గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ కేటగిరీకి సంబంధించిన 6,7,8, తరగతులకు చెందిన విద్యార్థులకు స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు.
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ కేటగిరీకి సంబంధించిన 6,7,8, తరగతులకు చెందిన విద్యార్థులకు స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు.
పేరూరు, పెన్నహోబిళం, నసనకోట, టేకులోడు, లేపాక్షి ప్రాంతాల పరిధిలోని 52 సీట్ల కోసం 177 మంది హాజరు కావాల్సి ఉండగా 162 మంది హాజరయ్యారు. ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు ప్రిన్సిపల్ వివరించారు.