కమలాపురం:స్థానిక గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న జోన్–4 థర్డ్ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో అండర్–19 విభాగంలో కమలాపురం కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జిల్లా సత్యవీడు జట్టుతో తలపడిన కమలాపురం జట్టు విజయం సాధించింది. అలాగే వాలీబాల్‌లో బి.కోట, త్రోబాల్‌లో రాజుపాళెం, ఖోఖోలో చిత్తూరు, క్యారమ్స్‌లో రాయచోటి, చెస్‌లో అడపూరు జట్లు విజేతలుగా నిలిచాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 100మీటర్ల పరుగు పందెంలో కవిత (పుత్తూరు), 200మీటర్లలో పద్మావతి (కుప్పం), 400మీటర్లలో సోనియా (పీలేరు), 800మీటర్లలో హేమవతి (పీలేరు), 1500మీటర్లలో లూర్దు (కమలాపురం), 3000మీటర్లలో హేమవతి(పీలేరు), లాంగ్ జంప్‌లో పద్మావతి(కుప్పం), హైజంప్‌లో కవిత(పుత్తూరు), ట్రిపుల్ జంప్‌లో బి.కోట, డిస్కస్ త్రోలో గాయత్రి(బి.కోట), షాట్‌పుట్‌లో గాయత్రి(బి.కోట), జావెలిన్ త్రోలో (బి.కోట), 4“100రిలేలో కమలాపురం, 4“400లో చిత్తూరు జట్టు విన్నర్స్‌గా నిలిచారు.
అండర్–17 విభాగంలో:
అండర్–17 విభాగంలో వాలీబాల్ విన్నర్స్ బి.కోట, త్రోబాల్‌లో రాయచోటి, కబడ్డీలో రాయచోటి, ఖోకోలో చిత్తూరు, క్యారమ్స్‌లో తొండూరు, చెస్‌లో కమలాపురం జట్లు విన్నర్స్‌గా నిలిచాయి. 100, 200 మీటర్లలో శిరీష(తొండూరు), 400, 800 మీటర్లలో షాలిని(చిత్తూరు), 1500మీటర్లలో దివ్య(మదనపల్లె), 3000మీటర్లలో మీన(తొండూరు), లాంగ్ జంప్ శిరీష(తొండూరు), హైజంప్ లీలీవతి(రాయచోటి), ట్రిపల్ జంప్‌లో ప్రీతి(మదనపల్లె), డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో పద్మిని(బి.కోట), జావెలిన్ త్రోలో కావేరి(బి.కోట), 4“100రిలేలో చిత్తూరు, 4“400లో తొండూరు జట్లు విన్నర్స్‌గా నిలిచారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు.
కబడ్డీ విజేత కమలాపురం జట్టు
Published Fri, Oct 28 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
Advertisement
Advertisement