కూడా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన జోక్యం చేసుకొని రోషన్ ఆగడాలను అరికట్టకపోతే కమలాపురం పోలీసుల తీరు మరో బీహార్ ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.కోగటం సంఘటనపై సీఐ రోషన్‌ను వివరణ కోరగా అదంతా బోగస్ అని కొట్టి పారేశారు. వారు లాయర్‌కు డబ్బు ఇచ్చుకున్నారేమో గాని తాను డబ్బు అడగలేదని వివరించారు. -
రైతుల నీటి కష్టాలు తీర్చాం : రవీంధ్రనాథ్ రెడ్డి
-
2 లక్షల మందితో నిండిపోయిన సీఎం జగన్ సభ
-
పార్టీ కోసం ఇంత కష్టపడితే.. మాకిచ్చే గౌరవం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం అసాధ్యమేనా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించడమే ఇందుకు కారణమా? పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న తెలుగుతమ్ముళ్లను వేదనకు గురిచేస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔను అనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. విధేయతతో నిమిత్తం లేకుండా స్థాయిని బట్టి ఆపైనున్న నేతలు అణచివేస్తున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలో టీడీపీ కూసాలు కదులుతున్నాయి. అధినేత వైఖరిపై మండిపడుతూ జిల్లా నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అదే జెండా అండగా ఉంటుందన్నది పాత మాట. కార్యకర్తల ఉన్నతి కాంక్షించే ఆ పార్టీలో ఇపుడు ‘పొడుగు చేతుల పందేరం’గా వ్యవహారం నడుస్తోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. విధేయులు, అవకాశవాదులను ఓకే గాటన కట్టేస్తున్నారనే ఆవేదనతో రగలిపోతున్నారు. కష్టపడ్డ వారికి గుర్తింపు అటుంచితే ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. గరం గరంగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి పదేళ్ల పాటు రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జిగా, ఇరవై ఐదేళ్లు టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో సేవలందిస్తున్నారు. తాజాగా ఈమారు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబుతో సమావేశపర్చమని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తీవ్ర ఆక్రోశానికి గురయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం సేవలు పొంది ఎన్నికలు సమీపించినపుడు మొండిచేయి చూపుతారా? కనీసం పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? ఇలాంటి పార్టీ కోసం తాను ఇంకా పనిచేయాలా అంటూ రమేష్‌రెడ్డి రగిలిపోతున్నట్లు సమాచారం. ఆ మేరకే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఆయనకు లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. ఇన్చార్జి రమేష్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అలా చేయని పక్షంలో తమ రాజీనామాలు స్వీకరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుల మద్దతు కోరుతున్న రమేష్‌రెడ్డి సైతం ఇక ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లాలో టీడీపీ భూస్థాపితానికి శాయశక్తులా కృషి చేయాలనే దిశగా సన్నిహితులతో మంతనాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లింగారెడ్డిని కనుమరుగు చేసిన అధిష్టానం ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసిన మల్లెల లింగారెడ్డి ఒక్కసారి విజయం సాధించారు. అప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో తలపడుతూనే జిల్లా అధ్యక్షుడిగా పలుమార్లు సేవలందించారు. 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈమారు ఆశావహుల్లో ఒకరైన నంద్యాల వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. పార్టీలో చేరకుండానే టీడీపీ టికెట్ ఎలా అడుగుతారని నిలదీస్తూనే, ఆయనకే టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న తమలాంటి వారు సన్యాసం స్వీకరించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరిక చేశారు. అంతే, ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని కూర్చోబెట్టారు. కష్టకాలంలో టీడీపీకి సేవలందించిన తనను తప్పించడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి జీర్ణించుకోలేకున్నారు. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పుత్తాకు వీరశివా సెగలు కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పుత్తా నరసింహారెడ్డి పదహారేళ్లుగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పుత్తాకు వీరశివా సెగలు తాకుతున్నాయి. తాజాగా మరోమారు కమలాపురం అభ్యర్థిత్వంపై ఐవీఆర్ ఫోన్ కాల్స్ రూపంలో ఇరువురు పేర్లపై టీడీపీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టడం విశేషం. ఈ వ్యవహారం వెనుక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పుత్తా వర్గీయులు విశ్వసిస్తున్నారు. మూడు సార్లు పోటీ చేసి పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న తనని కాదని, అవకాశవాదుల్ని తెరపైకి తెస్తారా? అని పుత్తా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆవేదనను తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడి నుంచైనా సరే శ్రీనివాసులరెడ్డి కుటుంబం పోటీ చేస్తే, ఓడించాలనే దిశగా స్వంత అన్న రమేష్‌రెడ్డి సైతం మండిపడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తుండటం విశేషం. రెడ్యంకు దక్కని ప్రాధాన్యత మైదుకూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి రెడ్యం సోదరుల పరిస్థితి కూడా పై వారికి భిన్నంగా ఏమీ లేదు. ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియారిటీ ఉన్న నాయకుల్ని కనుమరుగు చేయాలనే ఎత్తుగడల్లో భాగంగా వారిని పక్కకు తప్పిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యం సోదరులకు పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
రా కదిలి రా .. ఖాళీ కుర్చిలకు చంద్రబాబు మోత
-
కమలాపురం: చంద్రబాబు ‘రా..కదలిరా’ సభ అట్టర్‌ఫ్లాప్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురంలో చంద్రబాబు రా..కదలిరా సభ అట్టర్‌ప్లాప్ అయ్యింది. అబద్ధాలు, అవాస్తవాలతో చంద్రబాబు ప్రసంగం ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు తన ప్రసంగంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సభకు జన సమీకరణలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాక ముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. మద్యం ధరలపై చంద్రబాబు మాట్లాడుతుండగా సభలో మందుబాబులు క్వాటర్ బాటిళ్లు చూపించారు. టికెట్లపై స్పష్టమైన హామీ ఇస్తారనుకున్న ఆశావహులు.. బాబు నుంచి క్లారిటీ రాకపోవడంతో వెనుదిరిగారు. -
వైఎస్సార్ జిల్లా కమలాపురం : సామాజిక స్ఫూర్తి..పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన చెన్నూరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, యువనేత నరేన్ రామాంజులరెడ్డిల అధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, మేరుగ నాగార్జున, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. నమ్మి ఓటు వేసిందుకు సీఎం జగన్ ప్రభుత్వం సామాజిక సాధికారితకు కృషి చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ నేతలు పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దన్నారు.. కానీ సీఎం ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారన్నారు. ‘‘నేను దళితుడిని.. నేను మంత్రినయ్యా. కడప నుంచి ఓ మైనార్టీని డిప్యూటీ సీఎంను చేశారు. కులం, మతం చూడకుండా అందరిని సీఎం జగన్ అభివృద్ది చేశారు. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలను విడగొడితే వైఎస్సార్సీపీ ఓడిపొతుందని చంద్రబాబు అనుకుంటున్నారు’’ అని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో నోటాతో పోటీ పడ్డారు. తెలుగు ప్రజలు బాబును, పవన్ కళ్యాణ్‌ను నమ్మడం లేదని ఆదిమూలపు అన్నారు. చంద్రబాబును నమ్మొద్దు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ మాత్రం అందరిని అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అధిక దాడులు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా తగ్గుముఖం పట్టాయి. ఎట్టి పరిస్దితుల్లో చంద్రబాబును నమ్మొద్దు -మంత్రి మేరుగ నాగార్జున -
చంద్రబాబు హయాంలో కరువు, కాటకాలు
-
ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం.. ఈ భార్య కాకపోతే మరో భార్య..
-
CM Jagan: కొత్త వ్యూహాలతో.. ప్రత్యర్థులకు సర్రున కాలేలా..
రాజకీయాలలో ఒక్క డైలాగు చాలు సర్రున కాలడానికి. ఒక్క మాట చాలు మొత్తం కథ బయటపెట్టడానికి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా కమలాపురంలో జరిగిన సభలో చేసిన కామెంట్లు అంత పవర్ పుల్గా ఉన్నాయని చెప్పాలి. చూడండి.. ఆయన ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారో.. ఈ రాష్ట్రం కాకపోతే, మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని చంద్రబాబులా, ఆయన దత్తపుత్రుడు మాదిరి ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అననని జగన్ పేర్కొన్నారు. ఒక్క పదంలో ఎన్ని అర్దాలు వచ్చేలా ఆయన ప్రసంగించారో అర్దం అవుతోంది కదా! చంద్రబాబు ఇటీవల తెలంగాణలో టిడిపిని పునరుద్దరిస్తానంటూ సభలు పెడుతున్న వైనాన్ని సుత్తి లేకుండా సూటిగా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని ఆయన అంటున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీపై ఆశలు వదలుకున్నారని చెప్పినట్లయింది.అందుకే మళ్లీ తెలంగాణ వైపు వెళ్లారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఎటూ టిడిపికి భవిష్యత్తు లేదని, ఇక ఎపిలో కూడా పరిస్థితి అంతేనని ఆయన చెప్పదలిచారని అనుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్‌కు సంబంధించి వ్యక్తిగత జీవితంపై ఉన్న విమర్శలు,తాజాగా ప్రచారం అవుతున్న కధనాలను బహుశా దృష్టిలో ఉంచుకుని యధాప్రకారం చంద్రబాబు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ దాడి చేశారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తనను, వైసిపి నేతలను ఉద్దేశించి చేస్తున్న పరుష, వ్యక్తిగత వ్యాఖ్యలకు జగన్ జవాబు ఇచ్చినట్లయిందనుకోవాలి. ఈ ఫ్రంట్‌లో చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ బలహీనంగానే ఉన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పార్టీలు మార్చడం కాని, కూటములు మార్చడం కాని పలుమార్లు చేశారు. 1978లో కాంగ్రెస్ ఐ తరపున ఎన్నికైన ఆయన 1983లో టిడిపి అదికారంలోకి రావడంతోనే మామ ఎన్టీఆర్ పంచన చేరారు. 1995లో ఆయన ఎన్టీఆర్‌నే కూలదోసి అధికారంలోకి వచ్చారు. 1996లో వామపక్షాలతో కలిసి ప్రంట్ కట్టారు. 1998లో బిజెపి ఆద్వర్యంలోని ఎన్డీఏలోకి జంప్ చేశారు. 2004 ఓటమి తర్వాత జన్మలో బిజెపితో కలవనని శపధం చేశారు. 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. తదుపరి 2014లో మళ్లీ వామపక్షాలకు ఝలక్ ఇచ్చి బిజెపి ప్రధాని అభ్యర్దిగా ఉన్న నరేంద్ర మోడీని బతిమలాడుకుని తిరిగి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2018 లో బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, సిపిఐ, టిజెఎస్‌లతో కలిసి కూటమి కట్టి తెలంగాణలో పరాజయం చెందారు. 2019లో ఒంటరిగా పోటీచేసినా, పరోక్షంగా జనసేనతో సంబందాలు ఏర్పాటు చేసుకున్నారు. 2024 నాటికి మరోసారి జనసేన, బిజెపిలతో పొత్తు కోసం అర్రులు చాస్తున్నారు. దీనినంతటిని జగన్ ఒక్కమాటలో చెప్పేశారు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని చంద్రబాబు మాదిరి వెంపర్లాడబోనని నిక్కచ్చిగా జగన్ చెప్పేశారన్నమాట. ఇక ఇటీవలికాలంలో పవన్ కళ్యాణ్ చాలా అసహనంగా వైసిపిపైన , జగన్ పైన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న దూషణలను ఆయన కూడా కొనసాగిస్తున్నారు. వాటన్నిటికి సమాధానంగా పవన్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాన్ని మరోసారి ప్రజల దృష్టికి తీసుకు వచ్చారన్నమాట. అంతేకాక పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మీరు కూడా ఎన్ని పెళ్లిళ్లు కావాలంటే అన్ని చేసుకోండని చేసిన వ్యాఖ్య కూడా ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. దీనిని గమనంలోకి తీసుకుని జగన్ డైలాగు విసిరారనుకోవాలి. ఈ రకంగా వన్ షాట్ టు బర్డ్స్ అన్నట్లుగా జగన్ దెబ్బకొట్టారన్నమాట. ఇక అదే సమయంలో తన గురించి కూడా ఆయన చెబుతూ, ఇదే నా రాష్ట్రం, నా నివాసం, ఐదు కోట్ల మంది ప్రజలే తన కుటుంబం, ఇక్కడే నా రాజకీయం,ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే తన విధానం అంటూ సెంటిమెంట్ తో కూడిన వ్యాఖ్య చేశారు. ఈ సందర్భంగా కూడా పరోక్షంగా చంద్రబాబు, పవన్‌లు ఇప్పటికీ తెలంగాణలోనే నివాసం ఉంటున్న నేపధ్యంలో జగన్ మరో చురక అంటించారన్నమాట. నాయకుడు అంటే విశ్వసనీయత కలిగి ఉండాలని, తను అధికారంలోకి వచ్చాక 98 శాతం ఎన్నికల మానిఫెస్టోని అమలు చేశానని ఆయన వివరించారు. జగన్ మొత్తం మీద ప్రతి బహిరంగ సభలోను కొత్త, కొత్త వ్యూహాలతో తన రాజకీయ ప్రత్యర్ధులకు గట్టి జవాబే ఇస్తున్నారు. చంద్రబాబుకాని, పవన్ కళ్యాణ్ కాని గంటలకొద్దీ మాట్లాడుతూ జగన్‌ను, వైసిపిని విమర్శిస్తుంటారు. అందుకు ప్రతిగా ఒకటి, రెండు డైలాగులతో జగన్ వారిని డిఫెన్స్‌లో పడేస్తున్నారన్నమాట. - హితైషి -
వైఎస్ఆర్ జిల్లా : అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ (ఫొటోలు)
-
కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు: సీఎం జగన్
CM Jagan Kadapa Tour Live Updates 04:23PM కమలాపురం బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగం ►కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది ►కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం ►దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా ►వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం ►గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు ►మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం ►గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి ► గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు ► రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం ► మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం ► ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి ►కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం ►వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ►బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం ►రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు ►విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు ►జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి ►కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం ►జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ►గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవి ►గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే ►గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే ►గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో ►గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని ►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి ►రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి ►ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం ►ప్రజా సంక్షేమమే నా విధానం ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు ►ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు ►ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం ►5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం ►చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదు ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని... ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని,దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు 04.10PM ►పులివెందులకు మించి కమలాపురానికి సీఎం నిధులిచ్చారు: రవీంద్రనాథ్‌రెడ్డి ►అర్హలైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: రవీంద్రనాథ్‌రెడ్డి ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది: రవీంద్రనాథ్‌రెడ్డి ►సచివాలయ వ్యవస్థతో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి 03:20PM ►కమలాపురంలో సీఎం జగన్ ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం ►రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన 02:50PM ►వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్ 02:15PM ►పటేల్ రోడ్ లోని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ఇంటికి చేరుకున్న సీఎం జగన్. ►మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహానికి హాజరైన సీఎం జగన్.. నూతన దంపతులను ఆశీర్వదించారు. 01:18 PM ►కడప అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్ ►దర్గాలో చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ►కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం ► మొదటిరోజు పర్యటనలో కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన 01:05 PM ►అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ 12:52 PM ►కడప చేరుకున్న సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో పెద్ద దర్గా చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం జగన్ సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. -
నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల
సాక్షి ప్రతినిధి, కడప: కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. అధికారిక పగ్గాలు అందుకోగానే కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు. తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఫలాలు అందుతాయని ఆశించిన తరుణంలో ఆయన ఆకస్మిక మరణం అశనిపాతంలా మారింది. తండ్రి స్వప్నం సాకారం చేసేందుకు తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ఫలాలు ప్రజలకందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులకు జీవం పోసిన వైఎస్ఆర్ మెట్ట ప్రాంతమైన రాయలసీమకు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాణప్రదం. టీడీపీ పాలకులకు ఆ విషయం తెలిసినా చరణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం విస్తరించి, శరవేగంగా రెండు పథకాల పనులను పరుగెత్తించారు. ఇది జగమెరిగిన సత్యం. మెట్ట ప్రాంతాల్లో నీరు పుష్కలంగా కన్పిస్తోందంటే అందుకు వైఎస్సార్ ఏకైక కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నిండు కుండలా గండికోట ప్రాజెక్టు.. జీఎన్ఎస్ఎస్ పథకంలో జిల్లాకు ఆయువు పట్టు ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. తద్వారా అటు మైలవరం ప్రాజెక్టు, ఇటు పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌లలో సైతం పుష్కలంగా నీరు నిల్వ ఉంది. తద్వారా భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాగా డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పూర్తి అయితే ఆయకట్టుకు నీరు అందించే వెసులుబాటు కలగనుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌కు శుక్రవారం కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారు. 2023 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి, ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సర్వరాయసాగర్ పునరావాసానికి గ్రీన్‌సిగ్నల్.. 3.06 టీఎంసీలతో నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి ప్రాజెక్టు (సర్వరాయసాగర్) దిగువనున్న రెండు గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. వీరపునాయునిపల్లె మండలంలోని ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల్లో నీటి జౌకులు లభిస్తున్నాయి. జౌకులు కారణంగా వ్యవసాయానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో ఈ రెండు గ్రామాలకు పునరావాసం సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర హామీ అమలు... ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. అందులో వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు సీఎం హోదాలో వైఎస్ జగన్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.212 కోట్లు నిధులు మంజూరు చేశారు. నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ కుటుంబానికి కమలాపురంపై ప్రత్యేక శ్రద్ధ కమలాపురం ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ. నాడు వైఎస్సార్ కమలాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకలి్పంచగా, తండ్రి ఆశయాన్ని తనయుడు సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. 2019–22 మధ్య మూడేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు రూ.1284 కోట్లు వివిధ పనుల కోసం వెచ్చించారు. శుక్రవారం దాదాపు రూ.902 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. –ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి యుద్ధప్రాతిపదికన భూ సేకరణ వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన చేపడతాం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయింది. మిగిలిన భూ సేకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –వి.విజయరామరాజు, కలెక్టర్ అక్టోబరు నాటికి సాగునీరు వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో మిగులు పనులకు రూ. 212 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి చేసి వచ్చే అక్టోబరు నాటికి కనీసం 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. –మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప జిల్లాకు రానున్న సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడపకు 11.30 గంటలకు చేరుకుంటారు. 11.50 గంటలకు రోడ్డు మార్గాన కడప పెద్ద దర్గాకు చేరుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, పీఠాధిపతితో సమావేశం అనంతరం 12.20 గంటలకు బయలుదేరి, 12.35 గంటలకు ఏపీఐఐసీ సలహాదారు రాజోలి వీరారెడ్డి ఇంటికి వెళతారు. 12.45 గంటలకు బయలు దేరి ఏపీఎస్‌ఆరీ్టసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. అనంతరం 1.45 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకొని హెలికాప్టర్లో 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 గంటలకు బహిరంగ సభా ప్రాంగణం చేరుకొని 2.25 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫకాలను ఆవిష్కరించనున్నారు. 2.30 గంటల నుంచి 3.45 గంటల వరకూ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని 4.30 గంటల వరకూ స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. 5 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి, కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా.. ఈనెల 23వ తేదీన ►ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్ దర్గాకు చేరుకుంటారు. ►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. ►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. ►1.15 నుంచి 1.25 గంటల వరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. ►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. ►4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. ►5.00 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన ►ఉదయం 9.00 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. ►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. ►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. ►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. ►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. ►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్ వైఎస్సార్ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్డీ ఎస్టీపీని ప్రారంభిస్తారు. ►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. ►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 25వ తేదీన ►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
మూడు ముక్కలాట.. కమలాపురం టీడీపీలో వర్గపోరు
సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట పతాక స్థాయికి చేరింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి ఈసారి కూడా తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వ్యక్తికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదంటూ ఆ పార్టీ అధిష్టానం నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుత్తా నరసింహారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఓటమి చెందగా, అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగుసార్లు ఓటమి చెందారు. పుత్తా టీడీపీ తరుపున మూడుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలే పార్టీ యువనేత లోకేష్‌ను సైతం కలిశారు. టిక్కెట్ తనదేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంకోవైపు కమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ సైతం ఈ దఫా కమలాపురం టిక్కెట్ తనదేనని ప్రచా రం చేసుకుంటున్నారు. చాలాకాలంగా పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో సాయినాథ్‌శర్మ ‘పుత్తా’కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచా రం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్ ఇస్తే ఎంత డబ్బు అయి నా ఖర్చు చేసేందుకు సిద్ధమని, ఇదే విషయం అధిష్టానానికి సైతం తెలిపినట్లు సాయినాథ్‌శర్మ వర్గం ప్రచారం చేస్తోంది. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి పార్టీ టిక్కెట్టు ఇవ్వదని, ఈ లెక్కన తనకే టిక్కెట్టు అంటూ సాయినాథ్‌శర్మ క్యాడర్‌కు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చెల్లాచెదురైన క్యాడర్ నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు టిక్కెట్ నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటుండడంతో ఉన్న క్యాడర్ ఇప్పటికే వర్గాలుగా విడిపోయింది. పైపెచ్చు తమ నేతకే టిక్కెట్టు అంటూ గ్రామ స్థాయిలోనే క్యాడర్ సైతం ప్రచారం చేస్తోంది. పుత్తా నరసింహారెడ్డికి నచ్చజెప్పి రాబోయే ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్టు ఇస్తారని వీరశివారెడ్డి వర్గం చెబుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని, ఆర్థికంగా నష్టపోయామని, ఈ పరిస్థితుల్లో మరోమారు కూడా తమ నేతకే టిక్కెట్టు వస్తుందని ‘పుత్తా’వర్గం గట్టిగా చెబుతోంది. ఇదిలా ఉండగా ఒకవేళ తమ నాయకుడికి టిక్కెట్ రాకుంటే వీరశివారెడ్డికి మద్దతు ఇస్తాము తప్పించి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు ఇచ్చేది లేదంటూ సాయినాథ్ అనుచర వర్గం చెబుతోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చి నా మిగిలిన ఇద్దరు సదరు నేతకు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఒకవేళ నాయకులు మద్దతు పలికినా కిందిస్థాయిలో క్యాడర్ సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న కాస్త క్యాడర్ సైతం చెల్లాచెదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. -
శరవేగంగా జరుగుతున్న పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జ్ పనులు
-
కడప: పోటెత్తిన పాపాగ్ని నది.. కూలిన కమలాపురం బ్రిడ్జి
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమ అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో కడప జిల్లా పాపాగ్ని నది ఉధృతికి కమలాపురం వంతెన కుంగిపోయింది. వెలిగల్లు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో రెండు రోజులుగా భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు ప్రవహిస్తోంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కూలిపోయింది. చదవండి: ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ యుద్ధ నౌక జల ప్రవేశం బ్రిడ్జి మధ్య భాగంలోని దాదాపు ఆరు స్లాబ్స్ చీలిపోయి లోపలికి కుంగిపోయాయి. దీంతో కమలాపురం- కడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కుంగిన బ్రిడ్జిమీదుగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. చదవండి: సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు పాపాగ్ని నది బ్రిడ్జిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సీఎం అంగీకరించారని, సోమవారం నిపుణుల బృందం వస్తోందని పేర్కొన్నారు. త్వరితగతిన కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కడప- బళ్లారి రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాగేరు వంకపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. -
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మేజార్టీతో గెలుస్తాం
-
‘కష్ట సమయంలోనూ మాట నిలుపుకున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా కష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు నగదును జమచేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కమలాపురం వెలుగు కార్యాలయం ఆవరణలో ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మెగా చెక్కును ఆయన పంపిణీ చేశారు. (చదవండి: అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా) ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 3874 మహిళా సంఘాలకు మొదటి విడతగా 32 కోట్ల 47 లక్షల 81 వేల రూపాయలు లబ్ధి చేకూరింది. కమలాపురం మండలంలో ‘వైఎస్సార్ ఆసరా’ కింద మొదటి విడతగా 800 మహిళా సంఘాలకు గాను 6 కోట్ల 53 లక్షల 29 వేల రూపాయల విలువ కలిగిన మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందజేశారు. -
వైఎస్సార్ సీపీలోకి వీరశివారెడ్డి
వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలా చేయకపోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి వదలుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్ సమక్షంలో వెఎస్సార్సీపీలో చేరునున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్‌ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. చదవండి: బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం! -
‘ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరే’
సాక్షి, వైఎస్సార్ కడప : రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉందని కమలాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రంలో కార్మికుల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడని ప్రశంసించారు. మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా, నాయకుడిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్ ఒక్కరేనని కొనియాడారు. ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్లలో అవినీతికి పరాకాష్టగా చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం కూడా లేకుండా ప్రజా పాలన సాగుతుందన్నారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అర్షులైన ప్రతి లబ్ధిదారులకు నవరత్నాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు -
సంబటురులో రచ్చబండ కార్యక్రమం
-
బుల్లెట్లతో దొరికిపోయిన టీడీపీ నేత!
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో శనివారం టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. తనిఖీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం. అధికార బలంతో ఆయన గన్ను తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయినాథ్ శర్మ ఆయుధాన్ని అప్పగించారా లేదా అనేదానిపై కమలాపురం పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు... సాయినాథ్ శర్మ వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల (మే) మూడో తేదీతో గడువు ముగియనుంది. లైసెన్స్ దారుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిపాజిట్ చేస్తే పోలీసులు రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా లైసెన్స్‌దారుడు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకూ ఆయుధంతో పాటు తుటాలను కూడా కచ్చితంగా పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆయుధం నెంబర్, లైసెన్స్‌లో ఉన్న నంబర్ అదేవిధంగా జారీ చేసిన బుల్లెట్లకు సంబంధించిన నంబర్లు పరిశీలించిన తర్వాతే డిపాజిట్‌ను స్వీకరిస్తారు. ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని స్థానిక డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ నేత సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత సాయినాథ్ స్పందిస్తూ.. పోలీసులు తనకు నోటీస్ ఇవ్వకున్నా...ఆర్మ్ హౌస్ వద్ద గన్ డిపాజిట్ చేశానని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. -
సేవకుడే అక్కడ లీడర్
సాక్షి, కడప: కమలాపురం నియోజకవర్గంలో 1952 నుంచి 2014 వరకూ 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ, మూడు పర్యాయాలు టీడీపీ, రెండు దఫాలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. వైఎస్సార్సీపీ, సీపీఐ అభ్యర్థులు చెరోసారి విజయం సాధిం చారు. ఈమారు ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. అయినా ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. ఇరుపక్షాలు ముమ్మర ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నిత్యం ప్రజలతో మమేకమై ఉండటం ప్రచారంలో కలిసివచ్చింది. మొత్తం నియోజకవర్గంలో గడప గడపా చుట్టేశారు. టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ప్రచారం ఆలస్యంగా ప్రారంభించారు. ఎన్నికల గడువు ముగిసేలోపు ఇంటింటికీ తిరగడం కష్టసాధ్యమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉద్దండులను ఎన్నుకున్న ప్రజలు.... గత ఎన్నికలు విశ్లేషిస్తే కమలాపురం ఎప్పుడూ ఉద్దండులకు పట్టం కడుతోంది. నర్రెడ్డి శివరామి రెడ్డి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరా టం చేసి, నిర్బంధ జీవితం గడిపారు. సొంత కుటుంబాన్ని ఎదిరించి పోరాటం చేశారు. మహోన్నతుడుగా కీర్తిగడించిన శివరామిరెడ్డి సీపీఐ తరుపున పోటీచేయగా 1952లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన ఎన్ పుల్లారెడ్డి, పేర్ల శివారెడ్డిలను కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. రాయలసీమ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ఎంవీ మైసూరారెడ్డిని 1985లో శాసనసభకు పంపించారు. 1989లో కూడా రెండో పర్యాయం ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తర్వాత కమలాపురం తెరపైకి వచ్చిన వీరశివారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డిని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పుత్తా ప్రతికూలతలు.. నియంతృత్వాన్ని కమలాపురం ప్రజలు కట్టడి చేస్తూ వస్తున్నారు. గత చరిత్ర అదే విషయాన్ని రుజువు చేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎంవీ మైసూరారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాలో 1994 ఎన్నికల్లో పోటీచేయగా కమలాపురం ఓటర్లు తిరస్కరించారు. కమలాపురం మండలాధ్యక్షుడు హోదాలో నియోజకవర్గంలో పరిచయం ఉన్న వీరశివారెడ్డికి పట్టం కట్టారు. అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన దౌర్జన్యకర ఘటనలు మైసూరారెడ్డి ఎన్నికను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మంచితనానికి ఓటర్లు పట్టం కడుతున్నారని. దౌర్జన్యాన్ని సహించని పరిస్థితి ఇక్కడ ఓటర్లలో కనిపిస్తుంది. అదే విషయం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి పట్ల కూడా తేటతెల్లమైంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా ఓటమి చవిచూశారు. పార్టీలు మారినా విజయం దరి చేరలేదు. పుత్తా ఫ్యాక్షన్ చరిత్ర, ఇప్పటికీ కొనసాగుతున్న దౌర్జన్యకర ఘటనలేనని ఇందుకు కారణమని పలువురు వివరిస్తున్నారు. పదేళ్లుగా టీడీపీలో ఉన్నా, ఇప్పటికీ కార్యకర్తలు తమ అభిప్రాయాలు కూడా వెల్లడించలేని పరిస్థితి నెలకొంది. సాహసం చేసి ఎవరైనా అభిప్రాయం వెల్లడిస్తే దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెద్దా చిన్నా చూడకుండా వ్యవహరిస్తారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. పుత్తా పట్ల కమలాపురం ప్రాంత ప్రజల్లో మరో అభద్రతాభావం కూడా లేకపోలేదు. భూములపై కన్ను పడితే వదిలేసుకోవాల్సిందేనని పెద్దచెప్పలి, దేవరాజుపల్లె, సముద్రంపల్లె, పెద్దపుత్త ప్రాంతాలల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు’గా పుత్తా అనుచరులుగా కొంతమంది గ్యాంగ్‌లు నిర్వహిస్తూ ప్రధాన నగరాలల్లో భూ సెటిల్మెంట్లుకు పాల్పడుతోన్నారు. ఇదంతా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకుల అంచనా. అనుకూలించనున్న ఉద్యమ చరిత్ర: ఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి చేపట్టిన ఉద్యమ చరిత్ర ఆయనకు అనుకూలించనుందని పరిశీలకుల భావన. ప్రజాందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే, సర్వారాయసాగర్ను తక్షణమే నిర్మించాలని, 2013లో ఆమరణదీక్ష చేపట్టారు. ఆమేరకు ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించారు. గత ఏడాది గండికోట, వామికొండ ప్రాజెక్టుల నుంచి సర్వారా యసాగర్కు నీటి విడుదలకు విశేషంగా కృషి చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఒత్తిడి తేవడంతో అధికారులు అంగీకరించినా తెరవెనుక టీడీపీ నేతలు మోకా లొడ్డారు. ప్రజల కోసం సర్వారాయసాగర్ నుంచి కడప కలెక్టరేట్ వరకూ పాదయాత్ర చేపట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి సర్వారాయసాగర్‌కు నీరు తెప్పించారు. వీరపునాయునిపల్లె మండల ప్రజానీకం ఇదే విషయం మననం చేసుకుంటుం టారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా నిరంతర పోరాటాలు ఎంచుకున్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రజాఉద్యమాలు చేపట్టిన చరిత్ర ఎన్నికల్లో కలిసిరానున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నియంతృత్వ పోకడ నేపథ్యం ఓ వైపు, ప్ర జా ఉద్యమ చరిత్ర మరోవైపు ఇక్కడ బరిలో పోటీ పడతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కమలాపూరం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధుల బంధువులు
-
‘పది’లో ఫస్ట్ వస్తానంటివే..!
సాక్షి, కమలాపురం: కమలాపురం–లేటపల్లె ప్రధాన రహదారిలో నసంతపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి ఆవరణం దద్దరిల్లింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రబల్లె కొత్తపల్లెకు చెందిన విద్యార్థి అలిదెన విష్ణువర్ధన్ రెడ్డి(15) చిన్నచెప్పలి హైస్కూల్లో పదవతరగతి చదువు తున్నాడు. రోజూ అదే గ్రామానికి చెందిన మరి కొంత మంది విద్యార్థులతో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్తాడు. పదవ తరగతి పరీక్షలు కమలాపురంలో బాలికల హైస్కూల్ పరీక్ష కేంద్రంలో రాస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా ఇతర విద్యార్థులతో కలిసి పరీక్ష రాయడానికి ఆటోలో బయలు దేరి వెళ్లాడు. అయితే ఆ ఆటో మార్గ మధ్యలో నసంతపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీ కొంది. ప్రమాదంలో విష్ణువర్ధన్‌రెడ్డి కుడి కాలువ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటీన చికిత్స నిమిత్తం మరో ఆటోలో కమలాపురం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి విష్ణువర్ధన్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అలాగే ఈ ఘటనలో 6వ తరగతి చదువుతున్న నవ్య శ్రీ,, 4వ తరగతి చదువుతున్న వెంకట కిషోర్‌తో పాటు ఆటో డ్రైవర్ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరు బాధ్యత వహిస్తారు రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి విష్ణు వర్ధన్ రెడ్డి మృతి చెందడం దారుణం అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాజోలి వీరారెడ్డి తెలిపారు. మంగళవారం కమలాపురం ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని వారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రజల సేవ కోసం బస్సులు ఏర్పాటు చేస్తే నష్టం వస్తోందని ఆర్టీసీ వారు సర్వీసులను తొలగించడం అన్యాయం అన్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అధికారులా? లేక ఆర్టీసీనా? అని ప్రశ్నించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
టీడీపీ కంట్లో మరో నలుసు!
అభ్యర్థుల ఎంపిక వ్యవహారం టీడీపీకి కంటిమీదకు కునుకు లేకుండా చేస్తోంది. ఒక నియోజకవర్గ సమస్య పరిష్కారం అయిందనుకుంటే మరో నియోజకవర్గంలో సమస్య ఉత్పన్నమవుతోంది.రాయచోటి వ్యవహారం జఠిలం కాగా అదేబాటలో కమలాపురం టికెట్ వ్యవహారం నడుస్తోంది. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలసుబ్రమణ్యం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడంతో టీడీపీ పంటి కింద రాయిపడ్డట్లయింది. తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కంట్లో నలుసు కానున్నారు. పునరాలోచన చేయకపోతే పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి కడప : ఈమారు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రకటించారు. ఇదివరకే తన అనుచరులను సమాయత్తం చేశారు. ఆమేరకు దండోపాయం పన్నుతూ ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఆపై అభ్యర్థిత్వం రేసులో ముందువరుసలో నిలిచారు. టీడీపీ సర్వేలకు ప్రాధాన్యత ఇస్తుందని, కేడర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఇంతకాలం వీరశివా వర్గం ఆశిస్తూ వచ్చింది. ఆపై రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు మద్దతు ఉండడంతో టికెట్‌పై ఆశలు పెరిగాయి. ఈనేపథ్యంలో టీడీపీ ఇన్చార్జి పుత్తానరసింహారెడ్డి రెండురోజులు విజయవాడలో తిష్టవేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచి అనుకూలనిర్ణయం ప్రకటించుకున్నారు. అప్పటి వరకూ టికెట్ తనదేనని ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఒక్కమారుగా ఉలికిపాటుకు గురయ్యారని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చిన వీరశివా హఠాత్పరిణామం నేపథ్యంలో సీఎంను కలిశారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఓమారు సర్వే చేసి ఫైనల్ చేయాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఆమేరకు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కేడర్ అభిప్రాయాన్ని కోరారు. అందులో టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి అనుకూలంగా వచ్చినట్లు తెలు స్తోంది. అయినా పునరాలోచన లేకపోవడంతో ఆయన వర్గీయులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు. అమీతుమీకి సిద్ధమైన వీరశివా వర్గీయులు.. రాయచోటి టికెట్ ప్రసాద్‌బాబు ఇవ్వాలి.. లేదంటే ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని.. అలా కాకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి కేటాయిస్తే తాము టీడీపీకి పనిచేయమని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. వారి వాదనను కనీస పరిగణలోకి తీసుకోకుండా రమేష్‌రెడ్డి ఎంపిక చేయడంతో అక్కడి కేడర్ ఒత్తిడి మేరకు స్వతంత్ర అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీచేసేందుకు సమాయత్తమయ్యారు. తాజాగా అదే పరిస్థితి కమలాపురం నియోజకవర్గంలో తలెత్తింది. సర్వేల్లో ముందువరుసలో ఉన్న వీరశివాకు ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి గడువు సమీపించడంతో ప్లేట్ ఫిరాయించడంపై అధిష్టానంతో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. పోటీలో మెరుగైన అభ్యర్థికి కాకుండా కేడర్‌కు ఇష్టం లేని వారిని ఎలా నిర్ణయిస్తారని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అధిష్టానం నుంచి ఆశించిన సానుకూలత లభించకపోతే ఆపార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజీనామా చేసి, తర్వాత తన వర్గీయుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలనే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వీడడమా....ప్రత్యామ్నాయ పార్టీల్లో చేరడమా...లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటమా... చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా టికెట్ విషయమై అల్టిమేటం జారీ చేసి సిఎం ద్వారా ఏదో ఒక హామీ తీసుకోవాలనే ఎత్తుగడలు వేస్తున్నట్లు ఆయన వైరిపక్షం వర్గీయులు ఆరోపిస్తున్నారు. పైగా కమలాపుం టికెట్ మనదే, పందేలు కాయండీ అంటూ ప్రోత్సహించి అనుచరులను దివాళా తీయించారనీ, వారి ఒత్తిడి గట్టేక్కేందుకు వ్యూహాత్మంగా వ్యవహారిస్తున్నారనీ, టీడీపీ వదలి వెళ్లే ప్రసక్తే లేదని మరికొందరు వాదిస్తున్నారు. సోమవారం సీఎంతో వీరశివా భేటీ తర్వాత అసలు విషయం తెరపైకి రానుంది. -
రవీంద్రనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
‘చంద్రబాబును చూసి ఊసరవెల్లే సిగ్గు పడుతోంది’
కమలాపురం : ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కూడా సిగ్గు పడేవిధంగా మాటలు మారుస్తున్నారని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీలో చేర్చుకుని మరీ తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గపు నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేరని వ్యాక్యానించారు. గత ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ మోసం చేశాడని విమర్శించారు. కమీషన్లు ఎక్కువ వచ్చిన చోటే పనులు మాత్రమే చేశారని ధ్వజమెత్తారు. కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకుని వాటి ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు చెబుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. -
ఓటు..మన గౌరవం యువతా...మేల్కొనండి
‘యువతీ యువకులు బద్ధకం వీడాలి. పోలింగ్ రోజున సరదాగా గడపకుండా...తప్పకుండా ఓటేయాలి. కేటుగాళ్లకు బుద్ధి చెప్పి మంచి వాళ్లను ఎన్నుకోండి. ఈ విషయంలో నిరక్షరాస్యులను చూసి నేర్చుకోండి...’ అంటూ యువతకు పిలుపునిచ్చారు తొలితరం ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(96). కమలాపురం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నాటి అనుభవాలను మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...మా కాలంలో ఓటు వేయడాన్ని గొప్ప గౌరవంగా భావించే వాళ్లం. దీన్ని నేటి యువత కొనసాగించాలి. అప్పట్లోనూ ఎన్నికల బరిలో ఒకరినొకరం విమర్శించుకునే వాళ్లం. అయితే అవన్నీ వ్యక్తిగతంగానే. అసభ్యంగా మాత్రం కాదు. విధానపరమైన అంశాలే ఉండేవి. ఇప్పటి నాయకుల వ్యవహారశైలి..వారి విమర్శలు..మాటలు అసహ్యం కలిగిస్తున్నాయి. నన్ను 1952లో మొదటిసారి సీపీఐ తరపున పోటీకి నిలిపారు. అటువైపు కాంగ్రెస్ అభ్యర్థి రామలింగారెడ్డి. అప్పట్లో కూడా ఫ్యాక్షనిజం, దౌర్జన్యాలు ఉండేవి. అతడేమో ప్యూడల్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దీంతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారం ఆర్భాటంగానే సాగింది. పెద్ద నాయకులు వచ్చే సభలకు పది గ్రామాల ప్రజలు హాజరయ్యేలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేవాళ్లం. గ్రామ గ్రామాన ప్రతి ఇంటికీ తిరిగి ఓటడిగే వాళ్లం. సుమారు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు వరకూ ఖర్చయింది. పార్టీలు..సిద్ధాంతాలు వేరైనా అందరం కలిసిమెలిసే ఉండేవాళ్లం. నీలం సంజీవరెడ్డితో కలిసి నేను ఒకే కారులో ప్రయాణించిన స్నేహ వాతావరణం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రాజెక్టుల కోసం భగీరథ ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయటం అభినందనీయం. ముఖ్యంగా యువత, ఇప్పుడిప్పుడే ఓటు హక్కు పొందిన వారు ఓటు వేయటం తమ బాధ్యతగా గుర్తించాలి. .:: కోన సుధాకర్ రెడ్డి -
కమలాపురం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
సమత.. మమత
దర్గా విశిష్టత :కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి మత ప్రబోధనలు చేస్తూ వచ్చిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి 1916లో కమలాపురానికి వచ్చి స్థిర పడ్డారు. ఆయన తన భక్తులకు బోధనలు చేస్తూ ఎన్నో మహిమలు చూపారు. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనకు శిష్యులుగా మారారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణులై విరాజిల్లుతున్న గఫార్ షా ఖాద్రి తన ప్రియ శిష్యుడైన దస్తగిర్‌షా ఖాద్రికి గురుత్వం బోధించి 1924 జనవరి 10న సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దస్తగిర్‌షా ఖాద్రి వంశీయులే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా పీఠాధిపతిగా కొనసాగిన హజరత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఫైజుల్ గఫార్‌షా ఖాద్రి గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కమలాపురం :కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా మత సామరస్యానికి ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి, శ్రీ హజరత్ దస్తగిర్షాఖాద్రి, శ్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి , శ్రీ హజరత్ జహీరుద్దీన్ షాఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్లు వెలసి ఉన్నారు. ప్రతి ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం గత 50 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. స్వర్గీయ పీఠాధిపతి హజరత్ హాజి జహీరుద్దీన్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆయన పరమ పదించిన తర్వాత ఆయన వారసులు, ప్రస్తుత పీఠాధిపతి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 30వ తేదీన నషాన్‌తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 31న గంధం, ఏప్రిల్ 1న ఉరుసు, 2న తహలిల్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం గఫారియా ట్రస్ట్ అధ్యక్షుడు జియా ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1న బండ లాగుడు పోటీలు:ఏప్రిల్ 1వ తేదీన దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించ నున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రు.25,116, ద్వితీయ బహుమతి రు.10వేలు, తృతీయ బహుమతి రు.7వేలు, నాల్గవ బహుమతి రు.5వేలు ఇవ్వనున్నారు. అన్నదానం:ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నషాన్ రోజున టి. హుసేన్ మియ్య, గంధం, ఉరుసు రోజుల్లో మోహన్ బీడీ యజమాని మహబూబ్ సాహెబ్, తహలిల్ రోజున ముంబాయి ఖాదర్ వారు అన్నదానం చేయనున్నారు. మతసామరస్యానికి ప్రతీక హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిర్రిషా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్ఠి ధర్మకర్తగా కొనసాగారు. ఇప్పటికి నాగయ్య కుమారులే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. గొప్ప ఖవ్వాలి ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించ నున్నారు. ప్రముఖ ఖవ్వాల్లు యూపీకి చెందిన సర్ఫరాజ్ చిష్టి, రాజస్థాన్‌కు చెందిన దిల్షాద్ ఇర్షాద్ సాబిరి ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుంది. -
రేపటి మహా ధర్నా కొనసాగుతుంది: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కమలాపురం: తన పాదయాత్ర ద్వారా సర్వరాయసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలనే డిమాండ్ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, అయితే రేపటి తన మహా ధర్నా యథావిధిగా కొనసాగుతుందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడు రోజులుగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బాబురావు నాయుడు స్పందిస్తూ ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే తన నాలుగో రోజు పాదయాత్ర ముగింపు నాడు చేపట్టే మహా ధర్నా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరును కలుస్తానని, ఆయన ఇచ్చే హామీనిబట్టి ముందుగా ప్రకటించిన దీక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో అధికారులు ఇలానే హామీలు ఇచ్చి వెనక్కు తగ్గారని, అందుకే కలెక్టర్‌తో నేరుగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. -
ముగిసిన మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర
-
ముగిసిన మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కమలాపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఇవాళ 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన బుధవారం రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. ఈరోజు ఉదయం 8.40 గంటలకు వైఎస్ జగన్ మూడో రోజు 'ప్రజాసంకల్పయాత్ర'ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్గమధ్యలో రామిరెడ్డిపల్లె గ్రామస్థులు ఆయనను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి జగన్ హామీయిచ్చారు. అక్కడి నుంచి పాలగిరి జంక్షన్‌కు చేరుకున్నారు. తర్వాత వీఎన్ పల్లికి వచ్చారు. అనంతరం వీఎన్‌పల్లి సంగమేశ్వరాలయం జంక్షన్లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా ఆయనను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. బ్రాహ్మణసంఘం నేతలు వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. భోజన విరామం అనంతరం మరలా యాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా గంగిరెడ్డిపల్లి చేరుకున్న జగన్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు అదే గ్రామంలోని సాయిబాబా మందిరాన్ని జగన్ దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు చేరుకున్నారు. కాగా సోమవారం వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ జగన్ మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8, మూడోరోజు 16.2 కిలోమీటర్లు నడిచారు. ఇక నాలుగోరోజు అయిన గురువారం వైఎస్ జగన్ జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగించనున్నారు. -
ముగిసిన రెండోరోజు ప్రజా సంకల్ప యాత్ర
సాక్షి, కమలాపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండోరోజు ముగిసింది. తొలిరోజు 8.9 కిలోమీటర్లు యాత్ర చేసిన ఆయన ఇవాళ (మంగళవారం) 12.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ వేంపల్లి రోడ్డు వద్ద రెండోరోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. రాజన్న తనయుడికి తమ కష్టాలకు చెప్పుకునేందుకు జనాలు పోటెత్తారు. ప్రతిపక్షనేత అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ ఓపిగ్గా ముందుకు సాగారు. తనకోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించాకే ముందడుగు వేశారు. మధ్యాహ్న భోజన విరామం దాటిపోయినా.. జనం కోసం జగన్ యాత్రను కొనసాగించారు. శ్రీనివాస కళ్యాణ మండపంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, విద్యార్థులు, యువత తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. అనంతరం వైఎస్ జగన్ పత్తిచేలను పరిశీలించారు. నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా వేంపల్లి పట్టణంలో ఏడున్నర గంటలపాటు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్.. పులివెందుల దాటి కమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఓబుల్‌రెడ్డిపల్లి జంక్షన్ దాటుకుని నేలతిమ్మాయపల్లి గ్రామ సమీపంలో 2వరోజు పాదయాత్రను ముగించారు. మరోవైపు రేపు (బుధవారం) మూడోరోజు 16.2 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.నీలితిమ్మయపల్లి నుంచి వీఎన్ పల్లి, సంగాలపల్లి, గంగిరెడ్డిపల్లి, అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు వరకూ యాత్ర చేయనున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం: కమలాపురం రైల్వే గేటు సమీపంలోని తూర్పు వైపునకు ఉన్న 283/2–3 కిలోమీటరు రాయి మధ్య ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాదక్ వలి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం వెంకటాపురం వీవర్స్ కాలనీకి చెందిన దండే నరసింహులు (50) సోమవారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. ఆయన కుడి భాగంతోపాటు తల వెనుక భాగం బాగా దెబ్బతింది. ముఖం ఒక వైపు బాగుండటంతో దుగ్గాయపల్లె వాసులు నరసింహులుగా గుర్తించారు. ఆయన కొన్నేళ్లుగా సీకే దిన్నె మండలంలోని ఊటుకూరు సమీపంలోని వడ్డీలకాలనీలో సూరి హోటల్లో పని చేస్తూ జీవనం సాగించే వాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. నరసింహులుకు భార్య నాగలక్షుమ్మ, కుమార్తె ఉన్నారు. -
రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
నల్లింగాయపల్లె(కమలాపురం): కమలాపురం మండల పరిధిలోని నల్లింగాయపల్లె సమీపంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే లైను వద్ద ప్రమాదవశాత్తు రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం, పెద్దన్నగారిపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35) గత మూడేళ్లుగా భారతి పరిశ్రమకు బయటి నుంచి బొగ్గు వచ్చే రైల్వే విభాగంలో పాయింట్ మెన్‌గా పని చేస్తున్నాడు. మృతుడు బొగ్గు అన్లోడింగ్ అయ్యాక వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేసి జాయింట్ చేసే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున బొగ్గు అన్లోడ్ అయ్యాక రెండు వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వ్యాగన్లకు ఉన్న రాడ్లు మృతుని కుడి చేతి వైపు బలంగా గుద్దు కోవడంతో వ్యాగన్ల మద్య ఇరుక్కుని మృతి చెందాడు. మృతుని భార్య తాహరాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రిమ్స్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కమలాపురం: పట్టణ పరిధిలోని గండ్లూరు కాలనీకి చెందిన కదిరి జయమ్మ(45) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కమలాపురం ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గండ్లూరు కాలనీకి చెందిన జయమ్మ శనివారం తెల్లవారు జామున విషాహారం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలిసిందన్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతురాలికి భర్త లాజర్, వివాహిత కుమారుడు కిరణ్ ఉన్నారు. జయమ్మ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఖాతాల్లోకి బ్లాక్ మనీ
-
పక్కాగృహాలేవి?!
- ఏమి అభివృద్ధి చేశారు - టీడీపీ నేత పుత్తాను నిలదీసిన మహిళ చింతకొమ్మదిన్నె/కడప : ’చేయనది చేసినట్లు...లేనిది ఉన్నట్లు’ చెప్పుకుంటూ జనచైతన్య యాత్రలు చేపడుతున్న టీడీపీ నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. కమలాపురం నియోజకవర్గంలో గురువారం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిని ఓ మహిళ నిలదీసింది. మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు లేక ముగురునీరు ఎక్కడికక్కడే పేరుకపోయింది. పక్కాగృహాలు ఇస్తామన్నారు, ఇంతవరకూ ఇవ్వలేదని తీవ్రస్వరంతో చెప్పారు. ఊహించని పరిణామానికి ఆవాక్కైన టీడీపీ నేత కోపోద్రిక్తుడై అమెపై మండిపడ్డారు. చింతకొమ్మదిన్నె మండలం రోడ్డు కృష్ణాపురం గ్రామంలో గురువారం జన చైతన్యయాత్ర కార్యక్రమాన్ని టీడీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తుండగా అదే గ్రామానికి చెందిన దస్తగిరమ్మ అనే మహిళ మాట్లాడుతూ నాయకులందరూ అది చేశాం...ఇది చేశామంటూ వస్తూపోతున్నారే తప్పా చేసిందేమీ లేదన్నారు. పక్కా గృహం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని టీడీపీ నేత పుత్తాను ఆమె నిలదీసింది. సర్దిచెప్పాల్సిన ఆయన కోపోద్రిక్తుడయ్యారు. ’’నేను మీ ఇంటికి గుమస్తాను కాను...మీరు చెప్పినవన్నీ చేసేందుకు ఇక్కడికి రాలేదు...మీకు నేను ఇల్లు కట్టిస్తానని ఏమైనా చెప్పానా...నోరుందని ఊరికే మాట్లాడకు... నాకూ నోరుంది...నేనూ గట్టిగా మాట్లాడగలను...’’...అని పుత్తా అనడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. స్థానిక టీడీపీ నాయకులు దస్తగిరమ్మను సభ నుంచి బయటికి పంపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌ఛార్జి గంధం మోహన్‌బాబు, ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ మహేంద్రారెడ్డి, ఎంపీటీసీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు
కడప: కడపలోని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శేషుబాబు ఫిర్యాదు మేరకు ఎస్బీఐ పులివెందుల, కమలాపురం బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పని చేసిన ఆర్ఎస్ఎస్ శ్రీనివాసరావుతోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని కమలాపురంలో 17 మందికి, పులివెందులలో నలుగురికి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి రుణాలు ఇచ్చారని రీజినల్ మేనేజర్ శేషుబాబు గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కబడ్డీ విజేత కమలాపురం జట్టు
కమలాపురం:స్థానిక గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న జోన్–4 థర్డ్ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో అండర్–19 విభాగంలో కమలాపురం కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జిల్లా సత్యవీడు జట్టుతో తలపడిన కమలాపురం జట్టు విజయం సాధించింది. అలాగే వాలీబాల్‌లో బి.కోట, త్రోబాల్‌లో రాజుపాళెం, ఖోఖోలో చిత్తూరు, క్యారమ్స్‌లో రాయచోటి, చెస్‌లో అడపూరు జట్లు విజేతలుగా నిలిచాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 100మీటర్ల పరుగు పందెంలో కవిత (పుత్తూరు), 200మీటర్లలో పద్మావతి (కుప్పం), 400మీటర్లలో సోనియా (పీలేరు), 800మీటర్లలో హేమవతి (పీలేరు), 1500మీటర్లలో లూర్దు (కమలాపురం), 3000మీటర్లలో హేమవతి(పీలేరు), లాంగ్ జంప్‌లో పద్మావతి(కుప్పం), హైజంప్‌లో కవిత(పుత్తూరు), ట్రిపుల్ జంప్‌లో బి.కోట, డిస్కస్ త్రోలో గాయత్రి(బి.కోట), షాట్‌పుట్‌లో గాయత్రి(బి.కోట), జావెలిన్ త్రోలో (బి.కోట), 4“100రిలేలో కమలాపురం, 4“400లో చిత్తూరు జట్టు విన్నర్స్‌గా నిలిచారు. అండర్–17 విభాగంలో: అండర్–17 విభాగంలో వాలీబాల్ విన్నర్స్ బి.కోట, త్రోబాల్‌లో రాయచోటి, కబడ్డీలో రాయచోటి, ఖోకోలో చిత్తూరు, క్యారమ్స్‌లో తొండూరు, చెస్‌లో కమలాపురం జట్లు విన్నర్స్‌గా నిలిచాయి. 100, 200 మీటర్లలో శిరీష(తొండూరు), 400, 800 మీటర్లలో షాలిని(చిత్తూరు), 1500మీటర్లలో దివ్య(మదనపల్లె), 3000మీటర్లలో మీన(తొండూరు), లాంగ్ జంప్ శిరీష(తొండూరు), హైజంప్ లీలీవతి(రాయచోటి), ట్రిపల్ జంప్‌లో ప్రీతి(మదనపల్లె), డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో పద్మిని(బి.కోట), జావెలిన్ త్రోలో కావేరి(బి.కోట), 4“100రిలేలో చిత్తూరు, 4“400లో తొండూరు జట్లు విన్నర్స్‌గా నిలిచారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరికి ఏడాది జైలు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలో జరిగిన చోరీ కేసులో కమలాపురం కోర్టు ఇద్దరికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. 2014 జనవరిలో ఎర్రగుంట్లలోని న్యూకాలనీలో నివాసం ఉండే గుత్తి రామచంద్రారెడ్డి ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో నిందితులైన అనంతరపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన అబ్దుల్ గఫూర్, వేముల మండలం చింతలజూటురు గ్రామానికి చెందిన రామిరెడ్డి నరేష్రెడ్డిలకు ఈ మేరకు శిక్ష విధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరికి ఏడాది జైలు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలో జరిగిన చోరీ కేసులో కమలాపురం కోర్టు ఇద్దరికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. 2014 జనవరిలో ఎర్రగుంట్లలోని న్యూకాలనీలో నివాసం ఉండే గుత్తి రామచంద్రారెడ్డి ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో నిందితులైన అనంతరపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన అబ్దుల్ గఫూర్, వేముల మండలం చింతలజూటురు గ్రామానికి చెందిన రామిరెడ్డి నరేష్రెడ్డిలకు ఈ మేరకు శిక్ష విధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రసవత్తరంగా వైవీయూ క్రీడా పోటీలు
కమలాపురం అర్బన్: యోగి వేమన యూనివర్సిటి అంతర్ కళాశాల క్రీడా పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. స్థానిక సీఎసెస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో రెండో రోజు టేబుల్ టెన్నిస్, వాలిబాల్, ఖోఖో, చెస్ పోటీలు నిర్వహించారు. క్రీడా కారులు గెలుపుకోసం హోరాహోరీగా తలపడ్డారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగల్,డబుల్స్ లలో వివిధ కళాశాల జట్లు పాల్గొన్నాయి. వాలిబాల్, ఖోఖో, చెస్ పోటీల్లో క్రీడాకారులు తలపడ్డారు. వైవీయూకు చెందిన స్పోర్ట్స్ బోర్డు సెక్రటరి రామసుబ్బారెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌బాషా ఏర్పాట్లు పర్యవేక్షించారు. విజేతలు విరే : టేబుల్ టెన్నిస్: విన్నర్: పి. వెంకటేశ్వర్లు( ఎస్‌బివిఆర్ డిగ్రీ కాలేజ్ బద్వేల్) రన్నర్ : ఎ. శ్రీ హరి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల రైల్వే కొడూరు ) మహిళల సింగిల్స్ విభాగం విన్నర్ : ఎ. శ్రీలక్ష్మీ ( ఎస్‌కెఆర్ అండ్ఎస్కెఆర్ కడప) రన్నర్: కె. మమత ( సిఎస్ఎస్ఆర్, ఎస్ఆర్ఆర్ఎం, కమలాపురం) డబుల్స్ పురుషుల విభాగం విజేత: బి. మహమ్మద్ రఫి, పి. వెంకటేశ్వర్లు, జె.జీవన్ కుమార్( ఎస్‌బివిఆర్ బద్వేల్) రన్నర్ : ఎస్. సయ్యద్ హుస్సేన్, పెద్ద స్వామి, బాలాజి నాయక్( వైవీయూ) మహిళల డబుల్స్ విభాగం విన్నర్ కె. మమత, ఈశ్వరమ్మ, ఆర్. లక్ష్మీదేవి( సిఎస్ఎస్ఆర్, ఎస్ఆర్ఆర్ఎం, కమలాపురం) రన్నర్: బి. సుబాసిణి,టి. శ్రీవాణి, ఎం. స్వాతి( వైవీయూ) ఖోఖో లో ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు, సిఎస్ఎస్ఆర్, ఎస్ఆర్ఆర్ఎం ,కమలాపురం, వైవియూ కడప, ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు జట్లు ఫైనల్‌కు చేరాయి. వాలీబాల్‌లో జియోన్ కాలేజ్ కడప, ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు జట్లు ఫైనల్లో ప్రవేశించాయి. ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు, వైవియూ కడప, ఎస్ఎల్ఎస్డిసి పుల్లారెడ్డిపేట, సిఎస్ఎస్ఆర్, ఎస్ఆర్ఆర్ఎం, కమలాపురం సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. -
నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య
కమలాపురం: పట్టణంలోని రాం నగర్‌కు చెందిన సేగారి స్నేహ(12) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సేగారి శ్యామల, సోమయ్యకు ఇద్దరు సంతానం. వారిలో స్నేహ తొలి సంతానం. స్థానిక బాలికల హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక బుధవారం స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో తల్లి శ్యామల మందలించింది. గురువారం ఉదయం ఉపాధి పనికి పోతున్న తల్లి.. ‘స్కూల్‌కు వెళ్లే.. లేక పోతే నీ కథ చెబుతా’ అని మందలించింది. తండ్రి సోమయ్య ఆటో వృత్తిపై వెళ్లిపోయాడు. స్నేహ స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అరుస్తుందని భయపడిందో.. ఏమో.. తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టారు. అప్పటికే 80 శాతం కాలిపోయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు. స్నేహ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
ఆందోళనకు దిగిన బిల్ట్ కార్మికులు
కార్మికుడి మృతిపై ఆగ్రహం యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ మంగపేట : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌కు చెందిన కార్మికుడు కాసోజు పరమేశ్వర్రావు మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో పరమేశ్వర్ బుధ వారం రాత్రి మృతి చెందిన విషయం విది తమే. కొంత కాలంగా పరిశ్రమ మూతపడి వేతనాలు రాకపోవడంతో మనోవేదనతో పరమేశ్వర్రావు మృతి చెందాడని కార్మికులు ఆరో పించారు. దీనికి బిల్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్మికులు బూర్గంపాడ్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎర్రవాగు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. బిల్ట్ మూతపడి రెండేళ్లు గడుస్తున్నదని, ఉపాధి కరువై, వేతనాలు లేక వైద్యం చేయిం చుకోలేని పరిస్థితిలో కార్మికులు మృతి చెందుతుంటే యాజమాన్యం పట్టించుకో కపోవడం సరికా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు, వైద్యసేవలు నిలిపివేయడంతో గత 35 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి కాలుష్యం బారినపడి అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికే ఐదుగురు కార్మికులు మృతి చెందారని తెలిపారు. త్వరలోనే వేతనాలు ఇప్పిస్తామని మంత్రుల హామీలు ఇచ్చి నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. పరమేశ్వర్రావు మృతికి బిల్ట్ యాజ మాన్యమే పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుం బా న్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది తో చేరుకుని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్య క్రమంలో వడ్లూరి రాంచందర్, యలమంచిలి శ్రీనివాస్, వంగేటి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
భార్య పట్టించుకోలేదని...
-
భార్య సౌదీ వెళ్తానని అనడంతో...
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో బాబాసాబ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మాట వినకుండా భార్య సౌదీకి వెళ్తానంటూ మొండిపట్టు పట్టడంతో బాబాసాబ్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. దీంతో బుధవారం ఉదయం ఆయన రైలు పట్టాలపై పొడుకున్నాడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి... బాబాసాబ్ను రైలు పట్టాలపై నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పట్టినపట్టు వీడలేదు. ఇంతలో అదే ట్రాక్‌పైకి వచ్చిన రైలును స్థానికులు ఆపివేశారు. దీంతో బాబాసాబ్కు తృటిలో ప్రమాదం తప్పింది. -
వడదెబ్బకు ఇద్దరు మృతి
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఎక్కువవుతోంది. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(45) వ్యవసాయ పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా అంతలోనే మృతిచెందాడు. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన కె. పెద్దలక్ష్మమ్మ(60) వడదెబ్బకు గరై మృతిచెందింది. -
బకెట్లో పడి చిన్నారి మృత్యువాత
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : నీళ్లతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బకెట్లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బోనాల షావలి, కృష్ణవేణి దంపతులకు పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత శ్రావణి(4) పుట్టింది. శనివారం ఉదయం ఆమెకు స్నానం చేయించేందుకు తల్లి బాత్రూంకు తీసుకెళ్లింది. ఇంతలో కిచెన్‌లో పని గుర్తుకురావడంతో చిన్నారిని నీళ్ల బకెట్ వద్ద వదిలి అటుగా వెళ్లింది. బకెట్లో నీళ్లతో ఆడుకుంటూ శ్రావణి అందులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికే శ్రావణి నీళ్లలో ఊపిరాడక మృతి చెంది ఉంది. ఒక్కగానొక్క కూతురి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
కారు ఢీకొని బాలిక మృతి
కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలో కారు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన మంగమ్మ, కారుమంచిలు కూలి పనులకోసం వైఎస్సార్‌జిల్లా కమలాపురం మండలానికి వలస వచ్చారు. వీరి కుమార్తె తేజావతి(8) సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మరణించింది. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కరెంట్ వైర్ తగిలి బాలుడు మృతి
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని అంధుల కాలనీలో విద్యుత్ వైరు తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. అంధుల కాలనీకి చెందిన పెద్ద నర్సింహ కుమారుడు నర్సింగ్(4) శనివారం మధ్యాహ్నం వీధిలో ఆడుకుంటుండగా తెగి పడి ఉన్న విద్యుత్ వైరును పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహకు ఇద్దరు కుమారులు కాగా నర్సింగ్ రెండవ కుమారుడు. -
ప్రతిరైతుకూ బీమా వచ్చే వరకూ పోరాడతాం
ప్రతి రైతుకూ పంట బీమా అందే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. కమలాపురం ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కమలాపురం పరిధిలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన కొంత మంది రైతులకు 2012 సంవత్సరానికి గానూ పంట బీమా అందలేదు. దీంతో రైతులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కలిసి విషయం వివరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకూ పంట బీమా వచ్చేంతవరకూ పోరాడతామన్నారు. వీలైతే హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కంపెనీ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేసి ధర్నా నిర్వహిస్తామన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కమలాపురం (కరీంనగర్) : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెకు తాకి రైతు మృతిచెందాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారు మొగిలి(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పంట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గంట ముందే బడికి తాళం: హెచ్ఎం సస్పెండ్
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సి.రాజుపాలెంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిఈవో ప్రతాప్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే అప్పటికే హెచ్ఎం సహా టీచర్లందరూ పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం 4.45 గంటల వరకూ పాఠశాల తరగతులు నిర్వహించాల్సి ఉండగా గంట ముందే బడికి తాళం వేసి వెళ్లిపోవడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ను సస్పెండ్ చేయాలని ఆర్డేడీకి సిఫార్సు చేశారు. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో చెప్పారు. -
వివాహిత బలవన్మరణం
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : కమలాపురం పట్టణంలోని బైండ్‌కాలనీలో ఆదివారం తెల్లవారుజామున రాములు(25) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో గొడవపడి గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని వివాహిత తరపు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
త్రండీకొడుకుల ఆత్మహత్య
కమలాపురం (వైఎస్సార్‌జిల్లా) : త్రండీకొడుకులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్సార్‌జిల్లా కమలాపురం మండల పరిధిలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. మండలంలోని జంబాపురం గ్రామానికి వెళ్లే దారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దించి చూడగా.. మృతదేహాలు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. దీన్నిబట్టి నాలుగు రోజుల కిందటే ఉరి వేసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. కాగా వారి జేబులో దొరికిన చీటీ ఆధారంగా.. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన తండ్రీకొడుకులు నందికొండ సుబ్బరాయుడు(57), మీరావలి(25)గా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు
కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మండలంలోని గంగవరం గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవటంతో రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. -
కమలాపుర౦ దర్గాను స౦దర్శి౦చిన వైఎస్ జగన్
-
ఎస్బీఐలో మళ్లీ దొంగలు పడ్డారు
సీపీయూలు, ప్రింటర్లు, మానిటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం ఇది మూడో సంఘటన కమలాపురం (మంగపేట) : మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి దొంగలుపడ్డారు. డబ్బులు దోచుకోవడం వీలుకాకపోవడంతో సీపీయూలు, ప్రింటర్లు, మానిటర్లు ఎత్తుకెళ్లారు. ఆదివారం జరిగినట్లు భావిస్తున్న ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. బ్యాంకు అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. శని వారం బ్యాంక్‌కు ఆఫ్ డేతోపాటు ఆదివారం సెలవు ఉండటంతో సోమవారం 9.30 నిమిషాలకు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది తాళాలు తీసిచూడగా దొంగలు పడినట్లు గుర్తిం చారు. దీంతో బ్యాంక్ మేనేజర్ ఆకుల వరప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై ముస్కెం శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి విచారణ చేపట్టారు. దోపిడీకి పాల్పడిందిలా.. బ్యాంకు వెనుక వైపు గల ద్వారానికి ఏర్పాటు చేసిన గేటు ఐరన్ గ్రిల్స్‌కు వేసి ఉన్న తాళాలను యాక్సాస్ బ్లేడుతో కోసి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వెంటనే సీసీ కెమెరాల వైర్లను తొలగించి డబ్బులను దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో చేసేదిలేక బ్యాంకులోని సీపీయూలు, రెండు ప్రింటర్లు, రెండు మాని టర్లను ఎత్తుకెళ్లారు. బిల్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు బ్యాంకులో రూ.కోటికి పైగా ఉన్నాయనే సమాచారంతోనే ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతే గాక చోరీ చేసే ముందు దొంగలు సీసీ కెమెరాల వైర్లు తొలిగించే సమయంలో ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి ఉన్నారని వారు సెల్‌ఫోన్ వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు సీసీ కెమెరాల్లోని పుటేజీ ఆధారంగా దొంగతనం జరిగిన సమయంలో మండలంలోని వివిధ సెల్టవర్ల నుంచి పనిచేసిన సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది మూడోసారి.. ఇదిలా ఉండగా 2003లో బ్యాంకు దోపిడీకి ప్రయత్నించి విఫలమైన దొంగలు కిరోసిన్ పోసి బ్యాంకును దగ్ధం చేసేందుకు యత్నించారు. తిరిగి 2013లో మరోసారి దొంగలు బ్యాంక్ పైకప్పు రేకులను తొలగించి స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. మరోసారి ఇదే బ్యాంకులో చోరీ జరగడంతో బ్యాంక్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పనిచేస్తున్న సిబ్బందిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రం ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్, ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు బ్యాంక్‌ను సందర్శించి పరిశీలించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి త్వరలోనే కేసు ఛేదిస్తామని డీఎస్పీ తెలిపారు. -
కమలాపురం స్టేట్ బ్యాంక్‌లో చోరీ
మండపేట(వరంగల్): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్బీఐలో జరిగింది. వివరాలు.. కమలాపురం గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు సీసీ టీవీ పూటేజిల సహాయంతో గుర్తించారు. ఈ చోరీలో నిందితులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలుకాకపోవడంతో విరమించుకున్నారు. దీంతో, బ్యాంకులోని 3 సీపీయూలు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లను వారు దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకులోని లాకర్లలో రూ.93 లక్షలు ఉన్నట్లు వారు తెలిపారు. సోమవారం బ్యాంకు తెరిచిన సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పూటేజిల అధారంగా ఇద్దరు నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్లు, ఫోన్ నంబర్లు సంభాషణల ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారో గుర్తించి, నిందితులను పట్టుకుంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రకృతి ప్రకోపం..
ఒకవైపు భానుడు భగభగ మండుతుండగా.. మరో వైపు ప్రకృతి విలయతాండవం చేసింది. వేలాది ఎకరాల్లోని ఉద్యానపంటలు నేలమట్టమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, టవర్లు, నేలకొరిగాయి. బలంగా వీచిన ఈదురుగాలులతో అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతగిలింది. అధికారులు నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాలని రైతులు కన్నీటితో వేడుకుంటున్నారు. కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలోని కమలాపురం మండలం నసంతపురం, లేటపల్లె, జంగంపల్లె, పొడదుర్తి, వై.కొత్తపల్లె గ్రామాల్లోనూ, మైదుకూరు మండలంలోని వనిపెంట, విశ్వనాథపురం, బ్రహ్మంగారిమఠం మండలంలోని బి.మఠం, మల్లేపల్లె, బి.కోడూరు మండలంలోని మున్నెల్లి, కడప నగర పరిధిలోని కడప, పాతకడప, మోడమీదపల్లె, దళితవాడలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి భారీ నష్టం సంభవించింది. మోడమీదపల్లె దళితవాడలోని పెంకుటిల్లు, సిమెంట్ రేకుల ఇళ్లు గాలి దుమారానికి లేచిపోయి కొంతమంది ప్రజలకు గాయాలయ్యాయి. మైదుకూరు మండలంలోని విశ్వనాథపురంలో చెట్టు విరిగిపడి మూడు బర్రెలు మృతిచెందాయి. అలాగే రెండు ఎకరాల్లోని బొప్పాయి తోట నేలమట్టమైంది. బి.మఠం మండలంలోని పలు గ్రామాల్లో మిరపతోటలు దెబ్బతిన్నాయి. కమలాపురం మండలంలోని నసంతపురంలో 40 ఎకరాల్లో ఆకుతోటలు నేలమయ్యాయి. అదేవిధంగా కడప నగర సమీపంలోని పాతకడప వద్ద సాగులో ఉన్న కౌలు రైతు నరసింహులు ఆకుతోట రెండు ఎకరాల్లో, మిరప రెండు ఎకరాల్లో నేలవాలింది. పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు, నాగాయపల్లె, నందిమండలం, చీమలపెంట, కొత్త గంగిరెడ్డిపల్లె గ్రామాల్లో అరటి, మామిడి పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో ఉద్యాన తోటలకు దాదాపు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం : జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు గాలికి క్రింద పడిపోయాయి. పాతకడప వద్ద పొలాల్లో ఎక్కడ చూసినా విరిగిపడిన విద్యుత్ స్తంభాలే దర్శనమిస్తున్నాయి. భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలపై పడడంతో మోయలేని భారాన్ని తట్టుకోలేక విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కూడా దెబ్బతిన్నాయి. జిల్లాలో మొత్తం 20 సబ్స్టేషన్ల నుంచి సరఫరా ఆగిపోయినట్లు దక్షిణ మండల విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ తెలిపారు. అలాగే జిల్లాలో 114 పల్లెలకు కరెంటు సరఫరా దెబ్బతిందని తెలిపారు. ఇదే సందర్భంలో యుద్ద ప్రాతిపదికన 103 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించామన్నారు. 33కెవి ట్రాన్స్ఫార్మర్లు 17, 11 కెవి ట్రాన్స్ఫార్మర్లు 107 దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికల్లా సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. -
'రాయచోటి ప్రజల రుణం తీర్చుకుంటా'
రాయచోటి : ఎంతో నమ్మకంతో తనను గెలిపించిన రాయచోటి ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి కోసం రాయచోటి ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు శక్తిమేరా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలకు రవీంద్రనాథ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ సీపీ రేయింబవళ్లు కృషి చేస్తుందని చెప్పారు. -
కమలాపురంలో కాంగ్రెస్‌కు షాక్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కమలాపురం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని కుమారులుతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
వైఎస్సార్సీపీలోకి వీరాశివారెడ్డి సోదరుడి కుమారులు
-
ఔరా..!
ఔరా..! ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తూ ప్రతి రోజు దొడ్డి దారిన లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్న కమలాపురం టీడీపీ ఇన్చార్జ్ పుత్తా సోదరునికి అధికారులు చెక్ పెట్టారు. ఆ మేరకు నాలుగు లారీలు, ఇటాచీని సీజ్ చేసి వల్లూరు పోలీసులకు అప్పగించారు. వల్లూరు మండలం జంగంపల్లె సమీపంలో పుత్తా నరసింహారెడ్డికి వ్యవసాయ భూములు వున్నాయి. ఈ భూములు పాపాఘ్ని ఒడ్డున ఉండటంతో ప్రకృతి సంపదను దోచుకునేందుకు వరంగా మారింది. ఆవే భూముల నుంచి పాపాఘ్ని నదిలోకి అక్రమంగా దారి ఏర్పాటు చేశారు. లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడేవారు. పాపాఘ్నికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినా అక్రమ రవాణాను ఆపలేదు. ట్రాక్టర్లలోకి ఇసుకను లోడు చేయించి డబ్బులు వసూలు చేయడాన్ని పుత్తా నరసింహారెడ్డి సోదరుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆరంభించారు. యంత్రాల ద్వారా లారీలకు ఇసుకను లోడ్ చేయించి ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేవారు. పుత్తా రాజకీయ పలుకుబడిచూసి అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆదివారం రాత్రి ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులకు టార్పాలిన్ పట్టలను కప్పుకుని వెళుతున్న లారీలు అనుమానాన్ని పెంచాయి. తనిఖీలు నిర్వహించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇసుక ఎక్కడి నుంచి రవాణా అవుతోందని ఆరా తీశారు. డబ్బులు చెల్లించి జంగంపల్లె సమీపంలో పాపాఘ్ని నదినుంచి తీసుకుని వస్తున్నట్లు లారీ సిబ్బంది తెలిపారు. దీంతో విజిలెన్స్ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ శాఖ సీఐలు, రాయల్టీ అధికారులు సోమవారం ఉదయం అక్రమంగా వెలిసిన ఇసుక క్వారీపై దాడులు నిర్వహించారు. నాలుగు లారీలు, ఒక హిటాచీని సీజ్ చేశారు. అనంతరం వాటిని వల్లూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను ఏమేరకు తరలించారు, ఎంతకాలం నుంచి అక్రమరవాణాకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఆదాయానికి ఏమేరకు గండి పడింది అన్న విషయాలపై లెక్క గట్టాల్సిందిగా మైనింగ్ అధికారులను విజిలెన్సు యంత్రాంగం ఆదేశించింది. దీంతో గడువు కావాలని మైనింగ్ అధికారులు కోరినట్లు సమాచారం. వెంటనే కేసు నమోదు చేయకపోవడంపై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నివేదికలను సకాలంలో సక్రమంగా అందించకుండా కాలయాపన చేసేందుకే మైనింగ్ అధికారులు గడువు కోరినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఆలయంలో దొంగలుపడ్డారు!
కమలాపురం, న్యూస్‌లైన్: కమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. ఆలయంలోని గర్భగుడి తలుపులు పగులగొట్టిన దుండగులు అమ్మవారి వెండి విగ్రహం, ముఖావళి, వినాయకుని విగ్రహం, మూడు గ్రాముల బంగారుతో తయారు చేసిన అమ్మవారి బొట్టును ఎత్తుకెళ్లారు. గర్భగుడి వెనుకనున్న బీరువాను ధ్వంసం చేసి అందులోని వెండి చెంబు, కలశం, శఠగోపం, హారతిపళ్లాలు, గిన్నె తదితర వాటిని దొంగలు అపహరించారు. మంగళవారం ఉదయమే కసువు ఊడ్చేందుకు వచ్చిన పని మనిషి అక్కడి దృశ్యాలను గమనించి వెంటనే విషయాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కామిశెట్టి వెంకట రమణయ్యకు తెలిపింది. ఆయన కమిటీ సభ్యులతో కలసి ఆలయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 6.8 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వాటి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ లక్ష్మినారాయణ తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీంను రప్పించారు. వారు కాలి వేలిముద్రలను సేకరించారు. సాయంత్రం ఎర్రగుంట్ల సీఐ రామకృష్ణుడు ఆలయాన్ని సందర్శించారు. చోరీపై ఆరా తీశారు. -
బాబు లేఖ ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు: మైసురా
-
కమలాపురంలో వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం
-
కమలాపురం పీఠాధిపతి కన్నుమూత
కమలాపురంలోని హజరత్ అబ్దుల్ గప్ఫార్ షా ఖాద్రి దర్గా పీఠాధిపతి హజ రత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి(69) కన్నుమూశారు. కొంతకాలంగా మల్టీపుల్ ఆర్గాన్స ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు గురువారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస వది లారు. హైపర్ టెన్షన్, న్యూమోనియో, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 14న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో చికిత్సలు అందించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పీఠాధిపతి లోకం నుంచి నిష్ర్కమించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ర్ట నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ఆయన శిష్యులు విషాద వదనంతో ఉండిపోయారు. ఇప్పటికే ఆయన శిష్యులు ఒక్కొక్కరుగా దర్గా చేరుకుంటున్నారు. మహిమలతో పెరిగిన శిష్యరికం పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి తన దివ్య మహిమలతో రాష్ట్రం నలుమూలలే గాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో శిష్యగణాన్ని ఏర్పరచుకున్నారు. తన తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఖిలాఫత్ చేయడం ప్రారంభించారు. పదహారో ఏట తండ్రి మరణంతో 1960 నుంచి ఇప్పటి వరకు ఆయన దర్గాకు పీఠాధిపతిగా కొనసాగారు. ఏటా ఏప్రిల్‌లో ఆయన ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలను నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. భౌతికకాయాన్ని సందర్శించిన వైఎస్ జగన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రీ భౌతికకాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి అంత్యక్రియలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం నిర్వహించనున్నట్లు స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. భక్తులు, శిష్యులు హాజరు కావాలని వారు కోరారు. స్వామి ఆశీస్సుల కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఇక్కడి దర్గా పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి వద్దకు వచ్చి ఆశీర్వాదం పొందేవారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియకు ముందు అభ్యర్థులు స్వామి ఆశీర్వాదం పొందిన తర్వాతనే తమ పనులు మొదలుపెట్టేవారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ పీఠాధిపతి ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. చిన్న పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా తల్లిదండ్రులు వెంటనే ఇక్కడికి వచ్చి స్వామి వారు ఇచ్చే తాయొత్తులను కట్టించుకునేవారు. ఇప్పుడు ఆ స్వామి లేరని తెలసి భక్తులు కన్నీరుమున్నీరయ్యారు. దర్గా ప్రాంగాణానికి చేరుకుని గురువుతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.