Gurukula school
-
తెలంగాణలో గురితప్పిన గురుకులాలు
-
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది
తిమ్మాపూర్: ‘వారం రోజులుగా హాస్టళ్లలో అన్నం నాసిరకంగా ఉంటోంది. ముద్దలు ముద్దలుగా ఉండటంతో పాటు వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. ఆకలవుతోందని తింటే కడుపునొస్తోంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. హాస్టల్ అధికారులు విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు. మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు.వారంరోజులుగా కడుపునిండా తిండిలేక నీరసించిపోతున్నాం’అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. బియ్యంలో కల్తీ లేదు: ప్రిన్సిపాల్ రామకృష్ణ కాలనీలోని జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచే గురుకుల భోజనం చార్జీలను ప్రభుత్వం 40 శాతం పెంచింది. తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయినా అధికారులు మెనూ మార్చకపోగా, నాసిరకంగా అన్నం పెట్టడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు మాంసాహారం పెట్టాల్సి ఉండగా సరిగ్గా పెట్టడం లేదని, కోడిగుడ్లు వారానికి రెండు మూడే ఇస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థులు మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ భోజనం ఎలా తినాలని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాగే పెడుతున్నారా అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ అధికారులు నాసిరకం బియ్యం పంపుతున్నారని, దాంతో మెత్తగా అవుతోందని, బియ్యంలో ఎలాంటి కల్తీ లేదని, కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గురుకులంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా వాటి పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
గుడివాడ గురుకుల పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన ప్రిన్సిపాల్
-
ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్ రహమాన్, హుజూర్‌నగర్‌కు చెందిన ముజీబ్, జాన్ పహాడ్‌కు చెందిన తౌఫిక్ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్చార్జ్ ప్రిన్సిప ల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీని వాస్ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
కొలిక్కిరాని గురుకుల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎటూ తేలకపోతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అత్యధికంగా రెగ్యులర్ టీచర్లున్న ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో టీచర్ పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తూనే.. సమాంతరంగా బదిలీలనూ చేపట్టారు. కానీ కొన్ని గురుకుల పాఠశాలల్లో శాంక్షన్డ్ పోస్టులు, వర్కింగ్ కేటగిరీ సరితూగక పోవడంతో సొసైటీ అధికారులు.. పాఠశాలల వారీగా పోస్టుల మంజూరు లెక్కలను పరిశీలించారు.ఈ సొసైటీ పరిధిలో జీఓ 317 కింద చేసిన కేటాయింపులు కూడా పొంతన లేకుండా ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను డిస్లొకేట్ చేస్తూ కొత్త చోట్ల నియమించారు. ఆ ఉద్యోగులు, బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. అప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ చాలావరకు పూర్తయినా.. కోర్టు స్టే నేపథ్యంలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ఉద్యోగులంతా పాతస్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత నిషేధం అమలవుతుంది. ఆలోపు పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయా? లేదా? అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పరిధిలో.. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో కేటాయింపులపై ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైనార్టీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల సంఖ్య తక్కువే. అన్నీ కొత్త గురుకులాలు కావడం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులంతా కొత్తవారే కావడంతో సులువుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని భావించారు. కానీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం, నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.బదిలీల ప్రక్రియలో తప్పులు కూడా ఇబ్బందిగా మారా యి. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి రెండు పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ అదే సబ్జెక్ట్ వారు ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరికి ఎంచుకున్న ఆప్షన్‌కు బదులు ఇతర చోట పోస్టింగ్ ఇవ్వడం వంటివీ చోటు చేసుకున్నాయి. -
మేము అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండాలి
మోతె: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన గురుకుల పాఠశాలల విద్యార్థుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అస్మిత ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని స్వగ్రామం మోతె మండలంలోని బుర్కచర్లలో కుటుంబ సభ్యులను కవిత మంగళవారం పరామర్శించారు. అస్మితకు నివాళులర్పించి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి చేతులెత్తి జోడించారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని కవిత కోరారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం చొరవ చూపి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఉన్నారు. -
విద్యార్థినుల ఆత్మహత్యల కలకలం!
సూర్యాపేట రూరల్: సూర్యాపేట జిల్లా ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమాలకు తావిస్తోంది. ఇదే పాఠశాలలో ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ఈ నెల 10న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీని సస్పెండ్ చేశారు. సెలవులు ఇవ్వడంతో.. వైష్ణవి ఉదంతం మరువకముందే తాజాగా ఇదే పా ఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతిల కుమార్తె అస్మిత (15) శనివారం హైదరాబాద్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వైష్ణవి ఆత్మహత్య అనంతరం విద్యార్థినులు భయపడకుండా ఉంటానికి పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత సెలవుల్లో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్న తల్లి వద్దకు వెళ్లింది. శనివారంతో సెలవులు అయిపోతున్నందున తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి.. తల్లి తన పనులకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుందని బంధువులు తెలిపారు. పాఠశాలకు తిరిగి వెళ్లాల్సిన రోజే అస్మిత ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అస్మిత, వైష్ణవి రూమ్మేట్స్? గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థినులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి రూమ్‌లోనే అస్మిత కూడా ఉండేదని తెలిసింది. ఒకే రూమ్‌లో ఉండటంతో వైష్ణవి మరణాన్ని జీ ర్ణించుకోలేక అస్మిత కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు చెపుతున్నారు. వారం వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ఆత్మహత్యలకు పాల్పడటం వారి కుటుంబాలు, తోటి విద్యార్థినుల్లో విషాదాన్ని నింపింది. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం బుర్కచర్ల తీసుకువచ్చి ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇమాంపేట గురుకుల పాఠశాల తనిఖీ ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం సోషల్ వెల్ఫేర్ గు రుకుల కార్యదర్శి సీతాలక్ష్మి తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, బాలికల విశ్రాంతి గదులను పరిశీలించారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు బాలికల ఆత్మహత్యల నేపథ్యంలో విద్యార్థినుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించాలని, పిల్లలతో మమేకమై వారిని ఆటపాటలతో ఆనందింపజేయా లని సూచించారు. గురుకులాల్లో మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సైకియాట్రిస్టులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆమె వెంట గురుకుల జాయింట్ సెక్రటరీ అనంతలక్షి్మ, నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ ప్రశాంతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ అరుణకుమారి ఉన్నారు. ఉన్నతాధికారుల ఆరా.. ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏమి టి? తదితర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సోమవారం గురుకుల పాఠశాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు వెళ్లి విచార ణ జరపనున్నట్లు సమాచారం. ఈ తరహా ఘటనల వల్ల పాఠశాలలో విద్యనభ్యసించే ఇతర విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్‌కుమార్‌కు వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
పేదజనం కల నెరవేర్చిన జగనన్న ప్రభుత్వం
-
ఉపాధ్యాయుని సమయస్పూర్తితో దక్కిన 40 మంది పిల్లల ప్రాణాలు
-
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకులంలో బాలికకు పాముకాటు
-
అన్నంలో పురుగులు, వానపాములు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్‌మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్‌మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్‌మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ప్రిన్సిపాల్, వాచ్‌మన్‌పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్‌తో పాటు వాచ్‌మన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ రాసలీలలు.. వీడియో బహిర్గతం కావడంతో..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): మైనార్జీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఆనంద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ పీఆర్‌ఈఐ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నర్సింహరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ పాఠశాలలోనే రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలు బహిర్గతం కావటంతో, ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సున్నితమైన అంశమైనందున విషయం తెలిసన వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సంస్థ గుంటూరు సెక్రటరీ, జిల్లా కన్వీనర్ అదేవిధంగా మచిలీపట్నం డెప్యూటీ డీఈవో సుబ్బారావుతో కూడిన త్రీమెన్ కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ పాఠశాలలోని తన చాంబర్లో ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలుసాగిస్తున్నట్లు విషయం వాస్తవమే అని తేలింది. దీంతో దీన్ని తీవ్రంగా పరిగణించి, అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని ముసునూరు బాలుర మైనార్టీ పాఠశాలలో పీజీటీ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న పి.సాంబశివరావును మచిలీపట్నం గురుకుల పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నియమించారు. కాగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా నేడో, రేపో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి నివేదిక మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనని త్రీమెన్ కమిటీ సభ్యుడు, మచిలీపట్నం డెప్యూటీ డీఈవో యూవీ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ రిమాండ్‌కు తరలింపు... కోనేరుసెంటర్: మైనారిటీ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌తో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయిన ప్రిన్సిపాల్ ఆనందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో కామకలాపాలు సాగిస్తూ విద్యార్థులకు సెల్‌ఫోన్ లో అడ్డంగా దొరికిపోయిన ఆనందకుమార్ ఆ వీడియో తీసిన విద్యార్థులను చితకబాదిన విషయం పాఠకులకు విధితమే. ప్రిన్సిపాల్ చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న విద్యార్థి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న షకీలా ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ తనను ఆయన కార్యాలయంలోకి పిలిచి బలవంతంగా లోబరచుకునేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. అటు విద్యార్థి ఇటు కంప్యూటర్ ఆపరేటర్ షకీలా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి ఆనంద్ కుమార్‌ను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. చదవండి: ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్ -
ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడవ జాతీయ క్రీడల ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే స్పష్టంచేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఈ క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు జరగనున్న క్రీడల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఫుట్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్ కోర్టులను పరిశీలించిన కాంతిలాల్ దండే అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఫాదర్ జీఏపీ కిశోర్, సీనియర్ అథ్లెటిక్ కోచ్ వినాయక్ ప్రసాద్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, గిరిజన సంక్షేమ, శాప్ అధికారులు ఉన్నారు. (చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్) -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
అధికారి కాలర్ పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే
గద్వాల రూరల్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా కాలర్ పట్టి బూతులు తిట్టిన ఘటన మంగళవారం గద్వాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాలలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ ఆ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకొని కోపంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై చిందులు తొక్కారు. ప్రొటోకాల్ ప్రకారం గురుకుల పాఠశాలలకు తాను చైర్మన్‌కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌తో దానిని ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ్‌రెడ్డి సర్దిచెప్పబోగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని బలంగా వెనక్కి నెట్టేశారు. పత్రికలో రాయలేని విధంగా బూతులు తిడుతూ ఊగిపోయారు. దీంతో పక్కనే ఉన్న మహిళా అధికారులు, నాయకులు బిత్తరపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు అధికారి వెంగళ్‌రెడ్డిని పక్కకు తీసుకుపోయారు. ప్రజాప్రతినిధి దాదాగిరికి పాల్పడటంపట్ల అధికార, ఉద్యోగవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్న గ్రూపుల మధ్య నలుగుతున్న అధికారులు తాజా ఘటనతో బెంబేలెత్తుతున్నారు. వారిలో భయాందోళన వ్యక్తమవుతోంది. -
‘నేను ఇక ఇంటికి రాను.. సన్యాసం స్వీకరిస్తా.. అనుమతివ్వండి’
సాక్షి, మహబూబ్‌నగర్: చక్కటి విద్య, క్రమశిక్షణ అలవడుతుందని రూ.లక్షలు ఫీజు చెల్లించి ఓ గురుకుల విద్యాలయంలో తమ కుమారుడిని చేర్పిస్తే.. ఆధ్యాత్మిక చింతను ఎక్కువగా అలవరిచి చివరికి కన్నవారికే దూరం చేశారని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. జడ్చర్లలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న సింహ్మయ్య, పారిజాత దంపతులకు మణిదీప్(18) ఒక్కగానొక్క కుమారుడు. భారతీయ సంస్కృతి, క్రమశిక్షణ, మంచి విద్య అలవర్చాలన్న ఉద్దేశంతో జడ్చర్ల శివారులోని ఓ గురుకుల విద్యాలయంలో 6వ తరగతిలో జాయిన్ చేశారు. పదో తరగతి వరకు అదే గురుకులలో చదివిన మణిదీప్ ఇంటర్ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తిచేశాడు. గతంలో ఒకసారి.. అయితే 3 నెలల కిందట మణిదీప్ అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణిదీప్ తాను విద్యనభ్యసించిన గురుకుల అనుబంధ విద్యాలయం బెంగుళూర్లో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన మణిదీప్ ఇక తాను ఇంటికి రానని, సన్యాసం స్వీకరిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అప్పట్లో అక్కడి స్వామీజిలు నచ్చజెప్పి ఇంటికి పంపారు. వారం రోజులు ఇంటి దగ్గర ఉండి రెండు నెలల కిందట మళ్లీ కనిపించకుండాపోయాడు. చదవండి: మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడి నుంచి ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడిన మణిదీప్ తాను సన్యాసం స్వీకరించేందుకు అనుమతి పత్రం ఇవ్వాలని లేకుంటే తాను ఇంటికి రానని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక గురుకుల నిర్వాహకులను సంప్రదించి తమ కుమారుడిని అప్పగించాలని కోరారు. ప్రస్తుతానికి అంగీకార పత్రం ఇవ్వాలని, ఆ తర్వాత మణిదీప్ని ఇంటికి తిరిగి తీసుకువస్తామని గురుకుల నిర్వాహకులు చెప్పడంతో సన్యాస స్వీకరణకు సమ్మతిస్తూ లెటర్ ఇచ్చారు. తర్వాత తమ కుమారుడు ఈ నెల 5న బెంగుళూరు నుంచి బయలుదేరినట్లు అక్కడి స్వామీజీలు చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్నారు. మణిదీప్ విషయమై స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు గురుకుల నిర్వాహకులతో సోమవారం ఆందోళనకు దిగారు. మణిదీప్‌ను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
సీసీ కెమెరాను తాకాడని..
నందిపేట్ (ఆర్మూర్): సీసీ కెమెరాను పట్టుకున్నాడని విద్యార్థిని ఉపాధ్యాయులు విచక్షణా రహితంగా కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో జరిగింది. మండలంలోని జీజీ నడుకుడా గ్రామానికి చెందిన రుషేంద్ర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పాఠశాలలో ఆడుకుంటూ సీసీ కెమెరాని ముట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయులు శంకర్, నరేశ్ విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రుషేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. మరుసటిరోజు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థిని గురుకులం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చెవి కర్ణభేరి దెబ్బతిన్నదని, వినికిడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాలలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గురుకుల ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విచారించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్, గణితం ఉపాధ్యాయుడు శంకర్‌ను విధుల నుంచి తొలగించామని, మరో ఉపాధ్యాయుడైన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. దీంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన విరమించారు. -
వచ్చేనెల నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా వచ్చేనెల 15వ తేదీన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్టున్నట్లు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం హాలియాలో, అలాగే దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని వివరించారు. ఆత్మగౌరవ భవనాలకు 8న అనుమతి పత్రాలు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ బాధ్యతలను ఏక సంఘంగా ఏర్పడిన కుల సంఘాలకు అప్పగిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్మాణ అనుమతులు పొందాయన్నారు. ఇలా ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న అనుమతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనుండటంతో.. ప్రస్తుతం ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా మరో 50 స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం వండిన పప్పు మిగలడంతో శుక్రవారం ఉదయం వేడిచేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు తాగించారు. కాగా నిత్యం అన్నం పలుకుగానే ఉంటుందని, సరిగా ఉడకడం లేదని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని.. రోజూ అన్నం, పప్పు, సాంబారునే వడ్డించడంతో తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులం వార్డెన్ ఎల్లంను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వండిన పప్పు ఉదయం బాగుందని చెబితేనే వడ్డించామన్నారు. విద్యార్థుల్లో కొందరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్‌సింగ్ గురుకులాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పారదర్శకతకు పాతరేస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మధ్యవర్తుల వసూళ్ల పర్వంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమబద్ధీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొందరు మధ్యవర్తులు వసూళ్లకు తెగబడుతున్న తీరుపై గతనెల 24న ‘కొలువుల క్రమబద్ధీకరణలో కలెక్షన్ కింగ్‌లు’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది గురుకుల సొసైటీ వర్గాల్లోనే కాకుండా, సచివాలయంలోని కొన్ని విభాగాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మధ్యవర్తుల ప్రమేయం, వసూళ్ల తంతు ఏమిటంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తీగ లాగి.. హెచ్చరికలు చేసి.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు ఆరువందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. అందులో 550 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులుగా సొసైటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను కొందరు సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగి రకరకాల అపోహలు సృష్టించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారి కొలువే క్రమబద్ధీకరిస్తారని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు మధ్యవర్తులు అడిగినంత మేర ఇచ్చినట్లు తెలిసింది. ఇలా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేశారని సమాచారం. దీనిపై టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ రంగంలోకి దిగి తీగ లాగినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి విచారణ జరిపారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ, వారం క్రితం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మధ్యవర్తులు వసూళ్లు చేసిన తీరును, ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారని ఆరా తీసినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు, కార్యదర్శి మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వసూళ్ల తీరును తెలుసుకున్న తర్వాత ఆయన పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కళంకం రాకుండా, వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటిదాకా సొసైటీ ఉద్యోగుల ఫైలు కదలదని హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
CM YS Jagan: ఆర్ట్ టీచర్ అద్భుత చిత్రం
కొనకనమిట్ల (ప్రకాశం): ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మువ్వన్నెలు రెపరెపలాడే తరుణంలో వచ్చిన ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాకుసెల్యూట్ చేస్తున్నట్లు చిత్రాన్ని వేశారు. కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న కొమ్ము ప్రసాద్.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఆర్ట్స్ రూపంలో అద్భుతంగా వేయడాన్ని స్థానికులు అభినందించారు. (చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 20న మెగా జాబ్‌మేళా) -
నల్గొండ జిల్లా: 29 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్
-
‘ఇంద్రేశం’లో 25 మంది విద్యార్థినులకు కరోనా
పటాన్‌చెరుటౌన్/జూలూరుపాడు: విద్యాలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. ఒక్క సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం 966 విద్యార్థినులకు గాను అనుమానం ఉన్న 300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. కోవిడ్ సోకిన బాలికలను ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచారు. ఇదే జిల్లా ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం మరో ఆరుగురు విద్యార్థినులు కరోనా బారిపడ్డారు. ఇటీవల ఈ విద్యాసంస్థలో 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. గురువారం అనుమానం ఉన్న మరో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్కూల్లో మిగిలిన మొత్తం 426 మంది విద్యార్థులు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. జూలూరుపాడులో ముగ్గురు విద్యార్థినులకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం/కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఆరుగురు రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో గత బాధపడుతుండగా స్థానిక పీహెచ్సీలో వీరిద్దరికీ పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం కేజీబీవీలోని మొత్తం విద్యార్థినులకు పరీక్షలు చేయించగా, మరొకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
మరో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయం కరోనా కలకలం నుంచి తేరుకోక ముందే మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన ముగ్గురిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 48 మంది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిన విద్యార్థినుల్లో మంగళవారం 25 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థ తకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాలని డాక్టర్లు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఓ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు చెప్పారు. కరోనా సోకిన విద్యార్థినుల ఇంటిబాట కరోనా బారిన పడిన విద్యార్థినులను గురుకులంలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే 47 మంది విద్యార్థినుల్లో కొందరిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. -
48 మందికి కరోనా పాజిటివ్
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్ చదివే 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. వీరందరినీ గురుకులంలోని ‘ఎ’బ్లాక్‌లో ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి అందులో ఉంచారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి గురుకులంలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు శనివారం ఆమెను తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ తేలింది. దీంతో వారు గురుకుల టీచర్లకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో 470 మంది విద్యార్థినులు ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థినులు, సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరిపించారు. పరీక్షల్లో 37 మంది పదో తరగతి విద్యార్థినులు, ఐదుగురు ఇంటర్ విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు మొత్తం 43 మందికి పాజిటివ్ తేలింది. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, ఆర్డీఓ నాగేష్, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ గురుకులాన్ని సందర్శించి కోవిడ్ బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోమవారం మిగిలిన 209 మంది విద్యార్థినులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా, మరో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది. -
నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే
సంస్థాన్‌నారాయణపురం: ‘నా ఎదుగుదలకు సర్వేల్ గురుకులం చదువే కారణం.. నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు మంగళవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సర్వేల్ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు. -
వైరా గురుకులంలో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థులకు కరోనా
సాక్షి, ఖమ్మం: వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని టీఎస్ గురుకుల బాలికల పాఠశాలలో రెండ్రోజుల వ్యవధిలో 29 మంది విద్యార్థినులు కోవిడ్ బారినపడ్డారు. మొదట గత నెల 30న 8వ తరగతి విద్యార్థిని శుభకార్యం నిమిత్తం ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 15న దగ్గు, జలుబుతో బాధపడుతూనే పాఠశాలకు వచ్చింది. కరోనా పరీక్ష చేయించుకుని రావాలని ప్రిన్సిపాల్ బాలికను ఇంటికి పంపించారు. అక్కడ పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆమె పక్కన కూర్చునే మరో విద్యార్థినికి సైతం లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు బాలికకు వైరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణైంది. చదవండి: టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్.. దీంతో వైరా ఆస్పత్రి వైద్యురాలు సుచరిత ఆధ్వర్యంలో శనివారం గురుకుల పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు చేయగా 13 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరినీ ఇంటికి పంపించారు. ఆదివారం మళ్లీ పరీక్షలు చేయగా మరో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. జిల్లా అధికారులకు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో పాఠశాలను శానిటైజ్ చేయించారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజేశ్ పాఠశాలను పరిశీలించారు. మరో 15 మంది బాలికలకు అనుమానిత లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి శాంపిల్స్‌ను ఖమ్మం పంపారు. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. -
గురుకులాల్లో ‘పాఠశాల ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే దిశగా సంక్షేమశాఖలు నడుంబిగించాయి. చెట్లు నాటడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు వచ్చే శనివారం నుంచి కార్యాచరణ మొదలుపెట్టనున్నాయి. ఇందులో భాగంగా ‘పాఠశాల ప్రగతి’పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ముందుగా మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రతి శనివారం ‘పాఠశాల ప్రగతి’పేరిట కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రతి విద్యార్థికి ్రప్రకృతిపట్ల అవగాహన, వనరుల ఆవశ్యకతపై చైతన్యాన్ని కలిగిస్తారు. చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, పారిశుధ్యం, వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపడతారు. ప్రతి విద్యార్థికి సామాజిక స్పృహపట్ల విశ్వాసాన్ని కల్పిస్తారు. దీనికిగాను ప్రత్యేకంగా ఓ ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించాలని మంత్రి ఈశ్వర్ సొసైటీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్సీ గురుకుల సొసైటీలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందన
-
ఇదే కృషితో ఐఏఎస్ కొట్టాలి
ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న చోట రోజు వారీ సమావేశాల్లో ఐఏఎస్ అధికారులు కూర్చుంటారు. వారితో కలిసి వివిధ రంగాల్లో స్థితిగతులు, రాష్ట్రంలో పరిస్థితి, వివిధ పథకాల అమలుపై సమీక్షలు చేస్తాం. ఇప్పుడు ఏ స్ఫూర్తితో అయితే మీరు కష్టపడి ఐఐటీల్లో చేరడానికి మంచి ర్యాంకులు సాధించారో.. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో, కష్టపడి ఐఏఎస్ అధికారులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. అప్పుడు మీరూ ఇదే స్థానాల్లో కూర్చుని పరిపాలనలో భాగస్వాములు కావచ్చు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ప్రతిష్టాత్మక ఐఐటీ ఇతర ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తే కచ్చితంగా ఐఏఎస్ స్థానాల్లో కూర్చుంటారని విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్ధులు మంగళవారం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. విద్యార్థుల నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని మరింత రాణించాలని ప్రోత్సహించారు. స్ఫూర్తి రగిలించే కథలు ఇక్కడే.. విద్యారంగంపై ప్రభుత్వాలు చూపే శ్రద్ధ, ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యారంగాన్ని సంస్కరిస్తూ అమ్మఒడి, నాడు–నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. ‘మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, సునీత మాట్లాడారు. వారు కూడా మీలాంటి వారే. ఐఏఎస్ అధికారులయ్యారు. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానే కాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. మీరు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నారు. తొలి అడుగు వేసినట్లే భావించండి’ అని విద్యార్థులనుద్దేశించి సీఎం పేర్కొన్నారు. దేవుడి దయతో కష్టపడి చదువుతున్నారని, ఇలాగే కొనసాగించి దృష్టి కేంద్రీకరిస్తే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారని భరోసా కల్పించారు. అత్యంత సాధారణ నేపథ్యాలే.. ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంవోలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి నిదర్శనమని సీఎం జగన్ చెప్పారు. ‘ముత్యాలరాజు జీవితం మన హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి వెళ్లాలంటే పడవలే మార్గం. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు. ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే కచ్చితంగా ఆ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరు కనిపిస్తారు’ అని సీఎం పేర్కొన్నారు. కరోనా సమయంలో అడవుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో.. 5 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆన్లైన్లో చదువుకున్నామని చెప్పారు. తాము ఎలా, ఎంత కష్టపడిందీ వివరించారు. తమను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉన్నత చదువులకు అర్హత సాధించేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గిరిజన సంక్షేమశాఖ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సహాయం కావాలన్నా సరే.. తన వైపు నుంచి సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.. ఏం కావాలన్నా సహాయంగా నిలుస్తారని విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయి నుంచే వచ్చారు కాబట్టి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎలా పరిష్కరించాలి? ఏ రకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వారికి బాగా తెలుసని సీఎం విద్యార్థులతో పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థే మారిపోతుంది.. గిరిజన ప్రాంతాల నుంచి, కర్నూలులోని ఎమ్మిగనూరు తదితర చోట్ల నుంచి విద్యార్థులు ఐఐటీలో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమని సీఎం అభినందించారు. ‘నేను పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశా. అలాంటి ప్రాంతం నుంచి ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శకంగా భావించి మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పు కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అంటూ సీఎం స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే ఊరికి బ్రిడ్జి: ముత్యాలరాజు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా తన ప్రస్థానాన్ని తెలియజేయాలని సీఎం కోరడంతో సీఎంవో అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘మాది కృష్ణా జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం. మా ఊరు ఒక దీవి. అటు పశ్చిమ గోదావరి ఇటు కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. చాలా మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. నా సొంత చెల్లెలే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. ఈ పరీక్షల్లో నాకు అఖిల భారత స్థాయిలో నంబర్ వన్ ర్యాంకు వచ్చింది. అప్పటి సీఎం వైఎస్సార్ పిలవడంతో నా తల్లిదండ్రులతో వెళ్లి కలిశా. ఏం కావాలని వైఎస్సార్ అడిగితే మా ఊరికి బ్రిడ్జి సదుపాయం కల్పించాలని కోరా. నేను రిటైర్ అయ్యేలోగా మా ఊరికి బ్రిడ్జి తేగలనేమోనని అనుకున్నా. వైఎస్సార్ చొరవతో మూడేళ్లలోనే బ్రిడ్జి వేయగలిగాం. దీనికోసం రూ.26 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రస్తుతం విద్యా సంబంధిత అంశాలపై దృష్టిపెట్టా. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఏపీ చరిత్రలో ఇన్ని సీట్లు రాలేదు’ అని ముత్యాలరాజు తెలిపారు. ఇప్పటివరకూ 179 మందికి మంచి ర్యాంకులు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది విద్యార్థులు వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. 2014లో ఒకే ఒక్క గిరిజన విద్యార్థి ఐఐటీకి ఎంపిక కాగా 2021లో 30 మంది సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల విద్యార్థులు సీట్లు సాధించేలా ర్యాంకులు తెచ్చుకోవడం గమనార్హం. వీరిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించగా 21 మంది విద్యార్థులు ప్రిపరేటరీ కోర్సు (ఏడాది పాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందనున్నారు. 7 వేల లోపు ర్యాంకులు సాధించిన మరో 59 మంది ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతున్నందున మరింతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నీట్ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని, వాటిలో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం ఉన్నారనే ధైర్యంతోనే చదువుకోగలిగాం మాది.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం కోటపర్తివలస. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 596వ ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సీఎం జగనన్నే నాకు స్ఫూర్తి. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. కరోనా కష్టకాలంలో మేము భయపడకుండా చదువుకోగలిగామంటే జగనన్న ఉన్నారన్న ధైర్యమే కారణం. సివిల్స్ సాధించి నాలాంటి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉండటమే నా లక్ష్యం. – వరలక్ష్మి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మారికవలస, విశాఖపట్నం జిల్లా జగనన్న అమ్మఒడితో ఎంతో ప్రోత్సాహం.. మాది విజయనగరం జిల్లా కొట్టక్కి. జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్టీ కేటగిరీలో నాకు 333వ ర్యాంకు వచ్చింది. అమ్మానాన్న వెదురుబుట్టలు అల్లుతారు. సీఎం సారే మాకు స్ఫూర్తి. నాలాంటి విద్యార్థుల సంక్షేమం కోసం మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటితో మా చదువులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. – పార్ధసారధి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం, విజయనగరం జిల్లా ‘నాడు–నేడు’తో మా కళాశాలను బాగా అభివృద్ధి చేశారు నాకు జేఈఈ అడ్వాన్స్డ్ ఎస్సీ కేటగిరీలో 507వ ర్యాంకు వచ్చింది. నేను ఎల్బీ చర్ల, నర్సాపురంలోని ఎస్సీ సంక్షేమ కళాశాలలో చదువుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో స్ఫూర్తి కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడింది. మంచి శిక్షణ అందించారు. ప్రభుత్వం నాడు–నేడు ద్వారా మా కళాశాలను చాలా బాగా అభివృద్ధి చేసింది. – బి.తరుణ్, గణపవారిగూడెం, లింగపాలెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’
సాక్షి, కొయ్యూరు(పాడేరు): ‘నేనంటే ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు... నాకు నేనే నచ్చను.. సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది.. నాకు బతకాలని లేదు..’ అంటూ లేఖ రాసి ఓ విద్యార్థి డార్మెటరీలో కట్‌చేసిన రగ్గు పీలికతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక గురుకుల పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లి పంచాయతీ గురుపల్లికి చెందిన పూజారి హరికృష్ణరాజు, సరస్వతి కుమారుడు సౌజిత్‌రాజు (15) స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఐదేళ్లుగా ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాలలో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో రాజు పాల్గొన్నాడు. అతని తల్లిదండ్రులు హాజరుకాలేదు. పండగ సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులందరూ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. స్వగ్రామాలకు వెళ్తున్నట్టు అందరితో పాటు సౌజిత్‌రాజు కూడా రిజిస్టర్లో సంతకం చేశాడు. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడని స్నేహితులతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఒకసారి, ఎనిమిది గంటలకు మరోసారి పాఠశాల వాచ్‌మన్ కోటి డార్మెటరీలో గదులన్నీ చెక్ చేశాడు. విద్యార్థులెవరూ కనిపించలేదు. చదవండి: ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..! మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన కోటికి సౌజిత్‌రాజు విగతజీవిగా కనిపించాడు. వెంటనే ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేంద్రలు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరుపుతామని సీఐ,ఎస్ఐలు తెలిపారు. అందరితో పాటు పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన రాజు అర్ధరాత్రి సమయంలో డార్మెటరీకి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రాజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రాజు బంధువులు, తల్లిదండ్రులు కొద్ది సేపు వాచ్‌మన్ కోటితో వాగ్వాదం చేశారు. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! లేఖను చదువుతున్న తండ్రి హరికృష్ణరాజు తదితరులు రాజు కోసం వడ్డాది వెళ్లాం.. శుక్ర, శనివారాల్లో పాఠశాలకు రెండు సార్లు ఫోన్ చేస్తే సోమవారం అమ్మఒడి సమావేశం అయిన తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీంతో రాజు వస్తాడని సోమవారం రాత్రి వడ్డాది వెళ్లాం. అక్కడ చాలా సేపు వేచి ఉన్నామని రాజు తండ్రి హరికృష్ణరాజు విలపిస్తూ విలేకరులకు తెలిపాడు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తరువాత వడ్డాది నుంచి పాడేరు వచ్చేందుకు ఎలాంటి వాహనాలు ఉండవు. దీంతో తమ బిడ్డ వడ్డాదిలో ఉండిపోయి ఉంటాడని భావించి అక్కడ వెతికామని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం వస్తాడన్న ఆశతో వెళ్లిపోయామన్నారు. ఉదయం లేవగానే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. ఆరు పేజీల లేఖ ఆత్మహత్య చేసుకునే ముందు సౌజిత్ రాజు ఆరు పేజీల లేఖ రాశాడు. ఇంగ్లిష్ మీడియం కావడంతో తెలుగులో తప్పులు వస్తాయని పేర్కొన్నాడు. చిన్ననాటి విషయాలు, స్నేహితులతో ఆడుకున్న పాత జ్ఞాపకాలు ప్రస్తావించాడు. నాకు ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని తెలిపాడు. తల్లిదండ్రులు మందలించారని పేర్కొన్నాడు. సొంత గ్రామానికి వెళ్లాలని లేదని తెలిపాడు. పరీక్షల అట్ట, కొన్ని నోట్‌పుస్తకాలపై పబ్జీతోపాటు ప్రీఫైర్ ఆటల బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఈ ఆటలంటే నాటు ఇష్టం లేదంటూ ఆ లేఖలో తెలిపాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు. -
వేధింపులకే వెళ్లిపోయాడా?
సాక్షి, సిర్పూర్(టి)(కాగజ్‌నగర్): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పిట్టల నవీన్ (16) అనే విద్యార్థి శనివారం పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన శవమై కనిపించాడు. పాఠశాల నుంచి ఈనెల 11న మధ్యాహ్నం బయటికి వెళ్లిన పిట్టల నవీన్ తిరిగిరాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత గురువారం సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో విద్యార్థి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. సిర్పూర్(టి) ఎస్సై వెంకటేష్ దర్యాప్తు చేస్తుండగా శనివారం సాయంత్రం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన చెట్ల పొదల్లో ఓ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు నవీన్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విద్యార్థి తల్లితండ్రులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం తమ కుమారునిదే అని గుర్తించారు. తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన విద్యార్థి ఆత్మహత్య తన కొడుకు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి చేదేడు వాదోడుగా నిలుస్తాడని కోటి ఆశలతో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో తల్లితండ్రులు చేర్పించగా తన కొడుకు అర్ధాంతరంగా పాఠశాల నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థి తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బందువులు, ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ల వేధింపులకు పాఠశాల నుంచి పారిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నవిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 20లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని, మూడు ఎకరాల భూమి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. పీడీ సుమిత్, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేస్తున్నామని, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్‌పై విచారణ చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఆర్సీవో గంగాధర్ తెలిపారు. అంత్యక్రియల కొరకు తక్షణ ఆర్థిక సహాయంగా 30వేల రూపాయల నగదును అందజేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శోకసంద్రం నడుమ విద్యార్థి అంత్యక్రియలు కౌటాల(ఆసిఫాబాద్): నవీన్ అంత్యక్రియలు ఆదివారం కౌటాలలో శోకసంద్రంనడుమ ముగిశాయి. మృతుడి తండ్రి శ్రీనివాస్ కౌటాల గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి తమ్ముడు ప్రవీణ్, చెల్లి నవ్య ఉన్నారు. వేధింపులతోనే మృతి తమ కుమారుడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ టీచర్, తెలుగు టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, బందువులు ఆరోపించారు. -
ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్ గొడవ..!
సాక్షి, బూర్గంపాడు: చిన్నపాటి తగవు విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితుల మధ్య చోటుచేసుకున్న గొడవకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న వీసం నవీన్ (15) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వీసం కుమార్, జ్యోతి దంపతుల పెద్దకొడుకు నవీన్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. నవీన్ తండ్రి కుమార్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి జ్యోతి నవీన్‌ను ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది. నవీన్ సోమవారం సాయంత్రం హాస్టల్లో సెల్‌ఫోన్ విషయంలో మరో విద్యార్థితో గొడవ పడ్డాడు. సెల్‌ఫోన్ తీశావని నిలదీయటంతో.. తన సెల్‌ఫోన్ తీశావంటూ ఓ విద్యార్థి నవీన్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సోమవారం ఉదయాన్నే ఉప్పుసాకలోని తమ సమీప బంధువు నాగేశ్వరావు ఇంటికి వెళ్లాడు. ఆయన వెంటనే అతన్ని హాస్టల్లో వదిలేసి వార్డెన్‌కు చెప్పి వెళ్లాడు. పాఠశాలలో ప్రార్థన ముగిసిన వెంటనే నవీన్ ఎవరికీ చెప్పకుండా బంగారుచెలక లక్ష్మీపురంలోని ఇంటికి వెళ్లి పత్తి చేనుకు పిచికారీ చేసేందుకు దాచి ఉంచిన పురుగుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలిస్తుండగా మృతిచెందాడు. సెల్‌ఫోన్ విషయంలో జరిగిన గొడవ కారణంగానే మనస్తాపానికి గురై నవీన్ మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నవీన్ సెల్‌ఫోన్‌ను తన స్నేహితుడికి ఇచ్చి తనతో గొడవ పడిన విద్యార్థికి ఇవ్వమని చెప్పినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. రెండేళ్ల క్రితం హాస్టల్ విద్యార్థి పరారై నెలరోజుల తరువాత విజయవాడలో దొరికాడు. గత ఏడాది ఓ విద్యార్థి మరో విద్యార్థిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు పురుగుమందు తాగి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఆరా తీసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
గురుకుల పోస్టుల భర్తీపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ఉద్యోగాల భర్తీపై అయోమయం నెలకొంది. గురుకుల బోర్డు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం పలు పోస్టులు మంజూరు చేసినా ఆ మేరకు పూర్తిస్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దాదాపు 1,350 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండగా కొత్త జోన్లు, మల్టీజోన్లు ఏర్పాటు కావడం, ఆ తర్వాత ప్రభుత్వం రద్దు కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వాటి భర్తీపై గురుకుల నియామకాల బోర్డు అయోమయంలో పడింది. కొత్త జోన్ల ప్రకారం భర్తీ చేయాలా లేక పాత జోన్ల ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేయాలా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వాన్నే వివరణ కోరాలని భావించిన గురుకుల నియామకాల బోర్డు ఆ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి వివరించింది. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు కావడంతో ఆ మేరకు సైతం పోస్టులను విభజించుకుని ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డు యంత్రాగం కసరత్తు చేస్తోంది. -
గురుకులంలో ర్యాగింగ్ రక్కసి..!
సాక్షి, అనంతపురం: సరైన వసతులుండవనే కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ఓ వైపు తల్లిదండ్రులు వెనకడుగువేస్తుంటే.. మరోవైపు సరైన పర్యవేక్షణ లేని కారణంగా జిల్లాలోని ఓ పాఠశాలలో ర్యాగింగ్ జరిగింది. ఈ ఘటన కదిరి మండలం కళాసముద్రంలో గల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగుచూసింది. అయిదో తరగతి విదార్థులపై టెన్త్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్ల వెకిలి చేష్టలకు భయపడి ముగ్గురు విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోయినట్టు తెలిసింది. కాగా, ఘటనపై ఇంతవరకు విద్యాశాఖ అధికారులెవరూ స్పందించక పోవడం గమనార్హం. -
మైనార్టీ గురుకులాలకు మరో 1,863 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ : మైనార్టీ గురుకుల పాఠశాలలకు కొత్తగా 1,863 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. వీటిని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యారు. మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అధికారులు ప్రస్తావించగా సీఎస్ పైవిధంగా స్పందించారు. ఇటీ వల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1,321 మంది టీచర్లను నియమించినట్లు గుర్తు చేశారు. జిల్లాల్లోని వక్ఫ్ ఆస్తుల జాబితాను రూపొందించాలని, ఆ భూములను విద్యా సంస్థల నిర్మాణానికి వినియోగించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మైనార్టీ యువతకు వివిధ రంగాలలో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయాలని సూచించారు. షాదీ ముభారక్ ద్వారా 24,662 మం ది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 11,746 మందికి మంజూరు చేశామని, మిగతా వాటికి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు 968 మందిని ఎంపిక చేసి రూ.109 కోట్లు ఖర్చు చేశామన్నారు. మల్టీ సెక్టో రల్ డెవలప్మెంట్కు సంబంధించి 2016–17లో 7 మైనార్టీ గురుకులాల నిర్మాణానికి కేంద్రం రూ.126 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొదటి దశలో కేంద్రం రూ.37.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25.20 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే 2017–18లో మరో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూ రు చేసిందని, కేంద్ర వాటా కింద రూ.10.08 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.21.60 కోట్లు విడుదలయ్యా యని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవ లప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా సివిల్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. -
గురుకులంలో సమస్యల దరువు
నెక్కొండ: నెక్కొండ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పలు సమస్యలు తిష్టవేశాయి. శనివారం పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల.. అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకులం ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల విద్యార్థులకు హోంసిక్ సెలవులు, అలాగే ప్రతి రెండో శనివారం విద్యార్థులకు ఔటింగ్ ఉండడంతో ఉదయం పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో అద్దె భవనంలోని మొదటి అంతస్తులో పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు కలుసుకునే చోటు లేకపోవడంతో.. పాఠశాల ఎస్ఓ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు వారిని అనుమతించలేదు. గంటల కొద్దీ రోడ్డుపై నిల్చున్న తల్లిదండ్రులు అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుక యత్నించినా తల్లిదండ్రులు వినలేదు. అధికారులు ఇక్కడి రావాంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎంపీపీ, కొందరు తల్లిదండ్రులు, పాఠశాల ఎస్ఓతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతుల వారి రెండు సెక్షన్లలో మొత్తం విద్యార్థులు 292 మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపోను గదులు లేవని, పగటి వేళ తరగతులు నిర్వహిస్తుండగా అవే గదుల్లో రాత్రి నిద్రిస్తున్నారు. కనీసం డైనింగ్ హాల్ కూడా లేదు. విద్యార్థుల కోసం పడకలు వచ్చినా కూడా గదుల కొరత కారణంగా పాఠశాలకు పంపిణీ చేయలేదని ఉపాధ్యాయులు తెలిపారు. స్నానపు గదుల్లో నీరు బయటికి సరిగా పోవడం లేదని విద్యార్థులు తెలిపారు. కాగా పాఠశాలలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీపీ హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్న గదుల్లో గురుకులాన్ని తరలించేందు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. నెక్కొండ సమీపంలోని పత్తిపాక గుట్ట వద్ద స్థల సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
కాజీపేట అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన మైనార్టీ గురుకుల విద్యాలయంలో ని బంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాజీపేట మండలం క డిపికొండలోని మైనార్టీ గురుకుల విద్యాలయం గ తేడాది అట్టహాసంగా ప్రారంభమైంది. 5,6,7 తరగతులతో ప్రారంభమై ఈ ఏడాది ఎనిమిదో తరగతిని ప్రారంభించారు. 14 మంది ఉపాధ్యాయులు, ఒక ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో సుమారు 235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సామా న్య మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలకు కార్పోరేట్‌స్థాయి విద్యతో పాటు పూర్తి సంరక్షణ లభిస్తుందనే నమ్మకంతో కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయంలో చేర్చారు. విద్యార్థులపై పట్టింపేదీ.? శుక్రవారం మైనార్టీ గురుకుల విద్యాలయంలో విద్యార్థులు స్నానమాచరించేందుకు నీరు లేని కా రణంతో ఆరుబయటకు పంపించారు. దీంతో అ భం శుభం తెలియని చిన్నారులు పాఠశాలకు ప్ర క్కనే గల పెద్ద చెరువులో కొందరు, శివాలయంలో మరికొందరు స్నానమాచరించారు. వీరిని సరైన రీతిలో తీసుకువెళ్లేందుకు ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు, వార్డెన్ ఎవరూ లేరు. విద్యార్థులు స్నానమాచరించి కడిపికొండ నుంచి ఉర్సుకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఆరులైన్ల బైపాస్ రోడు ్డపై పరుగెత్తుకుంటూ వస్తుంటే స్థానికులు భారీ వాహనాల రాకపోకల్లో విద్యార్థులకు ఏమైన జరుగుతుందోనని కంగారుపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవా లని స్థానికులు కోరారు.నాకు తెలియకుండా పీఈటీ నిర్ణయం తీసుకున్నాడు విద్యార్థులను విద్యాలయం నుంచి నాకు తెలియకుండా పీఈటీ ఫిరోజ్‌ఖాన్ పంపించాడు. ఇటీవల బోర్ చెడిపోవడంతో ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నాం. కాగా, ఘటనకు బాధ్యుడైన పీఈటీని తొలగిస్తాం. – సిద్దీఖీ, ప్రిన్సిపాల్, కడిపికొండ మైనార్టీ గురుకుల విద్యాలయం -
‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా నెల్లిమర్ల గురుకులం
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్ఎస్ఎన్.రాజు తెలిపారు. పట్టణంలోని బీసీ బా లికలు, మత్స్యకార బాలుర పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదల చేశామన్నారు. వచ్చేనెల 1నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ తరగతులతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి సింహాచలంలో బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 12 కళాశాలలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 15న 5వ తరగతి విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ గురుకులాలతో కలిసి అకడమిక్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేనెలలో నిర్వహిస్తామని రాజు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ రఘునాధ్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రామినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
-
వేడి సాంబార్లో పడి చిన్నారి మృతి
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఈ రోజు(శనివారం) విద్యార్థులకు వంటలు సిద్దం చేశారు. వంటలో భాగంగా సాంబర్ చేసి డేక్షాను పక్కన పెట్టారు. అంతలో అక్కడికి ఆడుకుంటూ వచ్చిన కీర్తన అకస్మాత్తుగా ఆ సాంబార్ వండిన డేక్షా(గిన్నె, బగోనే) లో పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పిట్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చివరకు ప్రాణాలు వదిలింది. కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
గురుకులంలో దారుణం
సాక్షి, హైదరాబాద్ : గౌలిదొడ్డి గురుకుల పాఠశాల.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని గురుకులం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన గురుకుల పాఠశాలల విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్, ఎంసెట్‌లకు శిక్షణ ఇస్తుంటారు. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ప్రముఖులు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులందరూ విజిట్‌లో భాగంగా గురుకులాన్ని సందర్శిస్తుంటారు. అలాంటి గురుకులంలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులకు దిగాడు. గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్æ ప్రమోదని భర్త దామోదర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్లతో పాటు పోక్సో (పిల్లలపై లైంగిక వేధింపుల చట్టం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఐటీ ఫౌండేషన్ తరగతులంటూ.. దామోదర్ గతంలో నారాయణ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పని చేశాడు. పాఠశాలలోని క్వార్టర్స్‌లో కొడుకు, భార్యతో ఉంటున్న దామోదర్.. 2012 నుంచి గురుకులంలో స్వచ్ఛందంగా ఐఐటీ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నాడు. తాజా ఘటనతో ప్రిన్సిపాల్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలిసింది. దామోదర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని గచ్చిబౌలి సీఐ గంగాధర్ తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ప్రిన్సిపాల్ ప్రమోదను సస్పెండ్ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దామోదర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. నిందితుడు తమపై పలురకాలుగా ఒత్తిడి చేయిస్తున్నాడని.. రాజకీయ నాయకులు, కుల సంఘాలతో ఫోన్లు చేయిస్తూ కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. -
దుఃఖాన్ని దిగమింగుకుని..
కురవి/మరిపెడ: తండ్రి మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు మంచ్యా తండాలో చోటు చేసుకుంది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నేరడ శివారు మంచ్యా తండాకు చెందిన భూక్య రాజు(40) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు భూక్య కుమార్ మరిపెడలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నాడు. కుమార్ ప్రసుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తండ్రి రాజు మృతి చెందిన విషయం తెలిసి కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మనోధైర్యం ఇవ్వడంతో కన్నీళ్లను దిగమింగుకుంటూ మరిపెడలోని సీతారాంపురం జెడ్పీ హైస్కూల్లో కుమార్ సైన్స్ రెండో పేపర్ రాశాడు. పెద్దనాన్న అయిన మాధవపురం సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న పరీక్ష సమయం ముగియగానే కుమార్‌ను ద్విచక్రవాహనంపై తీసుకుని తండాకు చేరుకున్నాడు. తండాకు వచ్చిన కుమార్ తండ్రి శవంపై పడి నాన్న లే నాన్న అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. నన్ను ఒంటిరి చేసి వెళ్లావా? అంటూ రోదిస్తుంటే తండావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే తండావాసులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. దింపుడు కల్లం వద్ద తండ్రి ముఖం చూస్తూ బోరున విలపించాడు. చితికి నిప్పంటించాడు. అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్‌కు తోడుగా తల్లి శారద ఉంది. ఈ సంఘటనతో తండాలో విషాదం అలుముకుంది. రెండు రోజులు సెలవులు ఉండడంతో కుమార్ తండాలోనే ఉంటాడని బంధువులు తెలిపారు. -
గురుకుల పాఠశాలలో విద్యార్థినుల ఆందోళన
-
ర్యాగింగ్ : వేధించారని యాసిడ్ తాగేశారు
-
జారిపడ్డ విద్యార్థి
♦ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు ♦ ఓ విద్యార్థి రాకుండానే గురుకుల పాఠశాల గేట్లు మూసివేత ♦ ఆలస్యంగా వచ్చి.. పైపు ఎక్కి రూముకు చేరుకునే ప్రయత్నంలో జారిపడ్డ విద్యార్థి ♦ తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు.. ‘గురుకుల’ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం గురుకుల పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం మీదకొచ్చింది. డార్మెట్స్ రూమ్ (విశ్రాంతి గది)లో ఎంత మంది విద్యార్థులున్నారు? ఎవరు ఆబ్సెంట్ అయ్యారో చూసి బయటున్న వారిని లోపలికి వచ్చేలా చర్యలు తీసుకోకుండా గేట్లన్నీ క్లోజ్ చేయడంతో.. ఉపాధ్యాయులు ఎక్కడ తిడతారోనన్న భయంతో గోడ దూకిన విద్యార్థి పైప్‌లైన్ ఎక్కి డార్మెట్స్లో ప్రవేశించే ప్రయత్నంలో 10 అడుగుల ఎత్తు నుంచి కాలు జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన కణేకల్లు మండలం కణేకల్లుక్రాస్‌లోని గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి జరిగింది. కణేకల్లు: గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇంటర్, పదో తరగతి విద్యార్థులను మాత్రమే అనుమతించారు. సాయంకాలం 6 గంటల సమయంలో వినాయక విగ్రహం ఊరేగింపు జరిగింది. కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థి పి.భరత్‌కుమార్ మినహా మిగిలిన వారందరూ క్యాంపస్‌కు చేరుకున్నారు. సరిగ్గా పది గంటలకు గురుకుల పాఠశాల మెయిన్‌గేట్, డార్మెట్స్ గేట్లు క్లోజ్ చేశారు. నిమజ్జనానికి వెళ్లిన వారంతా వచ్చారా? లేదా? అని పరిశీలించకుండానే ఉపాధ్యాయులు గేట్లన్నీ మూసివేయించారు. రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చిన భరత్‌కుమార్ మెయిన్‌గేట్ క్లోజ్ అవడం చూసి ఏదోలా గోడ దూకి లోపలికొచ్చాడు. అనంతరం రెండంతస్తులపై ఉన్న డార్మెట్స్ రూమ్‌లోకి వెళ్లేందుకు పైప్ ఎక్కబోయాడు. కొంత ఎత్తు ఎక్కాక కాలుజారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి కదలలేని స్థితిలో రాత్రాంతా అక్కడే మూలుగుతూ ఉండిపోయాడు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వంట మనుషులు గమనించి పీడీ రాఘవేంద్రకు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే విద్యార్థిని కణేకల్లు ఆర్డీటీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి వెంటనే నల్లమాడ మండలం కురుమాలలో ఉంటున్న భరత్‌కుమార్ తల్లిదండ్రులు అనురాధ, మునీంద్రకు సమాచారం చేరవేశారు. వారు హుటాహుటిన వచ్చి కుమారుడిని అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సచచేయించారు. భరత్‌కుమార్‌కు కాలు విరగడంతో పాటు ముఖం, వీపు, కళ్లకు దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న తహశీల్దార్ వాణిశ్రీ, ఎస్ఐ యువరాజు గురుకుల పాఠశాలకెళ్లి ఘటనపై విచారణ చేశారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం గురుకుల పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు పి.భరత్‌కుమార్‌కు ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు అనురాధ, మునీంద్ర, బాబాయ్ మునిప్రసాద్లు ఆరోపించారు. ఫోన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమానికి ఎంత మంది వెళ్లారు? తిరిగి ఎంత మంది లోపలకొచ్చారు? పరిశీలించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నట్లు వారు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో విద్యార్థే చెప్పాలి : ప్రిన్సిపల్ ఈ ప్రమాదం ఎలా జరిగిందో విద్యార్థి భరత్‌కుమార్ కోలుకుని చెబితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని ప్రిన్సిపల్ అరుణకుమారి పేర్కొన్నారు. డార్మెట్స్ రూమ్ పైప్‌ల వద్ద పడి ఉంటే తమ సిబ్బంది పీడీ రాఘవేంద్రకు తెలిపారని, ఆయన వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారని చెప్పారు. ఆ వెంటనే తల్లిదండ్రులకు కబురందించామన్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థి కోలుకుంటున్నట్లు తెలిసిందన్నారు. -
కబడ్డీ విజేత కమలాపురం జట్టు
కమలాపురం:స్థానిక గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న జోన్–4 థర్డ్ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో అండర్–19 విభాగంలో కమలాపురం కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జిల్లా సత్యవీడు జట్టుతో తలపడిన కమలాపురం జట్టు విజయం సాధించింది. అలాగే వాలీబాల్‌లో బి.కోట, త్రోబాల్‌లో రాజుపాళెం, ఖోఖోలో చిత్తూరు, క్యారమ్స్‌లో రాయచోటి, చెస్‌లో అడపూరు జట్లు విజేతలుగా నిలిచాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 100మీటర్ల పరుగు పందెంలో కవిత (పుత్తూరు), 200మీటర్లలో పద్మావతి (కుప్పం), 400మీటర్లలో సోనియా (పీలేరు), 800మీటర్లలో హేమవతి (పీలేరు), 1500మీటర్లలో లూర్దు (కమలాపురం), 3000మీటర్లలో హేమవతి(పీలేరు), లాంగ్ జంప్‌లో పద్మావతి(కుప్పం), హైజంప్‌లో కవిత(పుత్తూరు), ట్రిపుల్ జంప్‌లో బి.కోట, డిస్కస్ త్రోలో గాయత్రి(బి.కోట), షాట్‌పుట్‌లో గాయత్రి(బి.కోట), జావెలిన్ త్రోలో (బి.కోట), 4“100రిలేలో కమలాపురం, 4“400లో చిత్తూరు జట్టు విన్నర్స్‌గా నిలిచారు. అండర్–17 విభాగంలో: అండర్–17 విభాగంలో వాలీబాల్ విన్నర్స్ బి.కోట, త్రోబాల్‌లో రాయచోటి, కబడ్డీలో రాయచోటి, ఖోకోలో చిత్తూరు, క్యారమ్స్‌లో తొండూరు, చెస్‌లో కమలాపురం జట్లు విన్నర్స్‌గా నిలిచాయి. 100, 200 మీటర్లలో శిరీష(తొండూరు), 400, 800 మీటర్లలో షాలిని(చిత్తూరు), 1500మీటర్లలో దివ్య(మదనపల్లె), 3000మీటర్లలో మీన(తొండూరు), లాంగ్ జంప్ శిరీష(తొండూరు), హైజంప్ లీలీవతి(రాయచోటి), ట్రిపల్ జంప్‌లో ప్రీతి(మదనపల్లె), డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో పద్మిని(బి.కోట), జావెలిన్ త్రోలో కావేరి(బి.కోట), 4“100రిలేలో చిత్తూరు, 4“400లో తొండూరు జట్లు విన్నర్స్‌గా నిలిచారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. -
‘గురుకులం’ విద్యార్థుల అదృశ్యం
హిందూపురం రూరల్ : మలుగూరు ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... పైన పేర్కొన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పరిగి మండలం విట్టాపల్లికి చెందిన రాహుల్ కుమార్, 9వ తరగతి చదివే హిందూపురంలోని లక్ష్మీపురానికి చెందిన శివశంకుమార్ ఈ నెల 17న పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఆచూకీ కోసం పరిసరాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం తమకు ఫిర్యాదు చేశారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదినారాయణ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సజావుగా ‘గురుకుల’ కౌన్సెలింగ్
చిలమత్తూరు : స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ కేటగిరీకి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు శనివారం కౌన్సెలింగ్ జరిగింది. పేరూరు, పెన్నహోబిళం, నసనకోట, టేకులోడు, లేపాక్షి ప్రాంతాల పరిధిలోని 52 సీట్ల కోసం 162 మంది విద్యార్థులు గత బుధవారం ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అందులో ఉత్తీర్ణత సాధించిన 36 మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ఎస్సీ జాబితాలో 10 మంది బాలికలు, ఆరుగురు బాలురు పెండింగ్‌లో ఉన్నారని వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ కేటగిరీకి సంబంధించిన 6,7,8, తరగతులకు చెందిన విద్యార్థులకు స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. పేరూరు, పెన్నహోబిళం, నసనకోట, టేకులోడు, లేపాక్షి ప్రాంతాల పరిధిలోని 52 సీట్ల కోసం 177 మంది హాజరు కావాల్సి ఉండగా 162 మంది హాజరయ్యారు. ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు ప్రిన్సిపల్ వివరించారు. -
గురుకుల బాలికలపై అత్యాచార యత్నం
అది సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల(బాలికల) పాఠశాల. శనివారం అర్ధరాత్రి.. సమయం 12గంటలు...రోజూలాగే ఆ రోజు కూడా ఇద్దరు బాలికలు టాయిలెట్‌కు వెళ్లారు. ఇంతలో స్కూల్ కాంపౌండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు సంచరిస్తూ కంటబడ్డారు. భయపడ్డ బాలికలు మీరెవరంటూ ప్రశ్నించేసరికి అగంతకులు ఇద్దరు బాలికలకు కత్తులు చూపించి బెదిరించి వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. అరిస్తే చంపేస్తామంటూ ఇద్దరి బాలికలను బాత్రూం వైపు తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు చింపేసి అసభ్యకర పదజాలంతో వ్యవహరిస్తూ కొంత సేపటి తరువాత అగంతకులు పారిపోయారు. జరిగిన విషయం వాచ్‌మేన్‌కు బాలికలు చెప్పగా దెయ్యాలు...పీడకలలంటూ కొట్టిపారేయడంతో బాలికలిద్దరు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలికలు బుధవారం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికలు చెప్పిన వివరాల్లోకి వెళ్తే... పాత శ్రీకాకుళం : రూరల్ మండలంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో 469 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ నెల 20న శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు టాయిలెట్ కోసం బయటకు వచ్చారు. అప్పటికే పాఠశాల కాంపౌండ్ పరిసర ప్రాంతంలో ముగ్గురు అగంతకులు ముఖానికి మాస్క్‌లు వేసుకొని సంచరిస్తూ బాలికలను కత్తులతో బెదిరించి బాత్రూం వైపు లాక్కెళ్లిపోయారు. అరిస్తే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించి అసభ్యకరంగా(రాయడానికి వీల్లేని భాష) ప్రవర్తించారు. మాతో వస్తే కావాల్సినంత డబ్బులిస్తామని...బీరు తాగుతావా...అంటూ తమతో ప్రవర్తించారంటూ మీడియా ముందు జరిగిన విషయం కుండబద్దలు కొట్టారు. అన్నయ్యా...అని బతిమలాడినా వదల్లేదని భోరుమన్నారు. గాఢనిద్రలో వాచ్‌మేన్...పట్టించుకోని ప్రిన్సిపాల్ బాలికలు జరిగిన విషయాన్ని వాచ్‌మేన్ శ్యామలమ్మకు చెప్పారు. స్కూల్లో దెయ్యాలు, పీడకలలంటూ కొట్టిపారేశారని కనీసం పట్టించుకోలేదని బాలికలు కన్నీరు పెట్టారు. మరుసటి రోజు ఆదివారం ప్రిన్సిపాల్‌కు కూడా ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు చెప్పారు. స్పందించాల్సిన ప్రిన్సిపాల్ అందుకు భిన్నంగా జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచాలని బెదిరించారని తెలిపారు. చెబితే టీసీలిచ్చి పంపేస్తామని గురుకుల సిబ్బంది బెదిరించారని బాలికల తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా తమ ఉద్యోగాలు చదువు చెప్పడానికే తప్ప కాపాలా కాసేందుకు కాదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ప్రిన్సిపాల్ తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్, విద్యార్థినుల తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం నెలకొంది. క్వార్టర్స్‌లో ఉండాల్సిందే... ఈ విషయం గురుకుల పాఠశాల కన్వీనర్ చంద్రావతికి తెలియడంతో స్పందించారు. సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రిన్సిపాల్, సిబ్బంది ఏ ఒక్కరూ క్వార్టర్స్‌లో ఉండరని తేల్చేశారు. నిరంతరం స్కూల్ ప్రధాన గేటు తెరిచే ఉంటుందని, ఎవరు వస్తున్నారో...ఎవరు వెళ్తున్నారో..తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. క్వార్టర్స్‌లో ప్రిన్సిపాల్, సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆదేశించారు. ప్రహరీ లేదు.. స్కూల్లో అన్ని వసతులున్నా పూర్తి స్థాయిలో ప్రహరీ లేదని ప్రిన్సిపాల్ ప్రభావతి చెప్పారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని తెలిపారు. జరిగిన సంఘటనపై రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. రక్షణ కావాల్సి ఉందని పేర్కొన్నారు. పిల్లలతోనే పనులన్నీ చేయిస్తారు.. స్కూల్లో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పిల్లలతో అన్ని పనులు చేయిస్తామని ఓ విద్యార్థిని తల్లి ఆరోపించారు. బాత్రూంలు కడిగిస్తారని, బియ్యం ఏరిస్తారని, గదులు శుభ్రపరచడం ఇలా అన్ని పనులు పిల్లలే చేస్తారని చెప్పారు. తల్లిదండ్రులకు చిన్నారులు చెబితే తిరిగి బాలికలను శిక్షిస్తారని ఆరోపించారు. -
నేడు ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
చిలమత్తూరు : మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో మూడోవిడత అడ్మిషన్ల కోసం గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపల్ ప్రసాద్ బుధవారం తెలిపారు. లేపాక్షి, టేకులోడు, పేరూరు, పెన్నహోబిళం, నసనకోట ప్రాంతాలకు చెందిన 60 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉదయం 8.30 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు. -
పట్టపగలే గురుకులంలో బాలికపై హత్యాయత్నం!
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఆదివారం గుర్తు తెలియని దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో పారిపోయాడు. వివరాలు... పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఉంది. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 602 వుంది బాలికలు చదువుతున్నారు. ఆదివారం ఉదయం 9.20 గంటల సవుయుంలో విద్యార్థినులు టిఫిన్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న కోవనూరుకు చెందిన లోకేశ్వరి(11) తొందరగా టిఫిన్ తిని వచ్చి హోంవర్క్ చేసుకుంటోంది. గుర్తు తెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోపలికి చొరబడ్డాడు. బాలిక వద్దకు చేరుకుని అమాంతం గొంతునులిమాడు. బాలిక అక్కడే స్ఫృహ కోల్పోయింది. దీన్ని గమనించిన మరో ఇద్దరు విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ దుండగుడు పారిపోయాడు. బాధిత బాలికను ప్రిన్సిపాల్ ద్వారకానాథ్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. పోలీసులతోపాటు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రెండు గంటల తర్వాత కోలుకున్న ఆ బాలికను తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. అప్పటికే విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ తమ పిల్లలకు భద్రత లేదని, ఇంటికి పంపేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టూటౌన్ సీఐ వేణుగోపాల్, ఎమ్మార్వో చంద్రమోహన్, ఎంఈవో బాలయ్యు పాఠశాలకు వెళ్లి బాలికను విచారించారు. ఈ సందర్భంగా సీఐ వేణుగోపాల్ వూట్లాడుతూ... 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లారు. -
కేజీ టు పీజీ .. గజిబిజి
* ఏడాదిన్నరగా ప్రకటనలే తప్ప చర్యలు చేపట్టని సర్కారు * నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 స్కూళ్ల ఏర్పాటు లక్ష్యం * 2016 జూన్ నుంచి ప్రారంభిస్తామన్నా.. కనీస కార్యాచరణకూ దిక్కులేదు... మిగిలిన సమయం ఇంకా ఎనిమిది నెలలే * ఇప్పుడున్న గురుకులాలు 668.. మోడల్ స్కూళ్లు మరో 187 * మిగతా వాటికి స్థలాలేవీ, ఎక్కడ నిర్మిస్తారు? * గురుకులాలను ఒకే గొడుగు కిందకు తేవడంపైనా అస్పష్టత * బాలికలకే పరిమితమైన కేజీబీవీల్లో బాలురకూ అవకాశమిస్తారా? * విద్యార్థులకు వసతి గృహాల పరిస్థితి ఏమిటి? * గందరగోళంగా మారిన ‘కేజీ టు పీజీ’ పథకం ‘వచ్చే ఏడాది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తాం. ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలి..’ - 2014 సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్ష ‘గురుకులాలను కేజీ టు పీజీలో భాగం చేస్తాం. నియోజకవర్గానికి 10 చొప్పున స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 662 ఉన్నాయి. మరో 528 ప్రారంభిస్తాం..’ - ఆగస్టు 5న ‘కేజీ టు పీజీ’పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పిన అంశం ‘మూడు దశల్లో కేజీ టు పీజీ.. 12వ తరగతి వరకు స్కూళ్లలో తరగతులు. తదనంతరం గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)లను అనుసంధానం చేయడం. కేజీ నుంచి 4వ తరగతి వరకు సాధారణ విద్య. 5వ తరగతి నుంచి నివాస వసతితో కూడిన గురుకుల విద్య అందించడమే లక్ష్యం..’ - గత ఏడాది జూలై 1న సీఎస్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కేజీ టు పీజీ’ విద్య గందరగోళంగా మారింది. ప్రాథమిక పాఠశాలల నుంచి పీజీ దాకా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తామన్న హామీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఆలోచనలు చేస్తోంది. ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తోంది. కానీ ఇంతవరకూ కనీస కార్యాచరణకు మాత్రం దిక్కులేదు. ‘ప్రతిష్టాత్మక పథకం కనుక ఆలస్యమైనా ఫరవాలేదు.. పకడ్బందీగా ప్రారంభించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష..’’ అని మంత్రులు, సీఎం పలు సందర్భాల్లో చె బుతూ వస్తున్నారు. చివరికి 2016 జూన్‌లో ‘కేజీ టు పీజీ’ని ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి మరో ఎనిమిది నెలలు మాత్రమే గడువున్నా... చర్యలు మాత్రం కానరావడం లేదు. - సాక్షి, హైదరాబాద్ పరిపాలన సౌలభ్యం కోసమంటూ.. ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలను చేర్చాలని భావిస్తోంది. కానీ కేజీ టు పీజీలో భాగంగా వీటిని ఒకే పరిధిలోకి తెస్తున్నారా, పాలనపరమైన సౌలభ్యం కోసమే చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఆయా స్కూళ్ల సమస్యలపైనా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గందరగోళంగా మారింది. వచ్చే విద్యా విద్యాసంవత్సరంలోనైనా ‘కేజీ టు పీజీ’ని ప్రారంభిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ స్పష్టత కరువే ‘కేజీ టు పీజీ’ అమలుపై ఇప్పటికీ ఒక స్పష్టమైన అవగాహనకు ప్రభుత్వవర్గాలే రాలేకపోతున్నాయి. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించే బృహత్తర లక్ష్యమైన ఈ పథకంపై సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేస్తున్నారే తప్ప ఏదీ ఆచరణకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీని వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్)లో ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఇందుకు ఇంకా 8 నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ కనీస కార్యాచరణ ప్రారంభం కాలేదు. చివరకు రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు), మోడల్ స్కూల్లు అన్నింటిని ఈ పథకంలో భాగం చేసినా ప్రభుత్వ లక్ష్యం ప్రకారం మరో 351 స్కూళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 44 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 132 గిరిజన సంక్షేమ గురుకులాలు, 95 ప్రభుత్వ గురుకులాలు కలిపి మొత్తంగా 662 స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వం కేజీ టు పీజీ కింద లక్ష్యంగా పెట్టుకున్న స్కూళ్లు 1,190.. అంటే మరో 528 స్కూళ్లు అవసరం. అయితే కేంద్రం మోడల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసినందున రాష్ట్రంలో ఉన్న 187 మోడల్ స్కూళ్లను కూడా వీటితో కలపాలని భావిస్తున్నారు. వీటిని కలిపినా మొత్తంగా 839 స్కూళ్లు మాత్రమే కేజీ టు పీజీకి అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మరో 351 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ఆ స్కూళ్లకోసం స్థలాల సేకరణ కూడా చేపట్టలేదు. మరి స్థలాలు సేకరించేదెప్పుడు, స్కూళ్ల నిర్మాణం, మౌలిక సౌకర్యాలు కల్పించేదెప్పుడు, తరగతులు ప్రారంభించేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బాలికలకే పరిమితమైన 391 కేజీబీవీల్లో బాలురకు కూడా ప్రవేశాలు కల్పిస్తారా, అలాగే కొనసాగిస్తారా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇక 12వ తరగతి వరకు ఉన్న 100 మోడల్ స్కూళ్లకు సంబంధించి వాటి ఆవరణలో బాలికలకు హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. మరి వాటిలో బాలురకు హాస్టల్ సదుపాయం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
గురుకులాలకు సంక్రాంతి సెలవుల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మూడు నుంచి ఆరు రోజులకు పెంచారు. మూడు రోజులే సెలవులు ఇవ్వడంతో పాఠశాలల జేఏసీ నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో చర్చలు జరిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రకటించిన సెలవులు 5-9తరగతుల విద్యార్థులకు వ ర్తిస్తాయి. దీనితో పాటు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకునే ఈ పాఠశాలల మహిళా సిబ్బందికి జీవో 52 ప్రకారం 45 రోజుల సెలవు వర్తించేలా కార్యదర్శి ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. జేఏసీ నాయకులు ఎ.వెంకటరెడ్డి, సీహెచ్ బాలరాజు, కె.అర్జున్, రవీంద్ర రెడ్డి, యాదయ్య, పరంధాములు కార్యదర్శిని కలిశారు. -
దయ్యాలున్నాయనే నెపంతో పాఠశాలలో క్షుద్రపూజలు
మెదక్: ఓ పాఠశాలలో దయ్యాలున్నాయనే నెపంతో క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన గజ్వేల్ గురువారం చోటు చేసుకుంది. అది ఒక గురుకుల పాఠశాల. పాఠశాల అంటే విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన చోటు. మూడ నమ్మకాలపై అపోహలు తొలింగించాల్సిన దేవాలయంలాంటి బడిలో దెయ్యాలున్నాయంటూ అలజడి సృష్టించారు. ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకరావడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వెంటనే గురుకుల పాఠశాలను సందర్శించి ఆరా తీశారు. పాఠశాలలో క్షుద్రపూజలు చేయడమేమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అసలు అక్కడ ఏం జరిగిందనే అంశంపై పాఠశాల విద్యార్థులందర్నీరప్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై డీఈఓ రమేష్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘గురుకుల’ లెక్చరర్ డిస్మిస్
జోగిపేట, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా అందోల్‌లోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశా ల జూనియర్ లెక్చరర్ మధుసూదన్‌ను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తు లు కలిగి ఉన్నట్లు అభియోగాల నేపథ్యంలో 2009లో ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది. విచారణ పూర్తికావడంతో తాజాగా అతని ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లోని గోపాల్‌పేట్‌కు చెందిన మధుసూదన్ గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటతో పాటు మెదక్ జిల్లాలోని హత్నూరలో పనిచేసి గత మే నెలలో అందోల్ గురుకుల పాఠశాలకు బదిలీపై వచ్చారు. 2009లో అచ్చంపేటలో పనిచేస్తున్న సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులుచేశారు. హైదరాబాద్‌లో ఆస్తులతోపాటు వాటర్‌ట్యాంకర్లు, అత్యంత సమీప బంధువులకు ఆరుకార్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును అప్పట్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకట్‌రెడ్డి విచారణ చేపట్టారు. కేసు విచారణలో మధుసూదన్ సహకరించకపోగా, తనపై నమోదైన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు చూపలేదని సమాచారం. విచారణ అనంత రం ఏసీబీ నివేదికను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యద ర్శి ప్రవీణ్‌కుమార్ జూనియర్ లెక్చరర్ మధుసూదన్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాటిని మంగళవారం అందోల్ గు రుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధురీదేవికి గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్ అందజేశారు. మరో ప్రతిని మధుసూదన్‌కు కూడా ఇచ్చారు. మంగళవారం నేరుగా ఉత్తర్వులు అందుకున్న ఆ యన పాఠశాల నుంచి నిష్ర్కమించారు. కాగా, డి స్మిస్కు గురైన జూనియల్ లెక్చరర్ మధుసూదన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం.