తమను ఎవరూ వెతకవద్దని లేఖ
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్ రహమాన్, హుజూర్‌నగర్‌కు చెందిన ముజీబ్, జాన్ పహాడ్‌కు చెందిన తౌఫిక్ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్‌చార్జ్ ప్రిన్సిప ల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.
వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు.
అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీని వాస్ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment