entrance examination
-
ఓయూ పీహెచ్డీ ప్రవేశపరీక్షకు 4800 దరఖాస్తులు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష–2025కు 4800 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు సమీపిస్తున్నందున అర్హులైన అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మార్చి చివరి వారం నుంచి ప్రారంభమయ్యే పీహెచ్డీ ప్రవేశ పరీక్షల కోసం.. మార్చి 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. యూజీసీ నెట్, సెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులు కూడా ఓయూ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడాలని సూచించారు. -
పరీక్షల సమరం
సాక్షి, హైదరాబాద్: ఇది పరీక్షల సమయం. భవిష్యత్తును నిర్ణయించే తరుణం. ఇటు వార్షిక పరీక్షలు.. మరోవైపు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్..విద్యాసంస్థల్లో హైటెన్షన్. ఇంకోవైపు తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, మరోవైపు విద్యాసంస్థలు..ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమవైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.మార్చి టు జూన్..మార్చి నుంచి జూన్ వరకూ వరుసగా ఎన్నో పరీక్షలు. ముందుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకూ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. థియరీ పరీక్షల కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే టెన్త్ పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి కొనసాగుతాయి. ఓరియంటల్ సబ్జెక్టులు రెండురోజుల పాటు జరుగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్ధికీ కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకూ జరుగుతుంది. ప్రఖ్యాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించాలనేది లక్షల మంది కల. ఈ మెట్టు ఎక్కాలంటే జేఈఈ పరీక్ష రాయాల్సిందే. తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తయింది. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది. ఇక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ వరకూ పరీక్షలే పరీక్షలు. విద్యార్థుల వెనుక కీలకంగా.. రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇది మనకు ప్రత్యక్షంగా కని్పంచే సంఖ్య మాత్రమే. ఒక్కో విద్యార్థిని పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ఇద్దరు తల్లిదండ్రులు, సగటున మరో ఇద్దరు ఉపాధ్యాయులు తెర వెనుక కృషి చేస్తారు. వీరే కాదు పరీక్షల ఏర్పాట్లలో ఉండే ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది పాత్రా కీలకమే. ఈ లెక్కన సుమారు కోటి మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. విద్యార్థులను సన్నద్ధం చేయడం మొదలుకుని, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ప్రశ్నాపత్రాలు పంపడం, వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేర్చడం..మొత్తం మీద ఎవరికీ ఈ సీజన్లో కంటి మీద కునుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... తదితర శాఖలకూ ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికీ ఇవి ఓ సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం టెన్త్, ఇంటర్ పరీక్షలు కీలకమైనవి. ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. మరోసారి పూర్తిస్థాయిలో రివిజన్ చేయిస్తున్నాం. విద్యార్థులు పరీక్షలు అంటే కాస్తా టెన్షన్‌గా ఫీలవ్వడం సహజం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అందరికీ మంచి మార్కులు వచ్చేలా టీచర్లు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. – ఆర్.పార్వతీరెడ్డి (హార్వెస్ట్ విద్యాసంస్థలు, ఖమ్మం) ఒకింత టెన్షన్‌గానే ఉంది గతంలో చాలా పరీక్షలు రాశా. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. అయితే ఒక్కోసారి చదివిందే వస్తుందా? ఇంపార్టెంట్ ఏమిటనే గందరగోళానికి గురవుతున్నా. ముఖ్యమైన చాప్టర్స్ పదేపదే చదవమని టీచర్లు చెబుతున్నారు. నాలో ధైర్యం పెంచేలా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. – ముక్తివరపు శేఖర్ (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) ––––––––––––––––––పరీక్షలయ్యే వరకు ధైర్యం చెబుతున్నాం.. అమ్మాయి చదువుపైనే దృష్టి పెడుతున్నాం. రాత్రి పడుకునే వరకూ ఏం కావాలో అందిస్తున్నాం. పరీక్షలంటే భయం ఉండకుండా ధైర్యం చెబుతున్నాం. ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తున్నాం. కాలేజీకి వెళ్లి లెక్చరర్లతో మాట్లాడి వారి సలహాలు కూడా పాటిస్తున్నాం. – సానియా బేగం (ఇంటర్ విద్యార్ధిని తల్లి, జడ్చర్ల) -
TG: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం(జనవరి15) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్(EAPCET), మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్,జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్జూన్ 8,9 న ఐసెట్,జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్,జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ(హెచ్),ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.ఇదీ చదవండి: మీరు డాక్టరా లేక ఇంజినీరా..? -
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
త్వరలో సెట్ల తేదీలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈసారి ఈ పరీక్షను ముందుకు జరపాలని, తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇటీవల మండలి ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రవేశ పరీక్ష, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ తేదీలను ఒకేసారి ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్య కోటా సీట్లను కూడా ఈసారి ఆన్లైన్ విధానంలో భర్తీ చేస్తామని మండలి చైర్మన్ తెలిపారు. దీనిపైనా త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది. త్వరగా తేదీలివ్వండి.. ఈఏపీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్‌లను ఎప్పుడు నిర్వహించాలో సూచించాల్సిందిగా టీసీఎస్ సంస్థను మండలి కోరింది. ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగిస్తారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలను, ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. దీని తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్ తేదీలను ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్‌ను అధికారులు కోరారు. ఏ సెట్ బాధ్యత ఎవరికి? ఏ ఉమ్మడి పరీక్షను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి? ఎవరిని కన్వీనర్‌గా తీసుకోవాలి? ఏవిధంగా నిర్వహించాలి? అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అన్ని యూనివర్సిటీల వీసీలకు వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రతి ఏటా ఈఏపీ సెట్‌ను జేఎన్టీయూహెచ్కు అప్పగిస్తున్నారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. ఈసారి కూడా ఈ వర్సిటీకే ఈ సెట్ అప్పగించే వీలుంది. లాసెట్, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని భావిస్తున్నారు. ఐసెట్‌ను కాకతీయ వర్సిటీకి అప్పగించే వీలుందని తెలుస్తోంది. పాలిసెట్, ఈసెట్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సెట్లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కనీ్వనర్ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 12 నుంచి కౌన్సెలింగ్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. -
నీట్ పేపర్‌లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
పాట్నా: నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌లీక్‌లో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.పేపర్‌లీక్‌లో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వియాదవ్ పీఏకు పరిచయం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ నితీష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. అసలు నీటి పేపర్ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమారే అన్నారు. బీజేపీ బిహార్‌లో పవర్లోకి వచ్చినప్పుడల్లా పేపర్‌లీక్‌లు జరుగుతున్నాయన్నారు. నీట్ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ‘ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లీక్ వెనుక అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్లే’అని తేజస్వి ఆరోపించారు. -
0.001 శాతం నిర్లక్ష్యమున్నా పరిష్కరించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్–యూజీ 2024 పరీక్ష విధానం, నిర్వహణలో 0.001 శాతం లోపం తలెత్తినా సరే సకాలంలో పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. మే ఐదో తేదీన నిర్వహించిన నీట్‌యూజీలో కొందరు విద్యార్థులకు సమయాభావం, ఇతరత్రా కారణాలతో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల సెలవుకాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చేపట్టిన విషయం విదితమే. ‘‘ అత్యంత కఠినమైన ఇలాంటి ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతగా శ్రమిస్తారో మనందరికీ తెలుసు. వైద్యుడే సమాజంలో అవినీతికి పాల్పడితే సమాజానికి ఎంతటి నష్టం చేకూరుతుందో ఊహించండి. ప్రవేశపరీక్షలు నిర్వహించే ఒక బాధ్యతాయుత సంస్థగా ఒకే మాట మీద నిలబడాలి. మీ వైపు ఏదైనా తప్పు జరిగితే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిదిద్దేందుకు చేపట్టిన చర్యలనూ వివరించాలి. కనీసం ఆ దిశగా చర్యలకు సమాయత్తం అయ్యామని అయినా నిరూపించుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం పెరుగుతుంది’’ అని ఎన్టీఏ తరఫున వాదించిన లాయర్లకు కోర్టు చీవాట్లు పెట్టింది.రెండు వారాల్లో స్పందన తెలపండికేసుల తదుపరి విచారణ జరిగే జూలై 8వ తేదీలోపు ఏమేం చర్యలు చేపట్టారో నివేదించాలని కోర్టు సూచించింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోపు మీ స్పందన తెలపాలంటూ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా ‘‘దానికి ఎన్టీఏ, కేంద్రం సమాధానం చెప్తాయి. మీరెందుకు పిటిషన్లు వేశారో మమ్మల్ని అర్థంచేసుకోనివ్వండి.మీ వాదనలను సావధానంగా వినేందుకు సాయంత్రందాకా కూర్చుంటాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌నూ కోర్టు విచారించింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆ మార్కులను తీసేశామని కేంద్రం, ఎన్టీఏ జూన్ 13వ తేదీన కోర్టుకు నివేదించిన విషయం విదితమే. ఆ మార్కులు పోను మిగి లిన మార్కులతో ఆ విద్యార్థు లు కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు లేదంటే మరో సారి పరీక్ష రాసు కోవ చ్చు అని ఎన్టీఏ తెలిపింది. 4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులుమే ఐదున 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్‌యూజీ–2024 రాశారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంలో రాసిన వారిలో ఆరుగురికి సహా దేశవ్యాప్తంగా 67 మందికి 720కిగాను 720 మార్కులు పొంది టాప్‌ర్యాంక్ సాధించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడమే ఈ అనూహ్య టాప్‌ర్యాంకుల పర్వానికి అసలు కారణమని వెల్లడైంది. వ్యవహారం కోర్టుకు చేరడంతో వారందరికీ గ్రేస్ మార్కులు తొలగిస్తున్నామని ఎన్టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని, గోప్యత ఎందుకు పాటించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.సమయం వృథా అయితే ఆ మేరకు అదనపు సమయం పరీక్ష రాయించాలిగానీ విద్యార్థికి ఏ ప్రామాణిక ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇస్తారని విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నీట్‌యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. -
ఈఏపీ సెట్లో బాలురు భళా
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్)/పుల్లలచెరువు/బలిజిపేట/ఆదోని సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులను కొల్లగొట్టారు. అగ్రికల్చర్ విభాగంలో టాప్ టెన్‌లో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణు సాయి 97 మార్కులతో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి 93.44 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడలో మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 24వేల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. టాప్ టెన్‌లో 8 మంది ఏపీ విద్యార్థులు కాగా ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఈఏపీసెట్‌కు 3,62,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 2,74,213 మంది రిజిస్టర్ చేసుకోగా 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,95,092 (75.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకుంటే 80,766 మంది పరీక్ష రాశారు. వీరిలో 70,352 (87.11 శాతం) మంది అర్హత సాధించారు. తెలంగాణ ఈఏపీ సెట్లో రెండు విభాగాల్లోనూ టాప్–10లో నిలిచిన వారిలో నలుగురు విద్యార్థులు చొప్పున ఏపీ ఈఏపీసెట్‌లోనూ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన నంద్యాల జిల్లా గోస్పాద మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ తెలంగాణ ఈఏపీసెట్‌లో 4వ ర్యాంకు సాధించగా తాజాగా ఏపీ ఈఏపీసెట్‌లో 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. గతేడాది మాదిరిగానే ఇంజనీరింగ్‌కు అత్యధికంగా బాలురు, అగ్రికల్చర్ వైపు బాలికలు మొగ్గు చూపారు. వెబ్సైట్లో ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచామని, త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత వేగంగా ప్రవేశాలు కల్పించి.. తరగతులను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. 25 శాతం వెయిటేజీతో ర్యాంకులుమే 16 నుంచి 23 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించినట్టు సెట్ చైర్మన్, జేఎన్టీయూ–కాకినాడ వీసీ ప్రసాదరాజు చెప్పారు. ఈఏపీసెట్ పూర్తయిన అనంతరం ప్రాథమిక కీ విడుదల చేశామన్నారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్ వెరిఫికేషన్ కమిటీని నియమించామన్నారు. ఇందులో కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మార్కులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీసెట్‌లో అర్హత సా«దించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించామని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ (ఇన్చార్జి) కె.రామ్మోహనరావు, వైస్ చైర్పర్సన్ ఉమామహేశ్వరిదేవి, సెట్స్ ప్రత్యేక అధికారి సు«దీర్‌రెడ్డి, సెట్ కనీ్వనర్ వెంకటరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు పాల్గొన్నారు. సీట్లకు మించిన ఉత్తీర్ణత రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 1.60 లక్షలు ఉండగా ఈ ఏడాది అత్యధికంగా 1.95 లక్షల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణతలో ముందున్నారు. 1,48,696 మంది బాలురు పరీక్ష రాస్తే 1,09,926 (73.93 శాతం) మంది, 1,09,678 మంది బాలికలు పరీక్ష రాస్తే 85,166 (77.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు.జిష్ణుసాయికి ప్రథమ ర్యాంకు ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరు నగరానికి చెందిన మాకినేని జిష్ణుసాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 62వ ర్యాంకు సాధించాడు. గుంటూరు నగరానికి చెందిన మరో విద్యార్థి కోమటినేని మనీష్ చౌదరికి ఈఏపీసెట్‌లో 5వ ర్యాంకు లభించింది.సాయి యశ్వంత్‌రెడ్డికి రెండో ర్యాంక్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గుంటూరులోనే చదివిన కర్నూలుకు చెందిన మరో విద్యార్థి సాయి యశ్వంత్‌రెడ్డికి ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంకు లభించింది. ఇటీవల జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు దక్కించుకున్నాడు. తనది చాలా పేద కుటుంబమని.. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతానని యశ్వంత్ తెలిపాడు. జీవితంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడడమే తన లక్ష్యమని వెల్లడించాడు. సందేశ్‌కు మూడో ర్యాంక్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి.రామసుబ్బారెడ్డి, వి.రాజేశ్వరిల కుమారుడు బి.సందేశ్ ఏపీఈసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకును సాధించడం విశేషం. సందేశ్ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని తెలిపాడు. ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమన్నాడు. ఇద్దరికి 10వ ర్యాంక్ ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్ 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అతడి తండ్రి కొమ్మరిశెట్టి పోలయ్య గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. కుమారుడు మంచి ర్యాంకు సాధించడంతో వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. కాగా, ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు. -
AP: ప్రారంభమైన ఈఏపీ సెట్ పరీక్షలు
విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్(ఎంసెట్) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ప్రారంభం అయింది. అనంతరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలు జరగనుంది. రేపు( శుక్రవార) బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయి. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఎప్‌సెట్‌కి హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య 3,61,640. ఇందులో మహిళలు1,81,536 మంది. పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 వేలకి పైగా విద్యార్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేయనున్న ఉన్నత విద్యా మండలి పేర్కొంది. విద్యార్ధులను పరీక్షా కేంద్రం లోపలికి గంటన్నర ముందుగానే అనుమతి ఉంటుంది. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. విద్యార్ధులు చేతులకి మెహందీ పెట్డుకోకూడదు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంపైనా నిషేదం ఉన్నట్లు ఉన్నతి విద్యామండలి తెలిపింది. -
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సంయుక్తంగా విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.సంస్థ పరిధిలోని 38 సాధారణ పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు, 12 మైనారిటీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లు, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 25,216 మంది పరీక్షకు హాజరయ్యారు.» పాఠశాల స్థాయిలో ఐదో తరగతిలో ఎం.కీర్తి (విశాఖపట్నం జిల్లా), 6వ తరగతి పి.సోమేశ్వరరావు (విజయనగరం జిల్లా), 7వ తరగతి కె.ఖగేంద్ర (శ్రీకాకుళం జిల్లా), ఎనిమిదో తరగతిలో వై.మేఘ శ్యామ్ (విజయనగరం జిల్లా) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. » రాష్ట్రంలోని ఏడు జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,149 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో జి.యశ్వంత్ సాయి, ఎంఈసీ/సీఈసీ విభాగంలో ఎల్.సత్యరామ్ మోహన్ (తూర్పు గోదావరి), బైపీసీ విభాగంలో ఎం.మహిత (కర్నూలు జిల్లా) అత్యధిక మార్కులు సాధించారు. వీరితో పాటు నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను https://aprs.apcfss.in/ లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు. -
ఇంజనీరింగ్ సెట్‌కు భారీ హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష మూడో రోజు ప్రశాంతంగా ముగిసింది. గడచిన రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ జరిగితే, గురువారం ఇంజనీరింగ్ సెట్ తొలి రోజు జరిగింది. ఈ విభాగానికి 2,54,539 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,01,956 మంది తొలి రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉండగా 96,228 (94.4 శాతం) మంది పరీక్షకు హాజరైనట్టు ఈఏపీసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంలో అత్యధికంగా 99 శాతం హాజరు కన్పించింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్ జిల్లాల్లో ఇంజనీరింగ్ సెట్ కేంద్రాలకు 90 శాతంపైనే విద్యార్థులు హాజరయ్యారు. అకాల వర్షం కారణంగా ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సెట్ కో–కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అన్ని చోట్లా జనరేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడా విద్యార్థులకు ఎలాంటి సమస్య తెలెత్తలేదని తెలిపారు. అయితే, హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొద్దిసేపు కంప్యూటర్లు తెరుచుకోలేదు. సమస్య పరిష్కరించేసరికి 15 నిమిషాలు పట్టిందని కూకట్పల్లి విద్యార్థిని మనోజ్ఞ తెలిపారు. మరో రెండు రోజులు ఇంజనీరింగ్ సెట్ జరగాల్సి ఉంది.పేపర్ మధ్యస్తంతొలి రోజు ఇంజనీరింగ్ సెట్ పేపర్ మధ్యస్తంగా ఉన్నట్టు విద్యార్థులు, అధ్యాపకులు తెలిపారు. మేథమెటిక్స్‌లో ఇచ్చిన ప్రశ్నలు తెలిసినవే అయినప్పటికీ, సమాధానాలు రాబట్టేందుకు సుదీర్ఘంగా ప్రయత్నించాల్సి వచ్చినట్టు వరంగల్ విద్యార్థి అభిలాష్ తెలిపారు. సమాధానాల కోసం ఎక్కువ సేపు ప్రయత్నించాల్సి వచ్చినట్టు, దీనివల్ల ఇతర ప్రశ్నలు రాయలేక పోయామని ఖమ్మం విద్యార్థిని అలేఖ్య తెలిపారు. అయితే, సాధారణ విద్యార్థి 35 నుంచి 40 ప్రశ్నలకు సమా«దానం తేలికగా చేసే వీలుందని మేథ్స్ సీనియర్ అధ్యాపకుడు ఎంఎన్‌రావు తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, స్ట్రైట్‌లైన్స్, పెయిర్స్ ఆఫ్ లైన్స్, త్రీడీ చాప్టర్ల నుంచి వచ్చినట్టు ఆయన విశ్లేషించారు. రసాయనశాస్త్రంలో 25 ప్రశ్నలు తేలికగా, నేరుగా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. ఆర్గానిక్ కెమెస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, ఎస్,పీ,డీ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు తేలికగా ఉన్నట్టు విశ్లేషించారు. ఫిజిక్స్ పేపర్ మధ్యస్థంగా ఉందని, 20 ప్రశ్నలు తేలికగా చేసే వీలుందని అధ్యాపకులు తెలిపారు. ఫార్ములా, కాన్సెప్ట్ విధానం నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మెకానిక్స్, ఎస్హెచ్ఎం, విక్టరీస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, వేవ్స్, ఆప్టిక్స్ చాప్టర్ల నుంచి తేలికగా సమాధానం ఇవ్వగల ప్రశ్నలు వచ్చినట్టు చెప్పారు. -
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
సాక్షి,విజయవాడ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్ రేపు (మే5) జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఏపీ నుంచి75 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.ఏపీలో 29 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు మద్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్దులికు సెంటర్లోకి అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. -
21న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో రాయవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
వచ్చే నెలాఖరు కల్లా గురుకుల ప్రవేశ పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు నిర్దేశించుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు నాటికే అన్నిరకాల ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గురుకుల సొసైటీలు ఉమ్మడిగా నిర్వహించే ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఇప్పటికే పూర్తి చేశాయి. విడివిడిగా నిర్వహించే బ్యాక్లాగ్ ఖాళీలు, జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు, డిగ్రీ, పీజీ కోర్సుల్లోనూ సంవత్సరం ప్రవేశాలకు అర్హత పరీక్షలను తేదీలను ప్రకటించి.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మే నెలాఖరు నాటికి ఫలితాలు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖల ఆధ్వర్యంలోని గురుకుల సొసైటీలు ఉమ్మడిగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నాయి. దాదాపు 50వేల సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఈసారి 1.5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అధికారులు వారి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక సొసైటీల వారీగా గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వీటికి పరీక్షలను నిర్వహించగా.. మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీలు వారంలోగా పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇక గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల అర్హత పరీక్షలు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల పరీక్షను ఏప్రిల్ 28వ తేదీ నాటికి అన్ని సొసైటీలు పూర్తి చేయనున్నాయి. పీజీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. వాటి ఫలితాలను మే నెలాఖరు నాటికి ప్రకటించాలని, జూన్ తొలివారం నుంచి 2024–25 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఆ తర్వాత క్రమంగా ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మే 9 నుంచి టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీసెట్)ను మే 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ దీన్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నామన్నారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌పీజీ సెట్)ను జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో మంగళవారం సెట్స్ తేదీలు వెల్లడించారు. మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహ్మమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఎంసెట్.. టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఈఏపీసెట్), టీఎస్ ఈ సెట్, టీఎస్ ఎడ్‌సెట్ సహా మొత్తం ఎనిమిది ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ప్రకటించింది. రాబోయే 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే పరీక్షల తేదీలు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గతంలో టీఎస్ ఎంసెట్‌గా ఉన్న పేరును గత కొంతకాలంగా విడిగా నీట్ ద్వారా మెడిసిన్ ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో టీఎస్ఈఏపీసెట్గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొ. ఆర్, లింబాద్రి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ ప్రొ. ఎస్కే మహమూద్, జేఎన్టీయూ–హెచ్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.టి.రమేశ్ పాల్గొన్నారు. ఈ ప్రవేశపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ..షెడ్యూల్, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ పీజు తదితరాల గురించి సంబంధించి సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎనిమిది ప్రవేశపరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు) టీఎస్ సెట్ల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.... -
NEET PG Exam 2024; జూలై 7న నీట్ పీజీ పరీక్ష
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్–పీజీ పరీక్షను ఈ ఏడాది జూలై 7వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు కటాఫ్ అర్హత తేదీ ఈ ఏడాది ఆగస్ట్ 15గా పేర్కొంది. నీట్ పీజీ పరీక్షను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం గుర్తు చేసింది. ఈ పరీక్షను సవరించిన షెడ్యూ ల్ను అనుసరించి జూలై 7వ తేదీన నిర్వహి స్తామని వివరించింది. ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ఒక్క అర్హత పరీక్ష నీట్ పీజీ ఎలిజిబిలిటీ కం ర్యాంకింగ్ పరీక్ష. -
25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా!
‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన రాజ్‌కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్‌కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్‌కరణ్ ఎట్టకేలకు ఎంఎస్సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రాజ్‌కరణ్ తన సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్‌కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్‌కరణ్‌కు గణితంలో ఎంఎస్సీ చేయాలనే ఆలోచన వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్పూర్)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. ఎట్టకేలకు 2020లో ఎంఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్సీ ఫైనల్‌ను పూర్తి చేశాడు. రాజ్‌కరణ్ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్‌కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ కరణ్ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్‌కరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్ కరణ్ తెలిపాడు. ఫెయిల్యూర్‌తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్ కరణ్ సలహా ఇస్తుంటాడు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
కోటాలో రాలిన మరో విద్యా కుసుమం.. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని..
కోటా(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్జోత్ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్’ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్జోత్కు అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు. విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్జోత్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు. మన్జోత్ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. -
చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..
Chinese Millionaire: చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించి ధనవంతుడవొచ్చు. ఇది సాధారణ ప్రజల ఫిలాసఫీ. అయితే కొంత మంది ఒక స్థాయికి చేరితే చదువును కూడా మధ్యలో ఆపేస్తారు. కానీ దానికి భిన్నంగా చైనాలో ఒక ధనవంతుడు ఒక పరీక్షను 27 సార్లుగా రాస్తూనే ఉన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైనాకి చెందిన 56 సంవత్సరాల 'లియాంగ్ షి' (Liang Shi) అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 27 సార్లు రాసినట్లు తెలుస్తోంది. 'గావోకావో' అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రతిష్టాత్మకమైన సిచువాన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నాడు. అయితే ఈ సారి కూడా అందులో సెలక్ట్ కాలేకపోయాడు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా లక్ష్యం చేరే వరకు ప్రయత్నం ఆపమని దీక్ష పట్టి కూర్చుకున్నాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) నిజానికి లియాంగ్ చైనాలోని ధనవంతుల జాబితాలో ఒకరు. మిలీనియర్ అయినప్పటికీ ఎలాగైనా ఆ పరీక్షల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఉన్నత విద్యను పొందడం కోసం కష్టతరమైన పరీక్షలో విజయం సాధించాలనే తపనతో, రోజుకు 12 గంటల పాటు చదువుకుంటూ ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాడు. 27 సార్లు ఒకే పరీక్ష రాస్తూ ఎంపిక కాకపోవడంతో ఎంతో మంది ఎగతాళి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) గావోకావో (Gaokao) గావోకావో అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. దీని అసలు పేరు 'నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (NCEE). చైనాలో ఈ పరీక్షను గావోకావో అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్‌ను సంవత్సరానికి ఒకేసారి మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది ఒక అవసరం. -
పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిప్లొమా సాంకేతిక విద్యకు ఉద్దేశించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్– 2023 (పాలిసెట్)లో గోదావరి జిల్లాల విద్యార్థుల హవా కొనసాగింది. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది 120కి 120 మార్కులు సాధించి ప్రథమ–ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి ర్యాంకును కాకినాడ జిల్లాకు చెందిన గోనెళ్ల శ్రీరామ శశాంక్ సాధించాడు. మే 10న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు సి.నాగరాణి శనివారం విజయవాడలో విడుదల చేశారు. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని ఆమె చెప్పారు. పాలిసెట్‌కు 1,43,625 మంది హాజరయ్యారని, 1,24,021 మంది (86.35 శాతం) విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణుల్లో 74,633 మంది బాలురు (84.74శాతం), 49,388 మంది బాలికలు (88.90శాతం) ఉన్నట్టు వివరించారు. అత్యధికంగా 10,516 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లా నుంచి అర్హత సాధించారన్నారు. 120 మార్కులకు 30 మార్కులు (25 శాతం) అర్హతగా పరిగణించామన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైన అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు వివరించారు. ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించామని, గణితంలోనూ ఒకేలా వస్తే భౌతిక శాస్త్రం మార్కులు, అందులోనూ సమానంగా వస్తే పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అక్కడా సమాన మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ర్యాంకు కార్డులను https://polycetap.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని, 29 నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు వెబ్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 39 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఈ ఏడాది నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 840 సీట్లతో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులకు 268 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి గన్నవరం ప్రభుత్వ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్‌లో రెండు కోర్సులు, కాకినాడ బాలికల కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో కొత్త కరిక్యులమ్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు. 4 వేల మందికి ప్లేస్‌మెంట్స్ ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు సాధించినట్టు వివరించారు. వార్షిక వేతనం అత్యధికంగా రూ.6.25 లక్షలు, సరాసరి వేతనం రూ.2.50 లక్షలుగా ఉందని చెప్పారు. 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యా దీవెన కింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెనగా రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి కేవీ రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ప్లేస్మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 120 కి120 మార్కులు సాధించిన విద్యార్థులు ♦ గోనెళ్ల శ్రీరామ శశాంక్ (కాకినాడ) ♦ వనపర్తి తేజశ్రీ (తూర్పు గోదావరి) ♦ కొంజర్ల శంకర్ మాణిక్ (తూర్పు గోదావరి) ♦ దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ (తూర్పు గోదావరి) ♦ శీల గౌతమ్ (తూర్పు గోదావరి) ♦ గ్రంధె గీతిక (తూర్పు గోదావరి) ♦ అగ్గాల కృష్ణ సాహితి (తూర్పు గోదావరి) ♦ ఉరింకాల జితు కౌముది (తూర్పు గోదావరి) ♦ పాల గేయ శ్రీ సాయి హర్షిత్ (తూర్పు గోదావరి) ♦ కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ (తూర్పు గోదావరి) ♦ కొడవటి మోహిత్ శ్రీరామ్ (పశ్చిమ గోదావరి) ♦ దొంగ శ్రీ వెంకట శర్వణ్ (పశ్చిమ గోదావరి) ♦ కానూరి భాను ప్రకాష్ (పశ్చిమ గోదావరి) ♦ దుద్దుపూడి రూపిక (తూర్పు గోదావరి) ♦ కప్పల వెంకటరామ వినేష్ (తూర్పు గోదావరి) -
లేటు వయసులోనూ నీట్ రాశారు..69 ఏళ్ల వయసులో పేదల కోసం..
సాక్షి, విశాఖపట్నం: పేదలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 69 ఏళ్ల వయసులోనూ ఎంబీబీఎస్ చేసేందుకు సంకల్పించారు విశ్రాంత ప్రొఫెసర్ డీకేఏఎస్ ప్రసాద్. సేవాభావం ముందు వయసు ఎప్పుడూ చిన్నదేనంటున్న ప్రసాద్ విజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయం కేంద్రంలో ఆదివారం నీట్ పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన ప్రొఫెసర్ ప్రసాద్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. కరోనా సమయంలో అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు. హోమియో వైద్యంపై కొంత అవగాహన ఉన్న ప్రొఫెసర్ ప్రసాద్ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఎంతో అభిమానం, అభిరుచి గల వైద్య వృత్తిని కొనసాగించాలంటే ఆయనకు పట్టా లేదు. ఎంబీబీఎస్ చదవకుండా వైద్య వృత్తి చేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన నీట్‌కు దరఖాస్తు చేశారు. వయో పరిమితి ఎత్తివేయడంతో.. నీట్ పరీక్ష రాయడానికి ఇప్పుడు వయసు నిబంధనలేవీ లేవు. గతంలో 21 సంవత్సరాలలోపు వయసు వారికి మాత్రమే నీట్ పరీక్షకు అనుమతి ఉండేది. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేయడంతో.. వైద్యుడు కావాలన్న ఆకాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం ప్రొఫెసర్ ప్రసాద్‌కు లభించింది. ఆయన దరఖాస్తు చేసిన వెంటనే హాల్‌టికెట్ రాగా.. ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష బాగా రాశానని.. తనకున్న అనుభవం వల్ల పరీక్షలో ర్యాంక్ సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్పారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో.. తాను పట్టా తీసుకుంటే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనతో పరీక్ష రాశానన్నారు. చదవండి: ఉన్నత విద్యే లక్ష్యం -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్‌లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్‌కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్‌లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్‌ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 67.00, ఈడబ్ల్యూఎస్‌కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్‌లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
నీట్ ప్రవేశపరీక్షకు రికార్డు దరఖాస్తులు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ప్రవేశ పరీక్ష రాయడానికి ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.87 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువ. ఈసారి అమ్మాయిలు ఎక్కువ మంది పరీక్ష రాస్తూ ఉండడం విశేషం. మొత్తం రిజిస్ట్రేషన్లలో అమ్మాయిలు 11.8 లక్షలున్నారు. అబ్బాయిల కంటే 2.8 లక్షలు అధికంగా మెడికల్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షకి హాజరుకానున్నారు. మే 7న నీట్ పరీక్ష జరగనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కానుండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ నిలిచింది. -
‘జేఈఈ’ సెషన్–2కు అభ్యర్థుల తాకిడి
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2023 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్ కన్నా రెండో సెషన్‌నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే, ఈసారి తొలిసెషన్ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్ కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్–1కు.. 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్ పరీక్షలు ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ సెషన్ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ ప్లస్2కు సంబంధించిన ప్రాక్టికల్స్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు.. ఇంటర్మీడియెట్ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తొలి సెషన్లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 30 లోపు ఇక జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశముంటుంది. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. -
మే 15 నుంచి ఏపీఈఏపీసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), లేటరల్ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్ మే 5న, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా... -
Telangana: మే 7 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023ను మే 7న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తోంది. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. -
నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ యూజీ- 2023 తేదీలు ఖరారయ్యాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ). మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నీట్ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ nta.ac.in, neet.nta.nic.inలలో లభిస్తాయి. ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్ యూజీ ఎగ్జామ్ విధానం, సిలబస్, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలను విడుదల చేయనుంది ఎన్టీఏ. ఈ పరీక్ష రాసేందుకు 17 ఏళ్లు ఆపైబడిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియెట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు నీట్ పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయూష్, 47 బీవీఎస్సీ, ఏహెచ్ కళాశాలలు నీట్ స్కోర్‌ను అనుమతిస్తున్నాయి. మరోవైపు.. ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్-2023 తేదీలను సైతం ఎన్టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్ పరీక్షలకు సంబంధించి రిజర్వ్ తేదీ జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది ఎన్టీఏ. ఇదీ చదవండి: కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు -
టీఎస్‌ఐసెట్‌లో తొలి 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులవే
కేయూ క్యాంపస్(వరంగల్): తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022–2023 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించిన టీఎస్ఐసెట్–2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఫైనల్ కీని శనివారం విడుదల చేశారు. తెలంగాణలోని 14 రీజియన్ సెంటర్లు, ఏపీలో 4 రీజియన్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన టీఎస్ ఐసెట్‌కు 68,781 మంది అభ్యర్థులు హాజరుకాగా, 61,613 మంది(89.58%)ఉత్తీర్ణులయ్యారు. అందులో పురుషులు 33,855 మంది పరీక్షకు హాజరుకాగా 30,409 మంది (89.82%), మహిళలు 34,922మందికి 31,201మంది (89.34%)ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్జెండర్లు నలుగురు హాజరుకాగా అందులో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు దక్కాయి. వీరిలో గుంటూరుకు చెందిన దంతాల పూజితవర్ధన్ 170.61 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ పొందగా, వైఎస్సార్ కడపకు చెందిన అంబవరం ఉమేష్‌చంద్రరెడ్డి రెండో ర్యాంకు (167.36 మార్కులు), గుంటూరుకే చెందిన కాట్రగడ్డ జితిన్‌సాయి మూడో ర్యాంకు (166.74 మార్కులు) సాధించారు. నాలుగో ర్యాంకు తెలంగాణాకు చెందిన మహబూబాద్ జిల్లా కేసముద్రం వాసి, 8వ ర్యాంకు వరంగల్ జిల్లా వాసి దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన త్రివేది సువర్ణ సాత్విక (151.20 మార్కులు) పదో ర్యాంక్ పొందారు. ఫలితాలు టీఎస్ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. -
ఐసెట్‌కు 90% హాజరు
సాక్షి, హైదరాబాద్/ కేయూ క్యాంపస్ (వరంగల్): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూని వర్సిటీ రెండ్రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఐసెట్)కు 90.56% హాజరైనట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి తెలి పారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో 27, 28 తేదీల్లో ఐసెట్ జరిగింది. మొత్తం 75,952 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 68,781 (90.56%) హాజర య్యారని, 7171 (9.44 శాతం) గైర్హాజరైనట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. ఐసెట్ ప్రాథమిక కీ ఆగస్టు 4న విడు దల చేస్తారని, అభ్యంతరాలు 8వ తేదీ వరకు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు. ఫైనల్ కీ, ఫలితాలు ఆగస్టు 22న విడుదల చేస్తారని తెలిపారు. -
నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేఖ రాసింది. ఇంజనీరింగ్, మెడిసిన్ తరహాలోనే నర్సింగ్ విద్యలోనూ ప్రమాణాలు పెంచడానికి నీట్ లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 2020లోనే నిర్ణయించింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్ సెట్ నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో కరోనాతో మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా మినహాయింపు కోసం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రయత్నించగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిరాకరించింది. దీంతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని కోరుతూ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి సుమారు 200 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు ఉండగా 12 వేల వరకు సీట్లు ఉన్నాయి. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏపీలో నర్సింగ్ కోర్సులు చేయడానికి వస్తుంటారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈఏపీసెట్, నీట్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు చేపట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈఏపీసెట్ దరఖాస్తుకు సమయం ముగిసింది. మరోవైపు నీట్ స్కోర్ ఆధారంగానూ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అవకాశం కల్పించింది. అయితే నీట్‌కు కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి ప్రత్యేకంగా నర్సింగ్ సెట్‌ను నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వంద మార్కులకు పరీక్ష నాలుగేళ్ల నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ల్లో 20 మార్కుల చొప్పున ప్రశ్నలిస్తారు. జనరల్ విద్యార్థులు కనీసం 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 40, దివ్యాంగులు (జనరల్) 45, దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) 40 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు చేపడతారు. ఈ ఏడాదికి నర్సింగ్ సెట్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లను, నీట్ యూజీ ద్వారా యాజమాన్యం కోటా సీట్లను భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఈఏపీసెట్ ద్వారా ప్రవేశాలు ఈ విద్యా సంవత్సరానికి నర్సింగ్ ప్రవేశాల కోసం నర్సింగ్ సెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాం. 2023–24 నుంచి ఈఏపీసెట్ ద్వారా నర్సింగ్ ప్రవేశాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. – డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం -
జూలై 20న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ–2022) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సోమవారం విడుదల చేశారు. జూలై 20న ఈ పరీక్ష ఉస్మానియా వర్సిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకూ దరఖాస్తు చేసు కోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వీలుంది. పరీక్ష ఫీజును ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.450 చెల్లించాలి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లింబాద్రితో పాటు ఓయూ ఇన్చార్జి వీసీ సీతారామారావు, రిజి స్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి సెట్ వివరాలు వెల్లడించారు. డిగ్రీ ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు.. ►రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు. ►ఈసారి పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో గుణాత్మక మార్పులు తెచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే. ►నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్లైన్, డిస్టెన్స్మోడ్లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ►పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్లైన్లో పొందుపర్చాలి. మిగిలిపోతున్న సీట్లు.. ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మరీ తక్కువ ప్రవేశాలుంటున్నాయి. గతేడాది గజ్వేల్ కాలేజీలో పీజీ కెమిస్ట్రీలో ఐదుగురే చేరారు. వాళ్లను వేరే కాలేజీలకు పంపాల్సి వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా మండలి సరైన విధానం అనుసరించాలి. ఈ ఏడాది కూడా 44 వేల సీట్లున్నాయి. కొత్త కోర్సులకు అనుమతిస్తే మరో వెయ్యి సీట్లు పెరిగే వీలుంది. – ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి (సీపీజీఈటీ–2022 కన్వీనర్) -
ఈనెల 30న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న అర్హత పరీక్ష నిర్వహించ నున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ శాఖ కార్యదర్శి సి.శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్–2022 దరఖాస్తు గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడిం చారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఏపీ ఐసెట్–2022: జూన్ 10 వరకు దరఖాస్తుకు గడువు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎన్. కిషోర్‌బాబు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జూలై 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించాలని సూచించారు. -
జేఈఈ.. ఆసక్తి తగ్గుతుందోయీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం అధీనంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవే శాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)పై విద్యార్థుల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతోంది. 2014లో జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 13.57 లక్షలమంది దర ఖాస్తు చేసుకోగా గతేడాది ఈ సంఖ్య 10.48 లక్షలకు తగ్గింది. దరఖాస్తు చేసిన వారి లోనూ దాదాపు లక్ష మంది పరీక్ష రాసేం దుకు ఇష్టపడట్లేదు. రాష్ట్రాల ఎంసెట్ పేపర్ల తో పోలిస్తే జేఈఈ పరీక్ష పేపర్లు విశ్లేష ణాత్మకంగా ఉండటం, ప్రశ్నలు ఎక్కువ భాగం సుదీర్ఘంగా ఉండటం కూడా కారణ మని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యా ర్థులు ఎక్కువగా రాష్ట్రాల సెట్లపై దృష్టి పెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రస్థాయి, కేంద్రస్థాయి సిలబస్‌లో ఉన్న కొన్ని చిక్కులవల్ల కూడా జేఈఈని విద్యా ర్థులు కఠినంగా భావిస్తూ క్రమంగా పరీక్షకు దూరమవుతున్నట్లు ఉందని చెబుతున్నారు. రాష్ట్రాల్లోనూ పెరిగిన వనరులు రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విసృ ్తత మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధి కోర్సుల్లో సీట్లు పెరగడం కూడా జేఈఈ హాజరు తగ్గడానికి ఓ కారణమని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంక టరమణ తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లా, టీచింగ్, ఎంబీఏ వంటి కోర్సుల వైపు విద్యా ర్థులు మళ్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ తర్వాత విదేశీ విద్యకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారు జేఈఈ వంటి కష్టమైన పరీక్షల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ కోర్సుల ప్రాధాన్యత పెరగడం వల్ల ఉపాధి అవకా శాలు మెరుగవుతున్నాయని, వాటి ఆధారం గా విదేశీ విద్య, అక్కడ ఉపాధి అవకా శాలు మెరుగవుతాయనే ఆలోచన కూడా జేఈఈకి విద్యార్థులు క్రమంగా దూరం జరగడానికి కారణమవుతోందని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి చెప్పారు. పట్టు సాధించలేక... కరోనా లాక్డౌన్ సమయంలో కోచింగ్ సెంటర్లు మూతపడటం వల్ల విద్యార్థులు పెద్దగా సన్నద్ధమవ్వలేకపోయారని, ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని జేఈఈ గణిత శాస్త్ర అధ్యాపకుడు సత్యా నంద్ విశ్లేషించారు. 2021లో అన్ని రాష్ట్రా ల్లోనూ తొలుత ఆన్లైన్ క్లాసులే జరగడంతో జేఈఈకి సిద్ధం కావడంపై పట్టు సాధించ లేకపోయామనే భావన విద్యార్థుల్లో ఉందని ఓ ప్రైవేటు కాలేజీలో రసాయనశాస్త్ర అధ్యా పకుడిగా పనిచేస్తున్న కొసిగి రామనాథం తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారిలో 30 శాతం మాత్రమే సీరియస్‌గా ప్రిపేపర్ అవు తున్నారని, మిగతావారు అరకొరగా సన్నద్ధ మయ్యే వాళ్లేనని 15 ఏళ్లుగా జేఈఈ కోచింగ్ ఇస్తున్న శ్యామ్యూల్ అభిప్రాయపడ్డారు. -
జూలై అంతా ‘సెట్’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షలను జూలైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇతర పరీక్షలు రాయాల్సి వస్తే ఆయా సెట్ల తేదీల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. మండలి కార్యాలయంలో మంగళవారం వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్.శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌తో చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ ప్రవేశ పరీక్షకూ ఫీజులు పెంచడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఫీజులే వర్తిస్తాయని చెప్పారు. ఎంసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందని, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్ల నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సెట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్లో వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి, ఇతర సెట్ల బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించామని చెప్పారు. కాగా జూలై 13న ఈసెట్, జూలై 14 నుంచి 20 మధ్య ఎంసెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
6 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్–2022) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈసారి కూడా ఈ పరీక్షను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లలో.. జూలై 14 నుంచి 20వ తేదీ మధ్య ఈ పరీక్ష జరుగుతుంది. ఇంటర్మీడియెట్ తత్సమానమైన పరీక్ష రెండో ఏడాది రాస్తున్న అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఎంసెట్‌ను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ ద్వారా ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచ్‌ల్లో సీట్లు పొందే వీలుంది. 70 శాతం సిలబస్‌తోనే.. ఈసారి కూడా 70 శాతం ఇంటర్ సిలబస్‌లోంచే ఎంసెట్ ప్రశ్నావళి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇంటర్ సిలబస్‌ను కుదించిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌లో మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు. 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఎవరి జోన్లో వారు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పెరగనున్న అభ్యర్థుల సంఖ్య! ఈసారి కూడా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగే వీలుంది. ఇంటర్ విద్యార్థులందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైన నేపథ్యంలో అందరూ ఎంసెట్ రాసేందుకు అవకాశం ఏర్పడింది. 2021లో నిర్వహించిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94,550 మంది (85.70) అర్హత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 175 ఉన్నాయి. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 79,790 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఈసెట్ దరఖాస్తులు డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే వారికి నిర్వహించే ఈ–సెట్ కోసం కూడా ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఈసెట్ విభాగం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూన్ 8గా పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https:// ecet. tsche. ac. in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు. జూలై 13న ఈసెట్ నిర్వహించనున్నారు. ఫీజును రూ.400 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు), రూ.800 (ఇతరులకు) ప్రకటించారు. -
ఏప్రిల్ 3న ‘ప్రగతి– డాక్టర్ చుక్కా రామయ్య’ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు ‘ప్రగతి– డాక్టర్ చుక్కా రామయ్య’ టెస్ట్‌ను ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చెప్పారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతినగర్ సొసైటీల్లో ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలో ప్రవేశం కోసం ఏప్రిల్ 3న తెలంగాణలోని జిల్లాల్లో ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 91000 92345ను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కె. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్‌రెడ్డి, కరస్పాండెంట్ డి. దయాకర్‌రెడ్డి, విద్యాసంస్థల ప్రతినిధి సాంబశివరావు పాల్గొన్నారు. (క్లిక్: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?) -
మేమే ‘సెట్’ చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలతో పాటు, రాష్ట్రాల్లో నిర్వహించే విద్యా సంబంధమైన సెట్లన్నీ తామే నిర్వహించేందుకు అనుమతించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కోరింది. ఈ దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు కొన్ని ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా పరీక్షలు ఎన్టీఏకి అప్పగింతపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కేంద్రం కోరడం గమనార్హం. జేఈఈ, నీట్ వంటి పరీక్షలను ఎన్టీఏ స్వతంత్రంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రం ఎంసెట్, ఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇలాగే ఇతర రాష్ట్రాలు కూడా సెట్లు నిర్వహిస్తుంటాయి. అయితే ఇలా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రాలు నిర్వహించే సెట్లన్నీ భవిష్యత్తులో తామే నిర్వహించాలని ఏజెన్సీ భావిస్తోంది. గత కొన్నాళ్ళుగా తాము నిర్వహించే పరీక్షలకు విశ్వసనీయత, ప్రామాణికత ఉందని ఎన్టీఏ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించడంతో పాటు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, ఉన్నత ప్రమాణాలతో ఉండేలా తాము చూడగలమని ఈ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోటీ పరీక్షల తీరుతెన్నులపై ఆన్లైన్ సర్వే చేపట్టి, ఆ వివరాలతో కూడిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ముందుంచింది. పలు రాష్ట్రాల్లో సెట్ల నిర్వహణలో సమన్వయం కొరవడుతోందన్న వాదనను తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణలో ఇన్నేళ్లుగా ఇలాంటి సమస్యలేవీ రాలేదన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రాల విముఖత! కేంద్రీకృత పరీక్ష విధానంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సుముఖంగా లేవు. వాస్తవానికి ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులు, వనరులు, సమయాన్ని బట్టి రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఎంసెట్ పరీక్షను జేఈఈ మెయిన్, ఇతర పోటీ పరీక్షలు, అకడమిక్ పరీక్షల తేదీలను బట్టి నిర్వహిస్తారు. రాష్ట్రంలోని విద్యార్థుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల నిర్ధారణ, పరీక్ష కేంద్రాల నిర్వహణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మరిన్ని వెసులుబాట్లకు అవకాశం ఉంటుందని అంటున్నారు. పరీక్ష పేపర్ల రూపకల్పనలో స్థానిక ఫ్యాకల్టీ ప్రాధాన్యతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏ లాంటి సంస్థలు జాతీయ స్థాయిలో ఫ్యాకల్టీని ఎంపిక చేసుకుని, పరీక్ష పేపర్లు రూపొందిస్తే, ఆ ప్రామాణికతను అన్ని స్థాయిల విద్యార్థులు అందుకోలేరని అంటున్నారు. ఫీజుల భారం పెరిగే అవకాశం పోటీ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలు అన్ని వర్గాలను, స్థానిక అంశాలను పరిగణనలోనికి తీసుకుంటాయని ఉన్నత విద్యా మండలికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంసెట్‌కు రాష్ట్ర విద్యార్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుందని ఉదహరించారు. కానీ నీట్, జేఈఈ పరీక్షలకు రూ.2 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోందని, ఇది పేద విద్యార్థులకు భారంగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎన్టీఏ రాష్ట్రాల సెట్లు నిర్వహిస్తే ఆ ఫీజులు కూడా భారంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణకు స్వీయ సామర్థ్యం ఉంది రాష్ట్రంలో ఎంసెట్, దోస్త్ నిర్వహణలో ఏటా ఉన్నత విద్యా మండలి సమర్థత రెట్టింపు అవుతోంది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నాం. కోవిడ్ కష్టకాలంలోనే చిన్న సమస్య కూడా లేకుండా ఎంసెట్‌ను నిర్వహించాం. స్వీయ సామర్థ్యం, అనుభవం ఉన్న మేము ఇతరుల ప్రమేయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. –ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
జేఈఈ మెయిన్‌కు రెండుసార్లే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ మెయిన్‌ను ఇక నుంచి రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ఏడాది (2022) నుంచి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ను జరపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కి హాజరయ్యేందుకు విద్యార్థులకు రెండు చాన్సులు మాత్రమే ఉంటాయి. గతేడాది కరోనా నేపథ్యంలో మెయిన్ పరీక్షను నాలుగుసార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విద్యార్థులకు నాలుగుసార్లు పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. గతేడాది అస్తవ్యస్తం.. జేఈఈ మెయిన్‌ను గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నిర్వహించాలని ముందు నిర్ణయించారు. అయితే.. కోవిడ్‌తో ఏప్రిల్, మే నెలల పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కానీ పూర్తి కాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. మల్టీసెషన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించారు. అయితే ఈ నాలుగు చాన్సుల విధానంలో కొన్ని లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మొదటి చాన్సులో ప్రతిభ చూపని అభ్యర్థులు చివరి దశ పరీక్షలో అధిక మార్కులు సాధించడం గమనార్హం. గతేడాది నాలుగుసార్లు నిర్వహించిన పరీక్ష స్కోరుల్లో అత్యుత్తమమైన దాన్ని అభ్యర్థి తుది స్కోర్‌గా ఎన్టీఏ పరిగణించింది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటించింది. ఇలా నాలుగుసార్లు రాసుకునే అవకాశం కల్పించడం వల్ల కొంతమంది విద్యార్థులు గణనీయంగా లబ్ధి పొందారు. ఈసారి త్వరగా ప్రవేశాలు.. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనాతో వివిధ బోర్డుల 12వ తరగతి పరీక్షలను చాలా ఆలస్యంగా నిర్వహించారు. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలు సకాలంలో అంటే.. ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) పరీక్షలను ఏప్రిల్ చివరి వారం నుంచి నిర్వహించనున్నారు. దీంతో ఈసారి జేఈఈ మెయిన్‌ను రెండుసార్లకే పరిమితం చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల కానుంది. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
నీట్ రద్దుకు.. ఎందాకైనా!
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష రద్దు కోసం ఇక చట్టపరంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని, తమిళ విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంత వరకైనా వెళ్తామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): నీట్ రద్దు కోసం డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇక ఈ పరీక్షకు వ్యతిరేకంగా గత ఏడాది అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్.. రాష్ట్రపతికి పంపించకుండా తుంగలో తొక్కడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశానికి అసెంబ్లీ వేదికగా రెండు రోజుల క్రితం సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో నామక్కల్ కవింజర్ మాళిగైలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. గవర్నర్ తీరుపై.. అసెంబ్లీ తీర్మానాన్ని తుంగలో తొక్కిన గవర్నర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా ఇక, చట్టపరమైన చర్యలకు ఈ సమావేశంలో తీర్మానించారు. సీఎం స్టాలిన్ సమావేశంలో మాట్లాడుతూ.. తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించకుండా గవర్నర్ వ్యవహరించడం అసెంబ్లీ హక్కుల్ని కాలరాసినట్టు కాదా..? అని ప్రశ్నించారు. వృథా అవుతున్న.. విద్యార్థుల శ్రమ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ మీడియాకు వివరించారు. నీట్ శిక్షణ కేవలం సంపన్నులకే పరిమితం అవుతోందన్నారు. 12 ఏళ్లు రేయింబవళ్లు విద్యార్థులు పడ్డ శ్రమ, నేర్చుకున్న పాఠాలు నీట్ కారణంగా వృథా అవుతున్నాయని ధ్వజమెత్తారు. ఇది వరకు నీట్ విషయంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినప్పుడు తమ రాష్ట్రంలో(ఒడిశ్శా) కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అయితే, తానేమీ చేయలేని పరిస్థితిగా పేర్కొన్నట్టు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని నీట్‌కు అనుకూలంగా స్పందించిన బిజేపి ప్రతినిధి దృష్టి ఈ సమావేశంలో తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. అనుమతి రాగానే, రాష్ట్రంలోని ఎంపీలు, శాసన సభా పక్షపార్టీల ప్రతినిధులు అందరూ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ఒత్తిడి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 13 పార్టీల ప్రతినిధుల హాజరు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత సెల్వ పెరుంతొగై, అన్నాడీఎంకే తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్యే విజయ భాస్కర్, పీఎంకే తరపున ఆపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీకే మణి, బీజేపీ తరపున ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, మనిద నేయ మక్కల్ కట్చి తరపున ఎమ్మెల్యే జవహరుల్లా, తమిళర్ వాల్వురిమై కట్చి తరపున ఎమ్మెల్యే వేల్ మురుగన్‌తో పాటుగా ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ తదితర 13 పార్టీల శాసన సభ ప్రతినిధులు హాజరయ్యారు. గంట పాటుగా సాగి న ఈ సమావేశంలో నీట్ గురించి అన్ని పార్టీల అభిప్రాయాల్ని సీఎం స్టాలిన్ స్వీకరించారు. అయితే, బీజేపీ తరపున మాత్రం నీట్‌కు అనుకూలంగా కేంద్రం చర్యలను సమర్థించడం గమనార్హం. అలాగే, సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇక, మిగిలిన 12 పార్టీల ప్రతినిధులు నీట్ వద్దే వద్దు అని, అడ్డుకుని తీరుదామని, కేంద్రం చర్యలకు ముగింపు పలుకుదామని స్పష్టం చేశాయి. చదవండి: నవ దంపతులపై హత్యాయత్నం -
నెలాఖర్లోగా నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు గురుకులాలు ముందస్తు కసరత్తు చేపట్టాయి. ఈ నెలాఖరులోగా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే దరఖాస్తు ప్రక్రియకు ఇరవై రోజులపాటు గడువు ఇవ్వనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరివారం నుంచి ఏప్రిల్ రెండోవారం వరకు ప్రవేశాల నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా, ఆగస్టు రెండోవారం నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసేది. అయితే రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ప్రవేశాల ప్రక్రియ గాడితప్పుతోంది. 2021–22 సంవత్సరానికి డిసెంబర్ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికే వందశాతం అడ్మిషన్లు పూర్తి చేసేలా గురుకులాల సొసైటీలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుకుల సొసైటీలున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు మైనార్టీ సొసైటీ మినహా మిగతా నాలుగు గురుకులాలు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒకే నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకున్న ఖాళీలను భర్తీ చేసేందుకు సొసైటీలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిధిలోని సైనిక పాఠ శాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడ నున్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోగా జారీ చేసేం దుకు గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. ముందంజలో ఎస్సీ గురుకుల సొసైటీ... ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీయూజీసెట్–2022 నోటిఫికేషన్ జారీ చేసి, ఈ నెల 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. జూనియర్ కాలేజీలు, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)ల పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ అండ్ సీఓఈసెట్–2022 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 20న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ వెల్లడించింది. మిగతా సొసైటీలు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. -
విగ్గుతో పరీక్షల్లో కాపీయింగ్! ఎలా దొరికాడంటే..
లక్నో: ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలా మంది యువత పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే హైటెక్ కాపీయింగ్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక మాస్ కాపీయంగ్ ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
జనవరి 9న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: సైనిక్ స్కూళ్లలోని 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది జనవరి 9న ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈనెల 26 వరకు దరఖాస్తులకు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ చివరి వారంలో అడ్మిట్ కార్డులను విడుదల చేసి.. వచ్చే ఏడాది జనవరి 9న పరీక్ష నిర్వహిస్తారు. జనవరి చివరి వారంలో ‘కీ’, ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. మార్చిలో మెడికల్ టెస్టు నిర్వహించి.. ఏప్రిల్‌లో అడ్మిషన్లు చేపడతారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం నాలుగు విభాగాల్లో 300 మార్కులకు పరీక్ష పెడతారు. 125 ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షను విద్యార్థులు 2.30 గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో గణితం నుంచి మూడేసి మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జి, లాంగ్వేజెస్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలుంటాయి. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 400 మార్కులకు 150 ప్రశ్నలతో పరీక్ష పెడతారు. మూడు గంటల్లో వీటికి జవాబులు రాయాల్సి ఉంటుంది. గణితం నుంచి నాలుగేసి మార్కులకు 50 ప్రశ్నలు, ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. -
మహిళల హక్కుల్ని వాయిదా వేయలేం
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించడాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళల హక్కులను నిరాకరించాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. వారికి ఎన్డీయేలో ప్రవేశం కల్పించడం మరో ఏడాది వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. 2022 మే నాటికి ఎన్డీయే నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలను అనుమతిస్తామని కేంద్రం చెప్పగా, న్యాయస్థానం అంగీకరించలేదు. తాము ఇదివరకే ఇచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ ఏడాది నవంబర్లోనే వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సైనిక దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తుంటాయని జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఎన్డీయేలో మహిళలను చేర్చుకొనేందుకు ఇక ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో యూపీఎస్సీ, రక్షణ శాఖ కలిసి పని చేయాలని పేర్కొంది. ఎన్డీయేలో మహిళా అభ్యర్థుల కోసం సమగ్రమైన కరిక్యులమ్ రూపొందించాలని, ఇందుకోసం రక్షణ దళాల ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్డీయేలో మహిళలకు శిక్షణ ఇచ్చే విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించాలని తెలిపింది. ఎన్డీయేలో మహిళలకు ప్రవేశం నిరాకరించడాన్ని ఆక్షేపిస్తూ న్యాయవాది కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. నవంబర్ 14న జరిగే పరీక్షకు మహిళలను అనుమతించలేమని, అందుకు సమయం సరిపోదని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం బదులిచి్చంది. ఎన్డీయే ప్రవేశ పరీక్ష కోసం మహిళలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపర్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
NDA Exam: మహిళల ఆశలను అడ్డుకోలేం.. పరీక్ష నిర్వహించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష ఈ ఏడాది నిర్వహించలేమని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నవంబర్ 14న మహిళా అభ్యుర్థులకు ఎన్డీఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ విచారణ చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి పరీక్ష నిర్వహిస్తామనటం సరికాదని, అలా చెప్పడం వారి ఆశలను అడ్డుకోవడం అవుతుందని అన్నారు. ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఎన్డీఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మహిళా అభ్యర్థుల నమ్మకం, ఆశలను అడ్డుకోలేమని సుప్రీం కోర్డు పేర్కొంది. త్రివిధ దళాల్లో మహిళలను ఎంపిక చేస్తామని రక్షణా శాఖ ఇటీవల అఫిడవిట్ విడుదల చేసింది. అయితే మహిళా అభ్యర్థుల త్రివిధ దళాలకు సంబంధించి ఎన్డీఏ క్యాడెట్ శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించే విషయంపై ప్రవేశపరీక్షను వచ్చే ఏడాది నుంచి నిర్వహిస్తామని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
డిఫెన్స్ అకాడెమీలోకి మహిళలు..
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష
-
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్‌టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్‌టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్‌టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీ, కోల్‌కతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్‌లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్‌ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహిస్తున్న ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలో... దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాలలో పరీక్ష జరుగుతోంది. చదవండి: నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం -
నీట్ ఎగ్జామ్ 2021: డ్రెస్ కోడ్ తప్పనిసరి, ఆ వస్తువులు తెచ్చుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సు(యూజీ)ల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్–21కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కేటాయించింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్’కు హాజరు కాగా... ప్రస్తుతం హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం జరిగే నీట్‌కు ఎన్టీఏ కఠిన నిబంధనలు విధించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. అలాగే అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. నిబంధనలివే.. ►నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. సదరు విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి. ►అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. తక్కువ ఎత్తు ఉండే చెప్పులు మాత్రమే వేసుకోవాలి. ►వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దు. ►పెన్సిల్, కాలిక్యులేటర్, స్కేల్, రైటింగ్ ప్యాడ్ వంటివి కూడా అనుమతించరు. ►మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, హెల్త్‌బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దు. ►అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్లెట్ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్లెట్లు వేసుకోవద్దు. ►అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. ►హిందీ, ఇంగ్లిష్తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ►మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ►అభ్యర్థులు కనీసం ఒక గంట ముందే పరీక్షాకేంద్రానికి రావాలి. ►కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు. -
NEET 2021: నేడు ‘నీట్’.. ఇవి వద్దు, ఇవి తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి సుమారు 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకోనుండగా, 15 శాతం సీట్లు మాత్రం నేషనల్ పూల్(కేంద్ర కోటా)లో భర్తీ అవుతాయి. ఈ 15 శాతం సీట్లు ఏపీ ఇవ్వడం వల్ల.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది. ప్రభుత్వ పరిధిలో 11 వైద్యకాలేజీలుండగా, ప్రైవేటు పరిధిలో 18 వరకు ఉన్నాయి. గంట ముందే రావాలి.. పరీక్షా కేంద్రానికి గంట ముందే వచ్చేలా విద్యార్థులు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30కల్లా పరీక్షా కేంద్రానికి వచ్చి ఇన్విజిలేటర్‌కు అడ్మిట్ కార్డు చూపించాలి. 1.45 గంటలకు బుక్లెట్ ఇస్తారు. 1.50కి బుక్‌లెట్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. సరిగ్గా 2 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకే పరీక్షా కేంద్రానికి రావడం వల్ల ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు. తప్పకుండా తీసుకురావాల్సినవి ఇవే.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు.. అంటే పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. శానిటైజర్(50 ఎం.ఎల్) బాటిల్ తెచ్చుకోవచ్చు. నిషేధిత జాబితా.. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఆభరణాలు తదితరాలు తీసుకురాకూడదని నిబంధనల్లో స్పష్టం చేశారు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్లు, చైన్లు, నక్లెస్‌లు, పెండెంట్స్ తదితర ఆభరణలేవీ పెట్టుకోకూడదు. అలాగే కాగితాలు, బిట్స్ పేపర్లు, జామెట్రీ బాక్స్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, క్యాలిక్యులేటర్లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరైజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ తీసుకురాకూడదు. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్లు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, స్కార్ఫ్, కెమెరా తదితర వస్తువులన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీ సర్కారు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందాలంటే ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా అధికారులతో సమావేశమైన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ అంశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇంటర్ మార్క్స్(కచ్చితంగా ఇన్ని మార్కులు ఉండాలనే) నిబంధన ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: Afghanistan Crisis: భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు -
CAT 2021: ఐఐఎంలకు దారిచూపే.. క్యాట్!
ఐఐఎంలు.. మేనేజ్మెంట్ కోర్సులకు ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్స్! వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)!! ఐఐఎం అహ్మదాబాద్.. క్యాట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐఎంలతోపాటు దేశంలోని పలు ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశానికి క్యాట్ స్కోర్ కీలకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. క్యాట్ పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్ మెంట్ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎంల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్ కంపెనీలకు హాట్‌కేకే!! అందుకే పేరున్న ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. క్యాట్‌లో స్కోర్ తోపాటు మలిదశలో ప్రతిభ చూపితేనే వీటిల్లో అడ్మిషన్ ఖాయం అవుతుంది. అర్హత కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లు్యడీ అభ్య ర్థులకు డిగ్రీలో కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తు న్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► ప్రతి ఏటా క్యాట్‌కు 2 లక్షల మందికి పైగా అభ్య ర్థులు హాజరవుతుంటారు. గతేడాది దాదాపు 2.27 లక్షల మంది పరీక్ష రాసారు. క్యాట్‌కు హాజరవడం అనేది ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో ఎంతో కీలకమైన మొదటి దశ. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ స్కోర్ సాధించిన అభ్యర్థులను మలిదశకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ► మలి దశలో..గ్రూప్ డిస్కషన్(జీడీ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్(వాట్), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ► పలు ఐఐఎంలు గత అకడెమిక్ రికార్డ్, సంబంధిత పని అనుభవం, జెండర్ అండ్ అకడెమిక్ డైవర్సిటీ వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. 76 ప్రశ్నలు–మూడు విభాగాలు ► క్యాట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరుగుతుంది. ► పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 76 ప్రశ్నలు ఉంటాయి. ► వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్సీ) నుంచి 26 ప్రశ్నలు వస్తాయి. ► డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్ఆర్) నుంచి 24 ప్రశ్నలు ఉంటాయి. ► క్వాంటిటేటివ్ ఎబిలిటీ(క్యూఏ) విభాగం నుంచి 26 ప్రశ్నలు అడుగుతారు. ► మొత్తం 76 ప్రశ్నలు–228 మార్కులకు క్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ► ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్, నాన్ మల్టిపుల్ ఛాయిస్(టైప్ ఇన్ ది ఆన్సర్) విధానంలో ఉంటాయి. నాన్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండవు. పరీక్ష సమయం రెండుగంటలు ఈ ఏడాది క్యాట్ పరీక్ష సమయం రెండు గంటలు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండు గంటల్లో మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు ఆన్లైన్ స్లాట్స్ ఉంటాయి. టైమ్ మేనేజ్మెంట్ గతేడాది నుంచి ‘క్యాట్’ సమయం తగ్గింది. అందువల్ల అభ్యర్థులు ‘గోల్ సెట్టింగ్ థియరీ’ ప్రకారం చదివితే విజయం సాధించగలరు అంటున్నారు నిపుణులు. అంటే.. పరీక్షలో మూడు సెక్షన్లతోపాటు ‘టైమ్ మేనేజ్మెంట్’ను నాలుగో విభాగంగా పరిగణించాలి. అభ్యర్థులు ఏదైనా విభాగాన్ని పరిష్కరించడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు. ఈ సమయంలోనే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు టైప్ చేసే ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. బలాబలాలు క్యాట్ విభిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం చాలా అవసరం. పరిమిత కాలంలో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యా లను అంచనా వేసుకోవాలి. ఏ విభాగం ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించగలుగుతున్నారు.. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసు కోవాలి. వెనుకబడిన విభాగంలో ఇప్పటికే ప్రాక్టీస్ చేసిన నమూనా ప్రశ్నలను మరోసారి సాధించాలి. మాక్ టెస్టులు ► క్యాట్–2021 పరీక్ష నవంబర్ 28న నిర్వహిం చనున్నారు. అంటే.. దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారం భించినా.. టాప్ స్కోరు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ► ముఖ్యంగా పరీక్షలోని మూడు విభాగాల్లో ఒక్కో దానికి నెలరోజుల చొప్పున సమయం కేటాయిం చి చదవడం మంచిది. చివర్లో మిగతా నెలరోజు ల పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిని పరిశీలించాలి. ఏ టాపిక్‌లో ఎలాం టి మార్పులతో ప్రశ్నలు వస్తున్నాయో గుర్తిం చాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగి స్తూ.. మాక్ టెస్టులు సైతం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.1100, ఇతరులకు రూ.2200. ► హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: అక్టోబర్ 27–నవంబర్ 28 ► ఆన్లైన్ క్యాట్–2021 పరీక్ష తేది: నవంబర్ 28, 2021 ► ఫలితాల వెల్లడి: జనవరి రెండో వారం 2022 ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు వెబ్సైట్: https://iimcat.ac.in -
ఒక్క పరీక్షతో.. ఏడు వర్సిటీల్లో ప్రవేశం
దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. కోర్సులు ► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది. ► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్/సోషల్ వెల్ఫేర్/ డెవలప్మెం ట్ స్టడీస్ /హెచ్ఆర్ఎం/టూరిజం మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. ► ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి, పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్‌సీఏ), హిందీ, ఇస్లామిక్ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. ► ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యు కేషన్లో ఎంఈడీ, ఎంపీఈడీ; ► ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. అర్హతలు ► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(బీఏ/బీకామ్/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎల్ఎల్బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి. ► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి. ► ఓపెన్/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు. ► బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ/బీటెక్ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు. ► బీఎస్సీ(ఎంఎల్టీ)/బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్‌సైన్స్) /బీటెక్/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు. ► బీఈ/బీటెక్ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ , ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సీపీజీఈటీను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుంది. అభ్యర్థి తన అర్హతలను బట్టి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021 ► రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 30.08.2021 ► రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 03.09.2021 ► సీపీజీఈటీ– 2021 పరీక్ష తేది: 08.09.2021 ► వివరాలకు వెబ్సైట్: www.tscpget.com -
తెలంగాణలో ఆగస్టు నెలంతా ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అవి నెలంతా కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ముందుగా మంగళవారం (నేడు) ఈ–సెట్ జరగనుంది. దీన్ని రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 24 వేల మందికిపైగా రాయనున్నారు. దీనికోసం 41 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 4 నుంచి ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారికి పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తారు. 4, 5, 6వ తేదీల్లో ఇంజనీరింగ్‌కు, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం తెలంగాణలో 82 కేంద్రాలు, ఏపీలో 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలను కూడా రెండు విడతలుగా నిర్వహిస్తారు. తొలి విడత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్‌కు మొత్తం విద్యార్థులు 2,51,132 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఇంజనీరింగ్ 1,64,678 మంది, మెడికల్ 86,454 మంది రాస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు బిట్స్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. మరోవైపు ఈ నెల 4వ తేదీన డిగ్రీ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా జాగ్రత్తల మధ్య పరీక్షలు... కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు థర్డ్‌వేవ్‌కు సంబంధించి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరిగే ప్రవేశ పరీక్షలకు అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. శానిటైజర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు జ్వరం చూస్తారని, విద్యార్థులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ ఉంటే వారి విన్నపం మేరకు తదుపరి.. పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్: ‘ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్నొన్నారు. రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలో పలికి అనుమతిస్తామని చెప్పారు. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని అన్నారు. ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని తెలిపారు. కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుందని విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారు. కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఏపీ సెట్.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం... ఏపీ ఈఏపీసెట్ ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు.. ‘ఈఏపీసెట్’ (పూర్వపు ఎంసెట్). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. ► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. అర్హతలు ► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ /బీటెక్ (ఎఫ్ఎస్టీ)/బీఎస్సీ(సీఏ అండ్ బీఎం)/బీఫార్మసీ/బీటెక్(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. ► ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా) ► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు ► ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx ఏపీ ఈసెట్ ఏపీ ఈసెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. అర్హతలు ► డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష విధానం ► ఈసెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాథ్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్(సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► బీఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 ► పరీక్ష తేది: 19.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఏపీ ఐసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్–2021 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హతలు ► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్ష విధానం ► ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17,18 ► వెబ్సైట్: https://sche.ap.gov.in/icet ఏపీ ఎడ్‌సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ► బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు. పరీక్ష విధానం ► ఎడ్‌సెట్ ఆన్లైన్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్ సైన్స్: ఫిజిక్స్–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్ సైన్స్: బోటనీ–50, జువాలజీ–50/సోషల్ స్టడీస్: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్–15, ఎకనామిక్స్–20(మొత్తం 100)/ ఇంగ్లిష్: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేది: 21.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx ఏపీపీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ► అర్హత: బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్లైన్’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 ► ఏపీపీజీఈ సెట్ తేదీలు:27–30 సెప్టెంబర్ 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/PGECET -
Telangana: 11న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్ (కరీంనగర్), అశోక్‌నగర్ (నర్సంపేట్) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ చూడాలని సూచించాయి. ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు. -
TGCET 2021: తేదీల ఖరారు.. పరీక్షలు ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షలన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో బోధన, అభ్యసన కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా అడ్మిషన్లు నిర్వహించాలని విద్యాశాఖ సూచించడంతో గురుకుల సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం టీజీసెట్ నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి సైతం దరఖాస్తుల ఆధారంగా ప్రవేశ పరీక్షలుంటాయి. ఇక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆర్జేసీసెట్, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్డీసీసెట్ నిర్వహిస్తున్నారు. పది రోజుల్లో ఫలితాలు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీలు ఉమ్మడి ప్ర వేశ పరీక్ష(టీజీసెట్) నిర్వహిస్తోంది. ఈ నెల 18న టీజీసెట్‌ను నిర్వహించేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్షకు వారం ముందు వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సెట్ కన్వీనర్ ఇప్పటికే తెలిపారు. ► ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 17న యూజీసెట్ నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను ఈ ఏడాది మాత్రం విద్యార్థికి పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు. ► బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు, అదే సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈనెల 25న అర్హత పరీక్షలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో(ఆగస్టు తొలి వారం) ఫలితాలు విడుదల చేసేలా గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతేడాది పరీక్షలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది అలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా సొసైటీ అధికారులు ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారు. -
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ (ఎంసెట్).. ఆగస్టు 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎంసెట్).. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్.. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, ఆగస్టు 23న లాసెట్.. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్, జులై 17న పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది. -
ఆగస్టులో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని తేదీలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను మరికొంత కాలం వాయిదా వేయాలని భావించారు. తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించే అంశంపై చర్చించి ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమా చారం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈసెట్, పీజీఈసెట్ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. -
ఐఎన్ఐ సెట్ వాయిదా వేయండి, సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ సెట్) 2021ను జూన్ 16న నిర్వహించాలనడం ఏకపక్షంగా అనిపిస్తోందని, వాయిదా వేయాల ని ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 16న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని స్పష్టంచేసింది. ‘‘పరీక్షకు హాజరు కావాలనుకొనే చాలా మంది అభ్యర్థు లు కోవిడ్ విధుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని నిర్ణయిం చాం. నెల రోజుల తర్వాత ఎప్పుడైనా పరీక్ష నిర్వహించొచ్చు’’అని జస్టిస్ ఇందిరా బెనర్జీ , జస్టిస్ ఎంఆర్‌షాల ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహిస్తున్న ఐఎన్ఐ సెట్లో 815 సీట్లకుగాను సుమారు 80 వేల మంది అభ్యర్థు లు పోటీపడుతున్నారు. చదవండి : 'అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు' -
Telangana: ఎంసెట్ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ప్రస్తుతం ఇంటరీ్మడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు ఇక ఎంసెట్‌పై దృష్టి సారించనున్నారు. ఇన్నాళ్లూ సెకండియర్ పరీక్షలు ఉంటాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పైగా కరోనా కూడా అదుపులోకి రాలేదు. ఈనేపథ్యంలో విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు కనీసం 6 వారాల గడువు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చే నెల 5 నుంచి 9 వరకు (5, 6 తేదీల్లో అగ్రికల్చర్, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్) నిర్వహించాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేయాలన్న భావనకు వచి్చంది. త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు. ఇతర ప్రవేశ పరీక్షలు సైతం.. మరోవైపు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ ఏప్రిల్, మే నెలల సెషన్లను ఇంకా నిర్వహించలేదు. కరోనా కారణంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాటిని వాయిదా వేసింది. జూలై 3న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షనూ వాయిదా వేసింది. ఈ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఆయా పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేదీ టీసీఎస్సే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంసెట్, ఇతర సెట్స్‌తో ఆయా పరీక్షల తేదీలు క్లాష్ కాకుండా టీసీఎస్ ఖాళీ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. మొత్తానికి ఆగస్టు ఆఖరులోగా సెట్స్ అన్నింటినీ పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అయితే ఎంసెట్‌ను మాత్రం సరీ్వసు ప్రొవైడర్‌తో స్లాట్ల లభ్యతను బట్టి, జూలై 25 నుంచి ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 15 తరువాత చేపట్టి, సెపె్టంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రచిస్తోంది. పీజీఈసెట్, ఈసెట్ వాయిదానే.. ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించాల్సిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్), జూలై 1న నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఈసెట్)ను వాయిదావేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచి్చంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, అదే నెల 23న నిర్వహించాల్సిన లాసెట్, 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన ఎడ్‌సెట్ పరీక్షలు కూడా వాయిదాపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. అవి పూర్తయ్యాకే లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఫ్యాషన్ కెరీర్.. ఎలా చేస్తే బెటర్!
ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్, డిజైన్ రంగంలో కెరీర్ కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోర్సులు, అవకాశాల గురించి చెప్పండి? ప్రస్తుత ట్రెండీ కోర్సుల్లో చెప్పుకోదగ్గది ఫ్యాషన్ డిజైన్. ఇందులో దుస్తుల నుంచి పాదరక్షల వరకూ... వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్స్ చేయవచ్చు. ఫ్యాషన్ డిజైన్ ప్రధానంగా కంటికి ఆహ్లాదకరంగా, ధరించడానికి ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలను రూపొందించే విభాగంగా భావిస్తుంటారు. వాస్తవానికి ఇందులో మనిషి ధరించే అన్ని వస్తువుల డిజైనింగ్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే కళ్లజోడు నుంచి పాదరక్షల వరకూ.. అన్నీ ఫ్యాషన్ రంగానికి చెందినవే. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఇందులో ఆయా విభాగాలను ఎంచుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్‌లో.. ఫ్యాబ్రిక్ డిజైన్, డిజైన్ ప్రాసెస్ మేనేజ్మెంట్, కాన్సెప్ట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ యాక్ససరీ డిజైన్, ప్రింటింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్స్టైల్ సైన్స్, ఫ్యాషన్ మర్కండైజింగ్, మార్కెటింగ్ అండ్ కలర్ మిక్సింగ్‌పై దృష్టి సారిస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నిఫ్ట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) క్యాంపస్‌ల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అందుకోసం ఏటా నిర్వహించే నిఫ్ట్ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణతతోపాటు సిట్యూయేషన్ టెస్ట్ తదితర ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నిఫ్ట్తోపాటు దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ), ఐఐటీ బాంబే, హైదరాబాద్ తదితర ఐఐటీలు, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఏఐఎఫ్‌డీ), ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వంటి వాటిల్లో ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. చదవండి: Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్! మొటిమల కోసం క్రీమ్స్ వాడాను, కానీ: సాయిపల్లవి -
ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కోర్సుల పరీక్షల నిర్వహణపై కేంద్రం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల కార్యదర్శులు, బోర్డు ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు లేఖలు రాసింది. కాగా, కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రొఫెషనల్ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేసింది. కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్ ఈ పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్‌లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్‌లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్‌కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్‌లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్‌లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
టీఎస్ ఈసెట్ 2021: ముఖ్యసమాచారం
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం... అర్హతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. పరీక్ష స్వరూపం ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. బీఎస్సీ(మ్యాథ్స్) బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది. ఫార్మసీ స్ట్రీమ్ అర్హత మార్కులు అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు. అర్హత– బ్రాంచ్‌లు ► టీఎస్ ఈసెట్ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్.... ► కెమికల్ ఇంజనీరింగ్ పేపర్: సిరామిక్, లెదర్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్–పెట్రోకెమికల్,కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్–షుగర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► సివిల్ ఇంజనీరింగ్ పేపర్: సివిల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ► మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్: మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్. ► మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్: మైనింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ముఖ్యసమాచారం ► ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021 ► దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400. ► పరీక్ష తేదీ: జూలై 1, 2021 ► ఉదయం సెషన్ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ పేపర్లు ► మధ్యాహ్నం సెషన్ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం పేపర్లు. ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in -
ఆగస్ట్ 1న నీట్–2021
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్(యూజీ)–2021ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. హిందీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 11 భాషల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నీట్–2021ను విద్యార్థులు పెన్ అండ్ పేపర్ విధానంలో రాయాల్సి ఉంటుంది. సిలబస్, వయస్సు, రిజర్వేషన్లు, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, పరీక్షా నగరాలు, స్టేట్ కోడ్ తదితర పూర్తి వివరాలతో త్వరలో బుటెటిన్‌ను వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
టీఎస్ సీపీజీఈటీ-2020 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రొఫెసర్ పాపిరెడ్డి జనవరి 7వ తేదీన విడుదల చేశారు.ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్మిటీ డిసెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 85270 మంది దరఖాస్తు చేసుకోగా.. 72467 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 70141 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com లో చూడొచ్చు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-CET) ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి -
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు విడుదల
-
గురుకుల సెట్ ఫలితాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలపై ఉత్కంఠ వీడలేదు. పరీక్ష నిర్వహించి నెల గడిచినా ఫలితాలు వెలువడలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు సంబంధించి ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటివారంలో పరీక్ష నిర్వహించి నెలాఖరు కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ మొదటి వారంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో మార్చి నుంచి విద్యా సంస్థలు మూతబడటం, ఇప్పటికీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడంతో పరీక్ష నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ క్రమంలో పలుమార్లు పరీక్షకు సంబంధించిన దరఖాస్తును పొడిగించిన అధికారులు.. కోవిడ్ తీవ్రత కాస్త సద్దుమణిగిన తర్వాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 50 వేల సీట్లుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈక్రమంలో నవంబర్ రెండో వారంలో ఫలితాలు ప్రకటించి, నెలాఖరు కల్లా అడ్మిషన్లు పూర్తి చేయాలని భావించారు. బోధనపైనా ప్రభావం.. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావొస్తున్నా గురుకుల ఐదో తరగతిలో ఇంకా ప్రవేశాలు జరగకపోవడంతో బోధన ముందుకు సాగడం లేదు. ఇది విద్యార్థుల అభ్యాసనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బీఎడ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీఎడ్ ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. అక్టోబర్ 1,3 తేదీలలో తెలంగాణ ఎడ్‌సెట్-2020 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్‌ఈఎస్ కన్వీనర్ ప్రొఫెసర్ టి మృణాళిని తెలిపారు. బీఎడ్ 2 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే ఎడ్‌సెట్ 2020 పరీక్షలకు మొత్తం 43380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. వీరిలో 10339 మంది పురుషులు (24%), 33041 మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 న మధ్యాహ్నం 3 గంటల నుంచి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (టీఎస్ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు ఉండనున్నట్లు తెలిపారు. మార్నింగ్ సెషన్లో మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, మధ్యాహ్నం సెషన్లో బయోలాజికల్ సైన్సెస్, ఇంగ్లీష్,ఓరియంటల్ లాంగ్వేజెస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 పరీక్షా కేంద్రాలు (కర్నూలు, విజయవాడ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్ టికెట్లను https://edectische.ac.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 9 గంటలకు చేరుకోవాలని కోరారు. ఒక నిమిషం నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ సొంత మాస్క్‌ను తీసుకురావాలని, వాటర్ బాటిల్, గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ వెల్లడించారు. -
పరీక్షకు హాజరైన సినీ నటి హేమ
సాక్షి, నల్లగొండ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా 580 మంది హాజరయ్యారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జరిగిన అర్హత పరీక్షలో సినీ నటి హేమ పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్లైన్లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. అర్హత సాధించిన అ«భ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. -
తెలంగాణ ఎంసెట్ ‘కీ’ విడుదల..
సాక్షి, జేఎన్టీయూ: రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ‘కీ’ని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎంసెట్ కీ ఈ రోజు(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 20 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్‌లో 1 లక్ష 19వేల187 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఎంసెట్ ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్ పేపర్ స్కానింగ్ కాపీలనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని తెలిపారు. తుది ‘కీ’ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని, ఎంసెట్ ‘కీ’ సంబంధించిన వివరాలను అభ్యర్థులు https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని గోవర్ధన్ పేర్కొన్నారు. -
ఏపీ ఎంసెట్ పరీక్ష ప్రారంభం